
అమరావతి: ప్రముఖ గాయని మంగ్లీపై టీడీపీ & కో సోషల్ మీడియా వేదికగా మామూలు విషం చిమ్మడం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆమె చంద్రబాబుపై పాట పాడమని టీడీపీ కోరింది. అయితే అందుకు ఆమె సున్నితంగా తిరస్కరించారు. అదే సమయంలో వైఎస్ జగన్ మీద అభిమానంతో ఓ పాట పాడారు. ఈ క్రమంలో ఆ కోపాన్ని ఇప్పుడు సందర్భం రావడంతో ప్రదర్శిస్తోంది యెల్లో బ్యాచ్.
శ్రీకాకుళం అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాల సందర్భంగా ఈ నెల నాలుగో తేదీన గాయని మంగ్లీ(Singer Mangli) బృందం పాటల కార్యక్రమం ఏర్పాటు నిర్వహించింది. ఆ టైంలో కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు కుటుంబ సభ్యులతో దర్శనానికి వెళుతూ.. సింగర్ మంగ్లీని కూడా వెంట తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన దృశ్యాలు, చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ఇప్పుడు పోస్ట్ చేస్తోంది.

చంద్రబాబు పేరును పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తిని వెంట పెట్టుకుని మరీ ఎలా లోపలికి తీసుకెళ్తారంటూ రామ్మోహన్‌నాయుడును టీడీపీ వర్గాలు తప్పుబడుతున్నాయి. ఈ క్రమంలో.. అసలు ఆమెకు గుడిలోకి వెళ్లే అర్హతే లేదన్నట్లు అడ్డగోలు పోస్టులు పెడుతున్నారు. అదే టైంలో.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంగ్లీ టీటీడీకి చెందిన ఎస్వీబీసీ ఛానల్‌కు సలహాదారుగా పని చేశారని గుర్తు చేస్తూ ఆ విమర్శలను ఇంకా తీవ్ర తరం చేస్తున్నారు. ఒకవైపు టీడీపీ అనుకూల మీడియా సైతం ఈ విమర్శలను ప్రముఖంగా ప్రచురిస్తుండడం గమనార్హం. మరోవైైపు.. ఒక కళాకారిణిగా ఆమెకు రాజకీయాలను ఆపాదించడం ఎంతమాత్రం సరికాదని కొందరు ఆమెకు మద్ధతుగా నిలుస్తుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment