Andhra Cricket Association
-
విశాఖపట్నంలో విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లు
సాక్షి, విశాఖపట్నం: దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీకి విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. నగరంలోని పీఎం పాలెంలో గల వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియం ఇందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీశ్‌బాబు తెలిపారు.ఇక ఈ వన్డే టోర్నీ గ్రూప్-డిలో భాగంగా డిసెంబరు 21 నుంచి జనవరి 5 వరకు మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నెల 21న ఛత్తీస్‌గఢ్- మిజోరం జట్ల మధ్య మ్యాచ్‌తో టోర్నీకి తెరలేవనుంది. ఇక 23న మిజోరం- ఉత్తర్‌ప్రదేశ్, 26న తమిళనాడు- ఉత్తర్‌ప్రదేశ్, 28న చండీగఢ్- విదర్భ, 31న తమిళనాడు- విదర్భ జట్ల మధ్య మ్యాచ్‌లు జరుగుతాయి. అదే విధంగా.. జనవరి 3న చత్తీస్‌గఢ్- జమ్ము కశ్మీర్, 5న చండీగఢ్- జమ్ము కశ్మీర్ జట్లు తలపడతాయి.ఇక విజయ్ హజారే ట్రోఫీ కోసం వివిధ రాష్ట్రాల బోర్డులు ఇప్పటికే తమ జట్లను ప్రకటించాయి. ఇక టోర్నీకి సంబంధించిన ప్రత్యక్ష ప్రసారాలను జియో సినిమాతో పాటు.. ఫ్యాన్ కోడ్ యాప్, వెబ్సైట్లలో వీక్షించవచ్చు. -
ఆంధ్ర 344 ఆలౌట్
సాక్షి, విశాఖపట్నం: ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆంధ్ర బౌలర్ శశికాంత్ మూడు వికెట్లతో మెరిశాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 65 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అంకిత్ (53; 3 ఫోర్లు), ఆకాశ్ వశిష్ట్ (52 బ్యాటింగ్; 5 ఫోర్లు) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఓపెనర్లు శుభమ్ అరోరా (16), ప్రశాంత్ చోప్రా (10)తో పాటు... ఏకాంత్ సేన్ (20) విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో శశికాంత్ 3 వికెట్లు పడగొట్టగా... విజయ్ ఒక వికెట్ తీశాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 295/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 92.4 ఓవర్లలో 344 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం 49 పరుగులు చేసి మిగిలిన 4 వికెట్లు కోల్పోయింది. మనీశ్ (42; 4 ఫోర్లు), త్రిపురాణ విజయ్ (33; 2 ఫోర్లు) చివర్లో కీలక పరుగులు చేశారు. హిమాచల్ ప్రదేశ్ బౌలర్లలో దివేశ్ శర్మ 5 వికెట్లు పడగొట్టగా... రిషీ ధావన్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆంధ్ర జట్టు దీటుగా బదిలిస్తున్న హిమాచల్ ప్రదేశ్ జట్టు ఇంకా 146 పరుగులు వెనుకబడి ఉంది. చేతిలో ఆరు వికెట్లు ఉండగా... కెపె్టన్ రిషీ ధావన్ (38 బ్యాటింగ్; 4 ఫోర్లు), ఆకాశ్ వశి‹Ù్ట క్రీజులో ఉన్నారు. స్కోరు వివరాలు ఆంధ్ర తొలి ఇన్నింగ్స్: అభిõషేక్ రెడ్డి (ఎల్బీ) (బి) రిషీ ధావన్ 5; మహీప్ కుమార్ (ఎల్బీ) (బి) రిషీ ధావన్ 4; షేక్ రషీద్ (బి) అరి్పత్ 69; హనుమ విహారి (సి) రిషీ ధావన్ (బి) ముకుల్ నేగీ 66; శ్రీకర్ భరత్ (సి) ఆకాశ్ (బి) దివేశ్ శర్మ 65; అశ్విన్ హెబ్బర్ (సి) ఏకాంత్ సేన్ (బి) దివేశ్ శర్మ 15; మనీశ్ (సి) ముకుల్ నేగీ (బి) దివేశ్ శర్మ 42; త్రిపురాణ విజయ్ (సి) ఆకాశ్ వశి‹Ù్ట (బి) రిషీ ధావన్ 33; శశికాంత్ (సి) శుభమ్ అరోరా (బి) దివేశ్ శర్మ 6; లలిత్ మోహన్ (సి) శుభమ్ అరోరా (బి) దివేశ్ శర్మ 14; సత్యనారాయణ రాజు (నాటౌట్) 1, ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (92.4 ఓవర్లలో ఆలౌట్) 344. వికెట్ల పతనం: 1–5, 2–11, 3–136, 4–202, 5–226, 6–245, 7–317, 8–321, 9–341, 10–344. బౌలింగ్: వినయ్ 9–0–41–0; రిషీ ధావన్ 19–3–80–3; అర్పిత్ గులేరియా 11–0–47–1; దివేశ్ శర్మ 20.4–4–60–5; మయాంక్ డాగర్ 18–2–53–0; ముకుల్ నేగీ 15–2–52–1. హిమాచల్ ప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: శుభమ్ అరోరా (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 16; ప్రశాంత్ చోప్రా (సి) శ్రీకర్ భరత్ (బి) శశికాంత్ 10; అంకిత్ (బి) విజయ్ 53; ఏకాంత్ సేన్ (బి) శశికాంత్ 20; ఆకాశ్ వశిష్ట్ (బ్యాటింగ్) 52; రిషీ ధావన్ (బ్యాటింగ్) 38; ఎక్స్‌ట్రాలు 9, మొత్తం (65 ఓవర్లలో 4 వికెట్లకు) 198. వికెట్ల పతనం: 1–12, 2–31, 3–59, 4–124. బౌలింగ్: శశికాంత్ 15–6–50–3; సత్యనారాయణ రాజు 14–1–40–0; లలిత్ మోహన్ 11–1–26–0; విజయ్ 13–1–41–1; మహీప్ కుమార్ 4–1–10–0; మనీశ్ 7–0–28–0; రషీద్ 1–0–2–0. -
ఆంధ్ర 295/6
సాక్షి, విశాఖపట్నం: ప్రధాన బ్యాటర్లంతా రాణించడంతో రంజీ ట్రోఫీలో హిమాచల్ ప్రదేశ్‌తో పోరులో ఆంధ్ర జట్టు మంచి స్కోరు దిశగా సాగుతోంది. గ్రూప్ ‘బి’లో భాగంగా శనివారం విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ప్రారంభమైన పోరులో... తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర జట్టు 80 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. కెప్టెన్ షేక్ రషీద్ (69; 9 ఫోర్లు), హనుమ విహారి (66; 12 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించగా... వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (39 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) టి20 తరహాల్లో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి హాఫ్ సెంచరీ చేశాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టుకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు అభిõÙక్ రెడ్డి (5), మహీప్ కుమార్ (4) విఫలం కావడంతో 11 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రషీద్, విహారి ఆదుకున్నారు. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిపోతున్న సమయంలో సంయమనం పాటించిన ఈ జోడీ... క్రీజులో కుదురుకున్నాక వేగంగా పరుగులు రాబట్టింది. రెండో వికెట్‌కు 125 పరుగులు జోడించిన తర్వాత హనుమ విహారి వెనురదిగగా... షేక్ రషీద్‌తో కలిసి శ్రీకర్ భరత్ ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అప్పటి వరకు నిధానంగా సాగిన స్కోరుబోర్డు... భరత్ రాకతో పరుగులు పెట్టింది. బౌలర్‌తో సంబంధం లేకుండా భరత్ ఎడాపెడి బౌండ్రీలతో విజృంభించాడు. ఇక మరింత భారీ స్కోరు చేయడం ఖాయమే అనుకుంటున్న దశలో వీరిద్దరూ వెనుదిరగడంతో పరుగుల వేగం తగ్గింది. అశ్విన్ హెబర్ (15) ఎక్కువసేపు నిలవలేకపోగా... మనీశ్ (31 బ్యాటింగ్; 2 ఫోర్లు), త్రిపురన విజయ్ (20 బ్యాటింగ్; ఒక ఫోర్) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఏడ వికెట్‌కు అజేయంగా 50 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. -
ఏసీఏ పాలకవర్గం రాజీనామా
విజయవాడ స్పోర్ట్స్: రాష్ట్రంలో అధికార మార్పు తర్వాత వ్యవస్థలను స్వా«దీనం చేసుకునే పనిలో నిమగ్నమైన ‘పచ్చ ముఠా’ క్రీడా సంఘాల్లోకి కూడా చొరబడుతోంది. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)ను హస్తగతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్(చిన్ని) కేంద్రంగా ఈ క్రీడా రాజకీయం కొనసాగుతోంది.ప్రస్తుతం ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు శరత్‌చంద్రారెడ్డి, గోపినాథ్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు రోహిత్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాకేశ్, కోశాధికారిగా ఎ.వి.చలం, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడిగా పురుషోత్తం వ్యవహరిస్తున్నారు. వీరికి ఇంకా ఏడాది సమయముంది. కానీ ఆదివారం విజయవాడలోని ఓ హోటల్లో ఎంపీ చిన్ని ఆధ్వర్యంలో ఏసీఏ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి 13 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, క్రికెట్ అకాడమీల ప్రతినిధులు కలిపి మొత్తం 33 మంది హాజరయ్యారు. గోపినాథ్‌రెడ్డి, రాకేశ్, చలం తమ రాజీనామా పత్రాలతో పాటు మిగిలిన వారివి కూడా తీసుకొని సమావేశానికి వచ్చారు. ఎలాంటి చర్చ లేకుండానే పాలకవర్గం రాజీనామాలను ఆమోదించినట్లు విశాఖ జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణుకుమార్‌రాజుతో ఎంపీ కేశినేని చిన్ని ప్రకటింపజేశారు. ఆ వెంటనే గోపీనాథ్‌రెడ్డి, చలం వెళ్లిపోయారు. ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్.. ఏసీఏకు ఎన్నికలు జరిగే వరకు రాష్ట్రంలో క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోకూడదనే ఉద్దేశంతో త్రీ మెన్ కమిటీని ఏర్పాటు చేసినట్లు విష్ణుకుమార్‌రాజు మీడియాకు వెల్లడించారు. ఈ కమిటీలో ఆర్.వి.ఎస్.కె.రంగారావు, మాంచో ఫెర్రర్, మురళీమోహనరావును నియమించినట్లు తెలిపారు. వారిలో ఇద్దరికి చెక్ పవర్ ఇచ్చామన్నారు. ఎన్నికలు జరిగే వరకు ఈ కమిటీ కొనసాగుతుందని తెలిపారు. పాలకవర్గానికి ఉన్న మిగిలిన ఏడాది కాలానికి ఎన్నికలు నిర్వహించాలని తీర్మానించామన్నారు. సెపె్టంబర్ 8న ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికల అధికారిగా మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేశ్ వ్యవహరిస్తారని వెల్లడించారు. ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. అన్ని జిల్లాల్లోని క్రికెట్ సంఘాలను సందర్శించి క్రికెట్ సంఘాల్లో ఉన్న సమస్యలను, క్రీడాకారుల ఇబ్బందులను పరిష్కరిస్తామన్నారు. -
టీమిండియాలో ఎంట్రీ.. నితీశ్ కుమార్ రెడ్డికి ఏసీఏ అభినందనలు
టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభినందనలు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ నుంచి పొట్టి ఫార్మాట్లో అంతర్జాతీయ జట్టుకు ఎంపికైన విశాఖపట్నం కుర్రాడిపై ప్రశంసలు కురిపించింది.కాగా సీనియర్ల గైర్హాజరీలో యువ భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జూలై 6 నుంచి మొదలుకానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు శుబ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.ఈ జట్టులో ఐపీఎల్ హీరోలు తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి(సన్‌రైజర్స్ హైదరాబాద్)తో పాటు అభిషేక్ శర్మ(యోహానన్ ప్రధాన కోచ్‌గా), రియాన్ పరాగ్(రాజస్తాన్ రాయల్స్), తుషార్ దేశ్‌పాండే(చెన్నై సూపర్ కింగ్స్) తదితర యంగ్క్రికెటర్లు తొలిసారిగా చోటు దక్కింది.ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు పి. శరత్ చంద్రా రెడ్డితో పాటు కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్ రెడ్డి, అపెక్స్ మెంబర్స్ నితీశ్ కుమార్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల వ్యవధిలోనే నితీశ్ రెడ్డి ఐపీఎల్లో స్థానం సంపాదించాడు.ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున 13 మ్యాచ్‌లు ఆడి 303 పరుగులు చేశాడు. రైజర్స్ ఫైనల్ చేరడంలో తన వంతు పాత్ర పోషించిన ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో ఆంధ్ర నుంచి టీమిండియా టీ20 జట్టుకు ఎంపికైన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు.ఇక ఆంధ్ర ప్రీమియర్ లీగ్ వేలంలోనూ నితీశ్ రెడ్డి సరికొత్త రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. రూ. 15.6 లక్షలకు ఈ యంగ్ సెన్సేషన్‌ను గోదావరి టైటాన్స్ యాజమాన్యం సొంతం చేసుకుంది. ఐపీఎల్-2024 వేలంలో భాగంగా నితీశ్ రెడ్డిని రూ. 20 లక్షల కనీస ధరకు సన్‌రైజర్స్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ప్రధాన కోచ్‌గా యోహానన్నియామకంక్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) 2024–25 సీజన్ కోసం పురుషులు, మహిళల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) జట్లలోని పలు విభాగాలకు ప్రధాన కోచ్‌లను నియమించారు. 71 ఏళ్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా అంతర్జాతీయ స్థాయిలో ఆడిన కేరళ రాష్ట్రానికి చెందిన భారతీయ మాజీ క్రికెటర్ టిను యోహానన్‌ను సీనియర్ పురుషుల విభాగానికి ప్రధాన కోచ్‌గా నియమించారు.అదే విధంగా అండర్ –23 పురుషుల విభాగానికి ప్రధాన కోచ్‌గా జె.క్రిష్ణారావు, సీనియర్ మహిళా విభాగానికి ఎం.ఎన్. విక్రమ్ వర్మ, అండర్–23 మహిళా విభాగానికి ఎస్.రమాదేవి, అండర్–19 మహిళా విభాగానికి ఎస్.శ్రీనివాసరెడ్డి, అండర్–15 మహిళా విభాగానికి ఎం.సవితను ప్రధాన కోచ్‌లుగా నియమించారు.ఇంటర్నేషనల్‌కు ఆడిన యోహానన్‌ను ప్రధాన కోచ్‌గా తీసుకొచ్చేందుకు ఏసీఏ అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి తీవ్రంగా కృషి చేసినందుకు సీఏసీ చైర్మన్ ఎన్.మధుకర్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. యోహానన్ ప్రధాన కోచ్‌గా నియమించడం వల్ల రాష్ట్రానికి చెందిన ప్లేయర్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఎన్.మధుకర్ వెల్లడించారు.యోహానన్ గురించి..యోహానన్ 1979 ఫిబ్రవరి 18న జన్మించారు. టీమిండియా మాజీ క్రికెటర్. అతను కుడిచేతి వాటం కలిగిన ఫాస్ట్ మీడియం బౌలర్. కేరళ తరపున ఫస్ట్–క్లాస్ క్రికెట్ ఆడాడు.భారత్ తరపున టెస్ట్, వన్డే క్రికెట్ ఆడిన మొదటి కేరళ ఆటగాడు. అతను ప్రస్తుత కేరళ క్రికెట్ జట్టు కోచ్. 2000లో బెంగుళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి మొదటి ఇన్‌టేక్ కోసం ఎంపికయ్యాడు. డిసెంబర్ 2001లో ఇంగ్లండ్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో తన టెస్టు అరంగేట్రం చేశాడు.మొహాలీలో జరిగిన మొదటి టెస్టులో అతను ఇంగ్లండ్ ఓపెనర్లిద్దరినీ అవుట్ చేశాడు. అతను తన మొదటి ఓవర్ నాల్గవ బంతికి తన మొదటి టెస్ట్ వికెట్ సాధించారు. 2024–25 సీజన్‌ను విజయవంతంగా నిర్వహించాలని ఏసీఏ అధ్యక్షులు పి.శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి కోరారు. -
ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు.. ఏపీఎల్-3 వేలంలో వాళ్లు సైతం!
సాక్షి, విశాఖపట్నం: ప్రతిభ ఉన్న వారికే గుర్తింపు దక్కుతుందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి అన్నారు. అదే విధంగా క్రికెట్లో క్రమశిక్షణ ఎంతో అవసరం అని పేర్కొన్నారు.వీడీసీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మర్ క్రికెట్ కోచింగ్ క్యాంపు ముగింపు సమావేశం శనివారం జరిగింది. విశాఖలోని డా. వైఎస్సార్ ఏసీఏ – వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ప్రతిభ కలిగి.. గుర్తింపులేని క్రికెటర్లకు రైజింగ్ స్టార్స్ పేరుతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇటీవల చక్కటి వేదిక కల్పించాం.దీంతో ఏసీఏ విడుదల చేసిన వేలం అర్హత జాబితాలో లేని ఆటగాళ్లకు మరో అవకాశం వచ్చింది. ఇందులో భాగంగా మరోసారి ట్రయల్స్ నిర్వహించి ప్రతిభ చూపిన ఏడుగురికి ఏపీఎల్–3 వేలంలో స్థానం కల్పించాం’’ అని తెలిపారు.అదే విధంగా... ప్రతి క్రీడాకారుడి గణాంకాలతో కూడిన పూర్తి సమాచారాన్ని నిక్షిప్తం చేసేందుకు వీలుగా ఈసారి సరికొత్త సాఫ్ట్ వేర్‌ను వినియోగిస్తున్నట్లు ఎస్.ఆర్.గోపినాథ్ రెడ్డి వెల్లడించారు. అనంతరం క్రీడాకారులకు సర్టిఫికెట్లు, కోచ్‌లకు జ్ఞాపికలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ గేమ్ డెవలప్మెంట్ జనరల్ మేనేజర్ ఎం.ఎస్.కుమార్, వీడీసీఏ అధ్యక్ష, కార్యదర్శులు పి.విష్ణుకుమార్‌రాజు, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు -
APL: సీజన్-3 కి సిద్ధం.. లీగ్ ముఖ్య ఉద్దేశం అదే: ఏసీఏ
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్-3 నిర్వహణకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సిద్దమవుతోంది. గత రెండు ఎడిషన్లను విజయవంతంగా నిర్వహించిన ఏసీఏ ఈసారి కూడా ఆరు జట్లతో లీగ్‌ను కొనసాగించనుంది. ఏసీఏ కార్యదర్శి గోపీనాథ్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.బెజవాడ టైగర్స్, ఉత్తరాంధ్ర లయన్స్, గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, కోస్టల్ రైడర్స్ పేరిట ఆరు జట్లు బరిలోకి దిగుతాయని తెలిపారు. ఈ జట్ల మధ్య కడప, విశాఖ ప్రాంతాలలో మొత్తం 19 మ్యాచ్ లు నిర్వహించనున్నట్లు గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు.ఈ మేరకు గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘జోన్ లెవల్ క్రీడాకారులకి గుర్తింపు తీసుకొని రావడమే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ముఖ్య ఉద్దేశ్యం. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ జరగడం చాలా సంతోషకరం. మూలాల నుంచి అభివృద్ధి చేసుకుంటూ వస్తేనే విజయవంతమవుతాం.మూడో సీజన్ తర్వాత నాలుగో సీజన్ కూడా సజావుగా నిర్వహించాలని భావిస్తున్నాం. మంగళగిరిలో కూడా మ్యాచ్‌లు జరపాలని ప్రణాళికలు రచిస్తున్నాం. నవనీత్ కృష్ణ ఈసారి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఆక్షన్ లో పాల్గొంటున్నారు.విశాఖ, కడప, మంగళగిరి లో వెయ్యి మందిని గుర్తించి స్క్రీనింగ్ చేశాం. ఇక సీజన్-1 స్టార్ స్పోర్ట్స్ తెలుగులో బ్రాడ్ కాస్టింగ్ చేశాం. కొన్ని అనివార్య కారణాల వలన సీజన్-2ను తెలుగులో ప్రసారం చేయలేకపోయాం. అయితే, ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. బీసీసీఐ గైడ్‌లైన్స్‌తో ముందుకు వెళ్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్‌లో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయి. స్పోర్ట్స్ మెకానిక్ అనే సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను తీసుకుని వస్తున్నాం’’ అని తెలిపారు. -
IPL 2024 - Vizag: మార్చి 12 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ప్రాక్టీస్
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మరోసారి ఐపీఎల్ సందడి నెలకొననుంది. మార్చి 31, ఏప్రిల్ 3న నిర్వహించనున్న మ్యాచ్‌లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. తొలి విడత షెడ్యూల్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం హోం గ్రౌండ్‌గా నిలవనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్‌రెడ్డి గురువారం ఢిల్లీ క్యాపిటల్స్ ఆపరేషన్స్ టీమ్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రతా అనుమతులు, పారిశుధ్యం, టిక్కెట్ల విక్రయం, పార్కింగ్ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. అదే విధంగా.. మార్చి 12 నుంచి 19 వరకు వైఎస్సార్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ సభ్యులు ప్రాక్టీసు చేయనున్న నేపథ్యంలో.. ఆ మేరకు స్టేడియంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ ట్రెజరర్ ఏ.వి.చలం, సీఈవో ఎం.వి.శివారెడ్డి, సీఎఫ్ఓ ఎం.నవీన్ కుమార్, జనరల్ మేనేజర్లు ఎం.ఎస్.కుమార్, ఎస్.ఎం.ఎన్.రోహిత్ వర్మ తదితరులు పాల్గొన్నారు. వైజాగ్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి 31: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఏప్రిల్ 3: ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ -
క్రికెట్‌పై రాజకీయాలు చేయడం దురదృష్టకరం: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్
క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. క్రికెట్ అభివృద్ధి విస్తరణలో దేశంలోని అనేక అసోసియేషన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రతిష్టాత్మక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఇందుకు విశేష కృషి చేస్తోంది. ఆటగాళ్ల ప్రవర్తనా నియమావళి, నిర్వహణలో నిర్దేశిత నియమ నిబంధనలు అనుసరిస్తూ అసోసియేషన్ ముందుకు సాగుతోంది. ఇందులో పక్షపాతం, రాగద్వేషాలకు ఎక్కడా తావులేదు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను ఉద్దేశిస్తూ హనుమ విహారి ఇన్స్టాగ్రామ్ ద్వారా చేసిన ఆరోపణలు మా దృష్టికి వచ్చాయి. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌పై ఇలాంటి ఆరోపణలు విచారకరం. ఆటగాళ్ల మధ్య చిన్నచిన్న పొరపొచ్చాలు వచ్చినా వారి మధ్య సమన్వయం కుదిర్చి మంచి ఫలితాలు సాధించడం అన్నది జట్టు మేనేజ్మెంట్ మీద ఉన్న ప్రధాన బాధ్యత. ఆ బాధ్యతలో భాగంగా ఏ ఆటగాడైనా తొందరపడ్డా, లేక మరో రకంగా ప్రవర్తించినా వారి విషయంలో అత్యంత సంయమనంతో వ్యవహరించి జట్టును ఒక్కతాటిపైకి తీసుకురావడానికి మేనేజ్మెంట్ నిరంతరం ప్రయత్నిస్తుంది. జట్టు ప్రయోజనాలను, క్రికెట్ స్ఫూర్తిని పరిగణలోకి తీసుకుని లోలోపలే వాటిని సర్దుబాటు చేయడానికి యత్నిస్తుంది. పరిధి దాటినప్పుడు నిర్దేశిత నియమావళి, పద్ధతులు ప్రకారం వివక్ష లేకుండా చర్యలు తీసుకుంటుంది. సీనియర్ ఆటగాడు హనుమ విహారి సామాజిక మాధ్యమాల వేదికగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌పైనా, తోటి ఆటగాళ్లపైనా విమర్శలు చేసిన నేపథ్యంలో కొన్ని రాజకీయ పక్షాల నాయకులు వాటిని ఆసరాగా తీసుకుని అసోసియేషన్ నాయకత్వంపైనా, మేనేజ్‌మెంట్‌పైనా ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో అసోసియేషన్ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకుని వాస్తవ అంశాలను తెలియజేస్తున్నాం. హనుమ విహారి బాల్యం నుంచి అన్ని ఏజ్ గ్రూప్‌ల్లోనూ హైదరాబాద్ తరఫున ఆడారు. 2017లో ఏపీకి వచ్చి రంజీ ట్రోఫీ ఆడారు. ఇక్కడి నుంచే ఇండియా జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. తర్వాత 2020 సీజన్లో తిరిగి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. మళ్లీ ఆంధ్ర జట్టుకు తిరిగి వచ్చారు. ఆంధ్రాలో చేరినప్పటి నుండి విహారి తనకు వస్తున్న ఆఫర్ల నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి తరచుగా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) అడిగేవారు. హనుమ విహారి విజ్ఞప్తులను పలుమార్లు ఏసీఏ మన్నించింది. కాని ఈసారి ఎన్వోసీ ఇవ్వకపోవడంతో భారత జట్టుకు ఎంపిక కాకపోవడం పట్ల తాను ఫ్రస్టేషన్లో ఎమోషన్‌కు గురయ్యానంటూ క్షమాపణలు కోరుతూ, ఆంధ్రా తరపున కొనసాగించాలంటూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను కోరాడు. జట్టులోకి విహారి రావడం, పోవడం వల్ల స్థానికంగా ఉన్న ఆటగాళ్లు అవకాశాలు కోల్పోతున్నారని, ఆటగాళ్ల తల్లిదండ్రులు ఎన్నోమార్లు అసోసియేషన్ దృష్టికి తీసుకు వచ్చారు. కాని, విహారికి ఉన్న అనుభవం దృష్ట్యా జట్టు మేనేజ్మెంట్ అతన్ని ఇక్కడే కొనసాగించింది. అయినప్పటికీ విహారి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేయడం దురదృష్టకరం. -
ఇంగ్లండ్‌తో రెండో టెస్టు.. శ్రీకర్ భరత్‌ను సన్మానించనున్న ఏసీఏ
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్, ఆంధ్ర కెప్టెన్‌గా రాణించిన శ్రీకర్ భరత్.. తన హోం గ్రౌండ్లో తొలి టెస్టు మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లండ్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టులో సత్తాచాటాలని భరత్ ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ క్రమంలో సొంత గడ్డపై తొలి మ్యాచ్ ఆడుతున్న భరత్‌ను ఘనంగా సన్మానించాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించుకుంది. "వైజాగ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన శ్రీకర్ భరత్‌ను ఘనంగా సన్మానించనున్నాం. ఈ కార్యక్రమం గురువారం స్టేడియంలో నిర్వహించనున్నాం. ఇది అతడి విజయానికి దగ్గిన గౌరవం" అని న్యూస్ 18తో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గోపీనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. బాల్ బాయ్ నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా.. కేఎస్ భరత్ క్రికెట్ జర్నీ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంతోనే ప్రారంభమైంది. 2005లో బాల్ బాయ్‌గా ఎక్కడైతే పనిచేశాడో.. అదే స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. తద్వారా సొంతగడ్డపై టెస్టులో ఆడనున్న రెండో ఆంధ్ర ఆటగాడిగా భరత్ నిలవనున్నాడు. ఈ జాబితాలో భరత్ కంటే ముందు ఆంధ్ర దిగ్గజ ప్లేయర్ సీకే నాయుడు మొదటి ఆటగాడిగా ఉన్నారు. ఎమ్ఎస్కె ప్రసాద్, హనుమ విహారి భారత్ తరపున టెస్టుల్లో ఆడినప్పటికీ.. సొంతగడ్డపై ఆడే ఛాన్స్ రాలేదు. -
CWC: ఏపీలో ఫ్యాన్స్‌కు పండగే.. 13 జిల్లాల్లో భారీ స్క్రీన్లు! ఏయే చోట అంటే..
సాక్షి, విశాఖపట్నం: క్రికెట్ ప్రపంచం మొత్తం వరల్డ్‌కప్-2023 ఫీవర్‌తో ఊగిపోతోంది. ఈ మెగా ఈవెంట్‌కు వేదికైన భారత్‌లో.. ఊరూరా ప్రపంచకప్ సందడి మొదలైంది. సొంతగడ్డపై టీమిండియా ట్రోఫీ గెలిస్తే చూడాలనే ఆకాంక్షతో రోహిత్ సేనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు అభిమానులు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరుగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాను మట్టికరిపించాలంటూ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అభిమానులకు మరింత వినోదం అందించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) సిద్ధమైంది. భారత్– ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్‌ను పెద్ద స్క్రీన్ల (ఫేన్ ఎరీనా)పై తిలకించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల్లో స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. స్టేడియంలో ఉన్న వాతావరణాన్ని కల్పించి ఆనందంగా మ్యాచ్‌ను చూసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదట ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మ్యాచ్‌ను అభిమానులు ఉచితంగా వీక్షించవచ్చన్నారు. అదే విధంగా... అక్కడ ఫుడ్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు గోపీనాథ్‌రెడ్డి వెల్లడించారు. ఇక ప్రపంచకప్ ఫైనల్ నేపథ్యంలో.. పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేసేందుకు అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసే స్థలం జిల్లాల వారీగా.. 1. విశాఖపట్నం: ఆర్కీ బీచ్ , కాళీ మాత టెంపుల్ ఎదురుగా 2. అనంతపురం: పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పి.టి.సి) 3. ఏలూరు: ఇండోర్ స్టేడియం గ్రౌండ్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా 4. గుంటూరు: మాజేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్ 5. కడప: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ 6. కాకినాడ: రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్ 7. కర్నూల్: డి.ఎస్. ఏ. స్టేడియం 8. నెల్లూరు: వి.ఆర్. హైస్కూల్ గ్రౌండ్ 9. ఒంగోలు: జెడ్పీ మినీ స్టేడియం 10. శ్రీకాకుళం: ఎం. హెచ్. స్కూల్ గ్రౌండ్, 7 రోడ్ జంక్షన్ 11. తిరుపతి: కె.వి.ఎస్. స్పోర్ట్స్ పార్క్, తుమ్మలకుంట గ్రౌండ్ 12. విజయనగరం: ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, భాష్యం స్కూల్ వెనుక 13. విజయవాడ: ఎం.జి. రోడ్, ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం. -
CWC 2023: భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు
సాక్షి, విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌ను తిలకించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్రంలోని మూడు నగరాల్లో పెద్ద స్క్రీన్లను (ఫేన్ పార్క్‌లను) ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా వైజాగ్ ఆర్కే బీచ్ వద్ద కాళీ మాత టెంపుల్ ఎదురుగా, విజయవాడ ఎంజీ రోడ్డులో ఉన్న ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియం, వైఎస్సార్ కడపలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లలో ఒక్కో చోట దాదాపు 10 వేల మంది వీక్షించేలా పెద్ద స్క్రీన్లను ఏర్పాటు చేశామని, ఇందులో ప్రవేశం ఉచితం అన్నారు. క్రికెట్ అభిమానులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆయా ప్రాంతాల్లో ఫుడ్ కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. -
ఇండియా, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్.. రేపటి నుంచి టికెట్ల విక్రయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ నెల 23న జరుగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కోసం 15, 16 తేదీల్లో ఉదయం 11 గంటల నుంచి పేటీఎం (insider.in) లింక్ ద్వారా ఆన్లైన్లో టికెట్లు విక్రయించనున్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్‌రెడ్డి వెల్లడించారు. అదేవిధంగా 17, 18 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్, వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా ఆఫ్‌లైన్‌లో టికెట్లు విక్రయిస్తామని తెలిపారు. ఆన్లైన్లో టికెట్లు కొనుగోలు చేసిన వారు వన్‌టౌన్‌లో ఉన్న ఇందిర ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కౌంటర్ల 22వ తేదీ వరకు, అదేవిధంగా విశాఖపట్నం పీఎం పాలెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియంలోని ‘బి’ గ్రౌండ్ లో ఉన్న కౌంటర్ లో 23వ తేదీ వరకు రీడీమ్ చేసుకోవచ్చని తెలిపారు. టికెట్ ధరలు ఇలా.. రూ. 600/–, రూ. 1,500/–, రూ. 2000/–, రూ. 3,000/–, రూ. 3,500/–, రూ. 6000/– విలువ గల టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. మ్యాచ్ తేదీ: నవంబర్ 23 ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20 -
కోచ్ రహంతుల్లా బేగ్ మృతి క్రికెట్ లోకానికి తీరని లోటు
సాక్షి, విశాఖపట్నం: సీనియర్ క్రికెట్ కోచ్ రహమతుల్లా బేగ్ మృతి పట్ల ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి, కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డితో పాటు అపెక్స్ సభ్యులు సంతాపం వ్యక్తం చేశారు. బేగ్ కుటుంబ సభ్యులకు వీరు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహమతుల్లా బేగ్ మృతి క్రికెట్ లోకానికి తీరని లోటని అన్నారు. క్రికెట్‌కు ఆయన చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుంటాయని తెలిపారు. కోచ్‌గా ఆరు దశాబ్దాల పాటు సేవలు అందించిన ఆయన నేటి తరానికి స్ఫూర్తి అని.. తన కెరీర్లో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌తో పాటు ఎస్ఏఐ, శాప్, బీసీసీఐ, హెచ్.సీ.ఏ లకు ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు. కపిల్ దేవ్, రవిశాస్త్రి, అజారుద్దీన్, శివరామ కృష్ణన్, భరత్ అరుణ్, సంజయ్ మంజ్రేకర్, రాహుల్ ద్రవిడ్, వి.వి.ఎస్. లక్ష్మణ్, ఎం.ఎస్.కె ప్రసాద్ లతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ క్రికెటర్లకు ఆయన శిక్షణ ఇచ్చారని వారు గుర్తు చేశారు. -
వైజాగ్‌లో కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం.. బీసీసీఐ కార్యదర్శి జై షా హామీ
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం నిర్మాణానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా హామీ ఇచ్చారు. సోమవారం గోవాలో జరిగిన బీసీసీఐ 92వ వార్షికోత్సవ సమావేశంలో షా ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలకు మాట ఇచ్చారు. బీసీసీఐ వార్షికోత్సవ సమావేశానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు పి. శరత్ చంద్రారెడ్డి, సెక్రటరీ ఎస్.ఆర్. గోపినాథ్ రెడ్డి, ట్రెజరర్ ఎ.వి. చలం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్ర క్రికెట్‌కు సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి బీసీసీఐ అధ్యక్షులు రోజర్ బిన్నీ, సెక్రటరీ జై షా, ఉపాధ్యక్షులు రాజీవ్ శుక్లా తదితరులతో ఏసీఏ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి, సెక్రటరీ గోపినాథ్ రెడ్డి చర్చించారు. త్వరలో జై షా వైజాగ్‌కు వస్తానని హామీ ఇచ్చినట్లు ఏసీఏ పెద్దలు వెల్లడించారు. -
ఏసీఏ వల్లే ఆటగాళ్ల అద్భుత రాణింపు
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రోత్సాహంతోనే ఏపీ ఆటగాళ్లు రాణించి.. జాతీయ స్థాయిలో అవకాశాలు పొందుతున్నారని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. ఏసీఏ 70 వసంతాల వేడుకలు సోమవారం విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియంలోని ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆవిష్కరించారు. అనంతరం రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఏపీలో క్రికెటర్లకు అవసరమైన మౌలిక వసతులు, గ్రౌండ్లు, అకాడమీలు పెరుగుతున్నాయి. మరో పదేళ్లలో ఢిల్లీ, ముంబైతో పోటీపడే స్థాయికి రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి చెందుతోంది. తొలిసారిగా 1975లో రంజీ మ్యాచ్ ఆడేందుకు విశాఖ వచ్చాను. ఇప్పుడు విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందింది. ఏపీలో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లోనూ క్రీడలకు తగిన మౌలిక వసతులు కల్పించి.. క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరముంది. అప్పుడే భారత్‌లో క్రీడాభివృద్ధి సాధ్యపడుతుంది. బీసీసీఐ తరఫున స్కూల్ స్థాయి నుంచే ప్రొఫెషనల్ క్రికెటర్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ప్రక్రియ ఐదు రాష్ట్రాల్లో ముందంజలో ఉండగా.. ఇప్పుడు ఆంధ్ర చేరింది’ అని అన్నారు. ఐపీఎల్‌తో అద్భుత అవకాశాలు.. క్రికెట్ ఆడే దేశాల్లో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్స్ అన్నింటిలో.. ఐపీఎల్‌కున్న క్రేజ్ ప్రత్యేకమైనదని రోజర్ బిన్నీ చెప్పారు. ఆ స్టాండర్డ్స్‌ను కాపాడాలంటే.. ఐపీఎల్లో పాల్గొనే ప్రాంచైజీల నియంత్రణ చాలా అవసరమన్నారు. అందుకే ఐపీఎల్లో మరో కొత్త ఫ్రాంచైజీకి అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ఆ రోజుల్లో మూడు దశల్లో రాణించిన వారికి జాతీయ జట్టులో అవకాశం వచ్చేదని.. కానీ ఇప్పుడు ఐపీఎల్ తరహా ప్లాట్‌ఫాంలతో మెరుగైన ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.మహిళల క్రికెట్‌ను బాగా ప్రోత్సహిస్తున్నామని.. వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ మదన్‌లాల్ మాట్లాడుతూ.. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఏసీఏ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథరెడ్డి, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, ఏసీఏ పూర్వ కార్యదర్శి చాముండేశ్వర్‌నాథ్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, సీఈఓ శివారెడ్డి, వీడీసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రలో వేగంగా క్రికెట్ అభివృద్ధి.. అద్భుతం: టీమిండియా మాజీ క్రికెటర్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికై రోడ్ మ్యాప్ తయారు చేశామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్.ఆర్. గోపినాథ్‌రెడ్డి తెలిపారు. అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి ఆదేశాల మేరకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఏసీఏ 70 ఏళ్ల పండగను సోమవారం వైజాగ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీఏ కార్యదర్శి గోపినాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆటగాళ్ల భవిష్యత్ గురించే తాము నిత్యం తపనపడుతుంటామని పేర్కొన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో దేశంలోనే మొట్ట మొదటి సారిగా వుమెన్ టీ20 మ్యాచ్ నిర్వహించినట్లు ఆయన గుర్తు చేశారు. ఆంధ్రలో వేగంగా క్రికెట్ అభివృద్ధి: టీమిండియా మాజీ క్రికెటర్ అనంతరం ఇండియా మాజీ క్రికెటర్, ఇండియన్ నేషనల్ క్రికెట్ మాజీ కోచ్ మదన్ లాల్ మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రలో ఎంతో మంది ప్రతిభ ఉన్న క్రికెటర్లు ఉన్నారు., భవిష్యత్తులో వారు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించేలా ఎదగాలి’’ అని ఆకాంక్షించారు. ఇక్కడున్న యువ క్రికెటర్లను ఇక్కడ చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఏసీఏ పనితీరు అద్భుతం అని మదన్ లాల్ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఏపీఎల్ సూపర్ ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను వెలికి తీసేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఆంధ్రలో క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందుతోందని మదన్ లాల్ ప్రశంసించారు. ఇక ఈ సమావేశంలో.. పలువురు మాజీ రంజీ ప్లేయర్లు, మాజీ ఉమెన్ సీనియర్ ప్లేయర్స్, రంజీ ట్రోఫీ కెప్టెన్లు, క్రికెట్ కమిటీ సభ్యులకు, ఏసీఏ ఉద్యోగులకు, లీగల్ కమిటీలకు గోపినాథ్ రెడ్డి, ఏసీఏ ఉపాధ్యక్షులు పి. రోహిత్ రెడ్డి, మదన్ లాల్ జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎల్ చైర్మన్ మాంచో ఫెర్రర్, ఏసీఏ సంయుక్త కార్యదర్శి ఎ. రాకేశ్, ట్రెజరర్ ఏ.వి. చలం, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు కె.వి.పురుషోత్తం, జితేంద్ర నాథ్ శర్మ, సిఈఓ ఎం.వి. శివారెడ్డి, మాజీ రాష్ట్ర కార్యదర్శులు ఎన్. వెంకట రావు, చాముండేశ్వరి నాథ్ , అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కాగా ఆదివారం జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఫైనల్‌కు టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ హాజరైన విషయం తెలిసిందే. విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి స్టేడియంలో జరిగిన తుదిపోరులో డిపెండింగ్ చాంపియన్ కోస్టల్ రైడర్స్‌ను రాయలసీమ కింగ్స్ ఓడించింది. తద్వారా ఏపీఎల్-2 విజేతగా అవతరించింది. చదవండి: 13 ఏళ్ల వయస్సులోనే అవమానాలెన్నో.. అయినా వరల్డ్ ఛాంపియన్! -
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రీమియర్ లీగ్-2
-
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్!
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు విశాఖపట్నం వేదికగా రెండో వన్డేలో అదే జట్టుతో అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు భావిస్తుంటే.. ఆసీస్ మాత్రం తొలి వన్డే ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మార్చి 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది ఉందని భారత వాతావరణ విభాగం (IMD) ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు వర్షం పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. స్టేడియం నిర్వాహకులు తెలిపారు. వర్షం నుంచి మైదానాన్ని రక్షించేందుకు అవసరమైన అత్యంత తేలికైన పిచ్ కవర్లు తమ వద్ద ఉన్నట్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 గంటలకు ప్రారంభం కానుంది. తుది జట్లు(అంచనా) భారత్: శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ(కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్(కెప్టెన్), మార్నస్ లాబుషేన్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, సీన్ అబాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా. చదవండి: IND Vs AUS: ఏంటి హార్దిక్ ఇది.. సీనియర్లకు ఇచ్చే విలువ ఇదేనా? పాపం కోహ్లి! వీడియో వైరల్ -
ఆంధ్ర క్రికెట్ జట్టుకు మధురవాడ కుర్రాడు
మధురవాడ(భీమిలి): మధురవాడ బొట్టవానిపాలేనికి చెందిన ముగడ భానుస్వరూప్ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టులో చోటు సంపాదించాడు. భానుస్వరూప్ ప్రస్తుతం బక్కన్నపాలెం సెయింట్ ఆన్స్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి రమణ లారీ యజమాని. చిన్నప్పుడే కుమారుడి ఆసక్తిని గమనించిన రమణ.. తమకు తెలిసిన వారి దగ్గర క్రికెట్లో శిక్షణ ఇప్పించాడు. అనంతరం పక్కనే ఉన్న పీఎం పాలెంలో స్టేడియం ఉండటంతో.. విశాఖ క్రికెట్ అసోసియేషన్‌లో చేర్పించాడు. అప్పటి నుంచి భానుస్వరూప్ టోర్నమెంట్లలో పాల్గొంటూ ప్రతిభ చూపేవాడు. ఈక్రమంలో గతేడాది వీడీసీఏలో స్థానం సంపాదించాడు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్‌గా, బ్యాటింగ్‌లో రాణిస్తూ.. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అండర్–14 జట్టులో స్థానం సంపాదించాడు. ప్రస్తుతం కేరళలో దక్షిణాది రాష్ట్రాల జట్ల మధ్య జరుగుతున్న పోటీల్లో ఏసీఏ తరఫున భానుస్వరూప్ పాల్గొంటున్నాడు. భానుస్వరూప్ మాట్లాడుతూ.. ‘నాకు క్రికెట్‌పై ఉన్న ఇష్టాన్ని గమనించిన మా నాన్న.. నన్ను బాగా ప్రోత్సహించారు. వీడీసీఏలోని కోచ్‌లు, పెద్దల సూచనలు, ప్రోత్సాహంతో మరింత పట్టుదలగా ఆడుతున్నాను. నాకు రవీంద్ర జడేజా అంటే చాలా ఇష్టం. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని జాతీయ జట్టులో ఆడాలనేది నా కల. దాన్ని నిజం చేసుకుంటా’అని చెప్పాడు. -
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి
సాక్షి, అమరావతి, విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా హైకోర్టు ఉత్తర్వుల కారణంగా ఫలితాలను ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. వివరాల్లోకెళితే... మాజీ ఐఏఎస్ రమాకాంత్ రెడ్డి ఎన్నికల అధికారిగా నవంబర్ 18న ఏసీఏ ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఆరు కీలక పదవుల కోసం ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలు కావడంతో వీరందరూ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. వీటిని ఈనెల 3న ప్రకటించాల్సి ఉండగా... చిత్తూరు జిల్లా క్రికెట్ సంఘం హైకోర్టులో కేసు వేయడంతో ఫలితాలను నిలిపేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే తాజాగా చిత్తూరు జిల్లా సంఘం కేసును వెనక్కి తీసుకోవడంతో అడ్డంకి తొలగింది. దాంతో ఫలితాలను ప్రకటించేందుకు న్యాయమూర్తి జస్టిస్ సి.మానవేంద్రనాథ్ రాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. తాజా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పి. శరత్ చంద్రారెడ్డి... ఉపాధ్యాక్షుడిగా పి.రోహిత్ రెడ్డి... కార్యదర్శిగా గోపీనాథ్ రెడ్డి... సంయుక్త కార్యదర్శిగా ఎ.రాకేశ్... కోశాధికారిగా ఎ.వెంకటాచలం... కౌన్సిలర్‌గా కేవీ పురుషోత్తమ రావు ఎన్నికయ్యారు. చదవండి: FIFA WC2022: ఫ్రాన్స్ చేతిలో చిత్తు.. బ్రస్సెల్స్‌లో మొరాకో అభిమానుల విధ్వంసం -
ఏపీఎల్ తొలి సీజన్ షురూ.. (ఫొటోలు)
-
APL 2022: ఏపీఎల్ మొదటి సీజన్ షురూ
విశాఖ స్పోర్ట్స్: డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ– వీడీసీఏ స్టేడియం ప్రపంచ క్రికెట్ ఆడే అన్ని ఫార్మాట్ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఆతిథ్య జట్టుకు అచ్చివచ్చిన స్టేడియంగానూ పేరుగాంచింది. ఇప్పుడు సరికొత్త సీజన్ ఇక్క డి నుంచి ప్రారంభమవుతోంది. అదే ఆంధ్రా ప్రీమియర్ లీగ్(ఏపీఎల్). దేశవాళీ క్రికెట్లో అన్ని తరహా మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వడంతో పాటు అంతర్జాతీయ టెస్ట్‌లు, వన్డేలు, టీ–20లు, ఆఖరికి ఐపీఎల్ మ్యాచ్‌లకు హోమ్ పిచ్‌గా వైఎస్సార్ స్టేడియం సేవలందించింది. ఇప్పటికే ఐపీఎల్–15 సీజన్లు పూర్తయినా.. ఆంధ్రా నుంచి ఆడిన వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఆంధ్రా క్రికెటర్లను ఆ స్థాయిలో ప్రోత్సహించేందుకు ఏపీఎల్ సిద్ధమైంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహాంతో.. ఏసీఏ అధ్యక్షుడు శరత్చంద్ర ఆధ్వర్యంలో.. బీసీసీఐ గుర్తింపుతో ఏపీఎల్ బుధవారం నుంచి ప్రారంభమైంది. ఆంధ్రా తరపున ఆడి ప్రతిభ కనబరిచిన మేటి ఆటగాళ్లను వేలం ద్వారా ఆరు ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి. ఈ నెల 17వ తేదీన టైటిల్ పోరు జరగనుండగా.. విజేతకు ట్రోఫీ అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరవుతుండటం విశేషం. ఆరంభం ఇలా.. ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) తొలి సీజన్ టీ–20 మ్యాచ్‌లు షురూ అయ్యాయి. వైఎస్సార్ స్టేడియంలో బుధవారం మధ్యాహ్నపు సెషన్ మ్యాచ్ ఒంటి గంటకు ప్రారంభమైంది. రెండో మ్యాచ్ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆరున్నరకు ప్రారంభమైంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో కోస్టల్ రైడర్స్‌తో గోదావరి టైటాన్స్ తలపడగా లీగ్ చివరి మ్యాచ్‌లో 13న రాయలసీమ కింగ్స్‌తో వైజాగ్ వారియర్స్ జట్టు తలపడ్డాయి. ఇక ప్లేఆఫ్‌ల్లో లీగ్ 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుండగా.. 1, 2వ స్థానాల్లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్ మ్యాచ్ ఆడనున్నాయి. ఇవీ ఫ్రాంచైజీలు ఉత్తరాంధ్ర నుంచి రెండు ఫ్రాంచైజీలకు అవకాశం ఇవ్వగా.. ఉత్తరాంధ్ర లయన్స్ జట్టును కాయల వెంకటరెడ్డి, వైజాగ్ వారియర్స్ జట్టును సీహెచ్ తిరుమలరావు దక్కించుకున్నారు. సెంట్రల్ ఆంధ్ర నుంచి బెజవాడ టైగర్స్‌ను పి.వి రమణమూర్తి, గోదావరి టైటాన్స్‌ను పి.హరీష్‌బాబు, దక్షిణాంధ్ర నుంచి కోస్టల్ రైడర్స్‌ను ఎం.వెంకటరెడ్డి, రాయలసీమ కింగ్స్‌ను పి.వెంకటేశ్వర్ సొంతం చేసుకున్నారు. వీరంతా గత రెండు సీజన్లలో జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ఆంధ్రా తరఫున ప్రతిభ కనబరిచిన 20 మంది చొప్పున వేలంలో ఎంపిక చేసుకున్నారు. రంజీల్లో ఆరేళ్లుగా సత్తా చాటుతున్న 12 మందిలో ఇద్దరినీ చొప్పున జట్లకు ఐకాన్లుగా తీసుకున్నారు. వారు ఆడిన స్థాయిలను బట్టి ఆయా ఫ్రాంచైజీలు రూ.30 లక్షల వరకు వెచ్చించి ఎంపిక చేసుకున్నాయి. దేశంలో లీగ్‌లు ఐపీఎల్ ప్రపంచంలోనే ప్రత్యేక స్థానం పొందింది. అదే స్ఫూర్తితో దేశంలోనూ బీసీసీఐ గుర్తించిన కొన్ని లీగ్‌లు జరుగుతున్నాయి. 2009–10 సీజన్లోనే కర్నాటక ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఇదే రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన తొలి ప్రీమియర్ లీగ్. ప్రైజ్ పూల్‌గా రూ.20లక్షలు అందిస్తున్నారు. ఒకటిన్నర కోట్ల ప్రైజ్ పూల్తో ముంబయి లీగ్ 2018లో ప్రారంభించగా, అత్యధిక రూ.2.25కోట్ల ప్రైజ్‌పూల్‌తో తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2016 నుంచి కొనసాగుతోంది. ఒడిదొడుకుల్లో లీగ్‌లు ఒడిశా ప్రీమియర్ లీగ్ 2011లోనే ప్రారంభమైనా ఒడిదొడుకులతో నాలుగే సార్లు జరిగింది. రూ.6లక్షల ప్రైజ్ పూల్ ఇస్తోంది. సౌరాష్ట్ర ప్రీమియర్ లీగ్ 2019లో నిర్వహించగా... కేరళ ప్రెసిడెంట్స్ కప్ 2020లో నిర్వహించారు. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ 2009లో, తెలంగాణ ప్రీమియర్ లీగ్ 2018లో జరిగాయి. ఇక రాజపుటానా ప్రీమియర్ లీగ్, రాజ్వాడ క్రికెట్ లీగ్‌లు తొలి సెషన్స్‌లోనే మ్యాచ్ ఫిక్సింగ్ కారణాలతో సస్పెండ్ చేశారు. దీంతో తొలిసారిగా నిర్వహిస్తున్న ఏపీఎల్‌ను విజయవంతం చేసేందుకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కృషి చేస్తోంది. గోదావరి టైటాన్స్ గోదావరి టైటాన్స్ రూ.6.1 లక్షలతో ఆల్‌రౌండర్ శశికాంత్‌తో పాటు బ్యాటర్ నితీష్ కుమార్‌ను రూ.5 లక్షలతో కొనుగోలు చేసి బ్యాటింగ్‌లో దూకుడు చూపేందుకు సిద్ధమైంది. అనుభవజ్ఞుడు వటేకర్ కోచ్‌గా ఉండగా సందీప్, ధీరజ్, ఇస్మాయిల్, సాత్విక్, ఎం. వంశీకృష్ణ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆడారు. ఉత్తరాంధ్ర లయన్స్ ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్‌ను రూ.6 లక్షలకు కొనుగోలు చేసింది. ఇక ఆల్‌రౌండర్ షోయిబ్‌ను రూ.2లక్షలతోనే ఐకాన్‌గా ఎంచుకుంది. జట్టు విజయసారథి శిక్షణలో అహితేష్, క్రాంతి, తరుణ్, సుబ్రహ్మణ్యం, ప్రమో, రఫీ, సాయికౌషిక్, అజయ్ తదితరులతో ముందుకు నడవనుంది. బెజవాడ టైగర్స్ బెజవాడ టైగర్స్ జట్టు రూ.8.1 లక్షలతో బ్యాటర్ రికీబుయ్‌ను తీసుకున్నా.. బౌలింగ్‌లో మెరుపులు మెరిపించేందుకు అయ్యప్పను కేవలం రూ.లక్షన్నరకే దక్కించుకుంది. వి.అప్పారావు కోచింగ్‌లో సాయిరాహుల్, మహీష్, లలిత్, అఖిల్, మనీష్, సుమంత్, సాయితేజ తదితరులు ఆడనున్నారు. వైజాగ్ వారియర్స్ వైజాగ్ వారియర్స్ జట్టు బ్యాటర్ అశ్విన్ హెబ్బర్‌ను అత్యధికంగా రూ.8.7 లక్షలతో కొనుగోలు చేసింది. మరో ఐకాన్ ఆల్‌రౌండర్ నరేంద్ర రెడ్డిని రూ.4లక్షలకు చేజిక్కించుకుంది. విన్సెంట్ కోచింగ్‌లో ధ్రువ్, కార్తీక్, వేణు, మనోహర్, కరణ్, గిరినాథ్, సుదర్శన్, మల్లికార్జున తదితరులు జట్టుకు ఆడనున్నారు. కోస్టల్ రైడర్స్ కోస్టల్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ స్టీఫెన్‌ను రూ.4.50 లక్షలకు కొనుగోలు చేయగా మరో ఐకాన్ బౌలర్ హరిశంకర్పైనే దృష్టి పెట్టి 1.6 లక్షలకు కొనుగోలు చేసింది. విజయ్‌కుమార్ కోచ్‌గా లేఖజ్, తపస్వి, జ్ఞానేశ్వర్, అషిష్, హర్షవర్ధన్, మనీష్, రవికిరణ్, విజయ్ తదితరులు జట్టుకు ఆడనున్నారు. రాయలసీమ కింగ్స్ రాయలసీమ కింగ్స్ రూ.6.1 లక్షలతో ఆల్‌రౌండర్ గిరినాథ్‌ను, ఇటీవల జూనియర్స్‌లో సత్తాచాటిన రషీద్‌ను రూ.3.5 లక్షలతో కొనుగోలు చేసి బ్యాటింగ్‌లో బలం సొంతం చేసుకుంది. శ్రీనివాస్ కోచ్‌గా దుర్గాకుమార్, ప్రశాంత్, వంశీకృష్ణ, సంతోష్, అభిషేక్ ఫ్లడ్‌లైట్ల వెలుతురులో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడారు. (క్లిక్: విశాఖ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్!) -
Andhra Premier League: ఏపీఎల్‌లో ఆడే ఆరు జట్ల పేర్లు తెలుసా?
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ తరహాలో రాష్ట్రంలో నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) క్రికెట్ పోటీల ఫ్రాంచైజీ లోగోలను మంగళవారం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ పోటీలు జూలై 6 నుంచి 17వ తేదీ వరకు విశాఖలో జరుగుతాయి. పోటీలకు ఆరు ఫ్రాంచైజీలను ఎంపిక చేశారు. ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఏపీఎల్‌కు శ్రీరాం గ్రూప్ స్పాన్సరర్‌గా వ్యవహరిస్తోంది. ఈ మెగా ఈవెంట్లో భాగస్వామ్యం అవుతున్న ఆరు ఫ్రాంచైజీ జట్ల అధినేతలు లోగోలను ఆవిష్కరించారు. క్రికెటర్ల వేలం ఈనెల 24న వైఎస్సార్ స్టేడియంలో జరుగుతుందని ఏసీఏ సీఈవో శివారెడ్డి తెలిపారు. ఏసీఏ కోశాధికారి ఎస్ఆర్ గోపీనాధరెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సత్యప్రసాద్, సభ్యుడు ఆర్వీసీహెచ్ ప్రసాద్, ఆరు ఫ్రాంచైజీల అధినేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏపీఎల్‌లో ఆరు జట్లు ఇవే! ►ఉత్తరాంధ్ర లయన్స్ ►రాయలసీమ కింగ్స్ ►గోదావరి టైటాన్స్ ►కోస్టల్ రైడర్స్ ►బెజవాడ టైగర్స్ ►వైజాగ్ వారియర్స్ చదవండి: Rishabh Pant: నేనైతే పంత్ కెప్టెన్ కాకుండా కచ్చితంగా అడ్డుకునేవాడిని! ధోని ఏమో అలా.. కోహ్లి ఇలా! -
జూలై 6 నుంచి 17 వరకూ ఏపీఎల్ టి–20
సాక్షి, అమరావతి/విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) టీ–20 టోర్నమెంట్ లోగోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం సీఎం నివాసంలో సీఎం వైఎస్ జగన్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రెసిడెంట్ పి.శరత్‌చంద్రారెడ్డి, ట్రెజరర్ గోపినాథ్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సత్యప్రసాద్, సభ్యులు ప్రసాద్, గోపాలరాజు, టెక్నికల్ ఇన్చార్జ్ విష్ణు దంతుతో పాటు.. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు. ల్యాప్‌టాప్‌లో ఏపీఎల్ టీ–20 టీజర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నమెంట్‌ను ఏసీఏ నిర్వహించనుంది. జూలై 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సీఎం వైఎస్ జగన్‌ను ఏసీఏ బృందం ఆహ్వానించింది. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని సీఎం జగన్‌కు ఏసీఏ ప్రెసిడెంట్ పి.శరత్‌చంద్రారెడ్డి వివరించారు. టీ–20 టోర్నమెంట్ నిర్వహించుకునేందుకు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నట్టు వెల్లడించారు. -
రషీద్ కెరీర్ కోసం ఇంకెన్ని త్యాగాలకైనా మేము సిద్ధం.. మాకు అండగా నిలిచింది వాళ్లే!
U 19 World Cup- Shaik Rasheed Parents Comments: సత్తా ఉంటే సమస్యలు అడ్డంకిగా మారవని ... పట్టుదల ఉంటే పైపైకి దూసుకుపోవచ్చని షేక్ రషీద్ నిరూపించాడు. అండర్–19 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శనతో అదరగొట్టిన అతను ఫైనల్లోనూ కీలక అర్ధ సెంచరీతో జట్టును విజయం దిశగా నడిపించాడు. ఏసీఏ అండదండలతో... రషీద్ తండ్రి బాలీషా ప్రైవేట్ ఉద్యోగి. స్వస్థలం ప్రత్తిపాడు మండలం పాత మల్లాయపాలెం గ్రామం. చాలా ఏళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లారు. అక్కడే క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్నాడు. ఇంటర్ స్కూల్ టోర్నీల్లో ఆడుతూ వచ్చాడు. అయితే 2014లో కుటుంబం మళ్లీ గుంటూరుకు తిరిగొచ్చింది. ఇక్కడికి వచ్చాక రషీద్ ప్రతిభను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) గుర్తించింది. అతనికి క్రికెట్ పరంగా పూర్తి సౌకర్యాలు కల్పించడంతో పాటు చదువు బాధ్యత కూడా తీసుకొని మంగళగిరి అకాడమీలో తీసు కుంది. మరోవైపు తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా... తండ్రిగా బాలీషా తన కొడుకుకు అండగా నిలవడంలో ఎక్కడా వెనుకాడలేదు. ఈ క్రమంలో ఆర్థికపరంగా ఆయన పలు సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే ఆటగాడిగా రషీద్ పురోగతి తల్లి దండ్రులకు సంతోషపెట్టింది. అకాడమీలో ఏసీఏ కోచ్ కృష్ణారావు శిక్షణ, ఏసీఏ సభ్యుడు ఎన్.సీతాపతిరావు చూపించిన ప్రత్యేక శ్రద్ధ ఈ చిన్నోడికి కలిసొచ్చింది. ప్రతిభకు తోడు పట్టుదలతో తన ఆటకు అతను మరింత మెరుగులు దిద్దుకున్నాడు. ఒక్కో మెట్టే ఎక్కుతూ... అకాడమీలో శిక్షణ తీసుకుంటూ 11 ఏళ వయస్సు లోనే అండర్–14 జిల్లా జట్టుకు ఎంపికై చక్కని ఆటతీరును ప్రదర్శించడంతో రషీద్‌కు ఆంధ్ర జట్టులో స్థానం లభించింది. ఇక ఆ తర్వాత అతను వెనుదిరిగి చూడలేదు. నిలకడైన ప్రదర్శనతో వరుసగా అన్ని వయోవిభాగాల్లోనూ రషీద్ అవకాశాలు దక్కించుకున్నాడు. ఆటను మరింత మెరుగుపర్చు కుంటున్న దశలో ఏసీఏ ‘క్రికెట్ బియాండ్ బౌండరీస్’ కార్యక్రమం అతనికి ఎంతో మేలు చేసింది. దీని ద్వారా రెండు నెలల పాటు ఇంగ్లండ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకునే అవకాశం కలిగింది. ఆ తర్వాత అతను ఆటలో మరింత పదును పెరిగింది. ఈ ఏడాది వినూమన్కడ్ ట్రోఫీలో ఆంధ్ర కెప్టెన్‌గా ఆడి 376 పరుగులు చేయడం, ఆ తర్వాత చాలెంజర్ ట్రోఫీలోనూ సత్తా చాటడంతో ఆసియా కప్ టీమ్‌లోకి రషీద్ ఎంపికయ్యాడు. అదే జోరులో అతనికి భారత వైస్ కెప్టెన్‌గా ప్రపంచ కప్ ఆడే అవకాశం కూడా దక్కింది. ఇప్పుడు దానిని కూడా రెండు చేతులా పూర్తిగా అందిపుచ్చుకున్న రషీద్ భవిష్యత్తు తారగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మా అబ్బాయి శ్రమ ఈ దేశానికి ఉపయోగపడాలి. భవిష్యత్‌లో అతను దేశం గర్వించదగ్గ గొప్ప క్రికెటర్ అవ్వాలి. దాని కోసం మేము ఎన్ని త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో రషీద్ కెరీర్‌పై ఆందోళన కలిగిన సమయంలో మాకు మంగళగిరిలోని ఆంధ్ర క్రికెట్ అకాడమీ అండగా నిలిచింది. –రషీద్ తల్లిదండ్రులు జ్యోతి, బాలీషా చదవండి: U19 WC- Shaikh Rasheed: 40 లక్షల నగదు.. అంత డబ్బు ఎప్పుడూ చూడలేదు.. చిన్న ఇల్లు కొంటాను.. మిగతా మొత్తంతో.. -
ఐపీఎల్ మెగా వేలంలో రాజోలు కుర్రాడు
బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో జరగబోయే ఐపీఎల్ 2022 మెగా వేలంలో తూర్పు గోదావరి జిల్లా రాజోలు కుర్రాడు బండారు అయ్యప్ప అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ తరఫున వేలం బరిలో నిలిచిన అయ్యప్పను 2019లో ఢిల్లీ క్యాపిటల్స్ కనీస ధర రూ. 20 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే, అయ్యప్పకు ఇంతవరకు లీగ్‌లో అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. 2011 నుంచి ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 29 ఏళ్ల అయ్యప్ప.. 2015–16 రంజీ సీజన్లో ముంబై జట్టుపై ఆరు వికెట్లు తీసి తొలిసారి వార్తల్లో నిలిచాడు. దీంతో అతనికి 2018–19లో ఇండియా బ్లూ జట్టు నుంచి ఆహ్వానం లభించింది. మీడియం పేస్ బౌలర్‌గా, రైట్ హ్యాండ్ బ్యాటర్‌గా రాణిస్తున్న అయ్యప్ప, త్వరలో జరగనున్న వేలంలో భారీ ధర సొంతం చేసుకోవాలని ఆ ప్రాంతవాసులు ఆకాంక్షిస్తున్నారు. కెరీర్లో ఇప్పటివరకు 32 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 31 లిస్ట్ ఏ మ్యాచ్‌లు, 37 టీ20లు ఆడిన అయ్యప్ప.. మొత్తం 167 వికెట్లు పడగొట్టాడు. వేలం బరిలో ఉన్న ఇతర తెలుగు క్రికెటర్ల విషయానికొస్తే.. హైదరాబాద్‌కు చెందిన భావనక సందీప్(ఎస్ఆర్హెచ్), రామచంద్రాపురంకు చెందిన కేఎస్ భరత్(ఆర్సీబీ), వైఎస్సార్ జిల్లా రాయచోటికి చెందిన హరిశంకర్ రెడ్డి(సీఎస్కే)లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గతేడాది ఐపీఎల్లో వీరిని కనీస బేస్ ధర 20 లక్షలకు ఆయా జట్లు సొంతం చేసుకున్నాయి. త్వరలో జరిగే మెగా వేలంలో వీరంతా భారీ ధర ఆశిస్తున్నారు. వీరిలో ఒక్క కేఎస్ భరత్‌కు మాత్రమే ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం దక్కింది. 2021 సీజన్లో భరత్ ఆర్సీబీ తరఫున 8 మ్యాచ్‌లు ఆడి 122కు పైగా స్ట్రయిక్ రేట్‌తో 191 పరుగులు చేశాడు. ఇదిలా ఉంటే, ఈసారి వేలంలో మొత్తం 1214 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో 590 మంది షార్ట్ లిస్ట్ అయ్యారు. వీరిలో 370 మంది భారత క్రికెటర్లు కాగా, 220 మంది విదేశీయులు ఉన్నారు. చదవండి: IPL 2022: అందుకే ఐపీఎల్ మెగా వేలానికి దూరం: స్టార్ ప్లేయర్ -
జనవరి 13న సీఎం జగన్ చేతుల మీదుగా ఎంఐజీ లేఅవుట్ ప్రారంభం
సాక్షి,అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సమీపంలో మధ్య ఆదాయ వర్గాల వారి కోసం అందుబాటులోకి తెచ్చిన జగనన్న స్మార్ట్ టౌన్‌షిప్‌లోని ఎంఐజీ లే అవుట్‌ను ఈ నెల 13న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ సీఆర్డీఏ కమిషనర్ విజయకృష్ణన్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 200 నుంచి 240 చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఈ ప్లాట్లను పొందేందుకు రూ.18 లక్షల లోపు వార్షిక ఆదాయమున్న ఏపీకి చెందిన వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు సీఆర్డీఏ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. -
భారత్ క్రికెట్లో మెరిసిన తెలుగు తేజం.. కీలక బాధ్యతల్లో..
ప్రత్తిపాడు/గుంటూరు: అంతర్జాతీయ క్రికెట్లో తెలుగుతేజం మెరిసింది. వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరగనున్న ఐసీసీ అండర్–19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2022కు బీసీసీఐ భారత్ టీంను ప్రకటించింది. పదిహేడు మంది సభ్యులతో ప్రకటించిన భారత్ టీంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నుంచి వైస్ కెప్టెన్‌గా షేక్ రషీద్ ఎంపికయ్యాడు. రషీద్ మన జిల్లా వాసే. ప్రత్తిపాడు మండలం పాతమల్లాయపాలెంకు చెందిన షేక్ బాలీషా, జ్యోతిలకు ఇద్దరు కుమారులు. పెద్దకుమారుడు రియాజ్ మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతుండగా, రెండవ కుమారుడు రషీద్ ప్రస్తుతం నరసరావుపేటలోని రెడ్డి కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. తండ్రి వృత్తిరీత్యా ప్రైవేటు ఉద్యోగి కావడం, కుమారుడి ప్రాక్టీస్ నిమిత్తం వీరు ప్రస్తుతం గుంటూరులోని హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్నారు. పన్నెండేళ్ల వయస్సులోనే.. రషీద్‌కు చిన్నతనం నుంచే క్రికెట్‌పై అమితమైన ఆసక్తి ఉంది. స్వతహాగా బ్యాటింగ్ అంటే మంచి ఇష్టమున్న రషీద్ ఆ దిశగానే తన ప్రయత్నాలను మొదలుపెట్టాడు. పన్నెండేళ్ల వయస్సులోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు సెలక్ట్ అయ్యాడు. మంగళగిరిలో ప్రత్యేక కోచ్‌ల ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నాడు. రషీద్‌కు తల్లిదండ్రుల నుంచి కూడా మంచి ప్రోత్సాహం ఉంది. కుమారుడి ప్రాక్టీసుకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో పదేళ్ల క్రితం కుటుంబంతో సహా గుంటూరుకు వెళ్లిపోయారు. కుర్రాడి ఎంపిక పట్ల తల్లిదండ్రులతో పాటు పాతమల్లాయపాలెం గ్రామస్తులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. చదవండి: IND Vs SA: ఓవర్‌లోడ్ బ్యాగ్ మోసుకుని వెళ్లిన కోహ్లి.. దాంట్లో ఏముంది! -
మళ్లీ హైదరాబాద్ జట్టు తరఫున ఆడనున్న విహారి
హైదరాబాద్ : టీమిండియా టెస్టు ఆటగాడు హనుమ విహారి మళ్లీ హైదరాబాద్ జట్టు తరపున రంజీల్లో ఆడనున్నాడు. ఈ మేరకు అతడికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి వీ దుర్గాప్రసాద్ ధ్రువీకరించారు. తొలుత హైదరాబాద్ తరఫున రంజీ పోటీల్లో పాల్గొన్న విహారి.. అనంతరం ఆంధ్రాకు తరలి వెళ్లాడు. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ పర్యటనకు ఎంపికైన విహారి.. కేవలం రిజర్వ్ బెంచ్‌కే పరిమితమ్యాడు. కాగా కరోనా కారణంగా ఇంగ్లండ్‌తో జరగాల్సిన ఐదో టెస్టు అర్ధంతరంగా రద్దు కావడంతో విహారి స్వదేశానికి చేరుకున్నాడు. ఇప్పటివరకు 12 టెస్ట్ మ్యాచులాడిన విహారి 624 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో జరిగిన 2012 అండర్-19 ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన భారత జట్టులో విహారి సభ్యుడుగా ఉన్నాడు. చదవండి: IPL 2021: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బీసీసీఐ గుడ్ న్యూస్.. -
కష్టాల కడలి దాటి.. క్రికెట్ ఒడిలోకి
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో తొలి మహిళా అంపైర్‌గా ఎంపికైన వై.హరీషా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. అడ్డంకులను అధిగమిస్తూ.. కష్టాలనే విజయ సోపానాలుగా మలుచుకుంటూ విజేతగా నిలిచింది. హరీషా చిన్న వయసులోనే తండ్రి కన్నుమూశాడు.. బరువు.. బాధ్యత మోసిన మాతృమూర్తి తన ఎదుగుదలను చూడకముందే మృత్యుఒడికి చేరింది.. ఇలా అనుకోని కష్టాల కడలి దాటి క్రికెట్ ఒడికి చేరింది. శ్రమయేవ జయతే నినాదాన్ని నిజం చేస్తూ తల్లి ఆశయాన్ని.. తన లక్ష్యాన్నీ సాధించింది. ప్లేయర్‌గానే కాదు అంపైరింగ్‌లోనూ అడుగు పెట్టి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వై. హరీషా విజయగాథపై ప్రత్యేక కథనం. సాక్షి, కడప : కడప నగరంలోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న వై. హరీషా స్వస్థలం కర్నూలు జిల్లా నంద్యాల. తండ్రి చిన్న వయసులోనే చనిపోగా పోషణ భారమంతా తల్లిపై పడింది. అప్పటి నుంచి అన్నీతానై అల్లారుముద్దుగా పెంచింది. కూతురు ప్రయోజకురాలైతే చూడాలని ఎంతో ఆశ పడింది. ఆ ఆశ నెరవేరకుండానే కన్నుమూసింది. తల్లి ఆశయ సాధన కోసం.. కన్న తల్లి దూరమైనా ఆమె ఆశయసాధన కోసం మరింత పట్టుదలగా కృషి చేసింది హరీషా. ఈ క్రమంలో తనకెంతో ఇష్టమైన క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. అండర్–16, అండర్–19 ఉమన్టీంకు ప్రాతినిథ్యం వహించింది. జోనల్‌స్థాయి పోటీల్లో సైతం పాల్గొని ప్రతిభ కనబరిచింది. ఈ నేపథ్యంలో ఆమె ఇంట్లో పరిస్థితులు సహకరించకపోవడంతో క్రికెట్‌కు స్వస్తిపలికి చదువుపై దృష్టి సారించింది. తల్లిదండ్రులు లేకపోవడంతో బంధువుల సహకారంతో కడపలోని శ్రీహరి డిగ్రీ కళాశాలలో చేరింది. అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఆనంద్ ఆమెలోని ప్రతిభను గుర్తించి క్రికెట్లోకి మళ్లీ రావాలని ప్రోత్సహించాడు. అంతేకాకుండా క్రికెట్ సంఘం పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం. భరత్‌రెడ్డి, పి. సంజయ్‌కుమార్‌ల బృందం ఆమె బాగోగులు చూసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో పాటు సహకారం అందిస్తామని తెలిపారు. దీంతో క్రికెట్లో ఈమె కడప నుంచి ప్రాతినిథ్యం వహిస్తోంది. ఏసీఏ తొలి మహిళా అంపైర్‌గా.. ఇప్పటి వరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ పరిధిలో మహిళా క్రీడాకారిణులు తమ క్రికెట్ అనంతరం స్కోరర్లుగా పనిచేశారు. అయితే ఎవరూ అంపైరింగ్ రంగంలోకి రాలేదు. ఇటీవల జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో జనవరి 30న జిల్లాస్థాయి అంపైరింగ్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరైన ఏకైక మహిళ ఈమె కావడం విశేషం. పరీక్ష ఉత్తీర్ణత సాధించడంతో పాటు ఫిబ్రవరి 8న నిర్వహించిన ప్రాక్టికల్స్, వైవాలో ఉత్తీర్ణత సాధించడంతో ఈమెను స్టేట్ ప్యానల్‌కు అంపైర్‌గా జిల్లా క్రికెట్ సంఘం సభ్యులు సిఫార్సు చేశారు. దీనికి ఆంధ్రా క్రికెట్ సంఘం అనుమతించడంతో ఈమె తొలి ఏసీఏ అంపైర్‌గా అరుదైన చరిత్రను తనపేరు మీదుగా రాసుకుంది. రానున్న రోజుల్లో ఈమె లెవల్–2 అంపైర్‌గా కూడా అవకాశం లభించనుంది. చదవండి: ఏంటిది రహానే.. ఇలా చేశావు? ఓటమిని ఆహ్వానించిన టీమిండియా -
కింగ్స్ ఎలెవన్ నాలుగో విజయం
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర టి20 లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో కింగ్స్ ఎలెవన్ జట్టు నాలుగో విజయం నమోదు చేసింది. చార్జర్స్ ఎలెవన్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ జట్టు మూడు పరుగుల తేడాతో నెగ్గింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చార్జర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు చేసి ఓడిపోయింది. కింగ్స్ జట్టు బౌలర్ ‘మ్యాన్ ఆఫ్ ద మాŠయ్చ్’ పి.తపస్వీ 13 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయంలో ముఖ్యపాత్ర పోషించాడు. చార్జర్స్ జట్టులో రషీద్ (41 బంతుల్లో 61; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), సుమంత్ (39) మెరిసినా కీలకదశలో అవుటవ్వడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. అంతకుముందు కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 157 పరుగులు చేసింది. కెప్టెన్ సీఆర్ జ్ఞానేశ్వర్ (52; 6 ఫోర్లు, సిక్స్), నరేన్ రెడ్డి (44; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరిశారు. మరో మ్యాచ్‌లో చాంపియన్స్ జట్టు ఏడు వికెట్ల తేడాతో టైటాన్స్‌ను ఓడించింది. తొలుత టైటాన్స్ జట్టు 8 వికెట్లకు 151 పరుగులు చేయగా... చాంపియన్స్ జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రికీ భుయ్ (42 బంతుల్లో 62; 4 ఫోర్లు, 6 సిక్స్‌లు) కళ్లు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. గిరినాథ్ (33), అశ్విన్ హెబర్ (36) కూడా రాణించడంతో చాంపియన్స్ జట్టు ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని అధిగమించింది. క్వార్టర్స్‌లో దివిజ్ జంట నూర్–సుల్తాన్ (కజకిస్తాన్): అస్తానా ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నమెంట్లో దివిజ్ శరణ్ (భారత్)–ల్యూక్ బామ్‌బ్రిడ్జ్ (బ్రిటన్) జంట క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. బుధవారం జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో దివిజ్–బామ్‌బ్రిడ్జ్ ద్వయం 7–5, 4–6, 10–6తో ఏరియల్ బెహర్ (ఉరుగ్వే)–గొంజాలో ఎస్కోబార్ (ఈక్వెడార్) జోడీని ఓడించింది. -
వారియర్స్ ఎలెవెన్ గెలుపు
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర టి20 క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌ల్లో చాంపియన్స్ ఎలెవన్‌పై వారియర్స్ ఎలెవన్ ఆరు వికెట్ల తేడాతో... లెజెండ్స్ ఎలెవన్‌పై కింగ్స్ ఎలెవన్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించాయి. వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాంపియన్స్ జట్టు తొలుత 20 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. అశ్విన్ హెబ్బర్ (57 నాటౌట్), వంశీ కృష్ణ (28), రికీ భుయ్ (24) రాణించగా... తేజస్వి 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. అనంతరం వారియర్స్ జట్టు 17.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసి నెగ్గింది. ఎం.శ్రీరామ్ (60 బంతుల్లో 75 నాటౌట్; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ప్రశాంత్ కుమార్ (33) ఆకట్టుకున్నాడు. ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) సీఈఓ ఎం.వి.శివారెడ్డి నుంచి శ్రీరామ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం అందుకున్నాడు. సంక్షిప్త స్కోరు: కింగ్స్ ఎలెవన్: 128/8 (20 ఓవర్లలో) (సీఆర్ జ్ఞానేశ్వర్ 47, ధీరజ్ 28, ఆశిష్ రెడ్డి 3/20, జి.మనీశ్ 2/22); లెజెండ్స్ ఎలెవన్: 125 ఆలౌట్ (20 ఓవర్లలో) (జోగేశ్ 43, కార్తీక్ 26, నరేన్ రెడ్డి 4/15, ఆశిష్ 2/27). -
ఆంధ్ర క్రికెటర్లు భారత జట్టులోకి ఎంపికవ్వాలి
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడుతున్న యువ ఆటగాళ్లు భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధ్యక్షుడు శరత్‌చంద్రారెడ్డి ఆకాంక్షించారు. యువ క్రికెటర్లలను ప్రోత్సహించడంలో, వారికి తగిన అవకాశాలు ఇవ్వడంతో ఏసీఏ ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు. ఏసీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆంధ్ర టి20 లీగ్‌ను ఆయన ఆర్డీటీ మైదానంలో గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఆరు జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీ నవంబర్ 8 వరకు జరుగుతుంది. మొత్తం 33 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. తొలి రోజు మ్యాచ్‌ల్లో కింగ్స్ ఎలెవన్‌పై 6 వికెట్లతో టైటాన్స్ ఎలెవన్ గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో చార్జర్స్ ఎలెవన్ జట్టు 56 పరుగులతో లెజెండ్స్ ఎలెవన్‌ను ఓడించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏసీఏ రాష్ట్ర కార్యదర్శి దుర్గాప్రసాద్, సీఈఓ వెంకటశివారెడ్డి, ట్రెజరర్ గోపీనాథ్‌రెడ్డి, అండర్–14 ఆంధ్ర జట్టు సెలెక్టర్ ప్రసాద్‌రెడ్డి, ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్, మాజీ క్రికెటర్ షాబుద్దీన్ తదితరులు హాజరయ్యారు. -
‘లక్ష్యాన్ని ప్రేమతో సాధించాలి’
ఏ అంశంలోనైనా గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరు భావిస్తారు. క్రీడా రంగంలో.. అందులోనూ అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్న క్రికెట్ క్రీడ విషయంలో గెలుపు ముఖ్యం కాకూడదు. ఎంత బాగా మన ఆట తీరును ప్రదర్శించాం... ఎంత మందిని ప్రోత్సహించామన్నదే ప్రధానం. ప్రతిభ గల క్రీడాకారులను ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ ఎప్పుడూ ప్రోత్సహిస్తుంది. ఏసీఏ డైరెక్టర్ వై.వేణుగోపాలరావు త్వరలో ఇండియా జట్టులోకి మన కుర్రోళ్లు... ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు సాధనలో రాటుదేలుతూ ఉత్తమ ప్రతిభ కనబరుస్తున్నారు. ప్రస్తుతం మన రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు హనుమ విహారి, కె.ఎస్.భరత్ ఇండియా తరఫున ఆడుతున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. త్వరలో మరో ముగ్గురికి అవకాశం దక్కనుంది. విశేషమేమిటంటే ఆంధ్రప్రదేశ్ జట్టు రంజీ ట్రోఫీలకు క్వాలిఫై కావటం. క్రికెట్ చరిత్రలో ఇదో మంచి పరిణామంగా చెప్పవచ్చు. మన క్రీడాకారుల ప్రతిభకు ఇది తార్కాణంగా నిలుస్తుంది. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సాహం గ్రామీణ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఏసీఏ అధిక ప్రాధాన్యమిస్తుంది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే విజయనగరం వంటి జిల్లాలో రెండు నుంచి మూడు మైదానాలు ఏర్పాటు చేశాం. త్వరలో శ్రీకాకుళం, తిరుపతి నగరాల్లో మైదానాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆయా మైదానాల్లో శిక్షణ పొందేందుకు వచ్చే వారి కోసం శిక్షకులను ఏర్పాటు చేస్తాం. ఉన్నకాడికి వనరులను సద్వినియోగం చేసుకుని లక్ష్యాలను చేధించగలిగే స్థాయికి క్రీడాకారులు ఎదగాలి. ఫ్రీగా ఏసీఏ కోసం పని చేస్తున్నా... అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న తరువాత ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం ఆనందంగా ఉంది. 70 ఐపీఎల్ మ్యాచ్‌లు... 16 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాను. కానీ తాజాగా చేపట్టిన బాధ్యతలతో ఆనందంగా ఉంది. ఇంతకుముందు వారంతా నెలకు రూ. 3లక్షల వరకు జీతం తీసుకునేవారు. నేను మాత్రం అటువంటి రెమ్యూనరేషన్కోసం ఆశపడలేదు. ఫ్రీగానే బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఆంధ్రాలో క్రికెట్ క్రీడాకారులను తయారుచేయటమే ధ్యేయం. ఎన్నో కష్టాలు పడ్డా... మా స్వస్థలం విశాఖ జిల్లా గాజువాక. అక్కడే చిన్న స్టేడియంలో నిత్యం సాధన చేసే వాడ్ని. క్రికెట్లో రాణించాలన్నది నా లక్ష్యం. అందుకు అనుగుణంగానే కష్టపడ్డాను. ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. ఇష్టంగా ఎదుర్కొన్నా. మద్రాసు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో ఆడేందుకు వెల్లాల్సిన అవసరం వచ్చిన సమయంలో ట్రైన్లో జనరల్ బోగీలోని బాత్రూం పక్కన కూర్చొని వెల్లిన రోజులున్నాయి. బెంగళూరులో డార్మిటరీలో పడుకుని ప్రాక్టీస్‌కు వెళ్లాను. ఇన్ని కష్టాలు పడ్డ తరువాత అంతర్జాతీయ యవనికపై ఆడే అవకాశం దక్కింది. అప్పుడు ఈ కష్టాలన్నింటినీ మర్చిపోయాను. కుటుంబ ప్రోత్సాహం మరువలేనిది... అమ్మ.. నాన్న... ఐదుగురు అన్నదమ్ములం... అందులో నేను నాల్గవ వాడిని. నా తమ్ముడు జ్ఞానేశ్వర్ ఇండియా అండర్–19 జట్టుకు ఆడాడు. అమ్మనాన్నల ఇష్టంతో ప్రమేయం లేకుండానే క్రికెట్లోకి దిగాను. ఎవ్వరూ అడ్డుచెప్పలేదు. మా అన్నదమ్ములంతా ఆంధ్రా జట్టుకు ఆడినవారే. నేనొక్కడినే ఇండియాకు ఆడాను. ఆంధ్రా నుంచి తక్కువ మంది క్రీడాకారులు ఇండియాకు ఆడిన వారు ఉన్నారు. వారి సంఖ్య మరింత పెరగాలన్నదే నా లక్ష్యం. అందుకోసం నా శాయశక్తుల పని చేస్తా. ఈ విషయంలో నా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మరువలేనిది. ప్రస్తుతం భార్య, ఇద్దరు పిల్లలతో చెన్నైలో ఉంటున్నా. మూడు నెలల తరువాత విశాఖలో అమ్మ, నాన్న దగ్గరకు వెళ్లా. -
ఐదేళ్ల తర్వాత...
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: మాజీ చాంపియన్ గుజరాత్‌తో జరిగిన చివరిదైన ఎనిమిదో లీగ్ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ... రంజీ ట్రోఫీ టోర్నమెంట్లో ఆంధ్ర క్రికెట్ జట్టు నాకౌట్ దశకు (క్వార్టర్ ఫైనల్స్) అర్హత సాధించింది. నడియాడ్‌లో శనివారం ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ చేతిలో ఓటమి పాలైంది. ఆట చివరి రోజు ఓవర్‌నైట్ స్కోరు 216/7తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర 113.4 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. గుజరాత్ బౌలర్ అక్షర్ పటేల్ 92 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు. అనంతరం 30 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో గుజరాత్ 18 జట్లున్న ఎలైట్ గ్రూప్ ‘ఎ అండ్ బి’లో 35 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. ఎలైట్ ‘ఎ అండ్ బి’ గ్రూప్ నుంచి బెంగాల్ (32 పాయింట్లు), కర్ణాటక (31 పాయింట్లు), సౌరాష్ట్ర (31 పాయింట్లు), ఆంధ్ర (27 పాయింట్లు) జట్లు కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. ఆంధ్ర జట్టు రంజీ ట్రోఫీలో నాకౌట్ దశకు చేరడం ఇది నాలుగోసారి. గతంలో ఆంధ్ర జట్టు కె.ఎస్. భాస్కర మూర్తి సారథ్యంలో 1985–86 సీజన్లో... ఎమ్మెస్కే ప్రసాద్ కెప్టెన్సీలో 2001–02 సీజన్లో... మొహమ్మద్ కైఫ్ నాయకత్వంలో 2014–15 సీజన్లో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందింది. అయితే ఈ మూడు పర్యాయాలూ ఆంధ్ర పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. ఈనెల 20 నుంచి 24 వరకు ఒంగోలు వేదికగా జరిగే క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్రతో ఆంధ్ర జట్టు ఆడుతుంది. ఈ సీజన్లో ఆంధ్ర జట్టు మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో గెలిచింది. రెండింటిని ‘డ్రా’ చేసుకొని మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ సీజన్లో హనుమ విహారి, రికీ భుయ్, శ్రీకర్ భరత్‌లు ఆంధ్ర జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించారు. మరోవైపు హైదరాబాద్ జట్టు డిఫెండింగ్ చాంపియన్ విదర్భతో చివరి మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించింది. కేవలం ఏడు పాయింట్లతో అట్టడుగున నిలిచి వచ్చే ఏడాది గ్రూప్ ‘సి’కి పడిపోయింది. గ్రూప్ ‘సి’లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జమ్మూ కశ్మీర్, ఒడిశా జట్లు వచ్చే ఏడాది ఎలైట్ ‘ఎ అండ్ బి’ గ్రూప్‌కు ప్రమోట్ అయ్యాయి. ‘సి’లో చివరి స్థానంలో నిలిచిన ఉత్తరాఖండ్ ప్లేట్ డివిజన్‌కు పడిపోయింది. ప్లేట్ డివిజన్లో అగ్రస్థానంలో నిలిచిన గోవా జట్టు గ్రూప్ ‘సి’కి ప్రమోట్ అయ్యింది. ‘ఈ సీజన్లో జట్టులోని ప్రతి సభ్యుడు తీవ్రంగా కష్టపడ్డాడు. వారికి సహాయక సిబ్బంది కూడా తమ వంతుగా ప్రోత్సాహం అందించింది. నాకౌట్ మ్యాచ్‌లోనూ ఆంధ్ర జట్టు మంచి ప్రదర్శన చేసి ముందంజ వేయాలి. ఆంధ్ర క్రికెట్ సంఘానికి మరింత పేరు తేవాలి. సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్ కోసం అందరికీ బెస్టాఫ్ లక్’ అని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) సెక్రటరీ వి.దుర్గా ప్రసాద్ తెలిపారు. క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ ఫిబ్రవరి 20 నుంచి 24 వరకు ఆంధ్ర గీ సౌరాష్ట్ర (ఒంగోలు) కర్ణాటక గీ జమ్మూ కశ్మీర్ (జమ్మూ) బెంగాల్ గీ ఒడిశా (కటక్) గుజరాత్ గీ గోవా (వల్సాద్) -
భారత మహిళల జట్లలో ముగ్గురు ఆంధ్ర క్రికెటర్లు
ముంబై: నాలుగు జట్ల అంతర్జాతీయ టి20 మహిళల క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే భారత ‘ఎ’, ‘బి’ జట్లను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) శుక్రవారం ప్రకటించింది. ఈ రెండు జట్లలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు క్రికెటర్లు రావి కల్పన, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి ఎంపికయ్యారు. పట్నాలో ఈనెల 16 నుంచి 22 వరకు జరిగే ఈ టోర్నీలో భారత్ ‘ఎ’... ‘బి’ జట్లతోపాటు బంగ్లాదేశ్, థాయ్‌లాండ్ జట్లు బరిలోకి దిగుతాయి. దేశవాళీ టోర్నీల్లో రైల్వే స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్ఎస్పీబీ) తరఫున ఆడే కల్పన భారత ‘ఎ’ జట్టులో... మేఘన, అంజలి భారత ‘బి’ జట్టులో చోటు దక్కించుకున్నారు. భారత ‘ఎ’ జట్టుకు దేవిక వైద్య... భారత ‘బి’ జట్టుకు స్నేహ రాణే కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. -
జిల్లావాసికి అరుదైన గౌరవం
సుదీర్ఘ పాలన అనుభవానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) పెద్దపీట వేసింది. మన జిల్లాకు చెందిన ముండ్ల వెంకటశివారెడ్డికి ఏసీఏలో కీలకమైన సీఈఓ పోస్టును కట్టబెట్టి గౌరవించింది. జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడుగా ఉన్న ఈయనకు సీఈఓ పదవి రావడంతో జిల్లా క్రికెట్ సంఘానికి మహర్దశ పట్టనుంది.. రానున్న రోజుల్లో కీలకమైన మ్యాచ్‌లను తీసుకురావడంతోపాటు జిల్లాలో క్రికెట్ మరింత వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని జిల్లా క్రికెట్ ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, కడప : చెన్నూరు మండలం ముండ్లపల్లె గ్రామానికి చెందిన ఎం. వెంకటశివారెడ్డి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా నియమితులయ్యారు. ఏసీఏ నుంచి ఉత్తర్వులు అందాయి. స్వతహాగా క్రికెటర్ అయిన వెంకటశివారెడ్డి బ్యాట్స్‌మన్‌గా, ఆఫ్ స్పిన్నర్‌గా రాణించారు. ఎస్వీయూ, ఎస్కేయూ క్రికెట్ జట్లకు ఈయన ప్రాతినిధ్యం వహించడమే కాక ఒకే ఓవర్లో 5 వికెట్లు తీసిన రికార్డు కూడా ఈయన సొంతం. ఈయన తండ్రి ఎం. చంద్రశేఖరరెడ్డి జెడ్పీ మాజీ వైస్ చైర్మన్‌గా, క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా ఉన్నా రు. ఆయన స్ఫూర్తితో ఈయన తొలుత (1990) క్రికెట్ సంఘంలోకి ప్రవేశించడంతో పాటు అధ్యక్షస్థానాన్ని కైవసం చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 29 సంవత్సరాల పాటు ఏకధాటిగా జిల్లా అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. దీంతో పాటు 2011 నుంచి 2019 వరకు ఏసీఏ ఉపాధ్యక్షులుగా పనిచేశారు. దీంతో పాటు 2006లో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభధ్రుల ఎమ్మెల్సీగా ఎన్నికై ప్రజాశీర్వాదం పొందారు. కేడీసీఏ, ఏసీఏ సంఘాల పదవులతో పాటు బీసీసీఐ యాంటీ డోపింగ్ కమిటీ సభ్యుడుగా, ఇండియా ఏ టీం మేనేజర్‌గా పనిచేశారు. న్యూజిలాండ్ ఏ జట్టు లైజన్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహించారు. కడపలో క్రికెట్ మైదానం ఏర్పాటులో.. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే జిల్లాలో మంచి క్రికెట్ మైదానం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆయన్ను కలిసి నిర్మాణానికి శ్రీకాకారం చుట్టారు. దీంతో వైఎస్ 11 ఎకరాల స్థలం ఇవ్వడంతో పాటు రూ.50 లక్షలు అందజేశారు. 2011 నాటికి 15వేల మంది ప్రేక్షకులు వీక్షించగలిగే మైదానం అందుబాటులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఈయన కీలకపాత్ర పోషించారు. అప్పటి ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు సహకారంతో పలు రంజీ, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లను కడపకు తీసుకువచ్చారు. 2013లో దేశంలోనే మొట్టమొదటి రెసిడెన్షియల్ క్రికెట్ అకాడమీనీ కడపలో ఏర్పాటు చేయడంలో వెంకటశివారెడ్డి కీలకపాత్ర పోషించారు. 2014లో కేఎస్ఆర్ఎం, కేఓఆర్ఎం మైదానాలను, డ్రస్సింగ్ రూంలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కడప గడపకు దిగ్గజ క్రికెటర్లు.. 1993లో అప్పటి జిల్లా కలెక్టర్ కె.వి. రమణాచారి సూచనల మేరకు అప్పటి కేడీసీఏ అధ్యక్షుడుగా ఉన్న ఎం. వెంకటశివారెడ్డి కడప నగరంలోని డీఎస్ఏ మైదానంలో ఛారిటీ మ్యాచ్ నిర్వహించారు. 1993 జూన్ 12వ తేదీ నిర్వహించిన ఈ చారిటీ మ్యాచ్‌కు క్రికెట్ లెజండ్స్ సచిన్టెండూల్కర్, అనిల్‌కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్, రవిశాస్త్రి, వెంగ్‌సర్కార్, మనోజ్‌ప్రభాకర్, వెంకటపతిరాజు, కిరణమోరే, వెంకటేష్‌ప్రసాద్, సయ్యద్ కిర్మాణీ, సలీల్ అంకోలా వంటి దిగ్గజ క్రికెటర్లు కడప గడపకు విచ్చేసి మ్యాచ్ ఆడారు. అలా లెజండరీ క్రికెటర్లను చూసే అవకాశం జిల్లా వాసులకి దక్కింది. కాగా జిల్లాకు చెందిన వ్యక్తికి ఏసీఏ సీఈఓగా అవకాశం రావడం పట్ల జిల్లా క్రికెట్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో జిల్లాలో క్రికెట్‌కు, క్రీడాకారులకు మరింత మేలు జరుగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
కొలువుదీరిన ఏసీఏ కార్యవర్గం
విజయవాడ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కార్యవర్గం శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. ఏసీఏ అధ్యక్షుడిగా పి.శరత్‌చంద్రా రెడ్డి, ఉపాధ్యక్షుడిగా వీవీఎస్‌ఎస్‌కే యాచేంద్ర, కార్యదర్శిగా వి.దుర్గాప్రసాద్, సంయుక్త కార్యదర్శిగా కేఎస్ రామచంద్రరావు, కోశాధికారిగా జి.గోపినాథ్‌రెడ్డి, కౌన్సిలర్‌గా ఆర్.ధనుంజయరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో ఈ ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తరపున ఏసీఏ లీగల్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరాజు అధికారికంగా ఈ ఎంపికను ప్రకటించి సరి్టఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఆఫీస్‌బేరర్లు గోకరాజు రంగరాజు, సీహెచ్.అరుణ్‌కుమార్ కొత్త కమిటీకి స్వాగతం పలికారు. తమ హయాంలో జరిగిన ఏసీఏ అభివృద్ధిని తెలిపిన వీరు కొత్త కమిటీ దీనిని ముందుకు తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇటీవలే రిటైరైన టీమిండియా మాజీ ఆటగాడు వై.వేణుగోపాలరావును కొత్త కార్యవర్గం ఘనంగా సన్మానించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి చేరుకున్నట్లు ఈ సందర్భంగా వేణుగోపాలరావు అన్నాడు. ఆంధ్ర నుంచి ఎక్కువ మంది దేశానికి ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. అసోసియేషన్ కొత్త అధ్యక్షుడు పి.శరత్ చంద్రారెడ్డి మాట్లాడుతూ... క్షేత్ర స్థాయిలో క్రికెట్‌ను అభివృద్థి చేస్తామన్నారు. బా«ధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, పారదర్శకత పాటిస్తామని పేర్కొన్నారు. మిగిలిన కార్యవర్గం ప్రతినిధులు మాట్లాడుతూ, తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా శభాష్ అనిపించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పాల్గొన్నారు. -
‘ఒక క్రికెటర్‌ను బాధించే అంశం అదే’
విజయవాడ: జీవితంలో ఒక క్రికెటర్‌ను బాధించే అంశం ఏదైనా ఉంటే అది రిటైర్మెంటేనని టీమిండియా మాజీ క్రికెటర్ వేణుగోపాలరావు పేర్కొన్నారు. తాను 25 ఏళ్లు క్రికెటర్‌గా సేవలందించానని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కుటుంబ ప్రోత్సహమేనని అన్నారు. ప్రత్యేకంగా తన తండ్రి వల్లే ఇన్ని విజయాలు సాధ్యమైనట్లు తెలిపారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ)కు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు.. వేణుగోపాలరావును ఘనంగా సత్కరించారు. దీనిలో భాగంగా మాట్లాడిన వేణుగోపాలరావు.. ప్రతీ క్రికెటర్‌కు రిటైర్మెంట్ అనేది ఎక్కువగా బాధిస్తుందన్నారు. ఆంధ్ర నుంచి ఎక్కువ మంది యువ క్రికెటర్లు దేశానికి ఆడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన టీమిండియా చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ఏసీఏకు కొత్తగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలియజేశారు. లోధా కమిటీ నిబంధనల ప్రకారమే నూతన కార్యవర్గ సభ్యుల ఎన్నిక జరిగిందన్నారు. ఏసీఏ నూతన కార్యవర్గం పి. శరత్ చంద్ర - అధ్యక్షులు వీవీఎస్‌ఎస్‌కేకే యాచేంద్ర వి. దుర్గా ప్రసాద్- ప్రధాన కార్యదర్శి కేఎస్. రామచంద్ర రావు-జాయింట్ సెక్రటరీ ఎస్. గోపినాధ్ రెడ్డి -కోశాధికారి ఆర్. ధనుంజయ రెడ్డి - కౌన్సిలర్ -
ఆంధ్ర క్రికెట్ సంఘం కొత్త అధ్యక్షుడిగా శరత్ చంద్రారెడ్డి
సాక్షి, విజయవాడ: ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) కొత్త కార్యవర్గం ఏర్పాటైంది. సుప్రీం కోర్టు మార్గదర్శకాలు, లోధా కమిటీ సూచనలకు అనుగుణంగా ఏసీఏ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధం కాగా... ప్రత్యర్థులు లేకపోవడంతో ఆరు పదవులకు కూడా ఏకగ్రీవ ఎంపిక జరిగింది. ఈ వివరాలను సోమవారం ఎన్నికల అధికారి భన్వర్ లాల్ ప్రకటించారు. కొత్త అధ్యక్షుడిగా పి.శరత్ చంద్రారెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా వీవీఎస్‌ఎస్‌కేకే యాచేంద్ర, కార్యదర్శిగా వి.దుర్గాప్రసాద్‌లకు అవకాశం దక్కింది. సంయుక్త కార్యదర్శిగా కేఎస్ రామచంద్ర రావు, కోశాధికారిగా ఎస్.గోపీనాథ్ రెడ్డి బాధ్యతలు చేపడతారు. కౌన్సిలర్‌గా ఆర్.ధనంజయ రెడ్డి వ్యవహరిస్తారు. ఈ ఆరుగురితో పాటు బీసీసీఐ నామినేట్ చేసే ఇద్దరు మాజీ ఆంధ్ర ఫస్ట్ క్లాస్ క్రికెటర్లు (ఒక పురుషుడు, ఒక మహిళ), ఏపీ ఆడిటర్ జనరల్ కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారి కూడా అపెక్స్ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటారు. కొత్త సభ్యుల పదవీ కాలం మూడేళ్ల పాటు ఉంటుంది. -
విజయనగరం గడ్డపైకి సఫారీలు
సాక్షి, విజయనగరం: సాంస్కృతిక నగరంగా వెలుగొందుతున్న విజయనగరం అంతర్జాతీయ క్రికెట్ క్రీడకు ఆతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 2 నుంచి 6 వరకు విశాఖలోని ఏసీఏ వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్– సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందుగా ఈ నెల 26 నుంచి 28 వరకు జరిగే ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్‌లో ఆడేందుకు సఫారీల జట్టు విజయనగరం రానుంది. జిల్లాలోని డెంకాడ మండలం చింతలవలసలో డాక్టర్ పివిజి.రాజు ఏసీఏ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో మూడు రోజుల పాటు జరిగే ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్‌లో సఫారీల జట్టు బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో తలపడనుంది. ఈ మేరకు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు మ్యాచ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల ఆటను ఆస్వాదిద్దాం.. జిల్లా వేదికగా మొదటిసారిగా అంతర్జాతీయ స్థాయి పురుషుల క్రికెట్ క్రీడాకారులు మూడు రోజుల పాటు తమ ఆటతో కనువిందు చేయనున్నారు. ఈ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌తో పాటు నార్త్‌జోన్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భధ్రతా చర్యలు చేపడుతున్నారు. కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్, ఎస్పీ రాజకుమారిలతో ఈ అంశాలపై ఇప్పటికే చర్చించారు. మూడు రోజుల పాటు జరిగే మ్యాచ్‌లను చూసేందుకు ఒక్కో రోజు 1500 మంది వరకు ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న ఏసీఏ నిర్వాహకులు వివిధ పాఠశాలల్లో చదువుతున్న 200 మంది విద్యార్థులను ఒక్కో రోజుమ్యాచ్ చూసేలా అవకాశం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టులో ఆడనున్న రోహిత్‌శర్మ భారత్ – సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్‌కు ముందు జిల్లాలో జరుగుతున్న ప్రాక్టీస్ టెస్ట్ మ్యాచ్‌లో బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టులో ఆడనున్న రోహిత్‌శర్మ ఆడనున్నారు. ప్రస్తుత భారత జట్టు ఫెవరేట్‌గా క్రీడాకారుల మన్ననలు అందుకుంటున్న రోహిత్‌శర్మ లాంటి క్రీడాకారులు జిల్లాకు రానుండటంతో పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేడియంకు వచ్చే అవకాశం ఉంది. బోర్డ్ ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టు: రోహిత్‌శర్మ (కెప్టెన్), మయాంక్ అగర్వాల్, ప్రియాంక్ పంచల్, ఎఆర్.ఈశ్వరన్, కరుణ్నాయర్, సిద్దేష్‌లడ్, కెఎస్.భరత్(వికెట్ కీపర్), జలజ్ సక్సేనా, ధర్మేందర్‌షింగ్ జడేజా, అవేష్‌ఖాన్, ఇషాన్‌పోరల్, షార్ధూల్‌థాకూర్, ఉమేష్‌యాదవ్. సౌత్ ఆఫ్రికా జట్టు: డుప్లిసిస్(కెప్టెన్), టి.బవుమ (వికెట్ కీపర్), కె.రబడ, డికాక్, ఎల్గర్, ఫిలాండర్, మహరాజ్, పీయిడెట్, హంజా, నిగ్ధి, మక్రమ్, డిబ్రూన్, క్లాసెన్, నార్ట్జ్, ముతుసమి. ఏర్పాట్లు చేస్తున్నాం... భారత్– సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందుగా విజయనగరంలో జరిగే ప్రాక్టీస్ మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. క్యూరేటర్‌తో ప్రత్యేక పిచ్‌ను తయారు చేయిస్తున్నాం. అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు రానుండటంతో అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. మూడు రోజుల పాటే జరిగే మ్యాచ్‌ను వీక్షించేందుకు రోజుకు 1700 మంది వరకు అభిమానులు వస్తారని అంచనా వేస్తున్నాం. – ఎం.వాసుదేవరాజు, కార్యదర్శి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ -
క్రికెట్‌కు వేణు గుడ్‌బై
సాక్షి, విశాఖపట్నం : భారత మాజీ క్రికెటర్, ఆంధ్ర ఆటగాడు వై.వేణుగోపాల రావు (37) ఆటకు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు అతను ప్రకటించాడు. 2017 అక్టోబరులో ఆంధ్ర, తమిళనాడు మధ్య జరిగిన రంజీ మ్యాచ్ ఆడిన తర్వాత రెండేళ్లుగా వేణుగోపాలరావు మళ్లీ బరిలోకి దిగలేదు. క్రికెట్ కామెంటేటర్‌గా కూడా కొనసాగుతున్న వేణు... ఇటీవలి ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడైన ప్రదర్శనతో భారత జట్టులోకి వచ్చిన వేణుగోపాలరావు అంతర్జాతీయ కెరీర్ మాత్రం సంతృప్తికరంగా సాగలేదు. 2005 జులైలో తొలి వన్డే ఆడిన అతని కెరీర్ పది నెలల వ్యవధిలోనే 16 వన్డేలకే (ఆరు వేర్వేరు జట్లపై కలిపి) పరిమితమైంది. వేణుగోపాలరావు అంతర్జాతీయ క్రికెట్లో తన ఏకైక అర్ధ సెంచరీ (93 బంతుల్లో 61 నాటౌట్) పాకిస్తాన్‌పై అబుదాబిలో సాధించాడు. దక్కన్ చార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున కలిపి వేణు ఐపీఎల్లో మొత్తం 65 మ్యాచ్‌లు (2008–2014) ఆడాడు. ప్రధానంగా విజయ్ హజారే ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ, చాలెంజర్ ట్రోఫీలో రాణించడంతో అతనికి వన్డే టీమ్ పిలుపు దక్కినా... అంతకుముందు ఇంగ్లండ్ ‘ఎ’తో జరిగిన ఫస్ట్ క్లాస్‌మ్యాచ్‌లో చేసిన అద్భుత బ్యాటింగ్ వేణుకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. 501 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వేణు అజేయంగా 228 పరుగులు చేయడం విశేషం. ఆంధ్ర క్రికెట్‌కు సంబంధించి మాత్రం వేణుగోపాలరావుకు ప్రత్యేక స్థానం ఉంది. జూనియర్ క్రికెట్‌తో పాటు 19 ఏళ్ల సుదీర్ఘ ఫస్ట్ క్లాస్ కెరీర్లో అతను ఎన్నో సార్లు తన జట్టుకు కీలక విజయాలు అందించాడు. కెరీర్ చివర్లో వేర్వేరు కారణాలతో ఆంధ్ర జట్టుకు దూరమైన అతను రంజీల్లో గుజరాత్, రాజస్తాన్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. రిటైర్మెంట్ సందర్భంగా వేణుగోపాలరావును అభినందించి అతని సేవలను ప్రశంసించిన ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అతను భవిష్యత్తులో ఏ రంగంలోనైనా మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించింది. -
దాతల విస్మరణ.. మాజీల భజన..!
సాక్షి, కడప: కన్న వారిని.. ఉన్న ఊరిని మరిచిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సాయం చేసిన వారిని గుర్తుంచుకుంటారని అనుకోవడం అత్యాశే అవుతుంది. కడప నగరంలో ఎకరా రూ.1 వెయ్యి చొప్పున 11 ఎకరాలు కేటాయించడంతో పాటు, సొంత నిధులను రూ.50 లక్షలు వెచ్చించి వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ మైదానం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన దివంగత సీఎం వైఎస్సార్ జయంతిని నిర్వహించడానికి జిల్లా క్రికెట్ సంఘం పెద్దలకు మనసు రాకపోగా.. ఏసీఏ మాజీ కార్యదర్శి గోకరాజు గంగరాజు పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కేక్‌లు కట్ చేసి వేడుకలు నిర్వహించడం క్రికెట్ సంఘంలో కొనసాగుతున్న విపరీత పోకడలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహానేత, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కడప నగరంలో ఉన్నత ప్రమాణాలతో స్టేడియం నిర్మించాలని సంకల్పించారు. దీంతో ఆంధ్రా క్రికెట్ సంఘం పెద్దలతో సంప్రదించడంతో పాటు ఎంతో విలువైన భూములను ఎకరా కేవలం రూ. వెయ్యి చొప్పున 11.62 ఎకరాలను ఏసీఏ వారికి అప్పజెప్పారు. దీంతో పాటు ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి జ్ఞాపకార్థం రూ.50 లక్షల సొంత నిధులను ఏసీఏకి అందించారు. వైఎస్ఆర్ మరణానంతరం 2011లో కడప నగరంలో క్రికెట్ స్టేడియం అందుబాటులోకి వచ్చింది. ఈ మైదానానికి వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ మైదానం అని నామకరణం చేశారు. ఇంత వరకు బాగానే ఉంది. మహానేత గుర్తులు మాయం.. అయితే ఇంతసాయం చేసిన మహానేత చిత్రపటం కానీ, విగ్రహం ఏర్పాటు చేసేందుకు క్రికెట్ సంఘం పెద్దలకు మనసురాలేదు. దీనికి తోడు ఎక్కడా కూడా వైఎస్ రాజారెడ్డి స్టేడియం అన్న విషయం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ విషయమై జూన్ నెల 21న ‘దాతలను విస్మరించడం తగునా’ అంటూ సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన జిల్లా క్రికెట్ సంఘం పెద్దలు మొక్కుబడిగా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. త్వరలోనే విగ్రహాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు తప్పితే ఆచరణలోకి మాత్రం ఇంకా రాలేదు. కనీసం వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాలను ఏర్పాటు చేయడానికి క్రికెట్ సంఘం పెద్దలకు మనసు రాకపోవడం విచారకం. అయితే మాజీ కార్యదర్శి గోకరాజు గంగరాజుకు సంబంధించి చిత్రపటాలు మాత్రం ఏసీఏ కార్యాలయాల్లో నేటికీ దర్శనమిస్తుండటం గమనార్హం. ఈయన చిత్రపటం ఉండటం ఆక్షేపణీయం కానప్పటికీ దాతల చిత్రపటాలను కూడా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం అభిమానుల్లో నెలకొంది. ఘనంగా గోకరాజు జన్మదిన వేడుకలు. .స్టేడియం అభివృద్ధికి పాటుపడిన వారిని విస్మరించి తమకిష్టమైన వారి భజనలో మునిగితేలుతున్నారు. కడప నగరంలోని వైఎస్‌ఆర్‌ఆర్–ఏసీఏ స్టేడియంలోని స్కూల్ ఆఫ్ అకాడమీలో గోకరాజు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించడమే ఇందుకు నిదర్శనం. ఏసీఏ సౌత్‌జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు, జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి రామ్మూర్తి ఆధ్వర్యంలో ఏసీఏ మాజీ కార్యదర్శి గోకరాజు గంగరాజు 76వ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్రికెటర్ల చేతుల మీదుగా కేక్ కట్ చేసి, మైదానం ఆవరణలో మొక్కలు నాటడం గమనార్హం. గోకరాజు గంగరాజు అందించిన సేవలపై జిల్లా క్రికెట్ సంఘం పెద్దలకు అభిమానం ఉంటే ఆయన వేడుకలను నిర్వహించుకోవడం అభ్యంతరం లేనప్పటికీ, ఇటీవల వైఎస్సార్ జయంతి సందర్భంగా కనీసం ఆయనను స్మరించుకున్న దాఖలాలు లేకపోవడం మహానేత అభిమానులను తీవ్రంగా కలచివేస్తోంది. జిల్లాకు చెందిన వ్యక్తి, మైదానం ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన మహానేతను స్మరించుకునేందుకు మనసు రాలేదా అని క్రికెట్ సంఘంలోని మరోవర్గం ప్రశ్నిస్తోంది. ఇప్పటికైనా క్రికెట్ సంఘం పెద్దలు వివక్షతను విడనాడి దాతల విషయంలో సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. -
ఆంధ్ర క్రికెట్ లీగ్‌కు సిద్ధం
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నుంచి మరింత మంది అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లను తయారుచేయడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెట్ లీగ్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఆరు జట్లతో కూడిన ఆంధ్ర క్రికెట్ లీగ్ ఈ ఏడాది చివర్లో జరుగుతుందని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ప్రకటించింది. విశాఖపట్నం, విజయవాడ, గోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం ఫ్రాంచైజీలకు చెందిన జట్లు లీగ్‌లో పాల్గొంటాయని ఏసీఏ వెల్లడించింది. టి20 ఫార్మాట్లో ప్రతీ ఏడాది లీగ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. ఇప్పటికే ఫ్రాంచైజీల కొనుగోలు కోసం టెండర్లను ఆహ్వానించామని ఏసీఏ అధ్యక్షుడు వీకే రంగరాజు తెలిపారు. ఆంధ్రకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు లీగ్‌పై అమిత ఆసక్తి కనబరుస్తున్నట్లు ఆయన చెప్పారు. ‘గత కొన్నేళ్లుగా ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధి కోసం మెరుగైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇక ఆంధ్ర క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ అనుభవాన్ని కలిగించేలా టి20 ఫార్మాట్లో ఆంధ్ర క్రికెట్ లీగ్‌ను తీసుకువస్తున్నాం. ఈ ఫ్రాంచైజీ లీగ్ ప్రేక్షకులను, క్రికెటర్లను అలరిస్తుందని నమ్ముతున్నా’ అని రంగరాజు పేర్కొన్నారు. టెండర్ల నమోదుకు ఠీఠీఠీ.్చnఛీజిట్చ ఛిటజీఛిజ్ఛ్టు్చటటౌఛిజ్చ్టీజీౌn.ఛిౌఝ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. శుక్రవారం జరిగిన లీగ్ ప్రకటన కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు వీకే రంగారాజు, కార్యదర్శి సీహెచ్ అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్ర టి20 లీగ్‌కు సై
సాక్షి, విజయవాడ: బీసీసీఐ పరిధిలోని కొన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాల తరహాలోనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) కూడా తొలిసారి సొంత టి20 లీగ్‌ను నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు నగరాలు ఫ్రాంచైజీలుగా జూన్‌లో టోర్నీ జరుగుతుందని ఏసీఏ అధ్యక్షుడు గోకరాజు రంగరాజు వెల్లడించారు. విశాఖపట్నం, విజయవాడ, గోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం పేర్లతో జట్లు ఉంటాయి. వన్డే వరల్డ్ కప్ జరిగే సమయంలోనే భారత్ మ్యాచ్‌లు ఆడని రోజుల్లో లీగ్ మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలను సొంతం చేసుకునేందుకు ఏసీఏ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించిందని, మార్చి 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఏసీఏ కార్యదర్శి సీహెచ్ అరుణ్ కుమార్ చెప్పారు. సీనియర్ క్రికెటర్లతో యువ ఆటగాళ్లు కలిసి ఆడేందుకు ఇది మంచి అవకాశం ఇస్తుందని, దాదాపు వంద మంది క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఆంధ్ర లీగ్ వేదికగా నిలుస్తుందని కూడా ఆయన అన్నారు. తమిళనాడు, కర్ణాటక, ముంబై ప్రీమియర్ లీగ్‌లు ఇప్పటికే బాగా ప్రాచుర్యం పొందగా... గత ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా బోర్డు అనుమతితో తెలంగాణ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించింది. -
ఆంధ్ర... తొలిసారి
బెంగళూరు: బీసీసీఐ అఖిల భారత సీనియర్ మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించింది. హిమాచల్ ప్రదేశ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట హిమాచల్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. నీనా చౌదరీ (79 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీ సాధించగా, సుష్మ వర్మ (59; 5 ఫోర్లు, సిక్స్), హర్లీన్ డియోల్ (41; 4 ఫోర్లు) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో అంజలి శర్వాణి, ఝాన్సీలక్ష్మి, శరణ్య తలా ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఆంధ్ర 48.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 195 పరుగులు చేసి గెలిచింది. చంద్రలేఖ (49; 3 ఫోర్లు), హిమబిందు (45 నాటౌట్; 5 ఫోర్లు), ఝాన్సీలక్ష్మి (40; 5 ఫోర్లు), పద్మజ (33; 5 ఫోర్లు) సమష్టిగా రాణించారు. హిమాచల్ బౌలర్లలో రేణుక 2 వికెట్లు పడగొట్టగా, తనూజకు ఒక వికెట్ దక్కింది. సోమవారం జరిగే ఫైనల్లో బెంగాల్‌తో ఆంధ్ర తలపడుతుంది. రైల్వేస్‌కు షాక్ మిథాలీ, పూనమ్ రౌత్, వేద కృష్ణమూర్తి, ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్ తదితర భారత స్టార్ క్రికెటర్లున్న రైల్వేస్‌కు బెంగాల్ జట్టు షాకిచ్చింది. 21 పరుగుల తేడాతో మిథాలీ రాజ్ సేనపై గెలుపొందిన బెంగాల్ ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. మొదట బెంగాల్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 211 పరుగులు చేసింది. దీప్తి (85), జులన్ గోస్వామి (50 నాటౌట్) అర్ధ శతకాలతో రాణించారు. ఏక్తా బిష్త్ 2 వికెట్లు తీసింది. తర్వాత రైల్వేస్ 49 ఓవర్లలో 190 పరుగుల వద్ద ఆలౌటైంది. నుజహత్ పర్వీన్ (74) మినహా ఇంకెవరు జట్టును గెలిపించే ప్రయత్నం చేయలేదు. కెప్టెన్ మిథాలీ 37, మోనా 28, అరుంధతి రెడ్డి 21 పరుగులు చేశారు. బెంగాల్ బౌలర్ శుభ్‌లక్ష్మి 5 వికెట్లు, జులన్ 3 వికెట్లు తీశారు. -
ఆంధ్ర జట్టుకు రెండో విజయం
సాక్షి, గుంటూరు వెస్ట్: సమష్టి ప్రదర్శనతో రాణించిన ఆంధ్ర జట్టు బీసీసీఐ మహిళల వన్డే లీగ్ క్రికెట్ టోర్నమెంట్లో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. విదర్భ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 17 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర జట్టు 45.3 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ఎన్. అనూష (45; 7 ఫోర్లు), హిమబిందు (21; 4 ఫోర్లు), ఇ. పద్మజ (39; 3 ఫోర్లు) రాణించారు. పంజాబ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన మరో ఓపెనర్ ఝాన్సీ లక్ష్మి ఈ మ్యాచ్‌లో తాను ఆడిన తొలి బంతికే ఔటయ్యింది. 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విదర్భ జట్టు 43 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. బీఎస్ ఫుల్మాలి (83 బంతుల్లో 77; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) ధాటిగా ఆడినా ఆమెకు సరైన సహకారం లభించకపోవడంతో విదర్భకు ఓటమి తప్పలేదు. ఆంధ్ర బౌలర్లలో చంద్రలేఖ 15 పరుగులిచ్చి 3 వికెట్లు, ఝాన్సీ లక్ష్మి 43 పరుగులకు 2 వికెట్లు పడగొట్టారు. మూలపాడులో జరిగిన మరో మ్యాచ్‌లో మహారాష్ట్ర 183 పరుగుల తేడాతో హరియాణాను ఓడించింది. టీఎస్ హసాబ్నిస్ (131 బంతుల్లో 148; 23 ఫోర్లు) సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన మహారాష్ట్ర 50 ఓవర్లలో 2 వికెట్లకు 311 పరుగులు చేసింది. ఎం.ఆర్.మాగ్రే (70; 7 ఫోర్లు)తో కలిసి హసాబ్నిస్ తొలి వికెట్‌కు 212 పరుగులు జోడించడం విశేషం. అనంతరం మాయా సోనావానె (6/23) ధాటికి హరియాణా 33.5 ఓవర్లలో 128 పరుగులకే కుప్పకూలి ఓడిపోయింది. సౌరాష్ట్రతో జరిగిన మరో మ్యాచ్‌లో గోవా ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
ఆంధ్రకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
సాక్షి, విశాఖపట్నం: మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించడంతో పంజాబ్‌తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను ఆంధ్ర జట్టు ‘డ్రా’గా ముగించింది. ఓవర్‌నైట్ స్కోరు 328/5తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర చివరకు 423 పరుగులకు ఆలౌటైంది. ఏడు పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించింది. చివరి రోజు ఆంధ్ర 95 పరుగులు జతచేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. రికీ భుయ్ (181; 15 ఫోర్లు, 4 సిక్స్‌లు) క్రితం రోజు స్కోరుకు 30 పరుగులు జతచేసి పెవిలియన్ చేరగా... షోయబ్ ఖాన్ (52; 6 ఫోర్లు) అర్ధశతకం సాధించాడు. పంజాబ్ బౌలర్లలో అరంగేట్రం స్పిన్నర్ మయాంక్ మార్కండే 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 102 పరుగులు చేసింది. శుబ్‌మన్ గిల్ (54 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధసెంచరీతో మెరిశాడు. ఆంధ్ర బౌలర్లలో విజయ్ కుమార్, షోయబ్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు. అంతకుముందు పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 414 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ‘డ్రా’గా ముగిసినా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన ఆంధ్రకు మూడు పాయింట్లు, పంజాబ్‌కు ఒక పాయింట్ లభించాయి. హైదరాబాద్ మ్యాచ్ ‘డ్రా’ తిరువనంతపురం: వర్షం అంతరాయం కలిగించిన కేరళ, హైదరాబాద్ మ్యాచ్ ‘డ్రా’గా ముగిసింది. ఓవర్‌నైట్ స్కోరు 30/1తో ఆదివారం చివరి రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 112 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. సందీప్ (155 బంతుల్లో 56 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకం సాధించగా... హిమాలయ్ అగర్వాల్ (132 బంతుల్లో 48; 7 ఫోర్లు), సుమంత్ (136 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు) ఆకట్టుకున్నారు. అంతకుముందు కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 495/6 వద్ద డిక్లేర్ చేసింది. మ్యాచ్‌లో రెండు జట్ల ఇన్నింగ్స్‌లు పూర్తి కాకపోవడంతో రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. -
ఆంధ్ర మరో విజయం
న్యూఢిల్లీ: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా ఒడిశాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒడిశా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 184 పరుగులు చేసింది. సుజిత్ (55; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. ఆంధ్ర బౌలర్లలో కరణ్ శర్మ (3/29), మనీశ్ (2/29), షోయబ్ (2/32) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలో దిగిన ఆంధ్ర 47.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అశ్విన్ హెబర్ (130 బంతుల్లో 92 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డీబీ రవితేజ (53 నాటౌట్; 7 ఫోర్లు) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించారు. కేఎస్ భరత్ (0), రికీ భుయ్ (0) డకౌట్ కాగా.. కెప్టెన్ హనుమ విహారి (9) విఫలమయ్యాడు. 8 మంది ఆటగాళ్లపై సస్పెన్షన్... దేశవాళీ క్రికెట్లో తొలిసారి అడుగు పెట్టిన పుదుచ్చేరి జట్టుకు తొలి సీజన్లోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించిన కారణంగా ఆ జట్టుకు చెందిన 8 మంది ఆటగాళ్లపై బీసీసీఐ అనర్హత వేటు వేసింది. -
నాకౌట్ దశకు ఆంధ్ర
చెన్నై: విజయ్ హజారే టోర్నీలో ఆంధ్ర క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగిస్తూ క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. గుజరాత్‌తో సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర తొమ్మిది వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా ఐదో విజయం నమోదు చేసిన ఆంధ్ర 20 పాయింట్లతో ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. ముంబై 16 పాయింట్లతో ఇదే గ్రూప్ నుంచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర 251 పరుగుల లక్ష్యాన్ని కేవలం వికెట్ నష్టపోయి 45.2 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ శ్రీకర్ భరత్ (132 బంతుల్లో 106 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేయగా... మరో ఓపెనర్ అశ్విన్ హెబర్ (108 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కేవలం పరుగు తేడాతో శతకాన్ని చేజార్చుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 192 పరుగులు జోడించడం విశేషం. అశ్విన్ ఔటయ్యాక కెప్టెన్ విహారి (35 బంతుల్లో 39; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)తో కలిసి భరత్ ఆంధ్ర విజయాన్ని ఖాయం చేశాడు. అంతకుముందు గుజరాత్ సరిగ్గా 50 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటైంది. పార్థివ్ పటేల్ (39; 7 ఫోర్లు), రిజుల్ భట్ (74; 2 ఫోర్లు), పియూష్ చావ్లా (56; 6 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో కార్తీక్ రామన్ (4/32), బండారు అయ్యప్ప (2/68), నరేన్ రెడ్డి (2/35) ఆకట్టుకున్నారు. -
ఆంధ్ర అదిరే ఆట
చెన్నై: రంజీ ట్రోఫీలో నాకౌట్ దశకు చేరే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయిన ఆంధ్ర క్రికెట్ జట్టు దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం జోరు మీదుంది. పటిష్టమైన తమిళనాడుతో ఆదివారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో ఆంధ్ర 29 పరుగుల తేడాతో గెలిచింది. ఈ టోర్నీలో ఆంధ్రకిది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. తాజా గెలుపుతో ఆంధ్ర 16 పాయింట్లతో గ్రూప్ ‘సి’లో అగ్రస్థానంలో నిలిచి క్వార్టర్ ఫైనల్ చేరే అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 276 పరుగులు చేసింది. ఓపెనర్ శ్రీకర్ భరత్ (85 బంతుల్లో 82; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు), రికీ భుయ్ (51 బంతుల్లో 52; ఒక ఫోర్, 3 సిక్స్‌లు), బోడపాటి సుమంత్ (67 బంతుల్లో 62 నాటౌట్; 6 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అశ్విన్ హెబర్ (38; 4 ఫోర్లు, ఒక సిక్స్)తో కలిసి తొలి వికెట్‌కు భరత్ 87 పరుగులు జోడించాడు. అనంతరం 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన తమిళనాడు 48.5 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటై ఓటమి పాలైంది. ఆంధ్ర బౌలర్లలో శివ కుమార్ (2/53), అయ్యప్ప (2/37), భార్గవ్ భట్ (2/46), విహారి (2/41) రెండేసి వికెట్లు తీశారు. సోమవారం జరిగే తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌తో ఆంధ్ర తలపడుతుంది. -
ఆంధ్ర ఆశలు ఆవిరి
ఇండోర్: ఆంధ్ర క్రికెట్ జట్టుకు అదృష్టం కలిసి రాలేదు. రంజీ ట్రోఫీలో నిలకడగా రాణించినప్పటికీ ఆ జట్టుకు క్వార్టర్స్‌లో స్థానం దక్కలేదు. ఆంధ్ర జట్టు క్వార్టర్ ఫైనల్ చేరాలంటే ఒడిశాతో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ విజయం సాధించకుండా ఉండాల్సింది. కానీ అలా జరగలేదు. ఆంధ్రను వెనక్కి నెట్టి క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టాలంటే ఒడిశాపై తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ జట్టు అనుకున్న ఫలితం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో ఒడిశాను ఓడించి ఆంధ్ర ఆశలను ఆవిరి చేస్తూ మధ్యప్రదేశ్ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. మ్యాచ్ చివరిరోజు 110 పరుగుల విజయలక్ష్యాన్ని మధ్యప్రదేశ్ మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 237/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఒడిశా 350 పరుగుల వద్ద ఆలౌటైంది. ఈ విజయంతో మధ్యప్రదేశ్ మూడు విజయాలు, రెండు ‘డ్రా’లతో 21 పాయింట్లు సాధించి గ్రూప్ ‘సి’ టాపర్‌గా నిలిచింది. ముంబై కూడా 21 పాయింట్లు సాధించినా ఎక్కువ విజయాలు సాధించిన మధ్యప్రదేశ్‌కు అగ్రస్థానం దక్కింది. 19 పాయింట్లతో ఆంధ్ర మూడో స్థానంతో సరిపెట్టుకుంది. గ్రూప్ ‘ఎ’లో ఉన్న హైదరాబాద్ జట్టు 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. మంగళవారంతో రంజీ ట్రోఫీ సీజన్లో అన్ని గ్రూప్‌ల లీగ్ మ్యాచ్‌లు పూర్తయ్యాయి. గ్రూప్ ‘ఎ’ నుంచి కర్ణాటక (32 పాయింట్లు), ఢిల్లీ (27 పాయింట్లు)... గ్రూప్ ‘బి’ నుంచి ఢిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ (34 పాయింట్లు), కేరళ (31 పాయింట్లు)... గ్రూప్ ‘సి’ నుంచి మధ్యప్రదేశ్, ముంబై... గ్రూప్ ‘డి’ నుంచి విదర్భ (31 పాయింట్లు), బెంగాల్ (23 పాయింట్లు) క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. డిసెంబర్ 7 నుంచి మొదలయ్యే క్వార్టర్ ఫైనల్స్‌లో ముంబైతో కర్ణాటక; విదర్భతో కేరళ; ఢిల్లీతో మధ్యప్రదేశ్; బెంగాల్‌తో గుజరాత్ తలపడతాయి. -
వేణుగోపాలరావు దూరం
సాక్షి, విజయవాడ: ప్రస్తుత రంజీ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లకు తాను అందుబాటులో ఉండటం లేదని ఆంధ్ర క్రికెట్ జట్టు సభ్యుడు వై. వేణుగోపాలరావు ప్రకటించాడు. వ్యక్తిగత కారణాలతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని భారత వన్డే జట్టు మాజీ సభ్యుడైన వేణు వివరించాడు. ఈ సీజన్లో ఆంధ్ర జట్టు తమిళనాడు, బరోడా జట్లతో మ్యాచ్‌లు ఆడి రెండింటిలోనూ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించింది. వేణు మాత్రం తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లో తుది జట్టులో ఆడి కేవలం మూడు పరుగులు చేసి అవుటయ్యాడు. 1998లో రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన 35 ఏళ్ల వేణు తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో 121 మ్యాచ్‌లు ఆడి 7,081 పరుగులు చేయడంతోపాటు 66 వికెట్లు పడగొట్టాడు. ‘జట్టులో వేణుగోపాలరావు లేని లోటు కనిపిస్తుంది. అయితే అతని నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. వేణు స్థానంలో జ్యోతి సాయికృష్ణను జట్టులో ఎంపిక చేశాం’ అని ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ అరుణ్ కుమార్ తెలిపారు. -
అనంత, కర్నూలు జట్ల విజయం
అనంతపురం సప్తగిరి సర్కిల్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–16 బాలికల అంతర్ జిల్లా క్రికెట్ పోటీల్లో అనంతపురం, కర్నూలు జట్లు విజయం సాధించాయి. మంగళవారం అనంత క్రీడా గ్రామంలోని బీ- గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌ల్లో ఈరెండు జట్లు అన్ని విభాగాల్లో రాణించి విజేతలుగా నిలిచాయి. స్కోరు వివరాలు మొదటి మ్యాచ్‌లో అనంతపురం, వైఎస్సార్ కడప జట్లు తలపడగా, టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన అనంత జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 159 పరుగులు చేసి కేవలం 1 వికెట్‌ను కోల్పోయింది. జట్టులో పల్లవి 56 పరుగులు చేసి జట్టుకు భారీ ఆధిక్యతను అందించింది. మరో ఆల్‌రౌండర్ అనూష 43 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వైఎస్సార్ కడప జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 98 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంత జట్టు బౌలర్లు హిమజ 2, అఖిల 1 వికెట్లు సాధించారు. దీంతో అనంతపురం జట్టు 61 పరుగులతో విజయాన్ని సాధించింది. చిత్తూరు చిత్తు మరో మ్యాచ్‌లో చిత్తూరు, కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు నిర్ణీత 25 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 34 పరుగులు మాత్రమే సాధించింది. కర్నూలు జట్టు బౌలర్లు అరుణ 4 వికెట్లు, లక్ష్మి 3 వికెట్లు తీసి చిత్తూరు జట్టును చిత్తు చేశారు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కర్నూలు జట్టు 4.1 ఓవర్లలోనే వికెట్లు కోల్పోకుండా 37 పరుగులు సాధించింది. దీంతో కర్నూలు జట్టు 10 వికెట్లతో భారీ విజయాన్ని నమోదు చేసింది. -
భారత జట్టులో స్థానమే లక్ష్యం కావాలి
► కేడీసీఏ అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి కడప స్పోర్ట్స్: దేశానికి ప్రాతినిథ్యం వహించడ మే మీ లక్ష్యం కావాలని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ అండర్–14 అకాడమీ చైర్మన్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి ఆకాంక్షించారు. గురువారం రాత్రి నగరంలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ నెట్స్‌లో అండర్–14 క్రీడాకారుల ఫేర్వెల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకట శివారెడ్డి మాట్లాడుతూ గోకరాజు గంగరాజు సారధ్యంలో దేశంలోనే తొలి అకాడమీ కడప నగరంలో ఏర్పాటు చేశామన్నారు. అండర్–16, అండర్–19 అకాడమీలతో పాటు ప్రస్తుతం అండర్–14 అకాడమీని విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. రాబోయే కాలంలో ఏసీఏ నుంచి పలువురు క్రీడాకారులు దేశానికి ప్రాతినిథ్యం వహించేలా సన్నద్ధం కావాలని సూచించారు. ఏసీఏ స్కూల్ ఆఫ్ అండర్–14 అకాడమీ కన్వీనర్, సౌత్‌జోన్ కార్యదర్శి డి. నాగేశ్వరరాజు ప్రసంగించారు. పరిపాలనాధికారికి సన్మానం..: ఏసీఏ స్కూల్ ఆఫ్ అండర్–14 అకాడమీ పరిపాలనాధికాగా ఉన్న బాబ్జి బదిలీ కావడంతో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో నూతన ఏఓ శ్రీనివాస్, కోచ్‌లు మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాసులు, కిశోర్, ట్రైనర్ ఆనంద్ పాల్గొన్నారు. -
అండర్–25 ఆంధ్రా క్రికెట్ జట్టుకు అనంత క్రీడాకారులు
అనంతపురం సప్తగిరిసర్కిల్ : అండర్–25 ఆంధ్రా క్రికెట్ జట్టుకు అనంతపురం జిల్లాకు చెందిన నరేష్, ముదస్సర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ఎంపికయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. స్టాండ్‌బైగా దాదా ఖలందర్‌ను ఎంపిక చేశారన్నారు. ఇటీవల విజయనగరంలో జరిగిన ప్రాబబుల్స్‌లో నరేష్ 7 వికెట్లు, ముదస్సర్ 6 వికెట్లు తీశాడు. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి సెంచరీతో అలరించాడు. దీంతో సెలక్టర్లు వారిని ఆంధ్రా జట్టుకు ఎంపిక చేశారు. దాదా ఖలందర్ 7 వికెట్లు తీశాడు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 10 నుంచి 16 వరకు గుంటూరు జిల్లా పేరిచెర్లలో జరిగే అండర్–25 బీసీసీఐ సౌత్ ఇండియా రామ్మోహన్రావు ట్రోఫీలో పాల్గొంటారు. జిల్లా క్రీడాకారులకు రాష్ట్ర జట్టులో చోటు దక్కడంపై జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, బీఆర్ ప్రసన్న హర్షం వ్యక్తం చేశారు. -
ఏసీఏ అధ్యక్షుడిగా రంగరాజు
విజయవాడ: భారత క్రికెట్లో లోధా కమిటీ సిఫారసుల ప్రకారం మార్పులు అనివార్యం కావడంతో దాని ప్రభావం ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ)పై కూడా పడింది. ఇప్పటివరకు ఏసీఏ కార్యదర్శిగా ఉన్న గోకరాజు గంగరాజు తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో సీహెచ్ అరుణ్ కుమార్ కార్యదర్శిగా ఎంపికయ్యారు. అధ్యక్షుడిగా ఉన్న డీవీఎస్ఎస్ సోమయాజులు కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో గంగరాజు కుమారుడు గోకరాజు రంగరాజు ఏసీఏ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కోశాధికారిగా వ్యవహరించిన రహీమ్ కూడా కొత్త మార్గదర్శకాల ప్రకారం నిష్క్రమించాల్సి రావడంతో ఆయనకు బదులుగా రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్నారు. వి.దుర్గా ప్రసాద్ (సంయుక్త కార్యదర్శి), పీవీ దేవ వర్మ (ఉపాధ్యక్షుడు) కూడా కొత్తగా ఎన్నికయ్యారు. -
ఆంధ్ర క్రికెట్ సంఘంలో కీలక మార్పులు
విజయవాడ : ఆంధ్ర క్రికెట్ సంఘంలో సోమవారం పలు కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. జస్టిస్ లోథా కమిటీ సిఫార్సులు అమల్లోకి రావడంతో తాజాగా బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షుడు, నర్సాపురం బీజేపీ ఎంపీ గోకరాజు గంగరాజు ఏసీఏ జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. విజయవాడలో జరిగిన ఏసీఏ పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ కాలంగా బీసీసీఐలో ఆయన పలు కీలక పదవులు అలంకరించారు. -
వెంటనే అమలు చేస్తాం
ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు న్యూఢిల్లీ: జస్టిస్ ఆర్ఎం లోధా సూచించిన ప్రతిపాదనల అమల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు ఏకంగా బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శులను తొలగించడంతో ఇతర క్రికెట్ సంఘాల్లో ఒక్కసారిగా చలనం వచ్చింది. వీటిని తమ ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వెంటనే అమలు చేస్తుందని బీసీసీఐ సీనియర్ ఉపాధ్యక్షుడు, ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు స్పష్టం చేశారు. ‘సుప్రీం కోర్టు తీర్పుపై మాకు ఎలాంటి అయోమయం లేదు. మేం వెంటనే లోధా ప్యానెల్ ప్రతిపాదనలను అమలు చేయబోతున్నట్టు ఏసీఏ కార్యదర్శి హోదాలో ప్రకటిస్తున్నాను. భారత క్రికెట్ ముందుకెళ్లడమే మా ధ్యేయం. ఇప్పటిదాకా మేమంతా కలిసి ఉన్నాం కాబట్టి అమలు చేయలేదు. ఇప్పుడు తీర్పు వచ్చాక తిరస్కరించే సమస్యే లేదు’ అని గోకరాజు తెలిపారు. మరోవైపు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించే అవకాశాలపై ఆయన స్పందిస్తూ.. ఈ విషయంలో తనకు మరింత స్పష్టత అవసరం ఉందని చెప్పారు. ఢిల్లీ క్రికెట్ సంఘం నుంచి సీకే ఖన్నా తనకన్నా సీనియర్ అని గుర్తుచేశారు. ఒకవేళ అవకాశం దక్కితే గౌరవంగా భావిస్తానని అన్నారు. -
ఉల్లాసంగా క్రికెట్ పోటీలు
కడప స్పోర్ట్స్: క్రీడలు ఆడడం ద్వారా మానిసిక ఉల్లాసం కలుగుతుందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.వెంకటశివారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి- ఏసీఏ క్రికెట్ మైదానంలో విద్యుత్ ఉద్యోగుల ఇంటర్ సర్కిల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని సూచించారు. పని ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులు పోటీల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయమన్నారు. జిల్లాలో ఎంతో ఆకర్షణీయమైన చక్కటి టర్ఫ్ వికెట్లతో కూడిన క్రికెట్ మైదానాలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, అంకిత భావంతో ఆడాలని సూచించారు. క్రీడలతో ఉద్యోగుల్లో పునరుత్తేజం ఏపీఎస్పీడీసీఎల్ డివిజినల్ ఇంజినీర్ (టెక్నికల్) శోభా వాలెంటీనా మాట్లాడుతూ విధి నిర్వహణలో విద్యుత్ ఉద్యోగులు చాలా ఒత్తిడి ఎదుర్కొంటుంటారని, ఇలాంటి పోటీల ద్వారా వారిలో పునరుత్తేజం కలుగుతుందని తెలిపారు. జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.రామ్మూర్తి మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు ఈ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలు ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ సర్కిల్స్‌కు చెందిన 24 జట్లు పాల్గొన్నాయి. కార్యక్రమంలో విద్యుత్‌శాఖ డీఈ (ఎంఅండ్‌టీ) బ్రహ్మానందరెడ్డి, విద్యుత్‌శాఖ ఏడీఈ చాన్‌బాషా, ఏఈ శ్రీధర్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి వై.శివప్రసాద్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
దొరికినంతా దోచెయ్
ఆంధ్ర క్రికెట్ సంఘంలో అవినీతి ఇష్టారాజ్యంగా నిర్మాణాలు, మరమ్మతులు పాలకవర్గంలోని వారికే కాంట్రాక్టులు ప్రశ్నించిన జిల్లాలపై వేటు ఏసీఏ అంటే ఆదర్శ్ క్రికెట్ అసోసియేషన్... ఇదీ ఆంధ్ర క్రికెట్ సంఘం పెద్దలు పదే పదే చెప్పే మాట. కానీ వాస్తవంలో మాత్రం ఇది అవినీతి క్రికెట్ సంఘంగా మారింది. విశాఖపట్నం స్టేడియంలో అవినీతి... మంగళగిరి క్రికెట్ స్టేడియంలో పరిజ్ఞానం లేని నిర్మాణం... మూలపాడు మైదాన నిర్మాణంలో స్వప్రయోజనం... ప్రశ్నించిన సంఘాలపై వేటు... ఇష్టమొచ్చినట్లుగా ఓట్లు... వెరసి అంతా గుత్తాధిపత్యం. ప్రశ్నించేవాళ్లు లేరనే ధీమా. సొంత మనుషులకు పదవులు, కాంట్రాక్టులు... ఇలా అడ్డగోలుగా ఆంధ్ర క్రికెట్ నిర్వహణ జరుగుతోంది. ఏసీఏలో జరుగుతున్న పరిణామాలపై సాక్షి స్పోర్ట్స ప్రతినిధులు అందిస్తున్న ప్రత్యేక కథనం. మంగళగిరి పరిజ్ఞానం లేని నిర్మాణం ఏ క్రికెట్ సంఘానికీ రెండు అంతర్జాతీయ స్టేడియాలు అవసరం లేదు. ఏడాదికి ఒకటో రెండో జరిగే అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం ఒక్క స్టేడియం చాలు. విశాఖలో ఓ పెద్ద స్టేడియం ఉన్నా... మంగళగిరిలో మరో స్టేడియం నిర్మిస్తున్నారు. ఇది మొదలై ఆరేళ్లరుునా ఇంత వరకూ ఓ కొలిక్కి రాలేదు. ఈ స్టేడియం నిర్మాణంలో ఏ మాత్రం క్రికెట్ పరిజ్ఞానం లేకుండా వ్యవహరించారు. సాధారణంగా ఎక్కడైనా పిచ్ ఉత్తరం, దక్షిణం ఉంటుంది. కాబట్టి పెవిలియన్ అటువైపే నిర్మిస్తారు. కానీ ఇక్కడ తూర్పు, పడమర దిశలో పిచ్ నిర్మాణం ప్లాన్‌తో పెవిలియన్ నిర్మించారు. చెన్నై నుంచి వచ్చిన ఓ బీసీసీఐ అధికారి ఇది చూసి విస్తుపోయి తిట్టారు. దీంతో వాటిని పడగొట్టి మళ్లీ నిర్మాణం మొదలుపెట్టారు. దీనికోసం సుమారు మూడు కోట్ల రూపాయలు వృథా అయ్యాయి. స్టేడియం నిర్మాణానికి కూడా టెండర్లు లేవు. కావలసిన వారికి ఇచ్చేసుకున్నారు. నిజానికి ఈ స్టేడియం అంతర్జాతీయ మ్యాచ్‌ల నిర్వహణకు పనికిరాని ప్రమాణాలతో ఉంది. స్టేడియంకు వెళ్లాలంటే రైల్వేగేట్ దాటాలి. అక్కడ భూగర్భజలాలు కూడా బాగా లేవు. దీంతో ఆ ప్రాంతంలో ప్లాట్లు కొనుక్కున్నవాళ్లు ఇళ్లు కట్టుకోవడం లేదు. మైదానం నిర్వహణ కోసం నీటిని కొనాల్సి ఉంటుంది. అయినా ఈ ప్రాంతాన్ని ఎంచుకుని సుదీర్ఘ కాలం నుంచి నిర్మాణం జరుపుతున్నారు. పిచ్ ఉత్తర, దక్షిణంగా ఉండాలనే కనీస పరిజ్ఞానం లేకుండా మైదాన నిర్మాణం మొదలవడం కంటే దారుణం మరొకటి ఉండదు. ఆటగాళ్ల బదులు మైదానాలపై... ఏసీఏకు ఉన్న మైదానాలు దేశంలో మరే సంఘానికి లేవని అందుకే బీసీసీఐ తమని మెచ్చుకుందని పదే పదే చెప్పుకుంటారు. 13 జిల్లాల్లో 18 గ్రౌండ్స అభివృద్ధి చేశామని చెబుతున్నారు. కానీ మైదానాల కంటే ఆటగాళ్లు ముఖ్యమనే మాట మరచిపోయారు. గతంలో ఆంధ్ర నుంచి ఒక దశలో ఒకేసారి ముగ్గురు భారత అండర్-19 జట్టులో ఆడారు. అండర్-19, అండర్-16 భారత జట్లకు ఆంధ్ర క్రికెటర్లే సారథులుగా వ్యవహరించారు. కానీ ఇప్పుడు జాతీయ జట్టు దరిదాపుల్లో ఎవరూ లేరు. క్రికెట్ పరిజ్ఙానం లేని పాలకుల చేతుల్లో సంఘం ఉండటం వల్ల ఇలా జరుగుతుందనే విమర్శ ఉంది. ఎంతసేపూ ఓ కొత్త నిర్మాణం చేపడితే డబ్బులు వస్తాయని తప్పిస్తే... ఆట గురించి ఆలోచన లేదు. ఆటగాళ్ల కోసం ఖర్చుచేసేదీ లేదు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్శిటీలో మైదానం కట్టేందుకు 50 లక్షలు చెల్లించి ఒప్పందం చేసుకున్నారు. ఆ మైదానంలో ఉన్న టేకు చెట్లను కొట్టేయడంతో గ్రీన్ ట్రిబ్యునల్ ఏసీఏకు 90 లక్షల రూపాయలు జరిమానా వేసింది. దీంతో కోటీ 40 లక్షల రూపాయలు వృథా అయ్యారుు. అవగాహన లేకుండా పనులు చేస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. విశాఖపట్నం వ్యక్తి సామ్రాజ్యం నగరంలో అద్భుతమైన స్టేడియం ఉంది. హుదూద్ తుఫాన్ తర్వాత పాడరుుపోరుున స్టేడియాన్ని బాగు చేసి టెస్టు మ్యాచ్ కూడా నిర్వహించారు. కానీ ఈ స్టేడియంలో జరిగే అవినీతికి అడ్డూ అదుపూ లేదు. ఏసీఏలో ప్రధానమైన పదవిలో ఉన్న వ్యక్తి నియంత్రణలో ఇక్కడ వ్యవహారాలన్నీ జరుగుతాయి. ఆయన మనుషులే అన్ని రకాల కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఏ పనికీ టెండర్ పిలవడం ఉండదు. ఇక్కడ పనులు చేయడం కోసం పనులు ‘సృష్టించుకుంటారు’. అకస్మాత్తుగా ఓ గోడ పడిపోతుంది. లేదంటే డ్రెస్సింగ్ రూమ్‌లో కార్పెట్ చిరిగిపోతుంది. లేదంటే పై కప్పు పెచ్చు లు ఊడిపోతుంది. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వాటిని సదరు పెద్ద మనిషికి చెందిన వ్యక్తులు వచ్చి మరమ్మతులు చేసి ‘కావలసినన్ని’ డబ్బులు తీసుకుంటారు. అసలు ప్రతి 15 రోజులకు నెల రోజులకు ఏదో ఒక పని ఎందుకు చేయాల్సి వస్తుందని ఎవరూ ప్రశ్నించడం లేదు. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన స్టేడియంలో అకస్మాత్తుగా ఎందుకు కొత్త కొనుగోళ్లు, మరమ్మతులు చేయాల్సి వస్తుందని ఎవరూ ప్రశ్నించడం లేదు. ఎందుకంటే పదవిలో ఉన్న ఆ వ్యక్తికి ఏసీఏలోని పెద్దల ఆశిస్సులు ఉన్నాయి. టెస్టు మ్యాచ్‌తో ‘పండగ’ ఇటీవల టెస్టు హోదా వచ్చిన సందర్భంగా బీసీసీఐ ప్రమాణాల ప్రకారం అంటూ... మీడియా సెంటర్‌ను మార్చారు. గతంలో స్టాండ్స ఉన్న ప్రాంతంలో చుట్టూ అద్దాలు అమర్చి కొన్ని మార్పులతో దీనిని నిర్మించారు. దీని కోసం కోటీ 20 లక్షల రూపాయల వరకూ ఖర్చరుుందని సమాచారం. 30 లక్షలు కూడా ఖర్చవ్వని చోట ఇంత భారీ మొత్తం వెచ్చించారనే విమర్శలు ఉన్నాయి. ఇక మ్యాచ్‌ల సందర్భంగా ఏర్పాటు చేసే కమిటీలలో ఆదాయం పుష్కలంగా ఉండే కమిటీలన్నింటిలో సదరు పెద్దమనిషి సభ్యుడు. ఎవరికి కాంట్రాక్ట్ ఇవ్వాలో... ఎంత మొత్తం ఇవ్వాలో ఆయనే నిర్ణయిస్తాడు. ఆహారం, ఆతిథ్యం, రవాణాలాంటి ఖర్చయ్యే అంశాలన్నీ ఆయన మనుషులే చూస్తుంటారు. అన్నీ ‘హోమ్ మేడ్’ బిల్స్ పెట్టేస్తారు. స్టేడియంలో ఏ మ్యాచ్ జరిగినా 150 దాకా వాకీటాకీలు అవసరమవుతాయి. మ్యాచ్ జరిగినప్పుడు వీటిని అద్దెకు తెచ్చుకుని 20 వేల రూపాయలు చెల్లించేవారు. మహా అరుుతే ఏడాదికి సగటున ఐదు మ్యాచ్‌లు (ఒకవేళ ఐపీఎల్ ఉంటే) జరుగుతాయి. అంటే ఏడాదికి లక్ష రూపాయలు. కానీ సదరు పెద్దమనిషి ఈ వాకీ టాకీల కోసం సుమారు 15 లక్షల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. నిజానికి ఏసీఏలో పదవులన్నీ గౌరవం కోసమే. పదవుల్లో ఉన్నందుకు వారికి డబ్బులు ఇవ్వకూడదు. డీఏ తప్ప ఏమీ ఇవ్వకూడదు. కానీ ఆయన ఏ పని కోసం సమయం వెచ్చించినా రోజుకు మూడు వేల రూపాయలు తీసుకుంటారు. ఈయన సుమారు నెలకు 90 వేల రూపాయలు ఏసీఏ నుంచి తీసుకుంటున్నారు. మిగిలిన ఆఫీస్ బేరర్లకు లేని చెల్లింపులు ఆయనకు మాత్రమే ఎందుకనేది పెద్ద ప్రశ్న. దీనికి ఎవరూ సమాధానం ఇవ్వరు. తాజాగా స్టేడియం బయట ఉండే షాప్‌లలో ఒక షాప్‌ను సబ్ లీజ్‌కు ఇవ్వడానికి ఆయన అనుమతించారు. 10 వేల రూపాయలకు లీజ్ ఇచ్చి... ఆ షాప్‌ను 25 వేలకు సబ్ లీజ్‌కు ఇవ్వడానికి అనుమతి ఇచ్చారు. ఇలా ఎన్ని షాప్‌లకు అనుమతి ఇచ్చారో తెలియదు. మొత్తం మీద విశాఖ స్టేడియం గంగిగోవులా మారింది. పదే పదే మరమ్మతుల, అవసరం లేని కొనుగోళ్లతో అంతా ఓ పెద్ద మనిషి ఇష్టారాజ్యంగా మారిపోయింది. పేరేచర్ల, మూలపాడు స్వప్రయోజనాలు ఇక ఏసీఏ గుంటూరు జిల్లా పేరేచర్లలో, కృష్ణా జిల్లా మూలపాడులో మైదానాలు నిర్మించింది. ఈ రెండూ నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్నారుు. అటు గుంటూరు నుంచి పేరేచర్ల, ఇటు విజయవాడ నుంచి మూలపాడు వెళ్లి రోజువారీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇది చాలా దూరం. అరుునా సరే... స్థలం అక్కడ దొరికిందని సరిపెట్టుకోవచ్చు. పేరేచర్ల మైదానం చుట్లూ స్టోన్ క్రషర్స్ ఉన్నాయి. వీటి నుంచి వచ్చే ఫ్లైయాష్ కళ్లలో పడుతుంది. మూలపాడు మైదానం కూడా కొండల మధ్య ఉంది. అక్కడి క్రషర్లలో బ్లాస్టింగ్స చేస్తే ఆ రాళ్లు వచ్చి మైదానంలో పడతాయి. ఇలా రాళ్లు పడుతున్నాయని ఏసీఏ పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది కూడా. ఈ మైదానంలో ఇటీవల భారత్, వెస్టిండీస్ మహిళల మ్యాచ్‌లు నిర్వహించారు. తద్వారా ఇదో అద్భుత మైదానమని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రాంతంలో ఏసీఏకు చెందిన ఓ పెద్ద మనిషి పొలాలు ఉన్నాయి. చుట్టూ ఉన్న స్థలాల విలువను పెంచడం కోసం ఈ ప్రాంతంలో స్టేడియం నిర్మించారనే విమర్శలు వస్తున్నారుు. ఈ మైదానం దగ్గర కొండల మధ్య 900 ఎకరాల స్థలాన్ని తమకు ఇస్తే టూరిజం అభివృద్ధి చెందేలా నిర్మాణాలు చేస్తామని సదరు పెద్ద మనిషి తాజాగా ఏపీ సీఎంను కోరినట్లు సమాచారం. స్వప్రయోజనాల కోసమే మూలపాడు స్టేడియం నిర్మాణం జరిగిందని విమర్శలు ఉన్నారుు. ఎవరూ అడగవద్దు ఏసీఏలో జరుగుతున్న అవినీతి గురించి ఎవరైనా ప్రశ్నిస్తే ఆ సంఘంపై వేటు వేస్తారు. ఇలా ఇప్పటికే చిత్తూరు, గుంటూరు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లా సంఘాలను తొలగించారు. ఆశ్చర్యకరంగా ఆయా జిల్లాల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ క్రికెట్ అసోసియేషన్ పేరుతో కొత్త సంఘాలను ఏర్పాటు చేసి వాటికి గుర్తింపు ఇచ్చారు. దీంతో జిల్లా సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి. నిజానికి ఏసీఏను నడిపే వ్యక్తికి డబ్బు అవసరం లేదు. కాకపోతే ఆయన తన పదవి కోసం మిగిలిన వారు చేసే అవినీతిని చూసీ చూడకుండా వదిలేస్తున్నారు. ఇష్టారాజ్యంగా ఓట్లు ఏ క్రికెట్ సంఘంలో అరుునా ఆ సంఘం పరిధిలో ఉన్న జిల్లాలకు మాత్రమే ఓట్లు ఉండాలి. అయితే జిల్లాల్లో ఉన్న క్లబ్‌లకు కూడా క్రమంగా ఓట్లు ఇచ్చేశారు. ఇది చాలా రాష్ట్రాల్లో జరిగింది. అలా ఏసీఏలో కూడా 13 జిల్లాలు, 16 క్లబ్‌ల ఓట్లు ఉన్నాయి. ఈ 16 క్లబ్‌లు ఎప్పుడూ అధికారంలో ఉన్న వారి చేతిలో ఉంటాయి. ఒకవేళ జిల్లా సంఘాలు అసంతృప్తితో ఉన్నా తమ పదవులు పోకుండా కాపాడుకునేందుకు వీలుగా... ఏసీఏ ఆఫీస్ బేరర్లకు కూడా ఓట్లు ఇచ్చారు. 16 మంది ఆఫీస్ బేరర్ల చేతిలో 16 క్లబ్‌లు ఉంటాయి. కాబట్టి మొత్తం 45 ఓట్లలో 32 ఇటే పడతారుు. ఎన్నికలు జరిగినా సమస్య ఉండు. అరుుతే ఇలా ఆఫీస్ బేరర్లకు ఓట్లు ఇవ్వడం అనేది ఏసీఏలో తప్ప మరెక్కడా లేని విడ్డూరం. లోధా ప్రతిపాదనలు అమలు చేయరేం..? హైదరాబాద్ క్రికెట్ సంఘం లోధా కమిటీ ప్రతిపాదనలను అమలు చేస్తామంటూ తాజాగా ఏజీఎమ్ పెట్టి ప్రకటించింది. ఈ మేరకు లేఖ రాసింది. కానీ ఏసీఏ మాత్రం ఆ దిశగా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సుప్రీంకోర్టు ఆదేశించినా ఇప్పటివరకూ ఏసీఏలో ఉలుకూ పలుకూ లేదు. ఈ సంఘంలో ప్రధాన పదవిలో ఉన్న వ్యక్తి ఓ ప్రముఖ న్యాయవాది. మరి సుప్రీం ఉత్తర్వులను ఆయనే గౌరవించకపోతే ఎలా..? అమలు చేస్తే... లోధా కమిటీ బీసీసీఐతో పాటు రాష్ట్రాలను కూడా ప్రక్షాళన చేసే ప్రయత్నంలో ఉంది. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ప్రస్తుతం ఉన్న ఆఫీస్ బేరర్లంతా తప్పుకోవాల్సి వస్తుంది. క్లబ్‌ల ఓట్లు కూడా పోతాయి. అప్పుడు జిల్లాల అధికారం పెరుగుతుంది. కాబట్టి ఈ ప్రతిపాదనల అమలు జరిగే లోపే అన్ని జిల్లాలను తమ చేతుల్లో ఉంచుకునే ప్రక్రియలో భాగమే పాత సంఘాలను తొలగించి కొత్త వారికి గుర్తింపు ఇవ్వడం. అలాగే తాము తప్పుకుని తమ వారసులను తెరమీదకు తెస్తున్నారు. లోధా ప్రతిపాదనలు పూర్తి స్థారుులో అమలైతే ఈ ఆటలు సాగే అవకాశాలు తక్కువ. -
పండగవేళా పనికి రాలేదా!
తొలి టెస్టుకు వేణుకు దక్కని ఆహ్వానం తొలిసారి టెస్టు మ్యాచ్ నిర్వహిస్తూ పండుగ వాతావరణంలో సంబరం చేసుకున్న ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వేణుగోపాల రావును మాత్రం విస్మరించింది. టెస్టు ప్రారంభానికి ముందు ఎమ్మెస్కే ప్రసాద్‌తో పాటు గవాస్కర్, కుంబ్లే, మంజ్రేకర్, శివరామకృష్ణన్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ నాసిర్ హుస్సేన్‌లను పిలిచి మెమెంటోలు ఇచ్చి సత్కరించిన ఏసీఏ... ఆంధ్ర నుంచి భారత జట్టుకు ఆడిన వేణును కనీసం మ్యాచ్‌కు ఆహ్వానించలేదు. సాధారణంగా ఏ క్రికెట్ సంఘమైనా ఇలాంటి సమయంలో తమ ఆటగాళ్లను సత్కరించడం ఆనవారుుతీ. ఆంధ్ర తరఫున భారత్‌కు ఆడిన వాళ్ల సంఖ్య కూడా ఎక్కువేం లేదు. ప్రస్తుత చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కేతో పాటు వేణు మాత్రమే ఆ ఘనత సాధించారు. వేణును కూడా పిలిచి ఓ మెమెంటో ఇచ్చి ఉంటే బాగుండేది. వైజాగ్‌లోనే ఉన్నా వేణుకు ఎలాంటి ఆహ్వానం పంపలేదు. కనీసం ఒక ఫోన్, మెరుుల్ కూడా లేదు. రాష్ట్ర గౌరవం పెంచిన ఓ మాజీ భారత క్రికెటర్‌కు ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఏసీఏలోని కొందరు కీలక వ్యక్తులకు వేణు అంటే వ్యక్తిగతంగా ఇష్టం లేనందు వల్ల ఇలా చేశారని వారి సహచరులే అంటున్నారు. ఏమైనా ఇలాంటి కక్షపూరిత చర్యలు క్రికెట్‌కు ఎంత మాత్రం మంచిది కాదు. -
టెస్టులే అసలైన క్రికెట్
ఆరేళ్ల కష్టానికి ఫలితం టెస్టు హోదా 2019 ప్రపంచకప్ వరకూ ప్రణాళికఠ బెంచ్ బలం పెంచడమే సెలక్టర్ల లక్ష్యం ‘సాక్షి’తో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) ఇప్పుడు వెలిగిపోతోంది. బీసీసీఐలో ఏసీఏ అధికారులకు రకరకాల పదవులు... భారత చీఫ్ సెలక్టర్‌గా ఎమ్మెస్కే ప్రసాద్... కావలసినన్ని మ్యాచ్‌ల నిర్వహణ... తాజాగా టెస్టు హోదా... గత ఆరేళ్ల కాలంలో ఆంధ్ర క్రికెట్ చాలా మారిపోరుుంది. దీనిలో ఎమ్మెస్కే ప్రసాద్‌ది కీలక పాత్ర. ఏసీఏ క్రికెట్ ఆపరేషన్స డెరైక్టర్‌గా మైదానాలు, అకాడమీల నిర్మాణం, నిర్వహణలో ఆయన కీలకంగా వ్యవహరించారు. వైజాగ్ టెస్టు అరంగేట్రం సందర్భంగా టెస్టు హోదా, సెలక్టర్‌గా బాధ్యతలు, భారత జట్టు ప్రణాళికలు ఇలా వివిధ అంశాలపై ఎమ్మెస్కే ప్రసాద్ ‘సాక్షి’కి చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే... వైజాగ్‌కు టెస్టు హోదా: చాలా సంతోషంగా ఉంది. దీని కోసం మేం ఆరేళ్లుగా కలలుగంటున్నాం. ఆరేళ్ల పాటు కష్టపడ్డాం. ఆంధ్ర క్రికెట్ సంఘం పరిధిలో ఏర్పాటు చేసిన మైదానాలు, అకాడమీలు బోర్డును ఆకట్టుకున్నారుు. ఇక్కడ అనేక శిబిరాలు ఏర్పాటు చేశాం. వీటన్నింటి వల్లే టెస్టు హోదా సాధ్యమైంది. వన్డే ప్రపంచకప్ వరకు: సెలక్షన్ కమిటీ చైర్మన్ అవకాశం రావడం గొప్ప గౌరవం. ప్రస్తుత కమిటీ దీర్ఘకాలిక లక్ష్యాలతో ముందుకు వెళుతోంది. 2019 ప్రపంచకప్ వరకూ మాకు ప్రణాళికలు ఉన్నారుు. ఆలోగా భారత్ సుమారు 60 వన్డేలు ఆడుతుంది. వాటి ద్వారా ప్రపంచకప్ టోర్నీకి కూడా మంచి జట్టును తయారు చేస్తాం. ప్రతి విషయంలోనూ పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. టెస్టులకు కూడా: రాబోయే నాలుగేళ్ల కాలంలో టెస్టు మ్యాచ్‌లు కూడా బాగా ఉన్నారుు. దీని కోసం కూడా ప్రణాళికలు ఉన్నారుు. బీసీసీఐ టెస్టు క్రికెట్ కోసం అదనంగా నిధులు కేటారుుస్తోంది. ఈ ఫార్మా ట్ పట్ల బోర్డు అంకితభావంతో ఉంది. బోర్డుతో పాటు దేశంలో ప్రతి క్రికెటర్ కూడా టెస్టుల కోసం ఆసక్తిగా ఉన్నారు. ఎందుకంటే టెస్టు క్రికెట్ అసలైన క్రికెట్ అనేది అందరి భావన. అదే నిజం కూడా. సెలక్టర్ల బాధ్యత: భారత జట్టుతో పాటు సెలక్టర్లు ప్రయాణించడం అవసరం. విదేశాలకు జట్టుతో పాటు ఇద్దరు సెలక్టర్లు వెళుతున్నారు. స్వదేశంలో మ్యాచ్‌లకు ఒక సెలక్టర్ హాజరవుతున్నారు. మిగిలిన సెలక్టర్లు దేశవాళీ మ్యాచ్‌లను చూస్తున్నారు. భారత జట్టుకు బలమైన బెంచ్‌ను అందించడం మా ఉద్దేశం, బాధ్యత. ప్రత్యామ్నాయాలు సిద్ధం: బలమైన బెంచ్ వల్ల జట్టులో ఏ ఆటగాడు లేకపోరుునా లోటు తెలియదు. లోకేశ్ రాహుల్, శిఖర్ ధావన్ గాయపడితే గంభీర్ వచ్చి ఆ లోటు తెలియకుండా ఆడాడు. ఇప్పుడు మళ్లీ రాహుల్ వచ్చాడు. ఇంకా ముకుంద్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తను కూడా అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. గంభీర్ స్థానంలో రాహుల్: తను గాయం తర్వాత కోలుకుని రంజీ మ్యాచ్ ఆడి ఫిట్నెస్ను, ఫామ్‌ను నిరూపించుకున్నాడు. అందుబాటులో రాగానే జట్టులోకి తీసుకున్నాం. భారత జట్టులోని 15 మంది సమర్థులే. అందులోంచి ఉత్తమ తుది జట్టును మేనేజ్మెంట్ ఎంచుకుంటుంది. తుది జట్టు ఎంపికలో సెలక్టర్ల పాత్ర: టీమ్ మేనేజ్మెంట్లో ఇప్పుడు సెలక్టర్లు కూడా భాగం. గత ఏడాది నుంచి బీసీసీఐ దీనిని తప్పనిసరి చేసింది. మేనేజర్ నేతృత్వంలో కోచ్, కెప్టెన్, వైస్ కెప్టెన్, సెలక్టర్ కలిసి తుది జట్టును ఎంపిక చేస్తున్నారు. సెలక్టర్లు, టీమ్ ఒకే మార్గంలో నడవడానికి వీలుగా బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. జట్టు ఎంపికలో పరిగణలోకి తీసుకునే అంశాలు: ఫామ్, నైపుణ్యం, గత రికార్డు, భవిష్యత్‌లో జట్టు అవసరాలు, అన్నింటికి మించి ఏ స్లాట్ ఖాళీ ఉంది, ఏ స్లాట్‌లో ఆడగలడు అనే అంశాలన్నింటినీ పరిగణించిన తర్వాతే ఆటగాడిని జట్టులోకి ఎంపిక చేస్తాం. -
ఫ్రీగా రెండో టెస్ట్ మ్యాచ్ చూసే అవకాశం
-
కీలక వన్డేకు వైజాగ్ సిద్ధం
-
కీలక వన్డేకు వైజాగ్ సిద్ధం
తుపాను ప్రమాదం లేనట్లే నగరానికి చేరుకున్న జట్లు విశాఖపట్నం: భారత్, న్యూజిలాండ్‌ల మధ్య సిరీస్ ఫలితాన్ని నిర్ణరుుంచే ఆఖరి వన్డేకు ఆతిథ్యమిచ్చేందుకు విశాఖపట్నం సిద్ధమైంది. తుపాను నేపథ్యంలో మ్యాచ్ జరుగుతుందో లేదో అనే అనుమానాలు తొలగిపోయారుు. తుపాను బలహీనపడటం వల్ల నగరానికి భారీ వర్షాలు లేవని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) వర్గాలలో ఉత్సాహం పెరిగింది. ధోని సారథ్యంలోని భారత జట్టు, విలియమ్సన్ నేతృత్వంలోని న్యూజిలాండ్ బృందం గురువారం సాయంత్రం నగరానికి చేరుకున్నారుు. శుక్రవారం ఉదయం ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొంటారుు. పిచ్‌పై ఇంకా కవర్లు తొలగించలేదు. ఒకవేళ మ్యాచ్ రోజు వర్షం పడ్డా... స్టేడియంలో ఆధునిక డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. దీనికి తోడు సూపర్ సాపర్స్ కూడా సిద్ధం చేశారు. కాబట్టి వాతావరణంలో ఏవైనా అనుకోని మార్పులు జరిగితే తప్ప మ్యాచ్‌కు ఎలాంటి ఇబ్బందీ లేదు. ఇటీవల నగరంలో జరిగిన రంజీట్రోఫీ మ్యాచ్‌కు పిచ్ సరిగా లేదనే వార్తలు వచ్చారుు. ఒక దశలో వైజాగ్ వన్డేను తరలిస్తారని కూడా వినిపించింది. అన్ని ప్రతికూలతలను అధిగమించి ఏసీఏ మ్యాచ్ నిర్వహణకు సిద్ధమైంది. 260 పైచిలుకు పరుగులు వచ్చేలా పిచ్ ఉంటుందని క్యురేటర్ అంటున్నారు. -
సౌత్‌జోన్ క్రికెట్ విజేతగా కడప జట్టు
కడప స్పోర్ట్స్ : కడప నగరం కేఎస్ఆర్ఎం క్రీడామైదానంలో గత మూడురోజులుగా నిర్వహిస్తున్న సౌత్‌జోన్ అంతర్ జిల్లాల దివ్యాంగుల క్రికెట్ విజేతగా కడప జట్టు నిలిచింది. శనివారం నిర్వహించిన ఫైనల్మ్యాచ్లో అనంత జట్టుపై విజయం సాధించి విజేతగా నిలిచింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎం. వెంకటశివారెడ్డి, కందుల విద్యాసంస్థల కరస్పాండెంట్ శివానందరెడ్డి, టీడీపీ నాయకుడు దుర్గాప్రసాద్‌లు విచ్చేసి విన్నర్స్‌కు, రన్నర్స్‌కు, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ట్రోఫీలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వికలాంగులు ఏ రంగంలోనూ ఎవరికీ తీసిపోరన్నారు. అన్ని రంగాలతో పాటు క్రీడారంగంలో కూడా రాణించడం అభినందనీయమన్నారు. అనంతరం విజేతగా నిలిచిన కడప జట్టుకు విన్నర్స్ ట్రోఫీ, రన్నరప్‌గా నిలిచిన అనంత జట్టుకు రన్నర్స్ ట్రోఫీ అందజేశారు. మ్యాన్ఆఫ్ ది మ్యాచ్‌గా సుబ్బరాయుడు (కడప), మ్యాన్ ఆఫ్ ది సిరీస్, బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా హుదా (అనంతపురం), బెస్ట్ బౌలర్‌గా అంజినాయుడు (చిత్తూరు)లకు జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో వికలాంగుల క్రికెట్ సంఘం రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి రామాంజుల నాయక్, వికలాంగుల సంక్షేమ సంఘం నాయకుడు వెంకట్రామిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అనంతపై కడప విజయభేరి.. శనివారం నిర్వహించిన ఫైనల్మ్యాచ్లో కడప, అనంత జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. జట్టులోని రోశిరెడ్డి 60, హుదా 33 పరుగులు చేశారు. కడప బౌలర్లు క్రాంతి, సుబ్బరాయుడు, అశోక్, అంజి తలాఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కడప జట్టు 19 ఓవర్లలోనే 8 వికెట్ల నష్టానికి 133 పరుగుల విజయలక్ష్యం చేధించి విజేతగా నిలిచింది. జట్టులోని సుబ్బరాయుడు 45, వెంకటయ్య 24, అంజి 10 పరుగులు చేశారు. అనంత బౌలర్లు రామకృష్ణ 2, హుదా 2 వికెట్లు తీశారు. అనంతరం రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనే సౌత్‌జోన్ జట్టును ప్రకటించారు. సౌత్‌జోన్ జట్టు: అంజినాయుడు (కెప్టెన్ చిత్తూరు), క్రాంతికుమార్, సుబ్బరాయుడు (కడప), నూరుల్లాహుదా, రోశిరెడ్డి (అనంతపురం), ఇ. అశోక్ (కడప), పురుషోత్తం (చిత్తూరు), లక్ష్మణ్ (కర్నూలు), రహీం (కర్నూలు), మనోహర్ (నెల్లూరు), భాస్కర్ (అనంతపురం), నాగరాజు (చిత్తూరు), రఫీక్ (కర్నూలు), వేదా (కడప), వెంకటేష్, రవి (అనంతపురం), జావిద్ (కడప). -
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు సన్మానం
బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్‌ను ఆంధ్రక్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో ద్రోణాచార్య అవార్డు గ్రహీత రమేశ్‌ను కూడా ఘనంగా సన్మానించారు. రమేశ్‌కు రూ.2 లక్షల చెక్కును ఎంపీ గోకరాజు గంగరాజు అందజేశారు. తెలుగు వ్యక్తి తొలిసారి బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ కావడం గర్వకారణమని పలువురు వ్యక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోకరాజు గంగరాజుతో పాటు పలువురు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌గా విహారి
విజయవాడ : 2016-17 క్రికెట్ సీజన్లో పాల్గొనే ఆంధ్ర రంజీ జట్టును ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. గతేడాది హైదరాబాద్‌కు ఆడి ఈసారి ఆంధ్రకు వచ్చిన హనుమ విహారిని జట్టు కెప్టెన్‌గా నియమించారు. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చిన రవితేజతో పాటు గుజరాత్‌కు చెందిన భార్గవ్ భట్‌కు కూడా చోటు కల్పించారు. సొంత జట్టు ఆంధ్రకు ఆడతానంటూ ఏసీఏ చుట్టూ తిరిగిన వేణు గోపాలరావును సెలక్షన్ కమిటీ పట్టించుకోలేదు. సీజన్లో తొలి నాలుగు మ్యాచ్‌ల కోసం ఈ జట్టును ప్రకటించారు. ఆంధ్ర రంజీ జట్టు: విహారి (కెప్టెన్), కేఎస్ భరత్ (వైస్ కెప్టెన్), డీబీ ప్రశాంత్‌కుమార్, ఎంయూబీ శ్రీరామ్, కె.శ్రీకాంత్, ఏజీ ప్రదీప్, డీబీ రవితేజ, కె.అశ్విన్ హెబర్, సీహెచ్.స్టీఫెన్, డి.శివకుమార్, ఐ.కార్తీక్రామన్, బి.అయ్యప్ప, పి.విజయకుమార్, టి.వంశీకష్ణ, సిద్ధార్థ్, భార్గవ్ భట్. అక్టోబర్ 3నుంచి చెస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిడే ఇంటర్నేషనల్ రేటింగ్ అండర్-19 ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్ అక్టోబర్ 3న ప్రారంభం కానుంది. తెలంగాణ చెస్ సంఘం (టీఎస్‌సీఏ) ఆధ్వర్యంలో ఖమ్మంలోని సీక్వెల్ రిసార్‌ట్సలో మూడు రోజుల పాటు ఈ టోర్నీ జరుగుతుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి పద్మారావు సోమవారం టోర్నమెంట్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌సీఏ అధ్యక్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి ఆనం చిన్ని వెంకటేశ్వర రావు, మీడియా ఇన్చార్జి పి. రమేశ్ పాల్గొన్నారు. -
'ఆట' మరచిన ఆంధ్ర!
ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో రకరకాల పదవుల్లో 11 మంది ఉన్నారు. ఇందులో జాతీయ సెలక్టర్ కూడా ఒకరు. ఇక ఏసీఏ పరిధిలో అద్భుతమైన స్టేడియాలు, అకాడమీలు ఉన్నాయి. శభాష్... ఆంధ్ర క్రికెట్ ‘వెలిగిపోతోంది’.... ఇదీ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. పదవులు, స్టేడియాల సంగతి సరే... మరి ఆట సంగతేంటి..? ఒక్కరంటే ఒక్కరన్నా జాతీయ జట్టు దరిదాపుల్లో ఉన్నారా..? లక్షల రూపాయలు పోసి అరువు సీనియర్లను తెచ్చుకున్నా రంజీ జట్టు ఆటతీరు నానాటికీ తీసికట్టుగా ఎందుకు తయారవుతోంది. పదవులు, స్టేడియాలతోనే హడావిడి * ఏ మాత్రం పెరగని క్రికెట్ ప్రమాణాలు * జాతీయ జట్టుకు ఆడే ఆంధ్రా క్రికెటరే లేడా..? సాక్షి, విజయవాడ స్పోర్స్ట్ : ‘హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా మేం మంచి స్టేడియం కట్టాము. మంచి సౌకర్యాలు కల్పించాం. అయితే నాకేమీ సంతోషంగా లేదు. నా రాష్ట్రానికి చెందిన క్రికెటర్లు భారత్‌కు ఆడుతుంటేనే నాకు నిజమైన సంతోషం కలుగుతుంది’... ఇటీవల విజయవాడ సమీపంలోని మూలపాడు వద్ద క్రికెట్ స్టేడియాల ప్రారంభోత్సవంలో బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్య ఇది. అంటే ఓ రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి జరిగిందనడానికి నిదర్శనం ఆటగాళ్లు తయారు కావడం. కానీ ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) మాత్రం దీనిని ఇంకా గ్రహించినట్లు లేదు. ప్రతి జిల్లాలో ఓ క్రికెట్ గ్రౌండ్... కొత్తగా టెస్టు హోదా... ఇండోర్ క్రికెట్ ప్రాక్టీస్ వసతి, రెసిడెన్షియల్ అకాడమీ... దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ స్థారుులో స్టేడియాల అభివృద్ధి జరగలేదని ఏసీఏ చెప్పుకుంటోంది. బీసీసీఐ ఇచ్చిన నిధులతో గత కొన్నేళ్లలో ఏసీఏలో మౌలిక సౌకర్యాల అభివృద్ధి బాగా జరిగిందనడంలో సందేహం లేదు. ఇక పదవుల సంగతి సరేసరి. ఏకంగా 11 మంది ఏసీఏ నుంచి బీసీసీఐకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బోర్డు ఉపాధ్యక్షుడిగా పెద్ద హోదాలో ఉన్న ఏసీఏ కార్యదర్శి గోకరాజు గంగరాజు మార్కెటింగ్, ఐటీ, ఫిక్చర్స్‌కమిటీల్లో కూడా సభ్యులు. ఇక ఏసీఏకు చెందిన ఎమ్మెస్కే ప్రసాద్ సెలక్టర్‌గా వ్యవహరించారు. తాజాగా ఆయన పదవీకాలం పూర్తయింది. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే. ఇన్ని సౌకర్యాలు, ఇంత అధికారం ఉన్న క్రికెట్ సంఘం నుంచి జాతీయ జట్టుకు, కనీసం ‘ఎ’ జట్టుకు ఆడే ఆటగాళ్లు కూడా కనపడటం లేదు. ఐపీఎల్‌లోనూ ఏ జట్టులోనూ తుది జట్టులో ఆంధ్ర క్రికెటర్ ఆనవాళ్లే లేవు. ఈ స్థితిని మార్చడానికి మాత్రం ఎవరూ చొరవ తీసుకోవడం లేదు. ఆటను పట్టించుకోవడం మానేశారు. దీనికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. పదేళ్ల క్రితం వరకూ ఆంధ్ర క్రికెట్లో ఆటగాళ్లు బాగానే ఉండేవారు. ఎప్పుడు సౌత్‌జోన్ జట్టు ఎంపిక జరిగినా కనీసం ఇద్దరు, ముగ్గురు ఆడేవారు. ‘ఎ’ జట్టు స్థాయికి కూడా ఆడారు. కానీ ఆ తర్వాత క్రమంగా వైభవం పోయింది. అండర్-19లో రికీ భుయ్ తప్ప మరో ఆటగాడు వెలుగులోకి రాలేదు. ’మా దగ్గర కొందరు పెద్దలకు అభద్రతా భావం ఎక్కువ. ఎవరికీ పేరు రాకూడదని, నేను తప్ప ఇంకెవరూ కనిపించకూడదనే ఆలోచనా ధోరణి కారణంగా ఈ స్థితి ఏర్పడింది’ అని ఏసీఏ సభ్యుడు ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏసీఏలో పదవులు అనుభవించేవారిలో మెజారిటీ సభ్యులకు రంజీ జట్టులో ఉండే క్రికెటర్లందరి పేర్లు కూడా తెలియవంటే అతిశయోక్తి కాదు. గత ఎనిమిదేళ్లలో ఒక్క సీజన్లో మాత్రమే ఆంధ్ర రంజీ జట్టు ఎలైట్ గ్రూప్‌కు వెళ్లింది. కానీ ఒక్క ఏడాదిలోనే మళ్లీ ప్లేట్ ‘సి’ గ్రూప్‌కు పడిపోయింది. ‘కై ఫ్, మజుందార్ లాంటి సీనియర్ క్రికెటర్లను 25 నుంచి 30 లక్షల రూపాయలు ఇచ్చి ఆడించారు. కానీ ప్రయోజనం లేదు. ఫిజియోలు, కోచ్‌లు అందరూ బయటివారే. మన దగ్గర ఉన్న టాలెంట్‌ను గుర్తించడం లేదు. వేణుగోపాలరావును ఆడించకపోవడం దీనికి ఉదాహరణ. ఇంగ్లీష్‌లో, హిందీలో మాట్లాడేవాళ్లంటే మా వాళ్లకు ఇష్టం. తెలుగు రాని వాళ్లు, తెలుగు మాత్రమే తెలిసిన ఆటగాళ్లకు ఏం కమ్యూనికేట్ చేస్తారని కూడా ఆలోచించడం లేదు’ అని మరో సభ్యుడు వాపోయారు. ఏసీఏలో ఎక్కువ మంది సభ్యులకు పదవులు, ఏ అవకాశం దొరికినా మేనేజర్‌గానో, మరో రూపంలో విదేశీ పర్యటన అవకాశాలు... ఇలా ఏదో ఒక తారుులాలు లభిస్తుండటంతో ఎవరూ సంఘంలో జరిగే విషయాలను ప్రశ్నించడం లేదు. నిజానికి ప్రశ్నించే వాళ్లు ఉన్నప్పుడే అభివృద్ధి జరుగుతుంది. ఇప్పుడు ఏసీఏలో లోపించిందే అది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత కాలం రంజీ జట్టు ప్లేట్లోనే ఉంటుంది... నాణ్యమైన ఆటగాళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. అరువు ఆటగాళ్లతో సీజన్‌ను అలా గడిపేయడమే. ఈ పరిస్థితిలో మార్పు రావాలని కోరుకుందాం. మనవాళ్లు పనికిరారా..? 2010లో ఎం.ఎస్.కె. ప్రసాద్ ఏసీఏలో క్రికెట్ ఆపరేషన్స డెరైక్టర్‌గా పదవి చేపట్టారు. గత ఏడాది ఆయనకు బీసీసీఐ సెలక్టర్‌గా అవకాశం లభించింది. దాంతో ప్రసాద్ స్థానంలో మరొకరిని నియమించాల్సి వచ్చింది. అయితే మనవాళ్లు ఎవరూ పనికి రారంటూ కింజల్ సూరత్వాలా అనే వ్యక్తిని ముంబై నుంచి పిలిపించి ఈ పదవిలో కూర్చోబెట్టారు. నెలకు రూ. 3 లక్షల జీతం తీసుకుంటున్న ఈయన నిజానికి వృత్తి రీత్యా డాక్టర్. యూనివర్శిటీ స్థాయిలో ఆడాడని చెప్పుకుంటారు కానీ ఒక రాష్ట్ర జట్టు ఆపరేషన్స చూసే స్థాయిలో క్రికెట్ పరిజ్ఞానం లేదు. గతంలో జాతీయ క్రికెట్ అకాడమీలో స్పోర్ట్స సైన్స హెడ్‌గా పని చేశారు. ఒక వైపు భాషా సమస్యను అధిగమిస్తూ ఈ ఏడాది కాలంలో ఏం పని చేశారో కూడా ఏసీఏలోనే చాలా మందికి తెలియదు. ‘మా వాళ్లకు ఆటగాళ్లే కాదు... పరిపాలనలోనూ అరువు వాళ్లను తెచ్చుకోవడమే ఇష్టం. ఇక్కడ ఎవరికై నా ఆ పదవి ఇస్తే అవసరమైన సమయంలో మళ్లీ ఎమ్మెస్కేను డెరైక్టర్ చేయలేమని వారి భయం. అందుకే వేరే రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు సెలక్టర్‌గా ప్రసాద్ పదవీకాలం పూర్తరుుంది. కాబట్టి సూరత్‌వాలాను పంపించి, ప్రసాద్‌ను ఆ స్థానంలో కూర్చోబెడతారు’ అని ఏసీఏలో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తి చెప్పటం విశేషం. -
వేణును ఆడించాల్సిందే...
సాక్షి నెట్వర్క్: ఆంధ్ర క్రికెట్ సంఘం వేణుగోపాలరావు లాంటి సీనియర్ క్రికెటర్ సేవలను వినియోగించుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే నిబంధన సాకుతో వేణును ఏసీఏ పక్కనపెట్టడంపై సాక్షిలో వచ్చిన కథనంపై పలువురు స్పందించారు. రూల్ కరెక్ట్ కాదు ‘లక్షలకు లక్షలు ఖర్చు చేసి ఇతర రాష్ట్రాల నుంచి క్రికెటర్లను తెచ్చి ఆడిస్తున్నారు. రాజకీయాల్లో ఉన్న కైఫ్‌ను తెచ్చి ఆడించారు. స్థానిక ఆటగాడు వేణును ఆడించకపోవడం అన్యాయం. సంవత్సరం పాటు ఎక్కడా ఆడకూడదు అంటూ వేణుకు నిబంధన పెట్టడం ఎంత వరకు సమంజసమో ఏసీఏ పెద్దలు ఆలోచించాలి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ అనే రూల్ కరెక్ట్ కాదు. భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆంధ్ర క్రికెటర్‌ను అవమానించడం కరెక్ట్ కాదు.’ - మధుసూదన్ రాజు, ఆంధ్ర సెలక్షన్ కమిటీ మాజీ సభ్యుడు అవసరమైతే నిబంధనలు మార్చాలి ‘వేణు మంచి క్రికెటర్. ఉత్తరాంధ్ర నుంచి దేశానికి ఆడిన ఏకైక ఆటగాడు. కొత్త కొత్త నిబంధనలు సాకుగా చూపించి ఆంధ్ర జట్టులోకి తీసుకోకపోవడం విచారకరం. అవసరమైతే నిబంధనలు మార్చాలి. ఈ విషయంపై నేను ఏసీఏ కార్యదర్శి గంగరాజుతో మాట్లాడతాను’. - విష్ణుకుమార్ రాజు, ఉత్తర విశాఖపట్నం ఎమ్మెల్యే ఐదు నిమిషాలు చాలు... ‘వేణు క్రమశిక్షణ కలిగిన క్రికెటర్. అలాంటి ఆటగాడిని ఆడించకపోవడం అన్యాయం. బయటి వాళ్ల చుట్టూ తిరిగే బదులు అనుభవం ఉన్న ఆంధ్ర ఆటగాడిని ఆడించాలి. కూలింగ్ ఆఫ్ పీరియడ్ బీసీసీఐ రూల్ కాదు. ఈసీ మీటింగ్ పెట్టి ఐదు నిమిషాల్లో నిబంధన మార్చవచ్చు. ఆటగాడు తన కెరీర్ కోసం ఎక్కడైనా ఆడొచ్చు. -వెంకట్రావు, ఏసీఏ మాజీ ప్రధాన కార్యదర్శి -
‘ప్రతిభాన్వేషణ’కు గుర్తింపు
అయ్యప్ప, స్టీఫెన్, భరత్, శ్రీరామ్, భుయ్... గత ఐదేళ్లలో ఆంధ్ర క్రికెట్‌నుంచి వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో కొందరు. వీరందరి గుర్తింపు, ఎంపిక వెనక ఎమ్మెస్కే ప్రసాద్ హస్తం ఉంది. 2010లో ప్రారంభమైన ఆంధ్ర క్రికెట్ అకాడమీ అందించిన క్రికెటర్లు వీరు. అంతకు రెండేళ్ల క్రితం 33 ఏళ్ల వయసులో ఇంకా ఆడే సత్తా ఉన్నా... ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ప్రసాద్, ఆ తర్వాత ఆంధ్ర క్రికెట్ అభివృద్ధిలో భాగమయ్యారు. ఏసీఏ డెరైక్టర్ (ఆపరేషన్స్) హోదాలో అనేక కొత్త ప్రణాళికలతో తమ జట్టు రాత మార్చారు. ప్రతిభ ఉంటే చాలు ఆంధ్ర క్రికెట్లో అవకాశం దక్కుతుందనే భావన అన్ని వర్గాల్లో వెళ్లటంలో ఎమ్మెస్కేదే కీలక పాత్ర. సాధారణ నేపథ్యం ఉన్న కుర్రాళ్లను సానబెట్టేందుకు ఏర్పాటు చేసిన మూడు రెసిడెన్షియల్ అకాడమీలు (అండర్-14, అండర్-16, అండర్-19) అతని మార్గదర్శనంలో మంచి ఫలితాలు అందించాయి. గత రెండేళ్లలో ఆంధ్ర రంజీ జట్టును పటిష్టంగా తీర్చిదిద్దడంలో ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. గత ఏడాది నాకౌట్ దశకు అర్హత సాధించిన ఆంధ్ర, ఈ సారి కూడా నిలకడగా రాణించింది. ఇటీవల ఆంధ్ర మహిళల అండర్-19 జట్టు జాతీయ చాంపియన్‌గా కూడా నిలిచింది. కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిభాన్వేషణ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ప్రతిభను ప్రోత్సహించడంలో ఎమ్మెస్కే చురుగ్గా పని చేస్తున్నారు. ఆంధ్ర క్రికెట్లో ప్రస్తుతం వేర్వేరు వయో విభాగాల్లో ఉన్న 9 సెలక్షన్ కమిటీల్లో ప్రసాద్ భాగం కావడం విశేషం. గతంలో బోర్డు టెక్నికల్ కమిటీ, ఎన్సీఏ కమిటీలో ప్రసాద్ సభ్యుడిగా పని చేశారు. ఎమ్మెస్కే 6 టెస్టులు, 17 వన్డేల్లో భారత్‌కు ప్రాతి నిధ్యం వహించారు. 1999-2000లో సచిన్ సారథ్యంలో ఆస్ట్రేలియా పర్యటించిన భారత జట్టులో ప్రసాద్ సభ్యుడు. 96 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 4021 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్ 239 క్యాచ్‌లు పట్టి, 27 స్టంపింగ్‌లు చేశారు. అభినందనలు... సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా ఎంపికైన ఎమ్మెస్కే ప్రసాద్‌ను ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు అభినందించారు. తెలుగువారికి ప్రసాద్ గర్వకారణంగా నిలిచారని సీఎం పేర్కొన్నారు. గత కొంత కాలంగా ఆంధ్ర క్రికెట్ దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక్కడ సమష్టిగా మేం చేస్తున్న కృషి అందరికీ కనిపిస్తోంది. ఈ కారణాలతోనే సౌత్‌నుంచి మరికొన్ని సీనియర్ ఆటగాళ్ల పేర్లు వచ్చినా...నా పనితీరు గురించి చెప్పి అవకాశం కల్పించిన గోకరాజు గంగరాజుగారికి కృతజ్ఞతలు. ఇక్కడ కేవలం ప్రతిభ మినహా ఎలాంటి సిఫారసులను పట్టించుకోవద్దంటూ ఆయన ఇచ్చిన స్వేచ్ఛ వల్లే ఆంధ్ర క్రికెట్‌నుంచి అనేక మంది కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. భారత సెలక్టర్‌గా కూడా సమర్థంగా పని చేసేందుకు ప్రయత్నిస్తా. ఇది నాకో సవాల్లాంటిది. ఇప్పుడే చెప్పలేను కానీ మున్ముందు ఆంధ్రనుంచి భారత జట్టుకు ఎక్కువ మంది ఎంపికవుతారని ఆశిస్తున్నా’ -‘సాక్షి’తో ఎమ్మెస్కే ప్రసాద్ -
తాడేపల్లిగూడెంలో క్రికెట్ మిని స్టేడియం
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి జిల్లా): పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల్లో క్రికెట్ కోసం మిని స్టేడియాన్ని నిర్మించనున్నట్లు నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం తాడేపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలోని విమానాశ్రయ భూముల్లో ఆరుఎకరాల విస్తీర్ణంలో మిని క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నామని ఆయన ఈ మేరకు తెలిపారు. -
స్నేహ, బిందు... 418 పరుగులు
ఒకే వన్డేలో ఇద్దరు డబుల్ సెంచరీలు సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర క్రికెట్ సంఘం సీనియర్ మహిళల టోర్నీలో సంచలనాలు నమోదవుతున్నాయి. వన్డే మ్యాచ్‌లో విశాఖ క్రికెటర్లు స్నేహదీప్తి (104 బంతుల్లో 209), హిమబిందు (132 బంతుల్లో 223 పరుగులు) డబుల్ సెంచరీలు సాధించారు. ఈ ఇద్ద రూ కలిసి ఏకంగా 418 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ ఇద్దరి సంచలన బ్యాటింగ్‌తో... ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో తూర్పు గోదావరి జిల్లా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో విశాఖపట్నం 515 పరుగులతో ఘన విజయం సా ధించింది. తొలుత విశాఖ జట్టు 50 ఓవర్లలో నాలు గు వికెట్లకు 567 పరుగులు చేయగా... తూర్పుగోదావరి 27.5 ఓవర్లలో 52 పరుగులకే ఆలౌటయింది. గురువారం జరిగిన వన్డేలో స్నేహదీప్తి ట్రిపుల్ సెంచ రీ సాధించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. -
అంతన్నారింతన్నారే ..గంగరాజు
- బాధ్యతలు పట్టించుకోని వైనం - పుష్కరాల్లోనూ అతిథి దర్శనమేనా - హామీలు గాలిలో..ఎంపీ వ్యాపారాల్లో..ప్రజలు సమస్యల్లో సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష బాధ్యతలు.. లైలా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పేరిట రియల్ ఎస్టేట్, హోటళ్ల వ్యాపారాలు, చెరకు ఫ్యాక్టరీలు.. ఇతరత్రా కంపెనీలు.. విశ్వహిందూ పరిషత్‌లో జాతీయ హోదా బాధ్యతలు.. ఇన్ని వ్యాపకాల్లో తలమునకలై ఎప్పుడో తీరిక దొరికిన తర్వాత గానీ నరసాపురం ఎంపీ పదవి గుర్తురావడం లేదు గోకరాజు గంగరాజుకు. పార్లమెంటు సభ్యునిగా నరసాపురం నియోజకవర్గ ప్రజలకు ఆయన ఏడాదికాలంగా అతిథి దర్శన భాగ్యమే కలిగిస్తున్నారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పుష్కరాల సందర్భంలోనూ అడపాదడపానే కనిపిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ కూడా వ్యాపార, సినీ ప్రముఖుడే అయినప్పటికీ పుష్కరాలకు సంబంధించి కీలకంగా వ్యవహరిస్తున్నారు. కానీ మన జిల్లాలో గోదావరి తీరం ఉన్న డెల్టా ప్రాంతానికి ఎంపీగా ఉన్న గంగరాజు మాత్రం ఇప్పటి వరకు పుష్కరాలపై సీరియస్‌గా దృష్టి సారించలేదు. పుష్కరాల సమీక్షలకు హాజరవడం గానీ.. పనులు ఎంతవరకు వచ్చాయని ఆరా తీసి వేగవంతం చేయాలన్న బాధ్యత గానీ ఇంతవరకు ఆయన తీసుకోలేదు. కేంద్రం పుష్కరాల నిర్వహణకు రూ.100 కోట్లు మాత్రమే విడుదల చేసింది. కేంద్రం నుంచి అధిక నిధులు రాబట్టడంలో కూడా ఆయన కనీస ప్రయత్నం చేయలేదన్న వాదనలున్నాయి. ఇక పుష్కరాల్లో కొవ్వూరు, నరసాపురం పట్టణాలతో పాటు జిల్లాలో పుష్కరాలు జరిగే అన్ని రైల్వేస్టేషన్లల్లో కనీస వసతులు లేవు. మిగిలిన అన్ని శాఖలు పుష్కరాలకు సమాయత్తమవుతుండగా రైల్వే శాఖ ఇంకా నిర్లిప్తంగానే ఉంది. ఎంపీగా రైల్వే శాఖ అధికారులతో మాట్లాడటం కాని, పుష్కరాల నేపథ్యంలో రైల్వేస్టేషన్లను అభివృద్ధి చేసే ప్రయత్నం కాని నామమాత్రంగా కూడా ఎంపీ చేయలేదన్న విమర్శలున్నాయి. సీఎం, కేంద్రమంత్రులు వస్తేనే దర్శనం ఎంపీగా గెలిచిన తర్వాత ఈ 13 నెలల కాలంలో ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు పాల్గొనే సభలకు హాజరవడం.. స్థానికంగా ఆహ్వానాల ప్రాధాన్యతను బట్టి నియోజకవరాల్లో ప్రత్యక్షం కావడం తప్పించి, సమస్యలు చెప్పుకుందామంటే ఎంపీ కానరావడం లేదని నియోజకవర్గ ప్రజలే కాదు రాజకీయ నాయకులూ అంటున్నారు. నరసాపురం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో ఇప్పటికీ ఆయన పర్యటించని మండలాలు ఉన్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఏడాదికాలంలో మొత్తంగా నరసాపురం, పాలకొల్లు నియోజకవర్గాలకు 15 సార్లు, తణుకుకు 4 సార్లు, తాడేపల్లిగూడెంకు 3 సార్లు మాత్రమే వచ్చారు. ఆచంటకు అడపాదడపా వచ్చే ఆయన కొద్దోగొప్పో భీమవరానికి ఎక్కువసార్లు వస్తుంటారు. అక్కడే ఎంపీ కార్యాలయం ఉంది. ఎన్నికల సమయంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో క్యాంపు ఆఫీస్‌లు పెడతానని హామీలు గుప్పించారు. అయితే ఇప్పటి వరకు క్యాంపు కార్యాలయాలకు అతీగతీ లేదు. ఏడాదిలో కానరాని ఎంపీ ముద్ర రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో జిల్లాలోని భీమవరం, తాడేపల్లిగూడెం లాంటి పట్టణాల ప్రాధాన్యం పెరిగింది. అభివృద్ధి పరంగా ప్రోత్సహిస్తే కార్పొరేషన్ల స్థాయికి ఈ పట్టణాలు చేరే అవకాశం ఉంది. అయితే ఎంపీగా ఆ దిశగా ఇంతవరకు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు. ఆక్వా ఉత్పత్తులకు ముఖ్య కేంద్రంగా ఉన్న భీమవరాన్ని ఆక్వారంగానికి సంబంధించి దేశంలోనే ముఖ్య పట్టణంగా తీర్చుదిద్దుతామని ఎన్నికల వేళ హామీనిచ్చారు. తాడేపల్లిగూడెం, తణుకు పట్టణాల్లో పారిశ్రామికీకరణను పరుగులు పెట్టిస్తానని చెప్పారు. తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న నరసాపురంలో గ్యాస్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. ఇక రైల్వేల అభివృద్ధి, గతం నుంచీ హామీలుగా మిగిలిపోయిన పైప్లైన్ల ద్వారా వంట గ్యాస్ సరఫరా వంటి విషయాల్లో చాలా వాగ్దానాలు చేశారు. గంగరాజు ఎంపీగా గెలవడం, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో హామీల్లో కొన్నయినా నెరవేరతాయని ప్రజలు ఆశించారు. కానీ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఏడాది దాటినా నరసాపురం లోక్‌సభ నియోజక అభివృద్ధి విషయంలో గంగరాజు మార్కు ఎక్కడా కనిపించడంలేదు. ఇప్పటివరకు ఇది చేశాను అని చెప్పుకోవడానికి ఒక్క పని కూడా ఎంపీ ఖాతాలో లేదని స్వయంగా సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
భారత జట్టులో కల్పన
న్యూజిలాండ్‌తో మహిళల సిరీస్‌కు ఆంధ్ర క్రికెటర్ సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్‌తో ఐదు వన్డేల సిరీస్‌లో తలపడే భారత జట్టులో ఆంధ్ర క్రీడాకారిణి ఆర్. కల్పనకు స్థానం లభించింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌వుమన్ అయిన కల్పన మొదటి సారి సీనియర్ జట్టులో చోటు దక్కించుకుంది. ఆంధ్ర తరఫున ఒక మహిళా క్రికెటర్ భారత జట్టుకు ఎంపిక కావడం కూడా ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్, కివీస్‌ల మధ్య ఈ నెల 28నుంచి బెంగళూరులో ఐదు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. కల్పనను ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు సోమయాజులు, కార్యదర్శి గంగరాజు తదితరులు అభినందించారు. -
ఏసీఏ కార్యదర్శిగా గంగరాజు
విజయవాడ స్పోర్ట్స్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు గోకరాజు గంగరాజు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని విజయవాడ క్లబ్లో ఏసీఏ 62వ సర్వసభ్య సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో 2019 వరకు కొనసాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా డీవీఎస్ఎస్ సోమయాజులు తిరిగి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా రంగరాజు, యాచేంద్ర, శివారెడ్డి, సుబ్బరాజు, జీజేజే రాజు, త్రినాథ్ రాజు, సునీల్ రత్నకుమార్, రామచంద్, ఉమామహేశ్వరరావు, సంయుక్త కార్యదర్శిగా సీహెచ్.అరుణ్‌కుమార్, కోశాధికారిగా రెహమాన్ ఎన్నికయ్యారు. టీఎన్‌సీఏ అధ్యక్షుడిగా శ్రీనివాసన్ చెన్నై: తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) అధ్యక్షుడిగా... ప్రస్తుత ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ 14వ సారి ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన 85వ వార్షిక సర్వసభ్య సమావేశంలో శ్రీని ఎంపికను సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. -
‘ఎంఆర్ఎఫ్’ శిక్షణకు స్టీఫెన్
సాక్షి, హైదరాబాద్ : ప్రఖ్యాత ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో శిక్షణ పొందేందుకు ఆంధ్ర క్రికెట్ జట్టు బౌలర్ చీపురుపల్లి స్టీఫెన్ ఎంపికయ్యాడు. పేస్ దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ దగ్గర స్టీఫెన్ శిక్షణ తీసుకుంటాడు. ఈ నెల 15నుంచి ఈ శిక్షణా శిబిరం ప్రారంభమవుతుంది. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంనకు చెందిన 21 ఏళ్ల స్టీఫెన్ గత రెండు సీజన్లుగా ఆంధ్ర జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఈ లెఫ్టార్మ్ పేసర్ ఇప్పటి వరకు 11 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 24.87 సగటుతో 39 వికెట్లు పడగొట్టాడు. ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్‌లో శిక్షణకు ఎంపికైన స్టీఫెన్‌ను ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అభినందించింది. -
భారత క్రికెట్‌కు గంగ‘రాజు’
విజయవాడ స్పోర్ట్స్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. చెన్నైలో సోమవారం జరిగిన బీసీసీఐ సర్వసభ్య సమావేశంలో 2017 వరకు బీసీసీఐ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సౌత్‌జోన్ నుంచి గంగరాజు ఒక్కరే పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం.అంచెలంచెలుగా ఎదుగుతూ.. విద్యార్థి దశలోనే యూనివర్సిటీ స్థాయి క్రికెటర్‌గా రాణించిన గంగరాజు పారిశ్రామికవేత్తగా రాణిస్తూనే కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ (కేడీసీఏ) ఉపాధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2007 వరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా వ్యవహరించారు. 2007-08లో ఏసీఏ ఉపాధ్యక్షునిగా, 2008 జూన్‌లో అధ్యక్షునిగా, 2009 జూన్‌లో ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2011లో జరిగిన ఏసీఏ ఎన్నికల్లో పూర్తి మెజారిటీ సాధించి తిరుగులేని క్రికెట్ అడ్మినిస్ట్రేటర్‌గా నిలిచారు. 2014లో బీజేపీ తరఫున పోటీచేసి నర్సాపురం ఎంపీగా గెలిచారు. 2011లో ఏసీఏ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాక మాజీ టెస్ట్ క్రికెటర్ ఎంఎస్కే ప్రసాద్‌తో కలిసి ఆంధ్రలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేశారు. దాదాపు అన్ని ఏజ్ గ్రూపుల్లో ఆంధ్రను సౌత్జోన్లో చాంపియన్‌గా నిలిపారు. మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించారు. క్రీడాకారులకు ప్రోత్సాహం.. కోట్లాది రూపాయల నిధులు తెచ్చి వర్ధమాన క్రికెటర్లకు విద్య, వసతి, ఉపకార వేతనాలందేలా చూశారు గంగరాజు. క్రికెటేతర క్రీడలను ప్రోత్సహించారు.