వైరల్
క్రమశిక్షణ తప్పిన వారిని ‘పశువులా ప్రవర్తించకు’ అంటాం. ఈ వైరల్ వీడియోను చూస్తే మాత్రం ‘పశువును చూసి నేర్చుకో’ అంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా ఎడా పెడా దూసుకుపోయేవాళ్లు ఈ వీడియోను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పుణెలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు వచ్చిన ఒక ఆవు ఎరుపురంగు ట్రాఫిక్ లైట్‌ను చూసి అడుగు ముందుకు వెయ్యలేదు.
ట్రాఫిక్ లైట్ ఆకుపచ్చ రంగులో మారే వరకు ఓపికగా ఎదురు చూసింది. ఆ తరువాతే ముందుకు కదిలింది. మ్యూజిక్ జోడించి ఈ వీడియోను పుణె పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రోడ్డు భద్రత గురించి ప్రచారం చేయడానికి ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు. ఆవు క్రమశిక్షణకు ముచ్చటపడిన నెటిజనులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment