రతన్ టాటా..రతనాల మాటలు
ఢిల్లీ : బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా యావత్ భారతం ఘన నివాళులర్పిస్తుండగా.. రతన్ టాటా పలు సందర్భాలలో జీవితాల్ని మార్చేసే స్పూర్తిదాయకమైన ప్రసంగాల్ని గుర్తు చేసుకుంటున్నారు. 👉‘జీవితంలో విజయం సాధించాలంటే ఒడిదొడుకులు ఉండటం చాలా ముఖ్యం. ఈసీజీలో సరళ రేఖ ఉన్నదంటే ప్రాణం లేదనే అర్థం’👉కేవలం భౌతిక విషయాలతోనే జీవితం ముడిపడిలేదని ప్రతివాళ్లూ ఎప్పుడో ఒకప్పుడు గ్రహిస్తారు. మనం ప్రేమించే వారిని ఆనందంగా ఉంచడంలోనే మన సంతోషమూ ఉంది.👉తన కోసం పని చేస్తున్న వారి మేలు కోరే వాడే ఉత్తమ నాయకుడు👉వృత్తిని – జీవితాన్ని సమతులం చేయడంపై నాకు నమ్మకంలేదు. వృత్తిని – జీవితాన్ని మమేకం చేయాలి. మీ వృత్తిని, జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దుకోవాలి.👉ఏ ఇబ్బందినీ స్వీకరించకపోవడమే పెద్ద ప్రమాదం. అతి వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఏ సవాల్నూ స్వీకరించ లేకపోతే అపజయం తప్పదు.👉ఎన్ని కష్టాలనైనా పట్టుదలతో ఎదుర్కోండి. అవే మీ విజయానికి పునాది రాళ్లు👉ఎదుటివాళ్ల దయా గుణాన్ని, ప్రేమను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకండి👉మీ జీవితం సాఫీగా ఉండకపోవచ్చు. సమాజంలోని సమస్యలను పరిష్కరించ లేకపోవచ్చు. అలాగని సమాజంలో మీ ప్రాముఖ్యాన్ని తక్కువగా అంచనావేయొద్దు. ధైర్యం, నమ్మకం మనకో దారి చూపిస్తాయి.👉అవకాశాల కోసం ఎదురు చూడకూడదు. అవకాశాల్ని సృష్టించుకోవాలి.👉నాయకత్వమంటే బాధ్యత తీసుకోవడం👉సరైన నిర్ణయాలు తీసుకోవడంపై నాకు దృష్టి లేదు. నిర్ణయం తీసుకొని దానిని విజయవంతం చేయడమే నా పని.👉విజయం అనేది నీవు చేపట్టిన పదవిపై ఆధారపడి ఉండదు. నీవు ఇతరులను ఎంతగా ప్రభావితం చేస్తున్నావన్న దానిపై ఆధారపడి ఉంటుంది.