bomb threat call
-
ఆర్బీఐ ఆఫీసుకు బాంబు బెదిరింపు.. పోలీసులు అలర్ట్
ఢిల్లీ: దేశంలో బాంబు బెదిరింపుల కాల్స్, మెయిల్స్ తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సైతం ఇలాంటి బెదిరింపులు రావడం ఆందోళన కలిగించింది. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ బెదిరింపు రావడం కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. ముంబైలోని ఆర్బీఐ కార్యాలయాన్ని పేలుడు పదార్థాలతో పేల్చేస్తామంటూ శుక్రవారం ఓ మెయిల్ వచ్చింది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధికారిక ఈ-మెయిల్ ఐడీకి ఈ బెదిరింపు రావడం గమనార్హం. అయితే, సదరు మెయిల్లో బెదిరింపులు రష్యన్ భాషలో వచ్చినట్లు పోలీసులు తెలిపారు.దీంతో, వెంటనే అప్రమత్తమైన ముంబై పోలీసులు ఆర్బీఐ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ మేరకు ఘటనపై పలు సెక్షన్ల కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మెయిల్ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.ఇక, ఇటీవలి కాలంలో బెదిరింపు కాల్స్, మెయిల్స్ సంఖ్యలో పెరిగింది. ఇవాళ ఉదయం ఢిల్లీలోని దాదాపు 16 పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. గడిచిన నాలుగు రోజుల్లోనే ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది రెండో సారి. మరోవైపు.. పలు విమాన సర్వీసులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది బాంబు బెదిరింపుల సంఖ్య ఏకంగా 900పైగానే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. Mumbai | A threatening email was received on the official website of Reserve Bank of India. The email was in Russian language, warned to blow up the bank. A case has been registered against unknown accused in Mata Ramabai Marg (MRA Marg) police station. Investigation into the…— ANI (@ANI) December 13, 2024 -
తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. రంగంలోని బాంబ్ స్క్వాడ్
ఆగ్రా: దేశంలోని ప్రముఖ పర్యాటక స్థలం తాజ్ మహల్‌కు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. బాంబు బెదిరింపు నేపథ్యంలో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర బృందాలతో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. అనంతరం, బాంబు బెదిరింపు ఫేక్ అని అధికారులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. ఆగ్రాలోని తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని ఉత్తర్‌ప్రదేశ్ టూరిజం ప్రాంతీయ కార్యాలయానికి మంగళవారం ఉదయం ఈ-మెయిల్ వచ్చింది. ఈ క్రమంలో పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. సమాచారం అందిన వెంటనే.. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇతర బృందాలతో పోలీసుల ముమ్మర తనిఖీలు చేపట్టారు. తాజ్‌మహల్ వద్ద సోదాల అనంతరం.. అక్కడ అనుమానాస్పదంగా ఏమీ కనిపించకపోవడంతో అది ఫేక్ మెయిల్ అని పోలీసులు వెల్లడించారు. ఈ బెదిరింపులకు పాల్పడింది ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. Uttar Pradesh | Taj Mahal in Agra received a bomb threat via email todayACP Taj Security Syed Areeb Ahmed says, "Tourism department received the email. Based on that, a case is being registered at Tajganj police station. Further investigation is being done..."(Pics: ACP Taj… pic.twitter.com/1lw3E34dOM— ANI (@ANI) December 3, 2024 -
హైదరాబాద్ లో అలెర్ట్.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు
-
శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది విమానాల్లో తనిఖీలు చేపట్టారు.శంషాబాద్ విమానాశ్రయంలో పలు విమానాల్లో బాంబు ఉన్నాయని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. విమానాశ్రయంలో ఉన్న ఇండిగో, ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ వర్గాలు, సిబ్బంది అప్రమత్తమయ్యాయి. విమానాల్లో సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.ఇదిలా ఉండగా.. గత కొద్ది రోజులుగా పలు విమానాలకు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే. బాంబుల బెదిరింపుల బెడద ఎక్కువ కావడంతో దీనిపై కేంద్రం దృష్టి సారించింది. ఇప్పటికీ వస్తున్న ఫేక్ బాంబు బెదిరింపులపై కేంద్రం దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. -
తిరుపతి: హోటళ్లకు ఆగని బాంబు బెదిరింపులు
సాక్షి,తిరుపతి: పుణ్యక్షేత్రం తిరుపతిలోని ప్రధాన హోటళ్లకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. మరోపక్క బాంబు బెదిరింపులకు సంబంధించి ఫేక్ మెయిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ప్రాక్సీ సర్వర్‌ను ఉపయోగించి ఫేక్‌మెయిల్స్ పంపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఫేక్మెయిల్స్పై ఎన్ఐఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. తిరుపతిలోని ఏడు హోటల్స్‌తో పాటు రెండు ఆలయాలకు జాఫర్‌సాదిక్ పేరుతో బాంబు బెదిరింపు ఫేక్‌మెయిల్స్ వచ్చినట్లు ప్రాథమికంగా తేల్చారు. మరోవైపు ఇటీవల దేశవ్యాప్తంగా విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్,మెయిళ్లు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిపై విమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. విమానాలకు బెదిరింపు మెయిళ్లు పంపిస్తే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించింది.ఇదీ చదవండి: హత్యకు యత్నం.. పీఎస్‌కు వెళితే అక్కడా దాడి -
తిరుపతిలో హోటల్సు కు బాంబు బెదిరింపు..
-
వారంలో 100కుపైగా బెదిరింపులు.. ‘నో-ఫ్లై లిస్ట్‌లో చేరుస్తాం’
విమానాల్లో బాంబు ఉందంటు తప్పుడు సమాచారం అందించి పట్టుబడిన వారిని ‘నో ఫ్లై లిస్ట్’లో పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్)గా పరిగణిస్తుందన్నారు. గత వారం రోజులుగా పలు విమానాల్లో దాదాపు 100కుపైగా బాంబు బెదిరింపులు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా పరిగణించింది.ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ..‘బాంబు బెదిరింపు చర్యల వల్ల విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌క్రాఫ్ట్ రాకపోకలు తాత్కాలికంగా కొన్నిచోట్ల నిలిపేశారు. మరికొన్ని ప్రాంతాల్లో చాలా ఆలస్యంగా నడిచాయి. విమానాశ్రయ భద్రతా సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ పరిణామాలకు కారణమవుతున్న వారిపట్ల ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. వీరిని ‘నో ఫ్లైలిస్ట్’(ఎలాంటి కమర్షియల్ విమానాల్లో ప్రయాణించకుండా నిరోధించడం)లో చేరుస్తాం. ఈ నేరాన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్-క్రిమినల్ కేసు)గా పరిగణిస్తాం’ అని చెప్పారు.సమాచారం అందిన వెంటనే ఏం చేస్తారంటే..బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలోని బాంబు బెదిరింపు అంచనా కమిటీ (బీటీఏసీ) అత్యవసర సమావేశం అవుతుంది. బీటీఏసీలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), సంబంధిత విమానయాన సంస్థ, విమానాశ్రయ నిర్వాహకులు సభ్యులుగా ఉంటారు. విమానంలో బాంబు ఉందని అందిన సమాచారం మేరకు ఈ కమిటీ ముప్పును ‘నిర్దిష్ట’, ‘నాన్-స్పెసిఫిక్(అస్పష్టమైన)’ అనే రెండు విధాలుగా వర్గీకరిస్తుంది. నిర్దిష్ట ముప్పులో ఫ్లైట్ నంబర్, తేదీ, బయలుదేరే సమయం, ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన సమయం..వంటి నిర్దిష్ట సమాచారంతో బెదిరింపులు వస్తాయి. దాంతో కమిటీ వెంటనే సదరు పైలట్లను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని సంప్రదించమని కోరతారు. తదుపరి చర్యల కోసం గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటారు. ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!నాన్-స్పెసిఫిక్ థ్రెట్ విషయంలో ఎయిర్‌లైన్, ఫ్లైట్ నంబర్, తేదీ, షెడ్యూల్ సమయం స్పష్టంగా తెలియజేయరు. టేకాఫ్ అయిన కాసేపటికే బెదిరింపు వస్తే తిరిగి విమానం బయలుదేరిన ఎయిర్‌పోర్ట్‌కు రమ్మని పైలట్‌కు చెబుతారు. లేదా అప్పటికే చాలా దూరం ప్రయాణం చేస్తే దగ్గర్లోని ఎయిర్‌పోర్ట్‌లో జనావాసం ఎక్కువగా లేని బే(విమానాలు నిలిసే ప్రదేశం)కు రప్పిస్తారు. వెంటనే ప్యాసింజర్లను వేరేచోటుకు మారుస్తారు. బ్యాగేజీ, కార్గో, క్యాటరింగ్ మెటీరియల్ స్కాన్ చేస్తూ షిఫ్ట్ చేస్తారు. బాంబు స్వ్కాడ్, స్కానర్ల సాయంతో విమానాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకుంటే విమానాన్ని తిరిగి ఆపరేట్ చేస్తారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులుంటే మాత్రం భద్రతా సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతారు. -
మరో 2 విమానాలకు బాంబు బెదిరింపులు.. 3 రోజుల్లో 12 ఘటనలు
దేశంలో పలు విమానాలకు బాంబు బెదిరింపు ఘటనలు ఎక్కువయ్యాయి. గత మూడు రోజుల్లో అనేక విమానాలకు బాంబు బెదరింపు కాల్స్ రావడం తీవ్ర కలకలం రేపుతోంది. మంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చినన విషయం తెలిసిందే. మొత్తం గత 72 గంటల్లో 12 విమానాలకు ఈ బెదిరింపులు వచ్చాయి.తాజాగా బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్, ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు.ఆకాశా ఎయిర్‌లైన్ సంస్థకు చెందిన QP 1335 విమానం 184 మంది ప్రయాణికులు, సిబ్బందితో బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరుకు బయల్దేరింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 2 గంటలకు సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానంలో అధికారులు తనిఖీలు చేపట్టారు.అదే విధంగా ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. 6E 651 విమానం దాదాపు 200 మంది ప్రయాణికులు, సిబ్బందితో ముంబై నుంచి బయల్దేరగా.. సోషల్ మీడియా ద్వారా బెదిరింపు అలర్ట్ వచ్చింది. దీంతో పైలట్ విమానాన్ని అహ్మదాబాద్‌కు మళ్లించారు. అక్కడ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు ఇండిగో ప్రతినిధి ఒకరు తెలిపారు. అనంతరం విమానంలో తనిఖీలు చేపట్టగా బెదిరింపు కాల్స్ బూటకమని తేలింది.48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులుమంగళవారం ఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్ విమానం, సిలిగురి-బెంగళూరు అకాశ ఎయిర్ విమానం, అలయన్స్ ఎయిర్ అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సహా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.సోమవారం రెండు ఇండిగో, ఎయిరిండియా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులతో కలిసి బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను కనిపెట్టడానికి పని చేస్తోంది. -
ఎయిరిండియా విమానంలో బాంబు?
ఎయిరిండియా విమానంలో బాంబు ఉందని బెదిరింపు సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తం అయ్యారు. ముంబై నుంచి న్యూయార్క్‌కు వెళ్లే ఎయిరిండియా ఇండియా విమానాన్ని వెంటనే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించారు. అప్పటికే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ పోలీసులు అవసరమైన భద్రతా చర్యలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ముంబై నుంచి న్యూయార్క్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు సమాచారం అందింది. అప్పటికే విమానం టేకాఫ్ అవ్వడంతో పైలట్‌కు సమాచారం అందించి వెంటనే విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఐజీఐ)కు మళ్లించాం. అప్పటికే ఎయిర్‌పోర్ట్‌లో అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్ సదుపాయాలు ఏర్పాటు చేశాం. విమానం ఎయిర్పోర్ట్ చేరిన వెంటనే ప్యాసింజర్లను సురక్షితంగా వేరేచోటుకు చేరవేశాం. భద్రతా సిబ్బంది విమానంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే ఈ బాంబు బెదిరింపు సమాచారం ఎవరు పంపారు..ఎక్కడి నుంచి తమకు సమాచారం వచ్చిందో మాత్రం ఇంకా తెలియరాలేదు.ఇదీ చదవండి: ఇంట్లో ఎంత బంగారం ఉండాలంటే..ఇటీవల తిరుచిరాపల్లి నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిరిండియా విమానంతో సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో టేకాఫ్ అయిన విమానం వీల్స్ లోపలికి ముడుచుకోలేదు. హైడ్రాలిక్స్ సమస్య కారణంగా ఇలా జరిగినట్లు తెలిసింది. వెంటనే పైలట్ గ్రౌండ్ సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు రెండు గంటలు గాల్లో ఉన్న విమానాన్ని సురక్షితంగా తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేసి చర్యలు చేపట్టారు. -
ఢిల్లీ-వైజాగ్ విమానానికి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: ఢిల్లీ-విశాఖపట్నం ఎయిర్ఇండియా విమానానికి మంగళవారం(సెప్టెంబర్3) అర్ధరాత్రి బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ వచ్చింది. అయితే ఈ బెదిరింపు ఆకతాయిలు చేసిన పనిగా అధికారులు తేల్చారు. విమానంలో బాంబు ఉందని తొలుత ఢిల్లీ పోలీసులకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో వారు తమను అప్రమత్తం చేసినట్లు వైజాగ్ విమానాశ్రయ అధికారులు తెలిపారు. 107 మందితో ప్రయాణించిన విమానం విశాఖపట్నంలో షెడ్యూల్ ప్రకారం ల్యాండ్ అయింది.విమానం ల్యాండ్ అయి ప్రయాణికులందరు దిగిన తర్వాత తనిఖీలు నిర్వహించామని, అందులో పేలుడు పదార్ధాలేవీ లేవన్నారు. తనిఖీలు పూర్తయిన తర్వాత విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లిపోయింది. -
Delhi: దుబాయ్- ఢిల్లీ ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు..
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపు ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెకాఫ్‌కు రెడీగా ఉన్న దుబాయ్ విమానంలో బాంబు ఉందంటూ మెయిల్ వచ్చింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు.ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరాగాంధీ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడం కలకలం సృష్టించింది. కాగా, సోమవారం ఉదయం 9:35 గంటల సమయంలో దుబాయ్‌కి వెళ్లేందుకు విమానం ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్‌లో సిద్ధంగా ఉంది. కాసేపట్లో టేకాఫ్ అవుతుందనంగ.. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ ఆఫీస్, ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌కి విమానంలో బాంబు ఉందంటూ కొందరు వ్యక్తులు బెదిరింపు మెయిల్ పంపారు అని మంగళవారం తెలిపారు. On 17th June at 9:35 am an email was received in DIAL (Delhi International Airport Limited) office, IGI Airport with the threat of a bomb inside a Delhi to Dubai flight. Accordingly necessary legal action has been taken and nothing suspicious was found: Delhi Police— ANI (@ANI) June 18, 2024 ఇక, బెదిరింపు మెయిల్‌తో ప్రొటోకాల్ ప్రకారం.. విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లు చెప్పారు. అయితే, తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ కనిపించలేదని వెల్లడించారు. అది బూటకపు మెయిల్ అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇదే జూన్ నెలలో ఢిల్లీ నుంచి కెనడా వెళ్తున్న ఎయిర్ కెనడా విమానానికి కూడా బాంబు బెదిరింపు బెయిల్ వచ్చింది. అది కూడా ఫేక్ అని తేలింది. ఈ ఘటనలో ఫేక్ మెయిల్ పంపిన వ్యక్తిని యూపీకి చెందిన మైనర్‌గా గుర్తించారు. అనంతరం, కౌన్సిలింగ్ ఇచ్చారు. -
ప్రజాభవన్‌కు బాంబు బెదిరింపు కాల్.. నిందితుడు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ప్రజా భవన్ బాంబ్ బెదిరింపు కేసులో హైదరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. 24 గంటలోనే నిందితుడిని అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు. నిందితుడిని గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు.కాగా మంగళవారం ఉదయం ప్రజాభవన్‌లో, నాంపల్లి కోర్టులో బాంబ్ పెట్టినట్లు కంట్రోల్ రూమ్‌కు ఫోన్‌చేసిన రామకృష్ణ.. అధికారును కంగారు పెట్టించాడు. అయితే రామకృష్ణ భార్యతో గొడవ పడి మధ్యనికి బానిసగా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య దూరం అవ్వడంతో ఆమె లేదని బాధలో ఫోన్ చేసినట్లు పోలీసులు తేల్చారు.అసలేం జరిగిందంటే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్ లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసిపి మనోహర్ కుమార్ సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు.ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా భట్టి విక్రమార్క కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.ఆ తర్వాత ప్రజాభవన్ లో ఉన్న అమ్మవారి ఆలయం లో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో దాదాపు మూడు గంటలపాటు తనిఖీలు సాగాయి. అనంతరం ఫేక్ కాల్‌గా తేలడంతో ప్రజాభవన్ నుంచిబాంబ్ స్క్వాడ్ ,డాగ్ స్క్వాడ్ సిబ్బంది.. ప్రజాభవన్ నుంచి బయటకు వచ్చారు. -
ప్రజా భవన్లో ముగిసిన తనిఖీలు..
హైదరాబాద్, సాక్షి: ప్రజా భవన్లో తనిఖీలు ముగిశాయి. మూడు గంటల పాటు అన్ని సముదాయాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. మంత్రి సీతక్క ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సముదాయాలతో పాటు గార్డెనింగ్ జిమ్ స్విమ్మింగ్ పూల్ సెక్యూరిటీ ప్లేసెస్ అన్ని ప్రాంతాలను పరిశీలించారు. తనిఖీలు ముగియడంతో ప్రజాభవన్ నుంచిబాంబ్ స్క్వాడ్ ,డాగ్ స్క్వాడ్ సిబ్బంది.. బయటకు వచ్చారు. అసలేం జరిగిందంటే.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కుటుంబం నివాసం ఉంటున్న ప్రజా భవన్ లో బాంబు ఉన్నట్లు అజ్ఞాత వ్యక్తి 100కు డయల్ చేసి చెప్పడంతో రాష్ట్ర పోలీస్ శాఖ వెంటనే అప్రమత్తమయింది. ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ పోలీస్ అధికారులను రంగంలోకి దింపింది. హుటాహుటిన బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ కు చేరుకొని అడుగడుగున తనిఖీలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పంజాగుట్ట ఏసిపి మనోహర్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి తన సిబ్బందితో చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి నివాసం లోపల ఉన్న అన్ని గదులను, బెడ్రూమ్స్, కిచెన్, డైనింగ్ హాల్, విజిటర్ హాల్స్, ఉప ముఖ్యమంత్రి ఛాంబర్, జిమ్, గార్డెన్, పరిసర ప్రాంతాలను అణువణువునా డాగ్ స్క్వాడ్ బృందం పోలీసులు తనిఖీలు చేశారు. అదేవిధంగా భట్టి విక్రమార్క గారి కాన్వాయ్, కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను పోలీసులు క్షున్నంగా పరిశీలించారు. ఆ తర్వాత ప్రజాభవన్ లో ఉన్న అమ్మవారి ఆలయం లో తనిఖీలు చేశారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు సాగాయిప్రజాభవన్లో బాంబు ఉన్నట్లు ఫోన్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషణ మొదలుపెట్టారు. సెల్‌ఫోన్ సిగ్నలింగ్ ఆధారంగా కనిపెట్టే పనిలో పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తున్నది. ఫోన్ చేసిన వ్యక్తి ఆకతాయి లేక కావాలని ఉద్దేశపూర్వకంగానే ఫోన్ చేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాభవన్ లో బాంబు ఉందని ఫోన్ రావడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ విషయం ప్రచారం మాధ్యమాలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం రేగింది. -
ఢిల్లీలో 100 స్కూళ్లకు బాంబు బెదింపులు.. స్పందించిన ఎల్జీ
ఢిల్లీ: ఢిల్లీ రాజధాని పరిధిలో బుధవారం 100 స్కూళ్లకు వచ్చిన బాంబు బెదిరింపుల ఘటనపై ఢిల్లీ ఎల్జీ వీకే సక్సేనా స్పందించారు. బాంబు బెదిరింపుకు సంబంధించి వచ్చిన ఈ మెయిల్స్‌ను పోలీసులు ట్రేస్ చేసినట్లు వెల్లడించారు. ఈ విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రజలకు హామీ ఇస్తున్నామని ఎల్జీ తెలిపారు.కేంద్ర హోం శాఖ స్పందన..ఢిల్లీ స్కూళ్ల బాంబు మెయిల్ బెదిరింపు ఘటనపై కేంద్ర హోంశాఖ స్పందించింది. పాఠశాలలకు వచ్చినవి నకిలీ బెదిరింపు మెయిల్స్ అని స్పష్టం చేసింది. పలు పాఠశాలలను ఢిల్లీ పోలీసులు తనిఖీ చేశారని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను స్కూళ్ల యాజమాన్యాలు మూసివేసినట్ల తెలిపారు.అంతకంటే ముందు.. బాంబు బెదిరింపులై ఢిల్లీ మంత్రి అతిశీ స్పందించారు. ‘ఇవాళ ఉదయం కొన్ని స్కూళ్లులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు విద్యార్థులను స్కూళ్ల నుంచి ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. అయితే పాఠశాలల్లో ఎటువంటి బాంబు లేవని పోలీసులు గుర్తించారు. మేము స్కూళ్లు, పోలీసులతో టచ్‌లో ఉన్నాం. పిల్లల తల్లిదండ్రులు, పాఠశాలల అధికారులు ఆందోళన పడొద్దు. స్కూళ్ల అధికారులు కూడా తల్లిదండ్రులకు టచ్‌లో ఉన్నారు’ అని మంత్రి అతిశీ ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.Some schools have received bomb threats today morning. Students have been evacuated and those premises are being searched by Delhi Police. So far nothing has been found in any of the schools.We are in constant touch with the Police and the schools. Would request parents and…— Atishi (@AtishiAAP) May 1, 2024దేశ రాజధాని పరిధిలో బుధవారం ఉదయం ఒక్కసారిగా అలజడి రేగింది. పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే పిల్లలను బయటకు పంపించి తనీఖలు చేపట్టింది. మరో వైపు ఈ సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆందోళనతో స్కూళ్ల వద్దకు చేరుకున్నారు.ఇప్పటివరకు 100 పాఠశాలల్లో బాంబు ఉన్నట్లు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్, ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చాణిక్య పురిలోని సంస్కృతి స్కూల్, అమిటి సాకేత్ స్కూల్, నోయిడాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన బాంబ్ స్క్వార్డ్స్, పోలీసులు స్కూల్స్‌కు వద్దకు చేరుకొని వాటి ఖాళీ చేయించి తనిఖీలు చేశారు. అయితే ఇప్పటి వరకు తనిఖీలు చేసిన పాఠశాలల్లో ఎలాంటి బాంబు లేవని, వచ్చింది నకిలీ బాంబు మెయిల్‌గా పోలీసులు గుర్తించారు. బయట దేశం నుంచి వీపీఎన్ మోడ్‌లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాంబు బెందిరింపుల నేపథ్యంలో స్కూల్స్ నుంచి విద్యార్థులను తల్లిదండ్రులు ఇళ్లకు తీసుకెళ్లారు. బాంబు బెదిరింపు ఈ మెయిల్స్‌పై ఢిల్లీ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరు చోట్ల బాంబులు పెట్టాం.. ముంబైకి బాంబు బెదిరింపు కాల్
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పలుచోట్ల బాంబులు పెట్టామని ఫోన్ కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. వివరాల ప్రకారం.. ముంబై నగరానికి మరోసారి బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం ఉదయం ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోన్ చేశాడు. ఈ సందర్భంగా ముంబైలోని ఆరు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు సదరు వ్యక్తి బెదిరించాడు. దీంతో పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు, ఫోన్ చేసిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ట్రాఫిక్ పోలీస్ హెల్ప్‌లైన్‌కు చెందిన వాట్సప్ నంబరుకు ఈ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక, అంతకుముందు కూడా ముంబైకి బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. అనంతరం, పోలీసుల దర్యాప్తులో భాగంగా అవన్నీ నకిలీవేనని తేలింది. -
బాంబు బెదిరింపులు.. ముంబై హైఅలర్ట్
ముంబై ప్రజలు న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ బాంబు పేలుళ్లకు సంబంధించిన బెదిరింపులతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. ముంబైలోని పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడుతామంటూ శనివారం సాయత్రం 6 గంటలకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ‘ముంబైలో బాంబు పేలుళ్లు ఉంటాయి’ అని గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే వెంటనే స్పందిన పోలీసులు పలు చోట్ల తనిఖీలు నిర్వహించగా.. ఎటువంటి అనుమానాస్పద పరిస్థితులు తమ దృష్టికి రాలేదన్నారు. అయితే ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని ఆ కాల్‌ను ట్రేస్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసులు అప్రమత్తమై నగరం మొత్తం హైఅలర్ట్ ప్రకటించి సెక్యూరిటీ పెంచారు. చదవండి: బీజేపీ ఎంపీ సొదరుడి అరెస్ట్.. కొత్త చిక్కుల్లో ప్రతాప్ సింహ! -
కొచ్చి–బెంగళూరు విమానానికి బాంబు బెదిరింపు
కొచ్చి: ఇండిగో విమానయాన సంస్థకు చెందిన కొచ్చి–బెంగళూరు విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు కాల్‌తో అధికారులు హైరానా పడ్డారు. సోమవారం ఉదయం 10.30 గంటలకు బయలుదేరాల్సిన విమానంలో పూర్తి స్థాయి తనిఖీలు చేపట్టారు. ఎటువంటి బాంబు లేదని తేల్చారు. అనంతరం మధ్యాహ్నం 2.24 గంటలకు బెంగళూరుకు బయలుదేరింది. 6ఈ6482 విమానం మొత్తం 139 మంది ప్రయాణికులతో కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం ఉదయం బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. అంతలోనే, ఆ విమానంలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా అధికారులకు ఫోన్ కాల్ చేశాడు. దీంతో, అధికారులు వెంటనే భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రయాణికులందరినీ కిందికి దించివేశారు. వారికి చెందిన లగేజీని కూడా క్షుణ్నంగా తనిఖీ చేశారు. అనుమానాస్పద వస్తువేదీ లేదని ధ్రువీకరించుకున్నారు. అనంతరం 2.24 గంటల సమయంలో ఆ విమానం తిరిగి బెంగళూరుకు టేకాఫ్ అయ్యింది. బాంబు బెదిరింపుపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
Hyderabad: టీసీఎస్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. టీసీఎస్ కంపెనీలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి కాల్ చేశారు దీంతో అప్రమత్తమైన కంపెనీ యాజమాన్యం మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. టీసీఎస్ వద్దకు చేరుకున్న పోలీసులు.. ఉద్యోగులను బయటకు పంపించి బాంబ్ స్క్వాడ్‌తో కంపెనీలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఫేక్ కాల్ అని, బాంబు లేదని నిర్ధారించారు. అయితే బాంబు బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. టీసీఎస్ కంపెనీ సెక్యూరిటీ విభాగంలో పనిచేసిన మాజీ ఉద్యోగి నిర్వాకంగా పోలీసులు తేల్చారు. తనకు తానే పోలీసులకు ఫోన్ చేసి ఫేక్ సమాచారం ఇచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. దీంతో సదరు వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. కాగా కంపెనీలో బాంబు లేదని తేల్చడంతో ఇటు ఉద్యోగులు, అటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. చదవండి: పెళ్లైన వెంటనే రంగంలోకి.. అటు వివాహం.. ఇటు నినాదం -
బాంబు బెదిరింపు కాల్ కలకలం
-
శంషాబాద్: కోపంతో బాంబు బెదిరింపు కాల్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు బాంబు బెదిరింపు ఫోన్‌కాల్ రావడంతో కాసేపు అధికారులు హడలి పోయారు. హైదరాబాద్-చెన్నై ఇండిగో విమానంలో బాంబు పెట్టానంటూ ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. అయితే.. తనిఖీ చేశాక విమానంలో బాంబులేదని అధికారులు నిర్ధారించుకున్నారు. ఇక.. ఫోన్ చేసిన వ్యక్తిని వెంటనే ట్రేస్ చేశారు అధికారులు. ఆ వ్యక్తిని అజ్మీరా భద్రయ్యగా గుర్తించించింది సీఐఎస్ఎఫ్ ఇంటెలిజెన్స్. దీంతో భద్రయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను చెప్పిన కారణం విని అధికారులు బిత్తరపోయారు. విమానంలో భద్రయ్య చెన్నై వెళ్లాల్సి ఉంది. కానీ, ఆలస్యంగా రావడంతో విమానం ఎక్కేందుకు ఆయన్ని సిబ్బంది అనుమతించలేదు. దీంతో కోపంతోనే విమానంలో బాంబు పెట్టానంటూ ఫోన్ చేసి బెదిరించాడట భద్రయ్య. -
యూపీ సీఎం యోగి ఇంటి వద్ద హైఅలర్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఫేక్ ప్రచారం కలకలం సృష్టించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి వద్ద బాంబు ఉందంటూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. పోలీసులు హై అలర్ట్ అయ్యారు. సీఎం ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. వివరాల ప్రకారం.. ఓ ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేసి సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారిక నివాసం వద్ద బాంబు ఉందని తెలిపాడు. దీంతో, వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాంబు నిర్వీర్య స్క్వాడ్‌తో రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బాంబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించారు. బాంబు దొరక్కపోయినప్పటికీ పోలీసులు.. సీఎం యోగి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అనంతరం, ఫోన్ కాల్ చేసిన ఆగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. Security upped outside UP CM Yogi Adityanath's Lucknow residence after bomb scare pic.twitter.com/vWpSmxqe8n — Times No1 (@no1_times) February 17, 2023 -
గూగుల్‌కు బాంబు బెదిరింపు కలకలం: హైదరాబాదీ అరెస్ట్
సాక్షి, ముంబై: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్‌కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. మహారాష్ట్ర పూణేలోని గూగుల్ కార్యాలయంలో బాంబు పెట్టినట్లు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న గూగుల్ ఆఫీస్‌కు కాల్ రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి బాంబు లేకపోవడంతో గందరగోళం సద్దుమణిగింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న గూగుల్ కార్యాలయానికి ఆదివారం రాత్రి 7.54 గంటలకు కాల్ వచ్చింది. దీనిపై సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పూణే పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా సోదాలు నిర్వహించి, ఇది ఫేక్అని పూణే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ V) విక్రాంత్ దేశ్‌ముఖ్ తేల్చారు. అనంతరం గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మద్యం మత్తులో ఈ కాల్ చేసినట్టు అధికారులు గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని అదుపులోకితీసుకున్నామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. -
రష్యా నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు
మాస్కో: రష్యా రాజధాని మాస్కో నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికే దుండగులు ఫోన్ చేశారు. దీంతో భద్రతా కారణాల దృష్ట్యా అధికారులు ఈ విమానాన్ని ఉజ్బెకిస్తాన్‌కు దారిమళ్లించారు. అజూర్ ఎయిర్వేస్కు చెందిన ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది, ఇద్దరు పిల్లలు సహా మొత్తం 238 మంది ప్రయాణికులు ఉన్నారు. రష్యాలోని పెర్మ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అర్ధరాత్రి సమయంలో బయల్దేరింది. అయితే ఇందులో బాంబు అమర్చినట్లు గోవా దబోలిమ్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌కు అర్ధరాత్రి 12:30 గంటలకు ఈమెయిల్ వచ్చింది. దీంతో విమానం భారత గగనతలంలోకి ప్రవేశించకముందే ఉబ్జెకిస్తాన్‌కు మళ్లించారు. ఇలా జరగకపోయి ఉంటే విమానం ఉదయం 4:15 గంటలకు గోవాలో ల్యాండ్ అయ్యేది. చదవండి: అమ్మాయిలంటే ఎందుకంత ద్వేషం.. ఆడ బొమ్మల మొహాలకు కూడా కవర్లా? -
కృష్ణా ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు
సికింద్రాబాద్: తిరుపతి నుంచి సికింద్రాబాద్ మీదుగా ఆదిలాబాద్ వెళ్లాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ రూట్లో బాంబు ఉందని ఓ యువకుడు చేసిన ఆకతాయి ఫోన్ సందేశం శుక్రవారం రాత్రి కలకలం సృష్టించింది. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో బాంబు ఉందని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నాక అది పేలుతుందని ఆకతాయి పంపిన మెసేజ్‌తో ఇటు జీఆర్పీ, అటు ఆర్పీఎఫ్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రాత్రి 8.45 గంటలకు చేరుకోవాల్సిన కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలు గంట ఆలస్యంగా నడుస్తుంది. 8 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి రాచకొండ పోలీసులకు ఫోన్ చేసి బాంబు ఉన్నట్లు చెప్పడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికే మౌలాలి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న రైలును అదే స్టేషన్లో నిలిపి సోదాలు నిర్వహించారు. అదే సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న బాంబ్ స్వా్వడ్ బృందాలు తనిఖీల అనంతరం ఆకతాయి పనిగా నిర్థారించారు. రెండు గంటలు ఆలస్యంగా కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని ఆ మీదట ఆదిలాబాద్‌కు బయలుదేరి వెళ్లింది. రైలులో ప్రయాణిస్తూనే .. మహబూబాబాద్‌కు చెందిన కిరణ్‌కుమార్ అనే యువకుడు అదే రైలులో ప్రయాణిస్తూ పోలీసులకు సెల్‌ఫోన్ ద్వారా మెసేజ్ చేశాడు. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలులో అరాచక శక్తులు ప్రయాణిస్తున్నాయని వారు రైలును పేల్చే ప్రయత్నం చేస్తున్నారని మెసేజ్‌లో పేర్కొన్నాడు. ఒక వైపు తనిఖీలు చేస్తూనే మరోవైపు మెస్సేజ్ అందిన ఫోన్ నెంబర్ సిగ్నల్ ఆధారంగా సందేశం పంపిన వ్యక్తి అదే రైలులో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ పరీక్షకు హాజరై సెలక్ట్ కాలేదన్న ఆక్రోశంతో మెసేజ్ చేసినట్లే నిందితుడు అంగీకరించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
244 మందితో వెళ్తున్న గోవా విమానంలో బాంబు కలకలం!
అహ్మదాబాద్: మాస్కో నుంచి గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. విమానంలో బాంబు ఉన్నట్లు ఫోన్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గోవాకు వెళ్లాల్సిన విమానాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు మళ్లించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలో మొత్తం 244 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువు లభించలేదని, బాంబు లేదని తేల్చడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. జామ్‌నగర్ నుంచి గోవాకి 11 గంటలకు విమానం బయలుదేరి వెళ్లనుంది ఎయిర్‌లైన్స్ అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపులతో నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) సిబ్బంది విమానం, లగేజ్‌ని తనిఖీలు చేశారు.‘ ఎన్ఎస్జీకి ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు. విమానం చాలా పెద్దతి, తనిఖీ చేసేందుకు ఎక్కువ సమయం పట్టింది. అన్ని రకాల అధికారిక కార్యక్రమాలు పూర్తయ్యాక ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్యలో జామ్‌నగర్ నుంచి గోవాకు విమానం బయలుదేరే అవకాశం ఉంది. క్యాబిన్‌లోని మొత్తం లగేజ్‌ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.’ అని జామ్‌నగర్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు. #WATCH | Visuals from Jamnagar Aiport where Moscow-Goa chartered flight passengers were deboarded after Goa ATC received a bomb threat. As per airport director, Nothing suspicious found. The flight is expected to leave for Goa probably b/w 10:30 am-11 am today.#Gujarat pic.twitter.com/dRBAEucYjy — ANI (@ANI) January 10, 2023 ఇదీ చదవండి: బ్రెజిల్ అల్లర్లు: మాజీ అధ్యక్షుడు బోల్సోనారోకు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక