టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఇటీవల వరుస మ్యూజింగ్స్ రిలీజ్ చేస్తున్నారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా జీవితంలో ఎలా నడుచుకోవాలో తన మాటల ద్వారా మోటివేట్ చేస్తున్నారు. తాజాగా ప్లే ఫూలిష్ అనే కాన్సెప్ట్‌తో మరో కొత్త మ్యూజింగ్‌ను విడుదల చేశారు. అదేంటో మీరు కూడా చూసేయండి.
పూరి మ్యూజింగ్స్‌లో మాట్లాడుతూ.. 'ది ఆర్ట్ ఆఫ్ ప్లేయింగ్ ఫూలిష్.. ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ అవ్వడానికి చాలామంది సైకాలజిస్టులు చెప్పే థియరీ ప్లే ఫూలిష్.. అది నీ బిజినెస్, జాబ్‌లో చాలామంది పోటీదారులు, సీనియర్స్, అనుభవజ్ఞులు ఉంటారు. నీకంటే బాగా సక్సెస్ అయినవాళ్లు ఉంటారు. వాళ్లందరినీ స్మూత్‌గా డీల్ చేసే థియరీ ప్లే ఫూలిష్. అంటే నిజంగానే ఫూల్‌లా ఉండటం కాదు. వాళ్ల ముందు తక్కువ నాలెడ్జ్ వాళ్లలా కనిపించడం. ఈ స్ట్రాటజీ మీరింకా నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అవతలి వ్యక్తి చెప్పే మాటలు వినటం నేర్చుకుంటే మనం ఎంత మాట్లాడాలి? ఎప్పుడు మాట్లాడాలి? అనే విషయాలు అర్థమవుతాయి. నీ పోటీదారులను ఎప్పుడు శత్రువులుగా చూడొద్దు. వారిని మెంటార్స్‌గా భావించండి. అతను, నువ్వు ఓకే బిజినెస్ చేస్తున్నా.. అతనికంటే నీకు తక్కువ తెలుసనే ఫీలింగ్ రావాలి' అని సూచించారు.
ఇదేమీ మానిపులేటేడ్ టాక్టిక్ కాదు.. వాదించడం మానేసి.. జీనియస్‌గా వ్యవహరించడం.. నువ్వు తక్కువ నాలెడ్జ్ వాడిలా కనిపించినప్పుడు.. అవతలివాళ్లు నిన్ను ఇబ్బందిగా భావించరు. నీపై ఫోకస్ పెట్టరు. నీకు తెలిసినా సరే బేసిక్స్ చెప్పమని అడగండి. అలా అడిగితేనే అవతలివాళ్లు ఆనందంగా సమాధానం చెబుతారు. వాళ్లు ఏమనుకుంటున్నారో వినాలి.. అప్పుడే ఎక్కువ నేర్చుకుంటాం. నీవల్ల వాళ్లకి ఇబ్బంది లేదని ఫీలవ్వాలి. అప్పుడే వాళ్ల స్ట్రాటజీలు మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పోటీ ప్రపంచంలో చర్చలు జరపాలంటే నాలెడ్జ్ చాలా అవసరం. అది నీ సీనియర్స్, పోటీదారుల నుంచి నేర్చుకుంటే అంతకంటే కావాల్సింది ఏముంది? వాళ్ల స్కిల్స్ ఏంటో మీకు అర్థమవుతాయి. అందుకే మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఎవరైనా చెబితే నేర్చుకుంటా అనేలా ఉండాలి. నీకే ఎక్కువ తెలిసినట్లు మాట్లాడితే.. అవతలి వ్యక్తి ఏది నీతో షేర్ చేసుకోడు. పైగా నువ్వు వాడి దృష్టిలో అహంకారిగా కనిపిస్తావు. అందరితో శత్రుత్వం మనకెందుకు? మీరు ఏదైనా అనుకుంటే అందులో సూచనలు చేయమని అడుగుతూ ఉంటే మంచిది. వాళ్లు మీ జీవితంలో సపోర్టింగ్ పర్సన్ అవుతాం. సోక్రటీస్ ఒకమాట చెప్పాడు. 'నాకు తెలిసింది ఏంటంటే.. ఏమీ తెలియదని'. మనం కూడా అదే ఫాలో అవ్వాలి. ఎప్పుడూ బిగినర్స్ మైండ్ సెట్‌తోనే ఉండాలి. అబ్రహాం లింకన్ ఇలాగే ఉండేవాడట. ఎదుటి వాడి జ్ఞానాన్ని తక్కువ అంచనా వేయొద్దు. మీకు ఎన్నో స్ట్రాటజీలు అర్థమవుతాయి. ప్లే ఫూలిష్ పవర్‌ఫుల్. ఈ ఆర్ట్‌లో మాస్టర్ అయితే మీరు లీడర్‌గా మంచి పొజిషన్‌లో ఉంటారు' అని చెప్పారు.
కాగా.. ఈ ఏడాది డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. రామ్ పోతినేని, కావ్యథాపర్ జంటగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రాన్ని ఛార్మి కౌర్, పూరి జగన్నాధ్ నిర్మించారు.
Comments
Please login to add a commentAdd a comment