iTDP
-
జగన్ అంటే ఒక ఎమోషన్.. దేవికాపై ట్రోల్స్.. ఐటీడీపీకి స్ట్రాంగ్ కౌంటర్
-
మానసికంగా వేధిస్తున్నారు మీ ఇంట్లో పిల్లను ఇలాగే చేస్తావా: Pothina Mahesh
-
చిన్న పిల్లని అలా ఎలా ట్రోల్ చేస్తారు.. మేయర్ భాగ్యలక్ష్మి ఫైర్..
-
చిన్నారిపై ఇదేం సైకోయిజం బాబు : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి,విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలతో పాటు చిన్నారులకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ(YSRCP) మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి (Varudu Kalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల విజయవాడ పర్యటనలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసిన ఎనిమిదో తరగతి చదువుతున్న దేవికారెడ్డి(Devika Reddy)పై ఐటీడీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చిన్నారిపై ఐటీడీపీ చేస్తున్న విష ప్రచారంపై విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్‌ను కలిసిన విద్యార్థిని దేవికారెడ్డిపై ఐటీడీపీ నేతలు సైకోల్లా వ్యవహరిస్తున్నారు.దేవికను మానసికంగా వేధిస్తున్నారు. అమ్మఒడి రాలేదు అన్నందుకు విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోందంటూ పోస్టులు పెడుతున్నారు. చిన్న పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే తోలు తీస్తామన్న చంద్రబాబు పవన్ మాటలు ఏమయ్యాయి.దేవికపై తప్పుడు ప్రచారం చేసిన ఐటీడీపీ నేతలపై కేసు నమోదు చేయాలి. గతంలో వైఎస్ జగన్వల్లే తనకు ఇల్లు వచ్చిందన్న గీతాంజలి అనే మహిళను సోషల్ మీడియాలో వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. ఇప్పుడు విద్యార్థినిపై అదే తరహాలో సైకోల్లా ప్రవర్తిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చిన్న పిల్లల్ని కూడా వదలని ఐటీడీపీ జీతగాళ్ళు
-
చిన్నారిపై లోకేష్ సైకో టీం విషప్రచారం
విజయవాడ, సాక్షి: పచ్చ బ్యాచ్ సైకోలు ఇంతకన్నా దిగజారరు అనుకున్న ప్రతీసారి ఆశ్చర్యపరస్తూ వస్తున్నారు. తాజాగా.. మరోసారి విష పడగ విప్పారు. జగన్‌పై అభిమానంతో ఓ చిన్నారి చేసిన పనిని విపరీతంగా ట్రోల్ చేశారు. అయితే ఈసారి నెటిజన్ల నుంచి ఛీత్కారాలు వచ్చాయి. దీంతో ఐటీడీపీ జీతగాళ్లు మరింత దిగజారి ప్రవర్తించారు. ఆ చిన్నారి విషయంలో అసత్య ప్రచారం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు.రవీంద్రభారతిలో ఎనిమిదో తరగతి చదువుతున్న దేవికారెడ్డి(Devika Reddy) .. విజయవాడ పర్యటనలో వైఎస్ జగన్‌ను కలిసింది. ఆ సమయంలో ఆయన ఆ పాపను దగ్గరికి తీసుకున్నారు. అయితే ఆ తర్వాత భావోద్వేగంతో ఆ చిన్నారి మీడియా ముందు మాట్లాడింది. జగన్ అంటే ఎంతో ఇష్టమని చెప్పింది. కూటమి ప్రభుత్వంలో అమ్మ ఒడి రావట్లేదని ఉన్నమాటే చెప్పింది. అయితే పచ్చ బ్యాచ్‌కు ఇది ఏమాత్రం సహించనట్లుంది.అందుకే తమ అనుకూల సోషల్ మీడియా పేజీలు, వెబ్సైట్లలో చిన్నారి గురించి ఇష్టానుసారం పోస్టులు చేయించారు. దిగజారిపోయి మరీ పోల్ క్వశ్చన్స్ పెట్టించారు. ఈ క్రమంలో #Childabuser అంటూ ఆ వెబ్సైట్లను జనం తిట్టిపోశారు కూడా. గతంలో చిన్నపిల్లలతో రాజకీయం చేసింది ఎవరంటూ.. టీడీపీకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.