
హైదరాబాద్, సాక్షి: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. సైబరాబాద్ కంట్రోల్ రూంకు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బాంబు ఉందని సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన తర్వాత అదొక ఫేక్ కాల్‌గా తేల్చారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మరోవైపు.. ఈ మధ్యకాలంలో నగరంలోని స్కూళ్లకు సైతం ఇదే తరహాలో మెయిల్స్ బెదిరింపులు వస్తుండడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment