Mani Sharma
-
‘అభిమాని’ కోసం రంగంలోకి మణిశర్మ
ప్రముఖ సినీ జర్నలిస్ట్, నిర్మాత సురేష్ కొండేటి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "అభిమాని". ది డిజైర్ ఆఫ్ ఏ ఫ్యాన్ (ఓ అభిమాని కోరిక) అనేది ఈ చిత్ర ట్యాగ్‌లైన్. భూలోకం, యమలోకం నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రాంబాబు దోమకొండ. ఎస్కే రహ్మాన్, కంద సాంబశివరావు గారు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. డ్రమ్స్ రాము సంగీతాన్ని (పాటలు) అందిస్తున్నారు. ఈ అభిమాని సినిమాకు మెలొడీ బ్రహ్మ మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం. తాజాగా ఈ సినిమా రీ రికార్డింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు మకర సంక్రాంతి విశెస్ తెలియజేసింది మూవీ టీమ్. ఫిబ్రవరిలో "అభిమాని" సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది.ఈ సందర్భంగా మెలొడీ బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ - అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మంచి కంటెంట్ ఇంకా సోషల్ మెసేజ్ కలిగిన అభిమాని( Abhimani) మూవీకి అంతే గొప్పగా నేపథ్య సంగీతం కుదిరింది . ఇందులో ఉన్న అంశం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. ప్రధాన పాత్రలో నటించిన సురేష్ కొండేటి బాగా నటించారు. ఆయన నటన అందరినీ ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ దోమకొండ రాంబాబు అనుకున్న కంటెంట్ ని అదే స్థాయిలో ప్రజెంట్ చేశారు. సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా ఉన్నప్పటి నుండి నాకు పరిచయం. ఈ సినిమాలో తన నటనతో మంచి పేరు తెచ్చుకుంటాడు. అభిమాని మూవీని మీరంతా సూపర్ హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. అల్ ది బెస్ట్ సురేష్, అండ్ అభిమాని టీమ్. అన్నారు.అనంతరం డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ..'అభిమాని' మూవీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెలొడీ బ్రహ్మ మణిశర్మ గారు అందించడం చాలా సంతోషంగా ఉంది. ఆయన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఇచ్చారు. రీ రికార్డింగ్ కంప్లీట్ అయ్యింది. మూవీలోని విజువల్స్ మణిశర్మ గారి నేపథ్య సంగీతం కలిసి ఐ ఫీస్ట్ లా ఉంటుంది. సినిమా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. మరీ ముఖ్యంగా సినిమాకి ప్రాణం అయిన చివరి 20 నిమిషాలుకు మణిశర్మ గారు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ప్రాణం పోశారు. మా సినిమాకు సపోర్ట్ చేసిన మణిశర్మ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం’ అన్నార. సురేష్ కొండేటి(Suresh Kondeti) మాట్లాడుతూ - లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు నేను ప్రధాన పాత్ర పోషించిన అభిమాని సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశారు. ఈ సంక్రాంతిని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అందుకే ఈసారి మా ఊరికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయాను. మణిశర్మ అనేది పేరు కాదు, ఓ బ్రాండ్. ఆయన సంగీతం వల్లే బ్లాక్ బస్టర్ సినిమాలు ఎన్నో ఉన్నాయి. తెలుగులో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అంటే మణిశర్మ చేయాలనే రేంజ్లో తన సినిమాలతో రఫ్పాడించారు. నేను యంగ్ గా ఉన్నప్పుడు ఆయన పాటలు వింటూ ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను అలాంటిది ఇప్పుడు అంతటి మెలోడీ బ్రహ్మ నా సినిమాకు నేపథ్య సంగీతాన్ని అందించడం తో సంతోషంగా ఉంది. మణిశర్మ గారితో నా పరిచయం కొన్ని దశాబ్దాల నాటిది. మణిశర్మ గారి మా టీమ్ కు తోడయ్యక అభిమాని సినిమా లెవెల్ పెరిగింది. రీ రికార్డింగ్ అద్భుతంగా వచ్చింది. ఇప్పటిదాకా నన్ను సినీ జర్నలిస్ట్ గా, ప్రొడ్యూసర్ గా ఆదరించిన ప్రేక్షకులు నటుడిగా కూడా అభిమాని సినిమాతో ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అన్నారు. -
19 ఏళ్ల నుండి గం గం గణేశా సాంగ్ ట్రెండ్ అవ్వడానికి కారణం
-
నాకు ఇష్టమైన డైరెక్టర్ వారే!
-
డబుల్ ఇస్మార్ట్ సాంగ్ గురించి పూరికి నాకు గొడవ అయింది !!
-
ఇళయరాజా గారితో తిట్లు తినేవాడిని ..
-
భమ్ భమ్ బోలే సాంగ్ నా లాగా ఇంకెవరూ చేయలేరు ఎందుకంటే..
-
నాకు ఇష్టమైన డైరెక్టర్ వారే!
-
ఏం జేద్దామంటవ్ మరి.. కేసీఆర్ డైలాగ్ అందుకే పెట్టాం: మణిశర్మ
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ మూవీ నుంచి మార్ ముంత.. చోడ్ చింత అనే సాంగ్ రిలీజైంది. ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వాయిస్‌ను ఉపయోగించారు. ఏం జేద్దామంటవు మరి? అనే డైలాగ్‌ను యథాతథంగా వాడేశారు. దీన్ని బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా విమర్శించారు.మీమ్స్ నుంచి..ఈ పాట చిత్రీకరణ అంతా కల్లు కాంపౌండ్లోనే జరుగుతుంది. ఇలాంటి మందు పాటలో కేసీఆర్ డైలాగ్ ఎలా వాడతారని మండిపడ్డారు. తాజాగా ఈ వివాదంపై సంగీత దర్శకుడు మణిశర్మ వివరణ ఇచ్చాడు. 'కేసీఆర్ గారు గొప్ప వ్యక్తి. ఆయన మనందరికీ ఫేవరెట్.. ఆయన్ను చాలా మీమ్స్‌లో చూస్తుంటాం. అలా మీమ్స్‌లో నుంచి ఆ డైలాగ్ తీసి వాడాం. ఎంజాయ్.. పండగ అనేది కూడా మీమ్స్ నుంచి తీసిన డైలాగే..ఐటం సాంగ్ కాదుఈ అల్టిమేట్ సాంగ్‌లో కేసీఆర్ డైలాగ్ పెడితే బాగుంటుందనుకున్నాం. అంతే తప్ప ఆయన్ను కించపరచాలని కాదు. కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే చేశాం. దయచేసి దీన్ని తప్పుగా తీసుకోకండి. పైగా ఇది ఐటం సాంగ్ కాదు, హీరోహీరోయిన్లు కలిసి చేసే డ్యూయెట్ సాంగ్' అని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. చదవండి: రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా రివ్యూ -
శివుడిపై అద్భుతమైన పాట వైరల్.. డాక్టర్ నాగ మాధురి గాత్రానికి ఫిదా!
'సర్వేంద్రియానాం నయనం ప్రధానం' అన్న విషయం తెలిసిందే. అందుకు తగినట్లుగా డా: నాగ మాధురి ఏరికోరి నేత్ర వైద్యురాలుగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. డాక్టర్‌గా సేవలు అందిస్తూనే ఆమెలో మరో టాలెంట్ కూడా దాగి ఉంది. అందరినీ మెచ్చేలా పాటలు పాడగలదు. ఒకపైపు వేలాదిమందికి కంటి చూపు ప్రసాదిస్తూ... సరి చేస్తూనే... సంగీతంలోనూ నిష్ణాతురాలిగా రాణిస్తున్నారు. బహుముఖ ప్రతిభాశాలిగా డాక్టర్ నాగ మాధురి మెప్పిస్తున్నారు. ఉన్నత విద్యా సంపన్న కుటుంబంలో జన్మించిన నాగ మాధురి చిన్నప్పటి నుంచి సంగీతం పట్ల మక్కువ చూపేవారు. చదువులో చాలా చురుగ్గా ఉంటూనే.. చిత్ర కళ, గానంలో విశేష ప్రతిభ కనబరిచేవారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో డాక్టర్ వైజర్సు సుబ్రహ్మణ్యం దగ్గర సంగీతంలో శిష్యరికం చేశారు. కర్నాటిక్ క్లాసిక్ మ్యూజిక్‌లో డిప్లొమా చేయడంతోపాటు అందులో డిష్టింక్షన్ సాధించడం నాగ మాధురి ప్రతిభను చెప్పకనే చెబుతుంది. ఆప్తమాలజీ (కంటి వైద్యం) స్పెషలిస్ట్‌గా ఒంగోలులోని స్మార్ట్ విజన్ హాస్పిటల్‌కి మేనేజింగ్ పార్టనర్ కమ్ ఛీఫ్ కన్సల్టెంట్‌గా సేవలందిస్తూనే.. సంగీతంలోనూ సాధన చేస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఈ శివరాత్రికి కానుకగా ఆ మహా శివుడిపై ప్రేమతో అద్భుతమైన పాటను ఆమె పాడారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో పేరుగాంచిన స్ట్రింగ్ ప్లేయర్ మాండలిన్ ఎస్.ఎమ్. సుభాని సారధ్యంలో "శంభో మహాదేవ... శంకర గిరిజా రమణ" త్యాగరాజ కృతిని ఆలపించి.. 'గాన మాధురి' అనే తన పేరును సార్ధకం చేసుకున్నారు నాగ మాధురి. 15 సంగీత వాయిద్యాలలో నిష్ణాతులు అయిన సుభాని గారు కీరవాణి, థమన్, రెహమాన్, అనిరుద్ వంటి దిగ్గజ దర్శకులకు తన వాద్య సహకారం అందిస్తుంటారు. ఇకపోతే... "శంభో మహాదేవ" ఆడియో అండ్ వీడియో ఆల్బమ్‌ను మ్యూజిక్ మాంత్రికుడు మణిశర్మ ఆవిష్కరించి, అభినందించడం విశేషం. "శంభో మహదేవ" ఆల్బమ్ అనే తన కల సాకారం దాల్చడంలో మాండలిన్ సుభాని గారి స్ఫూర్తి, విశ్వనాధ్ అరిగెల సహకారం, మరీ ముఖ్యంగా తన ఫ్యామిలి సపోర్ట్ ఎంతైనా ఉందని డాక్టర్ నాగ మాధురి అన్నారు. మణిశర్మ గారి మంచితనాన్ని, ఆయన అభినందనను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె తెలిపారు. -
ఇంద్రాణి ట్రైలర్ బాగుంది
‘‘ఇంద్రాణి’ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. సాయి కార్తీక్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. సరికొత్త కథాంశంతో రూపొందిన ‘ఇంద్రాణి’ చిత్రం విజయం సాధించాలి’’ అని ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. యానియా భరద్వాజ్, కబీర్ దుహాన్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇంద్రాణి’. స్టీఫెన్ పల్లం దర్శకత్వంలో వెరోనికా ఎంటర్టైన్ మెంట్స్‌పై స్టాన్లీ సుమన్ బాబు నిర్మించారు. సుధీర్ వేల్పుల, ఓఓ రెడ్డి, జైసన్, కేకే రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘అమెరికాలో ఉంటూ ఇక్కడ సినిమా నిర్మించడం ఎంత కష్టమో నాకు తెలుసు. సినిమా మీద ఫ్యాషన్ ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ‘ఇంద్రాణి’ విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘అన్ని వాణిజ్య అంశాలున్న సైన్స్‌ఫిక్షన్ థ్రిల్లర్ ఇది. రాబోయే 50 సంవత్సరాల్లో ఇండియా సాంకేతిక పరంగా ఎంత ముందుంటుంది? అనేది ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు స్టీఫెన్ పల్లం. ఈ వేడుకలో చిత్ర సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఎగ్జిక్యూటివ్‌ప్రోడ్యూసర్: స్టాన్లీ పల్లం, కెమెరా: చరణ్ మాధవనేని. -
ఆ తమన్ అన్నీ అబద్ధాలే చెప్తాడు: మణి శర్మ
మాస్ పాటైనా, క్లాస్ పాటైనా, భక్తి గీతమైనా.. అన్ని రకాల ట్యూన్స్‌తో అద్భుతాలు సృష్టిస్తాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించిన ఈయన ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు పూర్తయింది. ఒకప్పుడు టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా అందరికంటే ఎక్కువ పారితోషికం అందుకున్న ఈయన ఇప్పుడు చేతినిండా అవకాశాలు లేవని బాధపడుతున్నాడు. తనకు కూడా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులిస్తే బాగుండని ఆశపడుతున్నాడు. తాజాగా అతడు ఓ షోకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా మణి శర్మ మాట్లాడుతూ.. 'నేను మొదట వయొలిన్ నేర్చుకున్నాను. తర్వాత పెద్దదిగా కనిపించిందని కీబోర్డు నేర్చుకున్నాను' అని చెప్పాడు. ఇంతలో అనంత శ్రీరామ్.. 'మీకు పాట నచ్చకపోతే స్పీకర్ బాక్సులు పగలగొడతారంట కదా!' అని అడిగేశాడు. వెంటనే మణిశర్మ స్పందిస్తూ.. 'ఆ తమన్గాడు అబద్ధం చెప్పాడు. నా జీవితంలో ఒక్కసారే అలా చేశానులే' అని నవ్వేశాడు. తన కెరీర్లో ఎంతోమంది గొప్ప సెలబ్రిటీలతో కలిసి పని చేయడం అదృష్టమంటూ ఎమోషనలయ్యాడు. షో చివర్లో ఆయనకు సగౌరవంగా సన్మానం చేశారు. చదవండి: బెల్లంకొండ గణేశ్‌తో లవ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ -
ఆ స్టార్స్ అవకాశాలు ఇవ్వట్లేదు.. మణిశర్మ ఆవేదన ఎంతవరకు కరెక్ట్?
మణిశర్మ.. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. మహేశ్ దగ్గర నుంచి పవన్, చిరంజీవి.. ఇలా దాదాపు అందరు స్టార్ హీరోలకు వాళ్ల కెరీర్లో గుర్తుండిపోయే సాంగ్స్ ఇచ్చారు. అలాంటి ఈయన ఇప్పుడు చోటామోటా హీరోల సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిశర్మ.. తనకు స్టార్ హీరోలు అవకాశాలు ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?) మణిశర్మ ఏమన్నారు? ఇప్పుడు ఏ విషయంలోనైనా హర్ట్ అవుతున్నారా? అని యాంకర్ అడిగాడు. దీనికి బదులిచ్చిన మణిశర్మ.. 'హర్ట్ అయ్యేందుకు కారణం ఉందంటే.. మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి హీరోలు అందరికీ ఒక్కో ఛాన్స్ ఇవ్వొచ్చు. అలా అన్ని నాకే ఇచ్చేయాలని అనట్లేదు. ఒక్కొక్కరికి తలో ఛాన్స్ ఇస్తే జనాలకు కూడా వెరైటీగా ఉంటుంది. దేవీకి ఓ సినిమా.. నాకో సినిమా.. తమన్‌కి ఓ సినిమా.. పోనీ వాళ్లకు రెండు ఇచ్చి నాకు ఒకటే ఇవ్వండి. అలా పంచితే అందరికీ వెరైటీగా ఉంటుంది. ఇది నా వరకు నేను అనుకునేది. నేను వెళ్లి వాళ్లతో చెప్పలేదు. ఎవరితో చెప్పలేను' అని మణిశర్మ తన మనసులోని బాధని బయటపెట్టారు. ఆవేదన కరెక్టేనా? 1998 నుంచి 2010 వరకు మంచి ఫామ్‌లో ఉన్న మణిశర్మ.. ఆ తర్వాత పాటల పరంగా ఎందుకో వెనకబడిపోయారు. అదే టైంలో దేవీశ్రీ ప్రసాద్, తమన్ లాంటి వాళ్లు ముందుకు దూసుకొచ్చారు. మధ్యలో 'ఇస్మార్ట్ శంకర్'తో మణిశర్మ.. ఊపు ఊపునప్పటికీ జోష్ సరిపోలేదు. అలానే ట్రెండ్ తగ్గ పాటలు చేయడంలో మణిశర్మ కాస్త వెనకబడటం కూడా స్టార్ హీరోలు ఈయన ఛాన్సులు ఇవ్వకపోవడానికి కారణమై ఉండొచ్చు. ఈయన బాధపడటంలో తప్పు లేదు కానీ అంతమాత్రన మహేశ్, పవన్ లాంటి హీరోలు మణిశర్మకు పిలిచి ఛాన్స్‌లు ఇస్తారా అంటే డౌటే. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'యానిమల్'.. అనుకున్న టైమ్ కంటే ముందే స్ట్రీమింగ్?) Evaru Chance ichina ivvakapoyina Manisharma is god of Telugu melody ❤️ I owe you Mani garu for giving us 100’s of wonderful songs, I rarely listen to music but when I start listening it would be from your album 🤗 Love u Melody bramhi #Manisharma 🐐 pic.twitter.com/DJ5uYXkjpZ — 𝓖𝓮𝓻𝓶𝓪𝓷 𝓓𝓮𝓿𝓪𝓻𝓪 ⚒️ (@HemanthTweets39) January 2, 2024 -
RGV వల్ల చిరంజీవి నాకు ఛాన్స్ ఇచ్చారు..!
-
నీకు సాంగ్స్ కంపోజ్ చేయడం రాదు అని RGV ఏడిపించారు
-
చిరంజీవి,బాలకృష్ణ కి కలిపి ఒక సాంగ్ కొడితే..!
-
వైఫ్ కోసం తన మనసులో మాట చూపిన మణిశర్మ
-
'ఊరికి ఆత్మ ఉంటే?'.. డిఫరెంట్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
మనుషులకి ఆత్మలు ఉన్నట్టే.. ఓ ఊరికి ఆత్మ ఉంటే.. ఆ ఆత్మ తన కథ తానే చెబితే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీసిన సినిమా 'మధురపూడి గ్రామం అనే నేను'. శివ కంఠమనేని హీరోగా నటించారు. మల్లి దర్శకుడు. మణిశర్మ సంగీతమందించారు. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ పతాకంపై కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు. (ఇదీ చదవండి: 'బేబి' డైరెక్టర్‌కి రెండు కార్లు గిఫ్ట్ ఇచ్చిన ప్రొడ్యూసర్) ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే అక్టోబరు 13న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒంగోలు, చీరాల బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ ఇది. రాజమండ్రి, మచిలీపట్నం,హైదరాబాద్‌లోని పలు అందమైన, ఆసక్తికరమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిపామని దర్శకుడు చెప్పాడు. త్వరలో ట్రైలర్ రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌసులోకి టీమిండియా స్టార్ క్రికెటర్!?) -
వాడు నరరూప రాక్షసుడు : మణిశర్మ
-
ఒక్కడు మూవీ పాటల గురించి సంగీత దర్శకుడు మణి శర్మ
-
చిరంజీవి బాలకృష్ణ గురించి మాటల్లో చెప్పలేనిది
-
మణి శర్మకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఆర్జీవీ..!
-
సినిమా ఇండస్ట్రీలో ఈ గురుశిష్యుల బంధం గురించి తెలుసా?
శిష్యుల ప్రతిభను, అర్హతలను కచ్చితంగా అంచనావేసి, ఎప్పుడు, ఎవరికి, వేటిని ప్రసాదించాలో తెలిసినవారే నిజమైన గురువులు. అలా జీవిత పాఠాలతో పాటు తమ శిష్యులకు సినిమా పాఠాలు కూడా నేర్పించి సక్సెస్ఫుల్ హీరోలు,డైరెక్టర్లు, సంగీత దర్శకులను అందించిన గురువులు ఎందరో ఉన్నారు.. నేడు గురుపూజోత్సవం సందర్భంగా వారిలో కొందరిని గుర్తు చేసుకుందాం. తన డైరెక్షన్‌తో పాటు రైటింగ్స్‌తో టాలీవుడ్లో ఓ మార్క్ వేశారు దర్శకుడు సుకుమార్. 'ఆర్య' చిత్రం కోసం తొలిసారి మెగాఫోన్ పట్టిన ఈ స్టార్ డైరెక్టర్.. తన తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. తన మాస్టర్ స్క్రీన్ ప్లేతో సరికొత్త కథలను తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈ లెక్కల మాస్టర్.. 'పుష్ప: ది రైజ్ ' తో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డు దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే సుక్కూ లాగానే ఆయన శిష్యులు కూడా తమ సినిమాలతో ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నారు.తొలి సినిమాలతోనే బ్లాక్బస్టర్లను తమ ఖాతాల్లో వేసుకుంటున్నారు. తన వద్ద పని చేసిన ఎంతో మందికి మార్గదర్శిగా ఉంటూ తన శిష్యగణాన్ని టాలీవుడ్లో పాపులరయ్యేలా చేస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అనే బ్యానర్ ద్వారా వారిని సపోర్ట్ చేస్తూ అండగా నిలుస్తున్నారు. సుక్కు స్కూల్ నుంచి వచ్చినవారందరూ ఇప్పుడు స్టార్ డైరెక్టర్లుగా స్థిరపడుతున్నారు. ► 'ఉప్పెన' సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమైన బుచ్చిబాబు సనా.. మెగా మేనల్లుడితో కలసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌తో పాటు జాతీయ అవార్డును కూడా అందుకున్నాడు. సుకుమార్‌కు ఆయన ప్రియ శిష్యుడు. ఈ క్రమంలోనే తన సొంత బ్యానర్లో డైరెక్టర్‌గా లాంఛ్ చేశారు. ఇప్పుడు రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్‌తో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యారు. ► టాలీవుడ్లో మరో సెన్సేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ఆయన కూడా సుకుమార్ శిష్యుడే. 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీకాంత్.. 'దసరా' చిత్రంతో డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు. నాని, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల క్రేజీ డైరెక్టర్‌గా మారిపోయాడు. ► 'కరెంట్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పల్నాటి సూర్య ప్రతాప్ కూడా సుక్కు దగ్గర శిష్యరికం చేసినవాడే. ఫస్ట్ సినిమా నిరాశ పరిచినా, గురువు నేతృత్వంలో రెండో సినిమా 'కుమారి 21F'తో మంచి సక్సెస్ అందుకున్నాడు. ► జక్కా హరి ప్రసాద్ ఎన్నో సినిమాలకు సుక్కుతో కలసి వర్క్ చేశాడు. 100% లవ్ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చిన హరి.. '1 నేనొక్కడినే' సినిమాకు రచయితగా చేశాడు. 'ప్లే బ్యాక్' మూవీతో మంచి గుర్తింపు ► యాంకర్ ప్రదీప్ హీరోగా '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమా తీసిన దర్శకుడు మున్నా కూడా సుకుమార్ శిష్యుడే. ► డైరెక్టర్ 'బొమ్మరిల్లు' భాస్కర్ కూడా 'ఆర్య' సినిమాకు సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేశాడు. ► 'భమ్ భోలేనాథ్' ఫేమ్ కార్తీక్ దండు కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసినవాడే. సుకుమార్ బ్యానర్లో సాయి ధరమ్ తేజ్ హీరోగా 'విరూపాక్ష' అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ► ఇండస్ట్రీలో స్టార్ రైటర్‌గా రాణిస్తున్న శ్రీకాంత్ విస్సా కూడా సుకుమార్ దగ్గర వర్క్ చేశాడు. పుష్ప, పుష్ప 2, 18 పేజీస్ వంటి సినిమాల స్క్రిప్టు విషయంలో సుకుమార్‌కు సపోర్ట్‌గా శ్రీకాంత్ నిలిచారు. డెవిల్, టైగర్ నాగేశ్వరరావు సినిమాలకు కూడా ఆయన రైటర్‌గా పనిచేస్తున్నారు. ఆర్జీవీ ఫ్యాక్టరీలో ఎందరో... ఒకప్పుడు ఇండియన్ సినిమాను షేక్ చేసిన రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుంచి ఎందరో డైరెక్టర్లు బయటకు వచ్చి వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను తెచ్చుకున్నారు. వర్మ శిష్యుల్లో ఆయన తర్వాత అంత పేరు తెచ్చుకున్న వాళ్లలో కృష్ణవంశీ, తేజ, పూరి జగన్నాథ్, గుణశేఖర్, శివనాగేశ్వరరావు, నివాస్, అజయ్ భూపతి, జీవన్ రెడ్డి, హరీశ్ శంకర్, జేడీ చక్రవర్తి, బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, బాలీవుడ్ అగ్రదర్శకుడు మధుర్ బండార్కర్ ఉన్నారు. వర్మ ఫిలిం ఫ్యాక్టరీ పేరుతో ఆర్జీవీ బోలెడంతమందిని తన శిష్యులుగా తయారు చేసి వారికి లైఫ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సంగీత ప్రపంచంలో సంగీతంలో స్వరబ్రహ్మగా పేరు తెచ్చుకున్న మణిశర్మ ఒక దశాబ్దం పాటు ఆయన తెలుగు సినిమాను ఏలారు. టాప్ హీరో మూవీ అంటే సంగీతం మణిశర్మ ఇవ్వాల్సిందే. ఆయనకు చాలా మంది శిష్యులే ఉన్నారు వారిలో దేవిశ్రీ, హారీష్ జైరాజ్, థమన్ వంటి వారు ఆయన దగ్గర శిక్షణ తీసుకున్న వారు కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు కోటికి కూడా ఎందరో శిష్యులు ఉన్నారు. వారిలో ఏఆర్ రెహమాన్,మణిశర్మ ముందు వరుసలో ఉంటారు. దేవీశ్రీ ప్రసాద్, తమన్, హారీశ్‌జై శంకర్లు కూడా ఆయన వద్ద శిక్షణ పొందారు. సూపర్ స్టార్ కృష్ణకు గురువు ఎవరంటే... కృష్ణ నటించిన తొలి చిత్రం తేనె మనసులు. ఈ సినిమాకి ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వం వహించారు. ఆయనను కృష్ణ గురువుగా భావించేవారు. ఆదుర్తి వారు మరణించినప్పుడు పాడిపంటలు సినిమా షూటింగ్లో భాగంగా గుంటూరులో ఉన్నారు కృష్ణ. తన గురువు గారిని ఆఖరిచూపు చూసేందుకు ఎంతగానో తాపత్రయపడ్డారు. కానీ రవాణా సదుపాయాలేవీ అందుబాటులో లేవు. ఆఖరికి ది హిందూ పత్రిక యాజమాన్యం వారిని అభ్యర్థించి, వారి ప్రత్యేక విమానంలో హుటాహుటిన మద్రాసు చేరుకున్నారు. కమల్ హాసన్‌కు వారిద్దరూ గురువులే అగ్ర దర్శకుడు కె.విశ్వనాథ్ - ప్రముఖ కథానాయకుడు కమల్‌హాసన్ మధ్య గురు శిష్యుల బంధం ఉంది. ఈ ఇద్దరి కలయికలో ఎప్పటికీ గుర్తుండిపోయే సాగర సంగమం, శుభ సంకల్పం చిత్రాలొచ్చాయి. కె.విశ్వనాథ్ జీవించి ఉన్న రోజుల్లో ఆయనతో కొంత సమయం గడిపేవారు కమల్‌హాసన్.. మరో దిగ్గజ దర్శకుడు కె బాల చందర్ కూడా కమల్‌కు గురువే.. వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. చిరంజీవి- విశ్వనాథ్‌ల గురు శిష్యుల బంధం తెలుగు సినిమా స్థాయిని శిఖరాగ్రానికి చేర్చి, తన ప్రతి సినిమాతో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకులు విశ్వనాథ్‌కు మెగాస్టార్ చిరంజీవికి మధ్య గురు శిష్యుల సంబంధం ఉన్న విషయం అందరికి తెలిసిందే. విశ్వనాథ్ దర్శకత్వంలో చిరు నటించిన శుభలేఖ, ఆపద్భాంధవుడు, రుద్రవీణ, స్వయంకృషి, వంటి సినిమాలు మెగాస్టార్ కెరియర్లో మైలురాయిగా సుస్థిరస్థానం సంపాదించుకున్నాయి. మెగాస్టార్ మాస్ హీరోగా మాత్రమే కాదు, ఫ్యామిలీ అండ్ క్లాసికల్ సినిమాలలో సైతం అద్భుతంగా నటించి ఏ సినిమాకు అయినా వన్నె తేగలరు అని నిరూపించాయి వారి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు. ఇప్పటికీ కూడా ఒక క్లాసిక్‌గా నిలుస్తాయనడంలో సందేహం ఉండదు. (ఇదీ చదవండి: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కోసం వీళ్ల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. టాప్‌లో ఎవరంటే?) -
ఇంత వయసు వచ్చిన నాకు మ్యూజిక్ పూర్తిగా తెలియదు.
-
శాకుంతలం టీమ్ తో సాక్షి స్పెషల్ ఇంటర్వ్యూ
-
అవసరానికో అబద్ధం
త్రిగున్, రుబాల్ షేక్ రావత్ జంటగా ఆయాన్ బొమ్మాళి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘అవసరానికో అబద్ధం’’. ఝాన్సీ, శ్రీ కృష్ణమూర్తి యలమంచిలి సమర్పణలో డా. శివకుమార్ చికిన సహకారంతో డా. జై జగదీశ్ బాబు యలమంచిలి నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి తెలుగు నిర్మాతల మండలి అధ్యక్షుడు దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ కొట్టారు. మరో నిర్మాత సురేష్‌బాబు గౌరవ దర్శకత్వం వహించారు. ఆయాన్ బొమ్మాళి, కృష్ణమూర్తి, డా. జై జగదీశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘మనిషి జీవితంలో నిజానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అబద్ధానికి కూడా అంతే ప్రాధాన్యత ఉందని చెప్పే సందేశంతో మా చిత్రం రూ΄పొందుతోంది’’ అన్నారు. ఈ ప్రారంప్రాత్సవంలో విజయవాడ తూర్పు వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ , తెలంగాణ పో లీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ కోలేటి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరా: సీహెచ్ మోహన్ చారి. -
హీరోయిన్ అనుష్క పేరు చెప్పి రూ.51 లక్షలు మోసం!
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. పలానా హీరో, హీరోయిన్ అపాయింట్మెంట్ ఇప్పిస్తానని, సినిమాల్లో నటించే అవకాశాలు ఇప్పిస్తామంటూ పలువురు కేటుగాళ్లు లక్షల్లో డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ అనుష్క, మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పి రూ.51లక్షలు మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనుష్క, మణిశర్మలతో అపాయింట్మెంట్ ఇప్పిస్తానంటూ మేనేజర్ ఎల్లారెడ్డి.. విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత, వర్ధమాన నిర్మాత లక్ష్మన్ చారీ నుంచి రూ. 51 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. అనుష్కతో సినిమా డేట్స్ అంటూ నిర్మాతను పలు మార్లు బెంగళూరు తీసుకెళ్ళిన ఎల్లారెడ్డి.. మొదటగా రూ.26 లక్షలు వసూలు, తర్వాత మణిశర్మ పేరు చెప్పి మరికొన్ని డబ్బులు.. మొత్తంగా రూ.51 లక్షలు వసూలు చేసి అపాయింట్మెంట్ ఇప్పించలేదు. ఎల్లారెడ్డి చేతిలో మోసపోయానని గుర్తించిన లక్ష్మణాచారి.. ఫిలిం ఛాంబర్ ని ఆశ్రయించాడు. దీంతో మొదట డబ్బు వెనక్కి ఇస్తా అని చెప్పిన మేనేజర్, తరువాత తిరగపడ్డాడు.డబ్బులు అడిగితే ఇంట్లోని ఆడవాళ్లతో కేసులు పెట్టిస్తాని బెదిరించాడు. చివరకు చేసేదేమి లేక బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
సమంత 'శాకుంతలం' నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్‌కు రెడీ
స్టార్ హీరోయిన్ సమంత నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఇదివరకే ఈ చిత్రం నుంచి మల్లికా మల్లికా అంటూ సాగే మెలోడీ సాంగ్ విడుదలై ఆకట్టుకోగా ఇప్పుడు “ఋషివనములోనా” అనే సాంగ్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈనెల 25న ఈ పాటను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. శకుంతల, దుష్యంతల ప్రేమని చూపించేలా ఈ సెకండ్ సాంగ్ ఉండే ఛాన్స్ ఉంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల అవుతున్న శాకుంతలం సినిమాకు మనిశర్మ సంగీతం అందిస్తున్నారు. A melody you'd fall in love with!🤍🎶#Rushivanamlona/#RushimooniyonKa/#Ruhivanadalondu/#RishivanamAagum/#Risivanthane from Jan 25th.#Shaakuntalam @Gunasekhar1 @Samanthaprabhu2 @ActorDevMohan #ManiSharma @neelima_guna @GunaaTeamworks @SVC_official @tipsofficial @tipsmusicsouth pic.twitter.com/7kSuTqK0Bg — Neelima Guna (@neelima_guna) January 23, 2023 -
సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది.ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మణిశర్మ తల్లి సరస్వతి(88) ఆదివారం సాయంత్రం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మణిశర్మ సోదరుడు రామకృష్ణ నివాసంలో ఆమె కన్ను మూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సరస్వతి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మణిశర్మకు తమ సానుభూతిని ప్రకటించారు. -
NMBK: ఆకట్టుకుంటున్న ‘నచ్చావ్ అబ్బాయి’ పాట
రాజావారి రాణిగారు, ఎస్ఆర్ కళ్యాణమండపం లాంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కిరణ్ అబ్బవరం.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఈ మధ్యే సమ్మతమే చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన కిరణ్.. త్వరలోనే మరో సినిమాతో అలరించడానికి రెడీ అవుతున్నారు. ‘ఎస్ఆర్ కల్యాణ మండపం’ ఫేమ్ శ్రీధర్ గాదె దర్శకత్వంలో కోడి దివ్య ఎంటర్టైన్ మెంట్స్‌పై కోడి రామకృష్ణ గారి ప్రథమ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మిస్తున్న తాజా చిత్రం ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’(NMBK). సంజనా ఆనంద్, సిద్ధార్థ్ మీనా హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నచ్చావ్ అబ్బాయి’పాట విడుదలైంది. ఈ పాటకు భాస్కరపట్ల లిరిక్స్ అందించగా, ధనుంజయ్, లిప్సిక అద్భుతంగా ఆలపించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. కిరణ్ అబ్బవరం తనదైన స్టెప్పులతో ఆకట్టుకుంటున్నాడు. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం మాస్ లుక్‌లో కనిపించబోతున్నాడు. -
‘ప్రేమదేశం’ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన
1996లో వచ్చిన ‘ప్రేమదేశం’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు.. అప్పట్లో యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దాదాపు దశాబ్దం పాటు ఎక్కడ చూసిన అవే పాటలు వినిపించాయి. చాలాకాలం తర్వాత ఇప్పుడు అదే టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతుంది.మేఘా ఆకాశ్, త్రిగున్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదలైన మ్యూజికల్ గ్లింప్స్‌కు అనూహ్య స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో ఈ సినిమా గ్లిమ్స్ ఇప్పటికే 1 మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసిందిశ్రీకాంత్ సిద్దం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సిరి క్రియేటివ్ వర్క్స్ పతాకంపై శిరీష సిద్ధం నిర్మిస్తున్నారు. అలనాటి అందాల తార మధుబాల ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో లో చిత్రీకరించబడుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొంది .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూన్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
ఈ ఏడాది సెన్సేషనల్ హిట్ ఇస్తాను- హీరో శ్రీవిష్ణు
‘అన్నమయ్య ఎన్నో కీర్తనలు రాశారు. అందులో‘దనానా భళాతందనానా’ ఒక్కటే విప్లవాత్మకమైన కీర్తన. ప్రకృతితో పాటు మనిషికి డబ్బు, కులం, మతం వంటి అంశాలు చర్చిస్తూ రాసిన ఈ గీతం చాలా హైలెట్ అయింది. మా కథకు యాప్ట్ అయ్యే టైటిల్ ఇది. ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుందనే మా చిత్రానికి ‘భళా తందనాన’అనే టైటిల్ పెట్టామని చెప్పారు హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా, కేథరిన్ థ్రెసా హీరోయిన్గా నటించిన చిత్రం భళా తందనాన. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పణ లో రజనీ కొర్రపాటి నిర్మించారు. చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. మే 6 న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హీరో శ్రీవిష్ణు మీడియాతో పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.ఆవెంటో ఆయన మాటల్లోనే.. ► చైతన్యతో నాకు 14 ఏళ్లుగా పరిచయం ఉంది. ఈ కథను నాకు బాణం(2009) సినిమా అప్పుడే చెప్పారు. బసంతి టైంలో ఓ సినిమా చేద్దాం అనుకున్నాం. కానీ అప్పటికీ పూర్తిగా కథ వర్కౌట్ కాలేదు. ఆ తరువాత తను బిజీ అయ్యాడు నేను బిజీ అయ్యాను. నాలుగేళ్ళు తర్వాత కథకు ఒక రూపం రావడంతో బాగా నచ్చి ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. చైతన్యకు అన్ని శాఖలపై పట్టు వుంది. తను సెట్లో మోనిటర్ చూడరు. నాకు మొదట్లో అదే అనుమానం వచ్చి అడిగాను. నాకు ఫ్రేమ్ ఎలా వుందో, లైటింగ్ ఎట్లా పెట్టారో, నటీనటులు హావభావాలు అన్నీ నేను చెప్పినట్లే వస్తుంటాయి. అప్పడు మోనిటర్‌తో పనేంటి? అనేవారు. మొదటి సినిమాకే ఆయన అంత క్లారిటీగా వుండడంతో ఆయన ఆలోచన విధానం బాగా నచ్చింది. అందుకే ఆయనతో పనిచేయడం హ్యాపీగా అనిపించింది. ► ఈ సినిమాలో ముందు 25 నిమిషాలు క్యారెక్టర్ల పరిచయం ఉంటుంది. రానురాను కథలో డెప్త్ వెళ్లడంతో ప్రతి క్యారెక్టర్ హైలైట్ గా ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటాయి. ఇంతవరకు రాని కొత్త కోణం ఇందులో హైలెట్ గా ఉంటుంది. కేజీయఫ్ వంటి అంత పెద్ద సినిమాలో చేసిన ఆయన నా సినిమాలో చేయడం చాలా గొప్పగా ఉంది. ఆయనతో వచ్చే ఫైట్ సీక్వెన్స్ సినిమాను నిలబెడతాయి. ఒక అరుదైన కొత్త క్లైమాక్స్ ఈ సినిమాలో చూస్తారు. ► ఇది సస్పెన్స్ థ్రిల్లర్, ఇంటెన్సివ్ కథ. చాలా బాగుంటుంది. ఈ సినిమా చెప్పగానే నేను చేయాలని డిసైడ్ అయిపోయాను. ఇందులో చాలా ఫన్ ఉంటుంది. ► ఈ చిత్రంలో నేను కామన్ మ్యాన్ గానటించాను. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా కేథరిన్ నటించింది. కామన్ మ్యాన్ గా చాలా చేయాలి అనుకుంటాం, కానీ చేయలేం. ఆ సందర్భంలో ఈ జర్నలిస్టు సహకారంతో తీసుకుంటే ఎలా వుంటుంది అనేది నా పాత్ర. ఆ ప్రాసెస్ లో చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ► కేథరిన్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్. ఆమె నాతో కంటే మిగిలిన చాలా పాత్రలతో కనెక్ట్ కావడంతో ఆమె నటనకు మంచి స్కోప్ వున్న పాత్ర అది. ఆమె కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుంది. ► ఇది సస్పెన్స్ థ్రిల్లర్ కాబట్టి బీజియమ్స్ చాలా ఇంపార్టెంట్. మణిశర్మ చక్కటి బాణీలతోపాటు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చక్కగా ఇచ్చారు ఇలాంటి సినిమాలకి సౌండ్ అనేది చాలా కీలకం. ఆ సౌండ్ విని చాలా మంది మళ్లీ మళ్లీ రావాలి అనిపించేటట్లుగా ఆయన మలిచారు ఇందులో. కొత్త బీజియమ్ మనం వింటాం. పాటలు కూడా సందర్భానుసారంగా ఉంటాయి ► ఇప్పటి వరకు నాకు సెన్సేషనల్ హిట్ అనేది లేదు. అయితే ఇప్పుడే మంచి మంచి కథలు వస్తున్నాయి. ఈ ఏడాదిలో మాత్రం సెన్సేషనల్ హిట్ ఒకటి ఇస్తాను. ► ప్రస్తుతం అల్లూరి అనే సినిమా చేస్తున్నా. పోలీసు ఆఫీసర్ బయోపిక్. ఈ సినిమాతో మంచి హిట్ ఇవ్వగలననే నమ్మకముంది. -
వాలంటైన్స్ డే: ప్రేమంటే భద్రం కొడుకో సాంగ్ రిలీజ్
ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న కొత్త సినిమా 'బలమెవ్వడు'. వైవిద్యభరితమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా వైద్య రంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు నిర్మిస్తున్నారు. సీనియర్ నటులు ఫృథ్విరాజ్, సుహాసిని కీలకపాత్రలు పోషిస్తున్నారు. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీ నుంచి తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ఇటీవల విడుదలైన టీజర్, మరకతమణి ఎం.ఎం.కీరవాణి పాడిన టైటిల్ సాంగ్.. ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసుకొని విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఈ క్రమంలో చిత్రంలోని ‘ప్రేమంటే భద్రం కొడుకో’ అనే పాటను విడుదల చేశారు. శ్రీమద్ రామా రమణ గోవిందో హార్.. అంటూ సాగే ఈ పాటకు మణిశర్మ క్యాచీ ట్యూన్‌ను ఇచ్చారు. ఈ పాటకు కళ్యాణ చక్రవర్తి సాహిత్యాన్ని సమకూర్చగా.. అనురాగ్ కులకర్ణి అద్భుతంగా ఆలపించారు. ఇక ఈ లిరికల్ వీడియోలో సినిమా మేకింగ్ విజువల్స్‌ను జోడించారు. టీం అంతా కలిసి సరదాగా షూటింగ్ చేసినట్టు కనిపిపిస్తోంది. హీరో హీరోయిన్స్, ఫృథ్విరాజ్, సుహాసిని గార్ల నటన, కథ, డైలాగ్స్ ఈ బలమెవ్వడు సినిమాకు ప్రధాన బలాలు కానున్నాయి. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు. -
ఘనంగా మణిశర్మ కొడుకు వివాహం.. ఫోటోలు వైరల్
Mani Sharma Son Mahati Got Married To Sanjana: ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్ వివాహం ఘనంగా జరిగింది. గాయని సంజన కలమంజేతో ఆదివారం చెన్నైలోని టీ-నగర్‌లోని ద అకార్డ్ ఫంక్షన్ హాల్లో వైభవంగా వీరి పెళ్లి జరిగింది. ఈ వేడుకకు బంధుమిత్రులు సహా పలువురు సినీ ప్రముఖులు హాజరైనట్లు తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో మహతి-సంజనల నిశ్చితార్థం జరగ్గా, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఛలో, భీష్మ, మ్యాస్ట్రో సినిమాలకు మహతి సంగీతం అందించగా.. సంజన భీష్మ సినిమాలోని ‘హేయ్ చూసా’ పాటకు గాత్రం అందించారు. అంతేకాకుండా పలు తమిళ, కన్నడ చిత్రాల్లో కూడా ఆమె పాటలు పాడారు. -
Sri Devi Soda Center: శ్రీదేవి, సూరిబాబుల ప్రేమ పాట విన్నారా?
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నాలో ఇన్నాళ్లుగా కనిపించని ఏదో ఇది.. లోలో కొన్నాళ్లుగా నాతో ఏదో అంటున్నది...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను దినకర్, రమ్యా బెహ్రా ఆలపించారు. ‘‘ఈ పాటలో సూరిబాబు (సుధీర్), శ్రీదేవిల మధ్య లవ్ అండ్ రొమాంటిక్ మూమెంట్స్ చక్కగా కుదిరాయి. అలాగే శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ పాటకి ప్రేక్షకుల నుంచి స్పందన చాలా బాగుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
ఆచార్య మరో రికార్డు.. రిలీజ్‌కు ముందే 60 మిలియన్ వ్యూస్
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ హీరోయిన్గా నటిస్తుండగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్లే. ఇక రిలీజ్‌కు ముందే ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. మణిశర్మ స్వరపరచిన 'లాహే లాహే' పాట యూట్యూబ్‌ను ఎంత షేక్ చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ లిరికల్ వీడియో సాంగ్ మరో మైలురాయిని చేరుకుంది. 60 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. హారిక నారాయణ్, సాహితి చాగంటి ఈ సాంగ్‌ను పాడారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఆచార్య ఫైనల్ షెడ్యూల్ వచ్చే నెల రెండో వారంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. కేవలం 12 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. చివరి షెడ్యూల్ కోసం చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ అయిపోతే ఆచార్య షూటింగ్ పూర్తయినట్లే. దీంతో గుమ్మడికాయ కొట్టేందుకు మూవీ యూనిట్ సిద్ధమవుతుంది. #LaaheLaahe from #Acharya giving everyone some lovely vibes every time it is played 60M+ views & counting... ▶️ https://t.co/N7bdyKWKez Megastar @KChiruTweets @AlwaysRamCharan @sivakoratala @MsKajalAggarwal @sangithakrish #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/unrrfNOzSM — BARaju's Team (@baraju_SuperHit) June 27, 2021 చదవండి : ఆచార్యకు ప్యాకప్.. చివరి షెడ్యూల్ అప్పుడే -
కౌన్ హే అచ్చా... కౌన్ హే లుచ్చా.. అదిరిపోయింది
రామ్, నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరో హీరో యిన్లుగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించిన చిత్రం ‘రెడ్’. ఈ సినిమాలోని ‘కౌన్ హే అచ్చా... కౌన్ హే లుచ్చా...’ అంటూ సాగే పాటను ఇటీవల విడుదల చేశారు. కిశోర్ తిరుమల మాట్లాడుతూ – ‘‘సినిమాలో హీరో కేరక్టర్ ఎలివేషన్ నేపథ్యంలో వచ్చే పాట ఇది. కల్యాణ్ చక్రవర్తి పర్ఫెక్ట్గా రాశారు. ‘థీమ్ అదిరింది’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ పాట గురించి ట్విట్టర్లో ప్రత్యేకంగా పేర్కొనడం విశేషం. మణిశర్మగారి బాణీకి అనురాగ్ కులకర్ణి గానం అదనపు ఆకర్షణ అయింది’’ అన్నారు. రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘రెడ్’ నుంచి ఏ పాట విడుదలైనా ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. మణిశర్మగారి స్వరాలకు ఎంత గొప్ప ఆదరణ ఉంటుందో మరోసారి నిరూపితం అయింది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. -
మా `రెడ్` యూనిట్‌కు అలాంటి అనుభవాలే..
‘‘కొన్ని సంఘటనలను అవతలివాళ్లు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మరికొన్నిసార్లు నమ్మబుద్ధి కాదు. ఆ మాటల్లో అతిశయోక్తులు ధ్వనిస్తాయి. కానీ అలాంటి సంఘటనలు మన జీవితంలో ఎదురైనప్పుడు? అవే దృశ్యాలు మళ్లీ మళ్లీ కళ్ల ముందు మెదులుతుంటాయి. ఇప్పుడు మా `రెడ్` యూనిట్ సభ్యులకు కూడా అలాంటి అనుభవాలే మెదిలినట్టు. మా`రెడ్`టీమ్‌లో ఈ మధ్య దీనికి సంబంధించిన చర్చే ఎక్కువగా జరుగుతోంది`` అని అంటున్నారు ప్రముఖ నిర్మాత `స్రవంతి` రవికిశోర్. ఆయన తెరకెక్కిస్తున్న తాజా చిత్రం`రెడ్`. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇందులో హీరోగా నటించారు. ఫిబ్రవరి లో ఈ చిత్రంలోని రెండు పాటల చిత్రీకరణ ఇటలీలో జరిగింది. కోవిడ్-19తో అల్లాడుతున్నఇటలీ గురించి, అక్కడ ఆ వైరస్ సోకడానికి కొన్నాళ్ల ముందు గడిపిన క్షణాల గురించి`స్రవంతి` రవికిశోర్ వివరించారు. (‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’) `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ.. ``సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో -5 డిగ్రీల ఉష్ణోగ్రతతో, ఎటుచూసినా స్వచ్ఛంగా సుందరంగా ఉంటుంది డోలమైట్స్. ఈ పర్వత తీర ప్రాంతంలో ఇప్పటిదాకా పలు హాలీవుడ్ సినిమాల షూటింగులు జరిగాయి. తెలుగు సినిమాల షూటింగ్‌లు ఎప్పుడూ జరగలేదు. ఇప్పుడు రామ్‌తో తీస్తున్న `రెడ్` షూటింగ్ అక్కడ చేద్దామని మా డైరక్టర్ కిశోర్ తిరుమల అన్నారు. అప్పటికే ఆ ప్రాంతం గురించి తెలుసు కాబట్టి వెంటనే ఓకే అనుకున్నాం. రెండు పాటలు చిత్రీకరించడానికి టీమ్‌తో ఇటలీ చేరుకున్నాం. టుస్కాన్, ఫ్లారెన్స్, డోలమైట్సలో హీరో రామ్, హీరోయిన్ మాళవికా శర్మ మీద పాటలు చిత్రీకరించాం. ఇటీవల రిలీజ్ చేసిన ‘నువ్వే నువ్వే’ లిరికల్ సాంగ్‌లో లేక్‌గార్డ్ అందాలు కూడా కనిపిస్తాయి. లేక్‌గార్డ్ ప్రస్తావన ఎందుకంటే... ఈ ప్రాంతం బెర్గామోకి కేవలం గంటం పావు ప్రయాణ దూరంలో ఉంటుంది. ఇప్పుడు ఇటలీలో కోవిడ్-19కి ఎపిక్ సెంటర్‌గా బెర్గామో గురించి అందరికీ తెలిసిందే. ఫిబ్రవరి15న లేక్ గార్డలోనూ, ఫిబ్రవరి 16న డోలమైట్స్లోనూ షూటింగ్ చేశాం. మేం అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆరు రోజులకు... అంటే ఫిబ్రవరి 22న డోలమైట్స్కు బ్రిటిష్ స్కై టీం వెళ్లీంది’’ అని చెప్పారు. (ఇలాంటి కేస్ ఇదే ఫస్ట్ టైమ్..) ఇక ‘‘అక్కడికి వెళ్లిన 22 మందిలో 17 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పటిదాకా సుందరంగా, అద్భుతమైన అనుభవంగా అనిపించిన డోలమైట్ గురించి ఆలోచించగానే మమ్మల్ని కరోనా కలవర పెట్టింది. కేవలం వారం రోజులు ముందుగా అక్కడి నుంచి వచ్చిన మా యూనిట్ అంతా సురక్షితంగా ఉంది. ఇలాంటి విషయాల గురించి ఆలోచించినప్పుడు అదృష్టం కాక మరేంటి? అని అనిపిస్తుంది. ఈ విషయాన్నే అక్కడ పాటలకు కొరియోగ్రఫీ చేసిన శోభి మాస్టర్, మా యూనిట్ సభ్యులు గుర్తుచేస్తున్నారు. ఇటలీలోనే కాదు మన దగ్గరా కరోనా కలవరపెడుతోంది. ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవడమే మన ముందున్న కర్తవ్యం. మానవాళి సురక్షితంగా ఉండాల్సిన ఈ తరుణంలో వినోదం గురించి ఆలోచించడాన్ని మేం కూడా వాయిదా వేశాం. అయితే ఏప్రిల్ 9న ‘రెడ్’ విడుదల చేయాలనుకున్నాం కానీ ప్రస్తుతం పరిస్థుతులు అనుకూలంగా లేవు. సమాజం మామూలు స్థితికి వచ్చాక, అప్పుడు `రెడ్` విడుదల గురించి ప్రకటిస్తాం. కరోనా కోరల్లో చిక్కుకోకుండా ఉండాలంటే అందరూ ఇళ్లల్లోనే ఉండాలి. పరిశుభ్రతను పాటించాలి`` అని అన్నారు. (ఆనందంగా ఉన్నప్పుడే వినోదం ) కాగా రామ్, నివేదా పేతురాజ్,మాళవికా శర్మ, అమృతా అయ్యర్ తదితరులు నటిస్తున్న చిత్రం ‘రెడ్’. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఛాయాగ్రహణం: సమీర్ రెడ్డి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాష్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: జునైద్, సమర్పణ: కృష్ణ పోతినేని, నిర్మాత: 'స్రవంతి' రవికిశోర్, దర్శకత్వం: కిశోర్ తిరుమల. -
విశ్వకవి జయంతి: ‘దాడి’ ఫస్ట్‌లుక్ రిలీజ్
శ్రీరామ్, జీవన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దాడి’. మధు శోభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శంకర్.ఏ నిర్మిస్తున్నారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. గీతాంజలి కావ్యాన్ని, జాతీయ గీతాన్ని రచించిన రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలతో ఒక వ్యవస్థను కథగా రాసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కస్తున్నామని చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు మధు శోభ.టి మాట్లాడుతూ.. ‘సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా దాడి చిత్రాన్ని రూపొందిస్తున్నాం. రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చెయ్యడం సంతోషంగా ఉంది. నిర్మాత శంకర్.ఏ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా బాగా వస్తోంది, త్వరలో ఈ చిత్రం గురించి మరిన్ని విశేషాలు తెలియజేస్తాం’ అని అన్నారు. గణేష్ వెంకట రమణ, ముఖేష్ ఋషి, చరణ్ రాజ్, అజయ్ , అజయ్ రత్నం, నాగినీడు, అజయ్ ఘోష్, మధు, అలోక్, రాజా రవీంద్ర, సలీమ్ పాండ, దిల్ రమేష్, సితార తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. రాజు సుందరం, శివశంకర్, శేఖర్ మాస్టర్లు డ్యాన్స్ కొరియాగ్రాఫర్స్గా పనిచేస్తున్నారు. కనల్ కన్నన్, వెంకట్ ఫైట్ మాస్టర్లు. కాసర్ల శ్యామ్, భాష్య శ్రీ సాహిత్యం అందించారు. -
చిరు ఆసక్తికర ట్వీట్.. సస్పెన్స్‌లో ఫ్యాన్స్
సాక్షి, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆచార్య. మ్యాటినీ ఎంటర్ టైన్మెంట్, కొనిదల ప్రొడక్షన్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ నటిస్తోంది. మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. లాక్డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్, ఆ తర్వాత కొనసాగనుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిరంజీవి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసి ఫ్యాన్స్‌ను సస్పెన్స్‌లోకి నెట్టేశాడు. (చదవండి : అతని వల్లే అన్నీ కోల్పోయా: రకుల్) ‘సాధారంగా పాటలు చిత్రీకరించే సమయంలో నేను సంగీతం ఎంజాయ్ చేస్తాను. మధ్య మధ్యలో ఆపడం నాకు ఇష్టం ఉండదు. కానీ ఇటీవల ఓ పాటను మాత్రం తరచూ పాజ్ చేస్తూ.. మళ్లీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. దానికి గల కారణం ఏమిటన్నది రేపు ఉదయం 9 గంటలకు చెబుతాను’ అని ట్వీట్ చేసి అభిమానులను సస్పెన్స్‌లోకి నెట్టేశాడు. చిరంజీవి వినే ఆ పాట ‘ఆచార్య’ సినిమాలోది అయిండవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నాడు. అదే కనుక జరిగితే 14 ఏళ్ల తర్వాత చిరంజీవి కోసం మనిశర్మ స్వరపరిచిన పాటను మంగళవారం వినొచ్చు. కాగా, చిరు, మణిశర్మ కాంబోలో అన్నయ్య, ఠాగూర్, ఇంద్ర, స్టాలిన్ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. Usually, when we shoot songs, I thoroughly enjoy listening to them and wouldn't like interruptions. But recently, I have been enjoying pausing and resuming a song over and again. కారణం ... ...? ...tomorrow morning 9.00 am — Chiranjeevi Konidela (@KChiruTweets) April 27, 2020 -
డైలామా ఏం లేదు.. క్లారిటీ ఇచ్చిన రామ్
మహమ్మారి కరోనా వైరస్ కారణంగా యావత్ దేశం లాక్డౌన్లోకి వెళ్లిపోయింది. కరోనా ప్రభావం సినీ ఇండస్ట్రీపై భారీగానే పడింది. లాక్డౌన్ నేపథ్యంలో విడుదల కావాల్సిన చిత్రాలు వాయిదాపడ్డాయి. వేసవి సెలవులను ఉపయోగించుకోవాలని టాలీవుడ్ దర్శకనిర్మాతలు భారీ ప్రణాళికలు రచించుకున్నారు. కానీ లాక్డౌన్ కారణంగా వారి అంచనాలు తలకిందులయ్యాయి. ఒరేయ్ బుజ్జిగా, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, రెడ్, వి సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్నా లాక్డౌన్ కారణంగా తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే కొన్ని చిన్న సినిమాలు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో రిలీజ్ చేస్తుండగా.. మరికొన్ని పెద్ద సినిమాల దర్శకనిర్మాతలు, హీరోలు ఓటీటీ ప్లాట్‌ఫాంపై రిలీజ్ చేసేందుకు డైలామాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జాబితాలో ఎక్కువగా వినిపిస్తున్న చిత్రం రామ్ పోతినేని చిత్రం ‘రెడ్’. అన్నీ అనుకున్నట్లు సాగితే ‘రెడ్’ చిత్రం ఏప్రిల్ 9న విడుదల అయ్యేది. కానీ కుదర లేదు. అయితే దర్శకనిర్మాతలు డిజిటల్ బాట వైపు మొగ్గు చూపుతున్నారని, కానీ హీరో రామ్ డైలామాలో ఉన్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై రామ్ ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘అలాంటిదేం లేదు! రామ్ ఎలాంటి సందిగ్థంలో లేడు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక దూరం పాటిస్తూ, ఇంట్లోనే ఉంటున్నాడు. అభిమానులు ‘రెడ్’ సినిమాను థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు’ అని తెలిపాడు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా పేతురేజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్లు హీరోయిన్లుగా నటించారు. స్రవంతి మ´వీస్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నాడు. చదవండి: బన్ని కోసం బాలీవుడ్ నుంచి.. బాలయ్య సినిమాలో లేడీ విలన్? -
‘మణిశర్మ మెలోడీ వచ్చేది ఎప్పుడంటే?’
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రెడ్’. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో మూవీ ప్రమోషన్స్‌ను మొదలు పెట్టింది చిత్ర యూనిట్. దీనిలో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా మరో అస్త్రాన్ని విడుదల చేసేందుకు సమయాత్తమవుతోంది. చిత్రంలోని తొలి సాంగ్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. మార్చి 6న సాయంత్రం 5 గంటలకు సినిమాలోని ‘నువ్వే నువ్వే’ అంటూ సాగే ఫస్ట్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్య బెహ్రా ఆలపించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ కంపోజ్ చేశారు. ఇక మణిశర్మ శైలిలో ఈ మెలోడీ సాంగ్ ఉండబోతోందని చిత్ర బృందం తెలిపింది. ఇక కిశోర్ తిరుమల-రామ్ కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇక ఈ సాంగ్ కూడా హిట్టయిందంటే ‘రెడ్’ జోరుకు బ్రేకులు ఉండవని టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 9న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సమీర్‌రెడ్డి సినిమాటోగ్రఫీ అందించారు. చదవండి: ‘ఆయన రావడం మా అదృష్టం’ ‘బాధకు బ్రాండ్స్‌తో పనేంటి డాడీ’ -
మణిశర్మ, తమన్.. ఇప్పుడు అనిరుద్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్వకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేసవి తర్వాత ప్రారంభం కానుందట. అయితే సినిమా అనౌన్స్మెంట్ వచ్చినప్పట్నుంచి ఎన్నో వార్తలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కథ ఇదేనంటూ, హీరోయిన్ ఈవిడేనంటూ అనేక గాసిప్స్ వచ్చాయి. కాగా, ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేదానిపై అటు మహేశ్ ప్యాన్స్‌తో పాటు టాలీవుడ్ ఆభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా వారికి ఊహకందిన పేర్లను సూచిస్తూ మహేశ్ సినిమాకు సంగీత దర్శకుడు ఇతడేనంటూ పేర్కొంటున్నారు. ఈ జాబితాలో ఎక్కువగా వినిపించిన పేరు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. తిరిగి మునపటి ఫామ్‌లోకి వచ్చిన మణిశర్మ మహేశ్ తాజా చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారని తొలుత వార్తలు వచ్చాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ఎన్నో హిట్ సాంగ్స్ వచ్చాయి. దీంతో డైరెక్టర్ వంశీ మణిశర్మ వైపే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ‘అల.. వైకుంఠపురుములో’ మ్యూజిక్ ఆల్బమ్‌తో మ్యాజిక్ చేసిన క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేరును కూడా చిత్ర బృందం పరిశీలిస్తోందని మరో టాక్. మహేశ్-తమన్ కలయికలో వచ్చిన దూకుడు, బిజినెస్‌మన్ సినిమాల్లోని పాటలు సంగీత ప్రియుల్ని ఎంతగానో అలరించాయి. దీంతో ఈ సినిమాకు తమనే సంగీత దర్శకుడు అంటూ ఊహాగానాలు మరింతగా పెరిగాయి. తాజాగా మరో సంగీత దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది. అజ్ఞాతవాసి, గ్యాంగ్‌లీడర్ చిత్రాలతో తెలుగువారికి సుపరిచితుడైన అనిరుద్ రవిచంద్రన్ మహేశ్-వంశీ చిత్రానికి సంగీతం అందిచనున్నాడని టాలీవుడ్లో వినిపిస్తోంది. అంతేకాకుండా మహేశ్, వంశీలకు మంచి స్నేహితుడైన రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి చిత్ర బృందం ఎవరిని ఫైనల్ చేస్తుందో వేచి చూడాలి. మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల గురించి మహేశ్ విదేశాల నుంచి తిరిగొచ్చాక ప్రకటిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. చదవండి: నాది చాలా బోరింగ్ లైఫ్! ‘ప్రతి అమ్మాయి కలలుగనే ప్రపంచాన్ని అందించావ్’ -
చిరు ఆగయా.. ప్రచారంలో ఆ మూడు!
‘సైరా నరసింహారెడ్డి’చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆ మధ్య ఓ మంచి రోజు చూసి కొబ్బరికాయ కొట్టి షూటింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఇన్ని రోజులు ప్రి ప్రొడక్షన్స్ పనులు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి ఆరంభమైంది. హైదరాబాద్ శివార్లలో వేసిన ఓ సెట్లో బాస్(చిరంజీవి) అడుగుపెట్టారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. అయితే మెగాస్టార్ షూటింగ్లో అడుగుపెట్టిన రోజునే చిత్ర బృందం సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ను ఫ్యాన్స్‌కు తెలిపింది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతమందిస్తున్నాడని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. దీంతో చిరు-మణిల కాంబో సంగీత ప్రియుల్ని మరోసారి మైమరిపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. అయితే లీకువీరులు అందించిన సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష నటించనుందని సమాచారం. అంతేకాకుండా ఐటమ్ సాంగ్ కోసం చిత్ర బృందం రెజీనాను సంప్రదించగా ఆమె తిరస్కరించిందని టాలీవుడ్ టాక్. అయితే టాలీవుడ్ మెగాస్టార్ సినిమాలో అందివచ్చిన అవకాశాన్ని రెజీనా చేజేతులా వృథా చేసుకుందని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ఈ ఐటమ్ సాంగ్‌ను మాస్ ఆడియన్స్ ఊగిపోయే రీతిలో మణిశర్మ కంపోజ్ చేశారని కూడా తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ కొరటాల శివ.. ఈ చిత్రాన్ని తనదైన రీతిలో కాన్సెప్ట్ బేస్డ్తో పాటు మాస్ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో చాలా హుందాతనం కలిగిన రోల్ కావడంతో చిరు ఈ పాత్రకు తగ్గట్లుగా రెడీ అవ్వడానికి ఇన్ని రోజులు గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాలో చిరు లుక్ ఇదేనంటూ ఓ ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమా దేవాదాయ శాఖ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు.. ఇందులో చిరంజీవి.. దేవాదాయ ధర్మాదయ శాఖలో పనిచేసే ఉద్యోగి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి ‘గోవిందాచార్య’ మరియు ‘గోవిందా హరి గోవిందా’ ‘ఆచార్య’ అనే టైటిల్స్ ప్రచారంలో ఉన్నాయి. అయితే మూవీ టైటిల్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రాన్ని ఆగష్టు 14న విడుదల చేయాలనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రాజశేఖర్‌పై చిరంజీవి ఆగ్రహం మోహన్‌బాబును ఆలింగనం చేసుకున్న చిరంజీవి We are delighted to announce that Mani Sharma garu is scoring music for #Chiru152. Welcome onboard sir! — Konidela Pro Company (@KonidelaPro) January 2, 2020 -
సినీ మ్యుజిషియన్స్ స్వరసంగమం
-
‘ఇంతలా ప్రేమిస్తే.. నా దగ్గర తిరిగివ్వడానికేం లేదు’
టాలీవుడ్‌కు ఒక ఫార్ములా ఉంది. పైగా అది ఎప్పుడు సక్సెస్ అయ్యే ఫార్ములా. అదే ప్రేమకథ. ఇప్పటివరకు టాలీవుడ్లో లెక్కలేనన్ని ప్రేమకథలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. భవిష్యత్తులో కూడా వస్తాయి. తాజాగా మరొక ప్రేమ కథ మనముందుకు రాబోతోంది. ‘ఈ మాయ పేరేమిటో’ అంటూ కొత్త హీరో, హీరోయిన్లు పరిచయం కాబోతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను నాగచైతన్య రిలీజ్ చేశారు. సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ స్వరాలందిస్తుండటం కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ 36 సెకన్ల టీజర్.. పూర్తిగా నేపథ్య సంగీతంతోనే నడిచింది. ‘ఇంతలా ప్రేమిస్తే.. నా దగ్గర తిరిగివ్వడానికేం లేదు’ అనే ఒక్క డైలాగ్‌తో సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు. రాహుల్ విజయ్, కావ్యా థాపర్లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను దివ్యా విజయ్ నిర్మించగా, రమేష్ కొప్పుల దర్శకత్వం వహించారు. Yuva Samrat @chay_akkineni launched the teaser of @ActorRahulVijay & @KavyaThapar’s #EeMayaPeremito A Mani Sharma Musicalhttps://t.co/6NcWrePC9p pic.twitter.com/Afc6IYTleL — BARaju (@baraju_SuperHit) June 12, 2018 -
సంగీత దర్శకుడు మణిశర్మకు పితృవియోగం
ప్రఖ్యాత సంగీత దర్శకుడు మణిశర్మ తండ్రి యనమండ్ర నాగయజ్ఞశర్మ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 92ఏళ్ల శర్మ వృద్ధాప్యం కారణంగా కన్నుమూశారు. నాగయజ్ఞశర్మ ఆ తరం ప్రఖ్యాత సంగీత దర్శకులెందరితోనో పనిచేశారు. ప్రఖ్యాత గాయకుడు ఘంటసాలకు మొదటి శిష్యులు. ఆయన అన్ని కచేరిల్లోనూ శర్మ వయొలిన్ వాయించేవారు. ముఖ్యంగా ఘంటసాల భగవద్గీత ఆద్యంతం సహాయకుడిగా పనిచేశారు. ఘంటసాల అనంతరం ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు, పెండ్యాల, సుచర్ల దక్షిణామూర్తి వంటి వారి వద్ద మెయిన్ వయొలనిస్ట్‌గా పనిచేశారు. ఆ తర్వాత సంగీతదర్శకుడు రమేశ్‌నాయుడు వద్ద ముఖ్య సహాయకుడిగా స్థిరపడ్డారు. అప్పట్లో రుద్రవేదం తదితర వేదాలకు అచ్యుత రామశాస్త్రితో కలిసి సంగీత బాణీలు కట్టి కేసెట్ల రూపంలో విడుదల చేసిన ఘనత శర్మదే. శర్మలో మంచి పురోహితుడు కూడా ఉన్నారు. ప్రఖ్యాత గాయని పి.సుశీల పెద్ద కొడుకుకు ఉపనయనం చేయించి, పెళ్లి చేసింది శర్మనే. ఎందరో వాగ్గేయకారులను సంగీతదర్శకులకు పరిచయం చేసిన ఘనత శర్మది. నాగయజ్ఞశర్మకు ఒక కూతురు, ముగ్గురు కొడుకులు. మణిశర్మ మూడవ వారు. చెన్నై, పోరూరు సమీపంలోని కాట్రపాక్కంలో రెండో కొడుకు సూరిబాబు వద్ద నివశిస్తున్న శర్మ మంగళవారం ఉదయం 5.50 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఆ సాయంత్రమే అంత్యక్రియలు జరిగాయి. -
చిరంజీవి ఆ పాట వద్దన్నారు!
‘‘హీరోల టేస్టుకు తగ్గట్టు ఇప్పుడు పాటలు చేస్తున్నారు. హీరో డ్యాన్స్ స్పెషలిస్ట్ అయితే పాటలన్నీ డ్యాన్స్ బేస్డ్ అడుగుతారు. హీరో మాస్ అయితే మాస్. ఒక్కో హీరో ఒక్కో స్టైల్ ఫిక్స్ చేసుకుని అటువైపు వెళ్తున్నారు’’ అన్నారు మణిశర్మ. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతమందించిన ఆయన చేసిన తాజా సినిమా ‘ఫ్యాషన్ డిజైనర్’. సుమంత్ అశ్విన్ హీరోగా వంశీ దర్శకత్వంలో ‘మధుర’ శ్రీధర్ నిర్మించిన ఈ సినిమా గురించి మణిశర్మ చెప్పిన ముచ్చట్లు... వంశీగారితో పని చేయాలనే నా చిరకాల కోరిక ‘ఫ్యాషన్ డిజైనర్’తో తీరింది. ప్రతి హీరోకి ఓ స్టైల్, బాడీ లాంగ్వేజ్ ఉంటాయి. ఓ హీరోకి చేసిన పాటలు మరో హీరోకి సూట్ కావు. ఎవరి స్టైల్‌కి తగ్గట్టు వాళ్లకు పాటలు ఇవ్వడంలో నేను ఎక్స్పర్ట్. వంశీగారి సినిమాల్లో పాటలు విన్నాను. ఆయన స్టైల్ తెలుసు కనుక ఈజీగా సాంగ్స్ కంపోజ్ చేశా. ఈ సినిమాలో అన్నీ మెలోడీలే. ఒక్కో పాటను ఒక్కో కాన్సెప్ట్‌లో డిజైన్ చేశారు. ∙ప్రతి పాటకు ఒకేలా కష్టపడతా. కానీ, ఏ పాట ఎంత హిట్టవుతుందనేది ఎవరూ చెప్పలేరు. పాటలు హిట్టయితే మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. జనాలకు ‘వీడు మ్యూజిక్ చేస్తే పాటలు వినొచ్చు’ అనే నమ్మకం కలుగుతుంది. అప్పుడు ప్రయోగాలు చేస్తా. ఉదాహరణకు... ‘చూడాలని వుంది’ చిత్రంలో ‘రామ్మా చిలకమ్మా’ పాటను చిరంజీవిగారు వద్దన్నారు. నేను కాన్ఫిడెన్స్‌తో చేశా. కానీ, ఆయన వద్దన్నారని వేరే పాట రికార్డు చేశా. సెట్లో డ్యాన్సర్స్ అంతా ‘రామ్మా చిలకమ్మా’కు ఓటేయడంతో ఓకే చేశారు. అలాంటి హిట్ పాటను మళ్లీ చేయాలనుకుంటే కుదరదు. అద్భుతాలు వాటికవే జరగాలి. ∙నాకు కథే ముఖ్యం. హీరోల ఛాయిస్ వల్ల కథ, సందర్భాలతో పనిలేకుండా పోతోంది. ఈ ధోరణి వల్ల సంగీత దర్శకులపై ఒత్తిడి ఎక్కువైంది. అందుకే నేను చిన్న దర్శకులతో పని చేస్తున్నా. చిన్న సినిమాలు చేస్తున్నా. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య ‘శమంతకమణి’, హను రాఘవపూడి ‘లై’ ఇంకొన్ని చేస్తున్నా. యువ దర్శకులు కథకు తగ్గట్టు మంచి సంగీతాన్ని కోరుకుంటున్నారు. -
మార్చి 10న వస్తున్న 'ఆకతాయి'
ఆశిష్ రాజ్, రుక్సార్ మీర్ జంటగా తెరకెక్కుతున్న యాక్షన్ ప్యాక్డ్ లవ్ ఎంటర్టైనర్ 'ఆకతాయి'. వి కె ఎ ఫిలిమ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు రామ్ భీమన దర్శకుడు. 'రివేంజ్ ఈజ్ స్వీట్' అనేది ట్యాగ్ లైన్. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.ఆర్.విజయ్ కుమార్, కె.ఆర్.కౌశల్ కరణ్, కె.ఆర్.అనిల్ కరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల "యు/ఎ" సర్టిఫికెట్తో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఆకతాయి మార్చి 10న విడదలవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‌కు మంచి స్పందన రావటంతో సినిమా సక్సెస్‌పై యూనిట్ సభ్యులు కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. -
కథ విని ఎగై్జట్ అయ్యాను – రాంకీ
‘‘ఇటీవల తెలుగులో సినిమా చేయడానికి వీలు కుదరకపోవడం, మంచి సినిమా అవకాశం రాకపోవడం కారణాలు. ‘ఆకతాయి’ కథను రామ్‌భీమన వినిపించి నప్పుడు ఎగై్జట్ అయ్యాను. కథ నచ్చడంతో ఒప్పుకున్నా’’ అని నటుడు రాంకీ అన్నారు. ఆశిష్‌రాజ్, రుక్సార్‌మీర్ జంటగా రామ్‌భీమన దర్శకత్వంలో విజయ్ కరణ్, కౌశల్ కరణ్, అనిల్ కరణ్ నిర్మించిన చిత్రం ‘ఆకతాయి’. మణిశర్మ స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీలను రాంకీ విడుదల చేశారు. ‘‘2013లో ‘హమ్ తుమ్’ సినిమా తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని ‘ఆకతాయి’ చేశా. ఈ చిత్ర నిర్మాతలు అడక్కుండానే నాకు వరాలు ఇచ్చారు’’ అని దర్శకుడు అన్నారు. -
నితిన్ కోసం పక్కా ప్లానింగ్
అ..ఆ.. సినిమాతో 50 కోట్ల క్లబ్లో చేరిన యంగ్ హీరో నితిన్, తన నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే లాంగ్ గ్యాప్ తరువాత హను రాఘవపూడి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రారంభించాడు. గతంలో ఏ సినిమా కోసం లుక్ విషయంలో పెద్దగా మార్పులు చేయని నితిన్ ఈ సినిమా న్యూ లుక్‌లో దర్శనమివ్వమనున్నాడు. ఓల్డ్ సిటీ కుర్రాడిగా కనిపించేందుకు భారీగా గడ్డం పెంచేసి రఫ్ లుక్‌లోకి మారిపోయాడు నితిన్. అంతేకాదు నితిన్‌కు ప్రతినాయకుడిగా ఒకప్పటి యాక్షన్ హీరో అర్జున్ను ఎంపిక చేశారు. ఈ సీనియర్ నటుడు స్టైలిష్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మను ఎంపిక చేశారు. సినిమాకు నేపథ్య సంగీతం కీలకం కావటంతో మణిశర్మ అయితే కరెక్ట్ అని ఫిక్స్ అయ్యారు చిత్రయూనిట్. -
స్వరమణి
-
జెంటిల్... సస్పెన్స్ థ్రిల్లర్
సహజంగా అభినయించే నటుడు, సాహిత్యం - సినిమా రెంటినీ శ్రద్ధగా చదువుకొని మరీ పద్ధతిగా సినిమాలు తీస్తున్న దర్శకుడు, సినిమా నిర్మాణాన్ని కేవలం వ్యాపారంగా భావించని నిర్మాత - ఇలాంటి ‘జెంటిల్ మన్’లు కలిసినప్పుడు ఎలాంటి సినిమా వస్తుంది? నాని, ఇంద్ర గంటి మోహనకృష్ణ, సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (‘ఆదిత్య 369’ ఫేమ్)ల కాంబినే షన్లో వచ్చిన ‘నాని... జెంటిల్ మన్’ అలాంటిదే! కాంబినేషన్‌తో పాటు ‘హీరో? ఆర్ విలన్?’ అని ప్రశ్నించిన ఫస్ట్ లుక్ దగ్గర నుంచి ఒక విధమైన ఆసక్తిని ఈ సినిమా రేకెత్తించింది. నిజానికి, ఈ చిత్ర కథ కూడా అలాంటి ఆసక్తికరమైన రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లరే! విదేశాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న అంతర్జాతీయ విమానంలో సహ ప్రయాణికులైన ఐశ్వర్య (సురభి), కేథరిన్ (నివేదా థామస్) పరిచయ మవుతారు. కాలక్షేపానికి ఒకరి ప్రేమకథ మరొకరికి చెప్పుకుంటారు. గ్రాఫిక్స్ నిపుణురాలైన కేథరిన్‌ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు గౌతమ్ (నాని). కానీ, ఆమె మీద మోజున్న మేనమామ డేవిడ్ వారి ప్రేమకు విలన్ అవుతాడు. నాలుగు నెలల ప్రేమ పెళ్ళిగా మారాల్సిన టైమ్‌లో కేథరిన్ తన ఆఫీస్ పని మీద లండన్ వెళ్ళి, ఇప్పుడా ఫ్లైట్‌లో వెనక్కి తిరిగి వస్తోందన్న మాట! ఇక, ఐశ్వర్య కొన్ని వేల కోట్ల కన్స్ట్రక్షన్ కంపెనీకి ఏకైక వారసురాలు. యువ పారి శ్రామికవేత్త జైరామ్ ముళ్ళపూడి అలియాస్ జై (నాని ద్విపాత్రాభినయం)తో ఆమె పెళ్ళి చేయాలనుకుంటారు పెద్దలు. ఒకరినొకరు పరస్పరం అర్థం చేసు కోవడానికి జై, ఐశ్వర్యలు రెండు రోజుల పాటు డబ్బు, ఫోన్ లేని కొడెకైనాల్ సాహసయాత్రకు వెళతారు. ప్రేమ బంధం బలపడుతుంది. విదేశానికి వెళ్ళా ల్సొచ్చిన ఐశ్వర్య ఇప్పుడు కేథరిన్ ఉన్న ఫ్లైట్‌లోనే ఇండియాకు తిరిగొస్తోంది. ఐశ్వర్య, కేథరిన్లిద్దరూ ఎయిర్‌పోర్ట్‌లో దిగుతారు. కేథరిన్ అచ్చం తన ప్రేమికుడిలా ఉన్న రెండో హీరోని చూసి అవాక్కవుతుంది. మనిషిని పోలిన మనిషి అని సరిపెట్టుకొని తన లవర్ గౌతమ్ ఇంటికెళుతుంది. అక్కడ పెద్ద షాక్. గౌతమ్‌కు ఏమైంది? జై కథ ఏంటన్నది మిస్టరీతో సాగే మిగతా కథ. సరదాగా ఉండే గౌతమ్‌గా, సీరియస్‌గా - కాస్తంత నెగటివ్ షేడ్స్ నిండిన జైగా రెండు విభిన్న తరహా పాత్రల్లో నాని మెప్పి స్తారు. సహజంగా ప్రవర్తిస్తూ, కొన్ని మామూలు డైలాగ్స్, సన్నివేశాలు, సందర్భాల్ని కూడా ఓ మెట్టు పైకి తీసుకెళ్ళారు. ఇక, కేథరిన్ పాత్రతో తెలుగు తెరకు తొలి పరిచయమైన మలయాళ నటి నివేదా థామస్ తన అభినయ ప్రతిభతో ఆ పాత్రకూ, ఈ కథకూ పెద్ద ఎస్సెట్ అయ్యారు. సెకండాఫ్‌లో హీరో, ఆమె కలసి బావురుమనే దృశ్యంలో నటన బాగుం టుంది. నిత్యా మీనన్ ఫక్కీలో నటన తెలిసిన హీరోయిన్ మరొకరు తెలుగు తెరకు దొరికినట్లయింది. మరో హీరోయిన్ సురభి ఓ.కె. ఎప్పుడూ సాఫ్ట్‌గా కనిపించే అవసరాల శ్రీని వాస్ అవసరాన్ని బట్టి నాణేనికి మరో వైపు చూపించగలనని నిరూపించుకున్నారు. ఆఫీసులో అనుమాన పక్షి అయిన మేనేజర్ సుదర్శనం అలియాస్ దర్శనంగా ‘వెన్నెల’ కిశోర్ వినోదంతో మెప్పించారు. జనం గుర్తుపెట్టుకొనేదిగా చాలా రోజులకు దక్కిన ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కలిసొస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే హీరో - నివేదా థామస్‌ల ‘‘సినిమాటిక్ ప్రేమకథ’’, హీరో - మరో హీరోయిన్ సురభి మధ్య సాగే ‘అంతకు ముందు - ఆ తరువాత’ సినిమా తరహా డేటింగ్ ప్రేమ ప్రయాణం లవ్స్టోరీల్ని మెచ్చే యువతరాన్ని ఆకట్టు కుంటాయి. ఇంటర్వెల్‌కు కాసేపటి ముందు నుంచి వేగం, ఉత్కంఠ పెరుగుతాయి. ఆసక్తికరమైన మలుపు దగ్గర ఇంట ర్వెల్ కార్డ్ పడుతుంది. అనూహ్యమైన షాక్ నుంచి తేరుకున్న హీరోయిన్ నివేదా థామస్ మిస్టరీని ఛేదించే క్రమం అంతా ఇక సెకండాఫ్. మిస్టరీ కేసును డీల్ చేసిన జర్నలిస్ట్ నిత్య (టీవీ యాంకర్ శ్రీముఖి) పాత్ర, హీరో తల్లి, రెండో హీరో తండ్రి లాంటి పాత్రలేవీ చివరలో కనిపించక పోయినా, సినిమా ముగిసే హడావిడిలో అవేవీ గుర్తుపట్టలేం. అలాగే, హీరో పనిచేస్తున్నది తన సంస్థలోనా, హీరోయిన్ కంపెనీలోనా అన్నదీపట్టించుకోం. సెకండాఫ్‌లో అవసరాల దగ్గరకు హీరో వెళ్ళే సీన్ లాంటివి బిగువుగా సాగా ల్సిన కథలో గుట్టుగా ఉండాల్సిన సస్పెన్స్ ముడి విప్పేందుకు ఉప్పందించే స్తాయి. చివరలో జరిగిందంతా హీరో డైలాగ్స్‌లో కన్నా విజువల్‌గా చూపించ గలిగి ఉంటే, మరింత పట్టుగా ఉండేదనిపిస్తుంది. సస్పెన్స్ గుట్టు విప్పే క్రమంలో వేగం, ఉత్కంఠ దీన్ని చిరకాలం చెప్పుకొనే సినిమాగా మార్చేవి. మొత్తం మీద చిన్నాచితకా లోటుపాటుల్ని మరిచిపోనిచ్చే నాని నేచురల్ యాక్టింగ్, ఉన్నంతలో ఆయన - ఇతర కమెడియన్లు చేసే వినోదం, మంచి డైలాగ్స్, కట్టి పడేసే నివేద నటన, మణిశర్మ రీరికార్డింగ్, ముఖ్యంగా సినిమా థీమ్ మ్యూజిక్, పి.జి. విందా కెమేరా పనితనం, ‘చలిగాలి..’ పాట, చిత్ర నిర్మాణ విలువలు - ఈ సినిమాను ‘జెంటిల్’ రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌ని చేశాయి. దర్శకుడు ఇంద్రగంటి , హీరో నాని - ఇద్దరూ తమకు అలవాటైన పనికి పూర్తి భిన్నమైన వర్క్‌తో ముందుకు రావడం నిజంగానే థ్రిల్లింగ్ అనుభవం! అసభ్యత, హింస, రక్తపాతాలేవీ లేక పోవడం ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అనుభూతి! చిత్రం: ‘నాని... జెంటిల్మన్’, కథ - సినేరియో: డేవిడ్‌నాథన్, కెమేరా: పి.జి. విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేశ్, సంగీతం: మణిశర్మ, నిర్మాత: కృష్ణప్రసాద్, కథా విస్తరణ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ, రిలీజ్: జూన్ 17 -
శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీ వెంకటేశ్వరుడిని సంగీత దర్శకుడు మణిశర్మ సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. అలాగే, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.రవికుమార్ వెంకన్న దర్శనానికి వచ్చారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ కూడా ఇవాళ స్వామివారి దర్శనం చేసుకున్నారు. మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోనేరు ప్రసాద్ ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటు తిరుమల వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో పూజలు నిర్వహించారు. -
మరోసారి యుద్ధం
తొమ్మిదేళ్ల క్రితం గోపీచంద్ హీరోగా అమ్మ రాజశేఖర్ దర్శకత్వలో వచ్చిన ‘రణం’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా ‘రణం-2’ రాబోతోంది. అమ్మ రాజశేఖర్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్, నిధి కథానాయికలు. శ్రీ వెంకటేశ్వర మూవీస్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మాత గోపనబోయిన శ్రీనివాస యాదవ్ నిర్మించారు. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని వాణిజ్య హంగులను జోడించి ఈ చిత్రాన్ని రూపొందించామని, తప్పక విజయం సాధిస్తుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కెమెరామ్యాన్: శ్రీధర్. -
‘రఫ్’ కోసం సిక్స్‌ప్యాక్ చేశా!
ఆది ఆల్‌రౌండర్. క్లాస్, మాస్ సినిమాలకు న్యాయం చేయగలం. శక్తి సామర్థ్యాలు అతనిలో ఉన్నాయి. శ్రీదేవి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అభిలాష్ మాధవరం నిర్మించిన చిత్రమిది. రకుల్‌ప్రీత్‌సింగ్ కథానాయిక. సీహెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వం వహించారు. ఎమ్. సుదర్శనరావు సమర్పిస్తున్నారు. ‘‘నా ప్రయాణంలో ‘రఫ్’ సినిమా చాలా చాలా స్పెషల్. నా పెళ్లికి ముందు విడుదలవుతోంది. ఈ సినిమా విజయవంతమైతే నాన్న కళ్లల్లో హ్యాపీనెస్ చూస్తాను. ఆయన ఈ సినిమా గురించి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు’’ అంటున్న హీరో ఆది ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆవిషయాలివీ... భారీ బడ్జెట్! ‘‘నన్ను ఇంకో నాలుగు మెట్లు ఎక్కించే సినిమా ‘రఫ్’. నటుడిగా నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డా. నూటికి నూరుశాతం నా టాలెంట్‌ని ఈ సినిమాలో పెట్టా. అందుకే ‘రఫ్’ గురించి చాలా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. వినోదం, యాక్షన్, లవ్, ఫ్యామిలీ, సెంటిమెంట్స్... ఇలా అన్ని అంశాలూ ఈ చిత్రంలో ఉంటాయి. థియేటర్లోకి అడుగుపెట్టిన ఏ ప్రేక్షకుడూ నిరుత్సాహపడని రీతిలో ఈ కథని తీర్చిదిద్దారు దర్శకుడు సుబ్బారెడ్డి. ఆయనకి ఇదే తొలి చిత్రమైనా... ఎక్కడా అలా అనిపించలేదు. తొలిసారి చేసిన ఒక పక్కా కమర్షియల్ సినిమా కాబట్టి ఈ సినిమా రిజల్ట్ నాకు చాలా చాలా కీలకం. నా కెరీర్లోనే హయ్యస్ట్ బడ్జెట్‌తో తయారైంది. చందు సరదాలు! సినిమాలో నా పాత్ర పేరు చందు. ప్రేమ విషయంలో అతని ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది? నందు అనే అమ్మాయితో తనకి పరిచయం ఎలా ఏర్పడింది? అనే అంశాల్ని స్క్రీన్‌పైనే చూడాలి. చందు పంచే సరదాలు ప్రేక్షకుల్ని తప్పకుండా ఆకట్టుకుంటాయి. రకుల్ ప్రీత్‌సింగ్ కూడా చాలా కష్టపడింది. ఆమె అందం సినిమాకు తప్పకుండా ప్లస్ అవుతుంది. ఇటీవల యూత్ రకుల్‌ని చూసేందుకు థియేటర్లకు వస్తున్నారు. ఇందులో ఆమె మరింత అందంగా కనిపించింది. మణిశర్మ, సెంథిల్‌కుమార్ లాంటి టెక్నీషియన్లతో పనిచేయడం ఈ సినిమాతో నాకు దక్కిన మరో గొప్ప అవకాశం అని భావిస్తారు. సిక్స్‌ప్యాక్ ఓ అవసరం! ‘‘అందరూ చేస్తున్నారు, నేనూ చేయాలి అని నేను సిక్స్‌ప్యాక్ బాడీ చేయలేదు. సినిమాకి అది అవసరమైంది. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిలో వైవిధ్యం చూపాలంటే సిక్స్‌ప్యాక్ చేయడమే కరెక్ట్ అనిపించింది. దర్శకుడు కూడా అదే చెప్పాడు. దీంతో దాదాపు ఎనిమిది నెలలు కష్టపడి సిక్స్ ప్యాక్ చేశా. దానివల్ల సినిమా కాస్త ఆలస్యమైంది. అయినా సరే ‘ఏం ఫరవాలేదు’ అంటూ నిర్మాత నన్ను ప్రోత్సహించారు. ఒక ఛాలెంజ్‌గా భావించి సిక్స్ ప్యాక్ బాడీని తయారు చేశా. ఇప్పుడు సినిమాల్లో ఆ ట్రెండ్ కూడా నడుస్తుండడం నాకు కలిసొచ్చిందని చెప్పొచ్చు. - ఆది -
సంగీత దర్శకుడు మణిశర్మపై చార్జ్‌షీట్
చెన్నై: ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మపై చెన్నై పోలీసులు చార్జ్‌షీట్ నమోదు చేశారు. మణిశర్మకు చెన్నై నీలాంగరై సమీపంలోని కానత్తూర్లో కొంత స్థలం ఉంది. ఆయన తన స్థలం పక్కనున్న 73 సెంట్ల స్థలాన్ని ఆక్రమించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మణిశర్మ ఆక్రమించుకున్న స్థలం యజమాని సేలంకుప్పన్ నీలాంగరై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ కేసును నేర పరిశోధన శాఖకు అప్పగించారు. క్రైం బ్రాంచ్ పోలీసులు సంగీత దర్శకుడు మణిశర్మ స్థలం వద్దకు వెళ్లి పరిశీలించగా ఆయన ఆక్రమణకు పాల్పడినట్లు రుజువయింది. దీంతో మణిశర్మపై స్థలాక్రమణ కేసును నమోదు చేసి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కాగా, మణిశర్మ కోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. -
న్యూ ఇయర్ జనరేషన్
అనంతరం న్యూ ఇయర్ అంటేనే... న్యూ డ్రీమ్స్‌కి న్యూ థాట్స్‌కి న్యూ లైఫ్‌కి వెల్కమ్ చెప్పడం! 2014... తెలుగుతెరపై న్యూ వేవ్ చూపించబోతోంది. ఎందరో సినీ ప్రముఖుల వారసులకు ఈ కొత్త సంవత్సరం ఓ కొత్త మలుపు ఇవ్వబోతోంది. కమింగ్ సూన్ అక్కినేని నాగార్జున రెండో కొడుకు అఖిల్ తెరంగేట్రానికి రంగం సిద్ధం. నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ ఫస్ట్ మూవీ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో షూట్‌కి రెడీ... ఇన్ ద మేకింగ్ సీనియర్ నటుడు నరేష్ తనయుడు, విజయనిర్మల మనవడు నవీన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇందుకోసం మూడేళ్లు శ్రమించి మరీ 130 కేజీల నుంచి 70 కేజీలకు తగ్గాడు. యాక్టింగ్, కిక్ బాక్సింగ్, డ్యాన్సులన్నీ నేర్చుకున్నాడు. డేంజర్, రాఖీ, చందమామ లాంటి ఎన్నో చిత్రాలకు కూర్పరిగా పనిచేసిన నవీన్‌కు హీరోగా ఆరేడు ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. కొత్త సంవత్సరంలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. సంగీత దర్శకుడు మణిశర్మ కొడుకు మహతి స్వరసాగర్. ఏడేళ్లుగా కీరవాణి, మణిశర్మ, కల్యాణి మాలిక్ తదితరుల దగ్గర కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేస్తున్నాడు. ఈ అనుభవంతో ఈ ఏడాది మ్యూజిక్ డెరైక్షన్ చేపడతారని టాక్. హాస్యనటుడు బ్రహ్మానందం రెండో కొడుకు సిద్ధార్థ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నాడు. ఉత్తేజ్ కూతురు హీరోయిన్గా వచ్చే అవకాశాలు బోలెడు. -
ప్రేమ గీమ జాన్తా నయ్ మూవీ స్టిల్స్
ఇండియన్ ఐడల్ శ్రీరామ్ చంద్ర హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రేమ గీమ జాన్తా నయ్ బార్పీ కథానాయికగా సుబ్బు ఆర్ వీ దర్శకుడుగా శుభం క్రియేషన్స్ పతాకంపై మద్దాల భాస్కర్, దాడి బాల భాస్కర్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ. -
‘దూసుకెళ్తా’ ఆడియో విడుదల
మంచు విష్ణు కథానాయకుడిగా వీరు పోట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దూసుకెళ్తా’. అరియానా, వివియానా సమర్పణలో డా.మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. దాసరి ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని కె.రాఘవేంద్రరావుకు అందించారు. -
ఆయన బలవంతం మీదే పాటలు ప్రాక్టీస్ చేసేవాణ్ణి
‘‘నేను 20 మంది వరకూ సంగీత దర్శకుల దగ్గర శిష్యరికం చేశాను. అయితే నా జీవితాన్ని మలుపు తిప్పిన గురువులంటే మాత్రం నలుగురి పేరు ప్రధానంగా చెప్పుకోవాలి. వాళ్లల్లో అగ్రతాంబూలం ఇవ్వాల్సింది. రమేశ్ మాస్టారికి. ఆయన అంధుడు. కానీ సంగీత సరస్వతీ పుత్రుడు. ఆయన సమక్షం... ఏదో రాగాల ఖజానాలా అనిపించేది. చిన్నప్పుడే నాలో సంగీతం పట్ల ఓ ఆపేక్షను తీసుకొచ్చింది ఆయనే. కర్ణాటక సంగీతం గురించి, రాగాల గురించి నాకెంతో విశ్లేషించి చెప్పారు. నా శ్రద్ధ, తపన చూసి మిగతా వాళ్ల కన్నా నాతోనే ఎక్కువ ప్రాక్టీస్ చేయించేవారు. మాండలిన్, హార్మోనియంతో రాగాలు వాయిస్తూ పాటలు పాడమనేవారు. నాకేమో పాటలు పాడడం అంతగా ఆసక్తి ఉండేది కాదు. అయినా కూడా ఆయన బలవంతంగా నన్ను పాడుతూ ప్రాక్టీస్ చేయమనేవారు. ఆ ప్రక్రియే ఇప్పుడు నాకు తిండి పెడుతోంది. ఆయన శిక్షణ వల్లనే నేను ట్యూన్స్ పాడగలుగుతున్నాను. అందుకే జీవితాంతం ఆయన్ని తలుచుకుంటూనే ఉంటాను. అయితే బాధ కలిగించే విషయం ఏమంటే - నా ఎదుగుదల చూడకుండానే ఆయన కాల ధర్మం చెందారు. ఇక నా మరో గురువు జాకబ్ జాన్. సీనియర్ మ్యుజీషియన్. ఆయన దగ్గర వెస్ట్రన్, క్లాసికల్ నేర్చుకున్నాను. నా మూడో గురువు మా నాన్నగారైన వైఎన్ శర్మగారు. నా సంగీత ప్రయాణంలో ఆయన స్ఫూర్తి ఎంతో ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... ఇళయరాజాగారు. ఆయనకు నేను ఏకలవ్య శిష్ణుణ్ణి’’. - మణిశర్మ