టీడీపీ సోషల్ మీడియా(TDP Social Media) ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో తెలియంది కాదు. గతంలో ప్రభుత్వ స్కూల్లో అనర్గళంగా ఆంగ్లం మాట్లాడిన మేఘన అనే ఓ విద్యార్థిని విపరీతంగా ట్రోల్ చేశారు. జగన్ సాయం చేశారని చెప్పిన గీతాంజలికి.. సొంతింటి కల నెరవేరిన సంతోషాన్ని లేకుండా చేశారు. ఏకంగా.. ఆమె బలవన్మరణానికి పాల్పడేంతగా సోషల్ మీడియాలో ఏడ్పించారు. జగన్ పాలనలో సాయం పొందిన వాళ్లను, ఆయనపై అభిమానం ప్రదర్శించిన వాళ్లనూ ఏ ఒక్కరినీ వదలకుండా విపరీతంగా ట్రోల్ చేయడం చూశాం. ఇప్పుడు ఓ చిన్నారి విషయంలోనూ అదే చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మరీ శ్రుతిమించడంతో బూమరాంగ్ అయ్యింది. దీంతో ఈసారి అసత్య ప్రచారాలకు దిగారు. చిన్నారి దేవిక డీపీహెచ్ స్కూల్లో చదువుతుందంటూ ప్రచారం చేశారు. పైగా ఆమె తల్లి వైఎస్సార్సీపీ నాయకురాలు అని, ఆర్థికంగా ఆ కుటుంబ పరిస్థితి ఎంతో బాగుందంటూ విషం చిమ్మారు. దేవిక తండ్రి అద్దె ఇంట్లో ఉంటూనే ఓ షాప్‌లో పని చేస్తూ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కానీ, లోకేష్ సైకో టీం(Nara Lokesh Team) విషప్రచారం ఇంకా ఆ ప్రచారం ఆపట్లేదు.ఇంత జరుగుతున్నా.. టీడీపీ సోషల్ మీడియా విభాగాలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టడం లేదు. వైఎస్సార్సీపీ నేతలు, హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతున్నవాళ్లపై కూటమి పెద్దల ఆదేశాలతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుండడంలో తలమునకలైపోయారు అంతే!. -
Singer Mangli: పాట పాడలేదని ఇంత పగనా?
అమరావతి: ప్రముఖ గాయని మంగ్లీపై టీడీపీ & కో సోషల్ మీడియా వేదికగా మామూలు విషం చిమ్మడం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆమె చంద్రబాబుపై పాట పాడమని టీడీపీ కోరింది. అయితే అందుకు ఆమె సున్నితంగా తిరస్కరించారు. అదే సమయంలో వైఎస్ జగన్ మీద అభిమానంతో ఓ పాట పాడారు. ఈ క్రమంలో ఆ కోపాన్ని ఇప్పుడు సందర్భం రావడంతో ప్రదర్శిస్తోంది యెల్లో బ్యాచ్. శ్రీకాకుళం అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాల సందర్భంగా ఈ నెల నాలుగో తేదీన గాయని మంగ్లీ(Singer Mangli) బృందం పాటల కార్యక్రమం ఏర్పాటు నిర్వహించింది. ఆ టైంలో కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు కుటుంబ సభ్యులతో దర్శనానికి వెళుతూ.. సింగర్ మంగ్లీని కూడా వెంట తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన దృశ్యాలు, చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ఇప్పుడు పోస్ట్ చేస్తోంది. చంద్రబాబు పేరును పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తిని వెంట పెట్టుకుని మరీ ఎలా లోపలికి తీసుకెళ్తారంటూ రామ్మోహన్నాయుడును టీడీపీ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో.. అసలు ఆమెకు గుడిలోకి వెళ్లే అర్హతే లేదన్నట్లు అడ్డగోలు పోస్టులు పెడుతున్నారు. అదే టైంలో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంగ్లీ టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్‌కు సలహాదారుగా పని చేశారని గుర్తు చేస్తూ ఆ విమర్శలను ఇంకా తీవ్ర తరం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ అనుకూల మీడియా సైతం ఈ విమర్శలను ప్రముఖంగా ప్రచురిస్తుండడం గమనార్హం. మరోవైైపు.. ఒక కళాకారిణిగా ఆమెకు రాజకీయాలను ఆపాదించడం ఎంతమాత్రం సరికాదని కొందరు ఆమెకు మద్ధతుగా నిలుస్తుండడం విశేషం.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
తిరుపతి, సాక్షి: చంద్రగిరి మండలంలో ఘోరం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి(33) మృతి చెందాడు. రాకేష్ చంద్రగిరి ఐటీడీపీ అధ్యక్షుడిగా, కందులవారిపల్లి ఉప సర్పంచ్‌గా ఉన్నాడు. తమ పార్టీ యువనేత హఠాన్మరణంపై తెలుగు దేశం పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్నరామాపురం, కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు సంచరించాయి. మామిడిమాను గడ్డ గ్రామ పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి చేస్తుందన్న సమాచారంతో రాకేష్‌తో పాటు మరికొందరు అక్కడికి వెళ్లారు. అరుస్తూ వాటిని కొంతదూరం తరిమారు. ఈ క్రమంలో.. అవి తిరగబడడంతో పరుగులు తీశారు. ఓ ఏనుగు వాళ్లపై దాడికి దిగడంతో అంతా చెట్లెక్కి లైట్లు ఆఫ్ చేసుకున్నారు. అయితే.. రాకేష్ వాళ్లలో ముందు ఉండడం, తెల్ల చొక్కా ధరించి ఉండడంతో, పైగా అతని చేతిలో లైట్ ఆన్ చేసి ఉండడంతో ఏనుగు అతనిపై దాడికి దిగింది. తొండంతో ఎత్తి చెట్లకు కొట్టి.. కిందపడేసి తొక్కింది. దీంతో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.రాకేష్‌కు భార్య, ఒక కూతురు ఉన్నారు. ఈయన సీఎం కుటుంబానికి సన్నిహితుడిగా తెలుస్తోంది. రాకేశ్ మృతి వార్త తెలుసుకొని ఎమ్మెల్యే పులివర్తి నాని ఘటనాస్థలికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. -
ఐటీడీపీ పోస్టులపై హైకోర్టులో అంబటి రాంబాబు పిటిషన్
అమరావతి, సాక్షి: ఐటీడీపీ అనుచిత పోస్టుల వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని.. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలివ్వాలని ఆయన తన పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరారు.‘‘ఐటీడీపీ(iTDP)లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు. మా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కించపరుస్తున్నారు. నాపై , నాకుటుంబ సభ్యులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మేం ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు ఒక్క కేసు నమోదు చేయలేదు. మాపై వివక్ష ప్రదర్శిస్తున్నారు’’ అని అంబటి పిటిషన్లో పేర్కొన్నారు. తన పిటిషన్ ఆధారంగా.. కేసులు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలువ్వాలని పిటిషన్ ద్వారా అంబటి కోరారు. ఈ పిటిషన్‌పై స్వయంగా ఆయనే వాదనలు వినిపించనున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే.. ఐటీడీపీ, టీడీపీ అనుబంధ పేజీల్లో వైఎస్ జగన్(YS Jagan)పై, తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై ఆయన పోలీసులకు ఫిర్యాదులు చేశారు. అయితే అటు నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు. దీంతో తాజాగా ఆయన పట్టాభిపురం పీఎస్ వద్ద నిరసన తెలిపారు. అయితే న్యాయం చేయకపోగా.. అంబటిపైనే పోలీసులు తిరిగి కేసు నమోదు చేయడం గమనార్హం.ఇదీ చదవండి: ఉన్న ఉద్యోగం పీకేసి.. అయినవాళ్ల కోసం! -
ఐటీడీపీపై YSRCP నేతల ఫిర్యాదు
-
టిడిపి- జనసేన సోషల్ మీడియా సైకో మూకల కిరాతక క్రీడ
-
కుట్రతోనే వేధింపులు
తెనాలి: ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి సంతోషంగా తన అభిప్రాయాన్ని తెలియజేసిన గొల్తి గీతాంజలిపై సోషల్ మీడియాలో వికృతంగా ట్రోల్ చేసి ఆమె బలవన్మరణానికి కారకులైన ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా మృగాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని హెచ్చరించారు. గీతాంజలి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వెనుక ప్రభుత్వం చేసిన మంచిని మరెవరూ చెప్పకుండా అణచివేయాలనే పెద్ద కుట్ర ఉందని ఆమె మండిపడ్డారు. ఈ ఘటనల వెనక నారా లోకేశ్ హస్తం ఉందని ఆమె ఆరోపించారు. గీతాంజలి మరణించిన తర్వాత కూడా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వీరికసలు మనసనేది ఉందా అని ఆమె ప్రశ్నించారు. మహిళలంతా వీరి దుశ్చర్యలను గమనించాలని రానున్న ఎన్నికల్లో బుద్ధిచెప్పాలని ఆమె సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలోని గొల్తి గీతాంజలి నివాసానికి మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, పోతుల సునీత, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వినర్ సజ్జల భార్గవరెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘ కార్పొరేషన్ చైర్పర్సన్ పవిత్ర పరామర్శించారు. గీతాంజలి భర్త బాలచంద్రను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుమార్తెలు రిషిత, రిషికలను పరామర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనతో తామంతా వచ్చామని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. సీఎం జగన్ రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించినట్లు పేర్కొన్నారు. వీరితోపాటు గుంటూరు తూర్పు అసెంబ్లీ ఇన్చార్జి నూరి ఫాతిమా, మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జి మురుగుడు లావణ్య, ఎన్నారై అధికార ప్రతినిధి కడప రత్నాకర్, గాలి అరవింద, పలువురు ప్రజాప్రతినిధులు, మహిళా నాయకులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. చితిమంటల్లోనూ చలికాచుకుంటున్నారు... ప్రభుత్వం చేసిన మంచిని చెప్పే ఉత్సాహంలో ఒక అంకె తప్పు చెప్పడం బూతులాగా అనిపించిందా? గీతాంజలి చనిపోయి రెండురోజులైనా ఇంకా పోస్టులు పెడుతూ, ఇంకా రాబందుల్లా పీక్కుతింటున్నారు. తాగుబోతులు, సైకోలు వీరంగం వేసినట్టుంది. గీతాంజలి చితిమంటల్లోనూ చలికాచుకుంటున్న మీకు సిగ్గుండాలి.లోకేశ్ భార్య, చంద్రబాబు భార్యపై పోస్టులు పెడితే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు భార్యను ఏమీ అనకుండానే అసెంబ్లీ నుంచి బయటకొచ్చి గొడవ చేశారు. రాజీపడేదే లేదు. అందరికీ శిక్షలు పడతాయి. ఎవరినీ వదిలిపెట్టేది లేదు. – నందిగం సురేష్, ఎంపీ సోషల్ మీడియా టెర్రరిజం గీతాంజలిపై ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియా చేసింది ట్రోలింగ్ కాదు...టెర్రరిజం అంటాను. మా పార్టీలోని మహిళా ప్రజాప్రతినిధులు, మంత్రులు, సీనియర్ లీడర్లు, జర్నలిస్టులు అందరూ ఈ టెర్రరిజం బాధితులే. గీతాంజలి చనిపోయాక కూడా వదలడం లేదు. బాధపడుతున్నట్టు ఒక్కరు కూడా చెప్పటం లేదు. ఒక కుటుంబంలో భార్య, తల్లి, కోడలు, కుమార్తెగా ఉంటున్న మహిళ మరణానికి కారకులయ్యారు. న్యాయం ఏమిటి? నారా లోకేశ్, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ చెప్పాలి. ప్రజాస్వామ్యానికి ఇది నిజంగా బ్లాక్ డే. వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో ఎక్కడా అసభ్యత ఉండదు. – సజ్జల భార్గవ, కన్వినర్, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్య గీతాంజలిది ఆత్మహత్య కాదు...టీడీపీ, జనసేన సోషల్‌మీడియా చేసిన హత్య. ప్రభుత్వం చేసిన మంచిని ప్రతి కుటుంబంలోని లబ్దిదారులే స్టార్ క్యాంపెనర్లు అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతుంటారు. ప్రభుత్వం నుంచి పొందిన లబ్ధిని చెప్పిన గీతాంజలి నోరు నొక్కితే ఇంకెవరూ నోరు విప్పరు అనే కుట్రతో ఆమెను ట్రోల్ చేశారు. సీఎం జగన్ చేసిన మంచిని ఎవరూ చెప్పకూడదనే ఆమె జీవితాన్ని అంతం చేశారు. సోషల్ మీడియాలో మహిళలు ఎవరూ మాట్లాడకూడదనే వారి కుట్ర. – వాసిరెడ్డి పద్మ, ఏపీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ పట్టా ఇచ్చిన చేత్తోనే నివాళి అర్పించడం దురదృష్టం... గీతాంజలికి ఈ నెల 4వ తేదీన రిజిస్ట్రేషన్ పట్టాను ఇచ్చిన చేతులతోనే ఆమె భౌతికకాయంపై పూలమాల వేసి నివాళి అర్పించాల్సి రావడం దురదృష్టం. ఆమె మరణానికి కారకులను ప్రభుత్వం శిక్షిస్తుంది. మానవతా దృక్పథంతో సీఎం జగన్మోహన్రెడ్డి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. ఆ మొత్తాన్ని ఆమె ఇద్దరు ఆడపిల్లల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. ఆ కుటుంబానికి అండగా ఉంటాం. – అన్నాబత్తుని శివకుమార్, తెనాలి ఎమ్మెల్యే గీతాంజలిని దారుణంగా వేధించారు.. ఐటీడీపీ, జనసేన సోషల్ మీడియావాళ్లు గీతాంజలిని దారుణంగా వేధించారు. ఆమె బలవన్మరణానికి కారకులయ్యారు. ప్రభుత్వం వీరిని కఠినంగా శిక్షిస్తుంది. మళ్లీ మరో మహిళకు ఇలా జరగకుండా చూడటమే ప్రభుత్వ ధ్యేయం. – ఎస్ఎం పవిత్ర, చైర్పర్సన్, ఏపీ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ -
వాళ్లను వదిలిపెట్టొద్దు.. గీతాంజలి భర్త ఆవేదన
సాక్షి, గుంటూరు జిల్లా: తెనాలిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టీడీపీ, జనసేన ట్రోలింగ్స్ తట్టుకోలేక గీతాంజలి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె భర్త బాలచందర్, ఇతర కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. గీతాంజలిది చిన్న పిల్ల మనస్తత్వం అని, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదన్నారు. వీడియో మాట్లాడినప్పుడు చాలా ఆనంద పడిందని, ఆ వీడియోకి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు తనలో తానే బాధపడిందని, ఫోన్ చూస్తూ నిత్యం ఏడ్చేదన్నారు. ‘‘తెల్లవారుజామున 3 గంటల వరకు ఫోను చూస్తూ ఏడుస్తూనే ఉంది. ఇంకా ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు ఉండవని చివరగా ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంది. ఒక మహిళ మీద ఇలాంటి ట్రోలింగ్స్ ఎవరైనా చేస్తారా?. ట్రోలింగ్స్ తట్టుకోలేక మా అమ్మాయి దూరమైంది. ఎవరైతే ట్రోలింగ్ చేసారో వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: టీడీపీ, జనసేన ఆన్లైన్ మృగాల వికృత క్రీడ.. ఓ చెల్లెమ్మను చంపేశారు! -
గీతాంజలి పై ట్రోల్ల్స్.. బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్
-
షర్మిలపై ఐటీడీపీ అసభ్య పోస్టింగ్ లు
-
దొంగ దొరికిండు..టీడీపీ కుట్ర బట్టబయలు..
-
షర్మిలపై ఐటీడీపీ అసభ్య పోస్టింగ్ లు
-
అది ఐటీడీపీ కాదు..సోషల్ మీడియా టెర్రరిస్టుల ఫ్యాక్టరీ
-
టీడీపీ ‘ఐ’ గేమ్..!
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ‘ఉదయగిరి మండలం గండిపాళెంలోని 31, 32 పోలింగ్ కేంద్రాల పరి«ధిలో 42 మంది టీడీపీ సానుభూతిపరుల ఓట్ల తొలగింపునకు రాపల్లె శ్రీనివాసులు అనే వ్యక్తి దరఖాస్తు చేశారు. దీనిపై టీడీపీ నాయకులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు.’ – ఇది ఈనాడు పత్రికలో వచ్చిన వార్త. వాస్తవం ఏంటంటే... గండిపాళెంలో 42 మంది ఓట్ల తొలగింపు కోసం ఫారం–7 ద్వారా ఆన్లైన్లో నమోదు చేయడం నిజమే. కానీ రాపల్లె శ్రీనివాసులు పేరుతో నమోదు చేసింది మాత్రం జిల్లా ఐ టీడీపీ వింగ్‌లో ఉన్న కీలక వ్యక్తి. గండిపాళేనికి చెందిన ఐ టీడీపీ లీడరే రాపల్లె శ్రీనివాసులు పేరుతో ఫారం–7 నమోదు చేయించి ఆ నేరం వైఎస్సార్సీపీపై నెట్టేశారు. ఎలక్షన్ కమిషన్‌కు టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. పచ్చపత్రికలో దీనిపై వార్త కూడా ప్రచురించేశారు. ఆ 42 మంది అసలు స్థానికులు కారు. వ్యాపారాల పేరుతో గత 20 ఏళ్లుగా హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, బెంగళూరు ప్రాంతాల్లో స్థిరపడిన వారే. వారి ఆధార్ కార్డులు పరిశీలించినా స్థానికేతరులని తెలుస్తుంది. కానీ తహసీల్దార్ వాస్తవాలు తెలుసుకోకుండా పచ్చపత్రిక ప్రభావం, స్థానిక టీడీపీ నేతల ఒత్తిడితో రాపల్లె శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు. స్వచ్ఛమైన జాబితాలపైనా టీడీపీ కుయుక్తులు స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలు రూపొందిస్తున్నప్పటికీ దాన్ని అడ్డుకునేందుకు టీడీపీ రకరకాల కుయుక్తులు పన్నుతోంది. తాజాగా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారంటూ అభూత కల్పన కోసం ఐ టీడీపీ వింగ్‌ను టీడీపీ రంగంలోకి దింపింది. ఆ టీం సభ్యులు టీడీపీ సానుభూతిపరులు అధి కంగా ఉన్న గ్రామాలను ఎంచుకుంటున్నారు. ఆ గ్రామానికి చెందిన వారు ఇతర ప్రాంతాలలో వ్యాపార నిమిత్తం స్థిరపడి ఉండి టీడీపీ సానుభూతిపరులైన వారిని ఎంపిక చేసుకుని వారి ఓట్లు తొలగించమని, ఈ మెయిల్స్ ద్వారా ఆన్లైన్లో ఫారం–7ను నమోదు చేయిస్తున్నారు. వెంటనే స్థానిక టీడీపీ నేతల చేత ఫిర్యాదులు చేయిస్తున్నారు. ఇరకాటంలో అధికారులు టీడీపీ చేస్తున్న ఈ పన్నాగంతో అధికారుల ఆత్మస్థైర్యం దెబ్బతింటోంది. ముందుగా ఐ టీడీపీ సభ్యులు ఫారం–7 దరఖాస్తులు పంపి ఎల్లో మీడియాలో అవి వైఎస్సార్సీపీ నాయకులు పంపినట్లుగా కథనాలు రాయిస్తున్నారు. రోజూ అధికారులపై వ్యతిరేక వార్తలు రాయించి వారిపై ఒత్తిడి పెంచుతున్నారు. నెల రోజులుగా జిల్లాల్లో ఓటర్ల జాబితాలో లోపాలున్నాయంటూ ఎల్లో మీడియాలో నిత్యం వార్తలు వసూ్తనే ఉన్నాయి. వాటిపై టీడీపీ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం, వాటిని జిల్లా కలెక్టర్‌కు ఎన్నికల కమిషన్ పంపి విచారణలు చేయించడం జరుగుతోంది. ఇలా అధికారులపై కొత్తరకం దాడి చేయిస్తున్నారు.