
సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో పట్ట పగలే దారుణ హత్య చోటుచేసుకుంది. మందమర్రి మండలం గద్దేరాగడిలో లక్ష్మీకాంతరావు అనే రియాల్టర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో ఆయన్ను కత్తులతో తలపై దాడి చేసి ప్రాణం తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.
కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల అసుపత్రికి తరలించారు. మృతుడు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుకు సమీప బంధవుగాపోలీసులు గుర్తించారు. అయితే ఓ స్థలం వ్యవహారంలో లక్ష్మీకాంతరావుకు స్థానికంగా కొందరితో వివాదం నడుస్తోందని, ఈ క్రమంలోనే ఆయన్ను హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
చదవండి: పెళ్లైన 3 రోజులకే ప్రియుడితో ఉడాయించిన నవవధువు.. భర్త అదృశ్యం
Comments
Please login to add a commentAdd a comment