red
-
Akhila Bhargavan: సముద్రతీరంలో మలయాళ బ్యూటీ అందాలు.. ఫోటోలు
-
Shriya Saran: చీరలో శ్రియా శరణ్.. అచ్చం శ్రావణ లక్ష్మి లా (ఫోటోలు)
-
వాతావరణశాఖ అలర్ట్: ఐదు రాష్ట్రాలకు రెడ్.. 16 రాష్ట్రాలకు ఆరెంజ్
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. అసోంలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తూ, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. అసోం పొరుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా భారత వాతావరణశాఖ ఐదు రాష్ట్రాలకు రెడ్, 16 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. అలాగే దక్షిణ మధ్య భారతదేశంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.జమ్ముకశ్మీర్, రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో వాతావరణం నిర్మలంగా ఉండే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లలో వాతావరణం సామాన్యంగా ఉండనుంది. మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌తో పాటు ఉత్తర భారత్‌లోని రాష్ట్రాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో ఆదివారం 9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. సోమవారం, మంగళవారాల్లో ఢిల్లీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. ఈ జాబితాలో మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, గుజరాత్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్ ఉన్నాయి. -
ఆవురా... ఎంత క్రమశిక్షణ!
క్రమశిక్షణ తప్పిన వారిని ‘పశువులా ప్రవర్తించకు’ అంటాం. ఈ వైరల్ వీడియోను చూస్తే మాత్రం ‘పశువును చూసి నేర్చుకో’ అంటాం. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా ఎడా పెడా దూసుకుపోయేవాళ్లు ఈ వీడియోను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. పుణెలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గరకు వచ్చిన ఒక ఆవు ఎరుపురంగు ట్రాఫిక్ లైట్‌ను చూసి అడుగు ముందుకు వెయ్యలేదు. ట్రాఫిక్ లైట్ ఆకుపచ్చ రంగులో మారే వరకు ఓపికగా ఎదురు చూసింది. ఆ తరువాతే ముందుకు కదిలింది. మ్యూజిక్ జోడించి ఈ వీడియోను పుణె పోలీసులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. రోడ్డు భద్రత గురించి ప్రచారం చేయడానికి ఈ వీడియోను ఉపయోగిస్తున్నారు. ఆవు క్రమశిక్షణకు ముచ్చటపడిన నెటిజనులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. -
అటవిక రాజ్యం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ జరిగిన మరుసటి రోజు నుంచి జిల్లాలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోయి ప్రవర్తిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా రెండు వారాలుగా జిల్లాలో టీడీపీ మూకలు సాగిస్తున్న భౌతిక దాడులు, ఆస్తుల విధ్వంసాలు, అరాచకాలు, దాషీ్టకాలతో సామాన్య ప్రజలు వణికిపోతున్నారు. ఇళ్లల్లోకి చొరబడి మహిళలనే విచక్షణ మరిచి ఆటవికంగా హింసకు పాల్పడుతున్నారు. మరో వైపు ప్రభుత్వం నిర్మించిన సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లపై శిలఫలకాల ధ్వంసాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రభుత్వ స్థలాల కబ్జా సాగిస్తున్నారు. జగనన్న లేఅవుట్లలో పేదలు నిర్మించుకుంటున్న ఇళ్లను కూల్చేశారు. పారీ్టలో క్రియాశీలకంగా పనిచేసిన నేతల ఆస్తులను కాల్చి బూడిద చేశారు. వీరి ఆటవిక చర్యలను అడ్డుకునేందుకు సాహించలేక మౌనంగా రోధిస్తున్నారు. గతంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని ప్రజలు గుర్తుచేస్తున్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేయకపోయినా.. సంక్షేమ పథకాలు అందించారని ప్రజలు అంటున్నారు. నారా రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారా? అని మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ నేత కారు అద్దాలు ధ్వంసం వెంకటాచలం పోలీస్‌స్టేషన్ ఎదుటే వైఎస్సార్సీపీ కార్యకర్త దూడల మనోజ్‌కుమార్ తన కారును పోలీస్‌స్టేషన్ బయట నిలిపి లోపలికి వెళ్లారు. ఆ కారును టీడీపీ కార్యకర్తలు సండి సురేష్ బాలిబోయిన మహేష్ ధ్వంసం చేశారు. పోలీస్‌స్టేషన్ ఎదుటే ఈ ఘటన జరిగినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. వీఎస్యూనూ వదలని మూకలు కాకుటూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరుతో సెంట్రల్ లైబ్రరీ శిలాఫలకాలను టీడీపీ నాయకులు గడ్డపారతో శిలాఫలకాలను ధ్వంసం చేశారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలనా భవనం వద్దకు చేరుకుని, ఆయన విగ్రహాన్ని భవనంలో ఎలా ఏర్పాటు చేస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. పరిపాలన భవనంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించాలని, లేకుంటే తామే ధ్వంసం చేస్తామని అధికారులను హెచ్చరించారు.నవరత్నాల బోర్డు ధ్వంసం రామాయపట్నం గ్రామ సచివాలయంపై ఉన్న నవరత్నాల బోర్డును టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. తాడుకట్టి పైకెక్కి ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి నెల్లూరు నగరంలోని చంద్రబాబునగర్‌కు చెందిన 29వ డివిజన్ వైఎస్సార్సీపీ కార్యకర్త సాజిద్‌పై స్థానిక టీడీపీ కార్యకర్త హమీద్ తన అనుచరులతో కలిసి దాడి చేశారు. వీరి నుంచి తప్పించుకుని ఆస్పత్రికి వెళ్తున్న సాజిద్‌ను మార్గమధ్యలో అటకాయించి మరోమారు విచక్షణరహితంగా దాడి చేశారు. అప్పుడు కాదురా...ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ కాపాడతారు.. వైఎస్సార్సీపీకి చెందిన కొందరి లిస్టు తమ వద్ద ఉందని.. వీరందరికీ ఇదే గతిపడుతుందని బెదిరించారు. వైఎస్సార్సీపీ నేతలపై దాడులు కావలి పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నివాసం ముందు టీడీపీ నేతలు, కార్యకర్తలు కవి్వంపు చర్యలకు పాల్పడ్డారు. డీజే పెట్టి, బాణసంచా పేలుస్తూ రామిరెడ్డి ఇంటి గేటును కాళ్లతో తన్నుతూ వీరంగం సృష్టించారు. దగదర్తిలో వైఎస్సార్సీపీ కార్యకర్త కాండ్ర శ్రీనివాసులు ఇంటికి సంబంధించిన నిర్మాణాన్ని జేసీబీతో కూల్చేశారు. తడకలూరుకు చెందిన వైఎస్సార్సీపీ సర్పంచ్ ఆత్మకూరు గిరినాయుడిపై దాడికి తెగబడ్డారు. దీంతో గిరినాయుడి చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఎంపీపీ తాళ్లూరు ప్రసాద్‌నాయుడి ఇంటి ఎదుట కవి్వంపు చర్యలకు పాల్పడి బాణసంచా కాల్చి ఇంట్లో వేశారు. ద్విచక్ర వాహనం దహనం కావలి నియోజకవర్గంలోని దగదర్తి మండలం యలమంచిపాడులో స్థానిక టీడీపీ నాయకులు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త షేక్ మస్తాన్‌పై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోబోయిన తల్లి షేక్ బీబీపైన కూడా దాడి చేశారు. 75 ఏళ్ల వయస్సున్న వృద్ధురాలు అనే కనికరం కూడా లేకుండా తలపైన దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. అదే రోజు తడకలూరులో టీడీపీ నాయకులు స్థానిక వైఎస్సార్సీపీ కార్యకర్త యలమా వెంకటేశ్వర్లుకు చెందిన ద్విచక్ర వాహనాన్ని పెట్రోల్ పోసి తగుల బెట్టారు.ఆర్బీకే శిలాఫలకం ధ్వంసం ఉలవపాడు మండలం ఆత్మకూరులో నిర్మించిన రైతు భరోసా కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ ధ్వంసం చేశారు. దీంతో పాటు రూమ్ తాళాన్ని సైతం పగలగొట్టారు. రూమ్ లోపల ఉన్న ఫ్యాన్‌ను సైతం ఎత్తుకెళ్లారని, టీడీపీ కార్యకర్తలు ఈ పనిచేసి ఉండొచ్చని.. దీనిపై ఫిర్యాదు చేయనున్నామని కాంట్రాక్టర్ తెలిపారు. వైఎస్సార్సీపీ నేతపై దాడి బుచ్చిరెడ్డిపాళెం మండలం జొన్నవాడలో వైఎస్సార్సీపీ నేతలు గిరికృష్ణ, మురళీకృష్ణ ఇంటిపై 15 మంది టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టి భయానక వాతావరణాన్ని సృష్టించారు. దాదాపు 15 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు బైక్‌లపై తన ఇంటి ముందు పెద్ద శబ్దాలు చేస్తూ.. బయటకు రా నీ అంతు చూస్తామంటూ బెదిరించారు. తన తల్లి గుండెజబ్బుతో బాధపడుతోందని చెప్పినా, వినిపించుకోకుండా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చి తన ఇంటిపై వేశారని తెలిపారు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో మరోసారి వచ్చి కర్రలతో విచక్షణరహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా త్వరలోనే చంపేస్తామని తనను బెదిరించారు. ఈ విషయమై పోలీస్‌స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.ట్రాక్టర్, ఆక్వా సామగ్రి దహనం తోటపల్లిగూడూరు మండలంలోని కోడూరు పంచాయితీకి చెందిన వైఎస్సార్సీపీ నేత కావల్‌రెడ్డి రంగారెడ్డికి చెందిన ఓ ట్రాక్టర్, ఏయిరేటర్ల, ఇతర ఆక్వా సామగ్రిని టీడీపీ వర్గీయులు దహనం చేశారు. మాజీ మంత్రి కాకాణి సమీప బంధువైన రంగారెడ్డి గడిచిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయానికి తీవ్రంగా శ్రమించారు. ఇది గిట్టని స్థానిక టీడీపీ నాయకులే అధికార అండతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో దాదాపు రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. జగనన్న లేఅవుట్లోని నిర్మాణ ఇల్లు ధ్వంసం దుత్తలూరు మండలం ఏరుకొల్లు పంచాయతీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చిన జగనన్న లేఅవుట్లోని నిర్మాణంలో ఉన్న తొమ్మిది ఇళ్లను అదే పంచాయతీ రావిళ్లవారిపల్లికి చెందిన పిడికిటి వెంకటేశ్వర్లు జేసీబీతో ధ్వంసం చేశాడు. ఏరుకొల్లు ఎస్సీ కాలనీ సమీపంలో జగనన్న లేఅవుట్ ఏర్పాటు చేసి 36 ఇళ్లు మంజూరు చేయగా వాటిలో 20 నిర్మాణాలు చేపట్టి పునాది దశలో ఉన్నాయి. ఎస్సీ కాలనీ వాసులు వైఎస్సార్సీపీకి ఓటేశారని అక్కసుతో 9 ఇళ్ల నిర్మాణాలను జేసీబీతో ధ్వంసం చేశాడు. ఇదేమని ప్రశి్నస్తే మీ దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరించాడని ఎస్సీ కాలనీవాసులు తెలిపారు. ధ్వంసం చేసిన తొమ్మిది ఇళ్లలో 6 కాంట్రాక్టర్ నిర్మించగా 3 ఇళ్లు సొంతంగా నిర్మించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ వర్గీయులపై దాడులు చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజు అనంతసారం మండలం శంకరనగరం గ్రామంలో వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ ఇంటి వద్ద టీడీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ప్రశ్నించిన వైఎస్సార్సీపీ నేతలపై మారణాయుధాలతో దాడులకు తెగబడ్డారు. వారి ఇంట్లోకి టీడీపీ నేతలు చొరబడి టీవీలు, ఫ్రిజ్‌లను ధ్వంసం చేశారు. సర్పంచ్ వరలక్ష్మి నివాసం వద్ద డీజే, బాణసంచా కాల్చుతూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. టీడీపీ నేతలు సర్పంచ్ వరలక్ష్మి ఇంట్లోకి చొరబడి మారణాయుధాలతో దాడి చేశారు. సర్పంచ్‌పై దాడికి తెగబడ్డారు. ఇంట్లో చొరబడి ధ్వంసం ఆస్తులు చేశారు. ఆ పక్క ఇంట్లోనే ఉన్న సర్పంచ్ బంధువు రవికుమార్‌రెడ్డి, అడ్డుకోబోయిన ఆయన బావ మరిది నాగసునీల్‌రెడ్డి, మామ రామసుబ్బారెడ్డిపై గొడ్డలితో దాడి చేశారు. ఇంట్లోని వృద్ధులని కూడా చూడకుండా ఇద్దరు మహిళలపై దాడికి పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ జెండా స్థూపం ధ్వంసం నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దన్‌రెడ్డికాలనీలో ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ జెండాను, స్థూపాన్ని, శిలాఫలకాన్ని కొందరు ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ వారే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేత ఇల్లు ధ్వంసం కావలి పట్టణం 13వ వార్డు పుల్లారెడ్డినగర్‌లో వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసులురెడ్డి ఇంటి నిర్మాణ పనులను ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు శనివారం జేసీబీతో ధ్వంసం చేశారు. రెవెన్యూ అధికారులు జారీ చేసిన పట్టా ఉన్నప్పటికీ అధికారులు ఇంటి నిర్మాణ పనులను తొలగించారు. మహిళపై టీడీపీ కార్యకర్త దాడి పంచాయతీ నిధులతో నిర్మించిన రచ్చబండను టీడీపీ కార్యకర్త ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న మహిళపై ఇనుప రాడ్‌తో దాడికి తెగబడిన ఘటన వెంకటాచలం మండలం కసుమూరులో జరిగింది. పది మందికి ఉపయోగపడే రచ్చబండను ధ్వంసం చేసి ఇంటి నిర్మాణం చేసుకోవడం ఏమిటని స్థానికంగా నివాసం ఉంటున్న ఉప్పు చెంగమ్మ ప్రశ్నించడంతో సదరు టీడీపీ కార్యకర్త షేక్ మస్తాన్ ఆమె తలపై రాడ్డుతో దాడి చేశాడు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మహిళపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
Seerat Kapoor: ఎర్ర చీరలో రాణిలా వెలిగిపోతున్న హీరోయిన్ (ఫోటోలు)
-
పండెరుపు చీరలో శ్రద్ధా స్టన్నింగ్ లుక్..ధర ఎంతంటే!
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రద్ధా కపూర్ టీన్ పట్టి అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచియం అయింది. అయితే ఆషికీ-2 సినిమాతోనే శ్రద్ధా కపూర్ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ నటనకు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. ఆ తర్వాత పలు హిట్ సినిమాల్లో నటించి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఇప్పుడు శ్రద్ధా స్ట్రీ2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో శ్రద్ధా సంప్రదాయ చీరలో తళుక్కమంది. ఈ చీర ఆమె ఫ్యాషన్ శైలి ఏంటో చెప్పకనే చెప్పింది. ఆమె పూల మొక్కలతో కూడిన పండెరుపు చీరలో శ్రద్ధా ఎర్ర గులాబీలా అందంగా కనిపించింది.ఆ చీరకు తగ్గట్టు గోల్డెన్ బ్యాంగిల్స్, చక్కటి చెవిపోగులు, స్లీవ్ లెస్ బ్లౌజ్, సింపుల్ మ్యాకప్‌తో మరింతో అందంగా కనిపించిది. ఈ చీరను డిజైనర్ ధృవ్ పంచల్ తీర్చిదిద్దారు. దీని ధర ఏకంగా రూ. 31,500/-. శ్రద్ధా ఇలా చీరలో ఇంతకుమునుపు కూడా సందడి చేసింది. ప్రతి చీర ఆమె స్కిన్ టోన్‌కి తగ్గట్లుగా ఎంపిక చేసుకుంటుంది. తన లుక్ అందంగా కనిపించేలా సింపుల్ మేకప్‌కే ప్రాధాన్యత ఇస్తుంది. ఇక ఆమె నట్టించిన స్ట్రీ2 మూవీ వచ్చే నెల ఆగస్ట 15 థియోటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో తన మూవీ ప్రమోషనల్ సందడి చేసేలా తన లుక్స్ పట్ల అత్యంత జాగ్రత్తలు తీసుకుంటోంది శ్రద్ధా.. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)(చదవండి: స్లిమ్‌గా మారిన నటి విద్యాబాలన్..ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!) -
ఔట్ ఆఫ్ ది బాక్స్ సుమ అదరగొట్టేసింది (ఫొటోలు)
-
గులాబీలా మెరిసిపోతున్న హీరోయిన్ రాశీ సింగ్.. చూస్తే అంతే (ఫొటోలు)
-
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి క్లాస్ లుక్.. ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)
-
Pooja Hegde HD Photos: రెడ్ డ్రెస్సులో అగ్గి రాజేస్తున్న బుట్టబొమ్మ (ఫోటోలు)
-
Stunning Looks of Sonakshi Sinha: రెడ్ లెహంగాలో జిగేలుమంటున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా
-
రెడ్ హెడ్ డేస్ ఫెస్టివల్ గురించి తెలుసా?
రెడ్ హెడ్ డే పండుగ గురించి ఎపుడైనా విన్నారా? నెదర్లాండ్స్‌లో ఈ పండుగ అత్యంత ఘనంగా జరుగుతుంది. పేరుకు తగ్గట్టే.. ఎర్ర జుట్టు వాళ్లంతా ఒక చోట చేరి చేసుకునే వేడుక ఈ రెడ్ హెడ్ డే ఫెస్టివల్. ఇది ప్రతి ఆగస్టు చివరి వారాంతంలో టిల్బర్గ్ నగరంలో జరుగుతుంది. మూడు రోజుల పాటు జరిగే ఆ పండుగకు పలు దేశాల్లో ఉన్న ఎర్ర జుత్తు మగ, ఆడ అంతా ఒక్క చోట చేరి వేడుక చేసుకుంటారు. ఈ ఏడాది ఆగస్టు 23-25 తేదీల్లో ఈ పండుగను నిర్వహించనున్నారు. అంతేకాదు ఎర్ర జుట్టు లేని వాళ్లు పాల్గొనాలంటే ఎర్ర రంగు బట్ట లేసుకోవాలనే నియమాన్ని పాటిస్తారు. జన్యుపరమైన మార్పులతో ఇలా ఎర్ర జుత్తు వస్తుంది. ప్రపంచ జనాభాలో దాదాపు ఒక శాతం ప్రజలకు ఎర్ర జుత్తు ఉందని ఒక అంచనా. స్కాట్లాండ్, రష్యాలలో రెడ్ హెయిర్ ఉన్నవారు ఎక్కువగా ఉన్నారట. -
లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు.. మరోసారి విచారణ వాయిదా
సాక్షి, విజయవాడ: ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ బెదిరింపుల కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయడానికి టీడీపీ లాయర్లు మళ్లీ సమయం కోరగా, మార్చి 11కి విచారణను కోర్టు వాయిదా వేసింది. గత రెండు నెలలగా ఏసీబీ కోర్టులో వాయిదాలతో టీడీపీ న్యాయవాదులు నెట్టుకొస్తున్నారు. కేసు విచారణ జరగకుండా మొదటి నుంచి లోకేష్ యత్నిస్తున్నారు. కౌంటర్ దాఖలు చేయాలని స్వయంగా ఏసీబీ కోర్టు ఆదేశాలను కూడా లోకేష్ పట్డించుకోలేదు. యువగళం ముగింపు రోజు మీడియా ఛానెళ్ల ఇంటర్వ్యూలలో లోకేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయించారని.. రిమాండ్ విధించడం తప్పంటూ ఏసీబీ న్యాయమూర్తిపై దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారు. అధికారులపై రెడ్ బుక్ పేరుతో బెదిరింపులకు దిగారు. లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులపై ఏసీబీ కోర్టులో రెండు నెలల క్రితం సీఐడీ పిటీషన్ దాఖలు చేసింది. కౌంటర్ దాఖలు చేస్తే అడ్డంగా దొరికిపోతామనే భయంతో వాయిదాలతో నెట్టుకొస్తున్నారు. స్వయంగా ఏసీబీ కోర్టు నుంచి లోకేష్‌కి నోటీసులు జారీ కాగా, ఏసీబీ కోర్టు ఆదేశాలని సైతం లోకేష్ లెక్కచేయలేదు. నేటి విచారణలో మరోసారి టీడీపీ లాయర్లు వాయిదా కోరారు. -
కొంప ముంచే డైరీలు..!
ఆనాడు హవాలా జైన్ డైరీ.. నేడు లోకేష్ రెడ్ డైరీ.. తెలంగాణాలో రేవంత్ రెడ్డి డైరీ.. వీళ్లంతా డైరీల పేరిట జనాన్ని భయపెడుతున్నారో లేక రాజకీయాల్లో హడావుడి చేస్తున్నారో తెలీదు కానీ వీళ్ళ పుణ్యాన డైరీల్లోని రహస్యాలు.. అందులోని అంశాలు.. వాటి పర్యవసానాలు ఎక్కడికి తీసుకుపోతాయోనన్న సందేహం ప్రజల్లో నెలకొంది. ఇప్పుడు డైరీలు రాయడం.. ఎదుటివాళ్లను బెదిరించడం ఒక ఫ్యాషన్ అయింది. అప్పట్లో స్కూల్లో టీచర్ బయటికి వెళ్తూ.. ఒరేయ్ లీడర్.. క్లాసులో అల్లరిచేసే వాళ్ళ పేర్లు పుస్తకంలో రాయి.. మళ్ళీ వచ్చి ఒక్కొక్కడికి వీపులు వాయగొడతాను అని చెప్పి వెళ్తాడు.. ఆ లీడర్ అలాగే తనకు నచ్చనివాళ్ళ పేర్లు... ఇంటర్వెల్లో జామకాయలు.. రేగ్గాయలు ఇవ్వని వాళ్ళను.. సైకిల్ అడిగితె ఇవ్వని వాళ్ళ పేర్లన్నీ రాసేసి టీచరుకు ఇచ్చి దెబ్బలు కాయిస్తాడు.. అచ్చం ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే నడుస్తోంది.. ఆంధ్రాలో లోకేష్ సైతం తన యువగళం పాదయాత్ర చేస్తున్నానని రోజులూ ఒక ఎర్ర బుక్కు పట్టుకుని ఉండేవారు.. తనకు నచ్చని.. తమ పార్టీని.. తమ క్యాడర్ ను ఇబ్బంది పెట్టినవాళ్లందరినీ మున్ముందు అధికారంలోకి వచ్చాక శిక్షిస్తాను అని చెబుతూ వాళ్ళ పేర్లు రాసుకునేవారు. పోలీసులు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులూ.. కార్యకర్తలు .. అధికారులు.. ఇలా రకరకాల వాళ్ళను టార్గెట్ చేస్తూ వారి పేర్లను రెడ్ బుక్కులో రాస్తున్నాను .. మా ప్రభుత్వం వచ్చాక వాళ్ళను కట్ డ్రాయర్లతో నడిపిస్తాను అని హెచ్చరించారు. ఇది ఆపూటకు ఆ మీటింగులో లోకేష్‌కు మైలేజి తెచ్చిందో లేదో తెలీదు కానీ.. జనం మాత్రం నవ్వుకున్నారు.. ఇలా ప్రతీకారం తీర్చుకోవడానికి ఇదేమైనా రాచరికపు కాలంలో ఉన్నామా అనే కామెంట్లు కూడా వచ్చాయి. గతంలో నిషిద్ధ పీపుల్స్ వార్ నక్సలైట్లు మాత్రమే ఇలా డైరీ రాసేవారు. తమ వర్గశత్రువుల పేర్లు ఆంటే ఎమ్మెల్యేలు ఆ జిల్లాలోని కొందరు పోలీసుల పేర్లు అందులో రాసి వాళ్ళను టార్గెట్ చేసి హత మార్చేవారు. అచ్చం ఆ డైరీని తలపించే లోకేష్ రెడ్ డైరీ మీద ఆంధ్ర సీఐడీ కేసు బుక్ చేసింది. విచారణకు సైతం రమ్మని నోటీసులు పంపింది. సిమ్మాదిరప్పన్న -
ఆ సీఎం "మాయగాడు"! అతని 'రెడ్ డైరీ'లో ప్రతీ పేజీ..
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గెహ్లోత్ ఓ మాయాగాడు అంటూ ఫైర్ అయ్యారు. అతను రాష్ట్రంలో తుపాకులకే ఎక్కువ పనిచెప్పాడని విమర్శించారు. అతని రెడ్‌డైరి తన దగ్గరుందని అందులోని ప్రతి పేజీ గురించి చెబితే.. దెబ్బకు గెహ్లోత్ ముఖం మాడిపోవడం ఖాయం అని ఆరోపణలు చేశారు. ఈ మేరకు రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో బరాసన్ అంటాలో జరిగిన ప్రచారా ర్యాలీలో మోదీ ముఖ్యమంత్రి గెహ్లోత్‌పై ఈవిధమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ రెడ్ డైరీలో..ఐదేళ్ల కాంగ్రెస్ పాలనలో రాజస్తాన్‌లోని ప్రతి భూమి, నీరు, అడవి ఎలా అమ్ముపోయాయో అనే వివరాలు ఉన్నాయని, అందుకు సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషన్ తన దగ్గర ఉందన్నారు. ముఖ్యంగా గెహ్లోత్ పాలనలో జరిగిన నేరారోపణలకు సంబంధించిన సమాచారం అంతా ఉందన్నారు . అందుకు సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవ్వడం గమనార్హం. ఈ సందర్భంగా మోదీ జూలైలో జరిగిన అసెంబ్లీ సమావేశం గురించి గుర్తుకు తెచ్చుకున్నారు. ఆ సమావేశంలో అప్పటి రాష్ట్ర మంత్రి రాజేంద్ర సింగ్ మహిళల భద్రతా అంశాన్ని లెవనెత్తారు. మణిపూర్‌లో మహిళలపై జరిగిన నేరాల విషయమై ఆత్మపరిశీలన చేసకోవాలని చురకలంటించారు. అంతే ఆ తర్వాత కొన్ని గంటల్లోనే గెహ్లోత్ ప్రభుత్వం ఆయన్ను తొలగించిందంటూ చెప్పుకొచ్చారు. అంతేగాదు ఆయన హాయాంలో జరిగిన అవినీతి గురించి కూడా ప్రస్తావించారు మోదీ. కాంగ్రెస్ అంటే అవినీతి, రాజవంశం, బుజ్జగింపులకు చిహ్నం అంటూ ఎద్దేవా చేశారు. నిజానికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయ్యింది. ప్రస్తుతం మన ముందు అభివృద్ధి చెందిన భారత్‌గా తీర్చిదిద్దడమేనదే లక్ష్యం, కానీ రాజస్తాన్ అభివృద్ధి చెందకుండా అభివృద్ధి చెందిన భారత్‌గా మార్చడమనే లక్ష్యం ఎలా సంపూర్ణమవుతుందన్ని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కి చిహ్నం అయినా ఆ మూడే.. దేశానికి అతిపెద్ద శత్రువులని, అవి మన మధ్య ఉన్నంతవరకు అభివృద్ధి చెందిన భారత్‌గా ఎలా మార్చగలం అని నిలదీశారు. ఇంకా మోదీ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీలోని ప్రతిఒక్కరూ సంయమనం లేనివారనని తిట్టిపోశారు. అది మంత్రి అయినా ఎమ్మెల్యే అయినా ఒకేలా ప్రవర్తిస్తారని, ఈ విషయంలో ప్రజలు సైతం చిరాకుపడుతున్నారంటూ చివాట్లు పెట్టారు. కాగా, కరణ్‌పూర్ కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కునార్ అకాల మరణంతో ఆ నియోజక వర్గంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. అందువల్ల 200 అసెంబ్లీ స్థానాలున్న రాజస్తాన్‌లో ప్రస్తుతం 199 స్థానాలకే అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 200 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ 99 సీటులు దక్కించుకోగా, బీజేపీ 73 సీట్లు గెలుపొందింది. దీంతో కాంగ్రెస్ పార్టీ చివరికి బీఎస్పీ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతు కూడగట్టుకుని గెహ్లోత్‌ని సీఎంగా ప్రమాణం స్వీకారం చేయించింది . (చదవండి: అసెంబ్లీ ఎన్నికల కోసం ఒకే ఎత్తుగడతో ఇరు పార్టీలు! ఏది హిట్ అవుతుందో?) -
‘మార్స్ ’ రెడ్ ప్లానెట్ ఎందుకయ్యింది? విలక్షణత ఎలా వచ్చింది?
మార్స్ అంటే అంగారక గ్రహం. ఇది ఎర్రగా కనిపించడం వెనుక అనేక కారణాలున్నాయి. వీటిలో మొదటిది దాని ఉపరితలం నిర్మాణంతో ముడిపడి ఉంది. కాగా ఐరన్ ఆక్సైడ్ ఉనికిని రస్ట్ అని అంటారు. ఆక్సిజన్‌తో పాటు తేమకు చేరువైనప్పుడు భూమిపై ఉన్న ఇనుప వస్తువులు తుప్పు పడతాయి. ఇదేవిధంగా మార్స్‌పై ఇనుము ఆక్సీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఫలితంగా అంగారక గ్రహం నేల, రాళ్ళకు విలక్షణమైన ఎరుపు రంగు సంతరించుకుంటుంది. భూమితో పోలిస్తే మార్స్ బలహీనమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది. అక్కడి వాతావరణం కార్బన్ డయాక్సైడ్తో కూడి ఉంటుంది. ఈ బలహీన వాతావరణంలో సూర్యరశ్మి భిన్నంగా వెలువడుతుంది. సూర్యరశ్మి అంగారకుని వాతావరణంలోకి ప్రవేశించినప్పుడు రేలీ స్కాటరింగ్ అనే ప్రక్రియ జరుగుతుంది. దీని వలన కాంతిలోని తక్కువ తరంగదైర్ఘ్యాలు (నీలం, ఆకుపచ్చ వంటివి) ఎక్కువ వెదజల్లుతాయి. ఎక్కువ తరంగదైర్ఘ్యాలు (ఎరుపు, నారింజ వంటివి) ప్రబలంగా మారతాయి. ఇదే అక్కడి ఎరుపు రంగుకు కారణం. మార్స్ చరిత్రలో గణనీయమైన అగ్నిపర్వత కార్యకలాపాలు జరిగాయి. ఈ విస్ఫోటనాల సమయంలో విడుదలయ్యే అగ్నిపర్వత శిలలు, ఖనిజాలు కూడా గ్రహం రంగుకు దోహదం చేస్తాయి. అంగారక గ్రహంపై ఉన్న కొన్ని అగ్నిపర్వత పదార్థాలు, వాతావరణం మారినప్పుడు ఎరుపు రంగును ఉత్పత్తి చేస్తాయి. అంగారక గ్రహంపై భారీగా దుమ్ము తుఫానులు చోటుచేసుకుంటాయి. సూక్ష్మ ధూళి కణాలతో నిండిన ఈ తుఫానులు, సూర్యరశ్మి వెదజల్లినప్పుడు మార్స్కున్న ఎరుపు రూపాన్ని మరింత వృద్ధి చేస్తాయి. ఈ రంగు ఖగోళ శాస్త్రవేత్తలు, అంతరిక్ష ప్రేమికులను ఆకర్షిస్తూనే ఉంటుంది. అంగారక గ్రహాన్ని అధ్యయనం చేసేందుకు కూడా అక్కడి ఎరుపురంగు దోహదపడుతుంది. ఇది కూడా చదవండి: దోమలను ఎవరు ఇష్టంగా తింటారు? -
ఎత్తయిన భవనాలపై ఎర్ర లైట్లు ఎందుకు? విమానాలకు సంబంధం ఏమిటి?
మీరు ఎప్పుడైనా ఏదైనా మహానగరంలో రాత్రిపూట ఆకాశం వైపు చూసినప్పుడు కొన్ని ఎత్తైన భవనాల పైన ఎరుపురంగు లైట్లు కనిపిస్తాయి. ఈ రెడ్ లైట్లు అలంకారం కోసం కాదని, దీని వెనుక ప్రత్యేక కారణం ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మహానగరాలు కాంక్రీట్ అడవులుగా ఎప్పుడో మారిపోయాయి. ఆ నగరాల్లో ఎత్తైన భవనాలన్నింటిపైనా ఈ తరహా లైట్లను ఏర్పాటు చేస్తుంటారు. ఈ లైట్లు భారీ భవనాలపైననే ఎందుకు కనిపిస్తాయి? ఓ మాదిరి భవనాలపై ఎందుకు కనిపించవు? దీని వెనుక ఏదైనా ప్రభుత్వ మార్గదర్శకం ఉందా లేదా భద్రతా కారణాల దృష్ట్యా ఇలా చేస్తున్నారా? ఈ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. భవనాల పైభాగంలో ఎరుపు రంగు దీపాలను అమర్చడానికి ప్రధాన కారణం విమాన భద్రత. ఈ లైట్లను ఏవియేషన్ అబ్స్ట్రక్షన్ లైట్లు లేదా ఎయిర్‌క్రాఫ్ట్ వార్నింగ్ లైట్లు అని అంటారు. ఆకాశహర్మ్యాలు, కమ్యూనికేషన్ టవర్లు, విండ్ టర్బైన్లు తదితర ఎత్తైన నిర్మాణాలు.. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలకు ముప్పును కలిగిస్తాయి. ముఖ్యంగా దృశ్యమానత తగ్గినప్పుడు, అననుకూల వాతావరణంలో రెడ్ లైట్లు నిరంతర ఫ్లాషింగ్ సిగ్నల్స్‌ను విడుదల చేస్తాయి. అవి విమాన పైలట్లకు సులభంగా కనిపిస్తాయి. ఇది విమానాలకు హెచ్చరికలా పనిచేస్తుంది. విమానయాన అధికారులకు ప్రమాదాలను నివారించడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇటువంటి లైట్ల ఏర్పాటుకు సంబంధించి పలు దేశాలలో కఠినమైన నిబంధనలను ఉన్నాయి. ఎయిర్ ట్రాఫిక్ భద్రతను నిర్ధారించడానికి ఈ నియమాలను పాటించడం తప్పనిసరి. ఈ లైట్లను అమర్చనిపక్షంలో భవన యజమానులు జరిమానాలతో పాటు చట్టపరమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎత్తైన భవనాలపైన ఉండే రెడ్ లైట్లు విమానాల కోసం నావిగేషనల్ ఎయిడ్స్‌గా కూడా పనిచేస్తాయి. వాటి స్థానాన్ని, దిశను గుర్తించడంలో సహాయపడతాయి. విమాన భద్రతతో పాటు, భవనాలపై కనిపించే ఎరుపురంగు లైట్లు సమీపంలోని ఎత్తైన నిర్మాణాలకు హెచ్చరికగా కూడా పనిచేస్తాయి. ఇది కూడా చదవండి: దేశంలోని తొలి సినిమాహాలు ఏది? ఏ సినిమాలు ఆడేవి? -
సాక్షి మనీ మంత్రా: నష్టాలతోనే ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
today stock market opening: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. క్రితం రోజు భారీ నష్టాలతో ముగిసిన సూచీలు ఏ మాత్రం కోలుకోలేదు. ఉదయం ట్రేడింగ్ ప్రారంభ సమయానికి సెన్సెక్స్ 552 పాయింట్ల నష్టంతో 65,059 వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల క్షీణతతో 19,400 వద్ద కొనసాగుతున్నాయి. నెస్లే, అదానీ ఎంటర్‌ప్రైజస్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్లు టాప్ గెయినర్స్‌గా కొనసాగుతున్నాయి. ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, మారుతీ సుజుకీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు టాప్ లూజర్స్ జాబితాలో ఉన్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) -
ఎర్రమట్టికి, ఎర్రమట్టి దిబ్బలకు తేడా తెలుసుకో పవన్
కొమ్మాది (భీమిలి): ఎర్రమట్టికి, ఎర్రమట్టి దిబ్బలకు తేడా తెలుసుకోవాలని ఇక్కడి జేవీ అగ్రహారం, నిడిగట్టు, కొత్తవలస రైతులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సూచించారు. పర్యాటక ప్రాంతం ఎర్రమట్టి దిబ్బలను ధ్వంసం చేస్తున్నారంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలను వారు ఖండించారు. గురువారం ఎర్రమట్టి ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతులు మాట్లాడారు. దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్న సమయంలో ఈ ప్రాంతాల్లో ఒక్కో రైతుకు 5 ఎకరాలు ఇచ్చారని తెలిపారు. కాలక్రమేణా పంటలు పండకపోవడంతో ప్రభుత్వం ఈ భూములను అభివృద్ధి చేస్తామనడంతో లాండ్ పూలింగ్‌కు ఇచ్చామని, తమపై ఎటువంటి ఒత్తిడీ లేదని చెప్పారు. బుధవారం పవన్ పర్యటించిన ప్రాంతం నుంచి కనుచూపు మేరలో కూడా ఎర్రమట్టి దిబ్బలు లేవన్నారు. అసలు ఎర్రమట్టి కనిపించే ప్రాంతమంతా ఎర్రమట్టి దిబ్బలు కావని పవన్ తెలుసుకోవాలన్నారు. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మట్టి ఎర్రగా ఉంటుందని, అలా అని ఊరంతా ఎర్రమట్టి దిబ్బలంటే ఎలా అని ప్రశ్నించారు. పవన్ పర్యటించిన ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం నాయకులు రైతుల వద్ద తక్కువ ధరకు డీఫారం భూములు కొన్నారని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక లాండ్ పూలింగ్ ద్వారా రైతులకు మేలు జరిగిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో భూములు చవగ్గా లాగేసుకున్నా మాట్లాడని పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. పవన్ వాస్తవాలు తెలుసుకుని ప్రజల్లోకి వెళ్లాలే తప్ప ఇతర పార్టీల లబ్ధికోసం పేదల పొట్టకొట్టడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రైతులతోపాటు వైఎస్సార్సీపీ వార్డు అధ్యక్షుడు రమణారెడ్డి, నాయకులు రామకృష్ణ, నల్లబాబు, చంటి తదితరులు పాల్గొన్నారు. -
దంచికొడుతున్న వానలు.. మళ్లీ యమునకు పోటెత్తిన వరద.. రెడ్ అలర్ట్ జారీ
ఢిల్లీ: ఉత్తరాదిలో వర్షాలు కాస్త తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పుంజుకున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు పలు రాష్ట్రాలను మళ్లీ వణికిస్తున్నాయి. ఇప్పటివరకు సంభవించిన వరదల భీబత్సం నుంచి తేరుకోకముందే మరోమారు ముప్పు పొంచి ఉంది. నిన్న రాత్రి ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో వానలు దంచికొట్టాయి. దీంతో ప్రయాగ్‌రాజ్ వద్ద గంగా, యమునా నది ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోయింది. వర్షాలకు తోటు రహదారులపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఉత్తరప్రదేశ్‌లో గంగ, యమునా నది ప్రవాహం ఉద్దృతంగా ప్రవహిస్తోంది. ఫఫమౌ వద్ద గంగా నది ప్రవాహం 11 సెంటీమీటర్ల నుంచి 24 సెంటీమీటర్ల వరకు పెరిగిపోయింది. నైనీ వద్ద యమునా నది 29 సెంటీమీటర్ల మేర పెరిగింది. ఉత్తరఖండ్‌లో చమోలీ జిల్లాలో జాతీయ రహదారి 7పై కొండచరియలు విరిగిపడ్డాయి. వర్షాలతో రాష్ట్రంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. అటు అసోంలోనూ వరదలు సంభవించాయి. దాదాపు 47 జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. 32,400 మంది ప్రజలు వరదలకు ప్రభావితమయ్యారు. గత 24 గంటల్లో కురిసిన వర్షాలకు ఉత్తరప్రదేశ్‌లో 10 మంది వరకు మరణించారు. పంజాబ్, హర్యానాల్లో వర్షాలకు దాదాపు 55 మంది మృతి చెందినట్లు సమాచారం. ఇక వరదలతో అతలాకుతలం అయిన హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటికే రూ.8000 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గత మూడు రోజులుగా యమునా నది ప్రవాహం పెరగడంతో ఢిల్లీ వణికిపోయింది. ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగుపడినా ఇంకా కొన్ని ప్రాంతాలు వరద నీటిలోనే ఉన్నాయి. త్రాగునీటి వ్యవస్థ, విద్యుత్ సరఫరాకు ఇంకా కొన్ని ప్రాంతాల్లో అంతరాయం కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు వర్షాల రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. రాజ్‌ఘాట్ నుంచి నిజాముద్దీన్ మార్గంలో ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఐపీ ఫ్లైఓవర్ రింగ్ రోడ్డు కాకుండా వేరే మార్గంలో రావాలని వాహనదారులకు సూచనలు చేస్తున్నారు పోలీసులు. ఇదీ చదవండి: వరద గుప్పిట ఉండగానే మళ్లీ అందుకున్న భారీ వర్షం.. ఢిల్లీలో స్తంభించిన జనజీవనం -
ఆ తేనెలో మద్యానికి మించిన మత్తు.. ఎక్కడ దొరుకుతుందంటే..
తేనె గురించి, అది అందించే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం ఎప్పుడో ఒకప్పుడు వినేవుంటాం. తేనె పలు వ్యాధులను కూడా దూరం చేస్తుందని చెబుతుంటారు. అయితే మీరు ఎప్పుడైనా ఎర్ర తేనె గురించి విన్నారా? ఇది ఎంతో మత్తును కలిగిస్తుంది. పెద్ద తేనె టీగలు ఈ తేనెను తయారుచేస్తాయి. ఈ తేనెను ఉత్పత్తి చేసే తేనెటీగలను ‘హిమాలయన్ క్లిఫ్ బీస్’ అని అంటారు. ఈ తేనెకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎర్ర తేనెను ఉత్పత్తి చేసేందుకు ‘హిమాలయన్ క్లిఫ్ బీస్’ విషపూరితమైన పండ్ల రసాన్ని సేకరిస్తాయి. ఈ తేనె ఎంతో మత్తునిస్తుంది. దీనిలో పలు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ఈ ఎర్ర తేనెకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. ఈ తేనె తీసుకోవడం వలన లైంగిక సామర్థ్యం పెరుగుతుందని చెబుతారు. డయాబెటీస్‌తో పాటు హైబ్లడ్ ప్రజర్‌ను ఇది తగ్గిస్తుందని చెబుతారు. ఇది అందించే మత్తు కారణంగా దీనికి అత్యధిక డిమాండ్ ఏర్పడిందని అంటారు. ఎర్ర తేనె నేపాల్ శివారు ప్రాంతాలలో లభ్యమవుతుంది. కాగా ఈ తెనె తీయడం ఎంతో ప్రమాదకరమని చెబుతారు. సాధారణ తీసే విధానం కన్నా ఇది ఎంతో కష్టమైనది. ఎర్ర తేనెను గురూంగా గిరిజన జాతివారు ఎంతో చాకచక్యంగా సేకరిస్తుంటారు. ఈ తేనె సేకరించేందుకు ముందుగా ఒక తాడు సహాయంతో ఎన్నో అడుగుల ఎత్తయిన ప్రాంతానికి చేరుకుంటారు. తరువాత పొగ సాయంతో తేనేటీగలను తరిమికొడతారు. ఈ నేపధ్యంలో తేనె సేకరించేవారు తేనెటీగల దాడికి కూడా బలవుతుంటారు. ఎర్ర తేనె అత్యధిక మత్తు కలిగిన ఎస్బింథే లాంటిది. ఎస్బింథే వినియోగంపై పలు దేశాల్లో నిషేధం ఉంది. ఎరుపు తేనెను అధికమోతాదులో తీసుకుంటే హృదయ సంబంధిత వ్యాధుల బారినపడే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కూడా చదవండి: డాక్టర్‌కు షాకిచ్చిన సమోసాలు.. రూ 1.40 లక్షలకు టోకరా! -
ఆ ప్రాంతంలో పోలీసులకు ఎర్రని టోపీలు... కారణం ఇదే!
దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పోలీసుల యూనిఫారం విభిన్నంగా ఉండటాన్ని మనం గమనించే ఉంటాం. అయితే చాలా రాష్ట్రాల్లో పోలీసుల యూనిఫారం ఖాకీ రంగులోనే ఉంటుంది. అయితే ఆ రాష్ట్రంలోని పోలీసుల యూనిఫారం మరింత విభిన్నంగా ఉంటుంది. అక్కడి పోలీసులు తలపై ఎర్రని రంగు టోపీ ధరిస్తారు. ఇటువంటి టోపీని ఏ రాష్ట్రంలోనూ ధరించరు. ఈ టోపీ తయారీ కూడా ఇతర టోపీల కన్నా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ తరహాలోని టోపీని పెట్టుకున్న పోలీసులను ఎంత దూరం నుంచి అయినా ఇట్టే గుర్తించవచ్చు. అయితే అక్కడి పోలీసులు ఎర్రని టోపీని ఎందుకు ధరిస్తారు? ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్రప్రాంతమైన పుదుచ్చేరికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మన దేశానికి స్వాతంత్ర్యం లభించిన చాలా ఏళ్ల తరువాత పుదుచ్చేరికి స్వాతంత్య్రం లభించింది. తరువాత అది భారత్‌లో భాగమయ్యింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం లభించగా, పుదుచ్చేరి మాత్రం ఫ్రాన్స్ ఆధీనంలోనే ఉంది. అక్కడ ఫ్రాన్స్ న్యాయవ్యవస్థనే కొనసాగింది. అయితే 1954లో పుదుచ్చేరి భారత్‌లో విలీనమయ్యింది. అప్పటి నుంచి అక్కడ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. అలాగే కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. దీని తరువాత పుదుచ్చేరిలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. అయితే పోలీసులు ధరించే ఎరుపు రంగు టోపీ విషయంలో ఎటువంటి మార్పు రాలేదు. ఫ్రాన్స్ పోలీసులు ఎరుపురంగు టోపీని ధరిస్తారు. ఇప్పటికీ అదే విధానం కొనసాగుతోంది. ఇక్కడి పోలీసులు ఎరుపురంగు టోపీ ధరించడానికి ఇదే ప్రధాన కారణం. అయితే ఎరుపు రంగు టోపీని ఇక్కడి పోలీసు విభాగంలోని ఉన్నతాధికారులు ధరించరు. కేవలం కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు మాత్రమే వీటిని ధరిస్తారు. అయితే వీరి టోపీలలో ఎంతో భిన్నత్వం కనిపిస్తుంది. కానిస్టేబుల్ ధరించే టోపీపై నలుపు రంగు గీత కనిపిస్తుంది. హెడ్‌కానిస్టేబుల్ టోపీపై పసుపు రంగు గీతలు కనిపిస్తాయి. చదవండి: వరుని మెడలో దండ వేసే సమయంలో షాకిచ్చిన వధువు -
పేద రైతు కుటుంబం నుంచి కోట్ల రూపాయల సంపాదన ఎలా ?
-
లాభాల్లోంచి నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు, జోరుగా ఆటో
సాక్షి, ముంబై: భారతీయ ఈక్విటీ బెంచ్‌మార్క్‌లు సోమవారం సెషన్‌ను సానుకూలంగా ప్రారంభించాయి. కానీ ఆ తరువాత నష్టాల్లోకి మళ్లాయి. ఆరంభంలో 100 పాయింట్లుకు పైగా ఎగిసిన సెన్సెక్స్ 99 పాయింట్ల నష్టంతో 58891 వద్ద, నిఫ్టీ19 పాయింట్లు కోల్పోయి 17339 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, ఆయిల్ అండ్‌గ్యాస్ సెక్టార్లు లాభాల్లోనూ, ఐటీ, బ్యాంకింగ్ నష్టాల్లోనూ ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్, హీరో మోటో కార్ప్ లాభ పడుతుండగా, బీపీసీఎల్, అదానీ, హెచ్‌యూఎల్, టెక్ మహీంద్ర, నెస్లే నష్ట పోతున్నాయి. -
Fashion: క్రిస్మస్ వేడుకలో మరింత వెలిగిపోయేలా..
కొన్ని రంగులు కొన్ని సందర్భాలలో ప్రత్యేకత నింపుకుంటాయి. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ కాంబినేషన్లో చేసే హంగామా క్రిస్మస్ వేడుకలో మరింతగా వెలిగిపోయేలా చేస్తుంది. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగు కాంబినేషన్ల డ్రెస్‌లు మాత్రమే కాదు ఇతర అలంకార వస్తువుల్లోనూ ప్రత్యేకత చూపవచ్చు. వాటిలో చేతికి ధరించే బ్రేస్లెట్స్, మెడలో ధరించే నెక్‌పీస్, క్రోచెట్ హ్యాండ్ బ్యాగ్స్, హెయిర్ క్లిప్స్ అండ్ బ్యాండ్స్, చెవులకు హ్యాంగింగ్స్ వేడుక ప్రతిఫలించేలా ఎంపిక చేసుకోవచ్చు. నెయిల్ ఆర్ట్‌లో భాగంగా క్రిస్మస్ ట్రీ, శాంటాక్లాజ్, స్టార్స్ డిజైన్స్‌తో మరింతగా మెరిసిపోవచ్చు. క్రిస్మస్ ట్రీలా నిండైన పచ్చదనాన్ని, ఆత్మీయ ఆప్యాయతలను పంచుకునే కానుకలా, స్వచ్ఛతకు ప్రతిరూపంగా నిలుస్తూ భూమిపైన నక్షత్రాల్లా మెరవాలని ఈ రంగులు సూచిస్తుంటాయి. అందుకే ఈ పండగ పూట అలంకరణలో ఈ రంగులు ప్రధాన భూమికను పోషిస్తుంటాయి. ఆధునికంగానూ ఉంటూనే అంతే హంగునూ పరిచయం చేసే ఈ కలెక్షన్ పండగ వేళ ఎంచుకుంటే మరింత ప్రత్యేకంగా కనిపిస్తారు. చదవండి: Malavika Sharma: అందమైన అల్లికల శారీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక! చీర ధర 68 వేలకు పైమాటే -
దలాల్ స్ట్రీట్‌లో వరుసగా ఆరవ రోజూ నష్టాలే!
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతోనే ముగిసాయి. ఆరంభ నష్టాలనుంచి ఏ మాత్రం కోలుకోని సూచీలు చివరికి భారీ నష్టాలనుమూటగట్టుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 509 పాయింట్లు పతనమై 56598 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 16858 వద్ద ముగిసింది. దలాల్ స్ట్రీట్‌లో వరుసగా ఆరవ రోజు కొనసాగిన నష్టాలతో ట్రేడర్ల వేల కోట్ల సంపద హారతి కర్పూరంలా కరిగి పోతోంది. ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లు భారీగా నష్టపోయాయి. యాక్సిస్ బ్యాంక్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యుస్టీల్, యాక్సిస్ బ్యాంకు, ఐటీసీ, రిలయన్స్ భారీగా నష్ట పోయాయి. ఏసియన్ పెయింట్స్, సన్ ఫార్మా, డా. రెడ్డీస్, ఐషర్ మోటార్స్, నెస్లే లాభపడ్డాయి. అటు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి 44 పైసలు క్షీణించి 81.94 వద్ద రికార్డు కనిష్టానికి చేరింది. -
ఎర్ర బంగారం ధగధగ.. క్వింటా రూ. 16,000
కర్నూలు: ఎర్ర బంగారం ధగధగ మెరుస్తోంది. ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. కర్నూలు జిల్లాలో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 17 వేల హెక్టార్లు కాగా.. ఈ ఏడాది అత్యధికంగా 23,670 హెక్టార్లలో సాగు చేశారు. ప్రత్యేకంగా ఎండు మిరప కోసం జిల్లా వ్యాప్తంగా 28,368 ఎకరాల్లో సాగు చేశారని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, నంద్యాల, కోవెలకుంట్ల, రుద్రవరం, శిరివెళ్ల, సంజామల, జూపాడుబంగ్లా, నందికొట్కూరు, మిడ్తూరు, పగిడ్యాల, పాములపాడు, కొత్తపల్లి ప్రాంతాల్లో విస్తారంగా సాగు చేశారు. పంట సాగు చేసినప్పటి నుంచి బింగి, నల్ల తామర వైరస్ తెగుళ్లు వ్యాపించటంతో పంటను కాపాడుకునేందుకు రైతులు కష్టాలు పడ్డారు. చదవండి: వెంగమ్మ పేణీలు.. రుచి మామూలుగా ఉండదు! రసాయన మందుల పిచికారీతో పాటు ఎరువుల కోసం ఎకరాకు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు వెచ్చించారు. సాధారణంగా ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా చీడపీడలు, వాతావరణ పరిస్థితులు అనుకూలించగా 12 నుంచి 15 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ మొదటి కోత పూర్తయింది. దిగుబడి తగ్గినా ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు కొంత ఊరట చెందుతున్నారు. గతేడాది క్వింటా రూ.8,000 – రూ.10,000 వరకు మాత్రమే పలికింది. ప్రసుత్తం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డులో సూపర్ –10 రకం ధర క్వింటా రూ.16,000, 116 రకం రూ. 15,000 పలుకుతోంది. బ్యాడిగ రకం క్వింటా రూ. 18,000 వరకు పలుకుతుందని రైతులు చెబుతున్నారు. జిల్లాలో మిర్చి కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు లేకపోవడంతో గుంటూరు యార్డుకు, కర్ణాటకలోని బ్యాడిగ మార్కెట్‌కు తరలిస్తున్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో కొంత మేర కొనుగోళ్లు జరుగుతున్నా ధరలో చాలా వ్యత్యాసం ఉండటంతో రైతులు వ్యయప్రయాసలతో గుంటూరు మార్కెట్‌కు తరలిస్తున్నారు. నంద్యాలకు మంజూరైన మిర్చి మార్కెట్ యార్డు త్వరలో అందుబాటులోకి వస్తే రైతుల కష్టాలు తొలగిపోతాయి. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి నేను ఆరు ఎకరాల్లో పండు మిరప సాగు చేశాను. ప్రస్తుతం మొదటి కోత పండు మిరపను తెంపగా ఎకరాకు 6 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇంకా రెండు కోతలు పడే అవకాశం ఉంది. మొత్తంగా ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పంటను అమ్మేందుకు గుంటూరు తీసుకెళ్లాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. – వీరనారాయణ, రైతు, భాస్కరాపురం, కర్నూలు జిల్లా ధరలు నిలకడగా ఉంటే మేలు నేను రెండు ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశాను. మొదటి కోత కోయగా ఎకరాకు 7 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం క్వింటా ధర రూ.16 వేలు పలికింది. వ్యాపారులు స్థానికంగా ధరలు తగ్గించి అడుగుతున్నారు. పండించిన పంటను గుంటూరుకు తీసుకెళ్లి విక్రయించుకోవాల్సి ఉంది. ధరలు ఇలాగే నిలకడగా ఉంటే రైతులకు ఆదాయం వస్తోంది. – జూటూరు నారాయణ, రైతు, భాస్కరాపురం, కర్నూలు జిల్లా -
విశాఖలో ‘రెడ్’ చిత్రం విజయోత్సవం
-
స్క్రిప్ట్ చదివే నిర్మాతలు ఇద్దరే!
‘స్రవంతి’ రవికిశోర్‌గారికి నేను చాలా రుణపడి ఉంటాను. స్క్రిప్ట్‌ను మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకూ చదివే నిర్మాతలు ఇద్దరే ఉన్నారు. వారిలో ఒకరు రామానాయుడుగారు, మరొకరు రవికిశోర్‌గారు. నా కెరీర్ మొదట్లోనే నాలుగు సినిమాలు రవికిశోర్‌గారితో పనిచేసే అదృష్టం నాకు దక్కింది’’ అంటూ రవికిశోర్‌కి పాదాభివందనం చేశారు దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ‘రెడ్’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘రామ్‌ను ‘దేవదాస్’ సినిమాలో చూసినప్పుడు రవికిశోర్‌గారితో మెరుపుతీగలా ఉన్నాడు అన్నాను. చూసినంత సులువు కాదు.. ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి సినిమాలో నటించటం’’ అన్నారు. రామ్ మాట్లాడుతూ– ‘‘మా పెదనాన్నగారితో చాలా సినిమాలు చేశాను. కానీ స్టేజ్ మీద ఎప్పుడూ ఆయన గురించి మాట్లాడలేదు. నా దృష్టిలో ‘రెడ్’ సినిమాకి రియల్ హీరో పెదనాన్న రవికిశోర్‌గారు. ఈ సినిమాని చంటిబిడ్డలా కాపాడుతూ వచ్చారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన రవికిశోర్‌గారికి, మంచి విజువల్స్ ఇచ్చిన సమీర్‌రెడ్డి గారికి థ్యాంక్స్’’ అన్నారు కిశోర్ తిరుమల. ఈ కార్యక్రమంలో మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నివేదా పేతురాజ్, ఆర్ట్ డైరెక్టర్ ఏయస్ ప్రకాశ్, ఎడిటర్ జునైద్ తదితరులు పాల్గొన్నారు. రవికిశోర్‌కి పాదాభివందనం చేస్తున్న త్రివిక్రమ్ -
లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలనుంది
‘‘తెలుగు సినిమాల్లో రెండో హీరోయిన్ పాత్రలే చేస్తున్నారెందుకు? అని అడుగుతున్నారు.. నేను నా పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తా.. ప్రాధాన్యం ఉంటే చాలు.. అది మొదటి హీరోయినా? రెండో హీరోయినా? అనేది చూడను’’ అన్నారు హీరోయిన్ నివేదా పేతురాజ్. రామ్ హీరోగా, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా నివేదా పేతురాజ్ చెప్పిన విశేషాలు. ► వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ‘మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా’ చేశాను. కిశోర్‌గారి దర్శకత్వంలో ‘చిత్రలహరి’ ఇప్పుడు ‘రెడ్’ సినిమా చేశా. వీరిద్దరి ప్రతిభపై నాకు నమ్మకం ఉంది. వీళ్ల సినిమాలంటే కథ ఏంటి? నా పాత్ర ఏంటి? అని అడగకుండా ఒప్పుకుంటా. ► ‘రెడ్’ సినిమాలో నాది ఇన్నోసెంట్ పోలీస్ పాత్ర. కానీ బయటకు రఫ్‌గా ఉంటాను. పోలీస్ పాత్ర కోసం ప్రత్యేకించి హోమ్‌వర్క్ చేయలేదు. ఎందుకంటే తమిళంలో ఓ సినిమాలో పోలీస్ పాత్రలో నటించాను. ఆ అనుభవం ఈ పాత్రకి బాగా ఉపయోగపడింది. ► ‘చిత్రలహరి’లో నాది చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర. ‘అల వైకుంఠపురములో’ చిత్రం చేసినందుకు ఎలాంటి బాధ లేదు. ఆ సినిమా చాలామందికి రీచ్ అయింది. ‘రెడ్’ సినిమాలో నాది పూర్తి స్థాయి నిడివి ఉన్న పాత్ర. ఇందులో రామ్ చేసిన రెండు పాత్రలతో నాకు సీన్లు ఉన్నాయి కానీ హీరోయిన్లతో లేవు. ► నాకు కామెడీ పాత్రలంటే ఇష్టం. అయితే తెలుగులో అన్నీ సీరియస్ పాత్రలే వస్తున్నాయి. అది కూడా హోమ్లీగా ఉండేవే. గ్లామరస్ రోల్స్ చేయడానికి అభ్యంతరం లేదు. ఏ ఇండస్ట్రీలో అయినా ప్రస్తుత పరిస్థితుల్లో హీరోయిన్లు ఎక్కువ రోజులు ఉండలేరు. అందుకే ఉన్నన్ని రోజులూ అన్ని రకాల పాత్రలూ చేయాలనుంది. తమిళ హీరో విజయ్ సేతుపతి అన్ని పాత్రలూ చేస్తున్నారు. నాకూ ఆయనలా చేయాలనుంది. నాకు లేడీ విజయ్ సేతుపతి అనిపించుకోవాలనుంది. ► కెరీర్ ప్రారంభంలో తమిళ్లో వరుసగా ఎనిమిది సినిమాలు ఒప్పుకున్నాను. అవి ఎందుకు ఒప్పుకున్నానా? అని ఆ తర్వాత అనిపించింది. ఇప్పుడు ఏ పాత్ర నాకు సరిపోతుందో దాన్నే ఎంచుకుంటున్నాను. ∙‘విరాటపర్వం’లో నాది అతిథి పాత్ర. విశ్వక్ సేన్ ‘పాగల్’లో నా పాత్ర సరదాగా ఉంటుంది. మరో తెలుగు సినిమా సైన్ చేశాను. -
ప్రతి పాత్ర కథకు కనెక్ట్ అయ్యుంటుంది
రామ్ మొదటిసారిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా కిశోర్ తిరుమల చెప్పిన విశేషాలు. ► ‘ఇస్మార్ట్ శంకర్’లో మాస్‌గా కనిపించారు రామ్. ఆ తర్వాత వచ్చే ఈ సినిమాలోనూ అలాంటి ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటుందనుకున్నాం. అలా ఒక పాత్ర, నా స్టైల్ ఆఫ్ హీరోలా మరో క్యారెక్టర్ ఉంటుంది. రామ్‌తో నేను తెరకెక్కించిన మొదటి సినిమా (నేను శైలజ) లవ్, తర్వాత ఫ్రెండ్షిప్ (ఉన్నది ఒకటే జిందగీ). ఇప్పుడు తనతో చేసిన మూడో సినిమా ‘రెడ్’లో చాలా షేడ్స్ ఉన్నాయి. ► మాములుగా హీరోకి రెండు క్యారెక్టర్లు ఉంటే ఒకటి సాఫ్ట్, రెండోది రఫ్ అన్నట్లు ఉంటుంది. కానీ ఈ సినిమాలో అలా ఉండదు. రామ్‌లో కొత్త యాంగిల్ కనబడుతుంది. అలాగే దర్శకుడిగా నాలోనూ కొత్త యాంగిల్ చూస్తారు. హీరో బాగా డ్యాన్స్ చేస్తాడు కాబట్టి ఓ మాస్ పాట పెట్టాం. రామ్, నేను రెండు సినిమాలు చేశాం కాబట్టి మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. ► ఈ సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ కథకు కనెక్ట్ అయ్యుంటుంది. ముగ్గురు హీరోయిన్లదీ మంచి క్యారెక్టరైజేషన్. నివేదా పేతురాజ్, అమృతా అయ్యర్, మాళవికా శర్మ పాత్రలు ఆకట్టుకుంటాయి. అయితే నివేదా పాత్ర ఇంకొంచెం బలంగా ఉంటుంది. ► జనరల్‌గా థ్రిల్లర్ సినిమా అంటే ఒక మీటర్లో ఉంటుంది. అయితే థ్రిల్లర్ ప్రధానంగా సాగే ‘రెడ్’ సినిమా అలా అనిపించదు. ఈ చిత్రంలో డ్రామా, యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండటంతో పక్కా కమర్షియల్ చిత్రంలా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే విధంగా ఉంటుంది. ► అప్పట్లో చెన్నైలో ఉండటంవల్ల ఓ తమిళ సినిమా చేశాను. ఆ తర్వాత తెలుగు మీద దృష్టి పెట్టాను. లాక్డౌన్లో శర్వానంద్ కోసం ఓ కథ, మరో రెండు స్క్రిప్ట్‌లు తయారు చేసుకున్నాను. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేశాను. -
తేదీ ఖరారు
సంక్రాంతి రేసులో నిలవడానికి పలు చిత్రాలు సిద్ధమవుతున్నాయి. వాటిలో రామ్ ‘రెడ్’ సినిమా ఒకటి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 14న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటించారు. రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించారు. రవికిశోర్ మాట్లాడుతూ – ‘‘దేవదాసు’, ‘మస్కా’ తర్వాత సంక్రాంతికి వస్తున్న రామ్ సినిమా ఇది. ప్రేక్షకులకు థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మా టీమ్ అంతా ఇన్నాళ్లూ ఎదురు చూశాం. మా సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకులకి మంచి అనుభూతిని ఇస్తుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సమర్పణ: కృష్ణ పోతినేని. -
థియేటర్‌కి వెళితే కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం
‘‘చాక్లెట్ బాయ్ ఇమేజ్ నుండి ‘ఇస్మార్ట్ శంకర్’లో విశ్వరూపం చూపించి, మాస్ ఇమేజ్ సంపాదించుకున్నాడు రామ్. ఇప్పుడు ‘రెడ్’తో దాన్ని రెండింతలు చేసుకోనున్నాడు’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. రామ్ హీరోగా, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ‘రెడ్’ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘చాలా సున్నితంగా, క్లాస్‌గా కనిపించే కిశోర్ తిరుమల ‘రెడ్’ చిత్రంతో తాను మాస్ చిత్రాలు రాయగలను, తీయగలనని నిరూపించుకున్నాడు. రామ్‌కి ‘ఇస్మార్ట్ శంకర్’ కంటే ‘రెడ్’ పెద్ద హిట్ అవ్వబోతోంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రం అందరికీ మంచి సక్సెస్‌ని, గుర్తింపుని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కిశోర్ తిరుమల. రామ్ మాట్లాడుతూ– ‘‘ఇంట్లో పూజ గది ఉన్నా గుడికే వెళతాం.. వంట చేసుకోగలిగినా హోటల్‌కి వెళుతుంటాం.. అలాగే ఎన్ని ఓటీటీ వేదికలున్నా థియేటర్లకే వచ్చి సినిమాలు చూస్తాం. థియేటర్లలో సినిమా చూస్తూ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోతాం. ప్రేక్షకులందరూ జాగ్రత్తలు పాటిస్తూనే థియేటర్లకు రావాలని కోరుతున్నాం’’ అన్నారు. నిర్మాత కె.ఎల్. దామోదర్ ప్రసాద్ (దాము), నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్, నాజర్ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి. -
రెడ్మిక్సర్ బంగారం పేరిట మోసం
సాక్షి, కాకినాడ: సాధారణ బంగారం కంటే విలువైన బంగారం తమ వద్ద ఉందని నమ్మించి ఒక వ్యక్తిని మోసం చేసిన ముఠా గుట్టును సర్పవరం పోలీసులు రట్టు చేశారు. సర్పవరం పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాకినాడ డీఏస్పీ భీమారావు, సీఐ గోవిందరాజు ఈ వివరాలు వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన బాధితుడు ఆడారి నాగులుకు ఫోన్ ద్వారా కొందరు వ్యక్తులు పరిచయమయ్యారు. బంగారం కంటే ఎక్కువ విలువైన రెడ్మిక్సర్ బంగారం తమ వద్ద ఉందని, దీని విలువ రూ.10 లక్షలు ఉంటుందని నమ్మించారు. తమకు డబ్బులు అర్జెంట్‌గా అవసరమవడంతో రెడ్మిక్సర్ బంగారాన్ని రూ.4 లక్షలకే ఇచ్చేస్తామని చెప్పారు. ఆ మాటలు నమ్మిన నాగులు ఆగస్టు 23న సర్పవరం పూల మార్కెట్ వద్ద ఆ వ్యక్తులకు నగదు అందజేశాడు. అనంతరం వారు రెడ్మిక్సర్ బంగారం ఇవ్వలేదంటూ 27వ తేదీన సర్పవరం పోలీసు స్టేషన్లో అతడు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్సై కృష్ణబాబు కేసు నమోదు చేశారు. సీఐ గోవిందరాజు తన సిబ్బందితో కలిసి ఈ కేసు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో ముందుగా అందిన సమాచారం మేరకు ఆదివారం రాత్రి 7 సమయంలో అచ్చంపేట జంక్షన్ వద్ద ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సామర్లకోట మండలం అయోధ్యరామపురానికి చెందిన గున్నాబత్తుల శివ, అచ్చంపేట గ్రామానికి చెందిన వీరంరెడ్డి వీర వెంకట రమణ, సామర్లకోట పట్టణానికి చెందిన రొంగల శేషుకుమార్, పిఠాపురం మండలం మాధవపురం గ్రామానికి చెందిన మోటుపల్లి శివనారాయణ, పెద్దాపురానికి చెందిన కలగా హరీష్ ఉన్నారు. పోలీసుల విచారణలో నిందితులు నేరాన్ని అంగీకరించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి రూ.1.65 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంతో సీఐ గోవిందరాజు, ఎస్సై కృష్ణబాబు, ఏఎస్సై నాగేశ్వరరావు, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, రూప్‌కుమార్, సతీష్‌కుమార్ సహకరించారని పేర్కొంటూ డీఎస్పీ భీమారావు వారికి అభినందనలు తెలిపారు. -
ఆరంభ లాభాలు ఆవిరి : తీవ్ర ఒడిదుడుకులు
సాక్షి, ముంబై : అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. అయితే ఆరంభ లాభాలను కోల్పోయిన సూచీలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. ఆరంభంలో 150 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ 23 పాయింట్లు లాభాలకు పరిమితమై 34411 వద్ద ఉంది. 10300 స్థాయిని అధిగమించిన నిఫ్టీ కూడా 11 పాయింట్ల లాభంతో 10178 వద్ద కొనసాగుతోంది. వరుస లాభాలనుంచి ట్రేడర్ల లాభాల స్వీకరణతో బ్యాంకు నిఫ్టీ కూడా నష్టాల్లోకి జారుకుంది. దాదాపు అన్ని రంగాల షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. వొడాఫోన్, టైటన్, ఎస్బీఐ, హెచ్ డీఎఫ్ స , గెయిల్ నష్ట పోతున్నాయి. -
సినీ ఇండస్ట్రీపై రామ్ ఆసక్తికర ట్వీట్
‘సినీ ఇండస్ట్రీలో ఓ విషయం ఉంది. సినిమా అనేది కొందరికి ఫ్యాషన్, చాలా మందికి వ్యాపారం.. మిగిలిన వారందరికీ అదొక ఆట’ అంటూ ఎనర్జటిక్ హీరో రామ్ పోతినేని ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఆయన హీరోగా నటించిన ‘రెడ్’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. లాక్డౌన్ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ‘రెడ్’ చిత్రాన్ని ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా విడుదల చేస్తారని అనేక వార్తలు వస్తున్న తరుణంలో రామ్ చేసిన ట్వీట్‌తో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రామ్ ట్వీట్లో అంతర్యం ఏమిటో తెలియక టాలీవుడ్ వర్గాలు తికమకపడుతున్నాయి. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్లు హీరోయిన్లుగా నటించారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. The thing about the Movie Industry is.. It’s a Passion for a few.. a Business for most.. & a Gamble for the rest.. Everyone sees it from their own perspective..#OTT #Theatrical #RAndoMthoughts — RAm POthineni (@ramsayz) May 18, 2020 చదవండి: వైరల్: చిరు ఎత్తుకున్న ఆ హీరో ఎవరు? ఎన్టీఆర్ బర్త్‌డే: చిన్న సర్ప్రైజ్ ఉంది -
అప్పుడు దిమాక్ ఖరాబ్.. ఇప్పుడు డింఛక్
ఇస్మార్ట్ శంకర్‌తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ‘రెడ్’ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఈ రోజు హీరో రామ్ బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని రామ్ అభిమానులకు కానుకగా ‘రెడ్’ చిత్రంలోని ‘డింఛక్’ అనే మాస్ సాంగ్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ పాటను మణిశర్మ కంపోజ్ చేయగా సాకేత్, కీర్తనలు పాడారు. జానీ మాస్టర్ డ్యాన్స్ కొరియగ్రఫీ, కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. ఇక ఈ సాంగ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలోని ‘దిమాక్ ఖరాబ్’ సాంగ్ రేంజ్లో హిట్టయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ లవ్ ట్రాక్‌కు ప్రేక్షకులను విశేష ఆదరణ లభించిన విషయం తెలసిందే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా తన పుట్టిన రోజు వేడుకలకు అభిమానులు దూరంగా ఉండాలని రామ్ పిలుపునిచ్చారు. అభిమానుల ఆరోగ్యం, సంతోషమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని.. అదే తనకు ఇచ్చే అసలైన పుట్టిన రోజు కానుకగా భావిస్తానని రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక తమ హీరో పిలుపు మేరకు ఆయన బర్త్‌డే వేడుకలకు రామ్ అభిమానులు దూరంగా ఉన్నారు. అయితే పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ హీరోకు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. రామ్ కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ ‘రెడ్’ చిత్రం తమిళ హిట్ ‘తడమ్’కు రీమేక్ అన్న విషయం తెలిసిందే. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. చదవండి: ఇన్నాళ్లకు కౌశల్‌కు సినిమా అవకాశం బాలయ్య కోసం భారీగా శత్రు గణం Here’s the teaser of one of my fav songs from #RedTheFilm 💥 #DinchakSong 💥https://t.co/UU5Zns38JH I had a blast on sets filming this..I’m sure you guys will have a blast at the theatres watching this. 🔥 Love..#RAPO pic.twitter.com/qE9qi0qevZ — RAm POthineni (@ramsayz) May 15, 2020 -
మా `రెడ్` యూనిట్‌కు అలాంటి అనుభవాలే..
‘‘కొన్ని సంఘటనలను అవతలివాళ్లు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మరికొన్నిసార్లు నమ్మబుద్ధి కాదు. ఆ మాటల్లో అతిశయోక్తులు ధ్వనిస్తాయి. కానీ అలాంటి సంఘటనలు మన జీవితంలో ఎదురైనప్పుడు? అవే దృశ్యాలు మళ్లీ మళ్లీ కళ్ల ముందు మెదులుతుంటాయి. ఇప్పుడు మా `రెడ్` యూనిట్ సభ్యులకు కూడా అలాంటి అనుభవాలే మెదిలినట్టు. మా`రెడ్`టీమ్‌లో ఈ మధ్య దీనికి సంబంధించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది`` అని అంటున్నారు ప్రముఖ నిర్మాత `స్రవంతి` రవికిశోర్. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం`రెడ్`. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇందులో హీరోగా నటించారు. ఫిబ్రవరి లో ఈ చిత్రంలోని రెండు పాటల చిత్రీకరణ ఇటలీలో జరిగింది. కోవిడ్-19తో అల్లాడుతున్నఇటలీ గురించి, అక్కడ ఆ వైరస్ సోకడానికి కొన్నాళ్ల ముందు గడిపిన క్షణాల గురించి`స్రవంతి` రవికిశోర్ వివరించారు. (‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’) `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ.. ``సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో -5 డిగ్రీల ఉష్ణోగ్రతతో, ఎటుచూసినా స్వచ్ఛంగా సుందరంగా ఉంటుంది డోలమైట్స్. ఈ పర్వత తీర ప్రాంతంలో ఇప్పటిదాకా పలు హాలీవుడ్ సినిమాల షూటింగులు జరిగాయి. తెలుగు సినిమాల షూటింగ్‌లు ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు రామ్‌తో తీస్తున్న `రెడ్` షూటింగ్ అక్కడ చేద్దామని మా డైరక్టర్ కిశోర్ తిరుమల అన్నారు. అప్పటికే ఆ ప్రాంతం గురించి తెలుసు కాబట్టి వెంటనే ఓకే అనుకున్నాం. రెండు పాటలు చిత్రీకరించడానికి టీమ్‌తో ఇటలీ చేరుకున్నాం. టుస్కాన్, ఫ్లారెన్స్, డోలమైట్సలో హీరో రామ్, హీరోయిన్ మాళవికా శర్మ మీద పాటలు చిత్రీకరించాం. ఇటీవల రిలీజ్ చేసిన ‘నువ్వే నువ్వే’ లిరికల్ సాంగ్‌లో లేక్‌గార్డ్ అందాలు కూడా కనిపిస్తాయి. లేక్‌గార్డ్ ప్రస్తావన ఎందుకంటే... ఈ ప్రాంతం బెర్గామోకి కేవలం గంటం పావు ప్రయాణ దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఇటలీలో కోవిడ్-19కి ఎపిక్ సెంటర్‌గా బెర్గామో గురించి అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి15న లేక్ గార్డలోనూ, ఫిబ్రవరి 16న డోలమైట్స్లోనూ షూటింగ్ చేశాం. మేం అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆరు రోజులకు... అంటే ఫిబ్రవరి 22న డోలమైట్స్కు బ్రిటిష్ స్కై టీం వెళ్లీంది’’ అని చెప్పారు. (ఇలాంటి కేస్ ఇదే ఫస్ట్ టైమ్..) ఇక ‘‘అక్కడికి వెళ్లిన 22 మందిలో 17 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పటిదాకా సుందరంగా, అద్భుతమైన అనుభవంగా అనిపించిన డోలమైట్ గురించి ఆలోచించగానే మమ్మల్ని కరోనా కలవర పెట్టింది. కేవలం వారం రోజులు ముందుగా అక్కడి నుంచి వచ్చిన మా యూనిట్ అంతా సురక్షితంగా ఉంది. ఇలాంటి విషయాల గురించి ఆలోచించినప్పుడు అదృష్టం కాక మరేంటి? అని అనిపిస్తుంది. ఈ విషయాన్నే అక్కడ పాటలకు కొరియోగ్రఫీ చేసిన శోభి మాస్టర్, మా యూనిట్ సభ్యులు గుర్తుచేస్తున్నారు. ఇటలీలోనే కాదు మన దగ్గరా కరోనా కలవరపెడుతోంది. ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవడమే మన ముందున్న కర్తవ్యం. మానవాళి సురక్షితంగా ఉండాల్సిన ఈ తరుణంలో వినోదం గురించి ఆలోచించడాన్ని మేం కూడా వాయిదా వేశాం. అయితే ఏప్రిల్ 9న ‘రెడ్’ విడుదల చేయాలనుకున్నాం కానీ ప్రస్తుతం పరిస్థుతులు అనుకూలంగా లేవు. సమాజం మామూలు స్థితికి వచ్చాక, అప్పుడు `రెడ్` విడుదల గురించి ప్రకటిస్తాం. కరోనా కోరల్లో చిక్కుకోకుండా ఉండాలంటే అందరూ ఇళ్లల్లోనే ఉండాలి. పరిశుభ్రతను పాటించాలి`` అని అన్నారు. (ఆనందంగా ఉన్నప్పుడే వినోదం ) కాగా రామ్, నివేదా పేతురాజ్,మాళవికా శర్మ, అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్న చిత్రం ‘రెడ్’. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: జునైద్, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్, దర్శకత్వం: కిశోర్ తిరుమల. -
డైలామా ఏం లేదు.. క్లారిటీ ఇచ్చిన రామ్
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా యావత్ దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీపై భారీగానే పడింది. లాక్డౌన్ నేపథ్యంలో విడుదల కావాల్సిన చిత్రాలు వాయిదాపడ్డాయి. వేసవి సెలవులను ఉపయోగించుకోవాలని టాలీవుడ్ దర్శకనిర్మాతలు భారీ ప్రణాళికలు రచించుకున్నారు. కానీ లాక్డౌన్ కారణంగా వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్, వి సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నా లాక్డౌన్ కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే కొన్ని చిన్న సినిమాలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేస్తుండగా.. మరికొన్ని పెద్ద సినిమాల దర్శకనిర్మాతలు, హీరోలు ఓటీటీ ప్లాట్‌ఫాంపై రిలీజ్ చేసేందుకు డైలామాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో ఎక్కువగా వినిపిస్తున్న చిత్రం రామ్ పోతినేని చిత్రం ‘రెడ్’. అన్నీ అనుకున్నట్లు సాగితే ‘రెడ్’ చిత్రం ఏప్రిల్ 9న విడుదల అయ్యేది. కానీ కుదర లేదు. అయితే దర్శకనిర్మాతలు డిజిటల్ బాట వైపు మొగ్గు చూపుతున్నారని, కానీ హీరో రామ్ డైలామాలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రామ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘అలాంటిదేం లేదు! రామ్ ఎలాంటి సందిగ్థంలో లేడు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక దూరం పాటిస్తూ, ఇంట్లోనే ఉంటున్నాడు. అభిమానులు ‘రెడ్’ సినిమాను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు’ అని తెలిపాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్లు హీరోయిన్లుగా నటించారు. స్రవంతి మ´వీస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. చదవండి: బన్ని కోసం బాలీవుడ్ నుంచి.. బాలయ్య సినిమాలో లేడీ విలన్? -
వారసుడు వచ్చాడు : హీరో రామ్
యంగ్ హీరో రామ్ పోతినేని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్స్‌తోపాటు, సినీ ఇండస్ట్రీలోని తన సన్నిహితులకు ఆయన సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పుతూ ఉంటాడు. తాజాగా రామ్ ఓ సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. వారసుడు వచ్చాడు అని పేర్కొన్న రామ్.. తన నెప్యూ సిద్దాంత్ పోతినేనితో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. (చదవండి : ఇలాంటి కేస్ ఇదే ఫస్ట్ టైమ్..) సినిమాల విషయానికి వస్తే.. ఇస్మార్ట్ శంకర్ విజయంతో మంచి జోష్‌లో ఉన్న హీరో రామ్.. ప్రస్తుతం కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెడ్ చిత్రంలో నటిస్తున్నారు. ‘రెడ్’ షూటింగ్ చివరి దశకు చేరకోవడంతో చిత్రం బృందం ప్రమోషన్స్‌ను మొదలుపెట్టింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. (చదవండి : ‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’) Varasudu Vachaadu ❤️ ....my lil baby nephew Sidhanth Pothineni! Love #RAPO pic.twitter.com/q2ls4smiRd — RAm POthineni (@ramsayz) March 5, 2020 -
‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రెడ్’. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో మూవీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో అస్త్రాన్ని విడుదల చేసేందుకు సమయాత్తమవుతోంది. చిత్రంలోని తొలి సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మార్చి 6న సాయంత్రం 5 గంటలకు సినిమాలోని ‘నువ్వే నువ్వే’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేశారు. ఇక మణిశర్మ శైలిలో ఈ మెలోడీ సాంగ్ ఉండబోతోందని చిత్ర బృందం తెలిపింది. ఇక కిశోర్ తిరుమల-రామ్ కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక ఈ సాంగ్ కూడా హిట్టయిందంటే ‘రెడ్’ జోరుకు బ్రేకులు ఉండవని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. చదవండి: ‘ఆయన రావడం మా అదృష్టం’ ‘బాధకు బ్రాండ్స్‌తో పనేంటి డాడీ’ -
ఇలాంటి కేస్ ఇదే ఫస్ట్ టైమ్..
రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న తాజా చిత్రం ‘రెడ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది. తాజాగా ‘రెడ్’ టీజర్‌ను చిత్రబృందం శుక్రవారం విడుదల చేసింది. ‘క్రైమ్ హిస్టరీలో ఇలాంటి కేసు చూడటం ఇదే ఫస్ట్ టైమ్’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన చిత్ర టీజర్.. చివరివరకు ఇంట్రెస్టింగ్ సాగింది. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్న రామ్.. క్లాస్, మాస్ లుక్స్‌లో అదరగొట్టినట్టుగా టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. ఇస్మార్ట్ శంకర్‌తో సత్తా చాటిన రామ్.. ఈ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడని అభిమానులు అంటున్నారు. ఈ చిత్రంలో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ తర్వాత రామ్, కిశోర్ తిరుమల కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో ‘రెడ్’పై అంచనాలు భారీగానే ఉన్నాయి. -
రెడ్ టీజర్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు
ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్‌బస్టర్ అందుకున్న రామ్ నటిస్తోన్న తాజా చిత్రం ‘రెడ్’. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కృష్ణ పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై రామ్ పెదనాన్న ‘స్రవంతి’ రవికిశోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకుడు. ఇందులో రామ్ తన కెరీర్లోనే తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో హీరోను చూసిన అభిమానులు ‘సంథింగ్ ఇంట్రెస్టింగ్’ అంటూ సినిమాపై ఆసక్తిని కనబరుస్తున్నారు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కుతున్న ‘రెడ్’ సినిమా టీజర్ విడుదలకు చిత్రయూనిట్ ముహూర్తం ఖరారు చేసింది. (రొమాంటిక్‌కి గెస్ట్) ఫిబ్రవరి 28 సాయంత్రం 5 గంటలకు టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఇక సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులోని డోలమైట్స్‌లో మైనస్ ఐదు డిగ్రీల వాతావరణంలో హీరోహీరోయిన్లపై పాటను చిత్రీకరించారు. ఇక్కడ షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం రెడ్ కావడం విశేషం. కొన్నిపాటలు, కీలక సన్నివేశాలను ఇంకా చిత్రీకరించాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్ రెడ్డి, ఫైట్స్ కొరియోగ్రఫీ: పీటర్ హెయిన్స్ (పది వేల అడుగుల ఎత్తులో...) -
పది వేల అడుగుల ఎత్తులో...
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి హిట్ చిత్రం తర్వాత రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమాలోని రెండు పాటలను ఇటలీలో చిత్రీకరించారు. ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఈ నెల 12 నుంచి 18 వరకూ ఇటలీలోని అందమైన ప్రదేశాల్లో రామ్, మాళవికా శర్మలపై రెండు పాటలు చిత్రీకరించాం. శోభి మాస్టర్ నృత్యాలు సమకూర్చారు. ఇటలీలోని టుస్కాన్, ఫ్లారె¯Œ ్స, డోలమైట్స్ ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. సముద్ర తీరానికి 10 వేల అడుగుల ఎత్తులోని డోలమైట్స్‌లో మైనస్ ఐదు డిగ్రీల వాతావరణంలో ఒక పాటను చిత్రీకరించాం. డోలమైట్స్‌లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం మాదే. ఇటలీలో ప్రతి ఏటా జరిగే వెనీడియా కార్నివాల్లో పాటలో కొంత భాగాన్ని చిత్రీకరించాం. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో ఆ పాట చిత్రీకరిస్తాం’’ అన్నారు. ‘‘ఈ చిత్రం క్లాస్, మాస్‌ని ఆకట్టుకుంటుంది. ఏప్రిల్ 9న సినిమాని విడుదల చేయబోతున్నాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు కృష్ణ పోతినేని. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సమీర్ రెడ్డి. -
ఆటా పాటా
‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘రెడ్’. ఈ చిత్రంలో కథానాయికలుగా నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ నటిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమాను కృష్ణా పోతినేని సమర్పణలో శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రవికిషోర్ మాట్లాడుతూ–‘‘నేను... శైలజా, ఉన్నది ఒక్కటే జిందగీ’ చిత్రాల తర్వాత రామ్–కిషోర్ కాంబినేషన్లో వస్తోన్న మూడో చిత్రం ఇది. సంగీత దర్శకుడు మణిశర్మ తొలిసారి మా సంస్థలో పని చేస్తున్నారు. హైదరాబాద్, వైజాగ్, గోవా లొకేషన్స్‌లో జరిపిన షూటింగ్స్‌తో టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం ఇటలీలోని టస్క్, ప్లారెన్స్, డోలోమైట్స్ లాంటి ప్రాంతాల్లో రెండు పాటలను చిత్రీకరించే పనిలో ఉన్నాం. శోభి మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ నెల 20వరకు ఇటలీ షెడ్యూల్ జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి మరో పాటను చిత్రీకరిస్తే ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తవుతుంది. ఏప్రిల్ 9న సినిమాను విడుదల చేస్తున్నాం’’ అని అన్నారు. రామ్ కెరీర్లో తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ ‘రెడ్’ చిత్రం తమిళ హిట్ ‘తడమ్’కు రీమేక్. -
రుచించని బడ్జెట్, మార్కెట్లు ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 680 పాయింట్లు కుప్పకూలి 40043 వద్ద, నిఫ్టీ 214 పాయింట్లు పతనమై 11748 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. హెచ్‌యూఎల్, టీసీఎస్, నెస్లే, ఏసియన్ పెయింట్స్ మాత్రమే స్వల్పంగా లాభపడుతున్నాయి. కేంద్ర బడ్జెట్ కారణంగా శనివారం సాధారణ సెలవు అయినప్పటికీ ప్రత్యేకంగా ట్రేడింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆరంభంలో బలహీనంగా ఉన్న మార్కెట్లు తరువాత దాదాపు 120 పాయింట్లకు పైగా పుంజుకున్నాయి. బడ్జెట్ ప్రసంగం మొదలైనప్పటినుంచి తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. చివరకు వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ టాక్స్, ఆటో రంగం పై జీఎస్టీ తగ్గింపు లాంటి ఆశాజనక వార్తలేవీ లేకపోవడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలు వెల్లువెత్తాయి. (మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ. 1.7 లక్షల కోట్లు...) డిపాజిట్ దారులకు గుడ్ న్యూస్ ఐడీబీఐ, ఎల్ఐసీలో వాటా అమ్మకం -
బర్త్‌డే స్పెషల్
రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రెడ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణచైతన్య పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇందులో నివేదా పేతురాజ్ కథానాయికగా నటించనున్నారు. శనివారం నివేదా పుట్టినరోజు సందర్భంగా ఆమెను కథానాయికగా ఖరారు చేసిన విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. ఆమె పుట్టినరోజు వేడుకలు కూడా ‘రెడ్’ చిత్రబృందం సమక్షంలో గోవాలో జరిగాయి. ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. -
థ్రిల్లింగ్ రెడ్
రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘రెడ్’. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై కృష్ణ పోతినేని సమర్పణలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. రామ్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత కిరణ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘రామ్‌కు ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి సూపర్‌హిట్ అందించిన పూరి జగన్నాథ్‌గారికి థ్యాంక్స్. మా బ్యానర్లో రామ్ ఇప్పటివరకు చాలామంచి సినిమాలు చేశారు. ‘రెడ్’ కూడా మరో మంచి చిత్రంగా నిలిచిపోతుందని భావిస్తున్నాను. నవంబర్ 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారం భిస్తాం. వచ్చే ఏడాది ఏప్రిల్ 9న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం. ఓ సినిమా సోల్‌ను తీసుకుని, అందులో మార్చులు చేసి ‘రెడ్’ సినిమాను తెరకెక్కిస్తాం’’ అన్నారు. ‘‘కెరీర్లో తొలిసారి థ్రిల్లర్ జానర్లో సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అని రామ్ అన్నారు. ‘‘రామ్‌తో మూడోసారి సినిమా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. థ్రిల్లర్‌కు వాణిజ్య పరమైన అంశాలు జోడించి కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మణిశర్మగారు మా సినిమాకు సంగీతం అందిస్తున్నందుకు చాలా సంతోషం’’ అన్నారు కిశోర్ తిరుముల. నిర్మాతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, అనిల్ సుంకర, రామ్ ఆచంట, కృష్ణ పోతినేని పాల్గొన్నారు. -
హీరో రామ్ ‘రెడ్’ చిత్రం ప్రారంభం
-
ఆ సిన్మా పూర్తికాలేదు.. ఎలా విడుదల చేస్తారు: రానా
దీపావళికి ముందు రోజు ఆ తర్వాత కొత్త లుక్స్ విడుదల సందడి సాగింది. కొత్తగా వచ్చిన ఆ స్టార్స్ చిత్రాల విశేషాల్లోకి వస్తే... ఇప్పటివరకు ఒంటరిగానే దర్శనం ఇచ్చిన రాజా ఈ దీపావళి పండగకి జంటగా కనిపించి ప్రేమ గొడుగు కింద కాస్తంత చోటు దక్కించుకున్నాడు. రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘డిస్కో రాజా’. ఈ చిత్రంలో పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది.‘‘ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతోంది. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రచనలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ పాట పాడారు. ఈ పాట పూర్తిగా రెట్రో ఫీల్‌ని కలిగిస్తుంది. విడుదల చేసిన పోస్టర్స్‌కు మంచి స్పందన లభిస్తోంది. త్వరలో టీజర్‌ను విడుదల చేస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్స్‌ను విడుదల చేశారు. డిసెంబరు 20న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. భారతీయ సైనికుడి పాత్రలో రానా నటిస్తున్న చిత్రం ‘1945’. శివకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు రాజరాజన్ నిర్మాత. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసి, సినిమాను జనవరి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘‘సినిమాను పూర్తి చేయడంలో నిర్మాత సఫలం కాలేదు. ఏడాదిగా వారిని నేను కలవలేదు. ఇదొక అసంపూర్ణమైన సినిమా. ఇప్పుడు పోస్టర్‌ను విడుదల చేశారు. మోసం చేసి సంపాదించాలనుకోవడమే వారి ఆలోచన అనుకుంటా’’ అని ఈ చిత్రం గురించి సోషల్ మీడిమాలో రానా పేర్కొన్నారు. ‘‘షూటింగ్ కోసం చాలా ఖర్చు చేశాను. పూర్తి కాని సినిమాను ఎవరూ విడుదల చేయరు. సినిమా పూర్తయిందా? లేదా? అనే విషయాన్ని ఆడియన్స్ నిర్ణయిస్తారు’’ అని నిర్మాత పేర్కొన్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’తో మాస్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న రామ్ మరో మాస్ ఫిల్మ్ చేయడానికి రెడీ అయ్యారు. రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘రెడ్’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ‘స్రవంతి’ రవికిశోర్ ఈ సినిమాను నిర్మిస్తారు. పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫైట్స్ కొరియోగ్రఫీ చేస్తారు. వెండితెర భీష్మగా కనిపించనున్నారు నితిన్. ఆయన హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ‘భీష్మ’. ఈ చిత్రంలో రష్మిక మండన్నా కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను విడుదల చేశారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ‘భీష్మ’లో రష్మిక, నితిన్ -
ఎరుపు రంగులో వర్షం
చెన్నై ,టీ.నగర్: కూడలూరులో ఎరుపు రంగులో వర్షం కరువడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ నీటిని అధికారులు పరిశీలనకు తీసుకెళ్లారు. నీలగిరి జిల్లా, కూడలూరు సమీపంలో నాడుకాని గ్రామం ఉంది. దీని సరిహద్దు ప్రాంతాలైన నాడుకాని, ముండా, కూవత్తిపొళిల్‌లలో సోమవారం రాత్రి గంటకు పైగా వర్షం కురిసింది. ఈ వర్షపు నీరు ఎరుపు రంగులో ఉండడంతో ప్రజలు ఆసక్తిగా గమనించారు. కొందరు నీటిని పాత్రల్లో, బాటిల్స్‌లో సేకరించారు. ఈ విషయం తెలుసుకున్న పరిసర గ్రామాల ప్రజలు అక్కడికి వచ్చి స్థానికులు సేకరించిన నీటిని వింతగా తిలకించారు. ఈ నీటిలో తడిసిన చాలా మందికి ఒంటిపై దురదలు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న రెవెన్యూశాఖ అధికారులు ప్రజలు బాటిళ్లలో సేకరించిన నీటిని పరిశోధనల కోసం తీసుకెళ్లారు. -
లాభాల స్వీకరణ :మార్కెట్ల వెనకడుగు
సాక్షి, ముంబై: లాభాలతో ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలలోకి ప్రవేశించాయి. గ్లోబల్ మార్కెట్ల సానుకూల సంకేతాలతో దాదాపు 100పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్ అమ్మకాల ఒత్తిడితో కుదేలవుతోంది. 194 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ 35,911 వద్ద, నిఫ్టీ 58 పాయింట్లు క్షీణించి10,763 వద్ద ట్రేడవుతోంది. దీంతో కీలక సూచీలు ప్రధాన మద్దతు స్థాయిల (సెన్సెక్స్ 36వేలు, నిఫ్టీ 10800 స్థాయి) దిగువకు చేరాయి. ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో రియల్టీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్స్ బలహీనంగాఉన్నాయి. అటు మెటల్, ఎఫ్ఎంసీజీ స్వల్పంగా లాభాపడుతున్నాయి. మెటల్ కౌంటర్లలో హిందాల్కో, ఎన్ఎండీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టీల్, వేదాంతా, హింద్ కాపర్ 2-1 శాతం మధ్య లాభపడ్డాయి. ఇక ఐటీ షేర్లు టీసీఎస్, మైండ్‌ట్రీ, టాటా ఎలక్సీ, నిట్ టెక్, ఇన్ఫోసిస్ కూడా నష్టపోతున్నాయి. రియల్టీ కౌంటర్లలో శోభా డీఎల్ఎఫ్, ఒబెరాయ్, ప్రెస్టేజ్, ఇండియాబుల్స్, సన్‌టెక్ నష్టపోతున్నాయి. వీటితోపాటు టాటా మోటార్స్, ఎల్అండ్టీ, ఇండస్ఇండ్, ఇన్ఫ్రాటెల్, ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, గెయిల్, అదానీ పోర్ట్స్, ఆర్ఐఎల్ లాంటి దిగ్గజాలు బలహీనంగా ఉన్నాయి. మరోవైపు ఐటీసీ, యూపీఎల్, ఓఎన్జీసీ, ఐవోసీ, గ్రాసిమ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌పీసీఎల్ టాప్ విన్నర్స్‌గా ఉన్నాయి. -
నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు: పీఎస్‌యూ బ్యాంక్స్ వీక్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల నష్టంతో 32,896వద్ద, నిఫ్టీ 17 పాయింట్ల నష్టంతో 10077 వద్ద ట్రేడ అవుతోంది. ఒకదశలో 10050 స్తాయిని కోల్పోయిని నిఫ్టీ ఆ తరువాత కోలుకుంది. అయితే మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతోంది. పీఎస్యూబ్యాకింగ్ నష్టాలు ఈ వరుసగా నాలుగో సెషన్లో మంగళవారం కూడా కొనసాగుతున్నాయి. ఐడీబీఐ భారీగా నష్టపోతోంది. వేదాంతా, సన్‌ఫార్మ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో , మారుతి, బీఈఎంల్, ఐవోసీ, బయోకాన్ నష్టపోతుండగా భారతి ఇన్ప్రాటెల్, జెట్ ఎయిర్వేస్ లాభపడుతోంది. -
నష్టాల ముగింపు: ఆయిల్ అండ్ గ్యాస్ డీలా
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ఆరంభంనుంచి బలహీనంగానే ఉన్నప్పటికీ మిడ్ సెషన్ నుంచీ పెరిగిన అమ్మకాలతో మార్కెట్లు మరింత డీలాపడ్డాయి. చివరికి వరుసగా మూడో రోజూకూడా నష్టాలతోనే ముగిసింది. సెన్సెక్స్ 150 పాయింట్ల నష్టంతో 33,685 వద్ద, నిఫ్టీ 51పాయింట్ల నష్టంతో 10,360 వద్ద ముగిసింది. దాదాపు అన్ని రంగాలు నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్ భారీగా నష్టపోయింది. ఐవోసీ, ఎస్‌బ్యాంక్, రిలయన్స్, గెయిల్, ఐసీఐసీఐబ్యాంక్ టాప్‌లూజర్స్ గా నిలిచాయి. టాటా స్టీల్,అల్ట్రాటెక్, సిప్లా, వేదాంతా, హిందాల్కో, గెయిల్ నష్టపోగా ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, ఐబీ హౌసింగ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఇన్ఫ్రాటెల్, కోల్ ఇండియా, ఎంఅండ్ఎం, అదానీ పోర్ట్స్, ఇండస్ఇండ్ లాభపడ్డాయి. -
ఆర్బీఐ రివ్యూపై దృష్టి: వరుసగా రెండో రోజూ నష్టాలే
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి సెన్సెక్స్ 91, నిప్టీ 38 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను కొనసాగిస్తోంది. తద్వారా నిఫ్టీ 10,100 స్థాయి దిగువకుచేరింది. ముఖ్యంగా ఆర్బీఐ పాలసీ నిర్ణయం వెలువడనున్న నేపథ్యంలో మార్కెట్లు ఒడుదొడుకులకు లోను కావవచ్చని నిపుణుల అభిప్రాయం. ఆర్బీఐ నిర్ణయం మార్కెట్లను మార్గనిర్దేశనం చేయనుంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అమ్మకాలతో వరుసగా రెండో రోజు నష్టాలు కొనసాగుతున్నాయి. దీంతో దాదాపు అన్ని సెక్టార్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకులు, మెటల్ ఇండెక్స్ బాగా నష్టపోతున్నాయి. వేదాంతా, హిందాల్కో, టాటా స్టీల్, ఐషర్, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, యస్‌బ్యాంక్, విప్రో, హెచ్‌పీసీఎల్, ఎంఅండ్ఎం నష్టాల్లోనూ, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఆర్ఐఎల్, సిప్లా స్వల్ప లాభాల్లోనూ కొనసాగుతున్నాయి. -
యుద్దమేఘాలు:నష్టాల్లో మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టపోయి 31,663 వద్ద నిఫ్టీ 47పాయింట్లు పతనమై 9904 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ సంకేతాల నేపథ్యంలో ఆరంభంలోనేనష్టాలను నమోదుచేసిన ప్రధాన సూచీల్లో నిఫ్టీ ఒక కదశలో 9900 దిగివకు చేరింది. ఉత్తర కొరియాతో మరోసారి యుద్ధభయాలు చెలరేగడంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు పతనంకాగా.. ప్రస్తుతం ఆసియాలోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అటు ఎఫ్ఐఐ అమ్మకాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. ఫార్మా, మెటల్, రియల్టీ, భారీగా నష్టపోతుండగా బ్యాంకింగ్, ఆటో, ఎఫ్ఎంసీజీ ఇదే బాటలోఉన్నాయి. ఎన్డీటీవీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా , సన్ ఫార్మా, టాటా మోటార్స్‌డీవీఆర్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, ఐటీసీ, వేదాంతా, టెక్ మహీంద్రా, భారతీ నష్టపోతున్నాయి., బజాజ్ ఫైనాన్స్‌జస్ట్ డయల్, హెచ్‌సీఎల్ , మారికో, టైటన్ లాభపడుతున్నాయి. -
పొరుగు రాష్ట్రాల్లో విక్రయానికే మిర్చిరైతుల మొగ్గు
ఇప్పటికే 70 శాతం పంట జగదల్పూర్లో విక్రయం తీవ్రంగా నష్టపోతున్న వైనం నెల్లిపాక: సరైన ధరలేక తీవ్రంగా నష్టపోతున్న మిర్చి రైతులను ఆదుకొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మద్దతు ధర ప్రకటనలు మాయగా మారాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్వెన్షన్ స్కీం విలీన మండలాలవారికి ఏ మాత్రం ఉపయోగపడదంటున్నారు. ఇప్పటికే ఇక్కడి మిర్చి రైతులు పొరుగు రాష్ట్రాల్లో తమ పంటను విక్రయిస్తున్నారు. 80 శాతం మిర్చి పంటను ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జగదల్పూర్లో విక్రయించారు. గిట్టుబాటు ధర రాకపోయినా ఇక్కడి మార్కెట్ ధర కంటె పక్క రాష్ట్రంలోనే బాగుందన్న అభిప్రాయం రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఎటపాక, వీఆర్ పురం, కూనవరం, చింతూరు మండలాల్లో సుమారు 5,200 మంది రైతులు 10 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. సగటున ఎకరాకు 20 క్వింటాళ్ల వరకూ దిగుబడి వచ్చింది. ప్రస్తుతం మన రాష్ట్రంలోని గుంటూరు మార్కెట్లో క్వింటాలు మిర్చికి సుమారు రూ. 3,200 వరకు ధర పలుకుతోంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ మార్కెట్లో సుమారు రూ. 4,500 ధర పలుకుతోంది. దాంతో రవాణా ఖర్చులు అధికమైనప్పటికీ మిర్చి పంటను జగదల్పూర్లో అమ్ముకునేందుకే రైతులు మొగ్గు చూపుతున్నారు. అనేక నిబంధనలకు లోబడి గుంటూరు మార్కెట్‌కు పంటను తరలించినా సకాలంలో అమ్ముకునే వీలుండటం లేదని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో రైతుకు 20 క్వింటాళ్ల వరకు క్వింటాలుకు రూ. 1,500 అదనంగా చెల్లిస్తామని చేసిన ప్రకటన ఏవిధంగానూ ఇక్కడి రైతులకు ఉపయోగపడలేదు. కొందరు రైతులు మిర్చిని గుంటూరు మార్కెట్‌కు తరలించినా పంటను కొనేవారులేక రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తుంది. దాంతోతో గుంటూరు మార్కెట్లో విక్రయానికి విలీన మండలాల రైతులు అనాసక్తి చూపుతున్నారు. 80 శాతం వరకూ పంటను అమ్ముకున్నాక ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం ప్రకటించిన పథకాలు కార్పొరేట్ కంపెనీలకు లాభం చేకూర్చేందుకే అని వారు విమర్శిస్తున్నారు. ఈఏడాది పెట్టుబడులు అధికం కావటం, గిట్టుబాటు ధర రాకపోవటం, ప్రభుత్వం రైతులను సకాలంలో ఆదుకోక పోవటంతో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారు. విలీన మండలాల్లో మిర్చి పంట వివరాలు (వ్యవసాయశాఖ అంచనా) మండలం రైతులు ఎకరాలు దిగుబడి సీజీలో విక్రయం ఎటపాక 3076 5000 98000 70శాతం వీఆర్ పురం 534 1254 25000 80శాతం కూనవరం 1500 1945 38940 80శాతం చింతూరు 50 300 6000 90శాతం గుంటూరు మార్కెట్‌కు వెల్లినా ఫలితం లేదు గుంటూరు మార్కెట్‌కు 30క్వింటాళ్ల మిర్చిని తీసుకెళ్లను. అక్కడ అనేక షరతులు విధించటంతో వారం రోజులు మార్కెట్ వద్దే నిరీక్షించాల్సి వచ్చింది. ఈలోగా సుమారు రూ. 1500 ధర పతనమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానన్న ప్రోత్సాహకం అందలేదు. - కోడూరు నవీన్, ఎటపాక -
నష్టాల్లో బెంచ్ మార్కు సూచీలు
స్వల్పలాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం ముగింపులో కిందకి పడిపోయాయి. నిఫ్టీ 8400 కిందకి పడిపోయి, 8398 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ సైతం 52.51 పాయింట్లు దిగజారి 27235.66 వద్ద ముగిసింది. ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంకు, ఏషియన్, హీరో మోటార్ కార్పొ, హెచ్‌యూఎల్ నేటి మార్కెట్లో లాభాలు పండించగా.. రిలయన్స్ కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ నష్టాలు గడించాయి. ఆయిల్, మెటల్స్, ఎంపికచేసిన బ్యాంకింగ్, ఫైనాన్సియల్ స్టాక్స్‌లో నష్టాలు కొనసాగడంతో మధ్యాహ్నం ట్రేడింగ్‌లో బెంచ్‌మార్కు సూచీలు పడిపోయాయి. ఆయిల్, టెలికాం దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో దాదాపు 3 శాతం పడిపోయాయి. కార్పొరేట్ కంపెనీల ఫలితాలు, ప్రభుత్వ బడ్జెట్‌పై ఎక్కువగా దృష్టిసారిస్తున్న పెట్టుబడిదారులు ఆచితూచి అడుగులు వేస్తున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. యాక్సిస్ బ్యాంకు, ఎస్ బ్యాంకు ఫలితాలు గురువారం వెల్లడికానున్నాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు కొరత ఏర్పడటంతో ఆర్థికవ్యవస్థకు సపోర్టుగా బడ్జెట్ వస్తుందని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారని విశ్లేషకులు పేర్కొన్నారు. 2017-18 బడ్జెట్ ఫిబ్రవరి 1న విడుదల కానుంది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.08 పైసలు బలపడి 68.01 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్ మార్కెట్లోనూ బంగారం ధరలు 219 రూపాయలు లాభపడి 28,748గా నమోదయ్యాయి. -
2017 ఫస్ట్ ట్రేడింగ్ డే: నష్టాల్లో ముగింపు
ఏడాది ప్రారంభ ట్రేడింగ్‌లో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 31.01 పాయింట్ల నష్టంతో 26,595 వద్ద, నిఫ్టీ 6.30 పాయింట్ల నష్టంతో 8,179 వద్ద ముగిసింది. నష్టాల్లో ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లు లాభనష్టాల ఊగిసలాటలో నడిచి, ఆఖరికి నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి. మధ్యాహ్నం సెషన్లో ఆటో, ఫార్మా స్టాక్స్ మద్దతుతో నిఫ్టీ తన కీలకమార్కు 8200ను పునరుద్ధరించుకుంది. కానీ ముగింపుకు వచ్చే సరికి మళ్లీ 8,179 పాయింట్లకు పడిపోయింది. 2017 ప్రారంభం రోజున మార్కెట్లు బలహీనంగా ముగిసినప్పటికీ, మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్స్ మార్కెట్లు మార్కెట్లో మంచి ప్రదర్శనను కనబరిచాయి. ఈ రెండు సూచీలు 1.2 శాతం పైకి ఎగిశాయి. నిఫ్టీ మెటల్, ఆటో సూచీలు సెషన్ ప్రారంభంలో కొంత రికవరీ అయి, ఆఖరికి 2 శాతం లాభాలను ఆర్జించాయి. ఆటో షేర్లలో మహింద్రా అండ్ మహింద్రా, ఐషర్ మోటార్స్, టాటా మోటార్స్, మారుతీసుజుకీ 3.8 శాతం మేర లాభాలు పొందాయి. రియాల్టీ స్టాక్స్ కూడా 4 శాతం లాభాల్లో ముగిశాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలు 0.17 పాయింట్లు పడిపోయి 68.10గా నమోదైంది. ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం సైతం 70 రూపాయల లాభంతో 27,515గా ట్రేడ్ అయింది. -
ఏడాది ఆరభంలో ప్రతికూలంగా మార్కెట్లు
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలయ్యాయి. 2017 కొత్త సంవత్సరంలో మొదటి ట్రేడింగ్ సెషన్ ఆరంభంలో పాజిటివ్ గా ఉన్నా..వెంటనే నెగిటివ్ గా మారిపోయాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 57 పాయింట్ల నష్టంతో 26,569, నిఫ్టీ17 పాయింట్ల నష్టంతో 8,169వద్ద కొనసాగుతున్నాయి. రెండు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలెండింగ్ రేటు కోతలు సెంటిమెంట్‌ను ప్రభావితం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ మోదీ శనివారం నాటి ప్రకటన నేపథ్యంలో రియల్టీ అత్యధికంగా 2.3 శాతం జంప్‌చేసింది. ముఖ్యంగా పేదప్రజలకు అనుగుణంగా ప్రకటించిన నిర్ణయాలకు, గృహ నిర్మాణ రాయితీలతో రియల్టీ లాభపడుతోంది. అలాగే స్మాల్ కాప్ షేర్లు కూడాపాజిటివ్ గా ఉన్నాయి. అయితే ఎఫ్ఎంసీజీ, బ్యాంకింగ్, ఆటో రంగాలు మాత్రం నష్టాలతో ఉన్నాయి. ఐషర్, అంబుజా, అల్ట్రాటెక్, ఏసీసీ, బీపీసీఎల్ పుంజుకోగా, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ, హీరో మోటో నష్టాల్లో కొనసాగుతున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా జపాన్, చైనా, హాంగ్ కాంగ్, సింగపూర్, అమెరికా, బ్రిటన్, ఇతరులలో, న్యూ ఇయర్ డే సందర్భంగా సెలవు. అమెరికాసహా పలు ప్రపంచ మార్కెట్లకు నేడు సెలవుకావడంతో ఆరంభంలో సానుకూలంగా ఉన్నా వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఎఫ్ఐఐల అమ్మకాలు శుక్రవారం నగదు విభాగంలో ఎఫ్ఐఐలు దాదాపు రూ. 586 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 5 పాయింట్ల నష్టంతో రూ.67.97 వద్ద ఉంది. -
నష్టాల్లో మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం బలహీనంగా ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే100 పాయింట్లకు పైగా నష్టపోయిన సెన్సెక్స్ 162 పాయింట్ల నష్టంతో 26397 వద్ద, నిఫ్టీ 56 నష్టంతో 8136వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో నిఫ్టీ కీలక మద్దతుస్తాయి 8150 కిందికి దిగజారింది. బ్యాంక్ నిప్టీ కూడా నష్టాలతోనే ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా ఐటీ ఎఫ్ ఎంసీజీ, ఆటో రంగం నష్టపోతోంది. ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు లాభాల్లోఉన్నాయి. గురువారం నగదు విభాగంలో ఎఫ్ఐఐలు దాదాపు రూ. 403 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, దేశీ ఫండ్స్ మాత్రం యథావిధిగా రూ. 238 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి. అటు డాలర్ మారకపు విలువలో రూపాయి రెండు పైసల లాభంతో రూ. 68.37 వద్ద వద్ద ఉంది. -
నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
న్యూఢిల్లీ : అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో దేశీయ సూచీలు శుక్రవారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉత్తర కొరియా అణు పరీక్ష అనుమానాలతో ఆసియన్ మార్కెట్లు పడిపోతుండటంతో, సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పతనమవుతోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 114.84 పాయింట్ల నష్టంతో 29వేల దిగువకు 28930 దగ్గర ట్రేడ్ అవుతుండగా.. నిఫ్టీ 41.95 పాయింట్ల నష్టంతో 8910 వద్ద కొనసాగుతోంది. ప్రైవేట్ రంగ బ్యాంకు ఎస్ బ్యాంకు దాదాపు 6 శాతం మేర డౌన్ అవుతూ.. నిఫ్టీలో టాప్ లూజర్‌గా నష్టాలను గడిస్తోంది. అదేవిధంగా బీహెచ్ఈఎల్, హీరో మోటార్ కార్పొ సెన్సెక్స్‌లో నష్టాలను చవిచూస్తున్నాయి. బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, సిప్లా, మహింద్రా అండ్ మహింద్రా, టీసీఎస్‌లు లాభాలను ఆర్జిస్తున్నాయి. అమెరికా డాలర్ రికవరీ అవడంతో వరుసగా రెండో సెషన్లో కూడా రూపాయిల విలువ పడిపోతోంది. ముందటి ముగింపుకు 16 పైసలు బలహీనపడిన రూపాయి మారకం 66.57గా ప్రారంభమైంది. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 90 రూపాయల నష్టంతో 31,215 వద్ద కొనసాగుతోంది. -
బండ నేలల్లో పచ్చని పంటలు
చెరువు మట్టిని తరలించుకున్న రైతులు ఎర్రరేగడి నేలల్ని మాగాణిగా మార్చుకున్న వైనం జహీరాబాద్ టౌన్:జహీరాబాద్ నియోకవర్గంలో ఎర్ర, నల్లరేగడి భూములున్నాయి. కొన్ని గ్రామాల్లో ఎర్రబండతో కూడిన పొలాలు ఉన్నాయి. ఎర్రబండ భూములు సాగుకు ఏమాత్రం అనుకూలం కావు. అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం బండ భూములు కలిగిన రైతులకు వరంగా మారింది. ఈ పథకం కింద పూడిక తీయగా వచ్చిన మట్టిని పంటలు పండని రాతి నేలల్లోకి తరలించుకుని నల్లరేగడి భూములుగా మార్చుకున్నారు ఈ ప్రాంత రైతులు. బండనేలలను సాగుకు యోగ్యంగా చేసుకుని పంటలు పండిస్తున్నారు. వర్షాలు కూడా పడడంతో సాగుచేసిన పంటలు ఏపుగా పెరుగుతున్నాయి. మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల మట్టిని పొలాలకు తరలించుకునేందుకు అనుమతులివ్వడంతో ఆసక్తి కలిగిన రైతులు ముందుకు వచ్చి సారవంతమైన చెరువు మట్టిని తమ బండ రాతి భూముల్లోకి తరలించి నల్ల రేగడి భూములుగా మార్చుకుంటున్నారు. మట్టితో నింపిన పొలాల్లో పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. రైతులు తమ ఆర్థిక స్తోమతను బట్టి మట్టిని తరలించారు. మిషన్ కాకతీయ పనులు కొనసాగుతున్న సమయంలో ఒక్కో టిప్పరుకు రూ.300- రూ.500 వరకు ఖర్చుచేసి నల్లరేగడి మట్టిని తరలించారు. ఎకరానికి వంద నుంచి 150 ట్రిప్పుల మట్టిని నింపారు. ఎత్తుపల్లాలు ఉన్న చోట చదును చేశారు. ఎకరాకు రూ. 50 వేల వరకు ఖర్చుచేసి బీడు భూములను సాగుకు యోగ్యంగా మార్చుకున్నారు. ఊహించని విధంగా బండ భూములు సారవంతమైన నల్ల రేగడి పొలాలుగా మారండంతో రైతులు ఉత్సాహంతో పంటల సాగుకు శ్రీకారం చుట్టారు. కొందరు చెరకు పంట వేయగా మరి కొందరు అల్లం పంటను సాగు చేస్తున్నారు. మరి కొందరు రైతులు ఖరీఫ్ పంటలైన సోయాబీన్, పెసర, కంది తదితర పంటలు వేశారు. మట్టి తరలించిన పొలాల్లో పంటలు ఆశాజనకంగానే ఉన్నాయని రైతులు అంటున్నారు. -
రంజాన్ కు వినూత్న స్వాగతం!
జెడ్డాః రంజాన్ పర్వదినాల్లో ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు, మసీదుల్లో ప్రార్థనలతో నెల రోజులపాటు పండుగ వేడుక అంగరంగ వైభవంగా సాగుతుంది. సూర్యోదయానికి పూర్వం నుంచీ సూర్యాస్తమయం వరకూ కఠిన ఉపవాస దీక్ష (రోజా) ను చేపట్టి, రాత్రి సమయంలో ఇఫ్తార్ విందుతో ఉపవాసాన్ని విడుస్తారు. నెల రోజులపాటు ఉపవాసాలు ముగిసిన తర్వాత రంజాన్ పండుగ జరుపుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి నెల్లాళ్ళ పాటు దాన ధర్మాలతో, భక్తిమార్గంలో జరుపుకునే ఈ రంజాన్ పండుగకు ముగ్గురు పాకిస్తానీ యువకులు వినూత్నంగా స్వాగతం పలికారు. అందరికీ ఆసక్తికరంగా ఉండేట్టు నీటి అడుగు భాగంలో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఎర్ర సముద్రం దిగువ భాగాన లాంతర్ల వెలుగులో పండుగను కొత్త రకంగా ఆహ్వానించారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న యహేయా అష్ఫాక్, ఉమర్ జాన్, ఖాజీ అజ్మా లు ఎర్ర సముద్రం దిగువ భాగాన నూతన మార్గంలో రంజాన్ వేడుకలను ప్రారంభించారు. జెడ్డా తీర ప్రాంతంలోని ఎర్ర సముద్రం లోపలికి వెళ్ళి, నీటి అడుగు భాగంనుంచీ రంజాన్ కు స్వాగతం పలికారు. వారితోపాటు తీసుకెళ్ళిన లాంతర్ల వెలుగులోనే నీటికింద వేడుకలను నిర్వహించినట్లు కార్యక్రమం మొత్తాన్ని చిత్రీకరించిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ యహేయా...స్థానిక వార్తా పత్రికకు తెలిపారు. సముద్రతీర ప్రాంతాలు, పగడపు దిబ్బలు, బీచ్ లను హైలెట్ చేసేందుకు, మన జీవితాల్లో వాటి ప్రాముఖ్యతను తెలపడమే తమ లక్ష్యమని చెప్తున్నారు. రంజాన్ సందర్భంగా నీటి అడుగు భాగాన వేడుకలు నిర్వహించడానికి అదే ముఖ్య కారణమంటున్నారు. అండర్ వాటర్ జీవితం ఎలా ఉంటుందో ఇప్పటివరకూ కనిపెట్టలేదని, ఇది పర్యాటకాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందే యహేయా దుబాయ్, యాన్బులలో నీటి అడుగు భాగంలో డైవింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు వ్యక్తుల బృందం రంజాన్ సందర్భంగా సముద్రానికి 140 అడుగుల కింది భాగంలో జెండాలు ఊపుతూ ప్రార్థనలు నిర్వహించినట్లు వారు చిత్రీకరించిన వీడియోలను బట్టి తెలుస్తోంది. జెడ్డా పరిసర ప్రాంతాల్లో డైవింగ్ కు వెళ్ళేందుకు ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య సమయం ఉత్తమమైనదని, సంవత్సరం మొత్తంలో ఆ రెండు నెలల సమయంలోనూ నీటి అడుగు భాగం ప్రత్యక్షంగా కనిపిస్తుందని, అలాగే నీటి ఉష్ణ్రోగ్రత కూడ సరిపడేట్లు ఉంటుందని యహేయా చెప్తున్నారు. భూమ్మీద, ఆకాశంలోనే కాక, నీటి అడుగు భాగాన కూడ విహరించి ఆనందించవచ్చని చెప్పడమే లక్ష్యంగా ఈ బృదం రంజాన్ వేడుకలను సముద్రానికి అడుగు భాగాన నిర్వహించింది. -
కాలిఫోర్నియా బీచ్ లో 'రెడ్ కార్పెట్'
కాలిఫోర్నియాః అక్కడి తీర ప్రాంతాలు ఇప్పుడు సందర్శకులకు, పర్యటకులకు రెడ్ కార్పెట్ తో భయాన్ని గొల్పుతున్నాయి. రెడ్ కార్పెట్ అంటే సాదర స్వాగతం అనుకుంటే తప్పులో కాలేసినట్లే. నీటిలో కాలుష్య ప్రభావమో.. వాతావరణ ప్రతికూల పరిస్థితులో కానీ జలచరాలు కుప్పలు తెప్పలుగా ఒడ్డుకు చేరుకుంటుండటంతో ఎర్రని ట్యూనా పీతలతో నిండిన తీరం రెడ్ కార్పెట్ ను తలపిస్తోంది. వేలకు వేలుగా ఎర్ర పీతలు దక్షిణ కాలిఫోర్నియా బీచుల్లో చేరడం న్యూ పోర్ట్ బీచ్ సందర్శకులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అరుదుగా కనిపించే ఆ దృశ్యాన్ని కొందరు వింతగా చూస్తుంటే... అక్కడి మునిసిపల్ సిబ్బంది మాత్రం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయలేక తీవ్ర కష్టాలు పడుతున్నారు. కొన్నేళ్ళ క్రితం ఇలాగే సుమారు మూడు అంగుళాల పొడవైన ఎర్ర పీతలు కాలిఫోర్నియా ఆరెంజ్ కౌంటీ ప్రాంతాన్ని ముంచెత్తాయి. అయితే కొందరి కష్టం మరి కొందరికి ఆనందం అన్నట్టు.. శాండియాగోకి దగ్గరలో ఉన్న ఇంపీరియల్ బీచ్ లో పక్షుల ఆనందం మాత్రం పట్టలేకుండా ఉంది. ఓ స్పెషల్ బఫెట్ ను వాటి ముందు పెట్టినట్లు బీచ్ ఒడ్డుకు చేరిన పీతలను తినేందుకు ఉత్సాహంగా పక్షులు అక్కడికి చేరుతున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి చేరిన పీతలను అక్కడే వదిలేయాలా, తిరిగి సముద్రంలోకి పంపించాలా అన్న విషయంపై అధికారులు తలమునకలౌతున్నారు. గత 15 సంవత్సరాలనుంచి ఇలా ఎర్ర పీతలు సముద్ర తీరాల్లోకి కొట్టుకు వస్తున్నట్లు పురపాలక రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఒక్క క్రితం సంవత్సరంలోనే బాల్బోవా ఐస్ ల్యాండ్, చైనా కోవ్ ప్రాంతాల్లో కార్మికులు, స్వచ్ఛంద సభ్యులు కలసి ఎనిమిది టన్నుల దాకా ఒడ్డుకు చేరిన పీతలను పట్టుకొన్నట్లు లాస్ ఏంజిల్స్ దగ్గరలోని ఆరెంజ్ కౌంటీ న్యూపోర్ట్ నగరం చెప్తోంది. ఇలా నీటినుంచి జలచరాలు బయటకు వచ్చేయడానికి తీవ్ర వాతావరణ మార్పులే కారణమని సైంటిస్టులు చెప్తున్నారు. -
వైన్ తాగి 107 ఏళ్ళు బతికాడు..!
ఇటీవల చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్ళిన ఓ 107 ఏళ్ళ వృద్ధుడి జీవన విధానం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అతడు కేవలం రెడ్ వైన్ మాత్రమే తాగి బతికాడన్న విషయం తెలిసి అంతా విస్మయం చెందారు. స్పెయిన్ గాల్సియాలోని విగోకి చెందిన యాంటోనియో డొకాంపో గార్సియా క్రితం వారం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. బతికున్నంత కాలం తాను స్వయంగా ఇంట్లో తయారు చేసుకున్న రెడ్ వైన్ మాత్రమే తాగేవాడట. డొకాంపో మధ్యాహ్న భోజనానికి బదులుగా రెండు బాటిల్స్... డిన్నర్ కు బదులుగా మరో రెండు బాటిల్స్ రెడ్ వైన్ తాగేవాడు. అంటే ఒక్కసారి అతడు తాగే మొత్తం వైన్ ఒకటిన్నర లీటరు వరకు ఉంటుందని అతడి కుమారుడు మిగ్వెల్ డొకాంపో తెలిపాడు. తామిద్దరూ కలిసి ఇంట్లోనే నెలకు రెండు వందల లీటర్ల రెడ్ వైన్ తయారు చేసేవాళ్ళమని, నీళ్లు కూడా తాగకుండా తన తండ్రి వైన్ మాత్రమే ఆహారంగా తీసుకునేవాడని చెప్తున్నాడు. 107 సంవత్సరాలపాటు తన తండ్రి ఎంతో ఆరోగ్యంగా బతికారని... స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రాంకో కోసం పోరాటం తరువాత వైన్ ఉత్పత్తి కేంద్రం.. బొడేగాస్ డొకాంపో స్థాపించారని, అందుకోసం రబాదావియా టౌన్ లో స్వంత ద్రాక్షతోట ఏర్పాటు చేసుకున్నారని తెలిపాడు. డొకాంపో కేవలం కెమికల్ ఫ్రీ ఆర్గానిక్ వైన్ ను మాత్రమే తాగేవాడు. అయితే అతడు ఉత్పత్తి చేసిన వైన్ లో ఎక్కువ భాగం అమ్మేయగా... మిగిలిన వైన్ తో పాటు, అతని ద్రాక్షతోటను ప్రస్తుతం అతడి మేనల్లుడు జెరోనిమో డొకాంపో నిర్వహిస్తున్నాడు. డొకాంపో సంవత్సరానికి 60,000 లీటర్ల వైన్ ను ఉత్సత్తి చేసి, అందులో 3 వేల లీటర్లను తన కోసం ఉంచుకొనేవాడు. అయితే తాను అన్నేళ్ళు ఆరోగ్యంగా బతకడానికి వైనే కారణమని ఎప్పుడూ చెప్తుండేవాడట. -
భారీ ఎర్రచందనం స్వాధీనం
-
శేషాచలం అడవుల్లో పోలీసుల కూంబింగ్
-
బహుమెత్తని బహుమతి
మన ఇష్టాన్ని అవతలివారికి తెలియజేయడానికి పడే కష్టాన్ని తగ్గించేది.. అవతలివారి ఇష్టాన్ని చూరగొనడానికి చేసే ప్రయత్నం ఫలించేలా చేసేది ఒకటుంది. అదేంటో తెలుసా..? కానుక. అవును. ఓ మంచి కానుక మనం చెప్పకుండానే మన మనసును అవతలివారి ముందు పరుస్తుంది. వారి మనసులో మనమీద ఓ ముద్ర వేస్తుంది. తగిన స్థానాన్నీ కల్పిస్తుంది. అందుకే మన అనుకునేవారికి, మనవాళ్లని చేసుకునేందుకు మనం ఎంచుకున్న వారికి.. మంచి కానుకను ఇవ్వడానికి ఓ రోజును సృష్టించారు. అదే ‘టెడ్డీ డే’! ..:: సమీర నేలపూడి వాలెంటైన్ వీక్‌లో నాలుగో రోజైన ‘టెడ్డీ డే’ నాడు ప్రతి ప్రేమికుడూ తన ప్రేయసికి ఓ టెడ్డీ బేర్‌ను గిఫ్ట్‌గా ఇస్తాడు. టెడ్డీ బేర్నే ఎందుకు ఇస్తారు అన్నది తెలుసుకోవాలంటే.. ముందు ఆ బొమ్మ చరిత్రను తెలుసుకోవాలి. నిజానికి టెడ్డీ బేర్ అనే బొమ్మ పుట్టుక వెనుక పెద్ద కథే ఉంది. 1902లో నాటి అమెరికా అధ్యక్షుడు థియోడర్ రూజ్వెల్ట్.. మిసిసిపీ, లూసియానాల మధ్య ఉన్న సరిహద్దు సమస్యని తీర్చడానికి వెళ్లారు. తీరిక సమయంలో మిసిసిపీలో వేటకు వెళ్లారు. అప్పుడాయనకు ఓ ఎలుగుబంటి కంటబడింది. వెంటనే దాన్ని వేటాడాలనుకున్నారు రూజ్వెల్ట్. కానీ అది బుజ్జి పిల్ల. ఎంతో ముద్దుగా ఉంది. దాంతో కాల్చడానికి ఆయనకు మనసొప్పలేదు. జాలితో విడిచిపెట్టేశారు. మర్నాడు ఓ పత్రికలో క్లిఫార్డ్ బెర్రీమ్యాన్ అనే కార్టూనిస్టు వేసిన చక్కని కార్టూన్ ప్రచురితమైంది. దాన్ని చూసిన ఓ బొమ్మల కంపెనీ యజమానురాలు, ఎలుగుబంటి పిల్ల రూపంలో ఓ బొమ్మను తయారుచేసింది. దాన్ని రూజ్వెల్ట్కు పంపిస్తూ... ‘ఆ బొమ్మకి టెడ్డీ బేర్’ అని పేరు పెట్టుకోవచ్చా’ అంటూ లేఖ రాసింది. ఆయన అనుమతినివ్వడంతో టెడ్డీ బేర్ అనే బొమ్మ ఈ ప్రపంచానికి పరిచయమైంది. సాఫ్ట్ గిఫ్ట్.. ఆనాడు అలా రూజ్వెల్ట్ ఎలుగు పిల్లను సంరక్షించడం వల్లే టెడ్డీ బేర్ పుట్టుకొచ్చింది కాబట్టి, టెడ్డీ బేర్‌ను సంరక్షణకు ప్రతిరూపంగా భావిస్తున్నారు. అందుకే వాలెంటైన్ వీక్‌లో ‘టెడ్డీ డే’నాడు.. నిన్ను జీవితాంతం జాగ్రత్తగా కాపాడుకుంటాను అని వాగ్దానం చేస్తూ ప్రేమికులు తమ ప్రియసఖులకు టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇవ్వడం జరుగుతోంది. ఈ మధ్య కొందరు అమ్మాయిలు కూడా అబ్బాయిలకు టెడ్డీ బేర్ కీ చెయిన్లు, టెడ్డీ బొమ్మలు ముద్రించిన గ్రీటింగ్ కార్డులూ ఇస్తున్నా.. ఎక్కువగా ఇచ్చేది మాత్రం అబ్బాయిలే. అబ్బాయిలే అమ్మాయిలకు ఎందుకు ఇస్తారు అనే ప్రశ్నకు రెండు సమాధానాలు ఉన్నాయి. మొదటిది.. అమ్మాయిలే సాఫ్ట్ టాయిస్ని ఇష్టపడతారు. రెండవది.. ఎప్పుడూ పురుషుడే స్త్రీని సంరక్షించాల్సిన స్థానంలో ఉంటాడు. అందుకే టెడ్డీ డే రాగానే ప్రతి ప్రేమికుడూ తన ఇష్టాన్ని, ప్రేమను వ్యక్తపరుస్తూ.. ఆమెను కాపాడతానని భరోసా ఇస్తూ.. అందమైన టెడ్డీ బేర్‌ని ప్రేయసి చేతుల్లో పెడతాడు. ఆమె మనసును, నమ్మకాన్ని గెలుచుకుంటాడు! అద్దాల అల్మరాల్లోంచి.. భాగ్యనగరంలో టెడ్డీ డే సందడి చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. సంవత్సరమంతా దుకాణాల్లోని అద్దాల అల్మరాల్లో కూర్చుని జాలిగా చూసే టెడ్డీ బేర్లు.. టెడ్డీ డే దగ్గర పడుతోందంటే రోడ్ల మీదకు వచ్చి సందడి చేస్తుంటాయి. ఎరుపు, తెలుపు, గులాబి, ఆరెంజ్ తదితర రంగుల్లో మెరిసిపోతుంటాయి. అయితే ప్రేమికుల మనసుకు దగ్గరగా ఉండే గులాబి రంగు టెడ్డీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. మెడకు అందమైన రిబ్బన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. టెడ్డీ మెత్తని రూపం.. చెలి నులివెచ్చని కౌగిలిలో నలిగిపోతుంది. వాలెంటైన్స్ డే పూర్తయ్యే వరకూ రోడ్ల పక్క ఎక్కడ చూసినా టెడ్డీలు కనిపించి మురిపిస్తుంటాయి. ఈ ఏడాది కూడా వీటి సందడి ఎక్కువగానే ఉంది. ఎక్కడ చూసినా ప్రేమికులు టెడ్డీలను కొంటూ కనిపిస్తున్నారు. తమ ప్రేమ కానుకను ప్రేమించిన వారికి అందించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
వినాయకుడు ఊగుతున్నాడని ప్రచారం
లక్ష్మణచాంద : లక్ష్మణచాంద మండలం రాచాపూర్ అనుబంధ గ్రామమైన పొట్టపెల్లి(కె) గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహం తల ఊగుతుందంటూ ప్రచారం జరగడంతో సోమవారం భక్తులు చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి తరలివచ్చారు. భక్తులు పూలమాల వేసే క్రమంలో తల ఊగడంతోపాటు కళ్లు కూడా ఎరుపు, తెలుపు రంగుల్లోకి మారుతున్న విషయం గమనించిన వారు చుట్టూ పక్కల ఉన్న వారికి సమాచారం అందించారు. వారు వచ్చి గమనించగా మళ్లీ తల ఊగడంతో వినాయకుడి తల ఊగుతుందంటూ ప్రచారం జోరందుకుంది. వినాయకుడి తల ఊగడం కళ్లు ఎరుపు, తెలుపు రంగులోకి మారడం, సోమవారం పౌర్ణమి గడియాలు రావడం వినాయకుడి మహిమగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
దావుద్ కన్ను ఎర్రచందనంపై పడిందా?
-
హైదరాబాద్ ట్రెండ్స్ రెడ్ రోజెస్
సందె వన్నెల్లో సాగే మబ్బు ఎర్రదనంతో ప్రకృతి కాంతకు సొగసులు అద్దితే.. ఎరుపులో మెరిసిపోయే మాణిక్యం కనువిందు చేస్తుంది. తొగరు రంగులో.. కాస్త పొగరుగా కనిపిస్తామని యువత రెడ్ డిజైనింగ్స్పై మోజు పడుతోంది. వాలెంటైన్స్ కలర్‌గా ముద్రపడిన ఎరుపును నగర యువత తెగ ప్రేమించేస్తోంది. నిన్నమొన్నటి వరకు మూన్లైట్ ఫంక్షన్స్‌లో బ్లాక్ డ్రెసప్తో మతులు పోగొట్టిన బ్యూటీలు ఇప్పుడు ఎర్రబడిపోతున్నారు. కోపంతో కాదండోయ్.. ఎర్రని ఆహార్యంతో గుంపులో ఇంపుగా కనబడుతున్నారు. రెడ్ లుక్స్ రిచ్ అని ఫిక్సయిన తరుణులు.. చెంగావి రంగులో బంగారు వన్నెలీనుతున్నారు. ఎర్రటి లాంగ్ గౌన్లలో తళుక్కుమంటున్న ఈ యువతులు అప్పుడే విచ్చుకున్న రోజాల్లా ఉన్నారు కదూ..! మగువలే కాదు, మగాళ్లు కూడా రెడ్ ట్రెండ్‌కు సలామ్ కొడుతున్నారు. సిటీలో ఇప్పుడు స్పెషల్ అకేషన్స్‌లో ఎర్రందనానికే పట్టం కడుతున్నారు. రొమాంటిక్ కలర్..! సైకలాజికల్‌గా ఫాస్టర్ హార్ట్ బీట్, బ్రీతింగ్కు సింబాలిక్‌గా రెడ్ కలర్‌ను చూపిస్తే, ఫ్యాషన్ డిజైనర్స్ మాత్రం రెడ్ను రొమాంటిక్ కలర్‌గా మార్చేశారు. ప్రమాదానికి, వేగాన్ని కంట్రోల్ చేయడానికి ఎర్రజెండా ఊపితే.. ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం రెడ్ కలర్‌కు పచ్చజెండా ఊపేస్తున్నారు. ఇక పెళ్లి తంతులో రెడ్కున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. నుదుటిన సింధూరం నుంచి పాదాల పారాణి వరకు ఎర్రదనంతో దర్శనమిచ్చే వధువు వివాహ వేడుకలో సెంటరాఫ్ అట్రాక్షన్. ఇటీవల ఫ్యాషన్ ప్రపంచంలోనూ రెడ్ హల్చల్ చేస్తోంది. ఫ్యాషన్ వరల్డ్ రోజురోజుకీ కొత్తందాలను ఆహ్వానిస్తోంది. వెరైటీ డిజైన్స్ ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. ఒక్కోసారి కలర్స్ కూడా ఫ్యాషన్ ప్రపంచాన్ని శాసిస్తుంటాయి. అకేషన్‌కు తగ్గ కలర్ ఫాలో అయ్యేవాళ్లు చాలా మందే ఉంటారు. ఈ మధ్య అందరూ రెడ్ కలర్‌పై మోజు పెంచుకుంటున్నారు. ఒకప్పుడు పార్టీ వేర్ బ్లాక్ కలర్ హవా నడిచింది. తర్వాత గ్రీన్, పర్పుల్, ఎల్లో, బ్లూ కాంబినేషన్స్ వచ్చి వెళ్లాయి. ప్రజెంట్ మాత్రం రెడ్ కలర్‌కు అందరూ ఆకర్షితులవుతున్నారు. సెలబ్రెటీల నుంచి కామన్ యూత్ వరకు అందరూ ఫంక్షనల్ బ్రాండ్‌గా రెడ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దివ్య, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఇన్నోవేటివ్స, హిమాయత్‌నగర్ -
రంగుపడుద్ది.. కానీ రెండే..
ఫొటోను జాగ్రత్తగా చూడండి. అన్నీ ఎరుపు, తెలుపు రంగుల్లోనే కనిపించడంలే.. బెంగళూరుకు చెందిన రియల్ ఎస్టేట్ ఏజెంట్ సెవెన్ రాజ్ ప్రత్యేకత అదే. ఈయనకు ఎరుపు, తెలుపు రంగులంటే చాలా ఇష్టం. దీంతో ఇంట్లో వాళ్లు వేసుకునే డ్రెస్‌లు, వాడే కారు, బైక్, ఇంటి రంగులు ఇలా అన్నింటా రెడ్ అండ్ వైటే కనిపిస్తుంది. చివరికి టూత్ పేస్టులు, ప్లేట్లు, కత్తులు, కళ్లద్దాలు ఇలా అన్నీ ఈ కలర్స్‌లోనే ఉండాల్సిందే. ఇంట్లో ఒక్క టీవీ, డీవీడీ ప్లేయర్ తప్ప అన్నీ ఈ రంగుల్లోనే ఉంటాయి. రంగుల్లో రెడ్, వైట్ వాడితే.. నంబర్ల విషయానికొచ్చేసరికి ఈయనకు ఏడు అంటే పడి చస్తాడు. దీనికి తోడు ఆయన పేరు కూడా సెవెన్ రాజే కావడం విశేషం. ఇంట్లో ఏడో సంతానం కావడంతో ఈయన తండ్రి సెవెన్ రాజ్ అని పేరు పెట్టారు. అప్పట్నుంచి ఈయన కూడా ‘7’పై మక్కువ పెంచుకున్నాడు. ఏ ఫోన్ నంబరైనా 777తోనే ముగుస్తుంది. అంతేకాదు.. కోటు వేసినా.. షర్ట్ వేసినా.. దానికి 7 బటన్లే ఉంటాయి. మరీ చిత్రం ఏంటంటే.. ఈయనకు 7 భాషలు మాట్లాడ్డం వచ్చు. ఇన్ని ప్రత్యేకత లుండటంతో స్థానికంగా సెవెన్ రాజ్ సెలబ్రిటీగా మారిపోయాడు. -
అర్ధరాత్రి సూర్యోదయం
విదేశాలలో... ‘ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్’ అని పేరున్న నార్వేలోనిదీ సూర్యోదయ దృశ్యం. ఇక్కడ మే నెల నుండి ఆగష్టు వరకు రాత్రి 11 గం.కి కూడా పట్టపగలులా ఉంటుంది. పన్నెండు గంటల తర్వాత చీకటి పడినట్టే పడి.. ఆ వెంటనే సూర్యోదయమౌతుంది. ఒక్కోసారి 4 గంటలకు సూర్యోదయం అవుతుంది. ఆ విధంగా వేసవిలో 4 గంటలే చీకటిగా ఉంటే, జూన్ జులైలో రెండు గంటలు మాత్రమే చీకటి. అక్టోబర్ నుండి ఈ దృశ్యం పూర్తిగా మారుపోతుంది. రోజులో 3-4 గంటలు మాత్రమే వెలుతురు. ఉత్తర ఐరోపాకు చెందిన నార్వే స్కాండినేవియా ద్వీపకల్పం పశ్చిమ ప్రాంతంలో ఉంది. ధ్రువప్రాంతం కావడంతో ఇక్కడి వాతావరణ పరిస్థితులు రోజుకు మూడు, నాలుగు సార్లు మారుతూ ఉంటాయి. అప్పుడే ఎండ, అప్పుడే చలి, ఆ వెంటనే వాన... ఇలా ఒకేరోజు మూడు రుతువులను చూడవచ్చు. ఉత్తర నార్వేలో జూన్ 21, దక్షిణ నార్వేలో డిసెంబర్ 22న రోజంతా ఎండకాస్తూనే ఉంటుంది. ధృవప్రాంతం కావడంతో సూర్యకిరణాల వెలుగులు ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ.. ఇలా హరివిల్లు రంగులు దర్శనమిస్తుంటాయి. -
నర్సంపేట టు నాగ్‌పూర్
దొడ్డు మిర్చికి డిమాండ్ రోజూ ఎనిమిది లారీల సరుకు ఎగుమతి క్వింటాల్‌కు రూ.11 వేలు పలుకుతున్న ధర నర్సంపేట, న్యూస్‌లైన్: రైతులు ఎర్ర బంగారంగా పిలుచుకునే మిర్చి పంట సాగులో నర్సంపేట ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ ప్రాంతంలో పండిన దొడ్డు మిర్చికి డిమాండ్ ఉంది. ఈ పంటకు గతంలోనే వుహారాష్ట్రలోని నాగ్‌పూర్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు లభిం చింది. అరుుతే కొన్ని సంత్సరాలుగా సరైన గిట్టుబాటు ధర లభించ లేదు. ఈ ఏడాది తిరిగి అత్యధిక ధర లభించడంతో నర్సంపేట నుంచి నాగ్‌పూర్‌కు మిర్చి ఎగువుతి అవుతున్నది. జిల్లాలో 20వేల హెక్టార్ల విస్తీర్ణంలో మిర్చి సాగు కా గా.. అందులో నర్సంపేట ప్రాంతంలోనే 5వేల హెక్టార్లలో సాగైంది. 80 శాతం వరకు దొడ్డు మిర్చిని సాగు చేశారు. వాతావరణం అనుకూలించడంతో పాటు వర్షాలు సంమృద్ధిగా కురియుడంతో ఈ ఏడాది మిర్చి దిగుబడి కూడా బాగానే వస్తోంది. నర్సంపేట నియోజకవర్గంలోని దాసరిప ల్లి, ఖవ్ముపల్లి, చంద్రయ్యుపల్లి, నల్లబెల్లి వుండలంలోని వూమిండ్ల వీరయ్యుపల్లి, పంతుల్‌పల్లి, రుద్రగూడెం, ఇటుకాలపల్లి, దుగ్గొండి వుండలంలోని తొగర్రారుు, చాపలబండ, గిర్నిబావి, వుల్లంపల్లి, తివ్ముంపేట, వు ర్రిపల్లి, చెన్నారావుపేట వుండలంలోని సూరిపల్లి, కోనాపురం, గురిజా ల, అమీనాబాద్, జల్లి, బోజెర్వుతో పాటు నెక్కొండ వుండలంలో కూడా మిర్చి అధికంగా సాగైంది. ఈ ప్రాంతం నుంచి రోజుకు 5 నుంచి 8 లారీ ల మిర్చి ఎగువుతి అవుతోంది. వరంగల్ మార్కెట్లో క్వింటాకు రూ.10 వేల నుంచి రూ.11 వేల వరకు ధర లభిస్తుండగా.. నాగపూర్‌లో రూ.15 వేల వరకు ధర లభిస్తుండడంతో నాగ్‌పూర్‌కు ఎగువుతి అవుతోంది. ధర బాగా వస్తున్నది నాకున్న నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాల్లో దొడ్డు(టవూట) మిర్చి సాగు చేసిన. ఎకరాకు రూ.20వేల చొప్పున రూ.40వేలు పెట్టుబడి పెట్టిన.ఎకరాకు 16 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. ఈ మిర్చిని వుహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వారం రోజుల్లో తరలిస్తా. అక్కడ క్వింటాకు రూ.13 వేల నుంచి రూ.15 వేల ధర లభిస్తుంది. నాకు రూ.5 లక్షల మేర ఆదాయం రానుంది. గిట్టుబాటు ధర వస్తున్నందుకు సంతోషంగా ఉంది. - ఎల్లబోరుున రాములు, దాసరిపల్లి నాలుగేళ్ల తర్వాత వుంచి రోజులు నాలుగు సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ పండించిన మిర్చి పంటకు నాగ్‌పూర్‌లో వుంచి ధర లభించేది. ఆ తర్వాత పెరిగిన ధరలు, త గ్గిన దిగుబడులతో మిర్చి పంట న ష్టాన్ని కలిగిస్తూ వచ్చింది. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురియుడంతో రెండు ఎకరాల్లో మిర్చి సాగు చేసిన నాకు సువూరు 30 క్వింటాళ్ళ దిగుబడి వచ్చింది. వారం రోజుల్లో నాగపూర్‌కు వూ గ్రావు రైతులందరం కలిసి మిర్చిని అవుు్మకునేందుకు వెళ్తున్నాం. - వూలోతు వీరన్న, బాంజీపేట -
గులాబీల గుసగుసలు
పద్మావతి గార్డెన్లో గులాబీల సోయగం తెలుపు, ఎరువు, పింక్ పువ్వులు తన్మయత్వం చెందుతున్న సందర్శకులు అరకులోయ, న్యూస్‌లైన్: పర్యాటక కేంద్రం అరకులోయలోని పద్మావతి గార్డెన్‌లోని గులాబీల సోయగం సందర్శకులను కట్టిపడేస్తున్నాయి. ప్రస్తుతం అన్‌సీజన్ కావడంతో సందర్శకుల సంఖ్య అంతంతమాత్రంగానే ఉన్నా వచ్చిన వారు ఇక్కడి పూల సొగసుతో తన్మయత్వం చెందుతున్నారు. ఎరుపు, తెలుపు, పింక్...ఇలా పలు రంగుల్లో, రకరకాల ఆకారాలతో పూలు ముచ్చటగొలుపుతున్నాయి. గార్డెన్లో చూడదగిన అంశాలు ఏమీ లేకపోవడంతో పర్యాటకుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న నిర్వాహకులు వారిని కొంతైనా సంతోషపరచాలన్న ఉద్దేశంతో గులాబీ తోటల పెంపకానికి శ్రీకారం చుట్టారు. అయితే సీజన్ ముగిసిన తరువాత పెంచడంతో అన్‌సీజన్ నాటికి ఇవి విరబూస్తున్నాయి. దీంతో వచ్చిన కొద్దిమందైనా సంతృప్తితో వెనుదిరుగుతున్నారు.