Devika
-
వైఎస్ జగన్‌ను కలిసిన చిన్నారిపై విషం చిమ్ముతున్న టీడీపీ
-
చిన్నారిపై లోకేష్ సైకో టీం విషప్రచారం
విజయవాడ, సాక్షి: పచ్చ బ్యాచ్ సైకోలు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతీసారి ఆశ్చర్యపరస్తూ వస్తున్నారు. తాజాగా.. మరోసారి విష పడగ విప్పారు. జగన్‌పై అభిమానంతో ఓ చిన్నారి చేసిన పనిని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈసారి నెటిజన్ల నుంచి ఛీత్కారాలు వచ్చాయి. దీంతో ఐటీడీపీ జీతగాళ్లు మరింత దిగజారి ప్రవర్తించారు. ఆ చిన్నారి విషయంలో అసత్య ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.రవీంద్రభారతిలో ఎనిమిదో తరగతి చదువుతున్న దేవికారెడ్డి(Devika Reddy) .. విజయవాడ పర్యటనలో వైఎస్ జగన్‌ను కలిసింది. ఆ సమయంలో ఆయన ఆ పాపను దగ్గరికి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత భావోద్వేగంతో ఆ చిన్నారి మీడియా ముందు మాట్లాడింది. జగన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడి రావట్లేదని ఉన్నమాటే చెప్పింది. అయితే పచ్చ బ్యాచ్‌కు ఇది ఏమాత్రం సహించనట్లుంది.అందుకే తమ అనుకూల సోషల్ మీడియా పేజీలు, వెబ్సైట్లలో చిన్నారి గురించి ఇష్టానుసారం పోస్టులు చేయించారు. దిగజారిపోయి మరీ పోల్ క్వశ్చన్స్ పెట్టించారు. ఈ క్రమంలో #Childabuser అంటూ ఆ వెబ్సైట్లను జనం తిట్టిపోశారు కూడా. గతంలో చిన్నపిల్లలతో రాజకీయం చేసింది ఎవరంటూ.. టీడీపీకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.టీడీపీ సోషల్ మీడియా(TDP Social Media) ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో తెలియంది కాదు. గతంలో ప్రభుత్వ స్కూల్లో అనర్గళంగా ఆంగ్లం మాట్లాడిన మేఘన అనే ఓ విద్యార్థిని విపరీతంగా ట్రోల్ చేశారు. జగన్ సాయం చేశారని చెప్పిన గీతాంజలికి.. సొంతింటి కల నెరవేరిన సంతోషాన్ని లేకుండా చేశారు. ఏకంగా.. ఆమె బలవన్మరణానికి పాల్పడేంతగా సోషల్ మీడియాలో ఏడ్పించారు. జగన్ పాలనలో సాయం పొందిన వాళ్లను, ఆయనపై అభిమానం ప్రదర్శించిన వాళ్లనూ ఏ ఒక్కరినీ వదలకుండా విపరీతంగా ట్రోల్ చేయడం చూశాం. ఇప్పుడు ఓ చిన్నారి విషయంలోనూ అదే చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మరీ శ్రుతిమించడంతో బూమరాంగ్ అయ్యింది. దీంతో ఈసారి అసత్య ప్రచారాలకు దిగారు. చిన్నారి దేవిక డీపీహెచ్ స్కూల్లో చదువుతుందంటూ ప్రచారం చేశారు. పైగా ఆమె తల్లి వైఎస్సార్సీపీ నాయకురాలు అని, ఆర్థికంగా ఆ కుటుంబ పరిస్థితి ఎంతో బాగుందంటూ విషం చిమ్మారు. దేవిక తండ్రి అద్దె ఇంట్లో ఉంటూనే ఓ షాప్‌లో పని చేస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కానీ, లోకేష్ సైకో టీం(Nara Lokesh Team) విషప్రచారం ఇంకా ఆ ప్రచారం ఆపట్లేదు.ఇంత జరుగుతున్నా.. టీడీపీ సోషల్ మీడియా విభాగాలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నవాళ్లపై కూటమి పెద్దల ఆదేశాలతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండడంలో తలమునకలైపోయారు అంతే!. -
డబ్బు కోసం నన్నే చంపాలనుకుంది.. నా వందకోట్ల ఆస్తి..: హీరోయిన్ మాజీ భర్త
దేవిక.. అలనాటి అందాల తార. వందకుపైగా సినిమాలు చేసింది. తెలుగులో ఆడవాళ్లే అలిగితే, ఆడ బ్రతుకు, అన్నా చెల్లెలు, బాటసారి, దేశ ద్రోహులు, గాలిమేడలు, గండికోట రహస్యం, మంగళసూత్రం, రేచుక్క, నిండు మనసులు, పాపం పసివాడు, రక్త సంబంధం, శ్రీ కృష్ణాంజనేయ యుద్ధం, సుగుణ సుందరి కథ, శ్రీ కృష్ణ సత్య.. ఇలా అనేక సినిమ్లాలో యాక్ట్ చేసింది. తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ కనిపించి కనువిందు చేసింది.రియల్ లైఫ్‌లోనూ యాక్టింగ్1968లో దర్శకుడు దేవదాసు (Devadoss)ను పెళ్లాడింది. ఈ జంటకు పుట్టిన కూతురు కనక (Actress Kanaka) కూడా సినిమాల్లో రాణించింది. కానీ తర్వాత ఈ కుటుంబం ఛిన్నాభిన్నమైపోయింది. దేవిక వల్ల తన జీవితమే తలకిందులైదంటున్నాడు ఆమె మాజీ భర్త దేవదాసు. దేవిక రీల్ లైఫ్‌లో మాత్రమే నటించలేదని, నిజ జీవితంలోనూ యాక్ట్ చేసిందని చెప్తున్నాడు.కాళ్లమీద పడిందితాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేనెప్పుడూ దేవిక (Devika) వెంట పడలేదు. తనే పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసింది. మీకూ, నాకూ సెట్టవదండని చెప్పాను. అయినా తను వినలేదు. నా కాళ్లమీద పడి పెళ్లి చేసుకోమని బతిమాలాడింది. ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది. అలా తిరుపతిలో పెళ్లి చేసుకున్నాం.. కానీ తనది నిజమైన ప్రేమ కాదని నెమ్మదిగా అర్థమైంది.నన్ను హత్య చేయించాలని..నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు తన దగ్గర పైసా లేదు. డబ్బు కోసం నన్ను పెళ్లాడింది. నేను పెద్ద డైరెక్టర్ అయిపోతానని దేవిక అనుకుంది. నన్ను తన చెప్పుచేతల్లో ఉంచుకోవాలని చూసింది. కానీ నేను స్వతంత్ర భావాలున్న వ్యక్తిని. నాకు నచ్చినట్లుగానే ఉండేవాడిని. దీంతో ఆమె నన్ను మనిషిగా చూసేది కాదు. ఒకరోజు తాళిబొట్టు విసిరి నా మొహాన కొట్టింది. నన్ను చంపించాలని ట్రై చేసింది. అందుకోసం మనుషుల్ని కూడా పంపింది. అప్పుడు నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను.తల్లి సంతకం ఫోర్జరీ..నేను, దేవిక 32 ఏళ్లపాటు కోర్టుల చుట్టూ తిరిగాం. ఆ సమయంలో ఓ సంఘటన జరిగింది. దేవిక తల్లి చనిపోయేటప్పుడు వీలునామా రాయలేదు. అప్పుడు దేవిక తన తల్లి సంతకం ఫోర్జరీ చేసి ఆస్తి తనపై రాసుకుంది. అది నేను పసిగట్టాను. తనకు చెన్నైలో ఒక ఇల్లుతో పాటు 25 ఎకరాల భూమి ఉండేది. మాకు కూతురు కనక పుట్టింది కదా.. అది కూడా దేవికకు ఇష్టం లేదు. కానీ విడాకులయ్యే సమయానికి కోర్టు కూతుర్ని తల్లికే అప్పగిస్తుందిగా.. అలా దేవిక కనకను తీసుకెళ్లింది. దేవికలాగే కూతురూ తయారైందితన మనసును మార్చేసింది. నా కూతురి దృష్టిలో నన్ను చెడ్డవాడిగా చిత్రీకరించింది. తను నాపై వేసిన నిందలకు అందరూ నన్ను శత్రువుగా చూశారు. అందుకే దేవిక చనిపోయినప్పుడు కూడా తనను చూసేందుకు వెళ్లలేదు. తల్లిలాగే కూతురూ తయారైంది. ఇప్పుడు నేనుంటున్న ఇల్లు తనదేనని కనక నాపై కేసు పెట్టింది. తల్లిలాగే తనూ ఫోర్జరీ సంతకంతో ఈ ఇంటిని లాక్కోవాలని చూసింది. అది ఫోర్జరీ అని కోర్టులో తేలితే ఎనిమిదేళ్లు జైల్లో ఉండాల్సి వస్తుందని కాంప్రమైజ్‌కు వచ్చింది. నీ తండ్రెవరో తెలుసా?ఈ కేసు నడుస్తున్న సమయంలో నన్ను నానామాటలన్నప్పుడు.. బయట ఉన్న మగవాళ్లతో డీఎన్ఏ టెస్ట్ చేయించుకో.. అప్పుడు నీకు నిజమైన తండ్రెవరో తెలుస్తుందన్నాను. ఇకపోతే కనక మానసిక స్థితి కూడా సరిగా లేదు. ఇంటి ముందు అంతా అపరిశుభ్రంగా ఉండేది. ఇల్లు దాటి బయటకు రాకుండా లోపల తాళం వేసుకుని ఉండేది. ఓరోజు కనక చనిపోయినట్లు వార్త రావడంతో పోలీసులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లాను. ఇంటికి వెళ్తే రానివ్వలేదుఅది తప్పుడు రిపోర్ట్ అని మీడియాకు చెప్పాక ఇంటి బయట మొత్తం క్లీన్ చేశాను. కానీ కనక.. నన్ను లోపలకు రానివ్వలేదు. తన మానసిక స్థితి అస్సలు బాగోలేదని అర్థమైంది. ఒకవేళ ఆమె ఆత్మహత్య చేసుకుంటే అందుకు నేను బాధ్యుడిని కాదని ముందుజాగ్రత్తగా కోర్టుకు చెప్పాను. తనతో నాకు సత్సంబంధాలు లేవు. జీవితంలో ఏదైనా పెద్ద తప్పు చేశానా? అంటే అది దేవికను పెళ్లి చేసుకోవడమే! నా మరణానంతరం దాదాపు రూ.100 కోట్ల ఆస్తి అంతా ట్రస్టుకు చెందాలని వీలునామా రాశాను అని దేవదాసు చెప్పుకొచ్చాడు.చదవండి: పీరియడ్స్ అన్నా పట్టించుకోరు... అతనొక్కడే...: నిత్యామీనన్ -
Jalaja, Devika and Surya: లారీలో దేశాన్ని చుట్టేస్తున్నారు!
ఇంట్లో ముగ్గురు ఆడవాళ్లు జలజ, దేవిక, సూర్య హెవీ వెహికిల్ డ్రైవింగ్ నేర్చుకొని, లైసెన్స్ పొందారు. లారీలో ఫ్లైవుడ్, ఉల్లి, అల్లం లోడ్‌ను తీసుకెళుతూదేశంలోని 22 రాష్ట్రాలలో ప్రయాణించారు. జలజ, దేవిక తల్లీకూతుళ్లు. జలజ తోడికోడలు సూర్య. ఈ ముగ్గురూ ఆసక్తితో నేర్చుకున్న ట్రక్కు డ్రైవింగ్‌తో తమ ప్రయాణ విశేషాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్నారు. కేరళవాసులైన ఈ ముగ్గురు మహిళలు చేస్తున్న సాహస ప్రయాణం చాలామందిలో కొత్త ఉత్సాహం నింపుతోంది.కేరళలోని ఎట్టుమనూరుకు చెందిన రతీష్ పుథెట్ లారీ ట్రాన్స్పోర్ట్ యజమాని. అతని ట్రాన్స్పోర్ట్ సంస్థలో 30 లారీలు ఉన్నాయి. రతీష్ 19వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య జలజకు తన ట్రక్కు తాళాలను ఇచ్చాడు. రెండేళ్ల క్రితం ఫిబ్రవరిలో ఆమె రతీష్‌తో కలిసి ట్రక్కులో కాశ్మీర్‌కు బయల్దేరింది. ఆ సమయంలోనే తనకూ డ్రైవింగ్ చేయాలనే ఆసక్తి కలిగింది. 2014లో ఫోర్ వీలర్ లైసెన్స్ తీసుకున్నా ఆ తర్వాత నాలుగేళ్లకు 2018లోనే జలజ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందింది. మొదటిసారి పెరుంబవూరు నుండి ఫ్లైవుడ్ తీసుకొని లారీలో పుణేకి మొదటి ప్రయాణం చేసింది. అక్కడ నుంచి కశ్మీరుకు ఉల్లిపాయల లోడు తీసుకెళ్లింది. ‘ఈ ప్రయాణాలు నాలో ధైర్యాన్ని నింపాయి. ఒక మహిళ డ్రైవింగ్ సీట్లో ఉండటంతో ఇతర డ్రైవర్లు, పోలీసు అధికారులు గౌరవంగా చూసేవారు. స్థానికులు కూడా ఆసక్తిగా చూసేవారు. కాశ్మీర్ ప్రయాణానికి ఆరు రోజులు వెళ్లడానికి, మరో ఆరు రోజులు తిరిగి రావడానికి సమయం పట్టింది. మధ్యలో కొండచరియలు విరిగిపడటంతో లారీలు వెళ్లేందుకు వీలు కాలేదు. లారీలన్నింటికీ ఇతర రాష్ట్రాల డ్రైవర్లు ఉన్నారు. ఏ సమస్యా రాలేదు. దేశవ్యాప్తంగా వివిధ రకాల వ్యక్తులు, వారి జీవనశైలి, ఆహారపుటలవాట్లు... ఇలా ప్రతిదానినీ అర్ధం చేసుకోవడానికి ఈ ప్రయాణాలు నాకు బాగా తోడ్పడుతున్నాయి. వివిధ రాష్ట్రాల భాష ముఖ్యంగా హిందీ నేర్చుకుంటున్నాను’ అని చెబుతోంది జలజ. కాశ్మీర్ వరకు జలజ ట్రక్ డ్రైవింగ్ చేయడంతో ఇంట్లో మరో ఇద్దరు మహిళలు డ్రైవింగ్ పట్ల ఆసక్తి చూపారు. జలజ కూతురు దేవిక డిగ్రీ చదువుతోంది. రతీష్ తమ్ముడి భార్య సూర్య. వీళ్లూ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందారు. దీంతో రతీష్ కూడా చాలా ఆనందించాడు. వీరు ముగ్గురూ కలిసి పుథెట్ ట్రాన్స్పోర్ట్ వ్లాగ్‌ను ్రపారంభించారు. ముగ్గురు మహిళలూ తాము చేసే లారీ ప్రయాణాల వివరాలను అందులో ఉంచుతున్నారు. దేవిక లడఖ్ ప్రయాణంలో 5,900 కిలోమీటర్లు ట్రక్కును నడిపింది. లారీ డ్రైవింగ్‌తో కేరళ నుంచి కాశ్మీర్ ప్రయాణం చేసిన జలజ ఆ తర్వాత మహారాష్ట్ర, నేపాల్‌కు వెళ్లింది. హరిద్వార్, రిషికేశ్‌లో పర్యటిస్తున్నప్పుడు రతీష్ తల్లి లీలాను వెంట తీసుకెళ్లింది. దేవిక ఎర్నాకులం రాజగిరి కాలేజీలో హెవీ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన ఏకైక స్టూడెంట్‌గా పేరొందింది. కోడలు గోపిక లైసెన్స్ కోసం ఎదురుచూస్తోంది. రతీష్, జలజ లది ఉమ్మడి కుటుంబం. పాతికేళ్లక్రితమే ఎట్టుమనూరుకు వలస వచ్చాడు. ఒకే ఇంట్లో ఉంటున్న జలజ, సూర్య, దేవిక కిందటి మే నెలలో లక్నో, షిల్లాంగ్ ట్రిప్పులలో డ్రైవర్లుగా ఉన్నారు. వీరికి తోడుగా సూర్య పిల్లలు గోపిక, మరో ముగ్గురు పిల్లలూ చేరారు. లారీ క్యాబిన్లో ఏసీని అమర్చారు. పడుకోవడానికి, కూర్చోవడానికి, రోడ్డు పక్కన వంట చేసుకోవడానికి అవసరమైన వస్తువులను తీసుకెళతారు. ‘ఎక్కడా ఇబ్బంది కలగకుండా లారీని ఇల్లులా తయారు చేసుకున్నాం’ అని చెబుతారు ఈ ముగ్గురు మహిళలు. ట్రక్కులలో లోడ్లను గమ్యస్థానాలకు తరలించడమే కాదు, కుటుంబం అంతా కలిసి యాత్రలు చేస్తుంటారు. ఈ యాత్రలో జలజ, సూర్యల కుటుంబసభ్యులు ఉంటారు. తమ యాత్ర వీడియోలను, ఫొటోలను సోషల్‌మీడియా ద్వారా పోస్ట్ చేస్తుంటారు. వీరికి దాదాపు మూడున్నర లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ మహిళా లారీ డ్రైవర్లకు ఉన్న అభిమానుల్లో విదేశీయులూ ఉన్నారు. -
Devika Manchandani: పాకశాస్త్ర ప్రవీణ! వంటలపై ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే?
చండీగఢ్‌కు చెందిన 23 సంవత్సరాల దేవిక మన్‌చందానీ ఇప్పుడు న్యూయార్క్‌లోని ప్రముఖ చెఫ్‌లలో ఒకరు. వంటలకు సంబంధించిన ఎన్నో పోటీల్లో బహుమతులు గెలుచుకుంది. పేస్ట్రీ చెఫ్‌గా రకరకాల ప్రయోగాలు చేస్తూ తనదైన ప్రత్యేకత చాటుకుంటోంది.చిన్నప్పటి నుంచి దేవికకు వంటలన్నా, కొత్త వంటకాల గురించి తెలుసుకోవడం అన్నా చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనని చండీగఢ్ వీధుల నుంచి న్యూయార్క్‌లోని ప్రసిద్ధ రెస్టారెంట్ల వరకు తీసుకెళ్లింది. ఆమె కుటుంబంలో, బంధువులలో పాకశాస్త్ర ప్రవీణులు ఎంతో మంది ఉన్నారు. వారి దగ్గరి నుంచి ఎన్నో కుటుంబ వంటకాలను నేర్చుకుంది.వంటలపై దేవిక ఇష్టం ఎక్కడిదాకా వెళ్లిందంటే న్యూయార్క్‌లోని కలినరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అమెరికా(సిఐఎ)లో చదివే వరకు. పాకశాస్త్ర పరిధిని విస్తరించుకోవడానికి,ప్రావీణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి ఈ చదువు దేవికకు ఉపయోగపడింది.‘సిఐఎ’లో అకడమిక్ ఎక్స్‌లెన్స్ అవార్డ్ నుంచి నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఇచ్చే అవార్డ్ వరకు ఎన్నో అవార్డ్లు అందుకుంది దేవిక. ‘స్కిల్స్ యూఎస్ఏ బేకింగ్ అండ్ పేస్ట్రీ ఆర్ట్స్’ పోటీల్లో పాల్గొనడం దేవిక కేరీర్లో మైలురాయిగా నిలిచింది. ఆ పోటీలో పాల్గొన్న ఏకైక భారతీయురాలిగా గుర్తింపు పొందింది. అంతేకాదు, ఆ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయం తనని రెండు అడుగులు ముందుకు వేసేలా చేసింది. ప్రసిద్ధ ‘గాబ్రియెల్’ రెస్టారెంట్‌కు సంబంధించి ముఖ్యమైన ఈవెంట్స్‌కు నాయకత్వం వహించేలా చేసింది.ఆ రెస్టారెంట్లో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త సవాళ్లు ఎదురయ్యేవి. క్రైసిస్ మేనేజ్మెంట్ గురించి బాగా తెలిసిన దేవిక ఆ సవాళ్లను అధిగమించింది. ఒక విజేతగా సిఐఏ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగం చేసే అవకాశం దేవికకు వచ్చింది. ‘పాత్ వేస్ టు ఎక్స్‌లెన్స్’ అంశంపై స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసింది. ‘ఎగ్జయిట్‌మెంట్‌కు ఎనర్జీ తోడైతే ఎంత విజయాన్ని అయినా సాధించవచ్చు’ అంటుంది దేవిక. ‘స్కిల్స్ యూఎస్ఎ’ రాష్ట్ర స్థాయి పోటీలకు న్యాయనిర్దేత పాత్ర పోషించిన దేవిక ‘బేకింగ్ అండ్ పేస్ట్రీ ఆర్ట్స్’కు సంబంధించిన పోటీకి పోటీ పడుతున్న తరువాతి తరం విద్యార్థులకు మార్గనిర్దేశం చేసింది.పేస్ట్రీ చెఫ్ కావాలనే కలతో చండీగఢ్ నుంచి అమెరికాకు వెళ్లిన దేవిక తన కలను నెరవేర్చుకోవడమే కాదు చిన్న వయసులోనే ప్రముఖ ‘పేస్ట్రీ చెఫ్’గా పెద్ద పేరు తెచ్చుకుంది.సూపర్ స్పీకర్..దేవిక మన్‌చందానీ చెఫ్ మాత్రమే కాదు స్ఫూర్తిదాయక వక్త కూడా. ఆమె వంటలతో పాటు ఉపన్యాసాలకు కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. పనిచేస్తున్న క్రమంలోనే క్రైసిస్ మేనేజ్మెంట్కు సంబంధించిన సూత్రాలు పట్టుబడతాయని చెబుతుంది దేవిక. చదువుల కోసం వేరే దేశం వెళ్లే విద్యార్థులకు రకరకాల సవాళ్లు ఎదురవుతుంటాయి.తాను అమెరికాకు వచ్చినప్పుడు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, వాటిని అధిగమించిన తీరును విద్యార్థులకు చెబుతుంటుంది దేవిక. ‘ఎంతో కొంత నేర్చుకున్నాను అనే తృప్తి కంటే ‘ఇంకా ఎంతైనా నేర్చుకుంటాను’ అనే దాహం విజయానికి దారి చూపుతుంది అంటుంది దేవిక. ‘లక్ష్యం మీద అయోమయం కాదు స్పష్టత ఉండాలి’ అంటున్న దేవిక ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తుంది.ఇవి చదవండి: Summer Season: ఈ సమ్మర్ సెలవుల్లో.. పిల్లలు ఫోన్‌కి దూరంగా ఉండాలంటే? -
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇన్నేళ్ల ఒంటరి జీవితానికి కారణమేంటి?
హీరోయిన్ కనక.. తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడుకు మని మనమరాలు. లెజెండరీ హీరోయిన్ దేవికకు ఏకైక కూతురు. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో దేవిక చివరిగా నటించారు. 2002లో ఆమె మరణించారు. అప్పటి వరకు స్టార్ హీరోయిన్గా ఉన్న ఆమె కూతురు కనక ఒక్కసారిగా డీలా పడిపోయారు. ఆ సమయం వరకు తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో 60కి పైగా చిత్రాల్లో కనక నటించింది. సూపర్ స్టార్ రజనీకాంత్, కార్తీక్, ప్రభు, మోహన్‌లాల్, మమ్ముట్టి, జయరామ్, రాజేంద్ర ప్రసాద్, భాను చందర్ వంటి స్టార్స్‌తో పలు సినిమాల్లో కనిపించిన ఆమె లెక్కలేనన్ని బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకుంది. కానీ తల్లి మరణం తర్వాత కనీసం ఒక్క సినిమాలో కూడా నటించలేదు. చివరకు వివాహం కూడా చేసుకోకుండా బాహ్య ప్రపంచానికి దూరంగా ఒంటరి జీవితాన్ని ఇప్పటి వరకు గడుపుతుంది. (కనిక- దేవిక) 80,90 దశకంలో కనకకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా తమిళ చిత్ర సీమలో ఆమె చెరగని ముద్ర వేశారు. తల్లి దేవిక మరణం తర్వాత ఆమె ఒంటరి అయిపోయారు. దీంతో ఆమె వ్యక్తిగత జీవితం గురించి రకరకాల పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఆమెను ఎవరో పెళ్లి చేసుకుని వదిలేశారని వార్తలు వచ్చాయి. బాహ్యప్రపంచానికి దూరంగా ఉన్న ఆమె.. వీటిని పట్టించుకోలేదు. అప్పుడప్పుడూ ఇంటి నుంచి బయటకు వచ్చే కనకకు అటెండర్ ఒక్కరే ఉంటారని కొందరు చెబుతున్న మాట. ఇప్పటి వరకు కనక ఏకాంతంగానే గడుపుతుండగా ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేదని కొందరిలో ప్రశ్న మొదలైంది. కనక గురించి కొందరు సీనియర్ జర్నలిస్ట్‌లు చెబుతున్న ప్రకారం.. ఆమె అప్పట్లోనే బీఏ చదివారని.. తల్లితో పాటుగా సినిమా షూటింగ్స్ వెళ్తున్న క్రమంలో వారి కుటుంబానికి రామచంద్రన్ అనే వ్యక్తి దగ్గర కావడం జరిగిందని చెబుతారు. అతనే ఆ కుటుంబానికి అండగా ఉంటూ వారిద్దరి మంచిచెడులు చూసేవాడని సమాచారం. కొంత కాలానికి కనక ప్రేమలో పడిన రామచంద్రన్ ఆ కుటుంబానికి మరింత దగ్గరయ్యాడు. అయితే ఓ దశలో రామచంద్రన్‌ను కనక అపార్థం చేసుకుందని దీంతో వారిద్దరి మధ్య విభేదాలు రావడం వల్ల అతన్ని ఇంటి నుంచి కనక పంపేసినట్లు చెబుతున్నారు. కొన్ని సంవత్సరాల తరువాత తల్లి మరణం ఆపై రామచంద్రన్ కూడా మరణించడం జరిగిపోయాయి. రామచంద్రన్ మరణం తర్వాత తనను ఎంతగా ప్రేమిస్తున్నాడో కనకకు తెలిసింది. దీంతో గుండెలవిసేలా రోదించిన కనక.. తనకు సినిమాలేవీ అక్కర్లేదని, ఒంటరిగా జైలు జీవితాన్ని కోరుకున్నట్లు అక్కడి మీడియా చెబుతుంది. అయితే సుమారు పదేళ్ల తర్వాత కనకను సంప్రదించిన కోలీవుడ్ ప్రముఖ జర్నలిస్ట్ కుట్టి పద్మిని ఒక కాఫీ షాప్‌లో కలిశారు. పదేళ్లపాటు బయటిప్రపంచంలో కనక కనిపించకపోవడంతో అందరూ చనిపోయిందని అనుకున్నారు. ఏకంగా ప్రముఖ పత్రికలు కూడా ఆ వార్తను ప్రచురించాయి. దీంతో కొందరు మీడియా వారు ఆమె ఇంటికెళ్లేసరికి అక్కడ ఎదురుగా కనక కనిపించారు. తాను బతికేవున్నానని, వదంతులకు వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది. అలా తల్లి మరణం తర్వాత కనక జీవితం ఒక్కసారిగా మారిపోయింది. 41 ఏళ్ల వయసులో ఆమె ఒంటరిగానే ఒక పాత ఇంటిలో జీవిస్తుంది. -
Methil Devika: నాట్య వెన్నెల
వెన్నెలకు పరిమితులు ఉండవు. ధనిక, పేద, దివ్యాంగులు అనే తేడాలుండవు. ‘నృత్యం కూడా వెన్నెలలాంటిదే. అది అందరి కోసం. అందరిదీ’ అంటున్న మెథిల్ దేవిక బధిరుల కోసం కొత్త నృత్యశైలిని సృష్టించింది. నాట్యంలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న కేరళకు చెందిన దేవిక డ్యాన్స్ రిసెర్చ్ స్కాలర్, ఎడ్యుకేటర్, కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకుంది. సైన్లాంగ్వేజ్ నేర్చుకుంది. హస్తముద్రలను, సైన్లాంగ్వేజ్తో మిళితం చేసి ‘క్రాస్వోవర్’ నృత్యానికి రూపకల్పన చేసింది. గత నెల తిరువనంతపురంలో దేవిక ఇచ్చిన శాస్త్రీయ నృత్యప్రదర్శనను ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న బధిరులు ఆనందంగా ఆస్వాదించారు. ఒకసారి నృత్యప్రదర్శన ఇవ్వడానికి గుజరాత్‌కు వెళ్లిన దేవిక అక్కడ బధిరుల బృందాన్ని చూసింది. నృత్యం చూడాలనే ఆసక్తి వారిలో ఉన్నా సంపూర్ణంగా ఆస్వాదించగలరా? నృత్యం ద్వారా చెప్పే కథను వారు అర్థం చేసుకోగలరా? వారికి సులభంగా అర్థం కావాలంటే ఏంచేయాలి... ఇలాంటి విషయాలు ఎన్నో ఆలోచించింది దేవిక. దేవిక సందేహించినట్లుగానే వారు తన నృత్యప్రదర్శనతో కనెక్ట్ కాలేదు. అర్థం కానట్లు ముఖం పెట్టారు. ఇక అప్పటి నుంచి ‘డ్యాన్స్ ఫిలాంత్రపి అండ్ సోషల్ ఇన్‌క్లూజన్’ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టింది. డ్యాన్స్ వొకాబ్యులరీని అభివృద్ధి చేయడానికి ఎంతోమందితో మాట్లాడింది. ‘నృత్యకారులకు తమతో తాము సంభాషించుకునే, తమలో ఊహాలోకాన్ని ఆవిష్కరించుకునే ఏకాంతంలో కొత్త ఆలోచనలు వస్తుంటాయి. నృత్యప్రదర్శనలు లేని ఖాళీ సమయంలో బధిరులను దృష్టిలో పెట్టుకొని మనసులోనే డ్యాన్స్‌ను కంపోజ్ చేశాను. ఊహల్లోని నృత్యానికి వాస్తవరూపం ఇవ్వడానికి సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాను’ అంటుంది దేవిక. కేరళలోని పాలక్కాడ్‌లో కళాకారుల కుటుంబంలో పుట్టింది దేవిక. నాలుగేళ్ల వయసులోనే కాలికి గజ్జె కట్టింది. 20 సంవత్సరాల వయసులో సోలోపెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ‘కేరళ కళామండపం’లో విద్యార్థులకు నాట్యపాఠాలు బోధించింది. టీవీ డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించింది. ‘నృత్యానికి పరిమితులు ఉన్నప్పుడు దాని ఉద్దేశం నెరవేరదు. అది సంపన్న కళాప్రియులకే కాదు అందరికీ చేరువ కావాలి’ అంటున్న దేవిక తన నృత్యప్రదర్శన సామాన్యులకు చేరువ చేయడానికి ప్రయత్నిస్తోంది. తిరువనంతపురం డ్యాన్స్ షోలో బధిరులు తన హస్తముద్రలను అనుకరించడం దేవికకు సంతోషం ఇచ్చింది. ‘అదొక గొప్ప అనుభవం. వారి కళ్లు ఆనందంతో వెలిగిపోయాయి. ఎన్నో సంస్కృతులు, ఎన్నో భాషలకు చెందిన ప్రేక్షకుల ముందు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాను. ఆ సంతోషాన్ని మించిన సంతోషం ఇది. నా నృత్యం వారి హృదయానికి దగ్గరైంది. నా ఉద్దేశం నెరవేరింది’ అంటోంది దేవిక. ‘నృత్యాన్ని ప్రజాస్వామీకరించాలి. అది అందరికీ చేరువ కావాలి’ అంటున్న దేవిక తన ప్రాజెక్ట్ ద్వారా మరిన్ని ప్రదర్శనలు ఇవ్వాలనుకుంటోంది. మనం ఒక ప్రయోగానికి సిద్ధపడినప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. దేవిక ఆలాగే చేసింది. ధైర్యంగా ముందు అడుగు వేసింది. బధిరులలో ఎంతోమందికి నృత్యం నేర్చుకోవాలనే ఆసక్తి ఉండవచ్చు. అయితే ప్రతికూల ఆలోచనలు వారిని వెనక్కి లాగవచ్చు. అలాంటి వారిని నృత్యకారులుగా తయారుచేయడానికి దేవిక సృష్టించిన నృత్యశైలి ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. క్రాస్వోవర్ నృత్యప్రదర్శన చూస్తున్నప్పుడు వారి ముఖాల్లో కనిపించిన వెలుగు నాకు సంతోషాన్ని, ధైర్యాన్ని ఇచ్చాయి. మనం వెదకాలేగాని దారులు ఎన్నో ఉన్నాయి. ‘క్రాస్వోవర్’ ద్వారా నాకు ఒక కొత్త దారి దొరికింది. – మెథిల్ దేవిక -
విద్యార్థిని హత్య కేసులో 143 రోజుల్లోనే తీర్పు
కాకినాడ లీగల్: ఓ విద్యార్థిని పాశవికంగా హత్య చేసిన కేసులో ప్రేమోన్మాదికి కేవలం 143 రోజుల్లోనే శిక్ష పడింది. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ కాకినాడ మూడో అదనపు జిల్లా సెషన్స్ జడ్జి పి.కమలాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. రాష్ట్రంలో కేసులు త్వరితగతిన విచారణ జరిగి, నిందితులకు శిక్ష పడాలని, బాధితులకు సత్వర న్యాయం జరగాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ ఇందుకు దోహదం చేసింది. గత ఏడాది జరిగిన హత్య కేసు విచారణ వేగంగా జరిగి, నిందితుడికి కఠిన శిక్ష పడింది. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బాలవరానికి చెందిన గుబ్బల వెంకట సూర్యనారాయణ కూరాడలో మేనమామ ఇంట్లో ఉండేవాడు. అదే గ్రామంలో కె.దేవిక తన అమ్మమ్మ ఇంట్లో ఉంటూ కాకినాడ పీఆర్ కళాశాలలో డిగ్రీ చదువుకునేది. దేవికను ప్రేమించానంటూ సూర్యనారాయణ వెంటపడేవాడు. సుమారు ఏడాది పాటు వెంట పడి వేధించాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. ఇతని వేధింపులు భరించలేక దేవిక విషయాన్ని బంధువులకు చెప్పింది. పెద్దలు యువకుడ్ని మందలించి పంపించేశారు. అయినా అతడు తన చేష్టలు ఆపలేదు. గతేడాది అక్టోబర్ 8న కాండ్రేగుల – కూరాడ మధ్య కాపు కాశాడు. యాక్టివా మోపెడ్‌పై వస్తున్న దేవికను ఆపి నడిరోడ్డుపై కత్తితో 18 సార్లు కిరాతకంగా పొడిచాడు. ఆమె అక్కడకక్కడే చనిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాకినాడ మూడో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో కేసు విచారణ జరిగింది. కాకినాడ రూరల్ సీఐ కె.శ్రీనివాసు త్వరితగతిన కేసు దర్యాప్తు చేశారు. సాక్ష్యాధారాలు సేకరించి 7 రోజులలోనే కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. విచారణ త్వరితగతిన జరిగింది. నేరం రుజువు కావడంతో సూర్యనారాయణకు జీవిత ఖైదు విధిస్తూ జడ్జి పి.కమలాదేవి తీర్పు చెప్పారు. కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థతో సత్ఫలితాలు విద్యార్థిని పాశవిక హత్య ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. వెంటనే మృతురాలి కుటుంబానికి సీఎం సహాయ నిధి నుంచి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. త్వరితగతిన విచారణ జరపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఎస్పీ ఎం.రవీంధ్రనాథ్‌బాబు నిరంతరం దర్యాప్తును పర్యవేక్షించారు. ఇందుకు కన్విక్షన్ బేస్డ్ ట్రయల్ కేసుల మానిటరింగ్ వ్యవస్థ చక్కగా పనిచేసింది. కేసు నమోదు చేసిన 143 రోజుల్లో విచారణ చేసి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఈ తీర్పు చెంపపెట్టు అవుతుందని పోలీసు అధికారులు వ్యాఖ్యానించారు. కేసు విచారణ విషయంలో ప్రభుత్వం బాగా స్పందించిందని, నిందితుడికి కఠిన శిక్ష పడిందని మృతురాలి తల్లి నాగమణి అన్నారు. -
వన్షజ్, దేవిక, రవీనా పసిడి పంచ్...
ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు లభించాయి. స్పెయిన్‌లో జరుగుతున్న ఈ మెగా ఈవెంట్లో పురుషుల 63.5 కేజీల విభాగంలో హరియాణా కుర్రాడు వన్షజ్... మహిళల 52 కేజీల విభాగంలో పుణే అమ్మాయి దేవిక ఘోర్పడే, 63 కేజీల విభాగంలో రవీనా పసిడి పతకాలు గెలిచారు. ఫైనల్స్‌లో వన్షజ్ 5–0తో దెముర్ కజై (జార్జియా)పై, దేవిక 5–0తో లౌరెన్ మెకీ (ఇంగ్లండ్)పై, రవీనా 4–3తో మేగన్ డెక్లెయిర్ (నెదర్లాండ్స్)పై గెలిచారు. పురుషుల 54 కేజీల ఫైనల్లో ఆశిష్ 1–4తో యుటా సకాయ్ (జపాన్) చేతిలో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. -
అమ్మ ఇక లేదు.. ప్రేమ పెళ్లి విషాదాంతం
ఆ పిల్లలకు అమ్మ చేతి ముద్ద ఇక అందదు. ఆ బిడ్డలకు అమ్మ ముద్దు మరి లేదు. కన్నతల్లుల క్షణికావేశం వారి పేగు తెంచుకుని పుట్టిన పిల్లలకు జీవితకాల శాపమైంది. కష్టాలకు తాళలేక, సమస్యలను ఎదుర్కోలేక, వేధింపులు భరించలేక ఇద్దరు అమ్మలు తమ జీవితాలను అర్ధంతరంగా ముగించారు. కానీ పిల్లలను అనాథలను చేశారు. తల్లిదండ్రుల మధ్య గొడవలకు చిన్నారులు మూల్యం చెల్లించాల్సి వస్తోంది. సాక్షి, శ్రీకాకుళం: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్ల కాపురానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు నెలలుగా వచ్చిన విభేదాలు ఆమె ప్రాణాన్ని బలికొన్నాయి. మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన చిత్తిరి గౌతమి (25) ఉదయం ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గౌతమికి చిత్తిరి సత్యనారాయణతో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. ఇద్దరూ ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏడే ళ్ల కుమార్తె తేజశ్విని, ఐదేళ్ల కుమారుడు షణ్ముఖనాయుడు ఉన్నారు. అయితే ఈ దంపతుల మధ్య రెండు నెలలుగా గొడవలు జరుగుతున్నా యి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఇంటిలో ఎవ రూ లేని సమయం చూసి గౌతమి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తర్వాత అత్త, బావ, తోడి కోడళ్లు ఉరికి వేలాడుతున్న గౌతమిని చూసి వెంటనే పొలం పనికి వెళ్లిన సత్యనారాయణకు స మాచారం అందజేశారు. గౌతమి అమ్మానాన్నలకు కూడా విషయం చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు రమణ, అప్పలసూరమ్మ ఇంటికి చేరుకొని భోరున విలపించారు. భర్త వేధింపులు భరించలేకనే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమ కుమార్తెతో తరచూ గొడవలకు దిగేవాడని, అనవసరంగా హింసించేవాడని తెలిపారు. గౌతమి ఆత్మహత్యపై స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ సామంతుల రామారావు తన సిబ్బంది, శ్రీకాకుళం క్లూస్ టీమ్‌తో గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతురాలి భర్త స త్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసు కున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని రాజాం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ రా మారావు కేసు నమోదు చేశారు. జేఆర్‌పురం సీఐ స్వామినాయుడు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అమ్మా.. లే అంటూ.. తల్లి గౌతమి మృతిచెందడం, తండ్రిని పోలీసులు తీసుకెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఆ చిన్నారులను చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. అమ్మా..లే అంటూ చిన్నారులు పిలవడం అక్కడున్న వారి చేత కంటతడి పెట్టించింది. పెట్రోల్ పోసుకుని.. టెక్కలి రూరల్, వజ్రపుకొత్తూరు: వజ్రపుకొత్తూరు మండలం పూండిలో శుక్రవారం ఓ వివాహిత తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండలం సూర్యమణిపురం గ్రామానికి చెందిన పైల దేవిక(29) అనే మహిళకు అదే గ్రామానికి చెందిన వరుసకు మామ అయిన కామేశ్వరరావుతో మూడేళ్ల కిందట వివాహం జరిగింది. ఆమెకు ఇది మూడో వివాహం. ఈ దంపతులకు ఏడాది వయసు గల పాప ఉంది. దేవికకు మరో అమ్మా యి కూడా ఉంది. కామేశ్వరరావు మర్చెంట్ నేవీలో పనిచేస్తున్నారు. ఆమె భర్తతో కలిసి పూండీలో నివాసం ఉంటున్నారు. దేవిక (ఫైల్) అయితే తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని ఆమె నిత్యం అనుమానిస్తూ ఉండేవారు. దీనిపైనే ఆ మహిళతో గొడవలు కూడా పడేవారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆమెతో గొడవకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చి తలుపులు వేసుకుని తనతో తెచ్చుకున్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు మంటలను ఆపి ఆమెను హుటాహుటిన టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పోలీసులకు సమాచారం ఇచ్చి, మెరుగైన వైద్యం కోసం ఆమెను శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించారు. ఈ ఘటనపై జూనియర్ సివిల్ జడ్జి తేజా చక్రవర్తి మల్ల బాధితురాలి నుంచి వాగ్మూలం తీసుకున్నారు. వజ్రపుకొత్తూరు పోలీసులు వివరాలు సేకరించారు. అయితే ఆమె శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ మృతి చెందారు. -
వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు..
తన ప్రేమను కాదందన్న అక్కసుతో మానవ మృగంలా మారిపోయి యువతిని దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. కత్తిలో నరికి అత్యంత దారుణంగా అమాయకురాలిని పొట్టన పెట్టుకున్నాడు. ఉన్మాదిలా మారి తమ కూతురి ప్రాణం బలిగొన్న రాక్షసుడిని ఉరి తీయాలని హతురాలి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. కాకినాడ క్రైం: ప్రేమోన్మాది గుబ్బల వెంకట సూర్యనారాయణ చేతిలో హతమైన కాదా దేవికపై జరిగిన దాడి అత్యంత పాశవికమైనదని ఫోరెన్సిక్ నిపుణులు నిర్ధారించారు. కాకినాడ జీజీహెచ్‌లో దేవిక మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి నివేదిక ప్రకారం.. దేవికను నిందితుడు కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో ఆమె ముఖం, మెడ భాగాల్లో లోతైన గాట్లు పడ్డాయి. సూర్యనారాయణ ఆమె కాలర్ బోన్లో కత్తి దింపి ఎడమ వైపునకు చీల్చేశాడు. రెండువైపులా నరకడంతో మెడలోని రక్తనాళాలు పూర్తిగా తెగిపోయాయి. దేవిక మరణానికి అదే కారణమని గుర్తించారు. విచక్షణారహితంగా కత్తితో పొడుస్తూండటంతో దేవిక రెండు చేతులూ అడ్డం పెట్టి రక్షించుకునే ప్రయత్నం చేసింది. అయితే అంతకు మించిన బలంతో అతడు కత్తితో పొడవడంతో దేవిక రెండు మోచేతుల పైభాగాల్లో లోతైన గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె ఎడమ చేతి ఎముకను సత్యనారాయణ నరికేశాడు. ఆమె రెండు భుజాలు శరీరం నుంచి వేరు పడ్డాయి. ఎడమ భుజానికి ఆధారమైన హ్యూమరస్ ఛిద్రమైంది. అక్కడి ఎముకలో సైతం కత్తి దిగింది. కత్తి నేరుగా మెడలో దించిన ఆనవాళ్లున్నాయి. దేవిక శరీరంలో మొత్తం 15 బలమైన గాయాలున్నట్టు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు. ఆ రాక్షసుడిని ఉరి తీయాలి చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం చేసుకుంటుందనుకుంటే ఇలా దారుణంగా హత్యకు గురవుతుందని ఊహించలేదని దేవిక కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తమ వద్దే పెరిగి, చదువుకుంటోందని, ఉద్యోగం వస్తే కళ్లలో పెట్టుకుని చూసుకుంటుందని అనుకుంటే దేవుడు అన్యాయం చేశాడంటూ దేవిక అమ్మమ్మ బోరున రోదించింది. అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటుందని హైదరాబాద్‌లో తాము నిశ్చింతగా ఉంటే కిరాతకుడి చేతిలో తమ కూతురు బలైపోయిందని దేవిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమార్తెని హత్య చేసిన రాక్షసుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. (క్లిక్: ప్రేమోన్మాది ఘాతుకం.. పట్టపగలే నడిరోడ్డుపై కిరాతకం) దేవిక కుటుంబానికి ప్రభుత్వం అండ: మంత్రి చెల్లుబోయిన వేణు రామచంద్రపురం/కె.గంగవరం: ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన కాదా దేవిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడి ఆదుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కరప మండలం కూరాడలో హత్యకు గురైన కాదా దేవిక తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను మంత్రి వేణు కె.గంగవరంలో ఆదివారం సాయంత్రం పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ఆటవికంగా హత్యకు పాల్పడిన హంతకుడిపై ప్రభుత్వం తర్వతగతిన విచారణ పూర్తి చేసి కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు ప్రస్తావించకూడదని, ప్రతి ఒక్కరూ ఇలాంటి దుశ్చర్యలను ఖండించాలన్నారు. ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, కె.గంగవరం మండల విప్ కొప్పిశెట్టి లక్ష్మణ్, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు నరాల ఏడుకొండలు, వైఎస్సార్సీపీ నాయకుడు పంపన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
'అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నటిగా అవకాశం వచ్చింది'
కలలు కన్న జీవితం కోసం క్రమశిక్షణను ఆలంబనగా మలచుకుంది.. స్క్రీన్ ట్రావెల్ స్టార్ట్ చేసింది.. ప్రతిభావంతురాలిగా పేరు తెచ్చుకుంది.. సహాయ దర్శకురాలు, నటి దేవిక వత్స.. ♦ ముంబైలో పుట్టి పెరిగింది. తండ్రి ఆర్మీ ఆఫీసర్ కావడంతో స్కూలింగ్ మొత్తం దేశంలోని వివిధ ప్రాంతాల్లో గడిచింది. ♦ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి, మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ♦ మొదట పలు వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. తర్వాత యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ♦ 2017లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ‘గబ్రూ: హిప్ హాప్ కే షెహజాదే’ తో వెబ్‌దునియాలోకి ఎంటర్ అయింది. అది మంచి విజయం సాధించడంతో వరుసగా ‘ద గుడ్ వైబ్స్’, ‘ఇట్స్ నాట్ దట్ సింపుల్’, ‘చీజ్ కేక్’ సిరీస్‌లలో నటించింది. ♦ వెండితెర మీద కనిపించాలన్నది ఆమె ఆశ. అయితే తొలుత ఆఫ్ స్క్రీన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవకాశం దొరకింది.. ‘హమారీ అధూరీ కహానీ’ సినిమాకు. ఆ సమయంలోనే ‘దమ్ లగా కే హైశా’ సినిమాలోని ఓ పాత్రకు ఎంపికైంది. ♦ ఆ సినిమా నుంచి నటిగా అవకాశాలు క్యూ కట్టాయి. తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది. ♦ యాక్టర్ల కంటే టెక్నీషియన్ల కష్టమే ఎక్కువ. వారికి ప్రతి ఒక్కరూ గౌరవం ఇవ్వాలి. ఇది నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసినందుకు చెప్పడం లేదు. యాడ్ షూట్స్ చేసే సమయంలోనే వారి కష్టం నాకు తెలిసింది. అందుకే కొన్ని రోజులు టెక్నీషియన్‌గా పనిచేశా. – దేవికా వత్స. చదవండి : 'ఆ హీరో ఫిజిక్ ది బెస్ట్..రష్మికను బలవంతంగా గెంటేస్తా' హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలి..హిందూ సంఘాల ఫిర్యాదు -
నటుడికి విడాకులివ్వనున్న రెండో భార్య!
Methil Devika Divorce with Mukesh: పాపులర్ మలయాళ జంట ముఖేశ్, మెతిల్ దేవిక విడాకులు తీసుకోనున్నారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు డ్యాన్సర్ దేవిక మీడియాముఖంగా వెల్లడించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ముఖేశ్ మంచివాడే కానీ మంచి భర్త కాలేకపోయాడని తెలిపింది. పెళ్లై ఎనిమిదేళ్లవుతున్నా అతడిని ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నానని పేర్కొంది. అందుకే అతడితో తెగదెంపులు చేసుకోవడానికి సిద్ధమయ్యానని స్పష్టం చేసింది. వ్యక్తిగత కారణాల వల్ల నేను, నా భర్త నుంచి విడాకుల కోసం దరఖాస్తు చేశాను. ఈ విషయంలో ముఖేశ్ అభిప్రాయమేంటో నాకు తెలియదు. కానీ ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఎంతో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని రాద్దాంతం చేయకండి. నేను అతడి పరువు తీయాలనుకోవడం లేదు. రాజకీయ నాయకుడిగా, నటుడిగా అతడి వ్యక్తిగత విషయాలను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అతడి మీద వస్తున్న రాజకీయ ఆరోపణల గురించి స్పందించేంత అవసరం, ఆసక్తి నాకు ఏమాత్రం లేదు. అతడి మీద గృహహింస ఆరోపణలు కూడా చేయడం లేదు. అలా అని నేనేమీ ఆవేశంలో, కోపంతో అతడితో విడిపోవడం లేదు' అని చెప్పుకొచ్చింది. అయితే ఈ విడాకులకు సంబంధించి తనకు ఎలాంటి లీగల్ నోటీసులు అందలేదని ముఖేశ్ పేర్కొన్నాడు. కాగా నటుడు, నాయకుడైన ముఖేశ్‌కు గతంలో నటి సరితతో పెళ్లైంది. అయితే ముఖేశ్ తాగుబోతు అని, పలువురు మహిళలతో అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలతో సరిత 2011లో భర్తకు విడాకులు ఇచ్చింది. దీని తర్వాత 2013లో ముఖేశ్ డ్యాన్సర్ దేవికను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఎనిమిదేళ్లుగా ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారనుకున్న ఈ జంట కూడా ఇప్పుడు విడాకులకు సిద్ధమవుతుండటంతో అభిమానులు షాకవుతున్నారు. -
చట్ట పరిమితులు దాటిన ‘న్యాయం’
తనపై సంవత్సరాలుగా అత్యాచారం సాగిస్తూ వచ్చిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలికి కాస్త ఉపశమనం కలుగుతుందని చీఫ్ జస్టిస్ భావించారా లేక జైలు శిక్షను అనుభవించడం కంటే పెళ్లి అనేది మరింత శిక్షగా ఆయన భావించారా లేక పెళ్లి ద్వారా శిక్షను తగ్గించుకోవచ్చని బాధితుడికి సూచించారా అనేది స్పష్టం కావడం లేదు. ఒక మహిళ శరీరంపై ఆమెకున్న హక్కును భగ్నపర్చిన వ్యక్తితో జీవితకాలం సంబంధంలో ఉండాలని, అందుకోసం చట్టపరంగా కూడా అతగాడికి పవిత్రతను చేకూరుస్తామని అర్థం వచ్చేలా ప్రధాన న్యాయమూర్తి సూచించడం నైతికంగా అత్యంత అసహ్యకరమైనదిగానే భావించాల్సి ఉంటుంది. సాక్షాత్తూ అత్యున్నత రాజ్యాంగ ధర్మాసనమే అత్యాచార నేర చర్యను చట్టవిరుద్ధంగా మాఫీ చేయవచ్చని, రాజీ కుదుర్చవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు, తాము అత్యాచారం చేసిన మహిళలను పెళ్లి చేసుకుంటే చాలు తమకు క్షమాభిక్ష లభిస్తుందనే ప్రమాదకర సంకేతాలు లైంగిక నేరస్తులకు అందటం ఖాయం. మైనారిటీ తీరని బాలికపై అత్యాచారం చేసిన సీరియల్ రేపిస్టుకు ఆమెను పెళ్లాడతావా అంటూ సాక్షాత్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే ప్రతిపాదించిన క్షణంలో మన దేశంలో కొనసాగుతున్న పితృస్వామిక దురభిప్రాయాలు, స్త్రీ ద్వేషం పూర్తి స్థాయిలో ప్రదర్శితమయ్యాయనే చెప్పాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించింది ఎవరినో కాదు.. లైంగిక దాడుల నుంచి పిల్లల పరిరక్షణ చట్టం 2012, భారతీయ శిక్షా స్మృతిలోని 376, 417, 506 సెక్షన్ల కింద అత్యాచారం, నేరపూరితంగా బెదిరించడం వంటి ఆరోపణలపై కేసులున్న నిందితుడికి సుప్రీం చీఫ్ జస్టిస్ ఈ విధమైన ప్రతిపాదన చేశారు. తన సమీప బంధువైన బాధితురాలి ఇంట్లోకి ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు ప్రవేశించిన నేరస్థుడు ఆమె కాళ్లు చేతులను కట్టివేసి తర్వాత అత్యాచారానికి ఒడిగట్టాడు. అప్పుడు ఆ అమ్మాయి 9వ తరగతి చదువుతూ ఉండింది. ఆమె 12వ తరగతిలోకి వచ్చేంతవరకు ఆమెను అతగాడు పదేపదే అత్యాచారం చేస్తూ వచ్చాడు. తనకు, తన కుటుంబానికి హాని కలిగిస్తానని బెది రించి మరీ ఈ పనికి పాల్పడ్డాడు. పైగా ఈ ముష్కరుడు మోటార్ సైకిల్లో పెట్రోల్ క్యాన్ పెట్టుకుని మరీ ఆమెను అనుసరిస్తూ సజీవ దహనం చేస్తానంటూ బెదిరిస్తూ వచ్చాడు. ఈ భయానక నేరం ఆ అమ్మాయి ఆత్మహత్యాయత్నం చేసినప్పుడు గానీ ఆమె తల్లిదండ్రులకు తెలీలేదు. చదువులేని ఆ బాధితురాలి తల్లి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని వెళితే, ఆమె నుంచి ఫిర్యాదు తీసుకోవడానికి బదులుగా ఆమె కుమార్తెకు, నిందితుడికి మధ్య పరస్పర సమ్మతితోనే శారీరక సంబంధం పెట్టుకున్నట్లు స్టాంప్ పేపర్‌పై కన్నతల్లి చేత సంతకం పెట్టించుకున్నారు. పైగా ఆ అమ్మాయికి మైనారిటీ తీరాక తన కొడుకు ఆమెను పెళ్లాడతాడని నిందితుడి తల్లి హామీ ఇచ్చింది. కానీ హామీని నింది తుడు భంగపరిచిన తర్వాతే పోక్సో చట్టం కింద అతగాడిపై ఫిర్యాదు నమోదు చేశారు. అదనపు సెషన్స్ జడ్జి మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్‌ని బాంబే హైకోర్టు కొట్టివేశాక నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లాడు. సెషన్స్ జడ్జి అహేతుకంగా, యథేచ్ఛగా, చంచలత్వంతో నిందితుడికి బెయిల్ మంజూరు చేశారని బాంబే హైకోర్టు పేర్కొనడమే కాకుండా, న్యాయవ్యవస్థ తనపై పెట్టిన బాధ్యతను విస్మరించారంటూ సెషన్స్ జడ్జిని అభిశంసించింది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యంలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సమక్షంలో నిందితుడితో చీఫ్ జస్టిస్ చేసిన సంభాషణను పరిశీలించవలసి ఉంటుంది. ఈ కేసులో నిందితుడి తరపు లాయర్‌తో మాట్లాడిన చీఫ్ జస్టిస్ ‘బాధితురాలిని పెళ్లాడాలనుకుంటే మేము నీకు సాయం చేస్తాం. అలా కాకుంటే నీ ఉద్యోగాన్ని పోగొట్టుకుని జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే నీవు ఆ అమ్మాయిని వేధించావు, అత్యాచారం చేశావు’ అని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఆమెపై అత్యాచారం చేయడానికి ముందు నీవొక ప్రభుత్వ ఉద్యోగివి అనే విషయం ఆలోచించాల్సి ఉండిందని కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. దానికి నిందితుడు స్పందిస్తూ, ప్రారంభంలోనే ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ ఆమె వ్యతిరేకించిందని, ఇప్పుడు తనకు పెళ్లయింది కాబట్టి ఆమెను పెళ్లాడలేనని సమాధానమిచ్చాడు. అప్పుడు సుప్రీంకోర్టు నిందితుడు తన పిటిషన్ ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తూ, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు హైకోర్టు అతడిపై విధించిన అరెస్టు ఆదేశంపై నాలుగువారాల పాటు స్టే విధించింది. పెళ్లి-సాంత్వన, శిక్ష, మినహాయింపు తనపై సంవత్సరాలుగా అత్యాచారం సల్పిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలికి కాస్త ఉపశమనం కలుగుతుందని చీఫ్ జస్టిస్ భావించారా లేక జైలు శిక్షను అనుభవించడం కంటే పెళ్లి అనేది మరింత శిక్షగా ఆయన భావించారా లేక పెళ్లి ద్వారా శిక్షను తగ్గించుకోవచ్చని బాధితుడికి సూచించారా అనేది స్పష్టం కావడం లేదు. ఒక మహిళ శరీరంపై ఆమెకున్న హక్కును భగ్నపర్చడమే కాకుండా, ఆ వ్యక్తితో జీవితకాలం సంబంధంలో ఉండాలని, అందుకోసం చట్టపరంగా కూడా అతగాడికి పవిత్రతను చేకూరుస్తామని అర్థం వచ్చేలా రాజ్యాంగంపై, లైంగిక సమానత్వం అనే మానవ విలువపై విశ్వాసం ఉంచుకున్న ప్రధాన న్యాయమూర్తి సూచించడం నైతికంగా అసహ్యకరమైనది. తనపై అత్యాచారం చేసిన వ్యక్తిని పెళ్లాడటం ద్వారా బాధితురాలు అంతకాలం అనుభవించిన బాధ, మానసిక అఘాతం, అవమానం, ఆగ్రహం వంటివన్ని మంత్రించినట్లుగా మాయమైపోతాయని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ భావిస్తున్నారా? నిందితుడి తల్లి తన కుమారుడితో పెళ్లికి ఒప్పుకోవాలని బాధితురాలి తల్లికి చేసిన ప్రతిపాదనను ఆమె ఆమోదించాల్సి వచ్చింది అంటేనే దాన్ని మహిళను నియంత్రిం చడానికి పితృస్వామిక ఆధిపత్యపు విషాద వ్యక్తీకరణగానే చూడాల్సి ఉంటుంది. దెబ్బతిన్న మహిళను లొంగదీయడానికి పరువు, అవమానాలను మన సమాజం నేటికీ ఆయుధాలుగా ఉపయోగి స్తోంది. ఈ కేసులో బాధితురాలు ఆనాటికి మైనర్‌గా ఉంటున్నందున ఆమె సమ్మతి తీసుకోవడం అనేది సమస్యే కాదు. కన్నకూతురిని బలాత్కరించిన వ్యక్తితో పెళ్లికి కన్నతల్లి ఆమోదం తెలపడం మన దేశ అమ్మాయిలపై తల్లిదండ్రులకు ఉన్న ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తుంది. మహిళ శరీరంపై అధికారం ఎవరిది? తనపై అత్యాచారం చేసిన నిందితుడిని పెళ్లాడాల్సిందిగా బాధితురాలిని తాను బలవంతపెట్టలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. బాధితురాలి మానసిక స్థితిని అంచనా వేయడానికి ముందే నిందితుడికి ఇలాంటి ప్రతిపాదన చేయడమే వింత. ఒకవేళ నిందితుడు బాధితురాలిని పెళ్లాడటానికి అంగీకరించి ఉంటే, తర్వాతైనా బాధితురాలి అభిప్రాయాలను, సమ్మతిని న్యాయస్థానం తెలుసుకుని ఉండేదా? తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తితో సంబంధంలోకి వెళ్లడం అనే భావననే బాధితురాలు సహించలేదని, తిరగబడుతుందని న్యాయమూర్తులకు తెలీదా? అందులోనూ శారీరకంగా, భావోద్వేగపరంగా తనపై దాడిచేసిన వ్యక్తికి సంబంధించిన విషయం ఇది. బాధితురాలికి రేపిస్టుతోనే పెళ్లి చేయడం ద్వారా ఆమెకు కనీస ప్రమాణాలతో కూడిన పవిత్రతను కలిపించడం అంటే తనపై లైంగిక దాడిచేసిన వ్యక్తితో జీవితకాల సంబంధాన్ని వ్యవస్థాగతంగా ఏర్పర్చడంలోని భయానకమైన స్థితిని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం కాదా? దెబ్బతిన్న మహిళలకు ఉత్తమ ప్రయోజనాలు కలిగించడానికే తాను పనిచేస్తున్నానని ఉన్నత న్యాయస్థానం నిజంగా నమ్ముతోందా? దీన్ని మరోలా చూద్దాం. నీ శరీరంపై నీ హక్కును ఉల్లంఘించారు. కానీ నీ సొంత ప్రయోజనం కోసమే నీ శరీరాన్ని నీ సమ్మతి లేకుండా పాశవికంగా, బలవంతంగా తాకి బలాత్కరించిన వ్యక్తే నీ గౌరవాన్ని పునరుద్ధరించగలడని నేను హామీ ఇవ్వగలను, నిన్ను తన భార్యగా స్వీకరించి దయదల్చడం ద్వారా నిందితుడు నీకు కలిగిన నష్టాన్ని పూడ్చగలడు అనే అంశాన్ని న్యాయస్థానం ఈ కేసులో సూచిస్తోందా? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రకటనపై తీవ్ర ఆగ్రహం ప్రకటించిన వేలాదిమంది లైంగిక సమానత్వ ఉద్యమకారులు చీఫ్ జస్టిస్ బాబ్డేకి బహిరంగ లేఖ రాస్తూ తన ప్రకటనను ఉపసంహరించుకోవాలని, దేశంలోని మహిళలందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని, అంతేకాకుండా ఆయన వెంటనే తన పదవినుంచి దిగిపోవాలని కూడా డిమాండ్ చేశారు. న్యాయస్థానాల్లో తమ విధులను నిర్వర్తిస్తున్న సమయంలో జడ్జీలు స్వేచ్ఛగా ఇలాంటి అసంబద్ధ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నప్పుడు, లైంగిక న్యాయం, సమానత్వానికి సంబంధించి రాజ్యాంగపరమైన విలువలను పాటించే, అమలు చేసే శక్తి మన న్యాయమూర్తులకు ఉందా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఎస్. దేవిక, న్యాయవాది, చెన్నై (ది వైర్ సౌజన్యంతో) -
యాంకర్ దేవిక సింగ్ గ్లామర్ ఫోటోలు
-
కసబ్‌ని గుర్తుపట్టిన దేవిక!
దేవికకు ఇరవై ఏళ్లు వచ్చాయి. పదేళ్లుగా.. అదే పేదరికం.. అవే బెదిరింపులు. కసబ్‌ని గుర్తుపట్టిన అమ్మాయి దేవిక! కాలేజ్‌కి కూడా వచ్చేసింది. ‘కసబ్ కీ బేటీ’ అనేవాళ్లు స్కూల్లో. దేశమాత బిడ్డ ఎప్పటికౌతుంది? ముంబై సెంట్రల్‌లోని ఆర్థర్ జైల్లో ఉన్నాడు కసబ్. అక్కడికి తీసుకొచ్చారు దేవికను. తొమ్మిదేళ్ల అమ్మాయి. చేతికర్రల మీద నడుస్తూ వచ్చింది. పక్కన తండ్రి ఉన్నాడు. జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కోర్టులో జడ్జి కూర్చొని ఉన్నారు. దేవిక కుడి కాలుకు ఆపరేషన్ జరిగి అప్పటికి ఆర్నెల్లు కావస్తోంది. ఆ చిన్నారి కాలి నుంచి బులెట్‌ను తీశారు డాక్టర్లు. ఆ బులెట్ కసబ్ పేల్చిందే! అయితే పేల్చింది కసబేనా? అది గుర్తించడానికి దేవికను కోర్టుకు పిలిపించారు. కసబ్‌ను, మరో ఇద్దర్ని పక్కపక్కన ఓ మూల కూర్చోబెట్టారు. దేవిక ను బోనులోకి రప్పించారు. భగవద్గీతను ఆమె చేతిలో పెట్టారు. ఆమె చేత హిందీలో ప్రమాణం చేయించారు. ‘‘నువ్వు చెప్పిన మాటలకు నీకు అర్థం తెలుసా?’’.. అడిగారు జడ్జి. ‘‘తెలుసు. అబద్ధం చెప్పకూడదు. దేవుడి మీద ఒట్టు వేశాను’’ అంది దేవిక. ‘‘మంచిది. ఆ ముగ్గురిలో నీపై తుపాకీతో కాల్చినవారెవరైనా ఉన్నారా?’’.. జడ్జి. వాళ్లను నిశితంగా చూసింది దేవిక. కసబ్ వైపు వేలెత్తి చూపింది. ఆ కొద్దిసేపటికే టీవీలలో బ్రేకింగ్ న్యూస్. కసబ్ ఫొటో, పక్కనే చేతికర్రలతో ఉన్న దేవిక ఫొటో. ‘కసబ్‌ను గుర్తుపట్టిన చిన్నారి’. ‘కసబ్‌కు బిగిసిన ఉచ్చు’. మర్నాడు ముంబైలోని పేపర్లన్నీ దేవిక గురించి రాశాయి. ఆమె జ్ఞాపకశక్తిని, ధైర్యాన్ని ముంబై పౌరులు ప్రశంసించారు. కసబ్, అతడి సహచరుడు కలిసి ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో 58 మంది చనిపోగా, బులెట్ దెబ్బ తిని కూడా అదృష్టవశాత్తూ బతికిన ఒక ప్రత్యక్ష సాక్షి దేవిక. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇరవై ఏళ్లు! అయితే పదకొండేళ్ల క్రితం దేవిక కుటుంబం ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది. అదే వెస్ట్ బాంద్రాలోని మురికివాడలో, అదే పేదరికంలో, అదే బెదిరింపులతో ఆమె జీవితం నడుస్తోంది. అసలు.. సాక్ష్యం కోసం ఆనాడు తన కూతుర్ని కోర్టుకు పంపననే అన్నాడు నట్వర్లాల్. లాయర్ ఆయన్ని ఒప్పించాడు. ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని, ప్రభుత్వం రక్షణ కల్పిస్తుందనీ చెప్పాడు. దేవిక సాక్ష్యం చెప్పింది కానీ, ఆయన చెప్పినవేవీ జరగలేదు. కుటుంబ పోషణ కోసం రోజులో నాలుగు పనులు చేస్తాడు నట్వార్లాల్. అన్నీ ఏ రోజుకు ఆ రోజు ఇంత సంపాదించుకునే పనులే. అతడి భార్య ఏనాడో చనిపోయింది. పెద్ద కొడుకు భరత్ పుణెలో ఉంటాడు. చిన్న కొడుకు జయేష్, అతడికన్నా చిన్నదైన దేవిక ఉంటారు ఇంట్లో. భరత్‌ను చూడ్డానికి పుణె వెళుతున్నప్పుడే.. ఛత్రపతి శివాజీ టెర్మినస్ (రైల్వేస్టేషన్) లో 2008 నవంబర్ 26 రాత్రి ఉగ్రదాడి జరిగింది. ఆ సమయం లో జయేష్ బాత్రూమ్లో ఉన్నాడు. నట్వర్లాల్, దేవిక ప్లాట్‌ఫారమ్ మీద ఉన్నారు. హటాత్తుగా పేలుడు చప్పుళ్లు మొదలయ్యాయి. దేవిక అటు వైపు చూసింది. తుపాకీ బులెట్ వచ్చి ఆమెకు తగిలింది. స్పృహలోకి వచ్చి కళ్లు తెరిచేటప్పటికి ఆసుపత్రిలో ఉంది. కసబ్‌ను ఉరి తీసేనాటికి దేవికకు పదమూడేళ్లు. ‘‘పెద్దయ్యాక ఐపీఎస్ ఆఫీసర్‌ను అయి ఉగ్రవాదుల పని పడతా..’’ అంటుండేది దేవిక. అయితే కసబ్‌ను ఆమె గుర్తు పట్టిందని తెలిశాక ఒక్క స్కూలు కూడా ఆమెకు సీటు ఇవ్వలేదు! భయం. ఆ పిల్ల వల్ల తమకేదైనా ముప్పు వస్తుందేమోనని. దేవిక ఇప్పుడు డిగ్రీలోకి వచ్చింది. పుణె నుంచి పెద్దన్న ముంబైకి ఏనాడో తిరిగి వచ్చేశాడు. చిన్నన్న, తండ్రి అంతా ఒక చిన్న గది లాంటి ఇంట్లో నెట్టుకొస్తున్నారు. దేవిక అన్నలిద్దరికీ తండ్రి లాంటి సంపాదనే. ఏ రోజుకు ఆ రోజు పని వెతుక్కోవడం. దేవిక సాక్ష్యం చెప్పిన రోజు నుంచే బంధువులు వీరిని చేరదీయడం మానేశారు. అప్పుడప్పుడూ ఆ ఇంటికి కసబ్ ఆత్మ మాట్లాడినట్లుగా ఆగంతకులెవరో ఫోన్ చేసి బెదిరిస్తుంటారు. కాలేజ్‌కి వెళ్లి వచ్చే దారిలో కొన్నిసార్లు దేవిక ఛత్రపతి శివాజీ టెర్మినస్‌లో తనకు బులెట్ దెబ్బ తగిలి పడిపోయిన చోట కాసేపు నిలబడి వస్తుంటుంది. బతికే ఉన్నానని తనకు తాను సమాధానం చెప్పుకోడానికేమో! మొన్న సోమవారం కాంగ్రెస్ ఎమ్మెల్యే జీషన్ బాబా సిద్ధిక్ దేవిక ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం అందించారు. చెక్కు చేతికి ఇచ్చారు. ఆ కుటుంబానికి సొంత గూడును, భద్రతను కల్పించమని మహారాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి కూడా చేశారు. కాలికి ఆపరేషన్ అయ్యి, దేవిక తిరిగి స్కూల్‌కి వెళ్లినప్పుడు ఆమె పక్కన ఎవ్వరూ కూర్చోలేదు. టీచర్లు కూడా ముభావంగా ఉన్నారు. పిల్లలంతా ఆమెను ‘కసబ్ కీ బేటీ’ అనడంతో ఆమెను ఆ స్కూలు మాన్పించి వేరే స్కూళ్లు వెతికాడు ఆమె తండ్రి. పిల్లలు వాళ్లు. ఏమైనా అంటారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దవాళ్లకు ఏమైంది? భరతమాత పుత్రికగా దేవికను ఎందుకు గుర్తించలేక పోతున్నారు?! దేవిక : తొమ్మిదేళ్ల వయసులో కసబ్‌ని గుర్తుపట్టడానికి కోర్టుకు వెళుతున్నప్పటి చిత్రం. -
సోషల్ మీడియాలో‘జస్టిస్ ఫర్.. పోస్టులు
కొత్తగూడెంఅర్బన్: రైల్వే పట్టాలపై ఒంటిపై అరకొర దుస్తులతో.. శరీరమంతా గాయాలతో పడి ఉన్న మృతదేహం. పట్టాలపై పడి ఉన్న యువతిది ఆత్మహత్యనా.. లేక ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారా.. ? ఇదే ఇప్పుడు భద్రాద్రి జిల్లా ప్రజల్లో నెలకొన్న సందేహం. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం త్రీఇంక్లైన్ పంచాయతీ బేరియం తండా సమీపంలోని గూడ్స్ రైల్వేట్రాక్‌పై బుధవారం తెల్లవారుజామున ఓ యువతి (17) మృతదేహం పడి ఉంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు అటుగా వెళ్లిన కొందరికి ఒంటిపై తీవ్ర గాయాలతో, దుస్తులు లేకుండా కన్పించింది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె ఎవరు అనేదానిపై టూటౌన్ పోలీసులు విచారణ జరపగా కొత్తగూడెంలోని గంగబిషన్ బస్తీకి చెందిన యువతిగా గుర్తించారు. రైల్వే పట్టాలపై మృతదేహం లభించడంతో ఆ కేసును పోలీసులు రైల్వే జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ మృతిపై స్థానికులు, జిల్లా ప్రజ లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గంగబిషన్బస్తీకి చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు కూతుళ్లు. అందులో ఒకరు ఈ యువతి (17). మృతదేహం లభించడానికి ముందురోజు అర్ధరాత్రి ఆమె కన్పించడం లేదంటూ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. మృతిపై అనుమానాలు ఉండటంతో పోస్టుమార్టం కూడా రెండుసార్లు నిర్వహించడం గమనార్హం.(సెల్ఫీ వీడియో తీసి యువకుడు ఆత్మహత్య ) ‘జస్టిస్ ఫర్.. ’ అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్ మృతిపై అనుమానాలు.. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యువతి మృతి చెందడానికి ముందురోజు ఆమె ఇంట్లోకి అదే ప్రాంతానికి చెందిన సందీప్ అనే యువకుడు గోడదూకి వెళ్లాడు. ఇది చూసిన ఆమె తల్లిదండ్రులు సందీప్‌ను పట్టుకుని, అతని తల్లిదండ్రుల వద్దకు తీసుకువెళ్లి మందలించారు. అయితే వారు తిరిగి ఇంటికి వచ్చేసరికి సదరు యువతి కన్పించలేదు. దీంతో వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ తెల్లవారుజామున రైల్వే పట్టాలపై మృతదేహం కన్పించిందని స్థానికుల ద్వారా తెలుసుకున్న వారు వెళ్లి చూసి తమ కూతురేనని నిర్ధారించారు. ఇదిలా ఉండగా మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడు తన కోసం ఇంట్లోకి గోడదూకి వెళ్లడంతో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుందా..? లేక ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారా అని అను మానం వ్యక్తమవుతోంది. ఒకవేళ ఆత్మహత్య చేసుకునేందుకే రైల్వే పట్టాలపైకి వెళ్తే.. తన ఇంటికి సుమారు నాలుగైదు కిలో మీటర్ల దూరంలో ఉన్న బేరియంతండా వరకు ఎందుకు వెళ్లినట్లు అని సందేహిస్తున్నారు. శరీరంపై ఉన్న గాయాలు, ఒంటిపై దుస్తులు కొద్దిగానే ఉండటంతో ఆత్మహత్య చేసుకునే క్రమంలో రైలు ఢీకొన్నప్పుడు కొద్దిదూరం కొట్టుకుని పోయిన క్రమంలో అలా జరిగి ఉండవచ్చునని కొందరు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో‘జస్టిస్ ఫర్.. ’ పోస్టులు ఇదిలా ఉండగా యువతిని అత్యాచారం చేసి హత్య చేశారని, న్యాయం చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా ‘జస్టిస్ ఫర్..’ పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆమె ఫైల్ ఫొటోలతో పాటు, రైల్వే పట్టాలపై మృతదేహం పడి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.. మృతి సంఘటనపై పోలీసులు, రైల్వే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. గత మూడు రోజులుగా ఐపీఎస్ అధికారి వినీత్ ఆధ్వర్యంలో రైల్వే జీఆర్పీ, టూ టౌన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అసలు అది ఆత్మహత్యనా, లేక అత్యాచారం చేసి హత్య చేశారా అనే విషయాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. త్వరలోనే బయటపెడతామని పోలీసులు చెప్తున్నారు. ఘటన జరిగిన రోజు సందీప్ కుటుంబసభ్యులతో సహా ఇంటి నుంచి వెళ్లిపోగా, ప్రస్తుతం ఆ యువకుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. -
ప్రియా సెంచరీ వృథా
బ్రిస్బేన్: తొలి వన్డేలో భారీ విజయం సాధించిన భారత మహిళల ‘ఎ’ జట్టు రెండో వన్డేలో మాత్రం తడబడింది. ఆస్ట్రేలియా ‘ఎ’తో మూడు అనధికారిక వన్డేల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 81 పరుగుల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ‘ఎ’ 50 ఓవర్లలో 5 వికెట్లకు 315 పరుగులు చేసింది. జార్జియా రెడ్మేన్ (128 బంతుల్లో 113; 10 ఫోర్లు, సిక్స్), ఎరిన్ అలెగ్జాండ్రా బర్న్స్ (59 బంతుల్లో 107; 13 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. భారత ‘ఎ’ బౌలర్లలో దేవిక వైద్యకు రెండు వికెట్లు లభించాయి. 316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ‘ఎ’ 44.1 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు ప్రియా పూనియా (127 బంతుల్లో 112; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు), షెఫాలీ వర్మ (36 బంతుల్లో 46; 5 ఫోర్లు, సిక్స్) తొలి వికెట్‌కు 17 ఓవర్లలో 98 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అయితే షెఫాలీ అవుటయ్యాక... ప్రియా సెంచరీ పూర్తి చేసుకోగా... మిగతా వారు క్రీజులో నిలదొక్కుకోవడంలో విఫలమయ్యారు. హేమలత, అరుంధతి రెడ్డి, అనూజా పాటిల్, తనూజ కన్వర్ ఖాతా తెరవకుండానే అవుటయ్యారు. ఫలితంగా భారత ‘ఎ’ మహిళలకు ఓటమి తప్పలేదు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. చివరిదైన మూడో వన్డే సోమవారం జరుగుతుంది. -
‘కసబ్‌కీ బేటీ’ అన్నారు!
దశాబ్దం క్రితం జరిగిన 26/11 ముంబై దాడులకు ప్రత్యక్ష సాక్షి ఆరేళ్ల దేవిక. ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్(సీఎస్టీ)లో అమాయకులను పొట్టనబెట్టుకున్న లష్కరే ఉగ్రవాది కసబ్‌ను పోలీసులు పట్టుకున్నాక అతడిని పోలీసు పరేడ్‌లో గుర్తుపట్టిన అత్యంత చిన్న వయసు ప్రత్యక్ష సాక్షి ఈమె. ఉగ్రవాదిని గుర్తించడంలో సాయంచేసినందుకు ఆ కుటుంబం ఎదుర్కొన్న చేదు అనుభవం ఒకటైతే, ఆ చిన్ని మనసును నొప్పించిన ఘటనలెన్నో. 2008 నవంబర్ 26న ఉగ్రబుల్లెట్ల నుంచి దేవిక త్రుటిలో తప్పించుకుంది. కసబ్‌ని గుర్తుపట్టి, అతడికి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చేందుకు నాడు కోర్టు మెట్లెక్కినపుడు దేవిక వయసు తొమ్మిదేళ్లు. ఘటన జరిగినపుడు ఆమె వయసు కేవలం ఆరేళ్లు. ‘నా కుడి కాలుని షూట్ చేశారు’ అంటూ ఆనాటి చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకుంది దేవిక. ప్రస్తుతం దేవిక ఇంటర్మీడియెట్ చదువుతోంది. దాడి జరిగిన రోజు పుణెలోని తన చిన్న అన్నయ్యను కలవడానికి తండ్రి నట్వర్లాల్, పెద్ద అన్నయ్యలతో కలిసి రైలెక్కడానికి ముంబై సీఎస్టీకి వచ్చింది. అదే సమయంలో రైల్వేస్టేషన్లో కసబ్ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఓ బుల్లెట్ దేవిక కుడి కాలును చీల్చుకుంటూ దూసుకెళ్లింది. రక్తసిక్తమైన దేవిక రెండు నెలల పాటు ఆసుపత్రిపాలైంది. కోలుకుని కోర్టుకెళ్లిన దేవికను ‘నిన్నెవరు కాల్చారు?’ అని ప్రశ్నించినపుడు సూటిగా కసబ్ వైపు చూపించింది. దీంతో అప్పట్లో దేవిక పేరు మార్మోగింది. దేశం యావత్తు ఆ చిన్నారి తెగువను ప్రశంసించింది. అయితే, దేవికను కష్టాలు మరోరూపంలో మొదలయ్యాయి. బడిలో తోటి విద్యార్థినులు ‘కసబ్‌కీ బేటీ’ అని పిలిచేవారు. స్నేహితులు దగ్గరికి రావడానికి భయపడ్డారు. సూటిపోటి మాటలతో వేధించారు. దీంతో దేవిక మరో పాఠశాలలో చేరాల్సి వచ్చింది. అక్కడా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. దీనికితోడు దేవిక కుటుంబానికి ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అయినా దేవిక, ఆమె కుటుంబం వెనక్కి తగ్గలేదు. దేవిక తండ్రి రోజుకూలీ. ఇంత పేదరికంలోనూ తను లక్ష్యంగా పెట్టుకున్న ఐపీఎస్ ఆశయాన్ని సాధించేందుకు దేదిక కష్టపడి చదువుతోంది. 26/11 మృతులకు సోమవారం జమ్మూలో నివాళులర్పిస్తున్న పాఠశాల విద్యార్థులు -
దేవిక రిమాండ్..
బంజారాహిల్స్: వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హత్య చేసిన ఘటనలో నిందితురాలితో పాటు ఆమె ప్రియుడిని బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వెస్ట్‌జోన్ డీసీపీ శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లా, మాచర్లకు చెందిన బానోతు జగన్, దేవిక అలియాస్ దేవి ఫిలింనగర్‌లోని జ్ఞానిజైల్‌సింగ్ నగర్ బస్తీలో నివాసం ఉంటున్నారు. గత కొంత కాలంగా దేవిక అడ్వాన్ సాఫ్ట్ ఇంటర్నేషనల్ కంపెనీలో లైజన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న తోట బెనర్జితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. దీనిని గుర్తించిన జగన్ పలుమార్లు ఆమెను మందలించాడు. అయినా తన వైఖరి మార్చుకోకపోగా, తనకు విడాకులు ఇస్తే బెనర్జీని పెళ్లి చేసుకుంటానని ప్రియుడిని ఏకంగా తన తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లింది. దీంతో వారు దేవిక, బెనర్జిలను బెదిరించి కాపురం చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయినా దేవికలో మార్పు రాకపోగా ప్రియుడిని ఏకంగా తాను అద్దెకుంటున్న ఇంటిపైనే పెంట్‌హౌజ్‌కు రప్పించింది. గత రెండు నెలలుగా భర్త కళ్లుగప్పి ఇద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో ఇటీవల జగన్ ఆమెను తీవ్రంగా మందలించాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని వారు పథకం పన్నారు. ఈ నెల 7వ తేదీ రాత్రి 2.30 ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న జగన్ మొహంపై బెనర్జీ కుక్కర్‌తో దాడి చేయగా, దేవిక అతని కళ్లల్లో పురుగుల మందు కొట్టి స్పృహతప్పేలా చేసింది. ప్రైవేట్ పార్టులను గట్టిగా ఒత్తడంతో అతను అపస్మారకస్థితికి చేరుకున్నాడు. బెనర్జి అతడి గొంతుపిసికి ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో నిద్రలేచిన జగన్ కుమారుడు ఉదయ్, కుమార్తె జ్యోతిషశ్రీని దేవిక బాత్రూమ్లోకి తోసి గడియ పెట్టింది. జగన్ మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాత బెనర్జి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం తానే హత్య చేసినట్లు నమ్మించేందుకు దేవిక గాజుపెంకులతో చేతులు కోసుకుంది. పోలీసుల సమక్షంలో తన భర్త ఆత్మహత్య చేసుకున్నట్లు మొదట బుకాయించినా, మరింత లోతుగా విచారించడంతో తానే హత్య చేశానని అంగీకరించింది. జగన్ కుమారుడు ఉదయ్ అర్ధరాత్రి గడ్డం అంకుల్ వచ్చాడని చెప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో సమీపంలోని డాక్టర్ లీలానాయక్ ఇంటి ఎదుట ఉన్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించగా ఓ యువకుడు ఇంటి ముందు బైక్ పార్క్ చేయడం, గంట తర్వాత తిరిగి వెళ్లిపోయినట్లు గుర్తించారు. ఆ ఫొటోను ఉదయ్‌కు చూపించగా అర్ధరాత్రి వచ్చింది అతనేనని తెలిపాడు. నిందితురాలి సోదరుడు కూడా గతంలో జరిగిన గొడవ విషయం చెప్పడంతో పోలీసులు స్నేహితుడి ఇంట్లో దాక్కున్న బెనర్జిని అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ప్లాన్ ఈమెదే!
పెళ్లి జరగాలంటే ముగ్గురు ఉండాలి..అమ్మాయి.. అబ్బాయి.. వెడ్డింగ్ ప్లానర్మరి మండపం? అలంకరణ? బాజా? భజంత్రీ?విందు? వినోదం? వీటన్నిటినీ ఒకప్పుడు ఇంటి పెద్దలు చూసుకునేవాళ్లు!ఇప్పుడు అందరూ గెస్ట్సే!అవును మరి.. ఇప్పుడు పెళ్లికి కావల్సింది ముగ్గురే.అబ్బాయి.. అమ్మాయి.. వెడ్డింగ్ ప్లానర్!! అనుష్కా శర్మ, విరాట్ కొహ్లీ పెళ్లి గురించి దేశమంతా చెవులు చేసుకుంది. ప్రతి ఆరాను ఆసక్తిగా విన్నది. ఆ డెస్టినేషన్ వెడ్డింగ్‌ను చూడలేకపోయినా.. ఆ థీమ్.. ఫొటోగ్రాఫ్స్ ఇంకా కళ్లల్లో మెదులుతూనే ఉంటాయి. దానికి సంబంధించి ఏ చిన్న వార్తయినా ఇప్పటికీ ఇంట్రెస్టింగే. ఆ కుతూహలాన్ని రేకెత్తించడంలో దాని గురించి నేటికీ ఇలా మాట్లాడుకోవడంలో అసలు ఆ పరిణయం అలా కన్నుల పండుగలా జరగడం వెనక ఉన్న వ్యక్తి దేవిక నరైన్. వృత్తి వెడ్డింగ్ ప్లానర్. సెలబ్రిటీ వెడ్డింగ్ ప్లానర్. సెలబ్రిటీల మ్యారెజేస్ను సక్సెస్‌ఫుల్‌గా ప్లాన్ చేస్తూ తనూ ఓ సెలెబ్రెటీగా మారిపోయింది. పెళ్లి... అమ్మాయి, అబ్బాయి కామన్ కల.. జానపద కథల్లోని హీరోలో వరుడిని.. హీరోయిన్లో వధువుని వెదుక్కుంటూ ఉంటారు.. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత పీట... నవరత్నాలే తలంబ్రాలు... అతిరథ మహారథులు అతిథులు.. పంచభూతాలు సాక్షులు.. వంటి రిచ్ ఎలిమెంట్స్, గ్రాండ్ ఎఫెక్ట్స్‌తో మూడుముళ్లు.. ఏడడుగుల వేడుక ఊహకు భారీగా బడ్జెట్ కేటాయిస్తారు. కాని నిజం చేసుకోవడానికి కాసుల కారణంతో కామ్ అయిపోతుంటారు. అలాంటి నిరాశ వద్దు.. మీ బడ్జెట్ ఎంతైనా అందులోనే ఆనుకున్నట్టుగా పెళ్లి చేసుకోండి.. ఆనందంగా ఆ క్షణాలను ఆస్వాదించండి.. అందమైన జ్ఞాపకంగా మిగుల్చుకోండి అంటోంది దేవిక నరైన్. ఆమె అనుష్కా పెళ్లి సందడితో పాపులర్ కాలేదు. అంతకుముందే దినేశ్ కార్తిక్, రాబిన్ ఉతప్పల వివాహాలనూ ప్లాన్ చేసింది. అలా సెలెబ్రిటీల దృష్టిలో పడింది. ఏం చదువుకుంది? ఎందుకీ ప్లాన్ చేస్తోంది? దేవిక నరైన్ సొంతూరు లక్నో. వాళ్లింట్లో బిజినెస్ వాసనే లేదు. ఆమె తండ్రి ప్రదీప్ నరైన్ ఉద్యోగస్తుడు. దేవికను, ఆమె తమ్ముడిని కూడా బాగా చదివించారు మంచి ఉద్యోగంలో స్థిరపడాలని. ఇంటర్ అయిపోగానే డిగ్రీ కోసం ఢిల్లీకి వచ్చింది దేవిక. లేడీ శ్రీరామ్ కాలేజ్‌లో ఇంగ్లిష్ లిటరేచర్‌లో చేరింది. చదువు అయిపోయాక జర్నలిజమ్ను కెరీర్‌గా ఎంచుకుంది. సీఎన్ఎన్ ఐబీఎన్‌లో ఇంటర్న్‌షిప్ మొదలుపెట్టింది. రాయడం ఇష్టంగానే ఉంది.. కాని ఇంకేదో చేయాలన్న ఆరాటం నిలువనీయలేదు. ఇది కాదు చేయాల్సింది అంటూ మెదడు పెట్టే పోరును పట్టించుకుంది. ఓ నిర్ణయం తీసుకుంది. బ్యాండ్ బాజా బారాత్ ఇంట్లో వాళ్లకు చెప్పింది. తను ఉద్యోగం మానేస్తున్నట్టు. మరి ఏం చేస్తావ్? పెళ్లి చేసుకుంటావా? అని పెద్దవాళ్లు అడిగేలోపే ‘పెళ్లి చేయిస్తా’ అని చెప్పింది. వెడ్డింగ్ ప్లానర్‌గా మారాలనుంది అని వివరించింది. ముంబైలోని ఓ వెడ్డింగ్ ఈవెంట్ కంపెనీలో జాయిన్ అయింది. కొన్నాళ్లు పోయాక తనే సొంతంగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకొని ‘దేవిక నరైన్ అండ్ కంపెనీ’ ప్రారంభించింది. ఇంట్లో వాళ్లు ఒకింత ఆందోళన పడ్తూనే ఉన్నారట ఆమె సక్సెస్ చూసేదాకా. ‘ఇప్పుడు ఎవ్రీబడీ హ్యాపీ’ అంటుంది దేవిక. ఆమె విజయం గురించి ఆమెనే చెప్పనిద్దాం.. సైకాలజీ...ప్లానింగ్ ‘వెస్ట్రన్ సొసైటీలో పెళ్లంటే ఇద్దరు వ్యక్తులదే. కాని మన దగ్గర అలా కాదు. రెండు కుటుంబాలకు సంబంధించింది. మన వాళ్లు ఎక్కడైనా కాంప్రమైజ్ అవుతారు కాని పెళ్లి విషయంలో కారు. ఇప్పుడు మ్యారేజ్ ఏర్పాట్లలో అమ్మాయి, అబ్బాయే ఇన్వాల్వ్ అవుతున్నారు. ఉన్నదాంట్లో గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. బడ్జెట్, అభిరుచికి తగ్గ థీమ్ ఇస్తాం. వాళ్ల ఇష్టాఇష్టాలు, సైకాలజీతోపాటు రెండు కుటుంబాల మధ్య రిలేషన్స్, ఎమోషన్స్ తెలుసుకోవడం కోసం వాళ్లతో చాలాసార్లు మాట్లాడతాను. దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకోవాలి కదా. సిక్స్ మంత్స్ నుంచి ఫిఫ్టీన్ మంత్స్ టైమ్ అవసరం. కాన్సెప్ట్స్ రాసుకోవాలి. థీమ్స్ డెవలప్ చేసుకోవాలి. ఇదీ ఒకరకంగా జర్నలిజం అసైన్మెంట్ లాంటిదే (నవ్వుతూ). మన మీద మనకు ట్రస్ట్, పరిస్థితులు, రీసోర్స్ మీద పట్టు ఉంటే సక్సెస్ ఖాయం. చాలెంజ్స్.. వెడ్డింగ్ ప్లానర్స్‌కి ఎంత డిమాండ్ ఉందో చాలెంజెస్ అన్నే ఉన్నాయి. పెళ్లి విషయంలో నార్త్దో స్టయిల్. సౌత్దో స్టయిల్. నార్త్ వాళ్లకు సెలబ్రేషన్ మీద దృష్టి ఎక్కువ. సౌత్ వాళ్లు అంతా సిస్టమేటిక్‌గా పర్టిక్యులర్‌గా జరగాలనుకుంటారు. ఏ పెళ్లికి ఆ పెళ్లి ఓ చాలెంజ్. ఇండోర్ అయితే పెద్ద సవాల్. చాలా ఇన్నోవేటివ్‌గా తీర్చిదిద్దాలి. డెస్టినేషన్ అయితే అక్కడి మనుషులు, వాతావరణం, పరిస్థితులు, కల్చర్, రీసోర్సెస్, నేటివిటీ.. స్టడీ చేయాలి. వాటినే ఉపయోగించుకోవాలి. సేమ్ టైమ్ మన నేటివిటీ దెబ్బతినకుండా చూసుకోవాలి. ఎగ్జాంపుల్ అనుష్కా, విరాట్ కొహ్లీ పెళ్లి తీసుకుంటే... నేను అప్పటిదాకా ఇటలీ వెళ్లలేదు. పైగా వాళ్ల పెళ్లి పనులను చాలా సీక్రెట్‌గా ఉంచాలనేది పెద్ద టాస్క్. వాళ్లు కోరుకున్నట్టు డిజైన్ చేయడానికి ముందు ఆ డెస్టినేషన్‌ను అర్థం చేసుకోవాలి. అందుకోసం చాలాసార్లు ఇటలీ ట్రావెల్ చేయాల్సి వచ్చింది. ఇంకో వెడ్డింగ్..సెల్వీ అనే తెలుగు అమ్మాయిది. ఆమె పుట్టి పెరిగిందంతా అమెరికాలోనే. ఆరన్ అనే అమెరికన్‌తో డెస్టినేషన్ వెడ్డింగ్. వెతుకులాటలో కేరళలోని కుమర్‌కోమ్ గురించి తెలిసింది. అక్కడ ప్లాన్ చేశా. ఇటు హిందూ సంప్రదాయం, అటు క్రిస్టియన్ సంప్రదాయంలో కాకుండా ఆ జంట తమదైన రీతిలో పెళ్లి చేసుకున్నారు. ఇంకొకరి పెళ్లి.. ఇండోర్ స్టేడియంలో ప్లాన్ చేశా. వచ్చిన వాళ్లంతా అది స్టేడియం అని తెలిసి ఆశ్చర్యపోయారు. ఎవరూ నమ్మలేదు. అలా డెకరేట్ చేశా. అయితే ఇబ్బందులను ఎదుర్కోవడం ఇంకా పెద్ద చాలెంజ్. ఒక పెళ్లిని కేరళలోని ఒక ఐల్యాండ్‌లో ప్లాన్ చేశాం. అరెంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయి. రాత్రికి రాత్రే తుఫాను వచ్చి తెల్లారేసరికల్లా అంతా కొట్టుకుపోయింది. ఆ టైమ్‌లో ధైర్యం కోల్పోతే అంతే సంగతి. మన మీద పెళ్లి వాళ్లు నమ్మకం కోల్పోవద్దు. మళ్లీ 24 గంటల్లో అంతా రెడీ చేశాం. ఎక్సయిమెంట్ ఎంతుంటుందో.. నెర్వస్ కూడా అంతే ఉంటుంది. ప్రతిదీ నేర్చుకోవడమే. ప్రతి ఎక్స్‌పీరియెన్స్ ఒక కాన్సెప్టే. ఇన్స్పైరింగే’’ అంటూ ముగించింది దేవిక నరైన్. తెలుగు వాళ్ల పెళ్లిళ్లు కూడా.. హైదరాబాద్‌లోని చాంద్, సృజనా గ్రూప్, గోల్కొండ హోటళ్ల కుటుంబానికి చెందిన వెడ్డింగ్స్నూ ప్లాన్ చేసింది దేవిక. తను కూడా తెలుగు అబ్బాయి జోసెఫ్ రాడిక్‌ను పెళ్లాడింది. జోసెఫ్ రాడిక్ కూడా సెలెబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫరే. అల్లు అర్జున్, రామ్‌చరణ్ వెడ్డింగ్ ఫొటోస్ తీసింది ఆయనే. అనుష్కా, విరాట్ కొహ్లీ పెళ్లినీ క్లిక్‌మనిపించాడు. ‘పర్ఫెక్ట్ ప్లాన్‌తో బ్యాండ్ బాజా బారాత్‌ను వందేళ్ల ఫ్రేమ్‌లో ముచ్చటైన గుర్తుగా ఫిక్స్ చేయొచ్చు’ అంటారు ఇద్దరూ! – శరాది -
ఫిలింనగర్లో దారుణం..
హైదరాబాద్: ఫిలింనగర్లో దారుణం చోటుచేసుకుంది. బానోతు జగన్ అనే వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సైదప్ప బస్తీలో మంగళవారం తెల్లవారుజామున ఇంటిముందు గేటు శబ్ధం రావడంతో ఇంట్లోకి ఎవరో వచ్చారన్న అనుమానంతో ఇంటి యజమానులు పైఅంతస్తుకు వెళ్లి చూడగా జగన్ చనిపోయి ఉన్నాడని, ఆ సమయంలో అక్కడే మరో వ్యక్తి కూడా ఉన్నాడని చెప్పారు. ఎలా చనిపోయాడని భార్య దేవికని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పిందని, దీంతో అనుమానం వచ్చి ఆ సమయంలో అక్కడే ఉన్న మరో వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించినా అతను తప్పించుకుని పారిపోయాడని వారు చెబుతున్నారు. జగన్ చాలా మంచి వ్యక్తి అని, మరో వ్యక్తితో కలిసి భార్యనే హత్య చేసి ఉంటుందని వారు చెప్పారు. వెంటనే పోలీసులకు విషయం చేరవేశామని వారు తెలిపారు. పెళ్లైననాటి నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్టు సమాచారం. కాగా, జగన్ మద్యం మత్తులో ఉండగా, అతని పురుషాంగంపై దాడి చేసి, నోట్లో హిట్ కొట్టి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. భార్య దేవికని అదుపులోకి తీసుకున్నారు. మృతుడు జగన్ స్వస్థలం గుంటూరు జిల్లా మాచర్ల. జగన్ ప్రస్తుతం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
దేవిక.. పసిడి పతకాల కానుక
పరవాడ(పెందుర్తి): బ్యాడ్మింటన్‌లో రాకెట్లా దూసుకుపోతోంది వాడచీపురుపల్లికి చెందిన కర్రి దేవిక. అంతర్జాతీయ ఖ్యాతే లక్ష్యంగా పాల్గొన్న ప్రతీ పోటీలో అద్భుత ప్రదర్శన కనబర్చుతూ అందరి మన్ననలూ పొందుతోంది. ఇటీవల శ్రీలంకలో నిర్వహించిన అంతర్జాతీయ బాల్‌బ్యాడ్మింటన్ పోటీల్లో బంగారు పతకాన్ని చేజిక్కించుకుని అందరి మన్ననలు పొందింది. వాడచీపురుపల్లి జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థిని దేవిక. తండ్రి కర్రి రాము ఆర్టీసీ కండక్టర్, తల్లి రామలక్ష్మి గృహిణి. చిన్ననాటి నుంచి బ్యాడ్మింటన్‌పై మక్కువ. పిన్ని అపర్ణ ప్రోత్సాహంతో సాధన ప్రారంభించిన ఆమె నాలుగేళ్లుగా నైపుణ్యం పెంపొందించుకుంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లోనూ రాణించి పతకాలను సొంతం చేసుకుంటోంది. రోజు 2 గంటల సాధన పాఠశాల విడిచిన తరువాత దేవిక రోజూ సాయంత్రం రెండు గంటల పాటు బాల్‌బ్యాడ్మింటన్ సాధన చేస్తోంది. పోటీలకు ముందు మరింత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తానని తెలిపింది. ఈమె రైట్ బ్యాక్ ఆడడంలో మంచి నేర్పరి. అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని.. బాల్‌బ్యాడ్మింటన్‌లో అంతర్జాతీయ కీర్తి పొందాలన్నదే ఆశయం. పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, పరవాడ ఎంపీపీ మాసరపు అప్పలనాయుడుల ప్రోత్సాహం ఎనలేనిది. లారస్ ల్యాబ్స్ యాజమాన్యం సహకారంతో ఇండో–లంక సిరీస్‌లో పాల్గొనే అవకాశం లభించిం ది. జట్టు కెప్టెన్‌గా వ్యవహరించి సిరీస్‌ను దక్కించుకున్నాం. బాల్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు రావు వెంకటరావు, చిరికి వెంకటరావు సహకారం అందిస్తున్నారు. – దేవిక సాధించిన పతకాలు – జాతీయ స్థాయి బ్యాల్బాండ్మింటన్ పోటీల్లో అండర్–16 విభాగంలో నాలుగు రజత పతకాలు సాధించింది.అండర్–17 విభాగంలో రెండు స్వర్ణాలు, రెండు కాంస్య పతకాలు, అండర్20లో ఒక రజతం, ఒక కాంస్య పతకం, సౌత్ జోన్ పోటీల్లో రెండు బంగారు, రెండు కాంస్య పతకాలు, ఫెడరేషన్ కప్ పోటీల్లో ఒక కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. రాష్ట్రస్థాయిలో.. అండర్–17 పోటీల్లో రెండు స్వర్ణ పతకాలు, అండర్–16లో రెండు స్వర్ణ పతకాలు, అండర్–20 విభాగంలో ఒక స్వర్ణం, జూనియర్స్ విభాగంలో స్వర్ణం, సీనియర్స్ విభాగంలో రజత పతకాలను కైవసం చేసుకుంది. స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ గత నెల నల్గొండలో నిర్వహించిన పోటీల్లో రజత పతకం సాధించింది. -
ప్రేమలో ఎక్కడున్నారు?
కాలేజీలో ప్రేమికులైన ఓ అమ్మాయి, ఓ అబ్బాయి చదువు పూర్తయ్యాకా వేర్వేరు ప్రదేశాలకు వెళతారు. వీళ్లు ప్రేమలో ఎంత దూరం వెళ్లారు? ఎలా ఒక్కట య్యారనే కథతో రూపొందుతోన్న సినిమా ‘అక్కడ అబ్బాయి–ఇక్కడ అమ్మాయి’. బొంతు సాయి, సూర్య, చైతన్య, దేవిక, శ్రావణి, తేజా రెడ్డి ముఖ్య తారలుగా రాజేశ్ యడమ దర్శకత్వంలో ఎస్. త్రివిక్రమ్ నిర్మిస్తున్నారు. ‘‘స్నేహం, ప్రేమ ప్రధాన అంశాలుగా తీస్తున్న చిత్రమిది. జూన్‌లో చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు దర్శకుడు. ఈ చిత్రానికి సంగీతం: వీఎస్ఎన్. -
మేమున్నామని...
బండి చక్రాలు రెండూ విరిగిపోతే గమ్యమే కాదు, మార్గం కూడా శూన్యం అనిపిస్తుంది. బలమైన వాళ్లయితే ఇరిగిన చక్రాల బండిని కూడా లాక్కెళ్లగలుగుతారు. శక్తి లేని చిన్నారి దేవిక బండి... కదిలే పరిస్థితిలో లేదు. బతుకు బండి, చదువుల బండి, భవిష్యత్తు బండి.. అన్నీ ఆగిపోయాయి. క్లాస్‌మేట్సే ఈ బండిని, బాటసారినిభుజానికెత్తుకుని ముందుకు నడిపిస్తున్నారు. కంబాలపల్లి శివారు సండ్రలగూడెంకు చెందిన అమ్మాయి ఈసం దేవిక. కంబాలపల్లి జిల్లాపరిషత్ సెంకడరీ పాఠశాల (ఇంగ్లీష్ మీడియం) లో ఎమినిదవ తరగతి చదువుతోంది. దేవిక తండ్రి ఈసం రమేశ్ హైదరాబాద్‌లో లారీడ్రైవర్‌గా పనిచేసేవాడు. 2012లో కాలు ఎముక విరగడంతో సండ్రలగూడెంకు వచ్చాడు. చికిత్స తీసుకుంటూనే మూడు నెలలకు అంటే ఏప్రిల్ 9న మరణించాడు. దేవిక తల్లి యశోద గృహిణి. ఆమె కూడా అనారోగ్యంతో బాధపడుతూ 2015, డిసెంబర్లో చనిపోయింది. ఆ దంపతుల ఏకైక కుమార్తె దేవికే కావడంతో ఆ ఇద్దరికీ ఈ చిన్నారే తలకొరివి పెట్టి జన్మరుణం తీర్చుకుంది. తల్లిదండ్రులను కోల్పోవడంతో ఏకాకైన దేవిక తాత, మేనమామల పంచన చేరింది. దేవిక తలిదండ్రులకు సండ్రలగూడెంలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి, తాటాకుల గోడలు, రేకుల పైకప్పుతో ఒక్క గది ఇల్లు ఉన్నాయి. వర్షం వస్తే బురదమయమే ఆ ఇల్లు. ఇదీ దేవిక నేపథ్యం! వారం కిందట.. కంబాలపల్లి ప్రాథమిక పాఠశాలలో పనిచేసే అంకటి వెంకటేశ్వర్లు అనే ఉపాధ్యాయుడు తాను దత్తత తీసుకున్న పేద విద్యార్థులు వల్లపు లావణ్య, హరిచంద్రప్రసాద్‌కు బ్యాగులు, చెప్పులు, నోట్ పుస్తకాలు, జామెట్రికల్ బాక్సు, డిక్షనరీ ఇచ్చారు. అప్పుడు దేవిక తన తల్లిదండ్రులు బతికి ఉంటే తనకూ ఇవన్నీ కొనిపెట్టేవారని బాధపడింది. అమ్మానాన్నను తలచుకొని ఏడ్చింది. ఈ విషయాన్ని ఆమె తోటి విద్యార్థులైన వల్లపు లావణ్య, గుగులోత్ సరస్వతి, దరిపెల్లి పావని, వాంకుడోత్ ఉష, సుమాలిక, ప్రియాంక, ఉమామహేశ్వరి గమనించారు. ఎలాగైన దేవిక బాధను దూరం చేయాలని అనుకున్నారు. దేవికకు తమ వంతు సహాయం చేయాలని నిశ్చయించుకున్నారు. తమ తరగతిలోని 47 మంది విద్యార్థులతో తమ ఆలోచనను పంచుకున్నారు. వాళ్ల నిర్ణయానికి ముక్తకంఠంతో మద్దతు తెలిపారు తోటి విద్యార్థులు. అంతే పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులెవరికీ చెప్పకుండా 47 మంది క్లాస్మేట్స్ కలిసి కొంత మొత్తం డబ్బును సమకూర్చారు. నోట్‌బుక్స్, దేవిక చదువుకోవడానికి ఉపయోగపడే ఇతర సామాగ్రిని అంటే తమ తల్లిదండ్రులు తమకు కొనిపెట్టిన వస్తువులన్నిటినీ దేవిక కోసం కొన్నారు ఆ పిల్లలు. నాలుగురోజుల కిందట... ఉదయం బడిలో ప్రార్థనా సమయమప్పుడు వాటన్నిటినీ ప్రధాన ఉపాధ్యాయుడు మైస శ్రీనివాసులు, పీఈటీ పిల్లి కాశీనాథ్ సమక్షంలో దేవికకు అందజేశారు. ఎనిదవ తరగతి విద్యార్థుల ఈ చొరవకు ఉపాధ్యాయ బృందంమంతా ఆనందాశ్చర్యాలకు లోనయింది. ఆ పిల్లల పెద్ద మనసు చదువుచెప్పే పెద్దలను కదిలించింది. తోటి మనిషికి చేయూనందించే విషయంలో స్ఫూర్తి పాఠం నేర్పించింది. అందుకే వాళ్ల క్లాస్‌టీచర్ గురునాథరావు వెంటనే స్పందించి దేవికకు స్కూల్ బ్యాగ్‌ను కొనిపెట్టారు. ‘మా దగ్గర పాఠాలు నేర్చుకుంటున్న పిల్లలు చేసిన ఈ గొప్ప పని చూస్తుంటే నిజంగా మాకు గర్వంగా ఉంది. వాళ్ల పెద్ద మనసు మాకూ ప్రేరణే! నేను మనిషిని అని చెప్పుకోవడం కంటే మానవత్వం ఉన్న మనిషనని నిరూపించుకోవడం గొప్ప విషయం. ఇప్పుడు మా పిల్లలు చేసింది అదే. ఈ సంఘటనతో మమ్మల్ని కూడా సరిదిద్దే ప్రయత్నం చేశారు మా పిల్లలు. మేం చెప్పే పాఠాలే కాదు మా ఆలోచనా ధోరణి కూడా ముఖ్యమే అన్న విషయాన్ని గుర్తు చేశారు. గురువుల బాధ్యత పెంచారు!’ అన్నారు గురునాథరావు. బాధ అనిపించింది... ‘‘వెంకటేశ్వర్లు సార్ పుస్తకాలు డొనేట్ చేస్తున్నప్పుడు దేవిక పక్కకు వెళ్లి ఏడ్వడం మాకు మస్తు బాధనిపించింది. తనను చూసుకోవడానికి అమ్మానాన్న లేరనే కదా అట్లా ఏడ్చింది అనుకున్నాం. అమ్మానాన్న లేకపోతే ఏంది.. మనమున్నం కదా.. దేవికకు కావల్సినవి మనమే కొనిద్దాం అని మాట్లాడుకున్నం. మా క్లాస్మేట్స్ అందరూ ఒప్పుకున్నరు. దేవికకు మేమందరం తోడున్నమని చెప్పడానికే ఈ సహాయం చేసినం అంతే’ అన్నారు ఈ సాయానికి సారథ్యం వహించిన వల్లపు లావణ్య, గుగులోత్ సరస్వతి, దరిపెల్లి పావని, వాంకుడోత్ ఉష. ‘ఆమెకు వాళ్ల తాత, మేనమామ ఉన్నా దేవిక అట్లా ఏడిస్తే మాకు మంచిగనిపించలేదు. ఆమె దోస్తులు ఆమెకు ఏదైనా చేయాలనిపించింది’ అన్నారు కల్లాకపటం లేని ఆ చిన్నారులు. దేవికకు 10వ తరగతి వరకు కావల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడానికి పాఠశాల పీఈటీ పిల్లి కాశీనాథ్ ముందుకు వచ్చారు. ఇందుకు ఆయనను ఉపాధ్యాయ బృందమంతా అభినందించింది. కంబాలపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలోని ఎనిమిదవ తరగతి విద్యార్థుల ఈ స్ఫూర్తి ప్రభుత్వ పాఠశాల కీర్తిని ఇనుమడింపచేసిందని, సర్కారు బడి ప్రగతికి దారివేసిందని కొనియాడారు ఆ స్కూల్ టీచర్లు. - బోనగిరి శ్రీనివాస్, సాక్షి మహబూబాబాద్ రూరల్, వరంగల్ మా ఫ్రెండ్స్, టీచర్లే ఆదర్శం మొదటి నుంచీ మేం పేదోళ్లమే. అయినా మా అమ్మ, నాన్న ఉన్నప్పుడు బాగానే చూసుకునేటోళ్లు. తాత, మేనమామ ఉన్నా అమ్మానాన్న బాగా గుర్తొస్తరు. బాధనిపిస్తుంటుంది. అందుకే ఆ రోజు వెంకటేశ్వర్లు సార్ లావణ్య, హరిశ్చంద్రప్రసాద్లను దత్తత తీసుకుని వాళ్లకు అన్ని కొనిస్తుంటే మా అమ్మానాన్న గుర్తొచ్చి బాగా ఏడ్పొచ్చింది. కాని ఆ సంఘటనే నాకు ఫ్రెండ్షిప్ వాల్యూని చెప్పింది. తోటివారికి ఎలా హెల్ప్ చేయాలో నేర్పింది. నా లైఫ్‌లో నాకు ఫ్రెండ్స్, మా టీచర్లే ఆదర్శం. అందుకే పెద్దయ్యాక నేనూ టీచర్నే కావాలనుకుంటున్నా. పూర్ స్టూడెంట్స్‌కి సహాయం చేయాలనుకుంటున్నా. ముఖ్యంగా అమ్మాయిలకు. వీలైనంత వరకు తోటివారికి సహాయడాలనేదే నా లక్ష్యం. ఇప్పుడు నాకు అమ్మానాన్న లేరనే దిగుల్లేదు. నా ఫ్రెండ్స్, టీచర్లే నాకు అన్నీ. నాకు సహాయం చేసి నాకు అండగా ఉండి నన్ను ప్రోత్సహిస్తున్న అందరికీ థాంక్స్. వాళ్లను ఎప్పటికీ మరిచిపోలేను’ - ఈసం దేవిక ఆ బాధ నాకు తెలుసు ‘నాకు నాన్న లేడు. అమ్మ ఉన్నా నాన్న లేని లోటు తెలుస్తూనే ఉంటుంది. అట్లాంటిది దేవికకు అమ్మానాన్న ఇద్దరూ లేరు. కాబట్టి ఆమెకెంత బాధ ఉంటుందో నాకు తెలుసు. అందుకే దేవిక ఆ లోటు ఫీల్‌కాకుండా చూడాలనే ఫ్రెండ్స్ అందరం అనుకొని ఆమెకు కావల్సినవి కొనిచ్చినం’ - వల్లపు లావణ్య. దేవిక క్లాస్మేట్ ఇదే ఉదాహరణ ‘తోటి విద్యార్థి కష్టానికి క్లాస్‌లోని పిల్లలంతా స్పందించడం వాళ్లలోని మానవతా విలువకు నిదర్శనం. దీనినే ఆదర్శంగా తీసుకొని ప్రతి బడిలో పాఠ్యపుస్తకాలతోపాటు పిల్లలకు సామాజిక పరిస్థితుల గురించి, నైతిక విలువల గురించీ బోధించాలి. దేవిక విషయానికి వస్తే టెన్త్ పూర్తయ్యే దాకా ఆమె బాగోగులు మేమే చూసుకుంటాం. - మైస శ్రీనివాసులుప్రధానోపాధ్యాయుడు బాగా చదువుకోవాలి తనకు ఎవరూ లేరనే బాధతో, దిగులుతో దేవిక చదువునెక్కడ కేర్లెస్ చేస్తుందోనని భయపడ్డాం. ఆమె ఎప్పుడూ బాధపడొద్దని.. బాగా చదువుకోవాలని.. ఏ విషయంలో ఇబ్బందిపడొద్దనే దేవికకు ఈ హెల్ప్ చేసినం’ - గంధసిరి సుమాలిక దేవిక మరో క్లాస్మేట్ -
శ్రీవారి భక్తురాలు మృతి
-
వెంకన్న దర్శనానికి వచ్చి భక్తురాలు మృతి
తిరుమల : తిరుమలలో వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు మృతి చెందింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్టుమెంట్ నెంబర్ 16లోని మరుగుదొడ్ల దగ్గర వృద్ధురాలు పడి ఉండటాన్ని గమనించిన విజిలెన్స్ అధికారులు ఆమెను హుటాహుటిన అశ్వని ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే వృద్ధురాలు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆమె మరణించిందని చెప్పారు. అయితే మృతికి కారణాలు ఏంటన్న విషయం మాత్రం ఇంకా నిర్ధారించలేదు. పోస్టుమార్టం చేస్తే గానీ కారణాలు తెలియవని అంటున్నారు. మృతురాలు తమిళనాడులోని ఆర్కాట్ జిల్లాకు చెందిన దేవికగా పోలీసులు గుర్తించారు. ఆమె అక్కడ పూలు అమ్ముకుని జీవిస్తుంటుందని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు . -
పట్టిందల్లా బంగారమే!
మంచి రోజులు మొదలైతే... అవి కొన్నాళ్ల పాటు అలానే కొనసాగుతుంటాయి. ఆ సమయంలో పట్టిందల్లా బంగారమే. ప్రస్తుతం శ్రుతీహాసన్‌కి అదే జరుగుతోంది. రెండేళ్ల క్రితం ‘గబ్బర్‌సింగ్'తో మొదలైంది ఆమె హవా. గత ఏడాది ‘బలుపు', ‘డి-డే’, ఈ ఏడాది ప్రారంభంలో ‘ఎవడు'... ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం ఈ పాలబుగ్గల వయ్యారి చేతినిండా సినిమాలే. ఈ నెల 11న ‘రేసుగుర్రం'తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారామె. సాధారణంగా హిందీ, తెలుగు, తమిళ చిత్ర సీమల్లో దేనినో ఒకదాన్ని నమ్ముకొని ముందుకెళ్తుంటారు హీరోయిన్లు. శ్రుతి మాత్రం అందుకు భిన్నం. సాధ్యమైనంతవరకూ అన్ని భాషల్నీ కవర్ చేస్తుంటారామె. బహుశా తండ్రి కమల్‌హాసన్ నుంచి అబ్బిన లక్షణం కావచ్చు. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు సినిమాలు చేస్తున్నారు. అందులో ఒకటి ‘వెల్కమ్ బ్యాక్’. జాన్ అబ్రహాం హీరో. ఇక రెండో సినిమా మన తెలుగు దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న ‘గబ్బర్'. మురుగదాస్ ‘రమణ' చిత్రం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అక్షయ్‌కుమార్ కథానాయకుడు. ఇందులో శ్రుతి పాత్ర పేరు ‘దేవిక'. నటనకి ఆస్కారమున్న పాత్ర చేస్తున్నారామె. తప్పకుండా బాలీవుడ్లో తనకు మంచి పేరు తెచ్చే సినిమా అవుతుందని నమ్మకంతో ఉన్నారామె. అలాగే తమిళంలో కూడా ఈ మధ్య ఓ సినిమాకు పచ్చ జెండా ఊపారు. అదే... విశాల్ ‘పూజై'. యముడు, సింగం-2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువైన హరి ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో శ్రుతీది మాస్ అప్పీల్ ఉన్న పాత్ర అని సమాచారం. ఇక ‘రేసుగుర్రం' తర్వాత శ్రుతీహాసన్ నటించే తెలుగు సినిమా ఏంటి? అనే విషయాన్ని ఆరాతీస్తే... ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. మహేశ్, ‘మిర్చి' కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే కదా. ఆ సినిమాలో కథానాయికగా శ్రుతీహాసన్ ఎంపికయ్యారనేది ఫిలిమ్‌నగర్ సమాచారం. అలాగే... మణిరత్నం తెరకెక్కించనున్న మల్టీస్టారర్‌లో కూడా శ్రుతీహాసనే కథానాయికట. ఈ జాబితాను బట్టి ఆమె ఇప్పుడు పట్టిందల్లా బంగారమేనని అర్థం చేసుకోవచ్చు.