pune
-
పెను విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి.. వీడియో
క్రికెట్ మైదానంలో పెను విషాదం చోటు చేసుకుంది. కార్డియాక్ అరెస్ట్ కారణంగా యువ ఆటగాడు మృతి చెందాడు. పూణేలోని ఛత్రపతి సంభాజి నగర్లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే ఓ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. ఇమ్రాన్ పటేల్ అనే ఆటగాడు కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనింగ్ బ్యాటర్‌గా బరిలోకి దిగిన ఇమ్రాన్ పటేల్.. కొన్ని ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన అనంతరం ఛాతీ నొప్పి వస్తుందని అంపైర్లకు చెప్పాడు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో ఇమ్రాన్ కుప్పకూలిపోయాడు. A young man, Imran Sikandar Patel, died of a #heartattack while playing cricket in the Chhatrapati Sambhaji Nagar district of Maharashtra.https://t.co/aCciWMuz8Y pic.twitter.com/pwybSRKSsa— Dee (@DeeEternalOpt) November 28, 2024హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్దారించారు. ఇమ్రాన్‌కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని.. పైపెచ్చు ఎప్పుడూ ఫిట్‌గా ఉండేవాడని తోటి క్రికెటర్లు చెప్పారు. ఇమ్రాన్‌కు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు నాలుగు నెలల పసి గుడ్డు. ఇమ్రాన్ అంత్యక్రియలకు జనం తండోపతండాలుగా వచ్చారు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన ఇమ్రాన్ పటేల్‌కు ఓ క్రికెట్ టీమ్ ఉంది. జీవనోపాధి కోసం అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం మరియు జ్యూస్ షాప్ నడిపే వాడు. ఇమ్రాన్ మృతి స్థానికంగా విషాద ఛాయలు నింపింది. అచ్చం ఇమ్రాన్లాగే రెండు నెలల క్రితం ఇదే పూణేలో మరో స్థానిక క్రికెటర్ కూడా మృతి చెందాడు. హబీబ్ షేక్ అనే క్రికెటర్ మ్యాచ్ ఆడుతూ ప్రాణాలు కోల్పోయాడు.సెప్డెంబర్ 7న ఈ ఘటన జరిగింది. మృతుడు షుగర్ పేషంట్ అని తెలిసింది. -
సికింద్రాబాద్–పుణే మధ్య వందే భారత్ రైలు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్–పుణే మధ్య త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలోనే ఈ మార్గాన్ని రైల్వేబోర్డు నోటిఫై చేసినా.. రైల్ రేక్ సిద్ధంగా లేకపోవటంతో ప్రారంభించలేదు. ఈ క్రమంలో త్వరలో ఈ రైలును పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. అది ముగిశాక ప్రారంభించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య శతాబ్ది సర్వీసు కొనసాగుతోంది. అది రోజూ మధ్యాహ్నం సికింద్రాబాద్ నుంచి బయలు దేరుతుంది. వందే భారత్‌ను ఉదయమే బయలుదేరేలా నడిపే అవకాశం ఉందని రైల్వే వర్గాలు చెప్తున్నాయి.స్లీపర్ కేటగిరీపై పరిశీలన!వందే భారత్ రైళ్లలో స్లీపర్ కేటగిరీ త్వరలో పట్టాలెక్కబోతోంది. ఇటీవలే నమూనా రైలు సిద్ధమైంది. ఆ రైలు రేక్స్ తయారవుతున్నాయి. ట్రయల్‌రన్ తర్వాత వాటిని ప్రారంభించనున్నారు. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 16 రూట్లను ఈ రైళ్లకోసం ఖరారు చేశారు. మరిన్ని మార్గాలను కూడా ఎంపిక చేయనున్నారు. సికింద్రాబాద్–పుణే మధ్య వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపే అంశాన్ని కూడా రైల్వే బోర్డు పరిశీలిస్తోంది.ఈ నగరాల మధ్య ప్రస్తుతమున్న పుణే శతాబ్ది రైలు సికింద్రాబాద్‌లో మధ్యాహ్న సమయంలో ప్రారంభమవుతోంది. కానీ రాత్రివేళ సర్వీసు పెట్టాలన్న డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఈ క్రమంలో రాత్రివేళ వందే భారత్ స్లీపర్ సర్వీసును ప్రారంభించి.. ఆ తర్వాత సాధారణ వందే భారత్‌ను శతాబ్ది స్థానంలో ప్రవేశపెట్టాలన్నది రైల్వే యోచన అని సమాచారం.నాగ్‌పూర్ సర్వీసు విఫలంతో..సికింద్రాబాద్–నాగ్‌పూర్ మధ్య 20 కోచ్‌లతో వందే భారత్ రైలు సేవలు మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ రెండు నగరాల మధ్య నిత్యం నాలుగు రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో వందే భారత్‌కు డిమాండ్ లేకుండా పోయింది. ఆక్యుపెన్సీ రేషియో 20 శాతం కూడా ఉండటం లేదు. నెల గడుస్తున్నా దీనికి ఆదరణ పెరగకపోవటంతో కోచ్‌ల సంఖ్యను తగ్గించి.. ఎనిమిది కోచ్‌లకే పరిమితం చేయాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో పుణే సర్వీసు ఎలా ఉంటుందన్న అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.సికింద్రాబాద్–పుణే మధ్య సర్వీసులు తక్కువ. పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉన్న నగరాలు కావడం, ప్రయాణికుల డిమాండ్ కూడా ఎక్కువగా ఉండటంతో.. ఈ రెండు నగరాల మధ్య వందే భారత్ సర్వీసు విఫలమయ్యే చాన్స్ లేదని ప్రాథమికంగా తేల్చారు. వందే భారత్‌ను పట్టాలెక్కించాలనే నిర్ణయానికి వచ్చారు. సాధారణ వందే భారత్ సర్వీసా? స్లీపర్ సర్వీసా? అన్నదానిపై మహారాష్ట్ర ఎన్నికల తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
కివీస్‌తో రెండో టెస్ట్.. నెట్స్‌లో చెమటోడుస్తున్న టీమిండియా క్రికెటర్లు (ఫొటోలు)
-
Sarfaraz vs KL Rahul: గిల్ రాక.. ఎవరిపై వేటు? కోచ్ ఆన్సర్ ఇదే
న్యూజిలాండ్‌తో సిరీస్‌ను పరాజయంతో ప్రారంభించిన టీమిండియా.. రెండో టెస్టులో విజయానికి గురిపెట్టింది. పుణెలో గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం రోహిత్ సేన ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. భారత్- కివీస్ జట్ల మధ్య గురువారం నుంచి మొదలుకానున్న ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే మీడియాతో మాట్లాడాడు.ఈ సందర్భంగా శుబ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వస్తే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఎదురైంది. గిల్ కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్లలో ఎవరిని తప్పిస్తారని విలేకరులు అడుగగా.. ‘‘శుబ్‌మన్ గిల్ ప్రస్తుతం బాగానే ఉన్నాడు. బెంగళూరులో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాడు. ఇక తుదిజట్టులో ఎవరు ఉండాలన్న అంశంపై పరిస్థితులకు తగ్గట్లు నిర్ణయం తీసుకుంటాం.జట్టులో ఒకరికి చోటు నిరాకరించడం అనేది ఉండదు. సర్ఫరాజ్ ఖాన్ తొలి టెస్టులో అద్భుతంగా ఆడాడు. కేఎల్ రాహుల్ కాస్త నిరాపరిచిన మాట వాస్తవమే. అయితే, తను ఎన్ని బంతులు మిస్ చేశాడని అడిగినపుడు అందుకు బదులుగా ఒక్కటి కూడా మిస్ చేయలేదనే సమాధానమే వచ్చింది.ఒక్కోసారి ఇలాగే జరుగుతుంది. బాగా ఆడినా పరుగులు రాబట్టలేకపోవచ్చు. కాబట్టి కేఎల్ రాహుల్ గురించి ఆందోళన అక్కర్లేదు. తను మానసికంగానూ ఏమాత్రం అలసటకు గురికాలేదు. అయితే, అందుబాటులో ఉన్న ఆరు స్థానాల్లో ఏడుగురిని ఇరికించడం కుదరదు. కాబట్టి అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్‌నే ఎంచుకుంటాం.ఇప్పటికైతే కేఎల్ రాహుల్ ఫామ గురించి మాకెలాంటి బెంగా లేదు. అతడి ఆట తీరుపై పూర్తి నమ్మకం ఉంది. దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా గౌతీ(హెడ్‌కోచ్ గౌతం గంభీర్) తనకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలనే యోచనలో ఉన్నాడు. మరోవైపు సర్ఫరాజ్ ఖాన్.. అతడు బెంగళూరులో 150 పరుగులు చేశాడు. ఇరానీ కప్ ఫైనల్లో డబుల్ సెంచరీ చేశాడు. కాబట్టి మిడిలార్డర్లో చోటు కోసం ఇద్దరి మధ్య పోటీ గట్టిగానే ఉంది’’ అని టెన్ డష్కాటే తెలిపాడు.ఇక రిషభ్ పంత్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని పుణెలో జరుగనున్న రెండో టెస్టులో అతడే వికెట్ కీపింగ్ చేస్తాడని ఈ సందర్భంగా డష్కాటే సంకేతాలు ఇచ్చాడు. కాగా మెడనొప్పి కారణంగా శుబ్‌మన్ గిల్ బెంగళూరలో జరిగిన తొలి టెస్టుకు దూరం కాగా.. వన్‌డౌన్‌లో అతడి స్థానంలో విరాట్ కోహ్లి వచ్చాడు. కోహ్లి ఆడే నాలుగో స్థానంలో సర్ఫరాజ్ బ్యాటింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ సెంచరీతో చెలరేగగా.. కేఎల్ రాహుల్ 0, 12 పరుగులు చేశాడు. -
మహారాష్ట్ర: రూ. 5 కోట్ల నగదు పట్టివేత
పూణె: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలయ్యింది. ఇంతలో పూణె సమీపంలో ఓ కారులో భారీగా నగదు పోలీసులకు పట్టుబడింది. ఖేడ్ శివ్పూర్ టోల్ ప్లాజా సమీపంలో ఓ వాహనంలో రూ. 5 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బులు ఎక్కడికి తరలిస్తున్నారనేదానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఇన్నోవా వాహనంలో భారీగా డబ్బు తరలిస్తున్నట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమై, ఖేడ్ శివపూర్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపధ్యంలో ఒక ఇన్నోవా కారులో తనిఖీలు చేసినప్పుడు భారీగా నగదు బయటపడింది. విషయం తెలుసుకున్న ఆదాయపు పన్ను శాఖ ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు గంటల పాటు నోట్లను లెక్కించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు.ఇది కూడా చదవండి: ‘చియోంగ్‌చియాన్’పై అధ్యయనం -
పూణె మెట్రో స్టేషన్లో మంటలు
పూణె: మహారాష్ట్రలోని పూణెలోని ఒక మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపకదళం ఘటనా స్థలికి చేరుకుని, మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని మెట్రో అధికారులు తెలిపారు.పూణెలోని మండై మెట్రో స్టేషన్లో అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో మెట్రో స్టేషన్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఫోమ్ మెటీరియల్‌లో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన మెట్రో అధికారులు వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు.ఐదు అగ్నిమాపక దళ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని, ఐదు నిమిషాల వ్యవధిలో మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. మెట్రో స్టేషన్లో వెల్డింగ్ పనులు జరుగుతుండగా మంటలు చెలరేగాయి. కేంద్ర మంత్రి మురళీధర్ మోహోల్ ఒక ట్వీట్లో ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పంచుకున్నారు. మెట్రో స్టేషన్లో పరిస్థితులు చక్కబడ్డాయని, మెట్రో రాకపోకలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. पुणे के मेट्रो स्टेशन में लगी आगमहाराष्ट्र के पुणे में मंडई मेट्रो स्टेशन के ग्राउंड फ्लोर पर रविवार आधी रात को आग लग गई, हालांकि घटना में कोई घायल नहीं हुआ. फायर विभाग के मुताबिक, वेल्डिंग के दौरान फोम में आग लगने से यह घटना घटी.#Maharashtra | #pune | #fireaccident | #fire pic.twitter.com/V8lBA4hdTV— NDTV India (@ndtvindia) October 21, 2024ఇది కూడా చదవండి: పిరమిడ్‌పై పక్షుల వేట -
సిద్దిఖీ హత్యకు పుణెలో కుట్ర
ముంబై: మహారాష్ట్ర మాజీ మంత్రి, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ నేత బాబా సిద్దిఖీని కాల్చిచంపడానికి పుణెలో కుట్ర జరిగిందని పోలీసులు సోమవారం వెల్లడించారు. íసిద్దిఖీని గుర్తించడానికి వీలుగా ఆయన ఫొటో, చిత్రం ముద్రించిన ఫ్లెక్సీని షూటర్లకు అందజేశారు. ఈ హత్యలో పుణెకు చెందిన సోదరులు ప్రవీణ్ లోంకర్, శుభమ్ లోంకర్ల పాత్ర ఉందని ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. నిందితులు దొరకితే హత్యకు కారణాలు తెలుస్తాయని ఒక పోలీసు అధికారి తెలిపారు. లోంకర్ సోదరులే హత్యకు పాల్పడిన షూటర్లకు రూ.50 వేల చొప్పున అడ్వాన్సు అందించారని, నిందితుల మధ్య సమావేశాలను ఏర్పాటు చేశారని, హత్యకు కావాల్సిన ఏర్పాట్లను చూశారని చెప్పారు. శుభమ్‌కు చెందిన డైరీలో ప్రవీణ్ పనిచేస్తున్నాడని.. అక్కడే షూటర్లు శివకుమార్ గౌతమ్, ధర్మరాజ్ కశ్యప్‌లను హత్య కోసం నియమించుకున్నారని తెలిపారు. అడ్వాన్సుగా అందిన మొత్తం నుంచి నిందితులు ఒక మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసి.. దాని పైనే సిద్దిఖీ నివాసం, ఆఫీసుల వద్ద, ఆయన దినచర్య పైనా రెక్కీ నిర్వహించారని వివరించారు. గుర్మైల్ బల్జీత్‌సింగ్ (హరియాణా), ధర్మరాజ్ కశ్యప్ (ఉత్తరప్రదేశ్), ప్రవీణ్ లోంకర్‌లను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. నిందితులకు దిశానిర్దేశం చేసిన మొహమ్మద్ యాసిన్ అక్తర్ కోసం. సిద్దిఖీని కాల్చిచంపిన గౌతమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
టక్ చేయలేదని చితక్కొట్టిన టీచర్
టక్ చేయలేదన్న ఒకే ఒక్క కారణంతో పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయిన ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదిన ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఎడమ చెవిపై గట్టిగా కొట్టడంతో కర్ణభేరి పగిలింది. దాంతో ఆ చెవి శాశ్వతంగా వినికిడి సామర్థ్యం కోల్పోయింది. సీసీటీవీ ఫుటేజీతో ఈ ఘటన వెలుగులోకి రావడంతో టీచర్‌పై పిల్లాడి తల్లిదండ్రులు ఫిర్యాదుచేశారు. నిర్లక్ష్యంగా సమాధానమిచి్చన టీచర్‌ను తల్లిదండ్రులు పోలీసుల ఎదుట చితక్కొట్టారు. కంప్యూటర్ సబ్జెక్ట్ బోధించే సందేశ్ బోసాలే సెప్టెంబర్ 27న ఆరో తరగతి గదిలో ఓ విద్యార్థి టక్ చేసుకోకపోవడం గమనించి కోపంతో కొట్టాడు. మెడ పట్టి క్లాసు నుంచి గెంటేశాడు. దెబ్బలకు బాలుని ముక్కు, ఎడమ చెవి నుంచి రక్తం కారింది. ఇంటికెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా ఎడమ చెవి కర్ణభేరి పగిలిందని వైద్యుడు చెప్పాడు. కుటుంబసభ్యులు స్కూలు యాజమాన్యాన్ని నిలదీసినా తమకు సంబంధం లేదన్నారు. దాంతో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన సలహాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి ఇరు వర్గాలను స్కూలుకు పిలిపించారు. అప్పటికే కోపంతో ఉన్న కుటుంబసభ్యులు, నవనిర్మాణ్ సేన కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే టీచర్‌ను చితకబాదారు. महाराष्ट्र के पुणे में पहले टीचर ने छात्र को पीटा, फिर मनसे और छात्र के परिजनों ने टीचर को पीटा! केस दर्ज छात्र का शर्ट इन नहीं था pic.twitter.com/NZ5fwgTX8R— Avinash Tiwari (@TaviJournalist) October 6, 2024 -
గుండె పగిలింది: టీమిండియా మాజీ క్రికెటర్ భావోద్వేగం
టీమిండియా మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతడి తల్లి మాలా అశోక్ అంకోలా(77) అనుమానాస్పద స్థితిలో కన్నుమూశారు. పుణెలోని తన ఫ్లాట్‌లో గొంతు కోసి ఉన్న స్థితిలో శవమై కనిపించారు.మానసిక సమస్యలతో సతమతంఈ నేపథ్యంలో ఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ఇరుగుపొరుగు వారిని ఆరా తీశారు. అనంతరం డీఎస్పీ సందీప్ సింగ్ గిల్ మాట్లాడుతూ.. ‘‘మాలా ఇంట్లో పనిచేసే వ్యక్తి ఫ్లాట్‌కి వచ్చి డోర్ కొట్టగా ఎవరూ తలుపుతీయలేదు. దీంతో సమీపంలో నివసించే బంధువులకు సమాచారం ఇచ్చింది.తలుపు తెరిచి చూడగా మాలా విగతజీవిగా కనిపించారు. ఆమె గొంతు కోసి ఉంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆ గాయాలు తనకు తాను గానే చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే, అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నాం’’ అని తెలిపారు. కాగా మాలా అశోక్ అంకోలా గత కొన్నిరోజులుగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు గిల్ ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతో తనకు తానుగానే గాయపరచుకున్నారా అన్న కోణంలో విచారిస్తున్నట్లు తెలిపారు. అమ్మా.. హృదయం ముక్కలైందికాగా సలీల్ అంకోలా అంతర్జాతీయ క్రికెట్లో 1989- 1997 మధ్య భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఒక టెస్టు, 20 వన్డేలు ఆడాడు. అనంతరం ఈ ఫాస్ట్‌బౌలర్ పలు హిందీ సినిమాలతో పాటు టీవీ షోలలో నటించాడు. కాగా తల్లి మరణాన్ని ధ్రువీకరిస్తూ.. ‘అమ్మా’ అంటూ గుండె పగిలినట్లుగా ఉన్న ఎమోజీతో ఆమె ఫొటోను సలీల్ అంకోలా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Salil Ankola (@salilankola) -
పుణెలో కూలిన హెలికాప్టర్..ముగ్గురు మృతి
పుణె: మహారాష్ట్రలోని పుణెలో బుధవారం(అక్టోబర్2) తెల్లవారుజామున హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు ఒక ఇంజినీర్ దుర్మరణం పాలయ్యారు. పుణెజిల్లాలోని బవ్ధాన్ కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బవ్ధాన్ పరిసర ప్రాంతంలోని గోల్ఫ్‌కోర్స్‌లో ఉన్న హెలిప్యాడ్ నుంచి గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ముంబై వెళ్లాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలియనప్పటికీ దట్టమైన పొగమంచు వల్లే హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కుప్పకూలిన హెలికాప్టర్ పుణెలోని హెరిటేజ్ ఏవియేషన్‌కు చెందినదిగా తేల్చారు. కాగా, ముంబై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ హెలికాప్టర్ పుణె సమీపంలో ఇటీవలే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని నలుగురు గాయపడ్డారు.#WATCH | A #helicopter with three people onboard crashed in the Bavdhan area in #Pune. According to the police, two people have died in the incident.More details here: https://t.co/34QkwGCcvh pic.twitter.com/v6tQTKz2K1— Hindustan Times (@htTweets) October 2, 2024 ఇదీ చదవండి: పెరోల్‌పై డేరా బాబా విడుదల -
భారీ వర్షాల ప్రభావం: ప్రధాని మోదీ పూణె పర్యటన రద్దు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ తన పూణె పర్యటనను రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలోని పలు నగరాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. రోడ్లపైకి నీరు చేరడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రధాని మోదీ ఈరోజు (గురువారం) పుణె మెట్రో రైలు ప్రారంభోత్సవంతో పాటు రూ.22,600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే భారీ వర్షాల దృష్ట్యా ప్రధాని మోదీ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.భారీ వర్షాల కారణంగా పూణె, పింప్రీ చించ్వాడ్లలో పాఠశాలలు, కళాశాలలను మూసివేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. కుండపోత వర్షాల కారణంగా గోవండి-మాన్‌ఖుర్ద్ మధ్య నడిచే ముంబై లోకల్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పుణె జిల్లాకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పౌరులు అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.జాతీయ సూపర్కంప్యూటింగ్ మిషన్ (ఎన్ఎస్ఎం) కింద సుమారు రూ. 130 కోట్లతో అభివృద్ధి చేసిన మూడు పరమ రుద్ర సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో నేడు ప్రధాని పాల్గొనాల్సి ఉంది. అలాగే వాతావరణ పరిశోధనల కోసం రూపొందించిన హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ (హెచ్పీసీ)సిస్టమ్‌ను కూడా ప్రధాని ప్రారంభించాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్‌కు రూ. 850 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే భారీ వర్షాల కారణంగా ఈ కార్యక్రమాలన్నీ నేడు రద్దయ్యాయి.ఇది కూడా చదవండి: ముంబయిలో భారీ వర్షం.. విమానాల దారి మళ్లింపు -
ఇంట్లోనే అబార్షన్.. గర్భిణీ మృతి
ముంబై: మహారాష్ట్రలోని పుణెలో విషాదం చోటుచేసుకుంది. గర్భిణికి ఇంట్లోనే అబార్షన్ చేయడం వల్ల 24 ఏళ్ల మహిళ మృతిచెందింది. ఈ కేసులో ఆమె భర్త, మామలను పోలీసులు అరెస్ట్ చేయగా.. అత్తపై కూడా కేసు నమోదు చేశారు. ఇక అబార్షన్ చేసేందుకు వచ్చిన ఓ ప్రైవేట్ వైద్యుడిని పోలీసులు అదుపులోకి తీసుకొచి విచారిస్తున్నారు. నాలుగు నెలల పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టినట్లు తేలింది.వివరాలు.. 2017లో యువతికి వివాహం జరిగింది. ఇప్పటికే ఈ జంటకు ఇద్దరు పిల్లలు( ఒక బాలిక, బాలుడు) ఉన్నారు. ఇటీవల ఆమె మూడోసారి గర్భం దాల్చింది. అయితే కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. మహిళకు ఇంట్లోనే అబార్షన్ చేయాని ప్లాన్ చేశారు. ఇందుకు ఓ వైద్యుడిని కూడా పిలిపించారు. నాలుగు నెలల గర్బిణీకి ఇంట్లోనే అబార్షన్ చేయించారు. పిండాన్ని కుటుంబీకులు పొలంలో పాతిపెట్టారు. అనంతరం అధిక రక్తస్రావం కారణంగా మహిళ పరిస్థితి విషమంగా మారింది. మరుసటి రోజు ఆమెను ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే మరణించింది.మృతురాలి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి ఆమె భర్త, మామలను అరెస్ట్ చేశారు. పొలం నుంచి పిండాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. అబార్షన్ చేసేందుకు పిలిచిన ఓ ప్రైవేట్ వైద్యుడిని కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఇందాపూర్ పోలీసులు పేర్కొన్నారు. -
EY ఉద్యోగి మృతి ఘటన: పుణె ఆఫీసులో తనిఖీలు
పుణె: యర్నెస్ట్ అండ్ యంగ్ (EY) కంపెనీ సీఏ అన్నా సెబాస్టియన్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అధికమైన అని ఒత్తిడి కారణంగానే మృతి చెందినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియా వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అయితే తాజాగా ఈ ఘటనకు సంబంధించి మహారాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయ అధికారులు పూణెలోని ఎర్నెస్ట్ అండ్ యంగ్ (EY) కార్యాలయాన్ని మంగళవారం తనిఖీ చేశారు. మృతికి సంబంధించి ఆధారాల సేకరణ కోసం అధికారులు ఆఫీసు, పరిసరాల్లో సోదాలు నిర్వహించారు. ‘‘తనిఖీలో మా అధికారులు ఆఫీసు ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో లభించిన ఆధారాలపై స్పందించేందుకు కంపెనీకి ఏడు రోజుల గడువు ఇచ్చాం. జూలైలో పెరయిల్ మరణం చుట్టూ చోటుచేసుకున్న అంశాల నివేదికను సిద్ధం చేసి ఒక వారంలో రాష్ట్ర కార్మిక కమిషనర్‌కు సమర్పించాలని ఆదేశించాం. అనంతరం ఆ పరిశీలన కొనుకొన్న ఆధారాలపై నివేదికను కేంద్రానికి పంపుతాం. ఈ ఘటనపై కేంద్రం విచారణ జరపనుంది’ అని పేర్కొన్నారు.మరోవైపు.. పని ఒత్తిడి కారణంగా ఆమె మృతిచెందినట్లు వస్తున్న ఆరోపణలపై ఎర్నెస్ట్ అండ్ యంగ్ కంపెనీ తీవ్రంగా ఖండించింది. ఆమె మరణానికి, కంపెనీ పనిభారానికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కంపెనీ ఉద్యోగుల సంక్షేమానికి పటిష్టమైన నియమాలు, పద్దతుల అమలు తాము ఎప్పటినుంచో కట్టుబడి ఉన్నామని పేర్కొంది.చదవండి: EY మహిళా ఉద్యోగి మృతి : నిర్మలా సీతారామన్ వ్యాఖ్యల దుమారం -
తనను వ్యతిరేకించే వారి మాట కూడా వినేవాడే పాలకుడు: గడ్కరీ
ముంబై: ప్రజాస్వామ్యం, పాలకుల వ్యవహార తీరుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను వ్యతిరేకించే వారి మాటను పాలకుడు వినడమే ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్షగా పేర్కొన్నారు. అందరి అభిప్రాయాలను స్వీకరించి, దానిపై ఆత్మపరిశీలన చేసుకుంటాడని చెప్పారు. రచయితలు, మేధావులు, కవులు నిర్భయంగా తమ భావాలను వ్యక్తీకరించాలని తెలిపారు.పుణెలోని ఎంఐటీ వరల్డ్ పీస్ యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి అతిపెద్ద పరీక్ష ఏంటంటే.. ప్రజలు ఎలాంటి అభిప్రాయాన్ని అందించినా దాన్ని పాలకుడు సహించవలసి ఉంటుందన్నారు. ఆ ఆలోచనలను పరిగణలోకి తీసుకొని నడుచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.దేశంలో విమర్శకుల అభిప్రాయ బేధాల్లో సమస్య లేదు కానీ.. అభిప్రాయాలను వెల్లడించడంలోనే సమస్య ఉంది. మనం రైటిస్టులు, లెఫ్టిస్టులం కాదు. మనం అవకాశవాదులం. రచయితలు, మేధావులు ఎలాంటి భయం లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని కోరుతున్నాం. ఒకరి లోపాలను గుర్తించేందుకు ఎప్పుడూ విమర్శకులు చుట్టుముట్టాల్సిన అవసరం ఉంది. అంటరానితనం, సామాజిక న్యూనత భావం, ఆధిపత్యం కొనసాగినంత కాలం దేశం అభివృద్ధి చెందదని అన్నారు. -
పని.. ప్రాణం మీదకు, ‘అన్నా’ మృతిపై ఎవరేమన్నారంటే!
‘ల్యాప్‌టాప్ అనేది నా శరీరంలో ఒక భాగం అయింది’ ఇచట, అచట అనే తేడా లేకుండా ఎప్పుడూ ఆఫీసు పనిలో తలమునకలయ్యే ఉద్యోగి మాట ఇది. ‘మాకు ఉగాదులు లేవు ఉషస్సులు లేవు’ అని కవి అన్నట్లు పనిభారంతో ఒత్తిడికి గురవుతున్న చాలామంది ఉద్యోగులకు జీవితం లేకుండాపోతోంది. పని కోసం జీవితాన్నే పణంగా పెట్టాల్సి వస్తోంది.26 ఏళ్ల తన కుమార్తె మరణానికి ‘అధిక పనిభారం’ కారణం అని ఆరోపిస్తూ ఆమె తల్లి ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ చైర్మన్‌కు రాసిన లేఖ ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది. విషపూరిత పని సంస్కృతిని ఎత్తి చూపేలా ఉన్న ఈ లేఖపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది...కొచ్చికి చెందిన చార్టెర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ కొన్ని నెలల క్రితం పుణెలోని ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్’ కంపెనీలో చేరింది. అధిక పనిభారం కారణంగా అన్నా సెబాస్టియన్ ఆరోగ్యం త్వరగా క్షీణించిందని ఆమె తల్లి అనితా అగస్టీన్ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ హెడ్ రాజీవ్ మెమానికి రాసిన లేఖలో ఆరోపించింది. (నా బిడ్డ నూరేళ్ల కలల్ని చిదిమేశారు: టాప్ కంపెనీకి తల్లి కన్నీటి లేఖ)‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’లాంటి పెద్ద కంపెనీలో ఉద్యోగం రావడంతో అన్నా సెబాస్టియన్ చాలా సంతోషించింది. అయితే ఆ సంతోషం కొద్ది నెలల్లోనే ఆవిరై΄ోయింది. ‘అధిక పని వల్ల రాత్రి ΄÷ద్దు΄ోయే వరకు, వారాంతాల్లో కూడా పనిచేసేది. ఎప్పుడూ అలిసి΄ోయి కనిపించేది’ అని కుమార్తె గురించి రాసింది అనిత అగస్టీన్.‘నా బిడ్డ తన ప్రాణాలనే మూల్యంగా చెల్లిస్తుందని అనుకోలేదు’ అని కళ్లనీళ్ల పర్యంతం అయింది అనిత. ‘ఎక్స్’లో ఆమె రాసిన లేఖకు రెండు మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.అనిత అగస్టీన్ లేఖ నేపథ్యంలో ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో, అన్నా మృతికి సంతాపం తెలుపుతూ ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్యకరమైన పని వాతావరణాన్ని కల్పించడానికి కంపెనీ ప్రాధాన్యత ఇస్తుందని హామీ ఇచ్చింది.అయితే వారి హామీ నెటిజనుల ఆగ్రహాన్ని తగ్గించలేదు.‘కంపెనీ నుండి ఎవరూ నా కుమార్తె అంత్యక్రియలకు హాజరు కాలేదు’ అంటూ అనిత వెల్లడించిన తరువాత నెటిజనుల కోపం మరింత ఎక్కువ అయింది. ‘కంటి తుడుపు మాటలు కాదు కార్యాచరణ ముఖ్యం’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.అనితా అగస్టీన్ లేఖపై కళాకారులు, రచయితలు స్పందించారు. ‘చిన్న వయసులోనే కూతురుని కోల్పోయిన అనితను చూస్తుంటే, ఆమె రాసిన లేఖ చదువుతుంటే కన్నీళ్లు ఆపుకోవడం కష్టంగా మారింది. ఆమె అంత్యక్రియలకు హాజరు కావాలనే కనీస మర్యాద లేని యజమానులు ఉండడం సిగ్గు చేటు. కార్పొరేటు శక్తుల కోసం మీ ఆరోగ్యాన్ని, మీ జీవితాన్ని బలి చేసుకోవద్దు’ అని స్పందించింది రచయిత్రి నందితా అయ్యర్. ఒకానొక సమయంలో రోజుకు 14 గంటలకు పైగా పనిచేసిన సింగర్ పౌశాలి సాహు తన గతాన్ని గుర్తు తెచ్చుకుంది.‘అన్నా సెబాస్టియన్ గుర్తుకు వచ్చినప్పుడల్లా మనసు భారం అవుతోంది. నా గత కాలం గుర్తుకు వస్తుంది. తీరిగ్గా కూర్చోలేని పని ఒత్తిడి... చివరికి వీకెండ్స్‌లో కూడా పనిచేయాల్సి వచ్చేది. అప్పటి పనిభారం ఇప్పటికీ ఏదో రూపంలో నాపై ప్రభావం చూపుతూనే ఉంది’ అంటూ స్పందించింది పౌశాలి సాహు.‘మన దేశంలో పని భారం భయంకరంగా ఉంది. వేతనం నిరాశాజనకంగా ఉంది. నిత్యం కార్మికులను వేధిస్తున్న యజమానులలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించడం లేదు’ అని ఒక యూజర్ స్పందించాడు. అన్నా సెబాస్టియన్ మరణం హాస్టల్ కల్చర్, విషపూరిత పని ప్రదేశాల ప్రమాదాల గురించి కూడా చర్చను రేకెత్తించింది. -
ట్యాంకర్‌ను మింగేసిన భారీ గుంత.. చూస్తుండగానే ఒక్కసారిగా..
రోడ్డుపైన గుంతల్లో వాహనాలు కూరుకుపోయిన దృశ్యాలు చాలానే చూసుంటారు. కానీ ఏకంగా వాహనం వాహనమే గుంతలో కూరుకుపోయింది. మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు చెందిన ట్యాంకర్ వెళ్తుండగా రోడ్డుపై పెద్ద గుంత పడింది. మొదట ట్యాంకర్ వెనక టైర్లు కుంగగా.. ఆ తర్వాత క్రమంగా ఆ ట్యాంకర్ వెనక నుంచి అందులో పడిపోయింది. అందరూ చూస్తుండగానే వాహనం గుంతలోకి చేరిపోయింది.ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీకెమెరాలో రికార్డ్ కావడంతో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని పూణె నగరంలో జరిగింది ఈ వింత ఘటన. బుద్వార్ పెత్ ప్రాంతంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం ప్రాంగణంలో డ్రైనేజ్ క్లీనింగ్ వర్క్ నిమిత్తం ట్యాంకర్ వచ్చింది.గుంతలో ట్యాంకర్ కూరుకుపోవడానికి కొన్ని క్షణాల ముందే అక్కడ నుంచి కొంత మంది నడుచుకుంటూ వెళ్లిపోవడం వీడియోలో కనిపిస్తోంది. అకస్మాత్తుగా భారీ గొయ్యి ఏర్పడటం, ట్యాంకర్ అందులో కూరుకుపోవడం క్షణాల్లో జరిగిపోయాయి. ఆ గొయ్యిలో మురుగు నీరు ఉండగా.. దాదాపుగా ట్యాంకర్ క్యాబిన్ వరకు ఆ మురుగు నీటిలో మునిగిపోయింది.అయితే అది గమనించిన ట్యాంకర్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి.. బయటికి దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఓ వ్యక్తి సాహసోపేతంగా గొయ్యి వద్దకు వెళ్లి, డ్రైవర్‌కు సాయం అందించాడు. ట్యాంకర్ క్యాబిన్ భాగం మునగిపోకపోవడంతోనే డ్రైవర్ సురక్షితంగా బయటపడగలిగాడు. అయితే, అక్కడ ఫ్లోర్ ఒక్కసారిగా ఎందుకు కుంగిపోయింది అని ఆరా తీయగా.. గతంలో అక్కడ బావి ఉండేదని ఓ అధికారి వెల్లడించారు. పాత బావికి స్లాబ్ వేసి.. దానిపై పేవర్ బ్లాక్స్ వేశారని చెప్పారు. రెండు క్రేన్ల సాయంతో ట్యాంకర్‌ను బయటికి తీశామని తెలిపారు.Pune Municipal Corporation truck fell into a pothole on the road at Samadhan Chowk in Pune. pic.twitter.com/jJbpovSsMY— Mohammed Zubair (@zoo_bear) September 20, 2024 -
ఆమెకు మరణశాసనం రాసింది ఎవరు?
-
Puja Khedkar: పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్
న్యూఢిల్లీ: మాజీ ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా ఆమెకు కేంద్రం షాకిచ్చింది. ఆమెను ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఆమెపై వేటు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఐఏఎస్ రూల్స్ 1954 ప్రకారం ఆమెపై చర్యలు తీసుకున్నట్లు అధికార ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా పుణెలో ఐఏఎస్ ప్రొబేషనరీ సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు గత జూన్‌లో ఖేద్కర్‌పై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ట్రైనింగ్ సమయంలో అధికారిక ఐఏఎస్ నెంబర్ ప్లేట్ కలిగిన కారు, కార్యాలయం వినియోగించడంతో ఆమెపై పుణె కలెక్టర్ మహారాష్ట్ర సీఎస్‌కు లేఖ రాశారు. దీంతో ఆమెపై బదిలీ వేటు పటింది. అక్కడి నుంచి పూజా అక్రమాల చిట్టా బయటపడింది.సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక అయ్యేందుకు ఓబీసీ, వికలాంగుల కోటాలో నకిలీ దృవీకరణ పత్రాలు సర్పించినట్లు సైతం తేలింది. అంతేగాక నిబంధనలకు మించి సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన యూపీఎస్సీ... ఆమెను ముస్సోరిలోని లాల్‌బహదూర్ శాస్త్రి జాతీయ అకాడమీకి తిరిగి రావాలని ఆదేశించింది. నకిలీ పత్రాలతో పరీక్షలో ఉత్తీర్ణత సాధించినట్లు గుర్తించిన యూపీఎస్సీ దానిపై వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసులిచ్చింది. ఆమెపై ఫోర్జరీ కేసు నమోదు చేయడంతో పాటు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. -
ఫుడ్ ఇవ్వలేదని.. ఏకంగా హోటల్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లిన డ్రైవర్
ముంబై: మహారాష్ట్రలో ఓ ట్రక్కు డ్రైవర్ మద్యం మత్తులో బీభత్సం సృష్టించాడు. అతడికి ఆహారం ఇవ్వలేదనే కోపంతో ఏకంగా హోటల్‌పైకి ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పుణెలోని ఇంద్రాపూర్ హింగాన్గావ్లో చోటుచేసుకుంది.కంటైనర్‌తో ట్రక్కు తో ఓ వ్యక్తి షోలాపూర్ నుంచి పుణె వెళ్తు మధ్యలో హోటల్ గోకుల్ వద్ద ఆగాడు. తర్వాత లోపలికి వెళ్లి ఆహారం అడిగాడు.కారణం తెలీదు కానీ హోటల్ యజమాని అతనికి ఫుడ్ ఇచ్చేందుకు నిరాకరించాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కోపోద్రిక్తుడై తన ట్రక్కులో కూర్చుని హోటల్ భవనంపైకి పోనిచ్చాడు. అంతటితో ఆగకుండా హోటల్ బయట ఆగి ఉన్న కారును కూడా ఢీకొట్టాడు.ఇంతలో డ్రైవర్‌ను ఆపేందుకు కొందరు వ్యక్తులు ట్రక్కుపై రాళ్లు రువ్వడం చేశారు. చివరికి ట్రక్కు చక్రాలుకింద రాళ్లు పడటంతో అవి ముందుకు కదల్లేక ఆగిపోయాడు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు కానీ హోటల్ తీవ్రంగా దెబ్బతింది సమాచారం అందుకున్న పోలీసులు ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది తమ ఫోన్లలో రికార్డు చేయడంతో..సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.VIDEO | Maharashtra: A truck driver rammed his vehicle into a hotel building in #Pune after he was reportedly denied food. The truck driver was allegedly drunk. The incident took place on Friday night.#PuneNews #maharashtranews (Source: Third Party)(Full video available on… pic.twitter.com/TrPEF1ZxrA— Press Trust of India (@PTI_News) September 7, 2024 -
కొంపముంచిన వడాపావ్.. వీడియో వైరల్
పుణె: పూణెలో జరిగిన పట్టపగలు దోపిడీలో వృద్ధ దంపతులు రూ. 5 లక్షల విలువైన నగలను పోగొట్టుకున్నారు. భార్యాభర్తలు బ్యాంకు నుంచి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా ఓ దుకాణంలో వడాపావ్ తినేందుకు ఆగారు. ఆ దంపతులు స్కూటర్‌ను రోడ్డు పక్కన నిలిపారు. ఆ వ్యక్తి ఫాస్ట్ ఫుడ్ కోసం షాపులోకి వెళ్లగా, ఆ మహిళ స్కూటర్ దగ్గర వేచి ఉంది. కాసేపటి తర్వాత, బైక్‌పై ముఖానికి మాస్క్‌తో ఒక వ్యక్తి స్కూటర్ దగ్గర ఆపాడు, రోడ్డుపై ఏదో పడిపోయినట్లుగా ఆ మహిళ దృష్టి మళ్లించి అక్కడ నుంచి వెళ్లిపోయాడుదానికోసం వంగి వెతుకుతుండగా.. స్కూటర్ ముందు భాగంలో ఉన్న బ్యాగ్‌ను తీసుకొని మరో వ్యక్తి పరారయ్యాడు. దీన్ని గమనించిన ఆ మహిళ కేకలు వేస్తూ దొంగతనానికి పాల్పడిన వ్యక్తి వెనకే పరుగులు తీసింది.ఈ ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డయ్యింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ బ్యాగులో రూ. 5 లక్షల విలువైన ఆభరణాలు, సెల్ఫోన్లు కూడా అందులోనే ఉన్నట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.In Pune, a couple’s gold jewellery valued at ₹4.95 lakh was stolen while they paused to buy vada pav after retrieving it from a bank. The theft occurred on Thursday outside Rohit Vadewale's shop in ShewalewadiReported by: Laxman MoreVideo Editor: Dhiraj Powar#PuneTheft… pic.twitter.com/JfXj1uuiU7— Pune Mirror (@ThePuneMirror) August 30, 2024 -
సీఎం చంద్రబాబు కోసం రప్పిస్తున్న హెలికాప్టర్ క్రాష్
సాక్షి, అమరావతి: ముంబై నుంచి బయల్దేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ పుణేలోని పౌద్ సమీపంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై నుంచి విజయవాడ వస్తుండగా హెలికాప్టర్ క్రాష్ అయ్యింది. అయితే, హెలికాప్టర్ కూలిన అనంతరం కొన్ని విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే హెలికాప్టర్‌ను ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నెల రోజుల నుంచి మెయింటెన్స్‌లో ఉన్న హెలికాప్టర్‌ను ఆగమేఘాల మీద విజయవాడకు రప్పించే యత్నం చేశారు అధికారులు.ఏవియేషన్ కో-ఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహారావు ఒత్తిడితోనే హెలికాప్టర్ విజయవాడకు బయలుదేరినట్లు సమాచారం. సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాప్టర్‌ను రప్పించే యత్నాలు చేసినట్లు తెలుస్తోంది. హెలికాప్టర్ క్రాష్ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. హెలికాప్టర్ క్రాష్‌పై పోలీసులు, ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నాయి. -
ముంబైలో కూలిన ప్రైవేటు హెలికాప్టర్..
ముంబై: మహారాష్ట్రలో ప్రమాదం చోటుచేసుకుంది. పుణెలోని పౌద్ సమీపంలో శనివారం ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం సమయంలో హెలికాప్టర్లో పైలట్, ముగ్గురు ప్రయాణికులున్నట్లు తేలింది. పైలట్‌తో సహా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.పుణెలో కురుస్తున్న భారీ వర్షాలతో వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలినట్ల పూణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎవరి ప్రాణాలకు ప్రమాదం లేదని, అందరూ సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. -
టీచర్ కాస్త రేసర్‌గా..ఏకంగా నేషనల్ కారు రేసింగ్ ఛాంపియన్షిప్..!
మనకు నచ్చిన అభిరుచి వైపు అకుంఠిత దీక్షతో సాగితే ఉన్నత విజయ శిఖరాలను అందుకోవడం ఖాయం. అలా ఎందరో గొప్ప గొప్ప విజయాలను అందుకుని స్ఫూర్తిగా నిలచారు కూడా. అలాంటి కోవకు చెందిందే డయానా పుండోల్. ఇంతకీ ఎవరీమె? ఏం సాధించిందంటే..పూణేకు చెందిన 28 ఏళ్ల డయానా పుండోల్ పురుషులే ఎక్కువగా ఇష్టపడే రేసింగ్‌ల వైపుకు అడుగులు వేసింది. రేసింగ్ అనేది పురుషాధిక్య కాంపీటీషన్ అనే చెప్పాలి. సాధారణంగా మహిళలు ఇటువైపు రావడం. అదీగాక ఎక్కువగా పురుషులే ఈ కారు రేసింగ్‌లో ఛాంపియన్ షిప్‌లు గెలుచుకుంటారు. ఇంతవరకు వాళ్లే ఈ రంగంలో అధిక్యంలో ఉన్నారు. అలాంటి సాహసకృత్యంతో కూడిన రేసింగ్‌ని డయానా ఎంచుకుంది. పైగా ఆమె తనకు ఎంతో ఇష్టమైన అభిరుచి అని చెబుతుండటం విశేషం. ఎంతో అంకితభావంతో రేసింగ్‌లో శిక్షణ తీసుకుని ఏకంగా నేషల్ కారు రేసింగ్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకుంది. అంతేగాదు ఇలాంటి ఘనత సాధించిన తొలి మహిళా రేసర్‌గా చరిత్ర సృష్టించింది. ఆమె టీచర్‌గా పనిచేస్తూ వీకెండ్లలో రేసింగ్ ప్రాక్టీస్ చేసి మరీ విజయం సాధించడం విశేషం. ఇన్నాళ్లుగా మహిళలు సాహస క్రీడల్లో పాల్గొనడం అంటే మాటలు కాదు అనే వాళ్ల నోళ్లు మూయించేలా విజయఢంకా మోగించింది డయానా. మహిళలు తలుచుకుంటే ప్రతి రంగంలో ధైర్యంగా దూసుకుపోగలరని తన గెలుపుతో చాటి చెప్పింది. అంతేగాదు పురుషలకు ఏ విషయంలోనూ మహిళలు తీసిపోరని నర్మగర్భంగా చెప్పింది. కాగా, ఆమె ఇలాంటి పలు ఇతర ప్రతిష్టాత్మకమైన రేసింగ్లలో పాల్గొంది కూడా. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రసిద్ధ రేసింగ్ కాంపిటీషన్ అన్నింటిల్లోనూ పాల్గొంది. ముఖ్యంగా దుబాయ్ ఆటోడ్రోమ్, యూరప్, యూఏఈలోని హాకెన్‌హైమ్రింగ్, బెల్జియంలోని F1 సర్క్యూట్ డి స్పా వంటి రేసింగ్లలో కూడా పాల్గొంది. పైగా రానున్న జనరేషన్ ధైర్యంగా ఇలాంటి వాటిల్లోకి వచ్చేలా ప్రేరణగా నిలిచింది. ధైర్యం, ఆత్మవిశ్వాసానికి నైపుణ్యం తోడైతే ఎలాంటి ఛాలెంజింగ్ క్రీడల్లో అయినా విజయం సాధించొచ్చని డయానాని చూస్తే తెలుస్తోంది కదూ..!. View this post on Instagram A post shared by Diana (@diana.pundole) (చదవండి: మలేషియా ప్రధానికి స్పెషల్ మిల్లెట్ లంచ్..మెనూలో ఏం ఉన్నాయంటే..!) -
విమానంలో సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై మహిళ దాడి
ముంబై: విమానంలో ఓ మహిళ.. తోటి ఇద్దరు ప్రయాణికులు, సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడికి తెగపడ్డారు. ఈ ఘటన శనివారం పుణెలోని లోహెగావ్ ఎయిర్‌పోర్టులో చోటు చేసుకుంది. ఉదయం 7. 45 గంటలకు పుణె నుంచి ఢిల్లీకి బయలుదేరే.. ఓ ప్రైవేటు విమానంలో బోర్డింగ్ ప్రాసెస్ సమయంలో ఓ మహిళ దాడికి తెడపడ్డారు. మొదట ఆ మహిళ ముందు సీట్లో ఉన్న ఇద్దరు ప్రయాణికులపై దాడి చేశారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితి చోటుచేసుకుంది. వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి విమాన సిబ్బంది, సీఐఎస్ఎఫ్ కానిస్టెబుల్స్ ఆమె వద్దకు వచ్చారు. దీంతో ఆమె మరింత రెచ్చిపోయి.. సీఐఎస్ఎఫ్ సిబ్బందిపై దాడి చేసింది. అనంతరం ఆ మహిళను, ఆమె భర్తను విమానం నుంచి దింపేశారు. ఆ మహిళను ఎయిర్ పోర్టు పోలీసులకు అప్పగించగా.. కేసు నమోదు చేశారు.సీనియర్ ఇన్స్పెక్టర్ అజయ్ సంకేశ్వరి మాట్లాడుతూ.. విచారణ కోసం సదరు మహిళకు నోటీసు ఇచ్చి విడిచిపెట్టాం. ఎయిర్‌లైన్ సిబ్బంది, సీఐఎస్ఎఫ్ సిబ్బంది,సహ ప్రయాణీకులు వాంగ్మూలాలను రికార్డు చేశాం’ అని చెప్పారు. వ్యక్తిగత అత్యవసర పరిస్థితి కారణంగా ఆమె తీవ్రమైన బాధలో ఉన్నట్లు గమనించామని, అందుకే ఆమె తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారని ఓ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ తెలిపారు. -
రూ.30 వేలకోట్ల ప్రాజెక్ట్‌లకు కేబినెట్ ఆమోదం
దేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో మెట్రో ప్రాజెక్టుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బెంగళూరు, థానే, పుణెల్లోని మెట్రో ప్రాజెక్ట్‌ల కోసం రూ.30,000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పింది. ఈ ప్రాజెక్ట్‌లను 2029 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దాంతోపాటు బగ్ద్గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయాల పరిసరాల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా మంత్రివర్గం ఆమోదం లభించిందని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు.కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..‘బెంగళూరు , థానే , పుణెల్లో దాదాపు రూ.30,000 కోట్ల విలువైన మెట్రో రైలు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌లను 2029లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దాంతోపాటు బగ్ద్గోరా, బిహ్తా, పాట్నా విమానాశ్రయ పరిసరాల్లో మౌలిక సదుపాయాలు విస్తరించేందుకు దాదాపు రూ.3,000 కోట్లు కేటాయించేలా అనుమతులు వచ్చాయి. ఈ కీలక ప్రాజెక్టులు ఆయా నగరాల వృద్ధికి దోహదపడుతాయి. 2014కి ముందు దేశంలో కేవలం ఐదు నగరాల్లో మాత్రమే మెట్రో రైలు ఉండేది. కానీ ప్రస్తుతం 21 నగరాలకు మెట్రో విస్తరించింది. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మౌలిక సదుపాయాల కల్పనకు రూ.2 లక్షల కోట్ల ఖర్చు చేసేలా ఆమోదం లభించింది’ అన్నారు.ఇదీ చదవండి: బ్యాంక్ ఖాతాలు క్లోజ్.. సమస్య పరిష్కారానికి చర్చలు‘బెంగళూరు మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేజ్-3లో రెండు కారిడార్లను అభివృద్ధి చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.15,611 కోట్ల భారం పడబోతోంది. ఈ ఫేజ్-3 ప్రాజెక్ట్ 44.65 కిలోమీటర్లతో 31 స్టేషన్లను అనుసంధానం చేస్తుంది. మెట్రో విస్తరణలో భాగంగా మూడో దశ పనులు పూర్తయిన తర్వాత బెంగళూరు నగరంలో 220.20 కిలోమీటర్ల మెట్రో రైలు నెట్వర్క్ ఉంటుంది. థానేలో కొత్తగా 22 స్టేషన్లతో ఏర్పాటు చేసే 29 కిమీ కారిడార్ కోసం రూ.12,200 కోట్లు ఖర్చు అవుతుంది. మహారాష్ట్రలో మంత్రివర్గం ఆమోదించిన మరో ప్రాజెక్ట్ కోసం రూ.2,954.53 కోట్లు ఖర్చు అవుతాయి’ అని మంత్రి వివరించారు.