
దేవిక.. అలనాటి అందాల తార. వందకుపైగా సినిమాలు చేసింది. తెలుగులో ఆడవాళ్లే అలిగితే, ఆడ బ్రతుకు, అన్నా చెల్లెలు, బాటసారి, దేశ ద్రోహులు, గాలిమేడలు, గండికోట రహస్యం, మంగళసూత్రం, రేచుక్క, నిండు మనసులు, పాపం పసివాడు, రక్త సంబంధం, శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం, సుగుణ సుందరి కథ, శ్రీ కృష్ణ సత్య.. ఇలా అనేక సినిమ్లాలో యాక్ట్ చేసింది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ కనిపించి కనువిందు చేసింది.
రియల్ లైఫ్‌లోనూ యాక్టింగ్
1968లో దర్శకుడు దేవదాసు (Devadoss)ను పెళ్లాడింది. ఈ జంటకు పుట్టిన కూతురు కనక (Actress Kanaka) కూడా సినిమాల్లో రాణించింది. కానీ తర్వాత ఈ కుటుంబం ఛిన్నాభిన్నమైపోయింది. దేవిక వల్ల తన జీవితమే తలకిందులైదంటున్నాడు ఆమె మాజీ భర్త దేవదాసు. దేవిక రీల్ లైఫ్‌లో మాత్రమే నటించలేదని, నిజ జీవితంలోనూ యాక్ట్ చేసిందని చెప్తున్నాడు.
కాళ్లమీద పడింది
తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేనెప్పుడూ దేవిక (Devika) వెంట పడలేదు. తనే పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసింది. మీకూ, నాకూ సెట్టవదండని చెప్పాను. అయినా తను వినలేదు. నా కాళ్లమీద పడి పెళ్లి చేసుకోమని బతిమాలాడింది. ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అలా తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం.. కానీ తనది నిజమైన ప్రేమ కాదని నెమ్మదిగా అర్థమైంది.
నన్ను హత్య చేయించాలని..
నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు తన దగ్గర పైసా లేదు. డబ్బు కోసం నన్ను పెళ్లాడింది. నేను పెద్ద డైరెక్టర్ అయిపోతానని దేవిక అనుకుంది. నన్ను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూసింది. కానీ నేను స్వతంత్ర భావాలున్న వ్యక్తిని. నాకు నచ్చినట్లుగానే ఉండేవాడిని. దీంతో ఆమె నన్ను మనిషిగా చూసేది కాదు. ఒకరోజు తాళిబొట్టు విసిరి నా మొహాన కొట్టింది. నన్ను చంపించాలని ట్రై చేసింది. అందుకోసం మనుషుల్ని కూడా పంపింది. అప్పుడు నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను.

తల్లి సంతకం ఫోర్జరీ..
నేను, దేవిక 32 ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగాం. ఆ సమయంలో ఓ సంఘటన జరిగింది. దేవిక తల్లి చనిపోయేటప్పుడు వీలునామా రాయలేదు. అప్పుడు దేవిక తన తల్లి సంతకం ఫోర్జరీ చేసి ఆస్తి తనపై రాసుకుంది. అది నేను పసిగట్టాను. తనకు చెన్నైలో ఒక ఇల్లుతో పాటు 25 ఎకరాల భూమి ఉండేది. మాకు కూతురు కనక పుట్టింది కదా.. అది కూడా దేవికకు ఇష్టం లేదు. కానీ విడాకులయ్యే సమయానికి కోర్టు కూతుర్ని తల్లికే అప్పగిస్తుందిగా.. అలా దేవిక కనకను తీసుకెళ్లింది.
దేవికలాగే కూతురూ తయారైంది
తన మనసును మార్చేసింది. నా కూతురి దృష్టిలో నన్ను చెడ్డవాడిగా చిత్రీకరించింది. తను నాపై వేసిన నిందలకు అందరూ నన్ను శత్రువుగా చూశారు. అందుకే దేవిక చనిపోయినప్పుడు కూడా తనను చూసేందుకు వెళ్లలేదు. తల్లిలాగే కూతురూ తయారైంది. ఇప్పుడు నేనుంటున్న ఇల్లు తనదేనని కనక నాపై కేసు పెట్టింది. తల్లిలాగే తనూ ఫోర్జరీ సంతకంతో ఈ ఇంటిని లాక్కోవాలని చూసింది. అది ఫోర్జరీ అని కోర్టులో తేలితే ఎనిమిదేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని కాంప్రమైజ్‌కు వచ్చింది.
నీ తండ్రెవరో తెలుసా?
ఈ కేసు నడుస్తున్న సమయంలో నన్ను నానామాటలన్నప్పుడు.. బయట ఉన్న మగవాళ్లతో డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకో.. అప్పుడు నీకు నిజమైన తండ్రెవరో తెలుస్తుందన్నాను. ఇకపోతే కనక మానసిక స్థితి కూడా సరిగా లేదు. ఇంటి ముందు అంతా అపరిశుభ్రంగా ఉండేది. ఇల్లు దాటి బయటకు రాకుండా లోపల తాళం వేసుకుని ఉండేది. ఓరోజు కనక చనిపోయినట్లు వార్త రావడంతో పోలీసులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లాను.
ఇంటికి వెళ్తే రానివ్వలేదు
అది తప్పుడు రిపోర్ట్ అని మీడియాకు చెప్పాక ఇంటి బయట మొత్తం క్లీన్ చేశాను. కానీ కనక.. నన్ను లోపలకు రానివ్వలేదు. తన మానసిక స్థితి అస్సలు బాగోలేదని అర్థమైంది. ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకుంటే అందుకు నేను బాధ్యుడిని కాదని ముందుజాగ్రత్తగా కోర్టుకు చెప్పాను. తనతో నాకు సత్సంబంధాలు లేవు. జీవితంలో ఏదైనా పెద్ద తప్పు చేశానా? అంటే అది దేవికను పెళ్లి చేసుకోవడమే! నా మరణానంతరం దాదాపు రూ.100 కోట్ల ఆస్తి అంతా ట్రస్టుకు చెందాలని వీలునామా రాశాను అని దేవదాసు చెప్పుకొచ్చాడు.
చదవండి: పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్
Comments
Please login to add a commentAdd a comment