Sudheer Babu's Naalo Innalluga Melody Song Lyrical Video Is Out - Sakshi
Sakshi News home page

ఇన్నాళ్లుగా కనిపించని ఏదో ఇది... మణి 'మెలోడీ' అదిరింది

Published Thu, Aug 12 2021 8:07 AM | Last Updated on Thu, Aug 12 2021 10:31 AM

Naalo Innalluga Melody Song Out From Sridevi Soda Center - Sakshi

సుధీర్‌ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’. ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నాలో ఇన్నాళ్లుగా కనిపించని ఏదో ఇది.. లోలో కొన్నాళ్లుగా నాతో ఏదో అంటున్నది...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు.

‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను దినకర్, రమ్యా బెహ్రా ఆలపించారు. ‘‘ఈ పాటలో సూరిబాబు (సుధీర్‌), శ్రీదేవిల మధ్య లవ్‌ అండ్‌ రొమాంటిక్‌ మూమెంట్స్‌ చక్కగా కుదిరాయి. అలాగే శ్యామ్‌ దత్‌ సైనుద్దీన్‌ సినిమాటోగ్రఫీ విజువల్స్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ పాటకి ప్రేక్షకుల నుంచి స్పందన చాలా బాగుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement