తల్లి కాబోతున్న హీరోయిన్‌ ఆనంది! | Heroine Kayal Anandhi To Be Mother Soon | Sakshi
Sakshi News home page

తల్లి కాబోతున్న హీరోయిన్‌ ఆనంది!

Published Mon, Aug 30 2021 9:25 PM | Last Updated on Tue, Aug 31 2021 5:29 PM

Heroine Kayal Anandhi To Be Mother Soon - Sakshi

‘శ్రీదేవి  సోడా సెంటర్‌’ మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్‌ ఆనంది తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగమ్మాయిగా పరిశ్రమలో అడుగుపెట్టిన ఆనంది ‘బస్ స్టాప్’, ‘ఈ రోజుల్లో’ వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ కాస్తా అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్‌ హీరోయిన్‌గా  ఎదిగింది. తెలుగమ్మాయి అయినప్పటికి తమిళంలో తన సత్తా చాటి సక్సెస్ సాధించింది.

చదవండి: పెళ్లి రూమర్లపై స్పందించిన శ్రుతి హాసన్‌

ఈ క్రమంలో తమిళ అసిస్టెంట్ డైరెక్టర్ సోక్రటీస్‌తో ప్రేమలో పడిన పడిన ఆమె ఈ జనవరి 7న పెద్దల అంగీకారంతో ప్రియుడిని వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆనంది త్వరలోనే తల్లి కాబోతోందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెకు ఆరు నెలల గర్భిణిగా ఉన్నట్లు సమాచారం. కాగా ఆనంది పెళ్లికి ముందు నటించిన జాంబిరెడ్డి, శ్రీదేవి సోడా సెంటర్‌ మూవీలు పెళ్లి అనంతరం విడుదలయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement