Rammohan Naidu
-
భూబదిలీ కాగానే వరంగల్ ఎయిర్పోర్ట్ పనులు
సాక్షి, హైదరాబాద్: వరంగల్‌లో విమానాశ్రయానికి అదనంగా కావాల్సిన 250 ఎకరాల భూమి భారత ఎయిర్పోర్ట్ అథారిటీకి బదిలీ కాగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్నాయుడు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రక్రియను వేగంగానే నిర్వహిస్తుందని ఆశిస్తున్నామన్నారు. బుధవారం మధ్యాహ్నం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్తగా ఏర్పాటు చేసిన నెక్ట్స్ జనరేషన్ ఎయిర్‌పోర్టు ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు మాట్లాడారు. రాష్ట్రంలో కొత్తగా ప్రతిపాదించిన విమానాశ్రయాల్లో తొలుత వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఏపీలోని భోగాపురం విమానాశ్రయాన్ని 2026 జూన్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. బెదిరింపు కాల్స్‌పై చర్యలకు చట్ట సవరణ దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో బాంబులు పెట్టామంటూ కాల్స్ చేస్తున్న ఘటనలు తీవ్రమైన నేపథ్యంలో, అలాంటి ఫోన్‌కాల్స్ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్ట సవరణ చేయనున్నామని మంత్రి వెల్లడించారు. ఫేక్ కాల్స్ విమాన ప్రయాణాలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న వారికి జైలు శిక్షతోపాటు జీవితాంతం విమానాల్లో ప్రయాణించే వీలు లేకుండా చట్టాన్ని సవరించాలని యోచిస్తున్నామని చెప్పారు. ఇందుకు భారత పౌరవిమానయాన చట్టం 1982కు సవరణలు ప్రతిపాదించామని, దీనిపై మంత్రివర్గ స్థాయిలో విస్తృత చర్చ జరుగుతోందని, అభిప్రాయ సేకరణ తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో కొత్తగా మరో 50 విమానాశ్రయాలు పదేళ్ల కాలంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 158కి పెరిగిందని, మరో 50 విమా నాశ్రయాల నిర్మాణానికి ప్రతిపాదిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ‘పెరుగుతున్న విమాన ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రస్తుతం దేశంలో ఉన్న 800 విమానాలకు అదనంగా మరో 1,100 విమానాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. మన విమానాశ్రయాలు ఈ ఏడాది అక్టోబర్‌లో 5.3 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది ఇదే నెలలో 1.26 కోట్ల మంది విమాన ప్రయాణం చేయగా, ఆ సంఖ్య ఈ ఏడాది అదే నెలలో 1.36 కోట్లుగా నమోదైంది’అని పేర్కొన్నారు. విమానాశ్రయాల్లో ప్రయాణికుల భద్రత, సులభతర ప్రయాణ ఏర్పాట్లు, అన్నిచోట్ల జాప్యాన్ని నివారించటమే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఎయిర్‌పోర్టు ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ భారత విమానయాన రంగంలో ఓ మైలురాయి అని మంత్రి పేర్కొన్నారు. జీఎమ్మార్ ఎయిర్‌పోర్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సౌత్చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ కిషోర్ మాట్లాడుతూ ఏఐ ఆధారితంగా పనిచేసే కొత్త కేంద్రం ఇటు ప్రయాణికుల భద్రతను మెరుగుపరచటంతోపాటు వారికి మెరుగైన ప్రయాణ అనూభూతిని కలిగిస్తుందన్నారు. 40 రకాల అంశాలను ఎప్పటికప్పుడు రియల్ టైమ్ ఆధారంగా మానిటర్ చేసే వేగంగా, తనకు తానుగా నిర్ణయాలు తీసుకొని ఏరకంగానూ ప్రయాణ సమయంలో అనవసరపు జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు. ఈ వ్యవస్థను జీఎమ్మార్ విమానాశ్రయాలన్నింటిలో త్వరలో ప్రారంభిస్తామన్నారు. జీఎమ్మార్ గ్రూపు విమానాశ్రయ విభాగ చైర్మన్ జీబీఎస్ రాజు, పౌర విమానయాన శాఖ కార్యదర్శి వాల్నమ్, జీఎమ్మార్ విమానాశ్రయ ప్రతినిధులు శ్రీనివాస్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. అంతకుముందు, కొత్తగా ప్రారంభించిన కేంద్రాన్ని పరిశీలించిన సమయంలో కేంద్రమంత్రి వెంట రాష్ట్ర రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉన్నారు. -
పోలవరానికి ద్రోహం చేసి బుకాయింపు 'ఎత్తు'గడ!
సాక్షి, అమరావతి: కనీస నీటి మట్టం (ఎండీడీఎల్) 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేయడం ద్వారా జీవనాడి పోలవరానికి తీరని ద్రోహం చేసిన కూటమి సర్కారు నిర్వాకాన్ని సాక్ష్యాధారాలతో ‘సాక్షి’ బహిర్గతం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వంఅడ్డగోలుగా బుకాయిస్తోంది. తమకు అలవాటైన రీతిలో అలవోకగా అబద్ధాలను వల్లె వేస్తూ తాము చేసిన ద్రోహాన్ని వైఎస్సార్సీపీ సర్కారుపై నెట్టేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. అడ్డగోలుగా అబద్ధాలను వల్లె వేస్తోంది. వాస్తవాలు ఇవిగో..ప్రభుత్వంపోలవరంలో 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పూర్తి చేయడానికి నిధులు ఇవ్వాలని ఫిబ్రవరి 29న కేంద్ర కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది... మిగిలిన పనులకు రూ.12,157 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదించింది... అప్పట్లో అధికారంలో ఉన్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. పోలవరం ఎత్తును తగ్గించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే!వాస్తవంపోలవరం ప్రాజెక్టు రెండో సవరించిన అంచనా వ్యయాన్ని సీడబ్ల్యూసీ టీఏసీ (సాంకేతిక సలహా మండలి) రూ.55,548.87 కోట్లుగా ఖరారు చేసిందని.. దాన్ని రివైజ్డ్ కాస్ట్ కమిటీ(ఆర్సీసీ) రూ.47,725.75 కోట్లుగా లెక్కకట్టిందని పీఐబీ నివేదికలో పేర్కొంది. 2022 జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ కార్యదర్శి(వ్యయ విభాగం) అధ్యక్షతన నిర్వహించిన కమిటీ చర్చల్లో ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. ప్రాజెక్టు రెండో దశలో గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేందుకు వీలుగా భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి అయ్యే నిధులు మంజూరు చేయాలని.. తొలి దశలో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్ఎఫ్) డ్యాం, అనుబంధ పనులు పూర్తి చేయడం... 41.15 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేయడానికి భూసేకరణ, నిర్వాసితుల పునరావాసం కల్పించడానికి నిధులు విడుదల చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరి 29న పీఐబీ కేంద్ర కేబినెట్‌కు నివేదిక ఇచ్చింది.ఈ నివేదికపై మార్చి 6న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేస్తుందని తెలుసుకున్న అప్పటి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు.. పోలవరానికి నిధులు ఇస్తే వైఎస్సార్సీపీకి ప్రయోజనం కలుగుతుందని బీజేపీ పెద్దల చెవిలో వేశారు. దాంతో అప్పట్లో కేంద్ర కేబినెట్ సమావేశం అజెండాలో పోలవరంపై పీఐబీ ఇచ్చిన నివేదికను చేర్చలేదు. పీఐబీ ఇచ్చిన నివేదికకు భిన్నంగా 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధులు మంజూరు చేయాలని ఈ ఏడాది ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌కు కేంద్ర ఆర్థిక శాఖ ప్రతిపాదించింది.45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయడానికి భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి నిధులు ఇవ్వాలనే అంశం ఆర్థిక శాఖ ప్రతిపాదనలో లేదు. దీనిపై నాటి సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి కె.రామ్మోహన్నాయుడు కనీసం అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీన్ని బట్టి చూస్తే.. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేసేలా పోలవరాన్ని పూర్తి చేయడానికి సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. మరి జీవనాడి పోలవరానికి ద్రోహం చేసిందెవరు? కూటమి ప్రభుత్వమే కదా? ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి?ప్రభుత్వంపోలవరం ప్రాజెక్టును తొలి దశ, రెండో దశ అంటూ దశలవారీగా పూర్తి చేయాలని ప్రతిపాదించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు పీపీఏ చెప్పింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయాలని ప్రతిపాదించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని పీపీఏ కుండబద్ధలు కొట్టింది.వాస్తవంవిభజన చట్టం ప్రకారం కేంద్రమే కట్టాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను 2016 సెప్టెంబరు 7న అప్పటి చంద్రబాబు ప్రభుత్వం దక్కించుకుంది. ఈ క్రమంలో తాగునీటి విభాగం వ్యయం రూ.4,068 కోట్లు, జలవిద్యుదుత్పత్తి కేంద్రం వ్యయం రూ.4,124.64 కోట్లు ఇవ్వబోమని.. కేవలం నీటిపారుదల విభాగానికి అదీ 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చేసిన ప్రతిపాదనకు నాడు చంద్రబాబు ప్రభుత్వం అంగీకరించింది. ఆ మేరకు మాత్రమే నిధులు ఇచ్చేలా 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది.అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక ప్రధాని మోదీతో సమావేశమై.. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస కల్పనకే రూ.33,168.24 కోట్లు వ్యయం అవుతుందని.. అలాంటప్పుడు రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును ఎలా పూర్తి చేయగలమని... తాజా ధరల మేరకు నిధులిచ్చి సత్వరమే ప్రాజెక్టు పూర్తికి సహకరించాలని కోరారు. తాగునీటి విభాగం, నీటిపారుదల విభాగం వేర్వేరు కాదని, రెండు ఒకటేనని.. తాగునీటి విభాగానికి అయ్యే వ్యయాన్ని ఇవ్వాలని కోరారు. ఇందుకు అంగీకరించిన ప్రధాని మోదీ.. వైఎస్ జగన్ ప్రస్తావించిన అంశాలను పరిశీలించాలని కేంద్ర జల్ శక్తి శాఖకు సూచించారు. దీంతో 2021 జూలై 8న తాగునీటి వ్యయ విభాగాన్ని నీటిపారుదల విభాగంలో కలిపేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ అంగీకరిస్తూ.. ప్రాజెక్టును రెండు దశల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించింది. ఏదైనా ఓ ప్రాజెక్టును పూర్తి చేసిన తొలి ఏడాది కనీస నీటిమట్టం స్థాయిలో నీటిని నిల్వ చేయాలని.. ఆ తర్వాత క్రమంగా గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలని 1986 మే 13న సీడబ్ల్యూసీ జారీ చేసిన మార్గదర్శకాలను గుర్తు చేస్తూ.. పోలవరం తొలి దశలో 41.15 మీటర్లు.. రెండో దశలో 45.72 మీటర్లలో నీటిని నిల్వ చేయాలని సూచించింది. ఇదే అంశాన్ని సమాచార హక్కు కింద అడిగిన ప్రశ్నకు పీపీఏ సమాధానంగా చెప్పింది. తొలి దశలో 41.15 మీటర్లు.. రెండో దశలో 45.72 మీటర్లలో నీటిని నిల్వ చేసేలా చర్యలు తీసుకుంటామంది. కానీ.. బాబు ప్రభుత్వం మాత్రం పీపీఏ చెప్పిన దాన్ని వక్రీకరించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటిని నిల్వ చేయడానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందంటూ అడ్డగోలుగా అబద్ధాలు వల్లె వేసింది.ప్రభుత్వంపోలవరం ప్రాజెక్టులో వైఎస్సార్సీపీ ప్రభుత్వం విధ్వంసం సృష్టించింది. డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి ఆ ప్రభుత్వం పాపమే కారణం. ప్రాజెక్టును పూర్తి చేయాలన్న ఆలోచనే వైఎస్ జగన్‌కు లేదు.వాస్తవంటీడీపీ హయాంలో స్పిల్‌వే, స్పిల్ ఛానల్.. ప్రధాన డ్యాం గ్యాప్–2లో పునాది డయాఫ్రం వాల్ పనులను 2016 డిసెంబర్లో ఒకేసారి చేపట్టారని.. 2017 జూలై నాటికి 1,006 మీటర్లు.. 2018 జూన్ నాటికి 390.6 మీటర్లు పూర్తి చేశారని.. 2017లో గోదావరి వరదలు డయాఫ్రం వాల్ మీదుగా ప్రవహించడం వల్ల కోతకు గురైందని.. 2018లో వరద ఉధృతికి మరింత దెబ్బతిందని తేల్చిచెబుతూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన మాట వాస్తవం కాదా నిమ్మలా? ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను పూర్తి చేయలేక ఇరువైపులా ఖాళీ ప్రదేశాలను వదిలేయడం వల్ల.. ఆ ఖాళీ ప్రదేశాల గుండా గోదావరి వరద అధిక ఉద్ధృతితో ప్రవహించడం వల్ల ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతంలో ఇసుక తిన్నెలు కోతకు గురై విధ్వంసం చోటుచేసుకోవడానికి చంద్రబాబు ప్రభుత్వ పాపాలు కారణం కాదా? కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 48 గేట్లతో సహా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ కాఫర్ డ్యాంను పూర్తి చేసి 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా వైఎస్ జగన్ మళ్లించారు.కోతకు గురైన దిగువ కాఫర్ డ్యాంను, ప్రధాన డ్యాం గ్యాప్–1లో డయాఫ్రం వాల్, గ్యాప్–3లో కాంక్రీట్ డ్యాంలను పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువ అనుసంధానాలను.. ఎడమ కాలువలో కీలకమైన నిర్మాణాలను పూర్తి చేశారు. డయాఫ్రం వాల్ భవితవ్యం తేల్చితే శరవేగంగా ప్రధాన డ్యాంను పూర్తి చేస్తామని కేంద్రాన్ని వైఎస్ జగన్ కోరుతూ వచ్చారు. ఈ క్రమంలో డయాఫ్రం వాల్ భవితవ్యంతోపాటు ప్రాజెక్టు నిర్మాణంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అంతర్జాతీయ నిపుణుల కమిటీని కేంద్రం నియమించింది. ఈ నేపథ్యంలో జీవనాడి పోలవరాన్ని జీవచ్ఛవంగా చేసిందెవరు? జీవనాడిగా మార్చిందెవరు?ప్రభుత్వంపోలవరం ఎత్తును 41.15 మీటర్లకు తగ్గించేందుకు 2021లోనే జగన్ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై మేం అప్పట్లో శాసనసభ లోపలా.. బయటా పోరాటం చేశాం.వాస్తవంపోలవరం స్పిల్ వేను ఇప్పటికే 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించామని.. కావాలంటే టేపు తీసుకొని వచ్చి కొలుచుకోవాలని అప్పట్లో శాసనసభలో నాటి సీఎం జగన్ సవాల్ విసిరారు. ప్రధాన డ్యాంను 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మిస్తామని స్పష్టం చేశారు. పోలవరం ఎత్తును తగ్గించాలనే ప్రతిపాదన లేనే లేదని, 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేస్తామని అప్పట్లో అటు రాజ్యసభ.. ఇటు లోక్‌సభలో నాటి కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సహాయ మంత్రులు రాతపూర్వకంగా కుండబద్ధలు కొట్టారు.రాజ్యసభలో నాటి టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ 2023 మార్చి 27న అడిగిన ప్రశ్నకు జవాబుగా పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మిస్తున్నామని కేంద్ర జల్ శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు. లోక్‌సభలో 2023 డిసెంబరు 7న అప్పటి ఎంపీ కె.రామ్మోహన్నాయుడు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా 1,06,006 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేలా పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని మంత్రి బిశ్వేశ్వర్ తుడు స్పష్టం చేశారు. దీన్ని బట్టి అప్పట్లో చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వీసమెత్తు నిజం లేదన్నది వాస్తవం కాదా? అప్పట్లో బాబు చేసిన అసత్య ప్రచారాన్నే ఇప్పుడు కేంద్రం ఆయుధంగా మార్చుకుని నీటి నిల్వ ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేసిందని నీటిపారుదల రంగ నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పోలవరానికి 'చంద్రబాబు కూటమి' ఉరి!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కూటమి ప్రభుత్వమే ఉరి వేసి.. ఊపిరి తీసేసిందా? ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గిస్తామని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు అంగీకరించిందా? 41.15 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని సవరిస్తూ గత ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినప్పుడు.. ఆ సమావేశంలో పాల్గొన్న టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడు అభ్యంతరం చెప్పనిది అందుకేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం చెబుతున్నాయి కేంద్ర, రాష్ట్ర అధికారవర్గాలు! సాధారణంగా కేంద్ర కేబినెట్ తీసుకునే నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి అదే రోజు మీడియాకు వెల్లడిస్తారు. కానీ.. 41.15 మీటర్ల వరకూ పోలవరం పూర్తి చేయడానికి రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు ఆమోదముద్ర వేస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అశ్విని వైష్ణవ్ ఆ రోజు మీడియాకు వెల్లడించలేదు. ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అంశం బహిర్గతమవుతుందనే పోలవరానికి నిధులు మంజూరు చేసిన అంశాన్ని మంత్రి ఆ రోజు ప్రస్తావించలేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాలతోపాటు ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణ లక్ష్యం నీరుగారిపోయిందని నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధికి చుక్కాని..⇒ పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల (150 అడుగులు) గరిష్ట నీటి మట్టంతో.. 194.6 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో.. 322 టీఎంసీలు వినియోగించుకునేలా నిర్మించుకోవడానికి గోదావరి ట్రిబ్యునల్ 1980లో అనుమతి ఇచ్చింది.⇒ అయితే దాదాపు 25 ఏళ్లపాటు ప్రాజెక్టు నిర్మాణంపై ఏ ముఖ్యమంత్రీ కనీసం ఆలోచన చేసిన పాపాన పోలేదు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా 2005లో అన్ని అనుమతులు సాధించి పోలవరం నిర్మాణాన్ని ప్రారంభించారు.⇒ పోలవరం కుడి, ఎడమ కాలువల ద్వారా 7.20 లక్షల ఎకరాలు.. కృష్ణా, గోదావరి డెల్టాల్లో 23.31 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలు వెరసి 38.51 లక్షల ఎకరాలకు నీళ్లందించవచ్చు. విశాఖ పారిశ్రామిక, తాగునీటి అవసరాల కోసం 23.44 టీఎంసీలను సరఫరా చేయవచ్చు. అంతేకాకుండా 960 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చు.⇒ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి పోలవరం చుక్కానిలా నిలుస్తుంది. అందుకే ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుందని నీటిపారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తూ వస్తున్నారు.జీవనాడి కాదు జీవచ్ఛవమే..!⇒ పోలవరం ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు 35.5 మీటర్ల నుంచి నీటిని సరఫరా చేయవచ్చు. ఎడమ కాలువ పూర్తి సామర్థ్యం 17,580 క్యూసెక్కులు కాగా కుడి కాలువ పూర్తి సామర్థ్యం 17,560 క్యూసెక్కులు.⇒ పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్లకు తగ్గించడం వల్ల జలాశయంలో గరిష్టంగా 115.44 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. గోదావరికి గరిష్టంగా వరద వచ్చే రోజుల్లో ఆయకట్టుకు నీటిని సరఫరా చేయగలిగినా.. వరద లేని రోజుల్లో ఆయకట్టుకు నీళ్లందించడం సాధ్యం కాదని అధికారవర్గాలు చెబుతున్నాయి.⇒ కాలువల ద్వారా పూర్తి సామర్థ్యం మేరకు నీటిని తరలించాలంటే ప్రాజెక్టులో 41.15 మీటర్ల కంటే ఎగువన నీటి మట్టం ఉండాలి. అప్పుడే ఎడమ కాలువ కింద 4 లక్షలు.. కుడి కాలువ కింద 3.20 లక్షల ఎకరాలకు నీళ్లందించడడంతోపాటు కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలను మళ్లించడానికి అవకాశం ఉంటుంది.⇒ పోలవరం ఆయకట్టు 7.20 లక్షల ఎకరాలతోపాటు కృష్ణా, గోదావరి డెల్టాల ఆయకట్టు స్థిరీకరణ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖకు పారిశ్రామిక, తాగునీటి అవసరాలు తీర్చడం అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు. 960 మెగావాట్ల జలవిద్యుత్ కూడా ఉత్పత్తి చేయడం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు.⇒ ఎత్తు తగ్గించడం వల్ల జీవనాడి పోలవరం ప్రాజెక్టును జీవచ్ఛవంగా మార్చేశారని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.తగ్గించేందుకు తలూపడం వల్లే..పోలవరం ప్రాజెక్టును కనీస నీటిమట్టం 41.15 మీటర్ల వరకూ పూర్తి చేసేందుకు అంచనా వ్యయాన్ని రూ.30,436.95 కోట్లకు సవరిస్తూ ఆగస్టు 28న కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిందని.. ఈ నేపథ్యంలో ఇప్పటిదాకా చేసిన వ్యయం పోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర జల్ శక్తి శాఖ సీనియర్ జాయింట్ కమిషనర్ దీపక్ చంద్ర భట్ లేఖ రాశారు. ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని... ఈ క్రమంలో 2024–25లో ఏ మేరకు నిధులు కావాలో ప్రతిపాదనలు పంపాలని ఆ లేఖలో కోరారు. ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నట్లు ఈ లేఖలో కేంద్రం స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపలేదు. అంటే.. ప్రాజెక్టు ఎత్తును తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నది స్పష్టమవుతోంది. ప్రాజెక్టుకు రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా విడుదల చేస్తూ ఈనెల 9న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలోనూ దీపక్ చంద్ర భట్ అదే అంశాన్ని పునరుద్ఘాటించారు. ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని.. ఆ మేరకు ఎంవోయూ కుదుర్చుకుందని ఆ లేఖలో పేర్కొన్నారు.కేంద్రానికి రూ.23,622 కోట్లకుపైగా మిగులు..కేంద్ర జలసంఘం టీఏసీ ఆమోదించిన ప్రకారం పోలవరం అంచనా వ్యయం 2017–18 ధరల ప్రకారం రూ.55,656.87 కోట్లు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఖరారు చేసిన దాని ప్రకారం రూ.47,725.74 కోట్లుగా ఉంది. పోలవరానికి ఇప్పటివరకూ కేంద్రం రూ.15,146.28 కోట్లను రీయింబర్స్ చేసింది. 2014 ఏప్రిల్ 1కి ముందు ప్రాజెక్టుకు రూ.4,730.71 కోట్లు ఖర్చు చేశారు. అంటే.. ఇప్పటిదాకా ప్రాజెక్టు కోసం రూ.19,876.99 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్క. సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన అంచనా వ్యయం ప్రకారం చూస్తే పోలవరానికి ఇంకా రూ.35,779.88 కోట్లు రావాలి. ప్రస్తుతం రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అంటే ఇంకా రూ.23,622.35 కోట్లు విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇవ్వాలి. ఆ నిధులు ఇస్తేనే 41.15 మీటర్ల కాంటూరు నుంచి 45.72 మీటర్ల వరకూ నీటిని నిల్వ చేయడానికి అవసరమైన ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించవచ్చు. భూమిని సేకరించవచ్చు. కానీ.. పోలవరం ఎత్తును 41.15 మీటర్లకే పరిమితం చేయడంతో కేంద్రానికి రూ.23,622.35 కోట్లు మిగిలినట్లైంది. -
ముప్పై కోట్లకు విమాన ప్రయాణికులు! ఎప్పటి వరకంటే..
న్యూఢిల్లీ: ఈ దశాబ్దం ఆఖరు నాటికి (2030) దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య 30 కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ నేపథ్యంలో విమానాశ్రయాలను అభివృద్ధి చేసేందుకు సుమారు 11 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఫ్రెంచ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (జీఐఎఫ్ఏఎస్) సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. అత్యంత వేగంగా ఎదుగుతున్న సివిల్ ఏవియేషన్ మార్కెట్లలో భారత్ కూడా ఒకటని, పెరుగుతున్న డిమాండ్‌కి అనుగుణంగా ఎయిర్‌లైన్స్ కూడా తమ విమానాల సంఖ్యను పెంచుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా 157 విమానాశ్రయాలు, హెలిపోర్ట్‌లు, వాటర్‌డ్రోమ్‌లు ఉన్నాయని చెప్పారు. వినియోగంలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌ల సంఖ్య 2025 ఆఖరు నాటికి 200కి పెరగవచ్చని పేర్కొన్నారు. వచ్చే 20–25 ఏళ్లలో మరో 200 విమానాశ్రయాలను అభివృద్ధి చేసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో పర్యావరణ అనుకూల విమాన ఇంధన సరఫరా వ్యవస్థను పటిష్టంగా తీర్చిదిద్దడంపై భారత్, ఫ్రాన్స్ కలిసి పని చేయొచ్చని ఆయన తెలిపారు. ఎయిర్‌బస్ భారత మార్కెట్ నుంచి విడిభాగాల కొనుగోళ్లను మరింతగా పెంచుకోనున్నట్లు ఎయిర్‌బస్ సీఈవో గిలామీ ఫారీ తెలిపారు. 2019–2024 మధ్య కాలంలో భారత్ నుంచి సరీ్వసులు, విడిభాగాల కొనుగోళ్లను రెట్టింపు స్థాయిలో 1 బిలియన్ యూరోలకు పెంచుకున్నట్లు వివరించారు. తమకు ఇక్కడ 100కు పైగా సరఫరాదారులు ఉన్నట్లు జీఐఎఫ్ఏఎస్లో పాల్గొన్న సందర్భంగా ఫారీ చెప్పారు. జీఐఎఫ్ఏఎస్లో భాగమైన కంపెనీలు భారత్ నుంచి ఏటా 2 బిలియన్ డాలర్ల పైగా కొనుగోళ్లు జరుపుతున్నాయని పేర్కొన్నారు. ఎయిర్‌బస్‌కు 8,600 విమానాల ఆర్డర్ బుక్ ఉండగా, ఈ ఏడాది 770 ప్లేన్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దేశీయంగా ఇండిగో, ఎయిరిండియా కలిసి 1,000కి పైగా విమానాల కోసం ఆర్డరు ఇచ్చాయి. -
విమాన తయారీకి ప్రభుత్వ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా వాణిజ్య విమానాల తయారీకి బూస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ)ను ఏర్పాటు చేయనుంది. తద్వారా విమాన తయారీ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లనున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశీయంగా వేగవంత వృద్ధిలో ఉన్న వైమానిక రంగానికి పలు అవకాశాలున్నట్లు తెలియజేశారు. భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024ను లోక్‌సభ ఆగస్ట్‌లో ఆమోదించింది. ఈ బిల్లులో విమాన తయారీ, డిజైన్లను నియంత్రించే ప్రొవిజన్లను చేర్చింది. తద్వారా ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి వత్తాసు పలకడం ద్వారా సొంత తయారీకి దారి ఏర్పాటు చేసింది. వెరసి సొంత విమానాలను భారత్ తయారు చేసుకునేందుకు ప్రభుత్వం పటిష్ట కార్యాచరణకు తెరతీసిందని నాయుడు తెలియజేశారు. ఇందుకు ఏర్పాటు చేయనున్న ఎస్పీవీలో పరిశ్రమ సంబంధిత నిపుణులు తదితరులను భాగస్వాములను చేయనున్నట్లు వెల్లడించారు. రానున్న ఐదేళ్లలో సొంత విమానాల తయారీ కార్యకలాపాలు ప్రారంభంకాగలవని హామీనిచ్చారు. విమాన తయారీలో ప్రధాన పాత్ర పోషించడంతోపాటు.. వీటిని భారత్ ఎగుమతి చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. విమాన తయారీ దిగ్గజాలు బోయింగ్, ఎయిర్‌బస్‌లకు భారత్ కీలక మార్కెట్‌గా నిలుస్తున్నట్లు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ దిగ్గజం హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) ఇప్పటికే చిన్నతరహా పౌర విమానాలను రూపొందిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచంలోనే వేగవంతంగా విస్తరిస్తున్న వైమానిక మార్కెట్లలో భారత్ ఒకటని పేర్కొన్నారు. పీహెచ్డీ సీసీఐ ఏర్పాటు చేసిన సదస్సులో నాయుడు వైమానిక తయారీ అంశాలపై ప్రసంగించారు. విమానాల నిర్వహణ, పూర్తిస్థాయి తనిఖీలు, మరమ్మతుల(ఎంఆర్వో) కార్యకలాపాలలో సైతం భారత్‌కు అపార అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. దేశాన్ని వైమానిక, ఎయిర్ కార్గో, ఎంఆర్వో కార్యకలాపాలకు కేంద్రంగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రస్తావించారు. -
24 గంటల్లో 228 మిల్లీమీటర్లు.. ఢిల్లీ వాన సరికొత్త రికార్డు
న్యూఢిల్లీ, సాక్షి: రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వాన.. ఢిల్లీని నీట ముంచింది. తెల్లారి చూసేసరికి.. నీట మునిగిన రోడ్లు.. కాలనీలు, అందులో బైకులు, కార్లు నగరవాసుల్ని బిత్తరపోయేలా చేశాయి. మరోవైపు ఢిల్లీఎయిర్‌పోర్ట్ టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిన ఘటనలో ఒకరు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలుకాగా, టెర్మినల్-1 వద్ద కార్యకలాపాల్ని అధికారులు నిలిపివేశారు.వేసవి తాపంతో అల్లలాడిపోతున్న దేశరాజధానిని వరుసగా రెండో రోజు వరుణుడు పలకరించాడు. అయితే వర్షం నాన్‌స్టాప్‌గా కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. పొద్దుపొద్దున్నే ట్రాఫిక్‌జామ్‌తో జనాలు అవస్తలు పడ్డారు. గత 24 గంటల్లో 228 మిల్లీమిటర్ల వర్షపాతం నమోదు కాగా, కేవలం అర్ధరాత్రి 2.30గం. నుంచి 5.30గం. మధ్యలోనే 150 మిల్లీమీటర్ల వర్షం నమోదైంది. ఢిల్లీ జూన్ వర్షాల్లో ఇది కొత్త రికార్డు అని అధికారులు అంటున్నారు. #WATCH | Drone visuals from ITO in Delhi show the current situation in the area as it remains waterlogged due to incessant heavy rainfall.(Visuals shot at 10 am) pic.twitter.com/nkN7DDxHwm— ANI (@ANI) June 28, 2024#WATCH | Severe waterlogging in different parts of Delhi, following incessant heavy rainfall.(Visuals from Raisina road and Firozeshah road) pic.twitter.com/HdVpxBFPaR— ANI (@ANI) June 28, 20241936లో జూన్ 28వ తేదీన 235.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, నిన్న కురిసిన వర్షం రెండో అత్యధికం అనేది అధికారికంగా ధృవీకరణ కావాల్సి ఉంది. #WATCH | People wade through water as incessant rainfall causes waterlogging in parts of Delhi; visuals from Mehrauli Badarpur Road pic.twitter.com/pcMa0eTQzC— ANI (@ANI) June 28, 2024#WATCH | Roads in several parts of Delhi inundated after heavy rainfall overnight(Visuals from Shanti Path) pic.twitter.com/mIBlFtJnGw— ANI (@ANI) June 28, 2024#WATCH | Waterlogging witnessed at several parts of Delhi following heavy rain(Visuals from Moti Bagh) pic.twitter.com/XLV1xs7YyW— ANI (@ANI) June 28, 2024 #WATCH | Heavy overnight rainfall leaves several parts of Delhi waterlogged. Visuals from Mandawali area. pic.twitter.com/UBUCidfoOS— ANI (@ANI) June 28, 2024#WATCH | A truck submerged as incessant rainfall causes severe waterlogging in parts of Delhi. (Visuals from Minto Road) pic.twitter.com/tc2DJQpSVX— ANI (@ANI) June 28, 2024శుక్రవారం వేకువజామున ఈదురు గాలుల వాన ధాటికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిపోయింది. ఘటనలో కొన్ని వాహనాలు ధ్వంసం అయ్యాయి. పలువురు అందులో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు మొదలయ్యాయి. ఫైర్ సిబ్బంది క్షతగాత్రుల్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు అధికారులు ధృవీకరించారు. ఆరుగురికి గాయాలయ్యాయని, అందులో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు.శుక్రవారం ఉదయం 5.30గం. ప్రాంతంలో ఘటన జరిగిందని సమాచారం వచ్చిందని, వాళ్లను రక్షించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించామని ఫైర్ విభాగం డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతుండడంతో.. టెర్మినల్ వద్ద కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. #WATCH | Latest visuals from Terminal-1 of Delhi airport, where a roof collapsed amid heavy rainfall, leaving 6 people injured pic.twitter.com/KzxvkVHRGG— ANI (@ANI) June 28, 2024 #UPDATE | 6 people injured after a roof collapsed at Terminal-1 of Delhi airport: Atul Garg, Fire Director https://t.co/r0ikZqMq9N— ANI (@ANI) June 28, 2024మరోవైపు ఈ ఘటనసహాయక చర్యలను వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్నాయుడు ఎక్స్ ద్వారా తెలియజేశారు. Personally monitoring the roof collapse incident at T1 Delhi Airport. First responders are working at site. Also advised the airlines to assist all affected passengers at T1. The injured have been evacuated to hospital. Rescue operations are still ongoing.— Ram Mohan Naidu Kinjarapu (@RamMNK) June 28, 2024 -
రేపు కేంద్రమంత్రులుగా కిషన్‌రెడ్డి, సంజయ్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రుల బాధ్యతల స్వీకారానికి ముహూర్తాలు ఖరారయ్యాయి. ఈనెల 13న ఉదయం 11 గంటల కు జి.కిషన్‌రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి గా శాస్త్రి భవన్‌లోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ సహా య మంత్రిగా బండి సంజయ్ నార్త్ బ్లాక్‌లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయు డు, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం లేదా శుక్రవారం, శ్రీనివాస వర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
నారా లోకేష్‌కు ఎమ్మెల్యే రెడ్డి శాంతి సవాల్
