![Sridevi Soda Center Trailer: Mahesh Babu Launched Sridevi Soda Center Trailer - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/19/Sridevi-Soda-Center.jpg.webp?itok=-ayhdMdr)
సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి పాత్రలో తెలుగమ్మాయి ఆనంది నటిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్దాయి. ఇటీవల విడుదలైన పాటలు, టీజర్ ఆ అంచనాలు మరింత పెంచాయి.ఈ సినిమాను ఈ నెల 27వ తేదీన థియేటర్లకు తీసుకురానున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మహేశ్ బాబు చేతుల మీదుగా ఒక ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. ప్రేమ .. పెళ్లి .. ఈ మధ్యలో పరువు సృష్టించే గొడవలు ఈ ట్రైలర్ లో చూపించారు. ‘మంచోడే కానీ.. మనోడు కాదు కదా’, పరువు పోతే ప్రాణం పోయినట్లే’ లాంటి డైలాగ్స్‌ని బట్టే ఈ సినిమాను కులం, పరువు నేపథ్యంలో తెరకెక్కించినట్లు అర‍్థమవుతుంది. ప్రేమ .. పెళ్లి .. ఈ మధ్యలో పరువు సృష్టించే గొడవలు ఈ ట్రైలర్ లో చూపించారు. ప్రేమకి పెద్దలు ఎదురుతిరగడం .. కథానాయకుడు తన ప్రేమకోసం ఎంతకైనా తెగించడం ట్రైలర్ లో ఆవిష్కరించారు. డైలాగ్స్ కూడా బాగున్నాయి. కంటెంట్ చూస్తుంటే యూత్‌ను, మాస్ ను ఒక రేంజ్ లోనే ఆకట్టుకునేలా అనిపిస్తోంది. మాస్ కుర్రాడు సూరిబాబుగా సుధీర్ బాబు అదరగొట్టేశాడు. ఆనంది లుక్, మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment