సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు నష్టపోయి 31,663 వద్ద నిఫ్టీ 47పాయింట్లు పతనమై 9904 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ సంకేతాల నేపథ్యంలో ఆరంభంలోనేనష్టాలను నమోదుచేసిన ప్రధాన సూచీల్లో నిఫ్టీ ఒక కదశలో 9900 దిగివకు చేరింది.
ఉత్తర కొరియాతో మరోసారి యుద్ధభయాలు చెలరేగడంతో మంగళవారం అమెరికా స్టాక్ మార్కెట్లు పతనంకాగా.. ప్రస్తుతం ఆసియాలోనూ అమ్మకాలు నమోదవుతున్నాయి. దీంతో దేశీయంగానూ సెంటిమెంటు బలహీనపడినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అటు ఎఫ్‌ఐఐ అమ్మకాలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి.
అన్ని సెక్టార్లు నష్టపోతున్నాయి. ఫార్మా, మెటల్, రియల్టీ, భారీగా నష్టపోతుండగా బ్యాంకింగ్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ ఇదే బాటలోఉన్నాయి. ఎన్‌డీటీవీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా , సన్ ఫార్మా, టాటా మోటార్స్‌డీవీఆర్, బీపీసీఎల్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, ఐటీసీ, వేదాంతా, టెక్ మహీంద్రా, భారతీ నష్టపోతున్నాయి., బజాజ్ ఫైనాన్స్‌జస్ట్ డయల్, హెచ్‌సీఎల్ , మారికో, టైటన్ లాభపడుతున్నాయి.