![Son And Daughter Assassinated Father In Adilabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/28/crime.jpg.webp?itok=BmT_xOTo)
భగత్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
సాక్షి, ఆదిలాబాద్: తాగుడుకు బానిసై ఇంటికొచ్చి రోజూ గొడవపడుతున్నాడని భావించిన కుమారుడు, కూతురు కన్నతండ్రిని హత్యచేసిన సంఘటన గురువారం మావల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై హరిబాబు వివరాల ప్రకారం.. భగత్‌సింగ్‌నగర్‌కు చెందిన బబ్బన్ భగత్ (50) కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అతడికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
మద్యానికి బానిసైన బబ్బన్ భగత్ ప్రతిరోజూ మద్యం తాగివచ్చి కుటుంబ సభ్యులతో గొడవ పడేవాడు. గురువారం మధ్యాహ్నం సైతం మద్యం తాగివచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. ఆగ్రహించిన కుమారుడు ఆకాష్, కుమార్తె ఆశ ఇనుప పైపుతో తలపై కొట్టారు. తలకు బలంగా గాయం కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment