తెనాలి : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జెడ్పీ హైస్కూలు విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన విషయం సోషల్ మీడియాలో చూసి ఆశ్చర్యపోయాను. నమ్మశక్యం కాలేదు. అదొక్కటే కాదు, చాలా రంగాల్లో రాష్ట్రంలో పెనుమార్పులు జరిగాయని తెలిసి సంతోషమేసిందని ఆ్రస్టేలియాలోని నోట్రెడేమ్ యూనివర్సిటీకి సిడ్నీలోని స్కూల్ ఆఫ్ లా అండ్ బిజినెస్ ప్రొఫెసర్, డిపార్టుమెంట్ హెడ్‌గా చేస్తున్న తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు డాక్టర్ అత్తోట విద్యాసాగర్ అన్నారు. కొద్ది నెలల క్రితం తెనాలిని సందర్శించిన ఆయన సొంత ఊరిలో జరిగిన మార్పు గురించి ఆ్రస్టేలియా నుంచి ‘సాక్షి’తో పంచుకున్న సంతోషం ఆయన మాటల్లోనే...
నేను ఆ్రస్టేలియాలో ప్రొఫెసర్‌గా చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాల విద్యపై నాకు దీర్ఘకాలంగా అసంతృప్తి ఉండేది. గతంలో శిథిలమైన భవనాలు, అత్తెసరు చదువులు అన్నట్టుగా ఉండేది.
👉సొంతూరుకు ఏదైనా చేయాలని, 2015 నుంచి తెనాలిలో ఇంగ్లిష్ మీడియం స్కూల్ నిర్వహిస్తున్నా.
👉జనవరిలో తెనాలిని సందర్శించా. పట్టణం, సమీప గ్రామాల్లో పర్యటించాను.
👉వలంటీర్లు, సచివాలయ వ్యవస్థతో పరిపాలన ప్రజల ఇంటి ముంగిటకే వచ్చింది.
👉పట్టణ ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు ప్రగతికి చిహ్నాలుగా కనిపించాయి.
👉ముఖ్యంగా విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధికి నేను ఫిదా అయ్యాను.
Comments
Please login to add a commentAdd a comment