mandamarri
-
రూపంలో తేడా ఉన్నందుకేనా దొంగలు?
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణ విద్యానగర్ ఎస్సీ–ఎస్టీ కాలనీకి చెందిన నలుగురు యువకులు మందమర్రి పోలీసులు తాము చేయని దొంగతనం కేసుల్లో ఇరికిస్తున్నారని ఆరోపిస్తూ డిసెంబర్ 19న సెల్ఫీ వీడియో ద్వారా అభ్యర్థన పెట్టి, హెయిర్ డై తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. ఇదే కాలనీకి చెందిన ఆటో నడుపుకొనే ఎరుకల కులానికి చెందిన మరో యువకుడు ఏడాది కింద పోలీసులు తనపై అనేక కేసులు బనాయిస్తున్నారని భయపడి పోలీస్ స్టేషన్లోనే ఒంటిపై పెట్రోల్ పోసుకుని అంటించుకున్నాడు. దాని కంటే ముందు ఒకసారి గొంతు కోసుకున్నాడు. ఆత్మహత్యా ప్రయత్నాల్ని ఆ యువకులు చనిపోయే ఉద్దేశంతో చేయకపోయినా, తామున్న పరిస్థితి నుండి ఎట్లా బయట పడాలో తెలియక ఈ ప్రమాదకర మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇలాంటి పెనుగులాటల వెనుక సామాజిక, ఆర్థిక, వ్యవస్థాపరమైన అంశాలున్నాయి.ఈ ఎస్సీ–ఎస్టీ కాలనీ అనేక ప్రాంతాల నుండి ఒకప్పుడు వలస వచ్చి, కాలరీ ఏరియాలో రోజూవారీ కూలీ చేసుకొని బతికే నిరుపేదలు నివసించే ప్రాంతం. స్థిరపడిన వారిలో మాదిగ, నేతకాని, ఎరుకల కులాలే ప్రధానంగా ఉన్నాయి. వాళ్ల తరువాత తరాలు కూడా ఇక్కడే పుట్టి పెరుగుతున్నాయి. ఈ కాలనీ కుటుంబాలకు నిర్మాణ రంగంలో దొరికే రోజువారీ అడ్డ కూలీ పని, యువకులైతే ఆటోలు నడుపు కోవటం, పాన్ టేలలు, వెల్డింగ్, చిన్న చిన్న మెకానిక్ పనులే జీవనా ధారం. తల్లిదండ్రుల జీవితాల్లోనే స్థిరత్వం లేకపోవటం, పరిసరాల ప్రభావం, ఇతర సాంస్కృతిక కారణాల వలన పిల్లలు పెద్దగా చదువులో రాణించటం లేదు. వీళ్లలో కొందరిపై గతంలో చిన్న చిన్న స్క్రాప్, కాపర్ వైర్ల, ఇతర దొంగతనాల కేసులున్నాయి. ఇద్దరిపై గంజాయిని స్థానికంగా అమ్మి పెట్టే కేసులున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ కేసుల్లో ఎవ్వరికీ ఎప్పుడూ కోర్టులో శిక్ష పడలేదు. నేరం జరగటానికి గల సామాజిక, ఆర్థిక నేపథ్యాన్ని వదిలేసి బ్రిటిష్ పాలకులు ఒకప్పుడు కొన్ని తెగలను నేరస్త తెగలుగా ముద్ర వేసి, వారిని క్రిమినల్ ట్రైబ్స్ అని పిలిచేవారు. ఫలితంగా ఆ తెగలో పుట్టిన వారు గతంలో నేరాలు చేసి ఇప్పుడు మానేసినా లేదా అసలు ఎప్పుడూ నేరం చేయకపోయినా నిరంతరం అంతులేని పోలీసు అకృత్యాలకు బలయ్యేవారు. ఆ ముద్ర చెరిపేసుకోవటానికి వారికి కొన్ని తరాలు పట్టింది.ఇతరుల కళ్ళు గప్పి, మన కష్టార్జితం కాని దాన్ని కైవసం చేసుకోవటమే దొంగతనం. సమాజంలో లంచగొండులు, అక్రమార్జనపరులు, బ్యాంకులను కొల్లగొట్టే వ్యాపారులు, ప్రజల ఉమ్మడి భూములను, వనరులను తమ హస్తగతం చేసుకొనే వైట్‌కాలర్ మనుషులు దొంగలు కారా? సభ్య సమాజం అనబడే దాంట్లో ఎంత మంది ఇవ్వాళ కేవలం వారి నైతికమైన కష్టార్జితం మీద మాత్రమే ఆధారపడి జీవిస్తున్నారు? వీరంతా సమాజంలో ఎంతో దర్జాగా బతుకుతుండగా నిమ్న కులాలకు చెందిన వాళ్లు, కటిక పేదలు మాత్రం పోలీసుల చేతిలో దెబ్బలు తింటున్నారు. కేవలం దొంగ తనం రూపంలో తేడా ఉన్నందుకేనా?పేదరికం, తగిన ఉపాధి మార్గాలు లేకపోవడం, పాలకులే పెంచి పోషించే వ్యసనపర సంస్కృతి, మనుషులందరినీ సమానంగా చూసే ప్రజాస్వామ్య సంస్కృతి లేని పరిపాలనల పర్యవసానంగానే చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి. దీనికి వ్యక్తిగతంగా వారినే బాధ్యులను చేసి శిక్షించటం కంటే పాలకులే ఆ స్థితికి నైతిక బాధ్యత వహించటం నాగరిక పద్ధతి. నేరం జరగటానికి గల నేపథ్యాన్నీ, నివారించడానికి గల అవకాశాలనూ పరిశీలించకుండా నేరస్తులను మాత్రమే శిక్షించే సాంప్రదాయం సంకుచితమైనది. నేర సంస్కృతి పెరగటానికి కావలసిన భౌతిక పరిస్థితులను పెంచి పోషించే పాలకులే నేరాల అదుపు పేరుతో పేదవర్గాలపై కేసులు బనాయించటం అనైతికమైన విషయం. చదవండి: విస్మృత చరిత్రపై వెలుగు రేకలు దేశంలో కొన్ని వర్గాలు మాత్రమే దొంగలుగా ఉంటారనే సామాజిక విలువలో ఆర్థిక, కులవివక్ష ఉంది. మేం మాత్రం దొంగలం కాదు సుమా అనే ఆత్మవంచన కూడా ఉంది. ఈ మానసిక భావనను సమీక్షించుకోవాల్సిన బాధ్యత పాలకులది, సభ్య సమాజానిది. సమాజంలోని పౌరులందరూ గౌరవప్రదమైన ఉపాధితో, సమానమైన హోదా, అవకాశాలతో జీవించేటట్టు చూడాల్సిన రాజ్యాంగ బాధ్యత పాలకులది.- డాక్టర్ ఎస్. తిరుపతయ్య మానవ హక్కుల వేదిక, తెలంగాణ సభ్యులు -
మందమర్రిలో దారుణం.. మేకను ఎత్తుకెళ్లారని ఇద్దరికి చిత్రహింసలు
మందమర్రి పట్టణం: మంచిర్యాల జిల్లా మందమర్రి లో దారుణం చోటు చేసుకుంది. మేకను దొంగతనం చేశారనే నెపంతో ఎస్సీ యువకుడితో పాటు పశువుల కాపరిని వేలాడదీసి కొట్టిన ఘటన కలకలం రేపింది. మందమర్రికి చెందిన కొమురాజుల రాములు కుటుంబం అంగడి బజార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. పట్టణ శివారులోని గంగ నీళ్ల పంపుల సమీపంలో మేకల షెడ్డులో మేకలను పెంచుతున్నారు. మేకల మండి లో నుండి రెండు మేకలను మాయం చేశారని నెపంతో మేకల కాపరితో పాటు అతని స్నేహితుడైన ఓ తాపి మేస్త్రీని విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో పశువుల కాపరి తేజ, ఎస్సీ యువకుడైన అతని స్నేహితుడు చిలుముల కిరణ్‌పై అనుమానంతో ఇద్దరినీ షెడ్డు వద్దకు పిలిపించారు. కింద పొగ పెట్టి వారిద్దరిని షెడ్డులో తలక్రిందులుగా వేలాడదీసి తీవ్రంగా కొట్టి వదిలేశారు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లిన కిరణ్ రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో తన తమ్ముణ్ణి కట్టేసి కొట్టిన విషయం తెలియడంతో బాధితుని సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మంచిర్యాల ఎమ్మెల్యే సమీప బంధువు దారుణ హత్య
సాక్షి, మంచిర్యాల: జిల్లాలో పట్ట పగలే దారుణ హత్య చోటుచేసుకుంది. మందమర్రి మండలం గద్దేరాగడిలో లక్ష్మీకాంతరావు అనే రియాల్టర్ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో ఆయన్ను కత్తులతో తలపై దాడి చేసి ప్రాణం తీశారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలపై విచారణ చేస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల అసుపత్రికి తరలించారు. మృతుడు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావుకు సమీప బంధవుగాపోలీసులు గుర్తించారు. అయితే ఓ స్థలం వ్యవహారంలో లక్ష్మీకాంతరావుకు స్థానికంగా కొందరితో వివాదం నడుస్తోందని, ఈ క్రమంలోనే ఆయన్ను హత్యచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: పెళ్లైన 3 రోజులకే ప్రియుడితో ఉడాయించిన నవవధువు.. భర్త అదృశ్యం -
మంచిర్యాల: టోల్‌ప్లాజా ఘటనపై ఎమ్మెల్యే చిన్నయ్య కీలక వ్యాఖ్యలు
సాక్షి, మంచిర్యాల: మందమర్రి టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తలపై స్పందించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. దాడి వార్తలను ఖండించారు. జాతీయ రహదారి పనులు పూర్తి కాకుండానే టోల్ వసూలు చేస్తున్నారని, అంబులెన్స్‌ను సైతం వదలటం లేదన్నారు. ఈవిషయంపైనే మేనేజర్‌తో మాట్లాడేందుకు వెళ్లినట్లు స్పష్టం చేశారు. ‘నేను దాడి చేసినట్లుగా టీవీలలో వార్తలు వస్తున్నాయి. జాతీయ రహదారి పనులు పూర్తి కాలేదు. సోమగూడేం ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తి చేయలేదు. కాని టోల్ ప్లాజాలో నూటయాభై టోల్ వసూలు చేస్తున్నారు. టోల్ ప్లాజా నుండి అంబులెన్స్ కూడ వదలడం లేదు. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాలపై మేనేజర్‌తో మాట్లాడానికి వెళ్లాను. మేనేజర్ నుంచి ఎటువంటి స్పందింన లేదు. అంతే కానీ నేను దాడి చేయలేదు. కనీసం టోల్ ప్లాజా ప్రారంభానికి కూడా నన్ను పిలువలేదు’ అని దాడి వార్తలను ఖండించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య. ఇదీ చదవండి: వీడియో: మందమర్రి టోల్‌ప్లాజా వద్ద ఎమ్మెల్యే చిన్నయ్య హల్చల్.. సిబ్బందిపై దాడి -
అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురు సజీవ దహనం
సాక్షి, మంచిర్యాల: అర్ధరాత్రి ఇంట్లో మంటలు చెలరేగి కుటుంబం మొత్తం సజీవ దహనమైన విషాద ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని మందమర్రి మండలం గుడిపల్లి వెంకటాపూర్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పెంకుటిల్లు కావడం, మంటలు భారీ స్థాయిలో ఎగిసిపడిన క్రమంలో నిద్రలోనే మాంసం ముద్దలుగా మారిపోయారు. ఈ ప్రమాదంలో కుటుంబంలోని ఆరుగురు మరణించగా.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక విభాగం హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. మృతులు శివయ్య, ఆయన భార్య పద్మ, చిన్నారులు ప్రీతి(4), హిమబిందు(2) మరో వ్యక్తి కాంతయ్యగా గుర్తించారు. మృతదేహాలను గుర్తించిన తర్వాత పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించనున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: యువతి కిడ్నాప్ కేసు.. వీడియోలు వైరల్.. నవీన్‌రెడ్డి సోదరుడి అరెస్ట్ -
‘ఆచార్య’లో నటించిన ఈ బాలుడు ఎవరో తెలుసా!
సాక్షి,మందమర్రిరూరల్: మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ నటించిన ఆచార్య సినిమాలో మందమర్రికి చెందిన బాలుడు మిథున్‌కు నటించే అవకాశం లభించింది. మందమర్రికి చెందిన డాక్టర్ భీమనాథుని సదానందం కుమారుడు శ్రీధర్, సరిత దంపతుల కుమారుడు మిథున్ శ్రేయాష్ హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో ఉంటున్నారు. మిథున్ సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో ఐదో తరగతి చదువుతున్నాడు. ఆచార్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకగా శ్రీధర్ మిత్రుడు విజయ్‌కుమార్‌కు తెలిసిన వారి ద్వారా సినిమా వాళ్లకి పరిచయం చేశారు. ఆడిషన్లో డైలాగ్‌లు బాగా చెప్పడంతో ఎంపిక చేసుకున్నారు. రాజమండ్రి మారెడుమల్లె, కోకాపేట ఏరియాలో జరిగిన షూటింగ్లో పాల్గొన్నాడు. ఆచార్య సినిమా శుక్రవారం రిలీజ్ కానుంది. చిరంజీవి సినిమాలో తమ మనవడు నటించడం సంతోషంగా ఉందని డాక్టర్ సదానందం తెలిపాడు. పట్టణంలోని ప్రైవేట్ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో బాలుడిని అభినందించారు. చదవండి: Acharya Movie Review: సాక్షి ఆడియన్స్ పోల్.. 'ఆచార్య'పై ప్రేక్షకుల రివ్యూ -
ప్రభుత్వం అనుమతిస్తే కరోనా బాధితున్ని రెండు గంటల్లో బాగు చేస్తా..
సాక్షి, మందమర్రి రూరల్: ‘ప్రభుత్వం అనుమతిస్తే కరోనా బాధితున్ని రెండు గంటల్లో బాగు చేస్తా.. ఇదివరకు మూడొందల మందిని నయం చేశా’అంటున్నాడు మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బచ్చలి భీమయ్య. మందమర్రిలో మరో ఆనందయ్య.. కరోనా బాధితులకు ఆయుర్వేదం మందు అందిస్తూ బాగు చేస్తున్నాడంటూ బుధవారం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది. పట్టణంలోని మారుతినగర్లో నివాసం ఉంటున్న భీమయ్య.. తన తాత దగ్గర వనమూలికల వైద్యం గురించి తెలుసుకున్నానని చెప్పాడు. దగ్గు, దమ్ము ఊపిరితిత్తుల సమస్యలకు 13 రకాల వన మూలికలతో తయారుచేసిన మందు కరోనా బాధితులకు బాగా పనిచేస్తుందని, రెండు గంటల్లో నయం అవుతుందని పేర్కొన్నాడు. ఉచితంగానే ఈ మందు అందిస్తున్నానని తెలిపాడు. కాగా, భీమయ్య అందించే మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదని మందమర్రి సీఐ ప్రమోద్‌రావు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని ప్రజలు నమ్మి మోసపోవద్దని సీఐ కోరారు. -
ప్రాణాపాయ స్థితిలో గాయకుడు జై శ్రీనివాస్
సాక్షి, ఆదిలాబాద్: చిన్నప్పటి నుంచీ పాటే ప్రాణంగా పెరిగాడు. ఎంతో కష్టపడి సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు. దేశభక్తి పాటతో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం కరోనా బారిన పడడంతో రూ.11లక్షలకు పైగా వైద్యం కోసం ఖర్చు చేశాడు. ఆర్థిక పరిస్థితి ఛిన్నాబిన్నం కావడంతో ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. మందమర్రి మూడో జోన్‌కు చెందిన నేరడికొమ్మ శ్రీనివాస్ ఉరఫ్ జై శ్రీనివాస్ స్థానిక సింగరేణి హైస్కూల్లో 1993లో పదో తరగతి వరకు చదివాడు. ఆయన తండ్రి మందమర్రి ఏరియాలోని స్టోర్‌లో క్లర్క్‌గా విధులు నిర్వర్తించి 15ఏళ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందాడు. అక్క చైతన్య, బావ జితేంద్ర సహకారంతో హైదరాబాద్‌కు వెళ్లాడు. చిన్నప్పటి నుంచి పాటల మీద ఉన్న మక్కువతో సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాడు. అవకాశాలు లభించడంతో పలు చిత్రాల్లో పాడాడు. జై సినిమాలోని దేశభక్తి పాట ‘దేశం మనదే తేజం మనదే..’, రాజారాణి సినిమాలో ‘ఓ బేబి ఓరకనులతో..’, వీధి సినిమాలో ‘నా చిట్టితల్లి..’, బోనాల పాట ఢమ ఢమ డప్పుల మోత, తెలంగాణ జననీ తదితర అనే పాటలతో గుర్తింపు పొందాడు. నేరడికొమ్మ శ్రీనివాస్ తన పాటతో ‘జై శ్రీనివాస్’గా మారాడు. సినిమా, దేశభక్తి, జానపద, దైవభక్తి పాటలు పాడి పేరు సంపాదించుకున్నాడు. కరోనాతో ఆసుపత్రిలో.. జై శ్రీనివాస్ గత నెలలో కరోనా బారిన పడ్డాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కావడంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరాడు. ఇప్పటివరకు వైద్యం కోసం కుటుంబ సభ్యులు సుమారు రూ.11లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఇంకా పరిస్థితి విషమంగానే ఉండడం, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురు కావడంతో భార్యాపిల్లలు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మానవత్వంతో ముందుకు వచ్చి ఆదుకోవాలని, శ్రీనివాస్ తండ్రి రామాచారి బ్యాంకు అకౌంట్ నంబరు 62107990766, ఐఎఫ్‌సీ కోడ్ N0020308, గూగుల్‌పే నంబర్ 918247641235కు దాతలు ఆర్థికసాయం అందించాలని భార్య స్వాతి, కూతుళ్లు అభిష్ణు, జైత్ర కోరుతున్నారు. చదవండి: ఆర్ఎంపీల అత్యుత్సాహం.. టైపాయిడ్ పేరిట వైద్యం -
అలుగును అప్పగించిన వ్యక్తికి చుక్కలు
సాక్షి, మందమర్రి: తనకు పట్టుబడిన అలుగును ఫారెస్ట్ అధికారులకు అప్పగించిన సింగరేణి కార్మికుడు చుక్కలు చూడాల్సి వచ్చింది. విచారణ పేరుతో అతడిని మంగళవారం రాత్రంతా మంచిర్యాల, కొమురంభీం జిల్లాల్లో ప లుచోట్లకు తిప్పడంతో సదరు వ్యక్తి అస్వస్థతకు గురయ్యా డు. దీంతో బుధవారం ఉదయం అతడిని మంచిర్యాల ప్ర భుత్వాసుపత్రిలో చేర్పించి.. అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అతడిని పరీక్షించిన వైద్యులు కరోనా సస్పెక్ట్ వచ్చిందని, ఆర్టీపీసీఆర్ కోసం హైదరాబాద్‌లోని కింగ్‌కోఠి ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నట్లు తెలిపారు. సదరు వ్యక్తి సింగరేణి ఉద్యోగి కావడంతో కుటుంబ సభ్యులు అతడిని రామకృష్ణాపూర్‌లోని సింగరేణి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అసలేం జరిగింది..? బాధితుడు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. సింగరేణి కార్మికుని లైన్లోకి ఆదివారం అలుగు (వన్యప్రాణి) రావడంతో ఫారెస్ట్ అధికారులకు అప్పగిస్తామనే ఉద్దేశంతో సింగరేణి కార్మికుడు పట్టుకున్నాడు. సోమవారం ఉదయం విధులకు హాజరై ఇంటికొచ్చే సరికి చీకటి పడింది. ఫారెస్ట్ అధికారులు అందుబాటులో లేకపోవడంతో మంగళవారం ఉదయం విధులకు హాజరై ఇంటికొచ్చి తెల్సినవారి ద్వారా అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అధికారులు వచ్చి అలుగుతోపాటు సదరు వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా తిప్పిన అధికారులు సదరు వ్యక్తిని విచారణ పేరిట రాత్రంతా రెండుజిల్లాల్లో తిప్పినట్లు సమాచారం. ఉదయం మందమర్రికి తీసుకురాగా.. సదరు వ్యక్తి అస్వస్థతకు లోనయ్యాడని, దీంతో గుచప్పుడు కాకుండా ఆసుపత్రిలో చేర్పించారని కుటుంబసభ్యులు అంటున్నారు. అతడికి ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహించేవారని ప్రశ్నిస్తున్నారు. సదరు వ్యక్తికి కరోనా సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న అటవీ శాఖ అధికారులు, సిబ్బందికి పరీక్షలు చేయాలని పలువురు పేర్కొంటున్నారు. -
వేటగాళ్ల ఉచ్చుకు ఎంపీటీసీ బలి
మందమర్రి రూరల్(చెన్నూర్): మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మామిడిగట్టు సమీపంలో అటవీ ప్రాంతానికి షికారుకు వెళ్లి విద్యుత్ తీగలకు తగిలి వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. షికారుకు వెళ్లిన వ్యక్తులు చెప్పిన వివరాల ప్రకారం ఆదివారం రాత్రి సండ్రోనిపల్లికి చెందిన బైర్నేని ప్రశాంత్, సారంగపల్లి నివాసి, చిర్రకుంట ఎంపీటీసీ ఎండీ ఆసిఫ్, తుర్కపల్లికి చెందిన ఎండీ అఫ్రోజ్, మామిడిగట్టుకు చెందిన సయ్యద్ షరీఫ్ షికారుకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున తిరిగి వస్తున్న క్రమంలో అడవిజంతువుల కోసం అమర్చిన జే వైర్ ముందుగా వస్తున్న ఆసిఫ్ కాలుకు తగలడంతో ఒక్కసారిగా పైకిఎగిరి కిందపడి మృతి చెందాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇద్దరిపై కేసు నమోదు అడవి జంతువుల షికారుకోసం విద్యుత్ తీగలు అమర్చి ఆసిఫ్ మృతికి కారణమైన మామిడిగట్టుకు చెందిన గజ్జె దుర్గయ్య, నాంపెల్లి రాజంలపై సయ్యద్ షరీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రామకృష్ణాపూర్ ఎస్సై రవిప్రసాద్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిద్రమత్తులో అధికారులు అటవీ ప్రాంతంలో అడవిజంతువుల షికారు జరుగుతున్నా అధికారులు నిద్రమత్తు వీడడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. షికారుకు వెళ్లామని బహిరంగంగానే చెబుతున్నా వారిని కనీసం అదుపులోకి తీసుకోలేదంటే వారి విధి నిర్వహణ అర్ధమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. అటవీశాఖ అధికారులు అడవిని, వన్యప్రాణులను రక్షించాలని ఎన్నో ఆంక్షలు విధిస్తూ కఠిన చట్టాలు చేసినా ఇలాంటి వ్యవహారం జరుగుతుందంటే అధికారుల చేయి లేనిదే జరగడం లేదని, అధికారులు సక్రమంగా విధులు నిర్వహించి ఉంటే ఎంపీటీసీ మృతి చెందేవాడు కాదని మండల ప్రజలు పేర్కొంటున్నారు. -
వామ్మో.. కాసిపేట గని
సాక్షి, కాసిపేట(ఆదిలాబాద్) : మందమర్రి ఏరియా కాసిపేట గనిలో మంగళవారం ఉదయం షిప్టులో పైకప్పు కూలింది. ఇలా పైకప్పు కూలడం.. ఐ దురోజుల్లో రెండోసారి. గనిలోని 1వ సీం, 10డీప్, 25 లెవెల్లో పనులు నడుస్తున్నాయి. ఎస్‌డీయల్ యంత్రంతో ఆపరేటర్ బొగ్గు తీసుకొ చ్చేందుకు గనిలోకి వెళ్లాడు. అదే సమయంలో జంక్షన్లో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ప్రమాదాన్ని గుర్తించిన పుషర్ కార్మికులు ఇద్దరు అక్కడి నుంచి పరుగెత్తడంతో ప్రాణా లు కాపాడుకున్నట్లయ్యింది. ఎస్‌డీయల్ ఆపరేటర్ లోనికి వెళ్లకున్నా.. ఇద్దరు కార్మికులు ఏ మాత్రం ఆదమరిచి ఉన్నా.. ప్రాణనష్టం సభవించేదని కార్మికులు చర్చించుకుంటున్నారు. 1 వ సీంలో ప్రమాదపు అంచున పనిచేస్తున్నట్లు కార్మికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఐదురోజుల్లో రెండుసార్లు కూలిన పైకప్పు గనిలో 1సీంలో పనులపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 5న 1వ సీం 7 డిప్ అఫ్ 25 లెవెల్ జంక్షన్లో పెద్దమొత్తంలో పైకప్పు కూలింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అది జరిగిన ఐదు రోజులకే తిరిగి 10 డిప్లో ప్రమాదం జరగడంతో రక్షణ చర్యలు, అధికారులు, యూనియన్ నాయకుల తీరుపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 7డిప్లో కూలినట్లు కూలితే తమ ప్రాణాలు దక్కేవి కావని, తక్కువ పరిమాణంలో కూలడంతో బతికిపోయామని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. జరిగిన ప్రమాదాలను బయటకు రాకుండా సింగరేణి అధికారులు గోప్యంగా ఉంచడం మినహా రక్షణచర్యలు, కార్మికుల ప్రాణాల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. మొదటిసారి జరిగిన ప్రమాదంపై రెండురోజుల క్రితం గనిని సందర్శించిన ఉన్నతాధికారులు.. 1సీం పనులపై ఆగ్రహం వ్యక్తం చేవారు. అయినా గని అధికారుల్లో స్పందన లేకుండాపోయింది. దీంతో మరోసారి పైకప్పు కూలడం చర్చనీయాంశంగా మారింది. బొగ్గును టాప్కు వదలడమే సమస్య? గనిలో రూఫ్బోల్ట్ వేసేక్రమంలో బొగ్గును సైతం టాప్కు వదలడమే సమస్య అనే ఆరోపణలున్నాయి. గతంలో రూఫ్‌టాప్ బండకు వేసేవారు. దీంతో రూఫ్ నుంచి నీరు లీకేజీ అవుతుండడంతో పనిస్థలాల్లో ఎస్‌డీయల్ యంత్రాలు నడవడం కష్టమవుతుందని అధికారులు బొగ్గును టాప్కు వదిలి రూఫ్ వేస్తున్నారు. రూఫ్ టచ్ కావలంటే 10 ఫీట్లు అవసరం కాగా.. గనిలో కేవలం ఆరుఫీట్లు మాత్రమే ఉండటంతో బోల్టు మధ్యలో ఉంటున్నట్లు కార్మికులు చెబుతున్నారు. దీంతో రూఫ్‌కు బొగ్గుకు మధ్యలో ఉండే క్లే కు నీరు వచ్చి తడిసి పైకప్పు కూలుతున్నట్లు తెలుస్తోంది. జంక్షన్లో సక్రమంగా రూఫ్‌బోల్టు వేయడం.. బొగ్గును వదిలి బండకు రూఫ్‌బోల్టు వేస్తెనే కూలకుండా ఉంటుందని కార్మికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికి 1సీంలో ఐదుసార్లు పైకప్పు కూలినప్పటికీ అధికారుల చర్యల్లో మాత్రం మార్పు రావడంలేదు. ప్రస్తుతం జరిగే ప్రమాదాలు పెద్దవి అయినప్పటికీ ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భయాందోళన మధ్య విధులు నిర్వర్తిస్తున్నామని, ఇలాగే నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదం తప్పదని, వెంటనె చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. -
కేకే ఓపెన్‌కాస్ట్‌లో భారీగా కుంగిన నేల
సాక్షి, మంచిర్యాల: మందమర్రిలోని కల్యాణిఖని(కేకే) ఓపెన్‌కాస్ట్‌లో గురువారం నెల భారీగా కుంగిది. గతంలో ఈ ప్రాంతంలోనే ఉన్న కేకే-1 భూగర్భ గని మూతపడింది. భూగర్భ గనిని మూసివేసే సమయంలో భూమిలోనికి తవ్విన లోతైన గుంతలను ఇసుకతో నింపారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా అధికారులు నిర్లక్ష్యంగా వహించడంతో.. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నెల భారీగా కుంగిపోయి, దెబ్బతింది. ఫలితంగా కల్యాణిఖని (కేకే) ఓపెన్‌కాస్ట్‌లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. -
ఐసీడీఎస్‌లో అవినీతి కోణం
సాక్షి, మందమర్రి(ఆదిలాబాద్) : ఐసీడీఎస్‌లో జరిగిన అవినీతి బట్టబయలు అయింది. ఆయా చనిపోయి నాలుగు సంవత్సరాలు అయినా ఆమె బ్యాంక్ అకౌంట్లో గౌరవ వేతనం జమ చేస్తూ వచ్చారు. అయితే ఆమె స్థానంలో కొత్తగా నియామకం అయినా ఆయా వేతనం అందడం లేదని అధికారలకు ఫిర్యాదు చేయడంతో అవినీతి బయట పడింది. మందమర్రి మండలంలోని ఆదిల్పేట్ అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా పని చేసే పసునూటి మల్లక్క అనారోగ్యంతో ఏప్రిల్ 2015లో మృతి చెందింది. అయితే ఈ విషయాన్ని సీడీపీవో ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులకు తెలియజేసి వేతనాన్ని నిలుపుదల చేయడంలో సూపర్వైజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో 2019 వరకు మృతిరాలి బ్యాంకు ఖాతాలో లక్షా 96వేల 579 రూపాయల గౌరవ వేతనం జమ అయింది. అయితే కొత్తగా ఫిబ్రవరి 2019లో సీడీపీవో ద్వారా సహాయకురాలిగా నియామకమైన మోర్ల రజిని ఇంత వరకు వేతనం రాకపోయేసరికి విషయాన్ని అధికారుల దృష్తికి తీసుకువెళ్లగా అసలు విషయం బయటకు పొక్కింది. దీనికి మందమర్రి సెక్టార్ సూపర్వైజర్ రమాదేవి బాధ్యత వహించాలని సీడీపీవో నోటీస్ ఇచ్చారు. అయితే అధికారులు ముందుగా మృతురాలి అకౌంట్ నుంచి గౌరవ వేతనాన్ని గుట్టు చప్పుడు కాకుండా వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. కొత్త ఆయా నియామకం.. ఆదిల్పేట్ అంగన్వాడీ కేంద్రం ఆయా 2015లో చనిపోగా గత సంవత్సరం మే నెలలో కొత్త ఆయా కోసం నోటిఫికేషన్ వేసి ఫిబ్రవరి 2019 మాసంలో కొత్త ఆయాగా మోర్ల రజినిని నియమించారు. రజిని ఆరు మాసాలుగా ఆయాగా విధులు నిర్వహిస్తుంది. ఆరు నెలలుగా రజినికి గౌరవ వేతనం రాకపోవడంతో ఐసీడీఎస్ కార్యాలయంలో సంప్రదించగా మృతురాలు మల్లక్క అకౌంట్లోనే గౌరవ వేతనం జమ అవుతుందన్న విషయం బయటకు వచ్చింది. ఆరు నెలలుగా ఆదిల్పేట్ అంగన్వాడీ కేంద్రంలో ఆయా పనులు చేస్తున్నానని తనకు గౌరవ వేతనం చెల్లించాలని రజిని డిమాండ్ చేసింది. సంజాయిషీ ఇవ్వాలని... ఆయాగా పని చేసిన మల్లక్క మృతి చెందిన విషయాన్ని తెలియజేయక పోవడంతోనే మృతురాలి బ్యాంక్ అకౌంట్లో గౌరవ వేతనం జమ అయిందని దానికి మందమర్రి సెక్టార్ సూపర్వైజర్ నిర్లక్ష్యమే కారణమంటూ రమాదేవికి నోటీసు పంపించారు. నోటీసులో మల్లక్క డ్యూటీ చేస్తుందని అటెండెన్సీ ఏ కారణం చేత ఇవ్వవలసి వచ్చిందో తెలపాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన తనపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో రాత పూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని తదితర అంశాలను రమాదేవికి సీడీపీవో అందించిన సంజాయిషీ నోటీసులో పేర్కొన్నారు. కొట్టొచ్చినట్లు అధికారుల నిర్లక్ష్యం.. ఆయాగా పని చేసిన మల్లక్క చనిపోయిన తర్వాత ఇద్దరు సూపర్వైజర్లు మారారు. చనిపోయినప్పుడు పని చేసిన సూపర్వైజర్ వేరు. ప్రస్తుతం సూపర్వైజర్గా పని చేస్తున్న రమాదేవి ఆదిల్‌పేట్‌లోని అంగన్వాడీ ఆయా మల్లక్క చనిసోయినప్పుడు అక్కడ విధులు నిర్వహించడం లేదు. అంతే కాకుండా ఆయా చనిపోయినందుకే ఆ కేంద్రానికి ఆయా కావాలని నోటిఫికేషన్ వేయడం జరిగింది. నోటిఫికేషన్ ద్వారానే కొత్తగా మోర్ల రజినిని ఆయాగా నియమించడం జరిగింది. కొత్తగా నోటిఫికేషన్ వేసినప్పుడైనా మల్లక్క పేరును తొలగించాల్సి ఉంది. అయినా అలా జరగలేదు. దీంతో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. కాని కింది స్థాయి అధికారులను బలి చేసి చేతులు దులుపుకుందామనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్న తీరు స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి బాధ్యులుగా ఉన్న ఉన్నతాధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
నాగపూర్ ట్రైన్లో దొంగల బీభత్సం
మందమర్రిరూరల్/మంచిర్యాలక్రైం: సికింద్రాబాద్ నుంచి నాగపూర్ వెళ్లే ట్రైన్లో శనివారం ఉద యం దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు మహిళల మెడల్లో నుంచి ఐదున్నర తులాల బంగారం అపహరించుకుని ట్రైన్ చైన్ లాగి పరారయ్యారు. రైల్వే సీఐ కర్రె స్వామి కథనం ప్రకారం శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు సికింద్రాబాద్ నుంచి నాగపూర్‌కు ట్రైన్ బయలుదేరింది. రవీంద్రఖని స్టేషన్ దాటిన తర్వాత మందమర్రి రైల్వేస్టేషన్ రాకముందు ట్రైన్లోనే వస్తున్న దొంగలు ప్రయాణికులు హైదరాబాద్‌కు చెందిన కల్పన మెడలో నుంచి తులంన్నర, సుష్మా రాంబాయి మెడలోంచి తులం, షేక్ తల్వాల్ మెడలోంచి మూడు తులాలు మొత్తం ఐ దున్నర తులాల బంగారు గొలుసులను లాక్కుని ట్రైన్ చైన్ లాగి, రైలు ఆగగానే దిగి పరారయ్యారు. ట్రైన్లో ఉన్న పోలీస్ సిబ్బంది నిందితులను పట్టుకునేందుకు గాలింపులు జరిపినా ఫలితం లేకుం డా పోయింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు జాగిలాలతో గాలించినా దొంగల ఆచూకీ దొర కలేదు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే సీఐ వివరించారు. దొంగలు పారిపోతున్న సమయంలో పోలీస్ సిబ్బంది వద్ద ఆయుధాలు లేకపోవడం కూడా కొంత ఇబ్బంది కలిగిందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే, దొంగతనానికి పాల్పడిన వారిలో 8 మంది ఉన్నట్లు తెలిసిందన్నారు. రైల్లో ప్రయణిస్తున్న సమయంలో నిద్రిస్తున్న మహిళలను టార్గె ట్ చేసి తరుచుగా దొంగతనాలకు పాల్పడే ముఠాగా అనుమానిస్తున్నామని సీఐ పేర్కొన్నారు. అదుపులో అనుమానితులు! రైల్లో జరిగిన దొంగతనం నేపథ్యంలో మంచిర్యా ల జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మంచి ర్యాల ఏసీపీ, బెల్లంపల్లి ఏసీపీ, కాగజ్‌నగర్ పోలీ సులు ఆయా ప్రాంతాల్లోని రైల్వేస్టేషన్లు, బస్టాండ్, లాడ్జీలు, వాహనాలతోపాటు బస్సులు, ఇతర వా హనాలను అర్ధరాత్రి నుంచే తనిఖీ చేశారు. కాగా, ఈ దోపిడి జరిగిన తర్వాత జీఆర్పీ పోలీసులు కొంతమంది పాత నేరస్తులను, అనుమానితులను అదుపులోకి తీసుకుకొని విచారిస్తున్నట్లు సమాచారం. తనిఖీల్లో మరీ అనుమానస్పదంగా కనిపించిన ఓ వ్యక్తిని ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు తెలిసింది. అనుమానితుడిని రైల్వే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తున్న జీఆర్పీ పోలీసులు -
మహిళలకు క్రీడాపోటీలు
సాక్షి, మందమర్రిరూరల్(చెన్నూర్): ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ఎల్లందు క్లబ్లో బుధవారం సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు పలు క్రీడాపోటీలు నిర్వహించారు. పోటీలను సేవా సమితి అధ్యక్షురాలు, ఏరియా జీఎం సతీమణి సుజాత రాఘవులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం మహిళల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. నేటి రోజుల్లో మహిళలు అంతర్జాతీయ స్థాయిలో మగవారికి ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. సింగరేణిలో ఉత్తమ సేవలు అందిస్తున్న మహిళలను గుర్తించి అభినందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మహిళలకు త్రోబాల్, బాంబే బ్లాస్ట్, పాటలు, నృత్యాలు, స్కిట్స్, హాస్యవల్లరి తదితర పోటీలు నిర్వహించగా గెలుపొందిన వారికి మహిళా దినోత్సవం రోజున ఏరియా జీఎం రాఘవులు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా డీవైపీఎం తిరుపతి, ఎస్టేట్ ఆఫీసర్ నవనీత, ఎకౌంట్స్ ఆఫీసర్ సుధారాణి, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ సకినాల రాజేశ్వర్రావ్, నెల్సన్, గ్రౌండ్ ఇన్చార్జి తిరుపతి, స్విమ్మింగ్ కోచ్ పప్పు నారాయణ అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శ్రీరాంపూర్(మంచిర్యాల): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సింగరేణి ఆధ్వర్యంలో మహిళలకు బుధవారం నస్పూర్ కాలనీలోని సేవా భవన్ వద్ద పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను సేవా అధ్యక్షురాలు ఆస్మాసుభాని ప్రారంభించారు. త్రోబాల్, బాల్ ఇన్ బాస్కెట్, టగ్ ఆఫ్ వార్, బాంబ్ బ్లాస్ట్ వంటి పోటీలు నిర్వహించారు. విజేతలకు శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో బహుమతి ప్రదానం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, పీఎం తుకారాం, స్పోర్ట్స్ సూపర్వైజర్ సీహెచ్ అశోక్, జనరల్ కేప్టెన్ గోపాల్‌రెడ్డి, కో ఆర్డినేటర్ రమేశ్, సేవా కార్యకర్తలు రత్నకళ, మంజుల, కొట్టె జ్యోతి, సునీత, స్వప్న, లలిత, తిరుమల, శంకరమ్మ పాల్గొన్నారు. -
మందమర్రిలో పులి చర్మం పట్టివేత
మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలోని రామన్‌కాలనీలో గురువారం అటవీశాఖ అధికారులు పులి చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులు పులి చర్మాన్ని అమ్మకానికి పెట్టారు. విషయం తెలియడంతో మహారాష్ట్రలోని చంద్రాపూర్‌కు చెందిన టైగర్ హంటింగ్ అండ్ సొసైటీ స్వచ్ఛంద సంస్థ సభ్యులు అటవీ అధికారులకు పట్టి చ్చేందుకు ఆపరేషన్ చేపట్టారు. వారితో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు బేరం కుదిరింది. వారి సహకారంతో మందమర్రిలో అధికారులు మాటు వేశా రు. పెద్దపల్లి జిల్లా రామారావుపేటకు చెందిన మేకల నర్సయ్య పట్టణంలో ఎవ రూ లేని ఇంటి వద్దకు తీసుకెళ్లాడు. దీంతో పులి చర్మంతోపాటు అతడిని అదుపులోకి తీసుకున్నారు. -
కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి
మందమర్రిరూరల్ : కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ నియోజక వర్గ ఇన్చార్జి సొత్కు సంజీవరావు అన్నారు. శుక్రవారం మండలంలోని తుర్కపల్లి, గుడిపెల్లి, వెంకటాపూర్ గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసి సమస్యలపై ప్రజాప్రతినిధులను నిలదీస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు అక్కల రమేశ్, నియోజక వర్గ ఓబీసీ చైర్మన్ గోళ్ల వీరయ్య, నాయకులు మేకల శ్రీనివాస్, కొప్పుల బాపు, షేక్ ఇబ్రహిం, శంకర్ గౌడ్, పైడి బానయ్య, ఉన్నారు. -
వికటించిన ఎంఆర్ వ్యాక్సిన్
- ఆరుగురు విద్యార్థులకు అస్వస్థత మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో ఎంఆర్ వ్యాక్సిన్ వికటించింది. స్థానికంగా ఉన్న లిటిల్ ఫ్లవర్ స్కూల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు గురువారం అస్వస్థతకు గురయ్యారు. రూబెల్లా వాక్సిన్ను విద్యార్థులకు ఇవ్వగానే వారికి తీవ్రమైన వాంతులు అయ్యాయి. కొందరు కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో విద్యార్థులను హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. వాక్సిన్ను సరైన విధంగా ఇప్పించటంలో యాజమాన్యం విఫలం అయిందని విద్యార్థి సంఘాల నాయకులు స్కూలు ఎదుట ఆందోళనకు దిగారు. -
బలవంతంగా పెళ్లి చేసుకున్నాడంటూ..
♦ యువతి ఆత్మహత్యాయత్నం ♦ తన చావుకు ఏసీపీ కూడా కారణమంటూ లేఖ ♦ ప్రేమ వివాహం.. బలవంతపు పెళ్లంటూ ఫిర్యాదు ♦ ఫొటోలు ఫేస్బుక్లో పెట్టడంపై మనస్తాపం మందమర్రి (చెన్నూర్): తనను బలవంతంగా పెళ్లి చేసుకొని ఫొటోలు వాట్సాప్, ఫేస్‌బుక్‌ల్లో పెట్టి పరువుకు భంగం కలిగించాడని మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. మంచిర్యాల జిల్లా మందమర్రిలో క్యాతం శ్రీవాణి కుటుంబం నివసిస్తోంది. ఇటీవలే ఆమె సారంగపెల్లికి చెందిన అయిల్ల సాగర్‌ను ప్రేమ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 22న సాగర్, శ్రీవాణి కాళేశ్వరంలో వివాహం చేసుకుని వస్తుండగా.. ఆమె సోదరుడు తన స్నేహితులతో కలిసి సాగర్‌పై దాడిచేసి సోదరిని ఇంటికి తీసుకెళ్లినట్లు సమాచారం. సాగర్ భయపెట్టి.. బలవంతంగా పెళ్లి చేసుకున్నాడంటూ బెల్లంపల్లి ఏసీపీకి శ్రీవాణి, సోదరుడు కలసి ఫిర్యాదు చేశారు. తాను బలవంతంగా పెళ్లి చేసుకోలేదని, పెళ్లి ఫొటోలే నిదర్శమంటూ శ్రీవాణితో దిగిన ఫొటోల్ని సాగర్ సోషల్‌మీడియాలో పెట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన శ్రీవాణి గురువారం నిద్రమాత్రలు మింగింది. దీంతో ఆమెను మంచిర్యాల ఆస్పత్రిలో చేర్పించారు. కమిషనర్‌కు ఫిర్యాదు...: తమ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్ట డం లేదని,సాగర్‌తోనే కాపురం చేయాలని ఏసీ పీ బెదిరిస్తున్నాడని శ్రీవాణి ఇటీవల మీడియా తో మాట్లాడింది. పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ దృష్టికి తీసుకెళ్లింది. తనకు న్యాయం చేయకుండా, తన అన్నయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతామంటూ ఏసీపీ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసింది. శ్రీవాణి రాసిన సూసైడ్ నోట్: ‘అమ్మ..అన్నయ్య..అక్కలందరూ నన్ను క్షమిం చండి. నేను చేసిన తప్పునకు క్షమించండి. ఇక ఈ భూమి మీద బతికే ఆశ నాకు లేదు. సాగర్, భీరెల్లి రాములు, పానుగంటి సతీశ్ నా వీడియోలు, ఫొటోలు ఫేస్బుక్లో అప్లోడ్ చేసి మన పరువు తీస్తున్నారు. ఇక్కడి ఏసీపీ సతీష్ కూడా అసభ్యంగా మాట్లాడుతూ నేను ఇచ్చిన కేసును దర్యాప్తు చేయకుండా అన్నయ్యను, నన్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. నా చావు కు ఏసీపీ సతీష్, సాగర్, రాములు, పాను గం టి సతీష్‌లే కారణం. నా చావుకు కారణమైన వీరిని అసలే వదలకండి. అన్నయ్యా.. నన్ను క్షమించు సారీ.. సారీ’ ఇట్లు నీ చెల్లెలు శ్రీవాణి అని రాసుంది. కాగా, నిందితులపై చర్య తీసుకోవాలని శ్రీవాణి బంధువులు మంచిర్యాల ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. డీసీపీ జాన్‌వెస్లీ బాధితులతో మాట్లాడి.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించుకున్నారు. -
రోడ్డు ప్రమాదంలో భార్య మృతి
- భర్త, కుమార్తె పరిస్థితి విషమం మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి శివారులోని సోనియా దాబా వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో భార్య మృతిచెందగా, భర్త, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. కుమార్తెతో పాటు దంపతులు ద్విచక్రవాహనంపై వెళుతుండగా లారీని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో భార్య కృష్ణవేణి అక్కడికక్కడే మృతిచెందగా, ఆమె భర్త, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. -
చిన్నారులపై యాసిడ్ దాడి
-
చిన్నారులపై యాసిడ్ దాడి
మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రిలో చిన్నారులపై యాసిడ్ దాడి జరిగింది. సిరికొండ అనూష, సంగీత్ అనే బాలురపై శనివారం మధ్యాహ్నం సొంత పెద్ద నాన్న సిరికొండ సదానందం యాసిడ్ పోశాడని స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యులు బాధితులిద్దరినీ వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదృష్టవశాత్తూ ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పెట్రో ధరలను నిరసిస్తూ ఆందోళనలు
-మోదీ దిష్టిబొమ్మ దహనం మందమర్రి: పెంచిన పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అదిలాబాద్ జిల్లా మందమర్రిలోని కోల్‌బెల్ట్ రహదారిపై స్థానిక కాంగ్రెస్ నాయకులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని.. దీని వల్ల మధ్య తరగతి ప్రజలపై విపరీతమైన భారం పడుతోందని ఆందోళన చేశారు. అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. -
యువకుడి దారుణహత్య
మందమర్రి : మందమర్రి మండల కేంద్రంలోని పాత బస్టాండ్ చౌరస్తాలో సోమవారం రాత్రి మేకల రాజేశ్(23) దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం... పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన రాజేశ్‌తో తన స్నేహితులైన ఐదుగురు యువకులకు బస్టాండ్ ప్రాంతంలో ఘర్షణ జరిగింది. ఇరువురి మధ్య మాటా మాటా పెరగడంతో వినయ్ అనే యువకుడు కత్తితో రాజేశ్‌పై దాడి చేశాడు. కడుపులో పొడిచాడు. సమాచారం అందుకున్న స్థానిక ఎస్సై సతీశ్ పోలీసు బందంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడ్డ రాజేశ్‌ను చికిత్స నిమిత్తం మంచిర్యాలకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. హత్య కారణాలు తెలియరాలేదు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
సింగరేణి బుల్ డోజర్ దహనం
మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్లో సింగరేణి సంస్థకు చెందిన బుల్డోజర్ను గుర్తు తెలియని వ్యక్తులు దహనం చేశారు. స్థానిక ఓపెన్‌కాస్ట్ గనిలో ఉన్న షావల్ డోజర్‌ను శుక్రవారం రాత్రి కిరోసిన్ పోసి దుండగులు నిప్పంటించారు. డోజర్‌కు పాక్షికంగా నష్టం వాటిల్లింది. ఈ మేరకు సంస్థ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల క్రితమే జిల్లాలో మావోయిస్టులు ప్రాణహితపై వంతెన పనులు చేస్తున్న వాహనాలను తగులబెట్టిన విషయం విదితమే. అయితే, తాజా ఘటనలోనూ వారి పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ఏసీబీ వలలో అందుగులపేట వీఆర్ఓ
మంచిర్యాల టౌన్ : ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం అందుగులపేట వీఆర్ఓ భూక్యా చందూలాల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పట్టాదారు పాసుపుస్తకం జారీ చేసేందుకు చండ్ర నాగేశ్వరరావు అనే రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి వద్ద రూ.7 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇదే సమయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా..రూ. 8 లక్షల నగదు, మరో రూ.10 లక్షలు బ్యాంక్‌లో ఉన్నట్లుగా గుర్తించారు. మరో చోట భూములు, మామిడి తోట కొన్నట్లు గుర్తించి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ పాపాలాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
వాగులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
మందమర్రి: అదిలాబాద్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం కనిపించకుండా పోయిన ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. జిల్లాలోని మందమర్రి మండలం తిమ్మాపూర్ కి చెందిన నరేష్, ఖలీల్ అనే ఇద్దరు చిన్నారులు గ్రామ సమీపంలోని పాలవాగులో మృత దేహాలై కనిపించారు. స్థానికులు గుర్తించి చిన్నారుల మృత దేహాలను వెలికి తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
‘మావోయిస్టు ప్రకటన కాదు.. ’
మందమర్రి: మావోయిస్టు పార్టీ ప్రతినిధి పేరుతో ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో పత్రికలకు విడుదలైన ప్రకటన నకిలీల సృష్టి అని స్థానిక సీఐ సబయ్య స్పష్టం చేశారు. మావోయిస్టుల పేరుతో వచ్చిన ప్రకటనపై శుక్రవారం సీఐ మీడియాతో మాట్లాడుతూ... నిందితులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేసేందుకే ఇలాంటి ప్రకటనలను సృష్టిస్తున్నారని అన్నారు. -
మందమర్రిలో సింగరేణి జాబ్‌మేళా
మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో శుక్రవారం సింగరేణి ఆధ్వర్యంలో జాబ్‌మేళా ప్రారంభమైంది. ఆణిముత్యాలు పేరుతో ఈ మేళాను సింగరేణి జీఎం వెంకటేశ్వరరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని యువత సద్వినియోగం చేసుకుని, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మొత్తం 1,500 మంది యువతీయువకులు హాజరై పేర్లు నమోదు చేయించుకున్నారు. సింగరేణి ఉద్యోగుల పిల్లలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నిరుద్యోగులు ఈ మేళాకు అర్హులు. ఎంపికైన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తారు. -
వైద్యం వికటించి వృద్ధుని మృతి
మందమర్రి (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలంలోని శ్రీపతినగర్‌కు చెందిన వల్లాల రాములు(65) వైద్యం వికటించి శనివారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక ఆర్ఎంపీ వైద్యుని వద్ద చికిత్స చేయించుకుంటున్నాడు. శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా మృతిచెందాడు. వైద్యం వికటించే రాములు మృతిచెందాడని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆర్ఎంపీ డాక్టర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకస్మిక తనిఖీలు : సారా వ్యాపారులు అరెస్ట్
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం పులిమడుగు వద్ద శనివారం పోలీసు, అటవీ శాఖ, ఆర్టీఏ, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 28 వాహనాలు సీజ్ చేశారు. అలాగే రూ. లక్ష విలువైన టేకు, కలపతోపాటు 125 లీటర్ల సారా, 2500 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం చేసుకున్నారు. 10 మంది సారా వ్యాపారులను అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సింగరేణి కార్మికుల స్వచ్ఛ భారత్
ఆదిలాబాద్(మందమర్రి): స్వచ్ఛ భారత్‌లో మేము సైతం అంటూ... సింగరేణి అధికారులు ముందుకొచ్చారు. ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో గురువారం ఉదయం సింగరేణి ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సింగరేణి మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పులువురు అధికారులు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మందమర్రిలోని కార్మిక నగర్లో పేరుకు పోయిన చెత్తను అధికారులు శుభ్రం చేశారు. పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా జీవించగల్గుతామని వెంకటేశ్వరరెడ్డి అన్నారు. -
ఐసీడీఎస్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలోని ఐసీడీఎస్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఐసీడీఎస్ కార్యాలయానికి సంబంధించి విపరీతమైన అవినీతి ఆరోపణలు రావడంతో బుధవారం ఏసీబీ అధికారులు అకస్మాత్తుగా దాడులు చేశారు. ఈ దాడుల్లో భాగంగా కంప్యూటర్ ఆపరేటర్ వద్ద ఉన్న రూ.4,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఐసీడీఎస్ సీపీడీవోపై విచారణ నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ చెప్పారు. -
ప్లానింగ్ లేకుండా అభివృద్ధి పనులా?
మందమర్రి : మంద మర్రి మున్సిపాలిటీ పనితీరుపై మంచిర్యాల ఆర్డీవో, మున్సిపాలిటీ ప్రత్యేకాధికారి ఆయేషా మస్రత్ ఖానం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లానింగ్ లేకుండా, ఇష్టానుసారంగా పనులు చేపడుతారా? అంటూ అసహనం వ్యక్తం చేశారు. బుధవారం ఆకస్మిక తనిఖీపై మందమర్రి మున్సిపాలిటీకి వచ్చిన ఆర్డీవో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు ఎలా చేపడుతున్నారనే ఆర్డీవో ప్రశ్నకు అధికారులు నీళ్లునమిలారు. ప్రభుత్వ పనులు, కార్యక్రమాలు చేపట్టే సమయంలో నియమ, నిబంధనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఏవైనా సిఫారసులు వస్తే వాటిని పట్టించుకోకూడదని సూచించారు. ఫైళ్లు ఎలా మాయమయ్యాయి? మున్సిపాలిటీలో గతంలో నల్లా కనెక్షన్ల కోసం ఇచ్చిన రశీదులు, దాని తాలుకూ ఫైల్ తెప్పించాలని ఆర్డీవో ఆదేశించగా ఆ ఫైల్ లేదంటూ సిబ్బంది సమాధానం ఇచ్చారు. దీనిపై ఆగ్రహానికి గురైన ఆర్డీవో ఫైళ్లు ఎలా మాయమవుతాయని మండిపడ్డారు. ప్రజలు పన్నులు కట్టేలా చైతన్యపర్చాలని సూచించారు. మందమర్రి మార్కెట్లో చెత్తాచెదారం పేరుకుపోతున్నదని ఫిర్యాదులు అందుతున్నాయని, అక్కడ తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. డీఈ గంగాధర్, ఏఈ ప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. -
మందమర్రిలో మావోయిస్టు పోస్టర్లు
మున్సిపల్ నోటీసు బోర్డుపై... మందమర్రి: ఆదిలాబాద్ జిల్లా మందమర్రిలో బుధవారం మావోయిస్టుల పేర పోస్టర్లు కనిపించాయి. మున్సిపాలిటీ కార్యాలయంలోని నోటీస్ బోర్డుపైనే ప్రత్యక్షమవడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. ‘డిసెంబర్ 2 నుంచి 8 వరకు పీఎల్జీఏ వారోత్సవాలను సమరోత్సాహంగా హుందాగా జరుపుకోండి. యువతీయువకులు ప్రజాసైన్యంలో చేరండి. పోలీసుల్లో చేరకండి. ప్రజాద్రోహులుగా మారకండి’ అంటూ ఆ పోస్టర్లలో మావోయిస్టులు పేర్కొన్నారు. ‘శత్రువుల మరణం గట్టిపోస కంటే తేలికైందని, ప్రజల కొరకు మరణం హిమాలయాల కన్న ఉన్నతమైందంటూ అందులో పొందుపరిచారు. ఈ పోస్టర్లు సింగరేణి కోల్‌బెల్ట్ మావోయిస్టు (సీపీఐ మావోయిస్టు) పేరిట వెలిశాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఈ పోస్టర్లు వేశారు. -
ఆదర్శం.. ఆగమాగం..
మందమర్రి రూరల్ : జిల్లాలోని ఆదర్శ పాఠశాలల పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటికే అరకొర సౌకర్యాలతో నెట్టుకువస్తున్న ఆదర్శ పాఠశాలలకు కొత్త ఆపద వచ్చిపడింది. జిల్లాలో ఏడు పాఠశాలలు ఉన్నాయి. వాటిని కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థాయిలో తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించడంతో ఆకర్షణీయమైన వేతనాలు, అన్ని అలవెన్సులు, బోధనకు కావాల్సిన అన్ని వసతులూ ఉంటాయనే ఆశతో పోటీ పరీక్షల్లో నెగ్గి మరీ ఉపాధ్యాయులు మోడల్ స్కూళ్లలో చేరారు. ఇప్పుడు వారి పట్ల ప్రభుత్వం ఉదాసీన వైఖరి ప్రదర్శిస్తుండడంతో ఒక్కొక్కరుగా గుడ్‌బై చెబుతున్నారు. అర్హత, సర్వీస్, సంబంధిత సమస్యలపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో వ్యక్తిగతంగా నష్టపోలేక స్కూల్ పాయింట్లకు పయనమవుతున్నారు. 14 మంజూరు.. ఏడు ప్రారంభం నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోడల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గత విద్యాసంవత్సరం నుంచే ఈ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. జిల్లాకు మొత్తం గతేడాదే 14 పాఠశాలలు మంజూరు కాగా.. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, దండేపల్లి, జైనథ్, మందమర్రి, కుంటాల, బజార్‌హత్నూర్‌లలో స్కూళ్లను ఏర్పాటు చేశారు. 6 నుంచి ఇంటర్మీడియెట్ వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. బోధనకు ప్రభుత్వం పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), టైయిస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల (టీజీటీ)ను ఎంపిక చేసింది. ఒక్కో స్కూల్‌కు ఒక ప్రిన్సిపాల్ 13 మంది పీటీజీలు, ఆరుగురు టీజీటీలు మొత్తం 20 మంది స్టాఫ్ ఉండాలి. కాగా.. ఈ ఏడు పాఠశాలన్నింటిలో ఇద్దరు మాత్రమే ప్రిన్సిపాల్స్ ఉన్నారు. ఇక పాఠశాలలో ముగ్గురు నుంచి నలుగురు వరకు స్టాఫ్ తక్కువగా ఉంది. సుమారు 20 పోస్టుల ఖాళీగా ఉన్నాయి. సర్సీస్ రూల్స్, వేతనాలతోనే సమస్య.. ప్రభుత్వ పాఠశాల ఎస్జీటీలకు నెలకు రూ.10,900, స్కూల్ అసిస్టెంట్లకు రూ.14,860 మూల వేతనాలు ఉండ గా ఆదర్శ పాఠశాలలో పనిచేసే టీజీటీలకు నెలకు రూ.14,860, పీజీటీలకు రూ.16,150 ఖరారు చేసింది. ఎక్కువ వేతనం వస్తుందని ఆశతో అప్పటికే ప్రభుత్వ పాఠశాల్లో ఎస్జీటీలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తూ రాత పరీక్షల ద్వారా ఎంపికై మోడల్ స్కూళ్లలో చేరారు పలువురు. ఎస్జీటీలను టీజీటీలుగా, స్కూల్ అసిస్టెంట్లను పీజీటీ ప్రిన్సిపాల్స్‌గా తీసుకుంది. నియామకాలు బాగానే ఉన్నా.. తర్వాత వీరిని ప్రభుత్వం పట్టించుకోవడమే మానేసింది. సర్సీస్ రూల్స్, బదీలీలపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. వీరి నియామకం నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఉపాధ్యాయులకు డీఏ రెండు సార్లు (17.12) శాతం పెరిగింది. ఆదర్శ పాఠశాలల అధ్యాపకులకు మాత్రం పాత మూల వేతనమే అందుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయులతో పోలిస్తే పీజీటీలకు ప్రతి నెలా రూ.7,125, టీజీటీలు రూ.6,556 తక్కువ వేతనం పొందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసి మోడల్ స్కూళ్లలో బోధిస్తున్న ఉపాధ్యాయులకు పాత పింఛన్ వర్తిస్తుందా? కొత్త పింఛన్ విధానమా? అనే అశంపై స్పష్టత లేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించింది. ఆదర్శ పాఠశాలల్లోని టీజీటీలు, పీజీటీలకు ఇది వర్తించకపోవడంతో భవిష్యత్తులో పీఆర్సీలో నష్టపోయే ప్రమాదం ఉంది. తిరిగి పాత స్థానాలకు.. మోడల్ స్కూళ్లలో పోస్టింగ్ పొందిన తర్వాత వాటిలో పనిచేయడం ఇష్టం లేకపోతే రెండేళ్లలోపు తిరిగి స్కూల్ పాయింట్లకు తిరిగి వచ్చే వెసులు బాటును ప్రభుత్వం కల్పిం చింది. దీంతో ఈ నిబంధన ఆధారంగా ఆదర్శ పాఠశాల బోధకులు పాత స్థానాలకు వెళ్తున్నారు. ఇక్కడే కొనసాగితే భవిష్యత్తులో సర్వీస్ పరంగా, వేతనాల పరంగా నష్టపోయే ప్రమాదం ఉందని వారు తిరిగి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే ఆసిఫాబాద్‌లోని పాఠశాలలో ఇద్దరు పీజీటీ లు, మందమర్రిలో ఒకరు సర్కారు బడిలోకి వెళ్లిపోయారు. మరో 20 మంది మోడల్ స్కూళ్ల నుంచి స్కూల్ పాయింట్లకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. వసతులు, భవనాలులేక అనేక అసౌకర్యాల మధ్య విద్యార్థులు పాఠశాలలో చేరేందుకు ఇష్టపడటం లేదు. మోడల్ స్కూళ్లలో ఇప్పటికే పోస్టులు భారీ స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న బోధకులు కూడా వెళ్లిపోతే విద్యాబోధన, ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో టీజీటీలు, పీజీటీలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు - సత్యనారాయణ, డీఈవో ఆదిలాబాద్ పోస్టింగ్‌లు తీసుకున్న రెండేళ్లలో ఇష్టం లేకుంటే టీజీటీలు, పీజీటీలు తిరిగి స్కూల్ పాయింట్లకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ విషయాన్ని ముందుగానే స్పష్టం చేసింది. వారికి కొన్ని సమస్యలున్నాయని అంటున్నారు. వారు వెళ్లిపోతే ఖాళీలతో కొత్తగా రిక్రూట్మెంట్ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది లేదు. -
ఈ-పంచాయతీ
మందమర్రి రూరల్ : గ్రామాల అభివృద్ధే లక్ష్యంతో దూసుకెళ్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం.. గ్రామ పాలన ను అంతర్జాలానికి అనుసంధానం చేస్తోంది. మారుమూల గ్రామాల్లోనే పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ-పాలనను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా పంచాయతీలను ప్రపంచంతో అనుసంధానం చేయనుంది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 8,778 గ్రామ పంచాయతీలకు గాను.. 2చ440 పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇందుకు కావాల్సిన మార్గదర్శకాలనూ సూచించింది. అందులో భాగంగా జిల్లాలో మొత్తం 866 గ్రామ పంచాయతీలకు గాను వీటిని 580 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. ఒక క్లస్టర్ కింద రెండు లేదా మూడు పంచాయతీలు ఉన్నాయి. ప్రస్తుతం 145 క్లస్టర్ల పంచాయతీలను ఈ-పంచాయతీలుగా ఎంపిక చేశారు. ఇందుకు సంబంధించిన పనులు కూడా చకాచకా సాగుతున్నాయి. ఇప్పటికే జిల్లాకు కంప్యూటర్లు కూడా చేరుకున్నాయి. బీఎస్ఎన్ల్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. జిల్లాలోని మూడు డివిజన్లలో మొదటిసారిగా ఈ-పంచాయతీ పాలన అమలులోకి రానుంది. ఎంపిక చేసిన 145 క్లస్టర్ పంచాయతీలలో ఆదిలాబాద్ డివిజన్లో 51, ఆసిఫాబాద్ డివిజన్లో 34, నిర్మల్ డివిజన్లో 60 పంచాయతీలకు కంప్యూటర్లు ఇవ్వనున్నారు. 145 కంప్యూటర్ల పంపిణీ.. ఈ-పంచాయతీల కోసం జిల్లాకు 145 కంప్యూటర్లు మంజూరయ్యాయి. వీటిని జిల్లాలోని అన్ని మండల పరిషత్ కార్యలయాలకు ఒకటి చొప్పున, జిల్లా పరిషత్ కార్యాలయాలకు రెండు, డివిజన్ స్థాయి కార్యాలయాలకు ఒకటి చొప్పున పంపిణీ చేశారు. జిల్లా కేంద్రం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ డివిజన్లలో, డీపీవో కార్యాలయంలో, 52 మండల పరిషత్‌లలో కంప్యూటర్లు పంపిణీ చేశారు. ఎంపికైన పంచాయతీలకు ఈ కంప్యూటర్లు పంపిణీ చేయాల్సి ఉంది. కంప్యూటర్ల పంపిణీ అనంతరం బీఎస్ఎన్ల్ ఇంటర్నెట్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. గతంలో ఏడింటిలో ‘ఈ’ పాలన గతంలోనూ జిల్లా వ్యాప్తంగా ఏడు పంచాయతీలను ఎంపిక చేశారు. ఇచ్చోడ, ఉట్నూర్, ముథోల్, బాసర, ఆసిఫాబాద్, క్యాతన్‌పల్లి, నస్పూర్‌లలో ఈ పాలన సాగుతోంది. ప్రస్తుతం ఉన్న ఏడు, ఇప్పుడు మంజూరైన 145 గ్రామ పంచాయతీలతో కలిపి జిల్లాలో 152 పంచాయతీలలో ఈ-పాలన సాగనుంది. ఇక ప్రభుత్వ సేవలు అందుబాటులోకి.. ఈ- పాలనాలో అన్ని ప్రభుత్వ సేవలు పారదర్శకంగా నిర్వహించనున్నారు. పంచాయతీలకు ఆదాయం ఎలా వ చ్చింది. ఎంత ఖర్చు చేశారనే వివరాలను ఆన్లైన్లో ఉం చుతారు. ఎలాంటి దాపరికం లేకుండా గ్రామపాలన సాగే అవకాశం ఉంది. అధికారులు ఎలాంటి అవకతవకులకు పాల్పడే వీలులేకుండా పోతుంది. అంతే కాకుండా గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని రకాల పింఛన్లు, ఉపాధి హామీ వేతనాల పంపిణీ కూడా ఆన్లైన్లో ఉంచుతారు. ప్రభుత్వం నుంచి విడుదల అయ్యే ప్రతి పైసా లెక్క ఉం టుంది. ఈ- పాలనలో ప్రస్తుతం కొన్ని కార్యక్రమాలనే చే పడుతున్నారు. విజయవంతమైతే మీ-సేవలో పొందే ప్ర తీ సేవలను పొందొచ్చు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, అంగన్వాడీ కార్యకర్త, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడితోపా టు మరికొందరిని భాగస్వాములను చేసే అవకాశం ఉంది. కంప్యూటర్లు పంపిణీ చేయాల్సి ఉంది.. - పోచయ్య, జిల్లా పంచాయతీ అధికారి, ఆదిలాబాద్ ప్రస్తుతం క్లస్టర్ పంచాయతీలకు కంప్యూటర్లు పంపిణీ చేయాల్సి ఉంది. కొన్ని ప్రాంతాలలో బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ ఉంది. లేని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రస్తుతం సర్వే నడుస్తోంది. అది పూర్తి కాగానే కంప్యూటర్లు పంపిణీ చేస్తాం. -
మన ఊరి అభివృద్ధి మన చేతిలోనే..
మందమర్రి రూరల్ : గ్రామాల అభివృద్ధికి ప్ర భుత్వం నడుంబిగించింది. పల్లెల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్ర భుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు ప్రత్యేకని ధుల కేటాయింపుకు మన ఊరు-మన ప్రణాళిక కార్యక్రమం చేపట్టింది. గ్రామానికో ప్రత్యేకాధికారిని నియమించి గ్రామాల్లో సభలు ని ర్వహించి సమస్యలపై నివేదిక రూపొందిస్తోం ది. ఇందుకు మండల ప్రత్యేకాధికారులు తహశీల్దార్, ఎంపీడీవోలు, వీఆర్వోలను ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులకు గ్రామసభలో ఆమోదం పొందాకే అధికారులు వాటిని అమలుచేయడానికి నిర్ణయిస్తారు. నేటితో పూర్తి.. మండలంలోని 8 గ్రామపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించారు. వీరు 8 గ్రామ పంచాయతీలోని 24 గ్రామాల్లో సర్వేనిర్వహిస్తారు. వీటిద్వారా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పశుపోషణ, భూమిఉపయోగం, ఉపాధి, రోడ్లు, మురికి కాలువలు, విద్యుత్ మరుగుదొడ్లు తదితర అంశాలపై సర్వేలు చేపడుతున్నారు. మార్గదర్శకాల ప్రకారం ప్రణాళికలు రూపొందించిన తర్వాత గ్రామసభను ఏర్పాటు చేసి 18లోగా తీర్మానం చేయాలి. సర్పంచులకు పెరిగిన ప్రాధాన్యం.. ప్రభుత్వ నిర్ణయంతో గ్రామపరిపాలనలో సర్పంచుల ప్రాధాన్యం పెరడగంతో వారిలో ఉత్సాహం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ నిర్ణయించిన ప్రకారం నిబంధనలు అమలైతే గ్రామంలో జరిగే ప్రతీపనికి సర్పంచే జవాబుదారిగా ఉంటాడు. గ్రామస్థాయిలో పనిచేసే 25 శాఖలకు పైగా అధికారులంతా సర్పంచ్ మార్గదర్శకాలను అనుసరించే పనిచేయల్సి ఉంటుంది. -
మూడు నెలలుగా జీతాల్లేవ్!
మందమర్రి రూరల్ : జిల్లాలోని 52 మండలాల్లో 251 మంది క్లస్టర్ రీసోర్సు పర్సన్ (సీఆర్పీ)లు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారు. వీరు ప్రతినెలా క్లస్టర్ పరిధిలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలను నిర్దేశించుకున్న షెడ్యూల్ ప్రకారం సందర్శించాలి. ప్రతీరోజు ఒక పాఠశాలకు వెళ్లి ప్రార్థన సమయం నుంచి తరగతులు ముగిసి బడి మూసివేసే సమయం వరకు అక్కడే ఉండాలి. ఆ రోజంతా పాఠశాల పనితీరును పరిశీలిస్తూ భవనాలు, మరుగుదొడ్ల సౌకర్యం, నీటి వసతి మధ్యాహ్న భోజన పథకం అమలు తీరు, విద్యార్థుల హాజరు తదితర అంశాలపై ఆరా తీయాలి. ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. ఆయా అంశాలపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారికి సమర్పించాలి. దీంతోపాటు బడిబయట ఉన్న చిన్నారులను గుర్తించి పాఠశాలలో చేర్పించే బాధ్యత కూడా వీరిదే. ఆర్వీఎం అధికారులు అడిగిన సమాచారాన్నీ అందించాలి. ఖర్చులకు ఇబ్బందులు.. ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో సీఆర్పీలపై అదనపు పనిభారం ఉంటుంది. ఈ నెలల్లో బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం కాగానే దగ్గరుండి బడిలో చేర్పించాలి. ఊరూరా తిరుగుతూ పిల్లలంతా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ఈ సమయంలోనే వేతనాలు అందకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఏదో ఒక పాఠశాలకు వెళ్లడంతోపాటు ఆర్వీఎం అధికారులు అడిగిన సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ విధులు నిర్వర్తించేందుకు రోజుకు కనీసం రూ.50 నుంచి రూ.100 వరకు ఖర్చు అవుతుంది. మూడు నెలలుగా జీతాలు లేకపోవడంతో విధులు ఎలా నిర్వర్తించేదని సీఆర్పీలు ప్రశ్నిన్నారు. అధికారులకు విన్నవించినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరితోపాటు ఎంఐసీ, సీసీవో, మేసెంజర్స్, ఐఈఆర్పీలకూ మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదు. పెరిగిన జీతం అందేనా? ప్రస్తుతం సీఆర్పీలకు నెలకు రూ.7000 చెల్లిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం మరో రూ.1500 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన జీతం జూన్ నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఇదీ సీఆర్పీలకు కాస్త ఊరట కలిగించే అంశం. అయినా జీతం చెల్లించకపోవడంతో పెరిగిన జీతం అమలుకు నోచుకుందో.. లేదో తెలియని పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు స్పందించి త్వరగా జీతం చెల్లించాలని జిల్లాలోని సీఆర్పీలు కోరుతున్నారు. -
‘ప్రణాళిక’కు కసరత్తు
కలెక్టరేట్/మందమర్రి రూరల్ : ప్రజల అవసరాలు, వసతులు, వనరులను దృష్టిలో పెట్టుకుని గ్రామ, మండల, పట్టణ, జిల్లాస్థాయి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి యంత్రాంగం కసరత్తు మొదలు పెట్టింది. ప్రణాళికల ఆధారంగా నిధులు కేటాయిస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు ప్రణాళిక వ్యూహరచన ప్రతిష్టాత్మకంగా జరిగేందుకు మండలస్థాయి అధికారులతోపాటు జిల్లాలోని 866 గ్రామ పంచాయతీల్లో ఉన్నతాధికారులను ప్రత్యేక ప్రణాళిక అధికారులుగా నియమించారు. దీంతో ప్రజల జీవితాల్లో నూతన వెలుగులు నిండుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 7న హైదరాబాద్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన ప్రణాళిక’పై అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. గ్రామ, వార్డుల్లో ప్రణాళిక తయారీకి నమూనా రూపొందించి దాని ఆధారంగా గ్రామ, వార్డు అభివృద్ధితోపాటు వనరులు, ప్రజావసరాలకు అవసరమగు అంశాలు అందులో పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రణాళిక తయారీ కార్యక్రమం జిల్లాలో ఆరు రోజులపాటు జరగనుంది. కాగాా, శనివారం తలమడుగు మండ లం రుయ్యాడి గ్రామంలో మంత్రి జోగు రామన్న ‘మన ఊరు-మన ప్రణాళిక ’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ప్రజలతో సమావేశం కానున్నారు. సమావేశానికి కలెక్టర్‌తోపాటు వివిధ శాఖల అధికారులు హాజరుకానున్నారు. ఇది ఉద్దేశం.. స్థానిక వనరులు, వసతులు, ప్రజావసరాలు కేంద్రంగా తెలంగాణ దృక్పథం ప్రతిబింబించేలా భౌతిక ఆర్థిక పరిస్థితులు పరిగణంలోకి తీసుకుని ప్రణాళికను తయారు చేయడం. ప్రాధాన్యత అంశాలు వ్యవసాయం, అనుబంధ రంగాలు, తాగునీరు, చిన్న నీటి వనరులు తెలంగాణకు హరిత హారం-అడవుల పెంపకం, స్మృతి వనాలు, పారిశుధ్యం, డంపింగ్ యార్డ్లు, విద్య, వైద్యం, పరిశ్రమలు, షెడ్యూల్ కులాల సంక్షేమం కోరకు భూమి కొనుగోలు, ఉమ్మడి స్మశాన వాటికల ఏర్పాటు. ప్రణాళికల రూపకల్పనకు ముందు కసరత్తు గ్రామ స్థితిగతులపై విశ్లేషణ, మానవ వనరుల అభివృద్ధికి ఉపయోగమయ్యే అన్ని అంశాలు పరిగణంలోకి తీసుకోవాలి. సామాజిక, ఆర్థిక, మౌలిక వసతుల లభ్యత, వాటి వృద్ధిపై దృష్టి సారించాలి. ఉత్పత్తి ఉత్పదక రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. వివిధ రకమైన వనరుల కేటాయింపులకు అంచనాలు వేయాలి. గ్రామాభివృద్ధి, సంక్షేమ పథకాల మధ్య సమన్వయం పాటించాలి. మండల స్థాయిలో ప్రణాళికలు గ్రామస్థాయి ప్రణాళికలు ఆధారంగా చేసుకుని మండల స్థాయి అవసరాలు అందులో పొందుపర్చి మండల స్థాయి ప్రణాళికలు నపొందుపర్చాలి. ఎంపీపీ, ఎంపీటీసీ సభ్యులు, మండల స్థాయి అధికారుల భాగస్వామ్యంతో తయారు చేసిన ప్రణాళికను మండల పరిషత్ ఆమోదంతో జిల్లాకు పంపాలి. జిల్లాస్థాయి ప్రణాళికలు మండల స్థాయి ప్రణాళికను ఆధారం చేసుకుని జిల్లాస్థాయి అవసరాలను పొందుపర్చి ప్రణాళిక తయారు చేయాలి. ఈ ప్రణాళికను జిల్లా పరిషత్ అధ్యక్షుడు, జెడ్పీటీసీ సభ్యులు, జిల్లా ప్రణాళిక సంఘం సభ్యులు అమోదించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించవలసి ఉంటుంది. గ్రామప్రణాళిక తయారి ‘మన ఊరు.. మన ప్రణాళిక’ రూపకల్పనకు గ్రామ పంచాయతిని ప్రాథమిక యూనిట్‌గా తీసుకుంటారు. ప్రణాళిక రూపకల్పనకు ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. గ్రామ ప్రణాళిక తయారులో ఆ గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల భాగాస్వామ్యంతో గ్రామ స్థాయిలో ఉండే అధికారులతో గ్రామ ప్రణాళికను తయారు చేస్తారు. గ్రామ ప్రణాళికలో ముఖ్య అంశాలు.. సహజ మనవ వనరుల గుర్తింపు, మౌలిక వసతుల లభ్యత, ఆవశ్యకత గుర్తించుట, వ్యవస్థాగత ఏర్పాట్లు భవిష్యత్ లక్ష్యసాధనకు పత్రాన్ని రూపొందించడం. ఐదేళ్ల దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించడంతోపాటు తక్షణ అవసరాల నిమిత్తం, వార్షిక ప్రణాళిక రూపకల్పన గ్రామ ప్రణాళికను గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించే సభలో ఆమోదించాలి. సిబ్బంది నియామకం ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. వారితోపాటు ఐకేపీ అధికారి ఇతర గ్రామ స్థాయి అధికారులలో ఒకరిని సహాయకులుగా తీసుకోవాలి. అలాగే ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించాలి. జిల్లా స్థాయిలో ప్రణాళికల తయారికి ప్రాధన్యత అంశాల శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన సాంకేతిక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. సాంకేతిక విభాగం అధికారులు గ్రామ స్థాయి నుంచి అధికారులను, ప్రజా ప్రతినిధులను సమన్వయ పరుస్తూ ప్రణాళికలు రూపొందించాలి. శిక్షణా తరగతులు ప్రణాళిక రూపకల్పనపై శిక్షణ ఇచ్చే నిమిత్తం రిసోర్స్ పర్సన్ళ్ల ఎంపిక జిల్లా, మండల స్థాయిలో జరుగాలి. జిల్లా రిసోర్స్ పర్సన్ మండల రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తారు. అలాగే మండల రిసోర్స్ పర్సన్ గ్రామ ప్రణాళిక తయారీలో పాలు పంచుకోని సిబ్బందికి, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. -
కేసీఆర్ పాలన మోసపూరితం
మందమర్రి/మంచిర్యాల టౌన్ : ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ మోసపూరిత పాలన సాగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పింఛన్ల పెంపు కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు శుక్రవారం మందమర్రి, మంచిర్యాలలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మంద కృష్ణమాదిగ శిబిరాలను సందర్శించి వారికి సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో దళితుడినే తొలి ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి మోసం చేశాడని ఆరోపించారు. రుణమాఫీపై గందరగోళం సృష్టించి రైతులను, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అంటూ విద్యార్థులను, పింఛన్ పెంచుతామంటూ వృద్ధులు, వితంతువులు, వికలాంగులను మోసగించాడని అన్నారు. తెలంగాణలో మిగులు బడ్జెట్ ఉన్నా పింఛన్ల పెంపు విషయమై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు. దీనిని నిరసిస్తూ వారం రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. పింఛన్ల పెంపు అమలు తేదీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి చిప్పకుర్తి వెంకన్న, నాయకుడు జూపాక సాయి, తూర్పు జిల్లా అధ్యక్షుడు కల్వల శరత్, నాయకులు మంతెన మల్లేశ్, మోతె పోషం, తుంగపిండి రమేశ్, కర్రావుల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. -
మందమర్రి మున్సిపాల్టీని వీడని గ్రహణం
మందమర్రి రూరల్, న్యూస్‌లైన్ : మందమర్రి మున్సిపాలిటీకి పట్టిన ఎన్నికల గ్రహణం వీడటం లేదు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిన మున్సిపాలిటీకి ఎన్నికలు జరగడం లేదు. దీంతో పట్టణ అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రామ పంచాయతీగా ఉన్న మందమర్రి కొన్ని రాజకీయ కారణాల వల్ల 1993లో నోటిఫైడ్ ఏరియాగా మారింది. ఆ తర్వాత 1995 మే 8వ తేదీన మందమర్రిని గ్రేడ్-3 మున్సిపాలిటీ హోదాను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 58 వేల జనాభా ఉన్న మందమర్రి మున్సిపాలిటీలో 32 వేల మంది ఓటర్లు ఉన్నారు. మున్సిపాలిటీని 24 వార్డులుగా విభజించి 1998 మే 21వ తేదీన రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ చైర్మన్ అభ్యర్థి పదవికి ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కేటాయించారు. దీంతో నోటిఫికేషన్ విడుదలై ఎన్నికల కోలాహలం సాగుతున్న సమయంలో ఏజెన్సీ ఏరియాలో ఉన్న మందమర్రి గ్రామ పంచాయతీ 7/70 చట్ట పరిధిలో ఉన్న కారణంగా ఇక్కడ ఎన్నికలు నిలిపేయాలని అప్పటి గ్రామ పంచాయతీ సర్పంచ్ మద్ది రాంచందర్ ప్రభుత్వం తీసుకున్న ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో రిట్ ఫిటిషన్ దాఖలు చేశారు. ఒక వేళ ఎన్నికలు జరపవలసి వస్తే ఎస్టీలకు మాత్రమే చైర్మన్ పదవి కేటాయించాలని తన పిటిషన్లో పేర్కొన్నారు. దీంతో ఎన్నికలు నిలిపేస్తూ జూన్, 18, 1998న హైకోర్టు స్టే జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తు ఆశానిర్మల కోర్టును ఆశ్రయించారు. కానీ వాది, ప్రతివాదుల తరుఫున ఎవ్వరు కోర్టుకు హాజరు కాకపోవడంతో ఏప్రిల్, 5, 2005లో కేసును డిస్మిస్ చేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు ప్రకటించింది. ఎన్నికల నిర్వహణపై ఈసీ కేంద్రానికి లేఖ ఫిబ్రవరి, 3, 1999లో మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికల వ్యవ హారంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ మున్సిపాలిటీ పరిపాలన కార్యదర్శికి లేఖ ద్వారా వివ రించింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఏజెన్సీ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీలకు సంబంధించిన విషయాల్లో వివాదాలు వస్తే దాన్ని కేవలం పార్లమెంటు జోక్యం తీసుకుంటుందని, షెడ్యూల్ ఏరియాల విభాగాల చట్టం ప్రకారం బిల్లు ఆమోదించవలసి ఉంటుందని తేల్చి చెప్పింది. దీంతో మందమర్రి మున్సిపాలిటీ ఎన్నికలకు పీటముడి బిగుసుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పట్టణ ప్రజలు, వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు ఎన్నికల కోసం పోరాటాలు చేస్తున్న ప్రయోజనం లేదు. మున్సిపాలిటీకి ఎన్నికలు లేక 16 ఏళ్లు.. జిల్లాలో మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపలి,్ల బైంసా, మందమర్రితో కలిసి ఏడు మున్సిపాలిటీలు ఉండగా కేవలం మందమర్రి మున్సిపాలిటీకి ఎన్నికలు లేక 16 ఏళ్లవుతోంది. దీంతో ప్రజా ప్రతినిధులు లేక, ప్రశ్నించే వారు కానరాక మున్సిపాలిటీ పాలనా అస్తవ్యస్తంగా మారింది. అధికారులు తమ ఇష్టారాజ్యాంగా వ్యవహరించడం. అందినంత దండుకోవడం, నిధుల దుర్వినియోగం చేయడంతోపాటు పట్టణ ప్రజలకు కనీస వసతులు కల్పించలేని పరిస్థితులో మందమర్రి మున్సిపాలిటీ కోట్టుమిట్టాడుతుంది. పన్నుల వసూలులో పురోగతి లేక పోవడంతో కార్యాలయానికి ఆదాయం తగ్గింది. ఇప్పటి వరకు మున్సిపాలిటీ కట్టవలసిన విద్యుత్ చార్జీలు రూ.70 లక్షలకు పేరుకుపోయాయి. కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకోంది. 2004లో రూ.24 కోట్ల హ డ్కో నిధులతో ప్రారంభించిన గోదావరి మంచినీటి పథకం ఇప్పటివరకు పూర్తి కాకపోవడంతో పట్టణంలోని హై లేవల్జోన్ ప్రాంతవాసులకు తాగునీరు అందకుండా పోతుంది. వేతనాలను ఇవ్వలేక చాలినంత సిబ్బందిని సమకూర్చుకోలేక పారిశుధ్యం పడకేసింది. రోడ్లు, డ్రెయినేజీల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం 3వ గ్రేడ్ మున్సిపాలిటీ అని ప్రకటించినా ఎన్నికలు లేక, ప్రజ లకు కనీస మౌలిక వసతులు అందక మందమర్రి మున్సిపాలిటీ త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతుం ది. ఇప్పటివరకు పదవుల్లో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై సరైన ఒత్తిడి చేయలేక పోవడం వల్లనే ఎన్నికలు జరుగకుండా పోతున్నాయని పట్టణ ప్రజలు భావిస్తున్నారు. వెంటనే ఎన్నికల ప్రక్రియకు తగిన కృషి చేయాలని వారు కోరుతున్నారు. -
తెరపైకి మున్సి‘పోల్స్’
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన ఆదేశంతో జిల్లాలో సందడి మొదలైంది. నాలుగు వారాల్లో నిర్వహించాలంటే సాధ్యం కాదని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు ఉండగా, ఆరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. మందమర్రి బల్దియా ప్రత్యేకపాలనలో ఉంటుందని అధికా ర వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా 2013 సర్వే ప్రకారం నిర్వహిం చడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. జిల్లా లో ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, కాగజ్‌నగర్, మంచిర్యాల,బెల్లంపల్లి మున్సిపాలిటీలు ఉన్నా యి. మున్సిపాలిటీల్లో ఎన్నికలకు వార్డులవారీ గా రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇప్పటి 2013 లో మున్సిపల్ అధికారులు పోలింగ్ బూత్‌లను గుర్తించారు. ఆదిలాబాద్‌లో 36 వార్డులకు 81, భైంసాలో 23 వార్డులకు 23, బెల్లంపల్లిలో 34 వార్డులకు 35, నిర్మల్‌లో 36 వార్డులకు 58, మంచిర్యాలకు 32 వార్డులకు 62 పోలింగ్ కేం ద్రాలు ఏర్పాటు చేశారు. వార్డులవారీగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రిజర్వేషన్లు ఖరారు చే శారు. కలెక్టర్ ఆమోదం తీసుకుని సిద్ధంగా ఉన్నాయి. నాలుగు వారాల్లో సాధ్యపడేనా? నాలుగు వారాల్లో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించాలనే హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా అధికారుల్లో గుబులు నెలకొంది. 2014 ఎన్నికల ఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్లు మారితే నాలుగు వారాల్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. ప్రత్యేక అధికారుల పాలనలో ఇన్నాళ్లు మున్సిపాలిటీలు కొనసాగాయి. గత 2010 సెప్టెంబర్ 31వ తేదీన మున్సిపల్ కౌన్సిల్ గడువు ముగిసింది. దీంతో మూడున్నర ఏళ్లుగా ప్రత్యేక అధికారుల పాలనలో సాగింది. ప్రత్యేకంగా 2011లో జరగాల్సిన ఎన్నికలు జరగక పోగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం విషయంలో వచ్చిన ఆందోళనతో ఈ ఎన్నికలు నిర్వహణకు నోచుకోలేదు. ప్రస్తుతం హైకోర్టు నిర్ణయంతో ఆశావహులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. -
జీవచ్ఛవాలుగా..
సాక్షి, మంచిర్యాల/మందమర్రి : అది కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్ మండలం రొంపికుంట. ఆ గ్రామంలో మంచి వైద్యుడు ఉన్నాడు. అతడే కుందారపు శ్రీనివాస్. ఇతనికి పదకొండేళ్ల క్రితం ఆదిలాబాద్ జిల్లా మందమర్రికి చెందిన శ్రీలతతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు అభిరామ్, కూతురు దీక్షిత జన్మించారు. కలతలు, కలహాలు లేకుండా హాయిగా జీవిస్తున్నా రు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు మందమర్రిలోని తన తోడల్లుడు హేమంత్‌కుమార్ నానమ్మ దశ దినకర్మకు వెళ్లారు. తోడళ్లుళ్లు, అక్కా చెల్లెళ్లు, అమ్మమ్మ, పిన్నిలతో శ్రీనివాస్ కుటుంబం హాయిగా గడిపి గురువారం సాయంత్రం 4 గంటలకు బెల్లంపల్లిలోని సెకండ్‌జోన్‌లో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లారు. వారి ఇంట్లో ఏడు గంటల వరకు గడిపి ఇంటికి బయలు దేరారు. అప్పటికే రాత్రయింది! ‘గింత చీకటైంది. పొద్దున్నె వెళ్లండి బిడ్డా.. అని శ్రీలత తల్లి లక్ష్మి అన్నది. మనమరాలు దీక్షిత నా చేయి పట్టుకుని వదల్లేదు. వచ్చింది కర్మకు కాబట్టి ఉండద్దనే ఉద్దేశంతో వెళ్లింది నాబిడ్డా. చీకట్లో జాగ్రత్తగా పొమ్మని చెప్పాను. అయినా పండుగ దగ్గర్లోనే ఉంది. రాత్రి 8.30 వరకు చేరుకుంటుం. ఎప్పుడు పోతలేమానె. చేరుకున్న తర్వాత ఫోన్ చేస్తా’ అని చెప్పి శ్రీలత, శ్రీనివాస్ పిల్లలు ద్విచక్ర వాహనంపై బయలు దేరారు అని రోదించుకుంటూ చెప్పింది శ్రీలత తల్లి లక్ష్మి. ఇంతలోనే ఘోరం.. రాత్రి 7.30 గంటలకు శ్రీనివాస్, శ్రీలత, పిల్లలు కమాన్‌పూర్‌కు బయలు దేరారు. మందమర్రి దగ్గరలోని పాలవాగు కల్వర్టు వద్ద పాము అడ్డు వచ్చింది. శ్రీనివాస్ బైక్ నడుపుతుండగా ముందు కూర్చున్న దీక్షిత డాడీ పాము అనగానే శ్రీనివాస్ బయపడి కంగారుపడ్డాడు. ఇంతలోనే బైక్ కల్వర్టుకు ఢీకొని లోయలో పడింది. కింద పదునైన బండలు ఉన్నాయి. బండలపై పడటంతో శ్రీనివాస్, దీక్షిత తలలకు తీవ్రంగా దెబ్బతాకింది. పడటంతోనే శ్రీనివాస్ చనిపోయాడు. దీక్షితకు బలమైన దెబ్బలు తాకడంతో మంచినీళ్లు.. మంచినీళ్లు అని అరిచింది.. అరిచి అరిచి రెండు గంటల తర్వాత మృతిచెందింది. అభిరామ్ పడటంతోనే అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతని చేయి విరిగింది. వెనుక కూర్చున్న శ్రీలతకు కూడా నడుంపై దెబ్బలు తాకాయి. కదల్లేని పరిస్థితి. చుట్టూ చీకటి ఉండటంతో ఎవరూ కనిపించ లేదు. ఎవండి.. ఎవండి.. అరేయ్ బాబు, అమ్మాయి ఎక్కడున్నారు.. అని అన్నా ఎవరి నుంచి మాటలు వినబడ లేదు. కాపాడండి.. కాపాడండి అని అరిచింది.. ఎవరు రాకపోవడంతో ఆమె కూడా అపస్మారక స్థితి లోకి వెళ్లింది. రాత్రి 11 గంటల వరకు కొడుకు అభిరామ్‌కు మెలుకువ వచ్చింది. మేలకువ వచ్చి.. చుట్టూ కటిక చీకటి.. చెట్లు.. చిమ్మట పురుగుల గోల.. ముళ్ల కంపలు.. రాళ్లు రప్పలపై రక్తపు మడుగులో తండ్రి, చెల్లెలు మృతదేహాలు.. మరోవైపు అపస్మారక స్థితిలోకి వెళ్లిన తల్లి. భయానకం కొలిపే దృశ్యాలు. ఎటూ చూసినా కటిక చీకటి. పామును చూసిన భయంతో ఎటు నుంచి వస్తుందోనని బాలుడి భయం.. బాలుడు కూడా కాపాడండని కేకలు వేశాడు. ఇంతలోనే బాలుడు కూడా అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గురువారం రాత్రి గడిచింది.. శుక్రవారం వాహనాలు ఆ కల్వర్టు పై నుంచి వెళ్లాయి. కల్వర్టు లోతుగా ఉండటం.. ముళ్లపొదలు అధికంగా ఉండటంతో వీరిని ఎవరు గమనించలేదు. ఆ రోజు కూడా గడిచింది. నిమిషాలు గంటలు.. గంటలు రోజుల్లా గడిచాయి.. ఇలా 48 గంటలు తల్లీ, కొడుకు జీవచ్ఛవాల్లా ఉన్నారు. శనివారం ఉదయం సృ్పహకోల్పోయిన శ్రీలత మేలుకువ వచ్చింది. కదులుదామంటే కదలలేని స్థితి. తన వద్ద ఉన్న సెల్‌ఫోన్ తీసి చూసే సరికి వందల కొద్ది మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వెంటనే కుటుంబ సభ్యులకు తెలియజేయాలని తాపత్రయ పడింది. కమాన్పూర్లోని తన బంధువులకు ఫోన్ చేసి తమకు ప్రమాదం జరిగిందని.. గోదావరిఖనిలోని రాజేశ్ టాకీస్ దగ్గర ఉన్నామని చెప్పి మళ్లీ సృ్పహ కోల్పోయింది. ఉదయం నుంచి వెతుకగా.. ఇటు కమాన్‌పూర్, మందమర్రిలోని కుటుంబ సభ్యులు ఉదయం నుంచి రహదారి వెంట వెతికారు. పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. ఇటు పోలీసులు, ఆటూ కుటుంబ సభ్యులు వెతికినా ప్రయోజనం లేదు. ఇరువురు అప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఫోన్ రింగవుతుంది కాని ఎవరూ లేపి మాట్లాడలేని పరిస్థితి. ఈ రింగ్ కల్వర్టు పై నుంచి పోయే వారికి వినిపించని పరిస్థితి. అంతలోనే మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మేలుకొవ వచ్చిన అభిరామ్ ఫోన్ శబ్దం విని మాట్లాడాడు. ‘పిన్ని దాహం అవుతుంది.. ఆకలవుతుంది..’ అంటూ ఏడ్చారు. అదే సమయంలో పోలీసులు సిగ్నల్ ఆధారంగా వారున్న ప్రాంతాన్ని గుర్తించారు. వెంటనే బాధిత కుటుంబసభ్యులతో కలిసి మందమర్రి-రామకృష్ణాపూర్ మధ్యలో ఉన్న కల్వర్టుల వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు కల్వర్లు కింద శనివారం రాత్రి పది గంటలకు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న అభిరామ్‌ను, శ్రీలతను మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు.. స్పృహలోకి రాని శ్రీలత మందమర్రి ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కుందారపు శ్రీలత, అభిరామ్రాం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న శ్రీలత స్పృహలోకి సరిగా రావడం లేదని అమె బంధువులు తెలిపారు. శ్రీలత ఎడమ చేయి విరగడంతో దానికి ఆపరేషన్ నిర్వహించారు. అభిరామ్ రాంలకు కూడా శరీరం లోపలి భాగాల్లో గాయాలు కావడంతో బాలుడిని కూడా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇంకా తన భర్త, కుమార్తె మృతి చెందిన విషయం ఇంకా శ్రీలతకు తెలియదని, వారు మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు మాత్రమే తెలుసు అని బంధువుల తెలిపారు. దీంతో వచ్చిన వారికి వారి మరణవార్త శ్రీలతకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మానసికంగా తీవ్రంగా గాయపడిందని, ఇంకా ప్రమాదం షాక్‌లోనే ఉందని వారు తెలిపారు. నేడు అయితే పూర్తిస్థాయిలో వారి ఆరోగ్య పరిస్థితి తెలిసే అవకాశం ఉంది. బాబాయ్ డాడీ, మమ్మీ, చెల్లి ఏక్కడ.. బాబాయ్ డాడీ, మమ్మీ, చెల్లి ఎక్కడ ఇంకా నాన్న నిద్రపోయి లేవలేదా.. ఎందుకు ఇంత మంది ఉన్నారు. నాకు మమ్మీ, డాడీ, చెల్లిని చూపించండి అంటూ శ్రీనివాస్ కుమారుడు అభిరామ్ అనడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు బోరున విలపించారు. ప్రమాదంలో గాయపడి మంచిర్యాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభిరామ్‌ను తన తండ్రికి దహన సంస్కారాలు చేసేందును రొంపికుంట గ్రామానికి తీసుకువచ్చారు. శ్రీనివాస్ తండ్రి రాజేశం మనవడు అభిరామ్‌తో కలిసి తలకొరివిపెట్టారు. కమాన్‌పూర్‌లో అంత్యక్రియలు మంచిర్యాలలో శ్రీనివాస్, దీక్షిత మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కమాన్‌పూర్‌కు తరలించారు. ఆదివారం తండ్రీకూతురు అంత్యక్రియలు జరిగాయి. శ్రీలతకు తీవ్రగాయాలు కాగాకరీంనగర్లోని ఓ ఓ ప్రవేటు ఆస్పతిలో చికిత్స పొందుతుంది. ఆమె భర్త, కూతురు కడారి సారి చూపున నోచుకోలేదు. -
కొత్త్త సంవత్సరం.. విషాద సంద్రం
మందమర్రి రూర ల్, న్యూస్‌లైన్: మందమర్రి పట్టణంలోని పాత బస్టాండ్ రాష్ట్రీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో స్థానిక విద్యానగర్ చెంచు కాలనీకి చెందిన మేకల రత్నాకర్(23) దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. డిసెంబర్ 31 కావడంతో అందరూ కొత్త సంవత్సరం వేడుకలకు సిద్ధమవుతున్నారు. తన ఇంట్లో ఈ వేడుకలు జరపాలనుకున్నాడు రత్నాకర్. ఈ విషయాన్ని ఇంట్లో వారితో కూడా సాయంత్రం సమయంలో చర్చించాడు. అప్పటిదాకా ఇంట్లో వారితో ఆనందంగా గడిపాడు. రాత్రి 12 గంటల సమయంలో స్వీట్లు పంచిపెట్టి బంధువుల నోరు తీపి చేయాలని భావించాడు. అనుకున్నదే తడవుగా స్వీట్లు కొనేందుకు తన మోటార్ సైకిల్‌పై ఇంటి నుంచి బయల్దేరాడు. మందమర్రి పాత బస్టాండ్ ప్రాంతానికి చేరుకున్నాడు. స్వీట్ షాపు అవతలి పక్కన ఉండడంతో రోడ్డు క్రాస్ చేసేందుకు ముందుకు కదిలాడు. ఓ క్షణంలోనే బెల్లంపల్లి నుంచి వస్తున్న లారీ వేగంగా ఢీకొంది. అంతేకాక వాహనం అతడి పైనుంచి వెళ్లడంతో శరీరం నడుము కింది భాగం అంతా కూడా నుజ్జునుజ్జయింది. దీంతో అక్కడిక్కడే మృతిచెందాడు. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కట్టలు తెంచుకున్న బంధువుల కోపాగ్ని చిధ్రమైన రత్నాకర్ మృతదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యుల కోపం కట్టలు తెంచుకుంది. ప్రమాదానికి కారణమైన లారీపై రాళ్లతో దాడికి దిగారు. అద్దాలు ధ్వసం చేశారు. అంతటితో ఆగకుండా లారీకి నిప్పంటించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వారిని అదుపు చేయడం పోలీసులతో కూడా కాలేదు. పట్టణ సీఐ రఘునందన్, ఎస్సై రాజేందర్, ఎంత నచ్చజెప్పినా మృతుడి కుటుంబ సభ్యులు వినలేదు. రెండు గంటల పాటు బస్టాండ్ ప్రాంతం రణరంగంగా మారింది. రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చివరకు నష్ట పరిహారం ఇప్పిస్తామని మృతుడి కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. అనంతరం మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కాగా, రత్నాకర్‌కు ఏడాది క్రి తమే వివాహమైంది. ఈ ఘటనతో అతడి కుటుంబం కొత్త సంవత్సరం వేళ విషాద సంద్రంలో మునిగింది. -
నేటి నుంచి టీడీపీ పల్లెబాట
మందమర్రి, న్యూస్‌లైన్ : మండలంలోని చిర్రకుంట గ్రామం నుంచి ఆదివారం టీడీపీ పల్లెబాట కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ ప్రకటించారు. శనివారం మందమర్రి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 25 రోజులపాటు పల్లెబాటు సాగుతుందని వివరించారు. చిర్రకుంట నుంచి సారంగపాణి, పొన్నారం, ఆదిల్పేట్, వెంకటాపూర్, ఎమ్మెల్యేకాలనీలను ఒక్క రోజులో పర్యటిస్తామని చెప్పారు. రోజుకు నాలుగు గ్రామాల చొప్పున 25 రోజుల్లో నియోజకవర్గంలోని 71 గ్రామ పంచాయతీల్లో పర్యటిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతిని వివరిస్తామని అన్నారు. గత రచ్చబండలో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, మూడో విడత నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. నాయకులు దార రవిసాగర్, సంగెపు హన్మంతు, పోరు సతీశ్, ఏదుల సంపత్, డాక్టర్ సారంగపాణి, సీహెచ్.సతీశ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆడపిల్ల అని..
అమ్మా.! నవమాసాలు మోసి జన్మనిచ్చినందుకు సంతోషం.. నీ గర్భంలో ఉండి తంతున్నప్పుడు నీవు పడే ఉలికిపాటును చూసి నా రాక కోసం ఆతృత పడుతున్నావని ఆనందపడేదానిని.. నా బంగారు తల్లి అని ముద్దులతో ముంచెత్తుతావని భావించాను.. ఎందుకమ్మా నన్ను పుట్టిన రెండు రోజులకే వదిలించుకున్నావు.. ఆడపిల్లను అనా? మందమర్రి రూరల్, న్యూస్‌లైన్ : ‘‘అమ్మా నవమాసాలు నన్ను నీ పొత్తిళ్లలో మోశావు. కడుపారా కన్నావు. కానీ నేను పుట్టీ పుట్టగానే ఎందుకమ్మా వదిలివెళ్లావు. జీవితాంతం నన్ను మోయలేనని అనుకున్నావా.. అమ్మ ప్రేమకు దూరం చేశావు. ఆడబిడ్డనై పుట్టడమే నా తప్పా..’’ రెండు రోజుల ఆ చిన్నారికి మాటలొచ్చి ఉంటే ఇలాగే బాధపడేదేమో. కానీ.. ఆలోచించే జ్ఞానం కూడా రాని ఆ పసికందు.. అమ్మకు దూరమై ఇప్పుడు ఏడ్వడం తప్ప ఏమీ చేయలేదు. ఈ హృదయ విదారకర ఘటన సోమవారం మందమర్రి మండలంలో వెలుగుచూసింది. ఇదీ సంగతి.. మందమర్రిలోని కేకే2 గని సమీపంలోని గఫూర్ దర్గా ద్వారం వద్ద రెండు రోజుల పసికందును ఓ తల్లి వ దిలి వెళ్లింది. సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దర్గా పక్కన పత్తి చేనుకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న యువకుడు పిండి రమేశ్‌కు ఏడుపు వినిపించడంతో వెళ్లి చూడగా ఆడ శిశువు కనిపించింది. అప్పటికి ఇంకా కళు ్లకూడా తెరవని ఆ పసిపాప శరీరానికి చీమలు పట్టి ఉండడంతో రమేశ్ పాపను చేతుల్లోకి తీసుకొని చీమలను దులిపివేశాడు. విషయూన్ని పోలీసులకు తెలిపాడు. వెంటనే సీఐ రఘనందన్ 108ను పిలిపించి మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్నారు. అరుుతే ఈ పాప ఎవరి బిడ్డ అరుు ఉంటుందనే వివరాలు వెలుగుచూడలేదు. ఎన్ని పథకాలుండి ఏం లాభం ప్రభుత్వం ఆడపిల్లల కోసం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. ఇందుకు ఓ కారణం.. ఆయూ పథకాలు ఆచరణకు నోచుకోవడం లేదు. ఆడ పిల్లల్ని పోషించని స్థితిలో చిన్నారులను కడుపులోనే చంపివేయడం, లేదా కన్న తర్వాత చె ట్ల కింద, ముళ్ల పొదల్లో వదలివేయడం జరుగుతోంది. ఆడ పిల్లల్ని అదుకుంటామని ప్రభుత్వం ప్రవేశపెట్టిన బంగారుతల్లి లాంటి పథకాలను మాతృమూర్తులు విశ్వసించడం లేదో ఏమో గానీ సభ్య సమాజం తలదించుకునేలా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. -
కార్పొరేట్ చదువొద్దు
మందమర్రి రూరల్/రామగుండం, న్యూస్‌లైన్ : కార్పొరేట్ చదువులతో మానసిక ఒత్తిడికి గురై ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు గొప్పవాడు కావాలని కలగన్న తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోయాడు. మందమర్రిలోని యాపల్‌కు చెందిన బొద్దుల కల్యాణ్‌కుమార్(19) శుక్రవారం రామగుండం రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని, కళాశాల వాతావరణంలో ఇమడలేక మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నాని సూసైడ్ నోట్ రాసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కల్యాణ్‌కుమార్ మందమర్రిలోనే పదో తరగతి వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు రాజేశ్వరి, ఫణికుమార్ హైదరాబాద్‌లోని కార్పొరేట్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో చేర్పించారు. శ్రీరాంపూర్ సింగరేణి కాలరీస్ డివిజన్లో సెక్యూరిటీ వింగ్‌లో ఫణికుమార్ పనిచేస్తున్నారు. కాగా.. కల్యాణ్‌కుమార్‌కు కళాశాలలో చేరినప్పటి నుంచి అక్కడి వాతావరణం నచ్చడం లేదని, తాను అక్కడ చదువుకోలేనని పలుమార్లు తల్లిదండ్రులతో చెప్పాడు. వేలకు వేలు ఫీజులు చెల్లించామని, మధ్యలో చదువు మానేస్తే ఎలా అంటూ వారు అతడిని బుజ్జగించి పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కల్యాణ్‌కుమార్ మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఇటీవల దసరా సెలవులు రావడంతో ఇంటికి వచ్చాడు. ఇక తాను కళాశాలకు వెళ్లబోనని ఇంట్లో చెప్పాడు. ఈ ఒక్క ఏడాది చదువుకో అని, ఆ తరువాత నీకు ఇష్టమైన కళాశాలలోనే చదువుకొందువని తల్లిదండ్రులు నచ్చచెప్పారు. మనసులో ఇష్టం లేకున్నా సరేనన్న కల్యాణ్‌కుమార్ శుక్రవారం కళాశాలకు బయల్దేరాడు. బ్యాగులో బట్టలు సర్దుకొని, తన సంబంధీకుల ఫోన్ నంబర్ల లిస్టును దగ్గర పెట్టుకొని భాగ్యనగర్ రైలు ఎక్కాడు. అప్పటికే కళాశాలకు వెళ్లవద్దని బలమైన నిర్ణయం తీసుకున్న అతను ఎటు వెళ్లాలో తెలియక రెలు రామగుండం రైల్వేస్టేషన్లో ఆగగానే దిగాడు. అదే సమయంలో న్యూఢిల్లీకి వెళ్తున్న జీటీ ఎక్స్‌ప్రెస్ రైలు రైల్వేస్టేషన్‌లోకి చేరుకుంటున్న క్రమంలో ఎదురుగా వెళ్లి దాని కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని తీయడంలో నిర్లక్ష్యం రైల్వే స్టేషన్లో ఉదయం ఆరు గంటలకు ఆత్మహత్య చేసుకున్న కల్యాణ్‌కుమార్ మృతదేహాన్ని పట్టాలపై నుంచి తీయడంలో రైల్వే పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో మృతదేహంపై నుంచే రైళ్లు వెళ్లడం కలచివేసింది. మృతదేహాన్ని తీసేందుకు సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులే మృతదేహాన్ని తీసే ప్రయత్నం చేశారు. రైళ్లు వస్తూ పోతుండడంతో సాహసించలేకపోయారు. సంఘటన జరిగిన రెండు గంటలకు జీఆర్పీ పోలీసులు వచ్చారు. మృతదేహాన్ని పరిశీలించి తల్లిదండ్రులకు సమాచారమివ్వడంతో వారు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెలు బాదుకుంటూ వచ్చి కొడుకు మృతదేహంపై పడి రోదించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్చార్జి కాంతారావు తెలిపారు.