ఏసీఏలో పదపై ఎంపీ దృష్టి! | Andhra Cricket Association President post rammohan naidu | Sakshi
Sakshi News home page

ఏసీఏలో పదపై ఎంపీ దృష్టి!

Published Tue, Sep 16 2014 1:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:25 PM

Andhra Cricket Association President post rammohan naidu

 శ్రీకాకుళం స్పోర్ట్స్: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)లో చక్రం తిప్పాలనే నెపంతో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవిపై శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు కన్నేశారు. ఇందులో భాగంగా  అధ్యక్షపదవికి ఇప్పటికే నామినేషన్ సమర్పించారు.  కేంద్రస్థాయిలో పలు అధ్యయన, నివేదికల కమిటీ నియామకాల్లో సభ్యునిగా ఉన్న  రామ్మోహన్ తాజాగా జిల్లా నుంచి మొదలుకుని రాష్ట్రస్థాయిలో పట్టు సాధించేందుకు క్రీడావేదికను సిద్ధం చేసుకుంటున్నారని ఆ పార్టీకి చెందిన వారంటున్నారు.
 
 కాగా జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షడుగా నాయుడు ఎంపిక లాంఛనమేనని ఆ సంఘ ప్రస్తుత కీలక ప్రతినిధులే బాహాటంగా చెబుతున్నారు. రామ్మోహన్ ఎంపిక కోసమే జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను ఎస్‌డీసీఏ పెద్దలు గొప్యంగా ఉంచినట్టు సమాచారం.  ఎస్‌డీసీఏ అధ్యక్షునితోపాటు పలు కార్యవర్గ సభ్యుల ఎంపికలకు మంగళవారంతో నామినేషన్ల పర్వం ముగియనుందని ఎస్‌డీసీఏ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎంపీకి తీరికలేని కారణంగా ఈనెల 29వ తేదీన జిల్లా క్రికెట్ అసోసియేషన్  నూతన కార్యవర్గ ఎన్నికలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement