జూలై 6 నుంచి 17 వరకూ ఏపీఎల్‌ టి–20 | Sakshi
Sakshi News home page

జూలై 6 నుంచి 17 వరకూ ఏపీఎల్‌ టి–20

Published Tue, Jun 7 2022 4:16 AM

Andhra Cricket Association Meeting With CM Jagan - Sakshi

సాక్షి, అమరావతి/విశాఖ స్పోర్ట్స్‌: ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌(ఏపీఎల్‌) టీ–20 టోర్నమెంట్‌ లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం సీఎం నివాసంలో సీఎం వైఎస్‌ జగన్‌ను ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌(ఏసీఏ) ప్రెసిడెంట్‌ పి.శరత్‌చంద్రారెడ్డి, ట్రెజరర్‌ గోపినాథ్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ సత్యప్రసాద్, సభ్యులు ప్రసాద్, గోపాలరాజు, టెక్నికల్‌ ఇన్‌చార్జ్‌ విష్ణు దంతుతో పాటు.. ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు.

ల్యాప్‌టాప్‌లో ఏపీఎల్‌ టీ–20 టీజర్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నంలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ టోర్నమెంట్‌ను ఏసీఏ నిర్వహించనుంది.

జూలై 17న జరిగే ఫైనల్‌ మ్యాచ్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ను ఏసీఏ బృందం ఆహ్వానించింది. ఐపీఎల్‌ తరహాలో ఏపీఎల్‌ మ్యాచ్‌లు నిర్వహిస్తామని సీఎం జగన్‌కు ఏసీఏ ప్రెసిడెంట్‌ పి.శరత్‌చంద్రారెడ్డి వివరించారు. టీ–20 టోర్నమెంట్‌ నిర్వహించుకునేందుకు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నట్టు వెల్లడించారు.   

Advertisement
 
Advertisement
 
Advertisement