Sridevi Soda Center
-
దీపావళికి ఓటీటీలో సందడి చేయబోతోన్న ‘శ్రీదేవి సోడా సెంటర్’
ఇటీవల సుధీర్ బాబు, తెలుగమ్మాయి ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 27న విడుదలైంది. ఇదిలా ఉంటే దీపావళి కానుకగా ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 తెలుగులో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వెల్లడించారు. చదవండి: విజయ్ డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు: చార్మీ కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ కూడా ఒకటి. విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి ఎన్నో అంచనాల మధ్య విడుదలై కొన్ని వర్గాల ప్రేక్ష్కుల బాగా ఆకట్టుకోగా.. మిరికొందరి నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇందులో నరేశ్, షావుల్ నవగీతమ్ కీలక పాత్రలు పోషించారు. 70ఎమ్ఎమ్ ఎంటర్టైనమెంట్ పతాకంపై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి నిర్మించారు. From bigg screens to ur home screens, coming to make ur diwali more special.. I am sure love for #SrideviSodaCenter will just grow bigger & bigger 🤟🤗 Premiers on 4th November exclusively on @ZEE5Telugu #sridevisodacenterOnZee5 @70mmEntertains @Karunafilmmaker @anandhiactress pic.twitter.com/CxtHg8Put0 — Sudheer Babu (@isudheerbabu) October 21, 2021 చదవండి: పెళ్లిలో కలిసిన మెగా బ్రదర్స్.. నవ్వుతున్న ఫోటోలు వైరల్ -
శ్రీదేవి సోడా సెంటర్.. ఓ తీపి జ్ఞాపకం
సాక్షి,ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): శ్రీదేవి సోడా సెంటర్ చిత్రం తన జీవితంలో ఒక తీపి జ్ఞాపకాన్ని ఇచ్చిందని ఆ చిత్ర హీరో సుదీర్ బాబు అన్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సందర్భంగా విజయోత్సవ యాత్రలో భాగంగా మంగళవారం నగరంలో చిత్రం ప్రదర్శిస్తున్న అంబికా థియేటర్‌కు చిత్ర బృందం విచ్చేసింది. తొలుత చిత్రంలోని నటీనటులు, సాంకేతిక నిపుణులు ప్రేక్షకులను ప్రత్యక్షంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలిపారు. చిత్రం ఎలా ఉంది అని అడిగి వారి నుంచి సానుకూల సమాధానం రాబట్టారు. ఈ సందర్భంగా హీరో సుదీర్‌బాబు చిత్రంలోని డైలాగులను చెప్పి ప్రేక్షకులను అలరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరో మాట్లాడుతూ చిత్రం తాము ఊహించిన దానికంటే ఎక్కువగా విజయవంతమైందన్నారు. ప్రేక్షకులకు వినోదం పంచుతూ వారి ఆదరణ పొందుతోందన్నారు. ఈ విజయం స్ఫూర్తిగా మరిన్ని విభిన్న కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పారు. దర్శకుడు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ తమ చిత్రంలో సుదీర్‌బాబు నటన హైలెట్‌గా నిలిచిందన్నారు. కుటుంబంతో కలిసి చూసే విధంగా చిత్రాన్ని వినోదాత్మకంగా నిర్మించామని, విడుదలైన అన్ని సెంటర్లలో చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోందని, వర్షాలు, కోవిడ్ భయం వెంటాడుతున్నా తమ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్నారు. థియేటర్ మేనేజర్ రఘు, జీఎం వెంకట్, సుదీర్‌కుమార్ అభిమాన సంఘం నాయకులు పాల్గొన్నారు. చదవండి: Seetimaarr Trailer: సీటీమార్ ట్రైలర్ చూశారా? -
కృష్ణగారు అలా అనగానే కన్నీళ్లొచ్చాయి!
‘‘డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయ్యాను. నేను గొప్ప నటుడు కావాలనేది మా అమ్మ (దివంగత నటి–దర్శకురాలు విజయ నిర్మల) కోరిక. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు (బాలనటుడిగానూ చేశారు) అవుతున్నా ఇప్పటికీ బిజీగా ఉండటం నా అదృష్టం. ‘శ్రీదేవి సోడా సెంటర్’లో నేను చేసిన పాత్ర గొప్పది.. ఇప్పుడు మా అమ్మ ఆత్మ సంతోషంగా ఉంటుందనుకుంటున్నాను’’ అన్నారు వీకే నరేశ్. సుధీర్ బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 27న విడుదలైంది. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించిన వీకే నరేశ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ– ‘‘ఇప్పటి వరకూ నేను 200 సినిమాల్లో నటించాను. అయితే ‘శ్రీదేవి సోడా సెంటర్’లోని పాత్ర నా గత చిత్రాలను మించిపోయింది. విలన్ పాత్రలకు కూడా నరేశ్‌ని తీసుకోవచ్చనే ఆలోచన ఇండస్ట్రీ వర్గాల్లో రేకెత్తించింది. సినిమా చూసిన కృష్ణ (సూపర్ స్టార్ కృష్ణ)గారు.. ‘నువ్వు, సుధీర్ ఈ సినిమాకు ప్రాణం పోశారు.. నీ పాత్ర నాకు కన్నీరు తెప్పించింది’ అనడంతో నాకు కన్నీళ్లొచ్చాయి. కరుణ కుమార్ పెద్ద దర్శకుడు అవుతాడు. రామానాయుడుగారిలా మంచి అభిరుచి, ప్యాషన్ ఉన్న నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడి’’ అన్నారు. మా ఎన్నికల్లో కృష్ణుడి పాత్ర! రానున్న ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల్లో నేను కృష్ణుడి పాత్ర పోషిస్తా. ఎన్నికలు ప్రకటించిన తర్వాత రథం ఎక్కుతా.. అది ఎవరి రథం అన్నది తర్వాత చెబుతా. నేను ఒక్కసారి మాత్రమే అధ్యక్షునిగా పని చేస్తానని గతంలో చెప్పా.. రానున్న ఎన్నికల్లో మరోసారి పోటీ చేయను.. నా విజన్‌ని ముందుకు తీసుకెళ్లగలిగే వారసుణ్ణి మాత్రం ‘మా’ కు అందిస్తా. -
తల్లి కాబోతున్న హీరోయిన్ ఆనంది!
‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్ ఆనంది తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగమ్మాయిగా పరిశ్రమలో అడుగుపెట్టిన ఆనంది ‘బస్ స్టాప్’, ‘ఈ రోజుల్లో’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ కాస్తా అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగమ్మాయి అయినప్పటికి తమిళంలో తన సత్తా చాటి సక్సెస్ సాధించింది. చదవండి: పెళ్లి రూమర్లపై స్పందించిన శ్రుతి హాసన్ ఈ క్రమంలో తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌తో ప్రేమలో పడిన పడిన ఆమె ఈ జనవరి 7న పెద్దల అంగీకారంతో ప్రియుడిని వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆనంది త్వరలోనే తల్లి కాబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెకు ఆరు నెలల గర్భిణిగా ఉన్నట్లు సమాచారం. కాగా ఆనంది పెళ్లికి ముందు నటించిన జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్ మూవీలు పెళ్లి అనంతరం విడుదలయ్యాయి. The beginning of new chapter... pic.twitter.com/IwUcet0BsH — Anandhi (kayal) (@anandhiactress) January 9, 2021 -
శ్రీదేవి సోడా సెంటర్ మూవీ టీం తో చిట్ చాట్
-
200 కోట్లు ఇచ్చినా మహేశ్ ఆ పని చేయరు : సుధీర్‌బాబు
‘‘మా సినిమా చూసిన ప్రేక్షకులకు సూరిబాబు, శ్రీదేవి పాత్రలు గుర్తుండిపోతాయి. చూసినవాళ్లందరూ బాగుందని అభినందిస్తున్నారు. మహేశ్ (హీరో మహేశ్‌బాబు) అనే వ్యక్తికి రెండొందల కోట్లు ఇచ్చినా, బెదిరించినా సరే తను నమ్మనిదే తన కెరీర్లో ఏమీ చేయడు. మా ‘శ్రీదేవి సోడా సెంటర్’ని అభినందిస్తూ ఆయన ట్వీట్ చేశాడు’’ అన్నారు సుధీర్‌బాబు. కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్‌బాబు, ఆనంది జంటగా విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ‘శ్రీదేవి సోడా సెంటర్‘ ఆగస్ట్ 27న విడుదలైంది. ఈ సందర్భంగా కరుణ కుమార్ మాట్లాడుతూ– ‘‘మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి మా సినిమా నిరూపించింది. మహిళలందరూ చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్‌తో తీసిన మా సినిమాకు అభినందనలు దక్కుతున్నాయి. ఇంకా థియేటర్స్ పెంచుతున్నాం’’ అన్నారు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి. చదవండి : ‘శ్రీదేవీ సోడా సెంటర్’పై మహేశ్ బాబు రివ్యూ Sridevi Soda Center Review: శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ -
‘శ్రీదేవి సోడా సెంటర్’ రిలీజ్: కేక్ కట్ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు
సాక్షి,శ్రీకాకుళం (కాశీబుగ్గ): సినీ చరిత్రలో పలాసకు ప్రత్యేక స్థానం ఉందని మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఏ సినిమా విడుదలైనా ఇక్కడ ప్రజలు ఆదరించి భారీ కలెక్షన్లు పంపేవారన్నారు. ఇప్పుడు పలాస ప్రాంతానికి చెందినవారే సినిమాలు తీయడం సంతోషకరమన్నారు. శుక్రవారం ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా విడుదల సందర్భంగా పలాసలోని వెంకటేశ్వర థియేటర్ వద్ద కేక్ కట్ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పలాస మండలంలో మారుముల కంట్రగడ గ్రామంలో పుట్టిపెరిగిన కరుణ కుమార్ ‘పలాస–1978’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమై రికార్డు సృష్టించారన్నారు. ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్’ బడ్జెట్ సినిమా తీసి దేశవ్యాప్తంగా విడుదల చేయడం ఆనందదాయకమన్నారు. పలాస అన్ని రంగాల్లో ప్రత్యేకత చాటుకుంటూ వస్తోందన్నారు. ఈ సినిమాలో పదుల సంఖ్యలో నటీనటులు ఈ ప్రాంతానికి చెందినవారు ఉండడంతో పలాసకు కళ వచ్చిందన్నారు. డైరెక్టర్ కరుణ కుమార్ తల్లి సరోజినమ్మకు అభినందనలు తెలియజేశారు. చిత్రంలో నటించిన నటులు మంత్రి అప్పలరాజును సత్కరించారు. కార్యక్రమంలో నటుడు గార రాజారావు, మల్లా భాస్కరరావు, పెంట రాజు, దువ్వాడ హేమబాబు చౌదిరి, కోత పూర్ణచంద్రరావు, పైల చిట్టి, జోగి సతీష్, దువ్వాడ మధుబాబు, ఉంగ సాయి ఉన్నారు. చదవండి: చిల్లర వేషాలు, చీకటి లీలలు.. అబ్బో మనోడు మామూలోడు కాదుగా -
‘శ్రీదేవీ సోడా సెంటర్’పై మహేశ్ బాబు రివ్యూ
సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (ఆగస్ట్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. రొటీన కథ అని కొందరంటే, సినిమా అదిరిపోయిందని మరికొంత మంది అంటున్నారు. ఇక ఈ మూవీపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చాడు సూపర్ స్టార్ మహేశ్‌బాబు. శుక్రవారం తన ఇంట్లోని మినీ థియేటర్లలో సినిమాను వీక్షించిన మహేశ్.. దర్శకుడు కరుణ కుమార్, హీరో సుధీర్ బాబుపై ప్రశంసల జల్లుకురిపించాడు. (చదవండి: శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ) ‘శ్రీదేవీ సోడా సెంటర్ రా అండ్ ఇంటెన్స్ మూవీ.. అంతేకాకుండా అదిరిపోయే క్లైమాక్స్ కూడా ఉంది. ‘పలాస’ తరువాత దర్శకుడు కరుణ కుమార్ అద్భుతమైన బోల్డ్ మూవీతో మన ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు అద్భుతంగా నటించాడు. ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఇదే తన బెస్ట్ ఫెర్మార్మెన్స్. నరేష్ గారు ఎప్పటిలానే అవలీలగా,అద్భుతంగా చేసి అలరించారు. హీరోయిన్ ఆనంది గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీమ్ అందరికి మరోసారి శుభాకాంక్షలు’అని మహేశ్ వరుస ట్వీట్లు చేశాడు. #SrideviSodaCenter... a raw and intense film with a hard-hitting climax. Director @Karunafilmmaker comes up with yet another bold film after Palasa 1978. @isudheerbabu, is absolutely brilliant!! His finest performance till date 👏👏👏 — Mahesh Babu (@urstrulyMahesh) August 27, 2021 -
Sridevi Soda Center Review: శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ
-
శ్రీదేవి సోడా సెంటర్ రివ్యూ
టైటిల్: శ్రీదేవి సోడా సెంటర్ నటీనటులు: సుధీర్ బాబు, ఆనంది, నరేశ్, పావల్ నవగీతమ్, తదితరులు దర్శకత్వం: కరుణ కుమార్ నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాణ సంస్థ: 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సంగీతం: మణిశర్మ సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్ సైనుద్దీన్ విడుదల తేదీ: 27 ఆగస్టు 2021 Sridevi Soda Center Movie Review: సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్'. అమలాపురం బ్యాక్ డ్రాప్లో రూపొందించిన ఈ సినిమాకు 'పలాస 1978' డైరెక్టర్ కరుణకుమార్ దర్శకత్వం వహించారు. 'వి' పరాజయం తర్వాత సుధీర్‌బాబు చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందులో ఎలక్ట్రీషియన్ సూరిబాబుగా నటించిన హీరో తనకు ఇష్టమైన అమ్మలాంటి అమ్మాయిని గాఢంగా ప్రేమిస్తాడు. కానీ వీరి ప్రేమ ఎన్నో మలుపులు తిరుగుతూ చివరాఖరకు ఏ తీరానికి చేరుకుందనేది మిగతా కథ. 'చాలామంది మలయాళ సినిమా కథల గురించే మాట్లాడుకుంటారు. కానీ మా సినిమా చూశాక తెలుగు సినిమా కథల గురించి మాట్లాడుకుంటారని ఎంతో ధీమాగా చెప్పాడు సుధీర్ బాబు. మరి ఆగస్టు27న విడుదలైన ఈ సినిమా నిజంగానే జనాలను కట్టిపడేసిందా? లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే! కథ సూరిబాబు (హీరో సుధీర్ బాబు) అమలాపురంలో ఎలక్ట్రీషియన్. ఓ గుడిలో లైట్ సెట్టింగ్ వేస్తున్న సమయంలో అక్కడ సోడాలు అమ్ముకునే శ్రీదేవి(ఆనంది)ని చూసి లవ్‌లో పడతాడు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో ఆ ఊళ్లో పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు కాశీ.. శ్రీదేవిని ఇష్టపడతాడు. దానికితోడు సూరిబాబును తక్కువ కులం అని వారి ప్రేమను భగ్నం చేయాలనుకుంటాడు. మరోపక్క మూడు ముళ్లు వేసేందుకు మనసులు కలిస్తే సరిపోదని, కులం కూడా కలవాలంటూ ఈ ప్రేమజంట పెళ్లికి విముఖత చూపిస్తారు పెద్దలు. ఇంతలో ఆ గ్రామంలో హత్య జరుగుతుంది. దానికి సూరిబాబే కారణమని అతడిని జైల్లో వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? సూరిబాబు జైలు నుంచి విడుదలయ్యాడా? అతడు జైలు నుంచి తిరిగొచ్చేలోపు శ్రీదేవి పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉందా? లేదా కులం కట్టుబాట్లను దాటుకుని సూరిబాబుతో ఏడడుగులు నడిచిందా? అదీ కాకుండా పెద్దల మనసు మార్చి వారి ఆశీస్సులతో పెళ్లి చేసుకున్నారా? అసలు సూరిబాబుకు ఆ హత్యకు సంబంధం ఏంటి? విలన్ కాశీ, హీరోయిన్ తండ్రి చావుకు కారణాలేంటి? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే థియేటర్లలో బొమ్మ చూడాల్సిందే! విశ్లేషణ సుధీర్ బాబు సిక్స్‌ప్యాక్ కోసం పడ్డ కష్టం ఏమాత్రం వృథా కాలేదు. అతడి పర్ఫామెన్స్‌ను, అప్పియరెన్స్‌ను అభిమానులు ఎంజాయ్ చేస్తారు. ఇక కథ స్టార్ట్ అవడమే జైలు సన్నివేశంతో మొదలవుతుంది. తర్వాత వచ్చే బోట్ సీన్లు, ఫైటింగ్, బీజీఎమ్ ఓ లెవల్లో ఉంటాయి. పల్లెటూరి అందాలను తెరపై మనోహరంగా చూపించారు. కామెడీ, ప్రేమ కథతో ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోతుంది. లవ్ స్టోరీ కొంత రొటీన్‌గా అనిపించక మానదు. పైగా కథలో పలు సన్నివేశాలను ప్రేక్షకుడు ముందే ఊహించేలా ఉండటం నెగెటివ్ అని చెప్పొచ్చు. సెకండాఫ్‌లో ఊహించని ట్విస్టులు ఎదురవుతుంటాయి. శ్రీదేవిని విలన్కిచ్చి పెళ్లి చేస్తాడు ఆమె తండ్రి. అయినప్పటికీ శ్రీదేవి అతడితో జీవించేందుకు అంగీకరించదు. హీరో రాక కోసం నిరీక్షిస్తుంది. అతడితో వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది. ఈ క్రమంలో కథను ఊహించని మలుపు తిప్పుతాడు డైరెక్టర్. ఎమోషనల్ సీన్లతో ప్రేక్షకులను కంటతడి పెట్టించే ప్రయత్నం చేశాడు. కానీ నత్తనడకన సాగే కథతో ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టాడు. ఇక కథ చివర్లో వచ్చే క్లైమాక్స్ సినిమా మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుంది. సినిమా గురించి స్థూలంగా చెప్పాలంటే పాత చింతకాయ పచ్చడికే మరికొంత మసాలా వేసి జనాలకు వడ్డించాడు డైరెక్టర్. నటీనటులు సుధీర్ బాబు సినిమా కోసం ప్రాణం పెట్టినట్లు కనిపిస్తుంది. సూరిబాబు పాత్రలో జీవించేశాడు. లవ్ సీన్లు, ఎమోషనల్ సీన్లలో ఇరగదీశాడు. హీరోయిన్ ఆనంది కూడా సుధీర్‌తో పోటీపడి మరీ నటించింది. నరేశ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతర నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్లస్ పాయింట్స్ ♦ క్లైమాక్స్ ♦ సంగీతం ♦ సినిమాటోగ్రఫీ మైనస్ పాయింట్స్ ♦ రొటీన్ కథ ♦ ఫస్టాఫ్ -
అప్పుడే విలన్ పాత్రల గురించి ఆలోచిస్తా : సుధీర్ బాబు
‘‘సుధీర్ బాబు ఎలాంటి పాత్రలైనా చేయగలడు’ అనే పేరు వచ్చింది. కథలు రాసుకున్న తర్వాత ఆ పాత్రకు నేను సరిపోతాననే నమ్మకంతో నా వద్దకు వస్తున్నారు. అందుకే నాకు ఎక్కువ ఫెయిల్యూర్స్ లేవు. ఇండస్ట్రీలో నాకు లాంగ్ రన్ ఉంటుందనేది నా ఫీలింగ్. నా ప్రతి సినిమా నన్ను ఒక్కో మెట్టు పైకి ఎక్కిస్తోంది’’ అన్నారు సుధీర్ బాబు. కరుణ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సుధీర్ బాబు చెప్పిన విశేషాలు. ‘పలాస 1978’ సినిమా చూసి, మంచి లైన్ ఉంటే చెప్పండి, సినిమా చేద్దామని కరుణ కుమార్‌కి ఫోన్ చేశాను. కొద్ది రోజుల తర్వాత ‘శ్రీదేవి సోడా సెంటర్’ లైన్ చెప్పారు, బాగుందన్నాను. ఇందులో ఎలక్ట్రీషియన్ సూరిబాబు పాత్రలో కనిపిస్తాను. తనకు ఇష్టమైన అమ్మలాంటి అమ్మాయితో ప్రేమలో పడ్డాక ఏం జరిగిందన్నదే కథ. చాలామంది మలయాళ సినిమా కథల గురించే మాట్లాడుకుంటారు. మా సినిమా చూశాక తెలుగు సినిమా కథల గురించి మాట్లాడుకుంటారు. ఒక గ్రామంలోని మనుషుల స్వభావాలు, అహం, రాజకీయాలను చూపించాం. ♦ కృష్ణగారు, మహేశ్ బాబుల సినిమాలను కేస్ స్టడీస్‌లా తీసుకుంటాను. అయితే వారిలా కాకుండా నా శైలిలో నటించేందుకు ప్రయత్నిస్తా. కేవలం అభిమానులు చూస్తే సినిమాలు హిట్ అయిపోవు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూస్తేనే హిట్ అవుతాయి.. అందుకు తగ్గట్టే కథలను ఎంచుకుంటున్నాను. ♦హీరోగా చేసేందుకే నా తొలి ప్రాధాన్యం. ఆ తర్వాతే విలన్, ఇతర పాత్రల గురించి ఆలోచిస్తా. ‘భాగీ’ తర్వాత హిందీలో అవకాశాలొచ్చినా తెలుగులో బిజీగా ఉండటంతో హిందీపై దృష్టి పెట్టడం లేదు. ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణతో ఓ సినిమా, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చేస్తున్నాను. ఆ తర్వాత పుల్లెల గోపీచంద్ బయోపిక్, హర్షవర్ధన్ దర్శకత్వంలో ఓ సినిమా, ‘70 ఎంఎం’ బ్యానర్లోనే మరో సినిమా చేస్తాను. చదవండి : 'కథ చెప్పడానికి ఫోన్ చేస్తే..మేనేజర్లకు చెప్పమన్నారు' హీరో శింబుకు ఊరట.. రెడ్‌కార్డు రద్దు -
సోడా సెంటర్లో ప్రభాస్
-
'కథ చెప్పడానికి ఫోన్ చేస్తే..మేనేజర్లకు చెప్పమన్నారు'
‘‘పరభాషా చిత్రాలు చూసి తెలుగులో అలాంటివి రావడం లేదని ఆ చిత్రాలను అభినందిస్తుంటాం. ‘శంకరాభరణం, సిరివెన్నెల, జ్యోతి, విజేత, ఛాలెంజ్’ వంటి లిటరేచర్ బేస్డ్ సినిమాలు తెలుగులో వచ్చినన్ని ఇతర భాషల్లో రాలేదు. ప్రపంచాన్ని షేక్ చేసిన ‘అరుంధతి, బాహుబలి’ వంటి సినిమాలు కూడా తెలుగులోనే వచ్చాయి. కథలు చెబుదామనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నేను రాసుకునే సినిమా కథల్లో కథలే హీరోలు’’ అన్నారు కరుణ కుమార్. సుధీర్‌బాబు, ఆనంది జంటగా కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మించిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఈ నెల 27న విడుదల కానుంది. ఈ సందర్భంగా కరుణ కుమార్ మాట్లాడుతూ – ‘‘అమలాపురం పక్కన ఉన్న గ్రామాల బ్యాక్‌డ్రాప్‌లో సాగే లవ్‌స్టోరీ ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఓ సోడా సెంటర్ యజమాని కూతుర్ని ఓ ఎలక్ట్రీషియన్ ప్రేమిస్తాడు. అక్కడి ప్రాంతాల్లోని సాంఘిక, ఆర్థిక, సామాజిక పరమైన ఇబ్బందుల వల్ల వీరి ప్రేమకథ ఏమైంది? అన్నదే ఈ సినిమా కంథాంశం. సుధీర్‌కి రెండు కథలు చెబితే, ‘శ్రీదేవి సోడా సెంటర్’ను సెలక్ట్ చేసుకున్నారు. నిర్మాతలు మంచి ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ సినిమాలో మణిశర్మగారి కొత్తరకం బాణీలు వింటారు’’ అని అన్నారు. ఇంకా మాట్లాడుతూ.. నా సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం కొంతమంది తెలుగు అమ్మాయిలకు ఫోన్ చేయగా, కొందరు సినిమాలో ‘హీరో ఎవరు?’ అని అడిగారని, మరికొందరు వాళ్ల మేనేజర్‌కు కథలు చెప్పమన్నారనీ.. అంతేకానీ కథలు ఎవరూ వినలేదనీ అన్నారు కరుణ కుమార్. చదవండి : ‘సర్కారువారి పాట’ : గోవా షెడ్యూల్ పూర్తి అందగత్తెను కాదని ఎగతాళి చేశారు: నటి భావోద్వేగం -
‘షూటింగ్ తొలిరోజే కెమెరా పడిపోయింది.. బ్రదర్‌ని కోల్పోయా’
‘‘సినిమా సినిమాకు మేం గ్యాప్ తీసుకోవడం లేదు. మంచి కథ కుదిరితేనే సినిమా చేస్తాం. కథలు వినడమే మా పని. కథ నచ్చితే పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు నిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి. సుధీర్‌బాబు, ఆనంది జంటగా కరుణకుమార్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. (చదవండి: ఒక్క రోజు లేట్ అయితే చచ్చిపోయేవాడ్ని.. చిరంజీవి కాపాడాడు : బండ్ల గణేశ్) ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు విజయ్ చిల్లా, శశిదేవి రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసిన రోజే మెయిన్ కెమెరా పడిపోయింది. లక్కీగా కెమెరాకు ఏం కాలేదు. తర్వాతి రోజు క్యారవ్యాన్ అసిస్టెంట్‌కు షాక్ కొట్టి గాయపడ్డాడు. ఆ నెక్ట్స్ రోజు క్యారవాన్ ఓ గోతిలో ఇరుక్కుపోయింది. అన్నింటికంటే ముఖ్యంగా నా బ్రదర్ (విజయ్ చిల్లా సోదరుడు)ను కోల్పోయాను. దాదాపు నెల రోజులు బ్రేక్ తీసుకుని షూట్‌ను స్టార్ట్ చేశాం. ఈ రూరల్ లవ్‌స్టోరీలో సుధీర్‌బాబు, ఆనంది బాగా చేశారు. గ్రామీణ రాజకీయాలు, కులాల ప్రస్తావన వంటి అంశాలను ఎలా డీల్ చేశామన్నది వెండితెరపై చూడాలి. ఈ చిత్రానికి మణిశర్మగారు మంచి సంగీతం అందించారు. మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన వెంటనే మా సినిమాకు బజ్ స్టార్ట్ అయ్యింది. అలాగే గ్లింప్స్ విడుదల చేశాక బిజినెస్ ఊపందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 500 థియేటర్స్‌లో, ఓవర్సీస్లో 120 థియేటర్స్‌లో సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేశాం’’ అన్నారు. -
ఆగస్ట్ చివరి వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలు ఇవే
కరోనా వల్ల థియేటర్లు పూర్తిక తెరచుకోని కారణంగా పలు చిత్రాలు ఇప్పటికీ ఓటీటీ బాటలోనే ముందుకెళ్తున్నాయి. కొన్ని సినిమాలు దైర్యం చేసి థియేటర్లలోకి వచ్చినప్పటికీ ఓటీటీల హవా తగ్గడంలేదు. వారానికి అరడజనుకు పైగా చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. మరి ఈ ఆగస్ట్ చివరివారంలో ఓటీటీ, ధియేటర్లలో విడుదల కానున్న సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం. శ్రీదేవి సోడా సెంటర్ సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్దాయి. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్ ఆ అంచనాలు మరింత పెంచాయి.ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు. ఇచట వాహనములు నిలుపరాదు యంగ్ హీరో సుశాంత్ నటించిన తాజా సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’.ఎస్.దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు . కమర్షియల్ అంశాలతో అలరించే పూర్తి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ఆగస్టు 27న విడుదల కానుంది. హౌజ్ అరెస్ట్ శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, రవిబాబు, రఘు, తాగుబోతు రమేశ్ కలిసి నటించిన చిత్రం ‘హౌజ్ అరెస్ట్’. శేఖర్ రెడ్డి యర్నా దర్శకుడు. పూర్తిస్థాయి కామెడీ నేపథ్యంలో రూపొందింది ఈ చిత్రం ఇది. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ పతాకంపై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.ఈ మూవీ కూడా ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. వివాహ భోజనంబు హాస్య నటుడు సత్య హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వివాహ భోజనంబు’ కూడా ఆగస్ట్ 27న ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు ఒటిటి సోనీలైవ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్ ఆహా ఎస్.ఆర్ కల్యాణమండపం (ఆగస్టు 27) అమెజాన్ ప్రైమ్ స్టాండప్ షార్ట్స్ (ఆగస్టు 26) ద కొరియర్ (ఆగస్టు 27) సోనీ లైవ్ వివాహ భోజనంబు (ఆగస్టు 27) కసడా తపరా (ఆగస్టు 27) నెట్‌ఫ్లిక్స్ అన్‌టోల్డ్ (ఆగస్టు 24) పోస్ట్ మార్టమ్ (ఆగస్టు 25) భూమిక (ఆగస్టు 26) హీజ్ ఆల్ దట్ (ఆగస్టు 27) జీ 5 ఇంజినీరింగ్ గర్ల్స్ (ఆగస్టు 27) -
అందుకే చిరంజీవిది లక్కీ హ్యాండ్ : సుధీర్‌బాబు
‘‘సూపర్‌స్టార్ మహేశ్‌బాబుగారి బ్యాగ్రౌండ్ ఉండి కూడా తనను తాను నిరూపించుకోవడానికి కష్టపడుతున్నారు సుధీర్‌బాబు. యాక్టింగ్, బ్యాడ్మింటన్, క్రికెటర్, ఫైటర్, డ్యాన్సర్.. ఇలా ప్రతి దాంట్లో నిరూపించుకుంటున్న సుధీర్‌ని ఆల్ రౌండర్ అంటాను. ‘భలే మంచి రోజు, యాత్ర, ఆనందో బ్రహ్మ’.. ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్’.. ఇలా వినూత్న సినిమాలు నిర్మిస్తున్న విజయ్, శశిలకు నా అభినందనలు’’ అని అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. సుధీర్‌బాబు, ఆనంది జంటగా ‘పలాస 1978’ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ – ‘‘రిస్క్ తీసుకోవడానికి భయపడని సుధీర్‌లాంటి వ్యక్తులంటే నాకు ఇష్టం. విజయ్, శశి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్’’ అన్నారు. ‘‘చిరంజీవిగారు ప్రమోట్ చేసిన నా ‘సమ్మోహనం’ హిట్. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్ ఆయనతో ఆరంభమైంది. అందుకే చిరంజీవిగారు నాకు లక్కీ హ్యాండ్. ‘సుధీర్‌కు కరెక్ట్ సినిమా పడితే కెరీర్లో నెక్ట్స్ లెవల్‌కు వెళతాడు’ అని ఓ సందర్భంలో మహేశ్ అన్నారు. ఆ సినిమా ఇదే అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘చాన్స్ ఇచ్చిన సుధీర్, విజయ్, శశిలకు థ్యాంక్స్’’ అన్నారు కరుణకుమార్. ‘‘పలాస’ చూసినప్పుడే కరుణకుమార్‌తో సినిమా చేయాలనుకున్నాం. సినిమా బాగా వచ్చింది. బిజినెస్ బాగా జరిగింది’’ అన్నారు విజయ్, శశి. కార్తికేయ, అజయ్ భూపతి, తమ్మారెడి భరద్వాజ, రాజ్ కందుకూరి తదితరులు పాల్గొన్నారు. చదవండి : మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది: అడవి శేషు నా జీవితంలో జరిగినవే సినిమాలో చూపించా: డైరెక్టర్ -
‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ రివ్యూ: సూరిబాబు అదరగొట్టేశాడుగా
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్దాయి. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్ ఆ అంచనాలు మరింత పెంచాయి.ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మహేశ్ బాబు చేతుల మీదుగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ప్రేమ .. పెళ్లి .. ఈ మధ్యలో పరువు సృష్టించే గొడవలు ఈ ట్రైలర్ లో చూపించారు. ‘మంచోడే కానీ.. మనోడు కాదు కదా’, పరువు పోతే ప్రాణం పోయినట్లే’ లాంటి డైలాగ్స్‌ని బట్టే ఈ సినిమాను కులం, పరువు నేపథ్యంలో తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. ప్రేమ .. పెళ్లి .. ఈ మధ్యలో పరువు సృష్టించే గొడవలు ఈ ట్రైలర్ లో చూపించారు. ప్రేమకి పెద్దలు ఎదురుతిరగడం .. కథానాయకుడు తన ప్రేమకోసం ఎంతకైనా తెగించడం ట్రైలర్ లో ఆవిష్కరించారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. కంటెంట్ చూస్తుంటే యూత్‌ను, మాస్ ను ఒక రేంజ్ లోనే ఆకట్టుకునేలా అనిపిస్తోంది. మాస్ కుర్రాడు సూరిబాబుగా సుధీర్ బాబు అదరగొట్టేశాడు. ఆనంది లుక్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. -
‘శ్రీదేవి సోడా సెంటర్’ విడుదలకు డేట్ ఫిక్స్, ఎప్పుడంటే
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్దాయి. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్ ఆ అంచనాలు మరింత పెంచాయి. తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేసింది చిత్ర బృందం. ఆగస్ట్ 27న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. గోదావరి జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్య సంగీతం అందిస్తున్నారు. -
Sri Devi Soda Center: శ్రీదేవి, సూరిబాబుల ప్రేమ పాట విన్నారా?
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘నాలో ఇన్నాళ్లుగా కనిపించని ఏదో ఇది.. లోలో కొన్నాళ్లుగా నాతో ఏదో అంటున్నది...’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను దినకర్, రమ్యా బెహ్రా ఆలపించారు. ‘‘ఈ పాటలో సూరిబాబు (సుధీర్), శ్రీదేవిల మధ్య లవ్ అండ్ రొమాంటిక్ మూమెంట్స్ చక్కగా కుదిరాయి. అలాగే శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ విజువల్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ఈ పాటకి ప్రేక్షకుల నుంచి స్పందన చాలా బాగుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
'శ్రీదేవి సోడా సెంటర్': మొత్తానికి హీరోయిన్ను రివీల్ చేశారు..
సుధీర్‌బాబు హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. 80ల నాటి అమలాపురం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటివరకు హీరోయిన్ను రివీల్ చేయలేదు చిత్ర బృందం. తాజాగా ఈ చిత్రంలో జాంబిరెడ్డి ఫేం ఆనంది కథానాయికగా నటిస్తుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో ఆమె గోలి సోడా కొడుతూ గ్రామీణ యువతిగా కనిపిస్తుంది. 'ఈ రోజుల్లో'.. 'బస్టాప్' వంటి సినిమాలతో తెలుగు తెరపై సందడి చేసిన ఆనంది..ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ బిజీ అయింది. తాజాగా జాంబిరెడ్డి సినిమాతో టాలీవుడ్లో రీఎంట్రీ ఇచ్చిన ఆనంది ఖాతాలో ఇప్పుడు ఈ చిత్రం కూడా చేరింది. కాగా 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. -
మాస్ మాయలోడా...
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘1978 పలాస’ చిత్రదర్శకుడు కరుణకుమార్ తెరకెక్కిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ‘భలే మంచి రోజు’, ‘ఆనందో బ్రహ్మ’, ‘యాత్ర’ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘మందులోడా ఓరి మాయలోడా... మామ రారా మందుల సిన్నోడా..’ అంటూ సాగే మాస్ సాంగ్‌ని హీరో చిరంజీవి విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘శ్రీదేవి సోడా సెంటర్’ టైటిల్ ప్రకటించినప్పటి నుంచి మా సినిమాపై క్రేజ్ మొదలయ్యింది. అదే విధంగా మొదటి లుక్‌కి, గ్లింప్స్‌కి విపరీతమైన స్పందన వచ్చింది. ‘మందులోడా ఓరి మాయలోడా..’ పాటకి కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యం అందించగా, మణిశర్మ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఈ పాట లిరికల్ వీడియోలో సుధీర్ బాబు వేసిన స్టెప్స్‌కి అనూహ్య స్పందన లభిస్తోంది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌దత్ సైనుద్దీన్. -
విడుదలకు ముందే మార్కెట్ చేస్తున్న సుధీర్ బాబు మూవీ
కంటెంట్ పరంగా వస్తున్న చిన్న సినిమాలు ఇటీవల కాలంలో బాక్సాఫీసు వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంటున్నాయి. అన్ని రకాలుగా చిన్న సినిమాలు మంచి మార్కెట్ చేస్తున్నాయి. డిజటల్ రైట్స్, శాటిలైట్, స్ట్రీమింగ్ హక్కులు పరంగా మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఈ జాబితాలో హీరో సుధీర్ బాబు లెటెస్ట్ మూవీ శ్రీదేవి సోడా సెంటర్ చేరిపోయింది. ప్రస్తుతం సుధీర్ బాబు ఈ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. విడుదలకు ముందే ఈ మూవీ నిర్మాతలను లాభాల బాట పట్టిస్తున్నట్లు తెలుస్తోంది. ‘శ్రీదేవి సోడా సెంటర్’ శాటిలైట్, డిజిటల్ హక్కులను జీటీవీ గ్రూప్ 9 కోట్ల రూపాలయకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌తో మేకర్స్‌కు ఈ మూవీకి పెట్టిన పెట్టుబడి వచ్చేసిందని వినికిడి. అదే నిజమైతే సుధీర్ బాబు మూవీ విడుదలకు ముందే నిర్మాతలకు మంచి మార్కెట్ఇస్తున్నాడన్నమాట. ‘పలాస’ మూవీతో తొలి హిట్ అందుకున్న దర్శకుడు కరుణ్ కుమార్ ఈ మూవీని రూపొందిస్తున్నాడు. గోదావరి జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. మణిశర్య సంగీతం అందిస్తున్నారు. -
డబ్బింగ్ కోసం సుధీర్‌బాబు ఎంత కష్టపడుతున్నారో చూడండి
సుధీర్‌బాబు హీరోగా కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శ్రీదేవి సోడా సెంటర్'. . 80ల నాటి అమలాపురం నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ మూవీలో సుధీర్‌బాబు లైటింగ్ సూరిబాబు పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ చిత్రంలోని తన పాత్రకి డబ్బింగ్ చెప్పడం పూర్తయినట్లు హీరో సుధీర్‌బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఫైట్ సీన్‌కు డబ్బింగ్ చెబుతున్న వీడియోను షేర్ చేసుకున్నారు. ఇందులో ఫైట్‌కు తగ్గట్లు సుధీర్‌బాబు చెప్పిన డబ్బింగ్ తీరు ఆకట్టుకుంటుంది. డబ్బింగ్‌కే ఇంత కష్టపడుతుంటే, ఇక యాక్టింగ్‌కి ఇంకెంత కష్టపడతారో..మీ డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. Done with #SrideviSodaCenter dubbing and it ended pretty much this way 😃 😎 #70mmSSC #SSC pic.twitter.com/ypOvKnSfGk — Sudheer Babu (@isudheerbabu) June 26, 2021 చదవండి : నెట్టింట వైరలవుతున్న సుధీర్‌బాబు ఫ్యామిలీ ఫోటోలు 'సిక్స్ ప్యాక్ బాడీ సీక్రెట్స్ చెప్పమని ఆ హీరోలు అడుగుతారు' -
శ్రీదేవి సోడా సెంటర్: ఇరగదీసిన సుధీర్ బాబు
నేడు(మే 11) టాలెంటెడ్ హీరో సుధీర్‌బాబు బర్త్‌డే. ఈ సందర్భంగా అతడు సూరిబాబుగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో నదిలో ఏదో పడవ పందెం జరుగుతున్నట్లుగా కపిపిస్తోంది. అయితే ఓడలో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నాడీ హీరో. పనిలో పనిగా సిక్స్‌ప్యాక్ బాడీని కూడా చూపించారు. తిరునాళ్లలో హీరో సిగ్గు, ప్రేమ, ఫైటింగ్.. అంతా చూపించారు. కానీ హీరోయిన్ను మాత్రం ఎక్కడా ఫ్రేమ్‌లో చూపించనేలేదు. కాగా ఈ చిత్రానికి ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. 70 ఎమ్ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర’ వంటి హిట్ సినిమాలను అందించిన విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా వుంటే సమ్మోహనం, వి చిత్రాల తర్వాత సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో మూడో చిత్రం తెరకెక్కుతోంది. కృతీశెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను గాజుల పల్లి సుధీర్‌బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై బి.మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’కిశోర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.