
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సంజీవరావు
మందమర్రిరూరల్ : కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ నియోజక వర్గ ఇన్‌చార్జి సొత్కు సంజీవరావు అన్నారు. శుక్రవారం మండలంలోని తుర్కపల్లి, గుడిపెల్లి, వెంకటాపూర్ గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసి సమస్యలపై ప్రజాప్రతినిధులను నిలదీస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు అక్కల రమేశ్, నియోజక వర్గ ఓబీసీ చైర్మన్ గోళ్ల వీరయ్య, నాయకులు మేకల శ్రీనివాస్, కొప్పుల బాపు, షేక్ ఇబ్రహిం, శంకర్ గౌడ్, పైడి బానయ్య, ఉన్నారు.