
ఇటీవల సుధీర్ బాబు, తెలుగమ్మాయి ఆనంది హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 27న విడుదలైంది. ఇదిలా ఉంటే దీపావళి కానుకగా ఈ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 తెలుగులో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుందని సోషల్ మీడియాలో వెల్లడించారు.
చదవండి: విజయ్ డ్యాన్స్ ఇరగదీస్తున్నాడు: చార్మీ
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ కూడా ఒకటి. విలేజ్ బ్యాక్‌గ్రౌండ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీకి ఎన్నో అంచనాల మధ్య విడుదలై కొన్ని వర్గాల ప్రేక్ష్‌కుల బాగా ఆకట్టుకోగా.. మిరికొందరి నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఇందులో నరేశ్, షావుల్ నవగీతమ్ కీలక పాత్రలు పోషించారు. 70ఎమ్‌ఎమ్ ఎంటర్‌టైనమెంట్ పతాకంపై విజయ్ చిల్లా, దేవిరెడ్డి శశి నిర్మించారు.
From bigg screens to ur home screens, coming to make ur diwali more special.. I am sure love for #SrideviSodaCenter will just grow bigger & bigger 🤟🤗 Premiers on 4th November exclusively on @ZEE5Telugu #sridevisodacenterOnZee5 @70mmEntertains @Karunafilmmaker @anandhiactress pic.twitter.com/CxtHg8Put0
— Sudheer Babu (@isudheerbabu) October 21, 2021
చదవండి: పెళ్లిలో కలిసిన మెగా బ్రదర్స్.. నవ్వుతున్న ఫోటోలు వైరల్
Comments
Please login to add a commentAdd a comment