సాక్షి, ముంబై: సెర్చ్ ఇంజీన్ దిగ్గజం గూగుల్‌కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. మహారాష్ట్ర పూణేలోని గూగుల్ కార్యాలయంలో బాంబు పెట్టినట్లు ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉన్న గూగుల్ ఆఫీస్‌కు కాల్ రావడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పోలీసులు ఫిర్యాదు చేశారు. అయితే సంఘటనా స్థలంలో ఎలాంటి బాంబు లేకపోవడంతో గందరగోళం సద్దుమణిగింది.
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఉన్న గూగుల్ కార్యాలయానికి ఆదివారం రాత్రి 7.54 గంటలకు కాల్ వచ్చింది. దీనిపై సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. పూణే పోలీసులు, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని విస్తృతంగా సోదాలు నిర్వహించి, ఇది ఫేక్‌అని పూణే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ V) విక్రాంత్ దేశ్‌ముఖ్ తేల్చారు.
అనంతరం గుర్తుతెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అయితే హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి మద్యం మత్తులో ఈ కాల్ చేసినట్టు అధికారులు గుర్తించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని అదుపులోకితీసుకున్నామనీ, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment