గ్రామాల అభివృద్ధితోనే దేశ పురోగతి
Published Wed, Nov 23 2016 2:36 AM | Last Updated on Mon, Sep 4 2017 8:49 PM
బళ్లారి అర్బన్ : గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం పురోగతి సాధిస్తుందని విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం(వీఎస్కేయూ) వైస్ చాన్సిలర్ ఎంఎస్ సుభాష్ పేర్కొన్నారు. మంగళవా రం ఆయన బళ్లారి తాలూకాలోని హందిహాళ్ గ్రామంలో శివప్ప తాత మఠంలో వీఎస్‌కేయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామ దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. వర్సిటీ నుంచి ప్రభుత్వానికి లేఖ రాసి హందిహాళ్ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చే స్తామని పేర్కొన్నారు.
గ్రామంలోని లోటు పాట్లను సర్వే చేసి ప్రభుత్వ సహకారంతో యూనివర్శిటీ ద్వారా అభివృద్ధి చేస్తామన్నారు. పీఆర్‌ఏ, పీఎంఏ నేతృత్వంలో విసృ్తతంగా సమాచారాన్ని రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో హందీహాళ్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం జిల్లా పంచాయతీ సీఈఓ డాక్టర్ రాజేంద్ర కేవీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ యూనివర్శిటీ వారు గ్రామాన్ని దత్తత తీసుకోవడం హర్షణీయమన్నారు.
ఈ కార్యక్రమంలో వీఎస్‌కేయూ ప్రొఫెసర్ టీఎం భాస్కర్, ప్రొఫెసర్ ఎస్‌ఏ పాటిల్, పీడబ్ల్యూడీ రిటైర్డ్ అధికారి వైఎల్ కృష్ణారెడ్డి, గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు శాంతమ్మ, డాక్టర్ గౌరీ, టీపీ ఉపాధ్యక్షుడు మల్లికార్జున, ఉపాధ్యక్షురాలు ప్రభావతి, మంజునాధ స్వామి, వెంకటేష్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement