పవిత్రమైన బంధాల్లో గురుశిష్యుల బంధం ఒకటి. అయితే అతిజుగుప్సాకరమైన పనులతో దాని పవిత్రతను దెబ్బ తీస్తున్నవాళ్లను తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ మహిళా ప్రొఫెసర్‌కు సంబంధించిన ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌ను కుదిపేస్తోంది. తన స్టూడెంట్‌నే ఆమె వివాహం చేసుకున్న వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది..
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాకు 150 కిలోమీటర్ల దూరంలో నదియాలో ఉంది హరిన్ఘటా టెక్నాలజీ కాలేజీ. ఈ కాలేజీ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ పరిధికి వస్తుంది. ఈ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేసే పాయల్ బెనర్జీ.. తన స్టూడెంట్ను వివాహమాడింది. ఆమె నుదుట ఆ విద్యార్థి కుంకుమ దిద్దడం దగ్గరి నుంచి.. దండలు మార్చుకోవడం, ఏడగుడులు వేయడం ఇలా అన్నీ సంప్రదాయ పద్ధతిలో క్లాస్‌రూంలోనే జరిగిపోయాయి. పైగా హల్దీ వేడుకలను కూడా విద్యార్థుల మధ్య కోలాహలంగా నిర్వహించారు.
మొత్తానికి ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు కాస్త వైరల్ కావడంతో.. ఆమె పాపులర్ అయిపోయారు. సరదా కామెంట్లతో పాటు సీరియస్‌గా విమర్శలు వినిపించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విచారణ చేపట్టారు. అయితే.. ఇక్కడే ప్రొఫెసర్ పాయల్ పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.
VIDEO Credits: HornbillTV
అది నిజం వివాహం కాదని, సరదా కోసం చేసిన ప్రయత్నమని చెబుతున్నారు. పాయల్ ఓ సైకాలజీ ప్రొఫెసర్. సైకలాజికల్ డ్రామాలో భాగంగా అలాంటి క్లాస్‌ను నిర్వహించాల్సి వచ్చిందని సమర్థించుకున్నారు. తానంటే గిట్టని వాళ్లు ఆ వీడియోను బయటపెట్టారని ఆమె మండిపడ్డారు. అయినప్పటికీ అధికారులు మాత్రం ఆమె వివరణతో సంతృప్తి చెందలేదు.
ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి నివేదిక వచ్చేదాకా ఆమెను సెలవుల్లో పంపారు. మరోపక్క.. ఈ ఘటనపై స్పందించేందుకు విద్యార్థులెవరూ సుముఖత చూపించకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment