villages development
-
మా ఊళ్లో అభివృద్ధికి ఫిదా
తెనాలి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జెడ్పీ హైస్కూలు విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యపోయాను. నమ్మశక్యం కాలేదు. అదొక్కటే కాదు, చాలా రంగాల్లో రాష్ట్రంలో పెనుమార్పులు జరిగాయని తెలిసి సంతోషమేసిందని ఆ్రస్టేలియాలోని నోట్రెడేమ్ యూనివర్సిటీకి సిడ్నీలోని స్కూల్ ఆఫ్ లా అండ్ బిజినెస్ ప్రొఫెసర్, డిపార్టుమెంట్ హెడ్‌గా చేస్తున్న తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ అత్తోట విద్యాసాగర్ అన్నారు. కొద్ది నెలల క్రితం తెనాలిని సందర్శించిన ఆయన సొంత ఊరిలో జరిగిన మార్పు గురించి ఆ్రస్టేలియా నుంచి ‘సాక్షి’తో పంచుకున్న సంతోషం ఆయన మాటల్లోనే... నేను ఆ్రస్టేలియాలో ప్రొఫెసర్‌గా చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యపై నాకు దీర్ఘకాలంగా అసంతృప్తి ఉండేది. గతంలో శిథిలమైన భవనాలు, అత్తెసరు చదువులు అన్నట్టుగా ఉండేది. 👉సొంతూరుకు ఏదైనా చేయాలని, 2015 నుంచి తెనాలిలో ఇంగ్లిష్ మీడియం స్కూల్ నిర్వహిస్తున్నా. 👉జనవరిలో తెనాలిని సందర్శించా. పట్టణం, సమీప గ్రామాల్లో పర్యటించాను. 👉వలంటీర్లు, సచివాలయ వ్యవస్థతో పరిపాలన ప్రజల ఇంటి ముంగిటకే వచ్చింది. 👉పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు ప్రగతికి చిహ్నాలుగా కనిపించాయి. 👉ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి నేను ఫిదా అయ్యాను. -
Andhra Pradesh: ‘పల్లె’కు కొత్త రూపు!
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని పాతమల్లంపేట పంచాయతీలో 18 గిరిజన కుటుంబాలు మాత్రమే ఉన్న కుగ్రామం చంద్రయ్యపాలెం. ఇక్కడి ప్రజలకు నాలుగేళ్ల క్రితం వరకు పక్కా ఇల్లు ఎలా ఉంటుందో తెలియదు. పేదరికానికి మారుపేరుగా ఉన్న వీరు పగలంతా కాయకష్టం చేయడం, కొద్దిపాటి పొలంలో జీడి మామిడి పంట సాగు చేసుకోవడం, రాత్రయితే గుడిసెల్లో బతుకులీడ్చడం.. ఎన్నో తరాలుగా ఇదే వారి జీవన విధానం. గుడిసెల్లోకి వచ్చే విష సర్పాల బారి నుంచి పిల్లలను పంచకు కట్టిన ఊయల్లోనే ఉంచాల్సిన పరిస్థితి. ఇలాంటి ఈ కుగ్రామం పరిస్థితి వైఎస్ జగన్ సీఎం కాగానే ఒక్కసారిగా మారిపోయింది. ఆ 18 కుటుంబాలకు పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. అమ్మ ఒడి నుంచి రైతు భరోసా వరకు వివిధ పథకాల ద్వారా ఇప్పటి వరకు రూ.91,40,000 వీరి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ డబ్బుతో గొర్రెలు, మేకలు, పాడె గేదెల పెంపకం చేపట్టి కూలి/ వ్యవసాయానికి అనుబంధంగా ఆదాయం పొందుతున్నారు. వీరి ఇళ్ల వద్దకే రేషన్, 104 ద్వారా వైద్యం అందుతోంది. ► ఈయన పేరు కురచ అప్పారావు. కాకినాడ జిల్లా అల్లిపూడి గ్రామానికి చెందిన ఈయన నాలుగేళ్లలో వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.5,85,285 లబ్ధి పొందారు. రైతు భరోసా నుంచి ఇంటి స్థలం వరకు 12 ప్రభుత్వ పథకాలను అందుకున్నారు. ‘ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఎన్నో హామీలు ఇస్తుంటారు.. అధికారంలోకి రాగానే ఒక్కటీ చేయరు. 2019 ఎన్నికల్లోనూ అలాగే అనుకున్నాను. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పిన దానికంటే ఎక్కువే చేశారు. అందుకు నేనే ఉదాహరణ. మా అబ్బాయికి ఆరోగ్యశ్రీ పథకంలో వైద్యం చేయించాను. ఒక్క రూపాయి ఖర్చు కాకుండా పూర్తి ఆరోగ్యంతో ఇంటికి పంపించారు. ఇంత గొప్ప పాలన ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని సంబరపడుతున్నాడు. ► ఇతను అనకాపల్లి జిల్లాలో అటవీ ప్రాంతంలో ఉన్న బుడ్డోడుపాడు గిరిజన గ్రామానికి చెందిన సెగ్గే రాజబాబు. దాదాపు 15 సంవత్సరాలు టీడీపీ తరఫున వార్డు సభ్యుడిగా పని చేశారు. పాతమల్లంపేట పంచాయతీ పరిధిలో 42 కుటుంబాలున్న ఈ గ్రామానికి రోడ్డు కోసం దశాబ్దాలపాటు శ్రమించారు. ‘మా గ్రామం చుట్టూ కొండ వాగులే, నడిచే మార్గం ఉండేది కాదు. వర్షాకాలంలో ఎవరికైనా జబ్బు చేస్తే డోలీల్లో వాగులు దాటించే క్రమంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు కోసం స్థానిక టీడీపీ నాయకుడిగా ఎంతో పోరాడాను. ఎమ్మెల్యేకు వినతి ఇస్తే పక్కన పడేసేవారు. కానీ జగన్ సీఎం అయ్యాక ఎమ్మెల్యేను ఒక్కసారి కలిసి అడగ్గానే హామీ ఇచ్చారు. కానీ రోడ్డు వేయకుండా మా టీడీపీ నాయకులు అడ్డుపడితే పట్టుబట్టి రోడ్డు వేయించారు. మోటారు సైకిలు చూడని మా ఊరికి ఇప్పుడు 104, 108 వాహనాలు నేరుగా వస్తున్నాయి. మా తాత, తండ్రుల కాలంలో ఊరికి రోడ్డు ఉంటే బాగుండు అని ఆశ పడ్డారు. నా తరంలో కూడా రోడ్డు చూస్తానన్న ఆశ పోయిన తరుణంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక అది సాకారమైంది’ అని తెలిపాడు. ►టీడీపీకి కంచుకోటలాంటి పాతమల్లంపేట పంచాయతీలోని 18 కుటుంబాలున్న చంద్రయ్యపాలెం గిరిజన గ్రామానికి చెందిన రుత్తల పెంటయ్య.. ఇప్పటిదాకా కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్న ఈయన ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలతో గొర్రెలను కొనుక్కొని రైతుగా మారాడు. ‘ఎకరం పొలం ఉంది, కొన్ని రోజులే వ్యవసాయ పనులు ఉంటాయి. మిగిలిన రోజుల్లో కూలి చేసుకోవాలి. ఇప్పుడు పాపకు అమ్మ ఒడి ఇస్తున్నారు. అమ్మకు పెన్షన్ వస్తోంది. ప్రభుత్వం బ్యాంకులో వేసిన డబ్బులతో గొర్రెలు పెంచుతూ ఆదాయం పొందుతున్నా. ఇల్లు కూడా మంజూరైంది. సంతోషంగా బతుకుతున్నాం’ అని ఆనందంగా చెబుతున్నాడు. నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి : అభివృద్ధి, సంక్షేమానికి దూరంగా ఉన్న గ్రామాలు నాలుగేళ్లుగా కొత్త మార్పు దిశగా పరుగులు తీస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా గ్రామాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయి. దాదాపు 26 సంక్షేమ పథకాల్లో వ్యక్తిగతంగా ప్రజలు సగటున నాలుగు పథకాల ద్వారా లబ్ధి పొందుతూ సొంత కాళ్లపై నిలదొక్కుకుంటున్నారు. ‘కులం, మతం చూడం, ఏ పార్టీ అని చూడం, అర్హులా కాదా అన్నది మాత్రమే చూస్తాం, ఆ ప్రాతిపదికనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి’ అని సీఎం వైఎస్ జగన్ తరచుగా చెప్పే మాట మారుమూల పల్లెల్లో సాక్షాత్కరిస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఊళ్లన్నీ మారిపోతున్నాయి. ఇంత తక్కువ వ్యవధిలో ఇంత మార్పు ఎలా సాధ్యమైందో ఆయా ఊళ్లలోని ప్రజలే కథలు కథలుగా చెబుతున్నారు. 1850 కుటుంబాలకు రూ.22.62 కోట్ల లబ్ధి ఇది కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలోని కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామం. దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు ఎమ్మెల్యేగా, స్పీకర్‌గా, ఆరి్థక మంత్రిగా పని చేసిన నాయకుడు ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గంలోని ఈ గ్రామం పరిస్థితి నాలుగేళ్ల క్రితం వరకు దయనీయం. మూడు కి.మీ రోడ్డు కోసం పదేళ్లకు పైగా ఎదురుచూపు.. శిథిలమైన ప్రభుత్వ బడులను బాగుచేసే నాథుడే కరవు.. డ్రైనేజీ వ్యవస్థే లేదు.. పథకాల కోసం నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు.. ఏ కొందరికో అరకొర ఇచ్చే పింఛన్లలోనూ కోతలు.. ఇలా సవాలక్ష సమస్యలు. 2019 ఎన్నికల తర్వాత 1850 కుటుంబాలు, 5,010 జనాభా ఉన్న ఈ ఊళ్లో ఎవరూ ఊహించని విధంగా మార్పు మొదలైంది. రూ.కోటి నిధులతో మండల కేంద్రాన్ని కలుపుతూ రోడ్డు వేశారు. శిథిలమైపోయిన ఉన్నత పాఠశాలను నాడు–నేడు రెండో విడతలో పునర్ నిర్మిస్తున్నారు. చక్కటి డ్రైనేజీ వ్యవస్థతో పాటు వీధుల్లో సీసీ రోడ్లు వచ్చాయి. విద్యార్థులకు అవసరమైన సర్టిఫికెట్లు ఇదే ఊళ్లోనే ఇస్తున్నారు. రెండు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ ఏర్పాటయ్యాయి. 17 మంది ఉద్యోగులు రోజూ స్థానికంగా ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. 35 మంది వలంటీర్లు ప్రతి ఇంటికీ అందుబాటులో ఉన్నారు. ప్రతినెల ఒకటో తేదీ ఉదయాన్నే 777 మందికి పెన్షన్లు అందిస్తున్నారు. 373 మందికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరయ్యాయి. రూ.2 కోట్లతో రోడ్డు, డ్రైనేజీలు, అంతర్గత సీసీరోడ్లు, ప్రభుత్వ పాఠశాల భవనాలు నిర్మిస్తున్నారు. రెండు ఎంపీపీ స్కూళ్లు, ఒక జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 312 మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద ఏటా పుస్తకాలు, బ్యాగు వంటి సమస్త వస్తువులు అందుతున్నాయి. దాదాపు 400 మంది తల్లులు అమ్మ ఒడి అందుకుంటున్నారు. మరో 152 మంది జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పొందుతున్నారు. మొత్తంగా గ్రామ ప్రజలు వివిధ పథకాలకు సంబంధించి డీబీటీ ద్వారా ఇప్పటి వరకు రూ.22,62,25,944 లబ్ధి పొందారు. ఎప్పుడో ఎన్నికల సమయంలో తప్ప కనిపించని ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఏటా రెండు, మూడు పర్యాయాలు గ్రామానికి వచ్చి బాగోగులు కనుక్కుంటున్నారు. ‘ప్రభుత్వం అంటే రేషన్ కార్డులు ఇవ్వడం, రోడ్లు వేయడం మాత్రమే చేస్తుందనుకున్నాం. ఇలా ఇన్ని మంచి పనులు చేయొచ్చని నాలుగేళ్లుగా సీఎం నిరూపించారు’ అని గ్రామస్తులు కితాబిస్తున్నారు. మరో ప్రపంచాన్ని చూస్తున్న బుడ్డోడుపాడు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలోని పాత మల్లంపేట పంచాయతీ చుట్టూ 14 చిన్న చిన్న వాడలున్నాయి. ఇందులో బుడ్డోడుపాడు ఒకటి. 42 గిరిజన కుటుంబాలున్న ఈ వాడకు 70 ఏళ్లుగా రోడ్డు మార్గం లేదు. ప్రజలు మైదాన ప్రాంతానికి రావాలంటే దాదాపు 12 కి.మీ మేర వాగులు, వంకలు, డొంకలు దాటి రావాలి. జబ్బు చేస్తే డోలీలో తరలించాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోయారు. సైకిల్ తప్ప ఇతర ద్విచక్ర వాహనాన్నే చూడని ప్రజలు, పండించిన పంటను సైతం మంచి ధరకు అమ్ముకోలేని దుస్థితి. కనీసం పిల్లలను చదివించుకుందామన్నా రోజూ ఇద్దరు మనుషులు పిల్లలకు రక్షణగా ఉండి వాగులు దాటించి తీసుకెళ్లి, తిరిగి తీసుకురావాల్సిన స్థితి. వర్షం వస్తే పొంగుతున్న వాగులు దాటలేక ఎక్కడో చోట తలదాచుకోవాల్సిన పరిస్థితులు. వాడంతా టీడీపీకి అనుకూలమే. కానీ ఏరోజూ ఏ నాయకుడూ ఇటు ౖవైపు కన్నెత్తి చూసేవారు కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాకతో ఈ వాడకు మంచి రోజులు వచ్చాయి. ‘టీడీపీ సానుభూతిపరులమన్న మాటేగాని గత టీడీపీ ప్రభుత్వంలో మేం పొందిన మేలు లేదు, మా కష్టాలు విన్న నాయకులూ లేరు. మమ్మల్ని మనుషులుగా గుర్తించింది మాత్రం జగన్ ప్రభుత్వమే’ అని 60 ఏళ్ల సెగ్గే రాజబాబు ఆవేదన వెలుబుచ్చాడు. ఇప్పుడు స్థానికంగా ఉండే వలంటీర్ ప్రతినెలా 21 మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. 18 పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. గతంలో చదువు కోసం పిల్లలను 9 కి.మీ దూరంలోని వేరే ఊరికి పంపాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఇక్కడే ఐదవ తరగతి వరకు పాఠశాల ఏర్పాటైంది. 22 మంది పిల్లలు చదువుకుంటున్నారు. ఏడుగురు విద్యార్థులు పై చదువుల కోసం వేరే ఊళ్లకు వెళ్లి వస్తున్నారు. డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో 1,87,7000 జమ అయింది. ఇప్పటి దాకా ప్రభుత్వం రూ.1.52 కోట్ల మేర ఇక్కడ అభివృద్ధి పనులు చేసింది. ఇప్పుడు ఈ వాడకే నేరుగా వాహనాలు వస్తుండడంతో పండించిన జీడిమామిడి పంటను స్థానికంగా అమ్ముకున్నారు. మూడుసార్లు ఎమ్మెల్యే వచ్చారు ఈ ప్రభుత్వం వచ్చాక నర్సీపట్నం ఎమ్మెల్యే మూడుసార్లు గ్రామానికి వచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గతంలో మా పెద్దలు ఎప్పుడూ ఎమ్మెల్యే ఎలా ఉంటారో చూడలేదు. సచివాలయాలు వచ్చాక అన్ని పథకాలు ఇంటికే వస్తున్నాయి. ఎన్నో దశాబ్దాల కల అయిన రోడ్డు కూడా జగనన్న ప్రభుత్వంలోనే వచ్చింది. ఇప్పుడు అంతా హ్యాపీ. – తూబిరి రాజబాబు, మాజీ వైస్ సర్పంచ్, బుడ్డోడుపాడు నాలుగేళ్లలో రూ.4 లక్షల సాయం మా ఇంట్లో ఇద్దరికి వికలాంగుల పెన్షన్ వస్తోంది. వైఎస్సార్ ఆసరా, రైతు భరోసా, సున్నా వడ్డీ పథకం కూడా ఇచ్చారు. నా భర్తకు ఆరోగ్యం బాగాలేకపోతే విశాఖపట్నం ఆస్పత్రిలో చేర్పిస్తే.. ఉచితంగా వైద్యం చేయడంతో పాటు ఆరోగ్య ఆసరా కింద రూ.5 వేలు ఇచ్చారు. వలంటీర్లు ప్రతిరోజు ఇంటికి వచ్చి ఏమన్నా సమస్యలున్నాయా అని అడుగుతున్నారు. ఇప్పటి దాకా వివిధ పథకాల ద్వారా మాకు రూ.4,05,500 వచ్చింది. – చింతకాయల మంగాయమ్మ, అల్లిపూడి గ్రామం ఇంత మంచి పాలన చూడలేం మా పెద్దబ్బాయికి మూడేళ్లు వసతి దీవెన వచ్చింది. చిన్నబ్బాయికి నాలుగేళ్లు జగనన్న అమ్మ ఒడి కూడా తీసుకున్నాం. ఏడు ప్రభుత్వ పథకాల ద్వారా నాకు రూ.2,51,250 నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యింది. ఆర్థిక పరిస్థితి బాగోలేని మాలాంటి కుటుంబాలు బతికేదే కూలి పనుల పైన. భర్త చనిపోయిన నాకు వితంతు పింఛన్ ఇస్తున్నారు. ఇంటి వద్దే బడ్డీ కొట్టు పెట్టుకున్నా. జగనన్న వల్ల అందరం చక్కగా బతుకుతున్నాం – వడ్డి సత్యవతి, అల్లిపూడి గ్రామం నా బిడ్డ ఇంజనీర్ అవుతోంది.. మా బాబు చదువుకునేటప్పుడు ఇన్ని ప్రభుత్వ పథకాలు లేవు. ఎలాంటి సాయం కూడా అందలేదు. మా పాప మాత్రం ప్రభుత్వ పథకాలతోనే ఇంజినీరింగ్ చదువుతోంది. విద్యా దీవెన, వసతి దీవెనతో పాటు కొద్దిపాటి పొలానికి రైతు భరోసా వచ్చింది. మా ఆయనకు వాహన మిత్ర ఇచ్చారు. ఇప్పటి దాకా మా కుటుంబానికి రూ.3,75,089 సాయం అందింది. – చింతకాయల నాగరత్నం, అల్లిపూడి పిల్లల చదువు కష్టాలు తీరాయి మా పెద్దబ్బాయి చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వం వచ్చాక మా చిన్నబ్బాయికి అమ్మ ఒడి వస్తోంది. మాకు రైతు భరోసా, చేయూతతో పాటు పెద్ద వారికి పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఏడాదికి అన్ని పథకాల రూపేణా రూ.70 వేలకు పైనే సాయం అందింది. గతంలో ఊరు దాటి బయటకు వెళ్లాలంటే బతుకుపై ఆశ వదులుకునేవారం. ఇప్పుడు చక్కటి రోడ్డు వేయడంతో ఏ సమయంలోనైనా బయటి ప్రాంతానికి నిర్భయంగా వెళ్లగలుగుతున్నాం. – బోయిన చినతల్లి, వెంకటేశ్వర్లు దంపతులు, బుడ్డోడుపాడు -
గ్రామ స్వరాజ్యం ఇదే
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విప్లవాత్మక మార్పులను ప్రజలకు క్షేత్ర స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థను మరింత మెరుగు పరుస్తూ మారు మూల గ్రామాలకు వేగంగా సేవలందించేందుకు ఏపీ సేవ పోర్టల్–2ను ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. రెండేళ్లలో గ్రామ స్వరాజ్యం అంటే ఇదీ అని కళ్ల ముందు కనిపించేలా అమలు చేసి చూపించామని చెప్పారు. గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటో ఇంతకన్నా వేరే అర్థం బహుశా ఉండదన్నారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి (ఏపీ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్) ఏపీ సేవ 2.0 (టూ పాయింట్ ఓ) పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇవాళ ప్రారంభించిన సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ (సీఎస్పీ)ను పలకడానికి అనువుగా ఏపీ సేవ అంటున్నామని చెప్పారు. దీని వల్ల మారుమూల గ్రామాల్లో కూడా వేగంగా, పారదర్శకంగా, జవాబుదారీతనం పెంచే విధంగా.. మనకున్న వ్యవస్థను మెరుగు పరుస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఇంతకంటే వేరే నిదర్శనం లేదు ► గ్రామ స్వరాజ్యం అంటే మన కళ్లముందే కనిపించేలా రెండేళ్లుగా ప్రభుత్వం అడుగులు ముందుకేస్తోంది. 540కి పైగా గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సేవలందిస్తున్నాం. ప్రతి 2 వేల జనాభాకు ఒకటి చొప్పున గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. అక్కడ పది మంది ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ► రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలు పని చేస్తున్నాయి. వీటి ద్వారా 1.34 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు పని చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున, మున్సిపల్ స్థాయిలో ప్రతి 100 ఇళ్లకు ఒకరు చొప్పున 2.60 లక్షల మంది వలంటీర్లు ఉన్నారు. మొత్తంగా దాదాపు 4 లక్షల మంది ఈ డెలివరీ మెకానిజంలో పని చేస్తున్నారు. వీరంతా ప్రభుత్వ పథకాలు, సేవలు అందించడంలో ఇంటింటికి వెళ్లి నిరంతరం పని చేస్తున్నారు. ఇంతకన్నా గ్రామ స్వరాజ్యానికి వేరే నిదర్శనం లేదు. వీరందరికీ అభినందనలు. ► ఇలా సేవలందించే కార్యక్రమాన్ని 2020 జనవరి 26న ప్రారంభించాం. ఈ రెండేళ్ల పయనంలో నేర్చుకున్న పాఠాల ద్వారా మరింత మెరుగ్గా సేవలను అందించేలా, పారదర్శకంగా ఉండేలా మార్పులు తీసుకొచ్చి ఏపీ సేవ పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాం. 540కి పైగా సేవల్లో వేగం ► గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకే వేదికపై 540కి పైగా ప్రభుత్వ సేవలు మెరుగైన రీతిలో అందుబాటులోకి వస్తాయి. గత రెండేళ్లలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 3.46 కోట్ల మందికి సేవలు అందించాం. ఈ లెక్కన ఏ స్థాయిలో ఈ వ్యవస్థ ఉపయోగపడిందో ఇట్టే తెలుస్తోంది. ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కొత్త పోర్టల్ ద్వారా మరింత వేగంగా పనులు జరుగుతాయి. ► తాము ఇచ్చిన అర్జీ ఎక్కడ ఉంది? ఏ స్థాయిలో ఉంది? ఎవరి దగ్గర ఎన్ని రోజుల నుంచి పెండింగ్‌లో ఉంది? అన్న విషయాన్ని నేరుగా ప్రజలు తెలుసుకోవచ్చు. సంబంధిత శాఖలోని పైస్థాయి అధికారులు కూడా ఈ విషయాలు తెలుసుకోవచ్చు. లంచాలు, అవినీతికి తావుండదు ► కొత్త సాఫ్ట్వేర్ ద్వారా అందించే విస్తృత సేవల వల్ల ప్రజలు తమకు అవసరమైన సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎవరికీ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. పారదర్శకత పెరిగి అవినీతి దూరం అవుతుంది. ► ప్రజలు వారి దరఖాస్తును ట్రాక్ చేసుకునే (ఏ దశలో ఉందో చూసుకునే) వెసులుబాటు ఉంటుంది. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయం సాధ్యపడుతుంది. అటు ప్రభుత్వ శాఖలు, ఇటు ప్రజల మధ్య వారధిగా అంటే ముఖ్యమైన హబ్‌గా.. గ్రామ, వార్డు సచివాలయాలు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా పనిచేసేందుకు ఏపీ సేవ పోర్టల్ ఉపకరిస్తుంది. ► ప్రజలు ఏదైనా సేవకు సంబంధించి దరఖాస్తు చేయగానే పక్కాగా రశీదు వస్తుంది. భౌతికంగా, డిజిటల్ పద్ధతుల్లో రశీదులు వస్తాయి. పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో కూడా చెబుతారు. ఆయా దరఖాస్తుల ప్రాసెస్‌ను తెలియజేస్తూ ఎప్పటికప్పుడు అర్జీదారులకు ఎస్ఎంఎస్లు వస్తాయి. ► ఫీజులు చెల్లించాల్సి ఉంటే.. ఏపీ సేవ పోర్ట్ల్ సహాయంతో రుసుములు చెల్లించే అవకాశం ఉంటుంది. యూపీఐ, క్యూ ఆర్ కోడ్ స్కానింగ్, క్యాష్ పేమెంట్ లేదా ఆన్లైన్లో పేమెంట్ చేసే వెసులుబాటు అందుబాటులోకి వస్తుంది. ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేయొచ్చు ► ఏపీ సేవ పోర్టల్ ద్వారా రెవిన్యూ, భూ పరిపాలనకు సంబంధించిన దాదాపు 35 రకాల సేవలను కూడా తీసుకు వచ్చాం. మునిసిపాలిటీలకు సంబంధించి 25 సేవలు, పౌర సరఫరాలకు చెందిన 6 సేవలు, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన 3 సేవలు, విద్యుత్ రంగానికి సంబంధించిన 53కు పైగా సేవలను పోర్టల్ కిందకు తీసుకు వచ్చాం. ► దరఖాస్తుదారుడు తమ సమీపంలోని సచివాలయంలోనే కాకుండా.. ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తున్నాం. ఒకచోట దరఖాస్తు చేస్తే.. వేరే చోట నుంచి కూడా సర్టిఫికెట్ పొందవచ్చు. ఒకవేళ దరఖాస్తును తిరస్కరిస్తే.. దానికి కారణాలు ఏంటో చెబుతారు. ఇలాంటి సదుపాయాలన్నీ కూడా ఏపీ సేవ పోర్టల్ద్వారా అందుబాటులోకి వస్తాయి. ► ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సేవలన్నింటినీ పూర్తిగా డిజిటలైజ్ చేస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల నుంచి మండల స్థాయి, మునిసిపాలిటీలు, జిల్లా స్థాయి, రాష్ట్ర సచివాలయంలోని ఉన్నత స్థాయి ఉద్యోగులు అందరూ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫాంపై పని చేస్తారు. తద్వారా ఉద్యోగుల్లో జవాబుదారీతనం మరింత పెరుగుతుంది. ప్రతి ఉద్యోగి డిజిటల్ సిగ్నేచర్ అందరికీ కనిపిస్తుంది. ఒకవేళ చేయకపోతే ఎందుకు చేయలేదని పై అధికారులు, దరఖాస్తుదారులు ప్రశ్నించ గలుగుతారు. తద్వారా సర్టిఫికెట్లు, డాక్యుమెంట్ల జారీలో జాప్యం ఉండదు. అవినీతికి తావుండదు. – సీఎం వైఎస్ జగన్ -
మారుతున్న పల్లె రూపురేఖలు
మన పల్లె ప్రగతి బాట పయనిస్తోంది. కోట్లాది రూపాయల ఎన్ఆర్ఈజీఎస్ (జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) నిధులతో గ్రామాలు అభివృద్ధి పథాన పయనిస్తున్నాయి. గ్రామ సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు, రైతు భరోసా కేంద్రాలతోపాటు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు చేకూరుతున్నాయి. మరోవైపు ఎప్పటిలాగే రోడ్లు, కాలువల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉపాధి హామీ కన్వర్జెన్సీ పనులతో గ్రామాల రూపురేఖలు శరవేగంగా మారిపోతు న్నాయి. సాక్షి ప్రతినిధి, విజయనగరం: మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలనలో పెద్ద ఎత్తున సంస్కరణలు చేపట్టింది. ఒకవైపు పాలనా వ్యవస్థలో మార్పులు, మరోవైపు మౌలిక సదుపాయాల కల్పన భారీగా జరుగుతోంది. గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వ పాలనా వ్యవస్థ ప్రజల ముంగిటకే అందుబాటులోకి వచ్చింది. చాలాచోట్ల రైతు భరోసా కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ప్రజారోగ్యమే పర మావధిగా వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు కాబోతున్నా యి. ప్రభుత్వ కార్యాలయాలన్నిటికీ దశలవారీగా సొంత భవనాల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం సహాయంతో ఈ భవనాల నిర్మాణం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలా సాగుతోంది. పనుల్లో పురోగతి జిల్లాకు రూ.243.82కోట్లతో 663 గ్రామ సచివాలయ భవనాలు నిర్మించాల్సి ఉండగా 436 భవనాల నిర్మా ణం ప్రారంభమయ్యింది. రూ.130.36కోట్లతో 567 రైతు భరోసా కేంద్రాలు నిర్మించాల్సి ఉండగా తొలివిడతలో 384 భవనాల నిర్మాణాన్ని చేపడుతుండగా, వీటి లో ఇప్పటికే 68 భవనాల పనులు ప్రారంభమయ్యా యి. 585 వెల్నెస్ సెంటర్ల నిర్మాణానికి రూ.74కోట్లు మంజూరుకాగా 41 సెంటర్ల నిర్మాణం కొనసాగుతోంది. జిల్లాకు ఇదివరకే 702 అంగన్వాడీ కేంద్రాలు మంజూరు కాగా, వీటిలో 687 కేంద్రాల నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయి. ఈ పనులకోసం రూ.32.89కోట్లు మంజూరవ్వగా రూ.32.70కోట్లు నిర్మాణ సామగ్రికి, రూ.19.96లక్షలు వేతనదారులకు కేటాయించారు. మనబడి నాడు–నేడు పనుల్లో భాగంగా 1145 పాఠశాలలకు రూ.70.54కోట్లతో ప్రహరీలు మంజూరు చేయగా, వీటిలో 634 పనులు వివిధ దశల్లో ఉన్నా యి. మరోవైపు గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కూడా జోరందుకుంది. గ్రామాలకు వెళ్లే లింకురోడ్లు, అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని ఉపాధిహామీ భాగస్వామ్యంతో చేపట్టారు. ముఖ్యంగా ఈ ఏడాది గిరిజన ప్రాంతంపై దృష్టిసారించి రహదారి సౌకర్యాన్ని కలి్పస్తున్నారు. గ్రామాల్లో డ్రైనేజీ నిర్మాణాన్ని కూడా మరోవైపు చేపడుతున్నారు. ఉపాధిహామీ కన్వర్జెన్సీ పనుల్లో భా గంగా జిల్లా వ్యాప్తంగా 17,904 సిమ్మెంటు కాంక్రీట్ రోడ్లు మంజూరు చేశారు. వీటి అంచనా విలువ సుమారుగా రూ.673.37కోట్లు కాగా, ఇప్పటివరకు 13,394 పనులు మొదలు పెట్టారు. అలాగే 81.46 కోట్లతో 117 బీటీ రోడ్లను మంజూరు చేయగా, ఈ పనులన్నీ ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. రూ.156.17కోట్ల తో 548 డబ్ల్యూబీఎం రోడ్లను మంజూరు చేయగా, వీటిలో 234 రహదారుల నిర్మాణం ప్రారంభమయ్యింది. ఆగస్టు నాటికి అన్నీ పూర్తి గ్రామ పరిపాలనకు కేంద్రస్థానమైన గ్రామ సచివాలయానికి తగిన వసతులతో, అవసరమైన విస్తీర్ణంతో భవనాలను నిర్మిస్తున్నాం. చాలాచోట్ల వీటిని ఆనుకునే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. అక్కడక్కడా కొన్నిచోట్ల ప్రభుత్వ భవనాలకు స్థలం కొరత కారణంగా ఇంకా ప్రారంభం కానప్పటికీ, వీటన్నిటినీ ఆగస్టు నాటికి పూర్తి చేయాలన్న కతనిశ్చయంతో జిల్లా యంత్రాంగం పనిచేస్తోంది. – డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, జిల్లాకలెక్టర్ -
నేటి నుంచి రెండో విడత ‘పల్లె ప్రగతి’
సాక్షి, హైదరాబాద్: నేటి నుంచి రెండో విడత ‘పల్లె ప్రగతి’ప్రారంభం కానుంది. అధికార యంత్రాంగం పల్లెబాట పడుతోంది. అధికారులు, పాలకవర్గాల హడావుడితో 11 రోజుల పాటు గ్రామాల్లో సందడి కొనసాగనుంది. గురువారం నుంచి ఈనెల 12వ తేదీ వరకు పల్లె ప్రగతి కార్యక్రమం జరగనుంది. గతేడాది సెపె్టంబర్లో జరిగిన 30 రోజుల ప్రణాళికలో అమలు చేసిన కార్యాచరణే ఈసారి కూడా ఆచరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి నిర్వహణకు పంచాయతీరాజ్‌శాఖ సన్నద్ధమైంది. బాగుంటే ప్రోత్సాహకాలు.. లేకుంటే చర్యలు ప్రతి పంచాయతీకి ఒక ప్రత్యేకాధికారిని నియమించిన ఆ శాఖ.. ఆ అధికారి పర్యవేక్షణలో పల్లె ప్రగతిని నిర్వహించాలని నిర్దేశించనుంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల పరిశీలనకు మండల, జిల్లా స్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించింది. ఈ సారి కొత్తగా రాష్ట్రస్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేసింది. 51 మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కేటాయించిన మండలాల్లోని రెండు పంచాయతీలను ఆకస్మికంగా సందర్శించి.. పల్లె ప్రగతి నిర్వహణ తీరును మదింపు చేస్తారు. అంతేగాకుండా.. ఆ గ్రామంలో గుర్తించిన పనులు, నిధులు, విధుల నిర్వహణలో స్థానిక పంచాయతీ సిబ్బంది, పాలకవర్గం పనితీరుపై ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ఈ నివేదిక ఆధారంగా బాగా పనిచేసిన పంచాయతీలకు ప్రోత్సాహకాలు.. అలసత్వం ప్రదర్శించినట్లు తేలితే చర్యలకు సిఫారసు చేస్తారు. తొలిరోజు నిర్వహించే గ్రామసభలో మొదటి విడత ప్రగతి నివేదికను గ్రామస్తుల ముందుంచనున్నారు. పల్లె ప్రగతి లక్ష్యం, పంచాయతీ ఆదాయ, వ్యయాలు, ప్రజల భాగస్వామ్యంపై అవగాహన కలి్పంచనున్నారు. గ్రామ వార్షిక ప్రణాళికకు ఆమోదముద్ర వేయనున్నారు. లక్ష్యాలివే.. ► గ్రామాలను పచ్చదనం–పరిశుభ్రంగా ఉంచడం ► పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కల సంరక్షణలో ప్రజలకు విస్తృత భాగస్వామం కలి్పంచడం ► గ్రామాభివృద్ధికి వార్షిక ప్రణాళికలు తయారుచేసి నియంత్రిత ► పద్ధతిలో నిధుల వినియోగం ► ప్రజాప్రతినిధులు, అధికారుల్లో జవాబుదారీతనం పెంచడం ప్రతి నెలా రూ. 339 కోట్లు.. గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.339 కోట్లు విడుదల చేస్తోంది. ఈ నిధులను గ్రామావసరాలకు వినియోగించాలని స్పష్టం చేసింది. మలీ్టపర్పస్ వర్కర్లకు వేతనాలు, చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు తరలించేందుకుట్రాక్టర్‌ను కొనుగోలు చేయాలని, మొక్కలకు నీళ్లు పోసేందుకు ట్యాంకర్‌ను సమకూర్చుకోవాలని ఆదేశించింది. వీటి వినియోగంపై గ్రామస్థాయిలో పరిశీలించాలని అధికారుల బృందాలకు ప్రభుత్వం సూచించింది. మొదటి విడతలో పూర్తి చేసిన పనులివే.. గతేడాది సెపె్టంబర్ 6 నుంచి ఆక్టోబర్ 5 వరకు తొలి విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ 30 రోజుల పాటు పల్లెల్లో పలు పనులు చేపట్టి పూర్తి చేశారు. ► 5 పంచాయతీల్లో మినహా 12,746 పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణ. 12,687 పంచాయతీల్లో 38,061 మంది కోఆప్షన్‌సభ్యుల ఎన్నిక. ► 12,744 పంచాయతీల్లో స్టాండింగ్ కమిటీ ఏర్పాటు ∙అందులో 8,20,009 మంది సభ్యుల ఎన్నిక.. అందులో మహిళాసభ్యులే 4,02,965 మంది ► సమస్యలకు సంబంధించి చర్యలు చేపట్టేందుకు 12,746 గ్రామపంచాయతీల్లో పాదయాత్రల నిర్వహణ, ఈ పంచాయతీల్లో వార్షిక ప్రణాళికల తయారీ ∙10,544 పంచాయతీల్లో వైకుంఠధామాలు/శ్మశానాల ఏర్పాటుకు భూమి గుర్తింపు ∙10,875 గ్రామాల్లో డంపింగ్‌యార్డుల ఏర్పాటుకు భూమి గుర్తింపు ► లక్షకు పైగా ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో శిథిలాల తొలగింపు ∙దాదాపు రెండున్నర లక్షల ప్రదేశాల్లో సర్కార్ తుమ్మ, పిచి్చమొక్కలు, పొదల తొలగింపు ∙లక్ష దాకా ఖాళీ ప్రదేశాల శుభ్రం ∙15,548 పాడుపడిన బావులు, 9,337 ఉపయోగించని బోరు బావులు మూసివేత ► 1.22 లక్ష ప్రాంతాల్లో పారిశుద్ధ్యం పెంచే చర్యలు, 79,108 ప్రభుత్వ సంస్థలు, ప్రదేశాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు. -
గ్రామాల్లో పచ్చదనం,సమగ్రాభివృద్ధే లక్ష్యం
-
కలెక్టర్ ఆగ్రహం
అశ్వారావుపేటరూరల్: డీఆర్డీఓపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో వెనకబడ్డ పంచాయతీ వివరాలు అడగ్గా.. సరైన సమాధానం చెప్పకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛ భారత్ ద్వారా నిర్మిస్తున్న మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించేందుకు శుక్రవారం కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ ఆకస్మికంగా అశ్వారావుపేట మండలంలో పర్యటించారు. డీఆర్డీఓ జగత్‌కుమార్ రెడ్డి సూచన ప్రకారం మండలంలోని వేదాంతపురం గ్రామ పంచాయతీలో మరుగుదొడ్ల నిర్మాణాల ప్రగతి తెలుసుకునేందుకు గ్రామంలో పర్యటించారు. పంచాయతీకి ఎన్ని మరుగుదొడ్లు మంజూరయ్యాయని, ఎన్ని నిర్మించారని ప్రశ్నించారు. పంచాయతీకి 29 మరుగుదొడ్లు మంజూరు కాగా, వాటిలో 23 పూర్తి చేశామని, మరో 6 మరుగుదొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని డీఆర్డీఓ జగత్‌కుమార్‌రెడ్డి వివరించారు. ఈ క్రమంలో కలెక్టర్ జోక్యం చేసుకుని ‘నిర్మాణాల్లో ప్రగతి ఉన్న చోటకు తనను దేనికి తీసుకొచ్చారు..? నిర్మాణాల్లో వెనుకబడిన చోటకు తీసుకెళ్లకుండా ఇక్కడికి తీసుకొచ్చి ప్రయోజనం ఏమిటీ..? నా టైమ్ వేస్ట్ చేశావ్..? మీ వల్ల ఒక రోజు డిలే అయిపోయంది కదా.? ఇదేనా మీ పనితీరు.? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో వెనుకబడిన పంచాయతీకి తీసుకెళ్లమని అడగ్గా.. సరైన సమాధానం చెప్పలేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. గుమ్మడిపల్లి పంచాయతీ కార్యదర్శిపై మండిపాటు అనంతరం మండలంలోని గుమ్మడవల్లి గ్రామ పంచాయతీ నిర్మాణాల్లో వెనుకబడినట్లు తెలుసుకొని ఆ పంచాయతీలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడుతుండగా గ్రామ కార్యదర్శి దొడ్డా ప్రసాద్ అక్కడికి వచ్చారు. మరుగుదొడ్ల నిర్మాణాలపై ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పలేదు. దీనికితోడు మద్యం సేవించి ఉన్నాడు. ఈ విషయాన్ని గ్రహించిన కలెక్టర్ శైనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తహసీల్దార్ రాఘవరెడ్డిని పిలిచి కార్యదర్శిని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలని పంపించారు. వైద్య పరీక్షల నివేదిక వచ్చిన తర్వాత కార్యదర్శిని సస్పెండ్ చేస్తానని కలెక్టర్ అన్నారు. గ్రామ పంచాయతీకి 231 మరుగుదొడ్లు మంజూరు కాగా, కేవలం 50 మాత్రమే పూర్తై, 181 మరుగుదొడ్లు పూర్తి కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మంజూరైన మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి కాకపోవడానికి గల కారణాలను గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేసిన బిల్లులు రావడం లేదని, అందుకే చాలా మంది మంజూరైన నిర్మించుకోవడానికి ముందుకు రావడం లేదని స్థానికులు చెప్పారు. దీంతో కలెక్టర్ మాట్లాడుతూ..బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం ఉండదని, మీ గ్రామ పంచాయతీ ఖాతాలోనే రూ.10లక్షల నిధులు ఉన్నాయని, నిర్మాణాలను నిబంధనల ప్రకారం చేసుకుంటే మంజూరు అవుతాయన్నారు. మరుగుదొడ్ల నిర్మాణాల్లో దేశంలోనే జిల్లా వెనుకబడిందని, వచ్చే జూలై 31 నాటికి మరుగుదొడ్ల నిర్మాణాలు వంద శాతం పూర్తి చేసుకొని ఓడీఎఫ్ ప్రకటించుకోవాలన్నారు. అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని, లేని పక్షంలో చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వి.రాఘవరెడ్డి, ఎంపీడీఓ కె పాపారాణి, ఈవోపీఆర్డీ ఓంటేరు దేవరాజ్, సర్పంచ్‌లు శివశంకర ప్రసాద్, కొడిమి సీత, తాజా ఎంపీటీసీ సభ్యులు వల్లెపు తిరుపతిరావు, ఏపీఓ శ్రీను, ఈజీఎస్ జేఈ స్వామి ఉన్నారు. -
పల్లెలకు పట్టణ సొబగులు
సాక్షి, కరీంనగర్ కార్పొరేషన్: కరీంనగర్ నగరపాలక సం స్థలో విలీనమైన 8 గ్రామపంచాయతీలు పట్టణీకరణను సంతరించుకుంటున్నాయి.నగరంలో విలీ నం కావడంతో గ్రామాల రూపురేఖలు మారాయి. విలీన గ్రామాలన్నింటినీ సమీప డివిజన్లలో కలపడంతోపాటు బోర్డులు ఏర్పాటు చేయడంతో గ్రా మాలకు నగరపాలక హంగులు కనిపిస్తున్నాయి. నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో ప్రజ లకు మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా కార్పొరేషన్ అధికారులు పనులు చేపడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా కనీస సౌకర్యాలు చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాలను తక్కువ సమయంలోనే డివిజన్లకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు ప్రతీ విభాగానికి ప్రత్యేక అధికారులను కేటాయించి పనులు చేపడుతున్నారు. శివారు ప్రాంతాల్లో మాదిరిగా ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి ప్రణాళికలు రూ పొందిస్తున్నారు. విలీనం తర్వాత పన్నుల భారం లేకుండా మరో మూడేళ్ల వరకు యధావిధిగా పన్నులు వసూలు చేయనున్నట్లు సమాచారం. అ దేవిధంగా ప్రతీ ఇంటికి తాగునీటి వసతి కల్పిం చేందుకు ఒక్క రూపాయికే నల్లా కనెక్షన్‌ను అంది ంచనున్నారు. రాబోయే రోజుల్లో మిషన్‌భగీరథ కింద ఓవర్‌హెడ్ ట్యాంకులు నిర్మాణం చేసి నీటి సరఫరాను మెరుగుపర్చే ప్రక్రియపై దృష్టిసారిం చారు. పట్టణానికి ధీటుగా అన్ని సౌకర్యాలు కల్పి ంచేందుకు నిదుల కేటాయింపు సైతం చేస్తున్నా రు. ఇక గ్రామాలు నగరంలో విలీనం కావడంతో స్థిరాస్తుల విలువలు సైతం రెట్టింపవుతున్నాయి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి నగరపాలక సంస్థలో విలీనమైన గ్రామాల్లో పారి శుధ్యం మెరుగుకు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతున్నారు. ప్రతీ గ్రామానికి ఒక శానిటరీ ఇన్స్పెక్టర్కు బాధ్యతలు అప్పగించి పనులు పూర్తిచేసేందుకు ఆదేశించారు. ప్రధాన రహదారుల్లో దుమ్ముదూళి లేకుండా చర్యలు చేపట్టడంతోపాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా ప్రత్యేక పారిశుధ్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలను భాగస్వాములను చేస్తూ మురుగునీరు నిల్వ ఉండకుండా పరిసరాలు పరి శుభ్రం చేసుకునే విధంగా చైతన్య పరుస్తున్నారు. వీధిదీపాలకు మరమ్మతులు గ్రామపంచాయతీల్లో వెలగని వీధిదీపాలకు మరమ్మతు చేస్తూ చీకట్లలో మగ్గుతున్న కాలనీలకు వెలుగులు నింపుతున్నారు. ఎల్ఈడీ వీధిదీపాలు అందుబాటులోకి వచ్చాక, వాటిస్థానంలో తొలగించిన ఎస్‌యూ, హైమాస్ లైట్లను ప్రస్తుతం గ్రామాల్లో ఉపయోగిస్తున్నారు. పంచాయతీ కార్యాలయాలతోపాటు ప్రధాన చౌరస్తాలో ఈ బల్బులను బిగిస్తుండడంతో గ్రామాల్లో కొత్త శోభ సంతరించుకుంటుంది. అయితే గ్రామాల ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలనే ఇబ్బంది లేకుండా గ్రామపంచాయతీ ప్రస్తుత వార్డు కార్యాలయాల్లో అధికారుల నంబర్లు అంటించారు. దీంతో ఏ అవసరమున్నా ఫిర్యాదు చేసే వీలుంటుంది. ఇక నుంచి ఆన్లైన్లోనే అనుమతులు కార్పొరేషన్లో విలీనమైన గ్రామాల్లో ఇక నుంచి ఇంటి అనుమతులన్నీ ఆన్లైన్లోనే పొందాల్సి ఉంటుంది. ఇప్పటికే టౌన్‌ప్లానింగ్ విభాగానికి చెందిన డీపీఎంఎస్‌కు లింక్ చేశారు. ఇందు కోసం గ్రామాలకు చెందిన ఇంటి నంబర్లను సైతం తీసుకొని ఆన్లైన్ చేయనున్నారు. ఆయా గ్రామాలను అటాచ్ చేసిన డివిజన్లకు బాధ్యులుగా ఉన్న టౌన్‌ప్లానింగ్ సిబ్బంది ఇంటి అనుమతులు, ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తున్నారు. వీటితో పాటు పౌరసేవలు సైతం అందుబాటులోకి తీసుకొచ్చారు ఇప్పటివరకు నగరంలో ఏవిధంగా సేవలు అందుతున్నాయో.. విలీన గ్రామాల ప్రజలకు సైతం అదే విధంగా సేవలు అందించనున్నారు. వేగంగా అభివృద్ధి పనులు విలీన గ్రామాలను నగర డివిజన్లకు ధీటుగా అభివృద్ది చేసేందుకు వేగంగా పనులు చేపడుతున్నాం. కార్పొరేషన్లో కలిస్తే ఎన్ని సౌకర్యాలు ఉంటా యో అన్ని కల్పిస్తాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. పంచాయితీలో పనిచేసిన పారిశుధ్య కార్మికులు, కారొబార్ తదితర సిబ్బందిని కార్పొరేషన్ వర్కర్లుగా గుర్తించాం. టౌన్‌ప్లాన్, ఇంజనీరింగ్, శానిటేషన్, వీధిదీపాలు, నీటి సరఫరా ఇలా అన్ని విభాగాల నుంచి నగర ప్రజలు పొందే సౌకర్యాలన్నీ కల్పిస్తాం. – సత్యనారాయణ, నగరపాలక సంస్థ కమిషనర్ -
పేదింట వెలుగులు!
సాక్షి, ఊర్కొండ: గ్రామీణ ప్రాంతాల పేదల ఇళ్లలో వెలుగు నింపాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న అన్ని కులాల నిరుపేదలకు రూ.125లకే విద్యుత్ మీటరు కనెక్షన్ ఇస్తున్నారు. రూ.125 కూడా దరఖాస్తు చేసుకునేందుకు అయ్యే ఖర్చు మాత్రమే. ఈ పథకాన్ని మార్చి 31వరకు పొడిగించినట్లు ట్రాన్స్‌కో అధికారులు తెలిపారు. లబ్ధిదారులు ఆధార్‌కార్డు జిరాక్స్, రెండు ఫొటోలు, ఫోన్ నంబర్‌తో సంబంధిత విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. విచారణ అనంతరం విద్యుత్ మీటర్‌తో పాటు ఉచితంగా విద్యుత్ కనెక్షన్ ఇస్తారు. అనంతరం సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు విచారణ జరిపి విద్యుత్ మీటర్ ఏర్పాటు చేసి సర్వీస్ వైరు, మీటర్, స్విచ్ బోర్డు, ఎల్ఈడీ బల్బు, ఎర్తింగ్ తదితర కనెక్షన్లు ఉచితంగా ఇస్తారు. సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ల బిగింపు గ్రామాల్లో విద్యుత్ లో–ఓల్టేజీ లేకుండా ఇప్పటికే కొత్త మీటర్లు ఏర్పాటు చేస్తున్న వీధుల్లో ట్రాన్స్‌కో అధికారులు సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు సమకూరుస్తున్నారు. దీన్‌దయాళ్ పథకం కింద విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు కొన్ని గ్రామాల్లో లో–ఓల్టేజీ సమస్యను అధిగమించేందుకు ఈ ట్రాన్స్ఫార్మర్లు ఉపయోగపడనున్నాయి. ధ్రువీకరణ పత్రం తప్పనిసరి దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జీవన్‌జ్యోతి పథకం కోసం దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తే సరిపోతుంది. వారికి ఉచితంగానే కనెక్షన్ ఇచ్చి ప్రతినెలా వారి బిల్లులో రూ.5 అదనంగా వసూలు చేస్తారు. ఇలా రూ.125 అయ్యేవరకు ఉంటుంది. 100 యూనిట్లు వాడుకునేందుకు ప్రభుత్వం వారికి సబ్సిడీ కల్పిస్తుందని, గతంలో విద్యుత్ కనెక్షన్ తీసుకున్న వారు ఎస్సీ, ఎస్టీలు అయితే కుల ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే వారిని 100 యూనిట్ల సబ్సిడీలో చేర్చే అవకాశం ఉంటుంది. ఇతర కులాలకు చెందిన నిరుపేదలకు కూడా రూ.125లకే మీటర్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సద్వినియోగం చేసుకోవాలి కరెంట్ మీటర్ లేని నిరుపేదలంతా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మండలంలో ఇప్పటికే 1000 మీటర్ల దాకా బిగించాం. మీటర్లు బిగించిన చోట లోఓల్టేజీ రాకుండా సింగిల్, త్రీ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశాం. దాదాపు మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటిలో వెలుగులు నింపాం. ఇంకా కావాల్సిన వారు దరఖాస్తు చేసుకుంటే తక్షణమే మీటర్లు ఏర్పాటు చేస్తాం. – రవి, ఏఈ, ఊర్కొండ -
పల్లె మెరవాలె
సాక్షి, హైదరాబాద్: పల్లెలను పచ్చగా, పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ లను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. స్వచ్ఛమైన పల్లెల కోసం మూస పద్ధతిలో కాకుండా వినూత్నంగా ఆలోచించి వ్యూహం ఖరారు చేయాలని సూచిం చారు. వచ్చే మూడు నెలల్లో గ్రామ పంచాయతీల సమగ్రాభివృద్ధికి ఏం చేయాలన్న అంశంపై కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మొదటి నెల రోజులు గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనులు చేపట్టాలని పేర్కొన్నారు. గ్రామాల సమగ్రాభివృద్దికి చర్యలు తీసుకునే క్రమంలో గ్రామ పంచాయతీల్లో పనిచేసే సిబ్బందికి, ముఖ్యంగా పారిశుధ్య సిబ్బందికి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. వివాహ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడంతోపాటు మరికొన్ని బాధ్యతలనూ గ్రామ పంచాయతీలకు అప్పగించాలని చెప్పారు. పంచాయతీలను పచ్చగా, పరిశుభ్రంగా మార్చే కార్యాచరణపై సీఎం కేసీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ ఉన్నతాధికారులు నర్సింగ్‌రావు, శాంత కుమారి, పీకే ఝా, వికాస్‌రాజ్, నీతూప్రసాద్, స్మితా సభర్వాల్, భూపాల్‌రెడ్డి, ప్రియాంక వర్గీస్, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చే పనిని ఆగస్టు 15న ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నెల రోజులపాటు చేపట్టాల్సిన పనులపై మార్గనిర్దేశనం చేశారు. దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలను, ప్రత్యేకంగా కృష్ణ తులసి మొక్కలను నాటాలని సూచించారు. గ్రామాలను పరిశుభ్రంగా మార్చేందుకు సీఎం చేసిన సూచనలివీ.. వదిలేసిన గుంతలు, ఉపయోగించని, పాడుపడిన బావులను పూడ్చేయాలి. కూలిపోయిన ఇళ్లు, భవనాల శిథిలాలను తొలగించాలి మురికి కాల్వల్లో పేరుకుపోయిన పూడికను పూర్తిగా తీసి, అన్ని కాల్వలను పరిశుభ్రం చేయాలి. హా గ్రామంలోని అంతర్గత రహదారులపై గుంతలు పూడ్చాలి. గుంతల్లో మొరం పోయాలి. వర్షపు నీరు రహదారులపై నిల్వ ఉండకుండా చూడాలి దోమలు వ్యాప్తి చెందకుండా విరివిగా తులసి మొక్కలు, ప్రత్యేకంగా కృష్ణ తులసి మొక్కలు పెంచాలి. పిచ్చిమొక్కలను, సర్కారు తుమ్మలను, జిల్లేడు చెట్లను పూర్తిగా తొలగించాలి గ్రామంలో ఉత్పత్తి అయ్యే చెత్త ఎంతో నిర్ధారించాలి. చెత్తను వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండాలి. డంప్ యార్డు కోసం స్థలం సేకరించాలి గ్రామానికి ఒక శ్మశాన వాటిక కచ్చితంగా నిర్మించాలి. హా గ్రామాలకు నియమితులైన స్పెషల్ ఆఫీసర్లు గ్రామస్తులను చైతన్యపరిచి వారానికోసారి శ్రమదానం చేయించాలి. పచ్చదనం పెంచేందుకు చేసిన సూచనలివీ.. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీకి ఒకటి చొప్పు న మొత్తం 12,751 నర్సరీలను ఏర్పాటు చేయాలి గ్రామంలోని రైతులతో, ఇంటి యజమానులతో మాట్లాడి వారు ఎలాంటి మొక్కలు పెంచుతారో తెలుసుకుని దానికి అనుగుణంగా నర్సరీల్లో మొక్కలు పెంచాలి దోమలు, ఈగలు, ఇతర క్రిమికీటకాలు రాని మొక్కలు కూడా ఉన్నాయి. వాటిపట్ల ప్రజలకు అవగాహన కల్పించి, అలాంటి మొక్కలను అందుబాటులో ఉంచాలి. రైతులు పొలం గట్ల మీద, బావుల వద్ద మొక్కలు పెంచే విధంగా ప్రోత్సహించాలి. గ్రామ సమీపంలో ఏవైనా అడవులుంటే వాటిలోనూ మొక్కలు పెంచాలి. అన్ని విద్యాసంస్థల అధ్యాపకులతో సమావేశం నిర్వహించి ఆ సంస్థల ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటే విధంగా కృషి చేయాలి. ఈ విషయంలో జిల్లా విద్యాధికారులకు లేఖలు రాయాలి. ప్రత్యేకాధికారులు సేకరించాల్సిన వివరాలు గ్రామ పరిధిలో అన్ని రకాల రోడ్లు కలిపి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి. ప్రస్తుతం అవి ఎలాంటి స్థితిలో ఉన్నాయి? గ్రామ పరిధిలో మురికి కాల్వల పొడవు ఎంత? అవి ఏ పరిస్థితిలో ఉన్నాయి? గ్రామంలో శ్మశాన వాటిక ఉందా? ఉంటే నిర్వహణ సరిగా ఉందా? లేకుంటే స్థలాన్ని సేకరించాలి గ్రామంలో దోబీఘాట్ ఉందా? ఉంటే ఏ పరిస్థితిలో ఉంది. లేకుంటే ఏర్పాటు చేయాలి. గ్రామంలో విద్యుత్ వీధి దీపాల పరిస్థితి ఎలా ఉంది. అన్ని వీధుల్లో స్తంభాలున్నాయా? కామన్ డంప్ యార్డు ఉందా? ఉంటే ఎలా ఉంది? లేకుంటే స్థలం సేకరించాలి. పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది ఎంత మంది? వారికి జీతాలు ఎలా అందుతున్నాయి? -
గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి
భూపాలపల్లి రూరల్ : గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని సీనియర్ ఐఏఎస్ అధికారులు హరికృష్ణ, సీవీ రావులు అన్నారు. పట్టణంలోని వేశాలపల్లిలో షేర్వాల్ టెక్నాలజీతో నిర్మిస్తున్న డబుల్బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను వారు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుపేదలకు నీడనిచ్చే గొప్ప ఆలోచన డబుల్ బెడ్ రూం ఇళ్లని, పనులు వేగంగా కొనసాగడానికి కలెక్టర్ అమయ్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని ప్రశంసించారు. గ్రామపంచాయతీలను బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనతో రూపుదిద్దుకొని అంబేద్కర్ జయంతి నాటి నుంచి అమలులోకి వచ్చిన ప్రధానమంత్రి గ్రామ స్వరాజ్ అభియాన్ కార్యక్రమం క్రింద జిల్లాలో ఎంపికైన గ్రామాల్లో వంద శాతం ఎల్పీజీ గ్యాస్ సిలెండర్లు, రూ.125 విద్యుత్ కనెక్షన్ ఇప్పించడం, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన కార్యక్రమం ద్వారా పౌరలందరికీ బ్యాంక్ ఖాతాలను తెరిపించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ దుగ్యాల అమయ్‌కుమార్, ఆర్డీఓ వీరబ్రహ్మచారి, సీపీఓ కొమురయ్య, విద్యుత్ శాఖ ఎస్ఈ నరేష్, డీఎంహెచ్ఓ డాక్టర్ అప్పయ్య, ఎల్డీఎం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తోనే గ్రామాల అభివృద్ధి
మందమర్రిరూరల్ : కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ చెన్నూర్ నియోజక వర్గ ఇన్చార్జి సొత్కు సంజీవరావు అన్నారు. శుక్రవారం మండలంలోని తుర్కపల్లి, గుడిపెల్లి, వెంకటాపూర్ గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసి సమస్యలపై ప్రజాప్రతినిధులను నిలదీస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు అక్కల రమేశ్, నియోజక వర్గ ఓబీసీ చైర్మన్ గోళ్ల వీరయ్య, నాయకులు మేకల శ్రీనివాస్, కొప్పుల బాపు, షేక్ ఇబ్రహిం, శంకర్ గౌడ్, పైడి బానయ్య, ఉన్నారు. -
నగరాభివృద్ధికి ‘నుడా’
వినాయక్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): నిజామాబాద్ నగరాభివృద్ధిలో భాగంగా నిజామాబాద్ నగరాభివృద్ధి సంస్థ (నుడా) ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నుడా పరిధిలో నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న మొత్తం 61 గ్రామాలు ఉంటాయి. నుడా ఏర్పాటుకు మున్సిపల్ పరిపాలన శాఖ నుంచి ఉత్తర్వులు (జీఓనెం.271) జారీ అయ్యాయి. నుడాకు పాలకవర్గాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో నగరంతో పాటు నగర పరిసర గ్రామాల్లో అభివృద్ధి ఊపందుకోనుంది. ఈ నేపథ్యంలో నగర మున్సిపల్ కమిషనర్ జాన్ సాంసన్‌ను ‘సాక్షి’ ఇంటర్వూ్య చేసింది. నుడా ఏర్పాటుతో అభివృద్ధి ఎలా ఉండబోతోంది? కమిషనర్ : నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుతో నగరంతో పాటు నిజామాబాద్ చుట్టు పక్కల ఉన్న 61 గ్రామాల్లో అభివృద్ధి ఊపందుకుంటుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు అందాల్సి ఉంది. నుడా ఏర్పాటుతో ప్రణాళిక బద్ధమైన అభివృద్ధితో పాటు ఆయా గ్రామాల్లో భూముల ధరలు పెరిగుతాయి. నగర సుందరీకరణ, అభివృద్ధి పనులు ఊపందుకుంటాయి. నగరాభివృద్ధికి మంజూరైన నిధులతో చేపట్టబోయే పనులు ఎలా పూర్తి చేస్తారు? కమిషనర్ : నగరాభివృద్ధికి రూ.100 కోట్లు మంజూరయ్యాయి. వీటిని ప్రాధాన్యత క్రమంలో వినియోగిస్తాం. తొలుత రోడ్లు, అంతర్గత రోడ్ల పనులు చేపడతాం. తర్వాత డ్రెయిన్ల పనులు, అహ్మదీ బజార్ మాంస విక్రయ భవన సముదాయాల పనులు చేపడతాం. నిర్ణీత సమయంలో పనులు చేపట్టేందుకు అధికారులను సమన్వయ పరుస్తాం. పారిశుధ్య నిర్వహణకు తీసుకుంటున్న చర్యలు? కమిషనర్ : పారిశుధ్య నిర్వహణ మెరుగుపర్చడానికి సిబ్బంది గైర్హాజరు కాకుండా చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బందికి పూర్తి స్థాయిలో సేఫ్టీ మెటీరియల్ అందుబాటులో లేదు. పారిశుధ్య పరికరాలు, యూనిఫాం, షూస్, సేఫ్టీ మెటీరియల్ అందించడంపై దృష్టి సారిస్తున్నాం. సిబ్బంది సహకారంతో శానిటేషన్ మెరుగుపరుస్తాం. మున్సిపాలిటీలో సిబ్బంది కొరత ఉందా? కమిషనర్ : నగర పాలక సంస్థలో సిబ్బంది కొరత లేదు. మున్సిపాలిటీలో మొత్తం 720 మంది సిబ్బంది ఉన్నారు. వీరితో ప్రస్తుతం సేవలను కొనసాగిస్తున్నాం. అవసరమనుకుంటే సిబ్బందిని నియమిస్తాం. చెత్త సేకరణ వాహనాల కొరత ఉందా? కమిషనర్ : చెత్త సేకరణ వాహనాల కొనుగోలుకు రూ.8కోట్లు మంజూరయ్యాయి. చెత్త సేకరణకు అవసరమైన వాహనాల జాబితాను ప్రభుత్వానికి పంపించి కొనుగోలు చేస్తాం. పబ్లిక్ హెల్త్ శాఖకు బాధ్యతలు అప్పగించాం. శానిటరీ సిబ్బందిపై కొరడా ఝులిపిస్తున్నారు.. వేరే శాఖల అధికారులు బయోమెట్రిక్ చేసి వెళ్లిపోతున్నారనే ఆరోపణలున్నాయి? కమిషనర్ : ప్రభుత్వ ఆదేశాల మేరకే సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నాం. ఎవరు క్రమశిక్షణ అతిక్రమించినా చర్యలు తీసుకుంటాం. ఎంతటి వారైనా సక్రమంగా విధులు నిర్వర్తించాల్సిందే. బయోమెట్రిక్ చేసి విధుల్లో నుంచి వెళ్తే ఉపేక్షించం. అలాంటి వారిపై పకడ్బందీ చర్యలు తీసుకోవడంపై దృష్టి సారిస్తాం. యూజీడీ పనులు ఎప్పటి వరకు పూర్తి చేస్తారు? కమిషనర్ : యూజీడీ పనులు సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం. పనుల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు నగరాభివృద్ధికి సహకరించాలి. -
గ్రామాల అభివృద్ధితోనే దేశ పురోగతి
బళ్లారి అర్బన్ : గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగతి సాధిస్తుందని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ) వైస్ చాన్సిలర్ ఎంఎస్ సుభాష్ పేర్కొన్నారు. మంగళవా రం ఆయన బళ్లారి తాలూకాలోని హందిహాళ్ గ్రామంలో శివప్ప తాత మఠంలో వీఎస్కేయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వర్సిటీ నుంచి ప్రభుత్వానికి లేఖ రాసి హందిహాళ్ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చే స్తామని పేర్కొన్నారు. గ్రామంలోని లోటు పాట్లను సర్వే చేసి ప్రభుత్వ సహకారంతో యూనివర్శిటీ ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. పీఆర్ఏ, పీఎంఏ నేతృత్వంలో విసృ్తతంగా సమాచారాన్ని రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో హందీహాళ్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం జిల్లా పంచాయతీ సీఈఓ డాక్టర్ రాజేంద్ర కేవీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ యూనివర్శిటీ వారు గ్రామాన్ని దత్తత తీసుకోవడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో వీఎస్కేయూ ప్రొఫెసర్ టీఎం భాస్కర్, ప్రొఫెసర్ ఎస్ఏ పాటిల్, పీడబ్ల్యూడీ రిటైర్డ్ అధికారి వైఎల్ కృష్ణారెడ్డి, గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు శాంతమ్మ, డాక్టర్ గౌరీ, టీపీ ఉపాధ్యక్షుడు మల్లికార్జున, ఉపాధ్యక్షురాలు ప్రభావతి, మంజునాధ స్వామి, వెంకటేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.