పాతపట్నం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దమ్ము, ధైర్యం ఉంటే మాట్లాడిన మాటలు నిరూపించాలని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి సవాల్ విసిరారు. ఆమె మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కలమట వెంకటరమణ రాసిన స్క్రి ప్టు లేకపోవడంతో పవన్ కళ్యాణ్ బంటులు రాసి న స్క్రిప్ట్‌నే లోకేష్ చదివారని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరో పణలు చేయడం కాదని, దమ్ము, ధైర్యం ఉంటే నిరూపించాలన్నారు. లోకేష్ మతి భ్రమించి మా ట్లాడుతున్నాడని, లోకేష్‌ను హైదరాబాద్ ఎర్రగెడ్డ మెంటల్ ఆస్పత్రిలో జాయిన్ చేయాలని అన్నా రు. 2014–19 కాలంలో అవినీతి అక్రమాలు జరిగినందు వల్లే మిమ్మల్ని జనం తరిమికొట్టారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వైఎస్ జగన్ భిక్షతో గెలిచి టీడీపీలోకి జంప్ అయ్యారని, చంద్రబాబే కొనుగోలు చేశార ని గుర్తు చేశారు. కలమట, ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, చంద్రబాబు పాలనలో జన్మభూమి కమిటీల పేరు తో, ప్రజలను హింస పెట్టారని గుర్తు చేశారు. అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారని అన్నారు. కలమట అక్రమ వ్యాపారాల్లో రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడుకు కూడా వాటాలు ఉన్నాయన్నారు. జగనన్న రాజ్యంలో ప్రజలకు సంక్షేమ పథకాలు చక్కగా అందిస్తున్నామని చెప్పారు. కాగువాడ–రొమదల మధ్య మహేంద్రతనయ నదిపై వంతెన మా హయాంలో జరిగితే ఎంపీ తన ఖాతాలో వేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో ఎంపీపీ దొర సావిత్రమ్మ, పీఏసీఎస్ అధ్యక్షుడు ఎం.శ్యామ్‌సుందరావు, పార్టీ మండల అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, ఎంఎస్ఎం రాష్ట్ర డైరెక్టర్ వై.వెంకటరమణ, పార్టీ వీవర్స్ జిల్లా అధ్యక్షుడు మంచు చంద్రయ్య, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జి.అప్పన్న, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం.తాతయ్య, నాయకులు బి.నారాయణమూర్తి, గేదెల సూర్యం, పనుకు మోహన్ పాల్గొన్నారు. -
స్టేజ్‌పై కిందపడ్డ అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు
సాక్షి, శ్రీకాకుళం: సర్దార్ లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమ వేదికపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్ నాయుడు కూర్చుంటుండగా.. ఒక్కసారిగా వెనక్కిపడిపోయారు. వేదికపై ఉన్న సోఫా వెనక్కి తూలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. నిర్వాహకులు వెంటనే అప్రమత్తమైన వారిని పైకిలేపి కుర్చీలను సరిచేశారు. అయితే, ఇద్దరికీ గాయాలేమీ కాకపోవడంతో నిర్వాహకులు ఊపిరిపీల్చుకున్నారు. -
ఎంపీ రామ్మోహన్ నాయుడుపై వెలమ సంఘం నాయకుల మండిపాటు
-
‘చిరంజీవి లేకుంటే నా పరిస్థితి ఏమై పోయేదో’
సాక్షి, హైదరాబాద్: తీవ్ర అనారోగ్యంతో గత 4 నెలల నుండి చికిత్స పొందుతున్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ నాయుడుని మెగాస్టార్ చిరంజీవి గారు పరామర్శించిన విషయం తెలిసిందే. ఆయన ఆరోగ్యం బాగా లేదన్న విషయం తెలిసిన వెంటనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ ధైర్యం చెప్పడమే కాకుండా, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చేశారు. ఆయన ఆరోగ్యం కుదుటపడి కోలుకోవడంతో మెగాస్టార్‌ను కలిసి కృతజ్ఞతలు చెప్పడానికి శనివారం రామ్మోహన్ నాయుడు చిరంజీవి ఇంటికి వెళ్ళారు. చిరంజీవిని కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ‘నేను ప్రజారాజ్యం పార్టీలో చురుకుగా పాల్గొన్నాను. గత నాలుగు నెలల నుండి నాకు ఆరోగ్యం బాగాలేదు. కరీంనగర్లో ట్రీట్మెంట్ తీసుకున్నాను. మొదట జాండిస్ అన్నారు...కానీ ఆ ట్రీట్మెంట్ లో చాలా వీక్ అయ్యాను, మనుషులను కూడా గుర్తుపట్టలేదు. ఇడ్లీ లో సగంకుడా తినలేని పరిస్తితికి వెళ్ళాను. మొత్తానికి అక్కడనుండి హైదరాబాద్ వచ్చాను, నా అనారోగ్యం గురించి చిరంజీవి తెలుసుకుని నన్ను ఇంటి నుంచి ఆసుపత్రిలో చేర్పించారు. నిజంగా ఇది నాకు పునర్జన్మ లాంటిది. చిరంజీవి నా అనారోగ్యం గురించి తెలుసుకుని, ఆయన స్వయంగా మా ఇంటికి వచ్చి పరామర్శించారు. అక్కడి వైద్యలు, చిరంజీవి గారి వల్లనేను పూర్తిగా కొలుకున్నాను. చిరంజీవి లేకుంటే నా పరిస్థితి ఏమై పోయేదో. ఆయన నాకు ఇచ్చిన సపోర్ట్ కు నా జన్మంతా రుణపడి ఉంటాను, అలాగే స్వామి నాయుడు, మెగా ఫ్యాన్స్ కు కూడా నా ధన్యవాదాలు’ అన్నారు. -
రామ్మోహన్.. లోకేష్‌కు సమ ఉజ్జీనే
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘తక్కువ మాట్లాడటం వల్ల ఎప్పుడూ మేలే జరుగుతుంది.. అజ్ఞానం బయటపడదు. రామ్మోహన్ నాయుడు కొన్నాళ్లు అలాగే ఉంటే బాగుండేది. కొన్ని కామెంట్లతో తనను తాను ఎక్స్పోజ్ చేసుకున్నాడు. ఏ రకంగా చూసినా లోకేష్‌కు సమ ఉజ్జీనే.. డౌటేలేదు’ అని ట్వీట్ చేశారు. (ఉండేది ఎవరో, వీడేది ఎవరో? 19న) -
ఎంపీ గారూ.. రూ.12 కోట్లకు లెక్క చెప్పగలరా?
పోలాకి: గత ప్రభుత్వంలో తంపర భూముల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం పేరుతో రూ. 12 కోట్లు ఖర్చు చేశారని, ఎంపీ రామ్మోహన్నాయుడు ఈ లెక్క చెప్పగలరా? అని పోలాకి పీఏసీఎస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ కరిమి రాజేశ్వరరావు ప్రశ్నించారు. మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదేశాల మేరకు పార్టీ నాయకులతో కలసి తంపర భూములను పరిశీలించారు. అనంతరం సుసరాంలోని మాజీ ఎంపీపీ దుంపల భాస్కరరావు స్వగృహంలో ఆయన మాట్లాడారు. తంపర భూముల ముంపు పాపం ముమ్మాటికీ టీడీపీదేనని దుయ్యబట్టారు. ఉప్పుగెడ్డ విస్తరణ పేరుతో రూ.12 కోట్లు దుర్వినియోగం చేశారని, ప్రస్తుతం తంపరభూముల ముంపు రైతులను టీడీపీ నాయకులు పరామర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉప్పుగెడ్డపై వంతెనలు నిర్మిస్తామని వంచన చేసిన మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. ఎంపీకి నిజంగా తంపర రైతుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే ఎంపీ నిధులతో వంతెనలు నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు కణితి కృష్ణారావు, మాజీ ఎంపీపీ దుంపల భాస్కరరావు, నాయకులు ముద్డాడ భైరాగినాయుడు, రెంటికోట త్రినాథరావు పాల్గొన్నారు. -
హైకోర్టును ఆశ్రయించనున్న మోదుగుల
సాక్షి, అమరావతి : గుంటూరు, శ్రీకాకుళం లోక్‌సభ ఎన్నికల ఫలితాల ప్రకటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఈ రెండు స్థానాల్లో పూర్తి ఓట్లను లెక్కించకుండానే రిటర్నింగ్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ఫలితాలను ప్రకటించారని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాల్లో స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కింపులో సరైన నిబంధనలు పాటించకుండా అధికారులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారని గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. మోదుగులపై టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ 4205 ఓట్ల స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. ఈ స్థానంలో దాదాపు 9700 పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించకుండా తిరస్కరించడంతో ఫలితం తారుమారైందని, అధికారులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. మొత్తం నమోదైన 14 వేలకు పైచిలుకు పోస్టల్ బ్యాలెట్లలో 4600 పైచిలుకు ఓట్లను మాత్రమే లెక్కించగా, వాటిల్లో మోదుగులకు దాదాపు 3 వేలు, గల్లాకు 12 వందలపైచిలుకు వచ్చాయి. మరో 9700 ఓట్లను తిరస్కరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఫారమ్ 13 (ఎ) ద్వారా నమోదు చేసిన పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 13 (బి) నంబర్ ను కవర్ పైన వేయలేదన్న సాకుతో ఆఓట్లను తిరస్కరించారని, ఇందుకు జిల్లా ఎన్నికల అధికారి బాధ్యత వహించాల్సి ఉంటుందని మోదుగుల చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కు మేరకు ఎన్నికల విధుల్లో నమగ్నమయ్యే సిబ్బంది పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తలన్నింటిపైనా తగిన తర్ఫీదు ఇవ్వడంతో పాటు మొత్తం బాధ్యత ఎన్నికల అధికారిదేనని వివరించారు. ఎన్నికల అధికారి తన బాధ్యతలను నిర్వర్తించకుండా పోస్టల్ బ్యాలెట్లను ఏకపకంగా తిరస్కరించడానికి వీలులేదని, ఇది ఓటర్లకు ఉన్న హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. పైగా ఈ రకంగా 9700 ఓట్లను తిరస్కరించారని, మెజారిటీ తక్కువగా వచ్చిన సందర్భాల్లో ఇలాంటి ఓట్లను మళ్లీ మళ్లీ లెక్కించాలని నిబంధనలు, సుప్రీంకోర్టు, హైకోర్టు రూలింగ్స్ ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. మొత్తం ఓట్లను లెక్కించకుండా ఎన్నికల జర్నల్స్ కు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంపై హైకోర్టును ఆశ్రయించనున్నట్టు మోదుగుల చెప్పారు. గుంటూరు లోక్‌సభ స్థానంతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ ఇదే తరహా చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశంపై పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తెచ్చారు. పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిపారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ దాఖలు చేయాలని నిర్ణయించినట్టు మోదుగుల మీడియాతో చెప్పారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో.. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి ప్రత్యర్థి గల్లా జయదేవ్ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయి. గుంటూరు లోక్‌సభ పరిధిలో సుమారు 9,700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్ అధికారులు తేల్చి పక్కన పడేశారు. అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. కవర్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ మోదుగుల అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ లెక్కింపు రోజున అధికారులు అంగీకరించలేదు. శ్రీకాకుళం లోక్‌సభ పరిధిలో.. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇచ్ఛాపురం, టెక్కలిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తం మీద స్వల్ప మెజార్టీతో రామ్మోహన్ నాయుడు గట్టెక్కారు. ఇక పలు చోట్ల అసెంబ్లీ నియోజక వర్గాల్లో సైతం పోస్టల్ బ్యాలెట్లు జారీ చేసిన ఉద్యోగులు చేసిన పొరపాట్లు వల్ల అవి చెల్లుబాటు కాకుండా పోయాయి. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్ఆర్సీపీ -
శ్రీకాకుళం గుంటూరు ఎంపీ ఎన్నికలపై కోర్టుకెళ్లనున్న వైఎస్ఆర్సీపీ
-
క్రాస్ ఓటింగ్‌తో గట్టెక్కారు!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు : రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్ ప్రభంజనంలో టీడీపీ ఎంపీ అభ్యర్థులందరూ కొట్టుకుపోయినా ముగ్గురు మాత్రం తక్కువ మెజారిటీతో గట్టెక్కారు. ఇందుకు ప్రధాన కారణం క్రాస్ ఓటింగేనని పోలింగ్ సరళిని బట్టి అర్ధమవుతోంది. శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు ఎంపీ ఫలితాలను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతోంది. శ్రీకాకుళం సిట్టింగ్ ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు కేవలం 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో వైఎస్సార్సీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌పై గెలుపొందారు. 2014 ఎన్నికలలో రామ్మోహన్నాయుడు 1,27,692 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఇచ్ఛాపురం, టెక్కలిలో మాత్రమే టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. అయితే క్రాస్ ఓటింగ్ కారణంగా రామ్మోహన్ గట్టెక్కారు. - ఇచ్ఛాపురం నియోజకవర్గంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి బెందాళం అశోక్‌కు 79,405 ఓట్లు వస్తే రామ్మోహన్‌కు 82,640 ఓట్లు వచ్చాయి. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్‌కు 71,931 ఓట్లు వస్తే ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు కేవలం 68,570 ఓట్లు వచ్చాయి. ఈ ప్రకారం 3,361 ఓట్లు క్రాసింగ్ జరిగింది. - పలాసలో గెలుపొందిన వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ సీదిరి అప్పలరాజుకు 75,357 ఓట్లు రాగా ఎంపీ అభ్యర్థి దువ్వాడకు కేవలం 65,939 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే.. 9,418 ఓట్లు తగ్గిపోయాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషకు 59,873 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 68,813 ఓట్లు వచ్చాయి. - రామ్మోహన్, దువ్వాడ శ్రీనివాస్ ఇద్దరికీ సొంత ప్రాంతమైన టెక్కలి నియోజకవర్గంలో కూడా క్రాస్ ఓటింగ్ జరిగినా స్వల్పమే. - పాతపట్నం నియోజకవర్గంలో విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి రెడ్డి శాంతికి 75,669 ఓట్లు రాగా, ఇక్కడ దువ్వాడకు 70,698 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి కలమట వెంకటరమణకు 60,975 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 64,656 ఓట్లు వచ్చాయి. నరసన్నపేటలో గెలుపొందిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్‌కు 85,622 ఓట్లు రాగా దువ్వాడకు 80,855 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడి టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తికి 66,597 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 72,890 ఓట్లు వచ్చాయి. - శ్రీకాకుళం నియోజకవర్గంలో విజయం సాధించిన వైఎస్సార్సీపీ అభ్యర్థి ధర్మాన ప్రసాదరావుకు 82,388 ఓట్లు రాగా దువ్వాడకు 75,253 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి 77,575 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 84,631 ఓట్లు వచ్చాయి. ఆమదాలవలస నియోజకవర్గంలో గెలిచిన వైఎస్సార్సీపీ అభ్యర్థి తమ్మినేని సీతారాంకు 76,801 ఓట్లు రాగా, దువ్వాడకు 74,781 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కూన రవికుమార్‌కు 63,274 ఓట్లు రాగా రామ్మోహన్‌కు 62,722 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తం మీద 6,658 ఓట్ల స్వల్ప మెజార్టీతో రామ్మోహన్నాయుడు గట్టెక్కారు. గుంటూరు లోక్‌సభ పరిధిలో.. గుంటూరు పార్లమెంట్ విషయానికొస్తే.. ఇక్కడి వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి కూడా క్రాస్ ఓటింగ్ కారణంతోనే ఓటమి పాలయ్యారు. ఇక్కడ గుంటూరు వెస్ట్ మినహా మిగతా ఆరు అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఆరు చోట్లా వైఎస్సార్సీపీ అభ్యర్థులకు 53,731 ఓట్ల మెజార్టీ వచ్చింది. మోదుగులకు మాత్రం ప్రత్యర్థి గల్లా జయదేవ్ కంటే 4,205 ఓట్లు తక్కువగా వచ్చాయి. సుమారు 55 వేల ఓట్ల మేర క్రాస్ ఓటింగ్ జరిగింది. మరో విచిత్ర విషయం ఏమిటంటే.. గుంటూరు పార్లమెంట్ పరిధిలో సుమారు 10వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చెల్లనివిగా కౌంటింగ్ అధికారులు తేల్చి పక్కన పడేశారు. అందుకు కవర్‌పై 13–సీ నంబరు లేకపోవడమే కారణంగా చెబుతున్నారు. కవర్లో ఉన్న పోస్టల్ బ్యాలెట్లో తప్పులు లేనప్పుడు అవి లెక్కించాలంటూ మోదుగుల పట్టుబట్టినప్పటికీ అధికారులు అంగీకరించలేదు. విజయవాడలోనూ ఇంతే.. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ భారీగా క్రాస్ ఓటింగ్ జరిగింది. తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామతో పాటు విజయవాడ నగరంలోని సెంట్రల్, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థుల కంటే టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అటొక ఓటు.. ఇటొక ఓటు వేసిన ఫలితంగా వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వీరప్రసాద్ ఓటమి పాలయ్యారు. - విజయవాడ నగరంలోని సెంట్రల్, పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున పోటీచేసిన అభ్యర్థులకు మొత్తం 1,21,460 ఓట్లు రాగా.. కేశినేనికి మాత్రం 1,43,307 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ అభ్యర్థులతో పోలిస్తే కేశినేని నానికి 21,847 ఓట్లు అదనంగా లభించాయి. - ఇక జగ్గయ్యపేట, తిరువూరు, మైలవరం, నందిగామ నియోజకవర్గాల్లోనూ క్రాస్ ఓటింగ్ ద్వారా కేశినేని లబ్ధిపొందారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు 3,40,369 ఓట్లు రాగా, కేశినేని నానికి 3,48,652 ఓట్లు లభించాయి. అసెంబ్లీ అభ్యర్థుల కంటే ఎంపీ అభ్యర్థికి 8,283 ఓట్లు అదనంగా వచ్చాయి. ఇదే నాలుగు నియోజకవర్గాల పరిధిలోని వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థులకు మొత్తం 3,79,516 ఓట్లు లభించగా, ఆ పార్టీ లోక్‌సభ అభ్యర్థి పొట్లూరి వీరప్రసాద్‌కు 3,64,744 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీ అభ్యర్థులతో పోలిస్తే పొట్లూరికి 14,772 ఓట్లు తగ్గాయి. క్రాస్ ఓటింగ్ జరిగిందనడానికి ఇవే తార్కాణాలు. -
సిక్కోలు సమస్యలు కానరాలేదా ‘రామా’..?
