ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో రాజమౌళి దంపతులు! | SS Rajamouli Couple Visits A Temple In Karnataka's Bellary Goes Viral | Sakshi
Sakshi News home page

SS Rajamouli: ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన రాజమౌళి దంపతులు!

Published Thu, Feb 29 2024 11:22 AM | Last Updated on Thu, Feb 29 2024 11:33 AM

SS Rajamouli Couple Visits A Temple In Bellary In Karnataka goes Viral  - Sakshi

టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దంపతులు ఆలయంలో పూజలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని శ్రీ అమృతేశ్వరా ఆలయంలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి ప్రాజెక్ట్‌ కోసం టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సూపర్ స్టార్‌ మహేశ్ బాబుతో తదుపరి చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. దీంతో వీరిద్దరి కాంబోపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. SSMB29గా తెరకెక్కించనున్న ఈ మూవీ కోసం మహేశ్ బాబు జిమ్‌లో కసరత్తులు ప్రారంభించారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథను అందించారు. ఈ ఏడాదిలో షూటింగ్‌ ప్రారంభం అవుతుందని గతంలో రాజమౌళి ప్రకటించిన విషయం తెలిసిందే. 

మరోవైపు ఈ చిత్రం కోసం హాలీవుడ్‌ నటీనటులను రాజమౌళి తీసుకొస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇండోనేషియా నటి అయిన చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్‌తో పాటు  థోర్‌ సినిమాతో పాపులర్‌ అయిన క్రిస్ హెమ్స్‌వర్త్‌ SSMB29 ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని టాక్ వినిపించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మహారాజా' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఇండస్ట్రీలో ఒక వార్త అప్పట్లో తెగ వైరలైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement