
విజయవాడ, సాక్షి: పచ్చ బ్యాచ్ సైకోలు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతీసారి ఆశ్చర్యపరస్తూ వస్తున్నారు. తాజాగా.. మరోసారి విష పడగ విప్పారు. జగన్‌పై అభిమానంతో ఓ చిన్నారి చేసిన పనిని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈసారి నెటిజన్ల నుంచి ఛీత్కారాలు వచ్చాయి. దీంతో ఐటీడీపీ జీతగాళ్లు మరింత దిగజారి ప్రవర్తించారు. ఆ చిన్నారి విషయంలో అసత్య ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.
రవీంద్రభారతిలో ఎనిమిదో తరగతి చదువుతున్న దేవికారెడ్డి(Devika Reddy) .. విజయవాడ పర్యటనలో వైఎస్ జగన్‌ను కలిసింది. ఆ సమయంలో ఆయన ఆ పాపను దగ్గరికి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత భావోద్వేగంతో ఆ చిన్నారి మీడియా ముందు మాట్లాడింది. జగన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడి రావట్లేదని ఉన్నమాటే చెప్పింది. అయితే పచ్చ బ్యాచ్‌కు ఇది ఏమాత్రం సహించనట్లుంది.
అందుకే తమ అనుకూల సోషల్ మీడియా పేజీలు, వెబ్‌సైట్లలో చిన్నారి గురించి ఇష్టానుసారం పోస్టులు చేయించారు. దిగజారిపోయి మరీ పోల్ క్వశ్చన్స్ పెట్టించారు. ఈ క్రమంలో #Childabuser అంటూ ఆ వెబ్‌సైట్లను జనం తిట్టిపోశారు కూడా. గతంలో చిన్నపిల్లలతో రాజకీయం చేసింది ఎవరంటూ.. టీడీపీకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.
టీడీపీ సోషల్ మీడియా(TDP Social Media) ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో తెలియంది కాదు. గతంలో ప్రభుత్వ స్కూల్‌లో అనర్గళంగా ఆంగ్లం మాట్లాడిన మేఘన అనే ఓ విద్యార్థిని విపరీతంగా ట్రోల్ చేశారు. జగన్ సాయం చేశారని చెప్పిన గీతాంజలికి.. సొంతింటి కల నెరవేరిన సంతోషాన్ని లేకుండా చేశారు. ఏకంగా.. ఆమె బలవన్మరణానికి పాల్పడేంతగా సోషల్ మీడియాలో ఏడ్పించారు. జగన్ పాలనలో సాయం పొందిన వాళ్లను, ఆయనపై అభిమానం ప్రదర్శించిన వాళ్లనూ ఏ ఒక్కరినీ వదలకుండా విపరీతంగా ట్రోల్ చేయడం చూశాం. ఇప్పుడు ఓ చిన్నారి విషయంలోనూ అదే చేస్తున్నారు.
అయితే ఈ వ్యవహారం మరీ శ్రుతిమించడంతో బూమరాంగ్ అయ్యింది. దీంతో ఈసారి అసత్య ప్రచారాలకు దిగారు. చిన్నారి దేవిక డీపీహెచ్ స్కూల్‌లో చదువుతుందంటూ ప్రచారం చేశారు. పైగా ఆమె తల్లి వైఎస్సార్సీపీ నాయకురాలు అని, ఆర్థికంగా ఆ కుటుంబ పరిస్థితి ఎంతో బాగుందంటూ విషం చిమ్మారు. దేవిక తండ్రి అద్దె ఇంట్లో ఉంటూనే ఓ షాప్‌లో పని చేస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కానీ, లోకేష్ సైకో టీం(Nara Lokesh Team) విషప్రచారం ఇంకా ఆ ప్రచారం ఆపట్లేదు.

ఇంత జరుగుతున్నా.. టీడీపీ సోషల్ మీడియా విభాగాలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టడం లేదు. వైఎస్సార్‌సీపీ నేతలు, హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నవాళ్లపై కూటమి పెద్దల ఆదేశాలతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండడంలో తలమునకలైపోయారు అంతే!.
Comments
Please login to add a commentAdd a comment