మా తాతలు నేతులు తాగారు. మా మూతులు వాసన చూడండి అన్నట్లుగా ఉంది శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడి పరిస్థితి అని జిల్లా ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు. ఆయన తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు మరణానంతరం సానుభూతితో వారసత్వంగా రాజకీయాలకు కొత్తవ్యక్తి అయినా తొలిసారే ఎంపీగా అవకాశమిచ్చిన జిల్లా ప్రజలకు ఆయన ఇచ్చిన బహుమానం ప్రజలకు దూరంగా ఎక్కడో ఉండడమేనని ఆరోపిస్తున్నారు. సాక్షి, టెక్కలి (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల ఘట్టం తుదిదశకు వచ్చేసింది. రాష్ట్రానికి చిట్టచివర్లో ఎటువంటి అభివృద్ధికి నోచుకోకుండా గ్రామాలన్నీ వలస బాట పడుతూ..నిరుద్యోగ యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన శ్రీకాకుళం కోటలో ఈ సారి ఎన్నికల వార్ వన్‌సైడ్‌గా కనిపిస్తోంది. దివంగత ఎంపీ కింజరాపు ఎర్రన్నాయుడు తనయుడిగా జిల్లా ప్రజల సెంటిమెంట్‌ను అనుకూలంగా చేసుకుని రాజకీయాల్లోకి వచ్చి మొదటి చాన్స్‌గా ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడు ఐదేళ్లలో జిల్లాకు చేసిన అభివృద్ధి శూన్యమనే ఆరోపణలు ఉన్నాయి. ఎంపీగా గెలిచిన తరువాత జిల్లా అభివృద్ధిని పట్టించుకునే విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు పూర్తిగా ప్రజల్లో లేరనే విమర్శలు ఉన్నాయి. ఆయన బాబాయ్ అచ్చిన్నాయుడు పెద్దరికం ముందు రామ్మోహన్నాయుడు ఎంపీ పదవి ఎందుకూ పనికిరాకుండా పోవడమే కాకుండా కేవలం ఎంజాయ్ చేయడానికే ఎంపీ పదవిని అలంకరించారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో ఎంపీ రామ్మోహన్నాయుడిని పక్కన పెట్టడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీకి వస్తున్న ప్రభంజనంతో శ్రీకాకుళం జిల్లా ఎంపీ స్థానాన్ని సైతం వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్‌కు కట్టబెట్టే ఆలోచనలో సిక్కోలు ప్రజలు ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్, టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్‌నాయుడుల అనుకూల, ప్రతికూలాంశాలను ఓసారి గమనిస్తే ఇలా ఉన్నాయి. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి దువ్వాడకు అనుకూలాంశాలు ♦ ప్రజలతో మమేకమయ్యే తత్వం. సమస్యలపై తక్షణమే స్పందించే గుణం. ♦ గతంలో కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా ప్రజల తరఫున ఉద్యమం చేసి, సుమారు నెలరోజులకు పైగా జైలు జీవితం గడపడం. ♦ నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి సన్నిహితుడిగా ఉన్న అనుభవం, నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డితో కూడా సాన్నిహిత్యంగా ఉండడం. ♦ ప్రజలు, కార్యకర్తలకు ఏ రాత్రి కష్టమొచ్చినా స్థానికంగా అందుబాటులో ఉండడం. ఆర్థికంగా సహకారం అందించడం. ♦ నీతి నిజాయితీగా రాజకీయాలు చేసే కుటుంబంగా ప్రజల్లో గుర్తింపు ♦ జిల్లా సమస్యలపై పూర్తి అవగాహన ఉండడం. ♦ ముఖ్యంగా కాళింగ సామాజిక వర్గానికి చెందిన బలమైన నాయకుడిగా గుర్తింపు ♦ గ్రామగ్రామాల్లో కార్యకర్తలు, అభిమానులకు పేరుపెట్టి పిలిచే చనువు ఉండడం ప్రతికూలాంశాలు ♦ దూకుడు తత్వం టీడీపీ ఎంపీ అభ్యర్థి రామ్మోహన్నాయుడు ప్రతికూలాంశాలు ♦ దివంగత ఎంపీ ఎర్రన్నాయుడు తనయుడిగా రాజకీయాల్లోకి అరంగ్రేటం చేసి ఎంపీగా గెలిచినప్పటికీ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం. ♦ జిల్లాలో వలసల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం. ♦ ఎంపీగా జిల్లా సమస్యలపై డిల్లీస్థాయిలో పోరాటాలు చేయకపోవడం. ♦ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు చూపకపోవడం. ♦ జిల్లాలో మూతపడిన పరిశ్రమలను తెరిపించలేకపోవడం. ♦ రైతులకు ఉపయోగపడే విధంగా నదుల అనుసంధానం చేయడంలో ఘోరంగా వైఫల్యం. ♦ జిల్లాలో ఉన్న రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై దృష్టి సారించకపోవడం. ♦ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆసరాగా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడం. ♦ జీడి, కొబ్బరి రైతులకు ఆసరాగా అనుసంధానమైన పరిశ్రమలు నెలకొల్పలేకపోవడం. ♦ మత్స్యకారుల అభివృద్ధికి చర్యలు తీసుకోకపోవడం. ♦ జిల్లాలో సమస్యలను పూర్తిగా విస్మరించడం. అనుకూల అంశం దివంగత ఎంపీ కె.ఎర్రన్నాయుడు తనయుడిగా పూర్తికాలం ఎంపీగా కొనసాగడం -
కోతల నాయుడు..
వేదికలెక్కి ఉపన్యాసాలు దంచుతారు. అనర్గళంగా మాట్లాడతారు. అది చూసిన వారెవరైనా ఆహా! అనుకుంటారు. ఆ జిల్లాకు ఎంతో అభివృద్ధి చేస్తున్నారని భ్రమ పడతారు. కానీ వాస్తవాన్ని పరిశీలించిన వారు ఆయన మాటల మాంత్రికుడే తప్ప అభివృద్ధి చోదకుడు కాదని ఇట్టే పసిగట్టేస్తారు. మాటలు కోటలు దాటించే ఆ కోతల రాయుడు.. కింజరాపు రామ్మోహన్నాయుడు..! శ్రీకాకుళం లోక్‌సభ సభ్యుడు. ఇప్పుడు టీడీపీ తరఫున రెండోసారి బరిలో ఉన్నారు. ఫ్యాన్ గాలికి ఎదురీదుతున్నారు. సాక్షి, శ్రీకాకుళం: గత ఎన్నికల్లో గెలవడానికి ఎన్నెన్నో హామీలు గుప్పించిన రామ్మోహన్నాయుడు గెలిచాక నియోజకవర్గ ప్రజలను తన పరుగు కలుసుకోమన్నారు. ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడి మల్లన్న అన్న చందంగా వ్యవహరించారు. ఉంటే ఢిల్లీలోను.. లేదంటే శ్రీకాకుళంలోనే తప్ప తనను గెలిపించిన పల్లెలకు వెళ్లే ప్రయత్నమే చేయడం మానేశారు. ఐదేళ్లలో ఎంపీ తమ ఊళ్లకు వస్తారని, ఎంతో అభివృద్ధి చేస్తారని ఓట్లేసి గెలిపిం చిన వారికి నిరాశనే మిగిల్చారు. రామ్మోహన్నాయుడికి స్థానిక సంస్థలంటే చిన్నచూపు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు కూడా హాజరు కాలేదు. దీంతో అక్కడ చర్చకొచ్చే ప్రధాన సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే వీలు లేకుండా పోయింది. వచ్చిన నిధులనూ ఖర్చు చేయలేదు.. ఏ ఎంపీ అయినా నియోజకవర్గం అభివృద్ధికి నిధుల కోసం పోరాటం చేసి తెచ్చుకుంటారు. కానీ ఈయన పోరాటం చేయడం మాట అటుంచి కేంద్రం నుంచి వచ్చే నిధులను కూడా సక్రమంగా వినియోగించలేకపోయారు. ఒక్కో ఎంపీకి ఎంపీ ల్యాడ్స్ కింద ఏటా రూ.5 కోట్ల నిధులు వస్తాయి. ఇలా రూ.20 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో నాలుగో వంతు నిధులు ఇంకా ఖర్చు చేయలేదు. ఐదో విడత రావలసిన రూ.5 కోట్లకు ప్రతిపాదనలు పంపకపోవడంతో అవి కూడా విడుదల కాలేదు. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద శ్రీకాకుళం జిల్లాకు ఏటా రూ.50 కోట్లు చొప్పున మూడేళ్లకు రూ.150 కోట్లు విడుదల చేసింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.50 కోట్లు మంజూరు చేసింది. ఈ రూ.200 కోట్లలో ఇప్పటిదాకా రూ.150 కోట్లు ఖర్చు చేశారు. ఇవి కేంద్రం నిర్దేశించిన వాటికి కాకుండా ఇతర పనులకు వెచ్చించడంతో యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) సమర్పించలేక పోయారు. దీంతో మరో రెండు విడతల్లో రావలసిన రూ.100 కోట్లు వెనక్కి పోయాయి. కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపే ప్రయత్నం కూడా చేయకపోవడం రామ్మోహన్నాయుడికి ఈ జిల్లాపై ఉన్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోంది. చెట్టుపేరు చెప్పుకుని.. ఇన్నాళ్లూ వేదికలెక్కి ఉపన్యాసాలు దంచుతుంటే ఆహా.. ఓహో అనుకున్న జిల్లావాసులు ఇప్పుడు రామ్మోహన్నాయుడు మాటలపోగే తప్ప చేతల నేత కాదని గ్రహించారు. ఇప్పుడు మళ్లీ మరోసారి తనను గెలిపించాలని తిరుగుతుంటే ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఐదేళ్లలో తాను ఈ అభివృద్ధి చేశానని గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నట్టు తండ్రి ఎర్రన్నాయుడి హయాంలో జరిగిన కాస్త అభివృద్ధినే చెప్పుకుంటున్నారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వీస్తున్న ఫ్యాన్ గాలి ధాటికి మాటల నాయుడిగా పేరు తెచ్చుకున్న రామ్మోహన్నాయుడు వెన్నులో వణుకు మొదలైంది. హామీలూ గాలికే..! రామ్మోహన్నాయుడు ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో ఇచ్చిన హామీలనూ గాలికొదిలేశారు. వాటిలో మచ్చుకు కొన్ని.. హామీ: శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వే స్టేషన్లో 22 వరకు ప్రధాన రైళ్లకు హాల్ట్ ఇచ్చేలా కృషి చేస్తానన్నారు. వాస్తవం: ఈ ఐదేళ్లలో ఈ రైళ్లకు హాల్ట్ ఇప్పించలేకపోయారు. ఈయన నిర్వాకంతో ఈ స్టేషన్ మీదుగా ఎన్నో ఎక్స్‌ప్రెస్ రైళ్లు రయ్‌మంటూ వెళ్లిపోతున్నాయి. వీటిలో తిరుపతి, తిరుచ్చి–హౌరా, హౌరా–యశ్వంత్‌పూర్, విల్లుపురం, కన్యాకుమారి, దురంతో, హిరాకుడ్, పూనే–భువనేశ్వర్, దిబ్రూగఢ్–చెన్నై, యశ్వంతపూర్ ఏసీ ఎక్స్‌ప్రెస్, భాగల్పూర్–యశ్వంత్‌పూర్, మైసూర్, డిఘా–విశాఖపట్నం, హల్దియా–చెన్నై, హమ్‌సఫర్, గౌహతి–చెన్నై, బెంగళూర్, రామేశ్వరం, సువిధ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లున్నాయి. హామీ: ఇచ్ఛాపురం, పలాస, నౌపడా, హరిశ్చంద్రపురం, కోటబొమ్మాళి, ఆమదాలవలస రైల్వే స్టేషన్ల ఆధునికీకరణకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వాస్తవం: ఆ హామీకీ తిలోదకాలిచ్చారు. రైళ్ల హా ల్ట్పై గాని, ఈ స్టేషన్ల ఆధునికీకరణపై గాని పార్లమెంట్లో గట్టిగా మాట్లాడిన సందర్భాలే లేవు. హామీ: తనను గెలిపిస్తే పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసి జిల్లాలో యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. వాస్తవం: ఎంపీ అయ్యాక రామ్మోహన్నాయుడు ఆ హామీని మరిచారు. పరిశ్రమల గురించి, ఉపాధి గురించి పట్టించుకున్నదే లేదు. హామీ: ఎంపీగా గెలిచాక 32 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానన్నారు. వాస్తవం: గెలిచాక ఆ దత్తత గ్రామాలను సైతం పట్టించుకున్న పాపాన పోలేదు. వాటి వైపు కన్నెత్తి చూడలేదు. -
టీడీపీ ఎంపీకి చేదు అనుభవం
సాక్షి, శ్రీకాకుళం : తెలుగు దేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి చేదు అనుభవం ఎదురైంది. టిట్లీ తుఫాను బాధితులను పరామర్శించటానికి వెళ్లిన ఆయనను బాధితులు నిలదీశారు. సహాయం అందించకుండా ఊరికే ఎందుకు తిరుగుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వచ్చిన పనిపూర్తవకుండానే ఎంపీ వెనుదిరగాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఎంపీ రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లాలోని కవిటి మండలం పనగానిపుట్టుగ గ్రామంలోని తుఫాను బాధితులను పరామర్శింటానికి వెళ్లారు. అక్కడ ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం తుఫాను బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించిందని, నీళ్లు ఇతర అవసరాలను తీర్చిందని చెబుతున్న నేపథ్యంలో గ్రామస్తులు ఒక్కసారిగా తిరగబడ్డారు. తమకు ఎలాంటి సహాయం అందలేదని, విద్యుత్ సౌకర్యం ఇప్పటివరకు పునరుద్ధరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన పంట అంచాన వేయటానికి ఏ ఒక్క అధికారి కూడా ఊరికి రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహాయం అందించకుండా ఊరికే ఎందుకు తిరుగుతున్నారిని నిలదీశారు. దీంతో ఆయన అక్కడి వెళ్లిపోయారు. -
టీడీపీ ఎంపీ దౌర్జన్యం
శ్రీకాకుళం : స్థానిక ఎంపీ, టీడీపీ నాయకుడు కె.రామ్మోహన్నాయుడు మంగళవారం దౌర్జన్యానికి దిగారు. పోలీసులు, రెవెన్యూ అధికారులతో గ్రామ కంఠాల భూ కబ్జాకు యత్నించారు. అందులోభాగంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు స్థలం పక్కనే ఉన్న భూమిలో నిర్మాణం జరగుతున్న ఇల్లును కూల్చివేశారు. అయితే ఎంపీ రామ్మోహన్ గతంలో తన స్థలం అడిగారని... అందుకు తాను నిరాకరించానని బాధితుడు తెలిపారు. ఈ నేపథ్యంలో తాను స్థలం ఇవ్వకపోవడంతో ఎంపీ రామ్మోహన్నాయుడు దౌర్జన్యానికి దిగారని బాధితుడు ఆరోపించారు. గ్రామకంఠం కింద ఎంపీ రామ్మోహన్నాయుడుకు శ్రీకాకుళంలో 40 సెంట్ల స్థలం ఉంది. అలాగే రెండు, మూడు సెంట్ల గ్రామ కంఠానికి చెందిన స్థలంలో పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే ఆ భూములు విక్రయించాలని ఎంపీ... స్థానికులపై తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చారు. అందుకు వారు ససేమీరా అన్నారు. రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఈ భూములు ప్రభుత్వానికి చెందినవి అంటూ స్థానిక ఎమ్మార్వో చెప్పడంతో.. స్థానికులు కోర్టుకు వెళ్లారు. దాంతో కోర్టు స్టేటస్ కో విధించింది. ఆ క్రమంలో రామ్మోహన్రావు రంగంలోకి దిగారు. -
పుష్కరాల కోసం నిధులు విడుదల
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల కోసం నిధులు విడుదల చేస్తున్నామని రాజమండ్రి ఎంపీ ఎం.మురళీమోహన్ వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలో శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్ నాయుడుతో కలసి మురళీమోహన్ మాట్లాడుతూ... రాజమండ్రిలో మధురపూడి విమానాశ్రయంలో రాత్రిపూట విమానాలు దిగేందుకు అనుమతించాలని పౌర విమానయానశాఖను ఆయన డిమాండ్ చేశారు. అలాగే రాజమండ్రి - కోవ్వూరు రోడ్డు కం రైలు బ్రిడ్జి మరమ్మతుకు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ... బలవంతపు మతమార్పిడులకు తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం తాము పోరాడుతున్నామని గుర్తు చేశారు. కాని ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి డిమాండ్‌నే చేస్తున్నాయని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. -
ఏసీఏలో పదపై ఎంపీ దృష్టి!
శ్రీకాకుళం స్పోర్ట్స్: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)లో చక్రం తిప్పాలనే నెపంతో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు కన్నేశారు. ఇందులో భాగంగా అధ్యక్షపదవికి ఇప్పటికే నామినేషన్ సమర్పించారు. కేంద్రస్థాయిలో పలు అధ్యయన, నివేదికల కమిటీ నియామకాల్లో సభ్యునిగా ఉన్న రామ్మోహన్ తాజాగా జిల్లా నుంచి మొదలుకుని రాష్ట్రస్థాయిలో పట్టు సాధించేందుకు క్రీడావేదికను సిద్ధం చేసుకుంటున్నారని ఆ పార్టీకి చెందిన వారంటున్నారు. కాగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడుగా నాయుడు ఎంపిక లాంఛనమేనని ఆ సంఘ ప్రస్తుత కీలక ప్రతినిధులే బాహాటంగా చెబుతున్నారు. రామ్మోహన్ ఎంపిక కోసమే జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను ఎస్‌డీసీఏ పెద్దలు గొప్యంగా ఉంచినట్టు సమాచారం. ఎస్‌డీసీఏ అధ్యక్షునితోపాటు పలు కార్యవర్గ సభ్యుల ఎంపికలకు మంగళవారంతో నామినేషన్ల పర్వం ముగియనుందని ఎస్‌డీసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎంపీకి తీరికలేని కారణంగా ఈనెల 29వ తేదీన జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
చట్టసభలకు ఏడు కొత్తముఖాలు
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో జిల్లా నుంచి విజయం సాధించిన వారిలో ఏడుగురు తొలిసారి చట్టసభల్లోకి అడుగుపెట్టనున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఇద్దరు కొత్తవారు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగా.. టీడీపీ నుంచి ఒక ఎంపీతో సహా ఐదుగురు కొత్తవారే కావడం విశేషం. శుక్రవారం వెల్లడైన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికైన కింజరాపు రామ్మోహన్నాయుడు చిన్న వయసులోనే పార్లమెంటులోకి అడుగుపెడుతున్నారు. ఇక వైఎస్ఆర్సీపీ తరఫున పాలకొండ, పాతపట్నం నియోజకవర్గాల ఎమ్మెల్యేలుగా ఎన్నికైన విశ్వాస రాయి కళావతి, కలమట వెంకటరమణలు అసెంబ్లీకి కొత్తవారే. తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వీరు జిల్లా తరఫున తమ వాణి వినిపించనున్నారు. అలాగే శ్రీకాకుళం, ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఆమదాలవలసల నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన గుండ లక్ష్మీదేవి, బెందాళం అశోక్, బగ్గు రమణమూర్తి, కూన రవికుమార్‌లు మొదటిసారి చట్టసభల్లో ప్రవేశిస్తున్నారు. లక్ష్మీదేవి, రమణమూర్తి, అశోక్‌లు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. కూన రవికుమార్ 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున ఆమదాలవలస నుంచే పోటీ చేసి ఓడిపోగా.. పాతపట్నం, పాలకొండల్లో గెలుపొందిన కలమట వెంకటరమణ, కళావతిలు 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలో దిగి ఓడిపోయారు. ఇప్పుడు రెండో ప్రయత్నంలో విజయాన్ని అందుకున్నారు.