అదిలాబాద్: జల్సాలకు అలవాటు పడి కష్టపడకుండా డబ్బు సంపాదించడానికి మావోయిస్టు అవతారం ఎత్తాడో వ్యక్తి. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో గురువారం చోటుచేసుకుంది. చెన్నూరు మండలం కొమతంకు చెందిన ముధుకర్ అనే వ్యక్తి స్థానిక కాళాశాలలో డిగ్రి చదువుతున్నాడు. జల్సాలకు అలవాటుపడిన మధుకర్ సులభంగా డబ్బు సంపాదించడానికి నకిలీ మావోయిస్ట్ గా మారాలనుకున్నాడు.
అంతే కొందరు ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల ఫోన్ నెంబర్లను సేకరించాడు. దీంతో వారిని ఫోన్‌లలో బెదింరించడం ప్రారంభించాడు. మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాకు చెందిన దళ కమాండర్‌గా పరిచయం చేసుకుని అడిగినంత డబ్బు ఇవ్వకపోతే చంపుతానని బెదిరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు చాకచక్యంగా వల పన్ని మధుకర్ ను అరెస్ట్ చేశారు. ఈ మేరకు మంచిర్యాల ఏఎస్పీ విజయ్‌కుమార్ గురువారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు.
(మంచిర్యాల)