ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రెడ్’. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో మూవీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో అస్త్రాన్ని విడుదల చేసేందుకు సమయాత్తమవుతోంది. చిత్రంలోని తొలి సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
మార్చి 6న సాయంత్రం 5 గంటలకు సినిమాలోని ‘నువ్వే నువ్వే’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేశారు. ఇక మణిశర్మ శైలిలో ఈ మెలోడీ సాంగ్ ఉండబోతోందని చిత్ర బృందం తెలిపింది. ఇక కిశోర్ తిరుమల-రామ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక ఈ సాంగ్ కూడా హిట్టయిందంటే ‘రెడ్’ జోరుకు బ్రేకులు ఉండవని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు.
చదవండి:
‘ఆయన రావడం మా అదృష్టం’
‘బాధకు బ్రాండ్స్‌తో పనేంటి డాడీ’
‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’
Published Wed, Mar 4 2020 9:06 PM | Last Updated on Wed, Mar 4 2020 9:06 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment