T-20 tournament
-
జూలై 6 నుంచి 17 వరకూ ఏపీఎల్ టి–20
సాక్షి, అమరావతి/విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) టీ–20 టోర్నమెంట్ లోగోను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం సీఎం నివాసంలో సీఎం వైఎస్ జగన్‌ను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రెసిడెంట్ పి.శరత్‌చంద్రారెడ్డి, ట్రెజరర్ గోపినాథ్‌రెడ్డి, సీఈవో ఎంవీ శివారెడ్డి, గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సత్యప్రసాద్, సభ్యులు ప్రసాద్, గోపాలరాజు, టెక్నికల్ ఇన్చార్జ్ విష్ణు దంతుతో పాటు.. ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కలిశారు. ల్యాప్‌టాప్‌లో ఏపీఎల్ టీ–20 టీజర్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. జూలై 6 నుంచి 17 వరకు విశాఖపట్నంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ టోర్నమెంట్‌ను ఏసీఏ నిర్వహించనుంది. జూలై 17న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు సీఎం వైఎస్ జగన్‌ను ఏసీఏ బృందం ఆహ్వానించింది. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని సీఎం జగన్‌కు ఏసీఏ ప్రెసిడెంట్ పి.శరత్‌చంద్రారెడ్డి వివరించారు. టీ–20 టోర్నమెంట్ నిర్వహించుకునేందుకు బీసీసీఐ నుంచి అనుమతి తీసుకున్నట్టు వెల్లడించారు. -
విజయంతో ముగించారు
ముంబై: ఫైనల్ చేరే అవకాశాలు చేజారిన తర్వాత భారత మహిళల జట్టు మెరిసింది. ముక్కోణపు టి20 టోర్నీని విజయంతో ముగించింది. గురువారం నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బృందం 8 వికెట్లతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన (41 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) ఈ సిరీస్‌లో మూడో అర్ధ శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత స్పిన్నర్ల విజృంభణతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. వ్యాట్ (31; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనూజ పాటిల్ 3, రాధా యాదవ్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లే 9 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం బరిలో దిగిన భారత్ 15.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలుపొందింది. మిథాలీ రాజ్ (6), జెమీమా రోడ్రిగ్స్ (7) విఫలమైనా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (20 నాటౌట్)తో కలిసి స్మృతి మంధాన జట్టును గెలిపించింది. వీరిద్దరు అభేద్యమైన మూడో వికెట్‌కు 60 పరుగులు జత చేయడంతో మరో 26 బంతులు మిగిలుండగానే భారత్ విజయం సాధించింది. శనివారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య ఫైనల్ జరుగనుంది. -
టీ20 లీగ్ విజేత భద్రాద్రి జట్టు
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ టీ20 లీగ్ మ్యాచ్‌లలో భాగంగా మూడు రోజులుగా స్థానిక ప్రకాశం స్టేడియంలో జరిగిన నాలుగు జిల్లాల క్రికెట్ లీగ్ మ్యాచ్‌లు శుక్రవారం ముగిశాయి. ఒక్కొక్క జట్టుకు మిగిలిన మూడు జట్లతో జరిగిన మ్యాచ్‌లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు జైత్రయాత్రను కొనసాగించింది. భద్రాద్రి కొత్తగూడెం జట్టు ఘనవిజయం శుక్రవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా జట్టు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు మధ్య జరిగిన చివరి లీగ్‌మ్యాచ్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు ప్రారంభం నుంచే ధాటిగా ఆడి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 209 భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందు ఉంచింది. చెలరేగిన సాయికుమార్.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు వైస్ కెప్టెన్ సాయికుమార్ మరోసారి చెలరేగి 53 బంతుల్లో 11 సిక్స్‌లు, 10 ఫోర్లతో 124 పరుగులు చేశాడు. మిగిలిన క్రీడాకారుల్లో రాజ్ కుమార్ 20 పరుగులు చేయగా, నందురెడ్డి 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఖమ్మం జిల్లా జట్టు బౌలర్లలో హరీష్ 52/2, అభిలాష్ 35/2 వికెట్లు తీశారు. అనంతరం 210 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఖమ్మం జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసింది. జరిగిన నాలుగు మ్యాచ్‌లలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జట్టు విజయాలు నమోదు చేసుకోవడంతోపాటు ఆ జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన సాయికుమార్ అన్ని మ్యాచ్‌లలో ప్రతిభ చూపి ఆఖరు లీగ్ మ్యాచ్‌లో 53 బంతుల్లో 124 పరుగులు సాధించడంతో మ్యాన్ ఆ«ఫ్‌ది సిరీస్ అవార్డును దక్కించుకున్నాడు. ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరపున మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డుతోపాటు రూ.20 వేల నగదు బహుమతిని కొత్తగూడెం డీఎస్పీ ఎస్.ఎం.అలీ, ఒలంపిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవీకే మనోహార్, ఉమ్మడి జిల్లా క్రికెట్ అసోసియేషన్ గౌరవ కార్యదర్శి చేకూరి వెంకట్ ముగింపు సభలో సాయికుమార్‌కు అందజేశారు. సూర్యాపేట జట్టుపై మహబూబాబాద్ జట్టు విజయం చివరిరోజైన శుక్రవారం ప్రకాశం స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో మహమూబాబాద్ – సూర్యాపేట జట్లు తలపడగా, మహబూబాబాద్ జట్టు విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సూర్యాపేట 20 ఓవర్లలో 113 పరుగులు చేసి ఆలౌటయింది. జట్టులోని బి.అనిల్ 37, ఎస్.కె.ఫజల్ 21 రన్లు చేశారు. మహబూబాబాద్ జిల్లా జట్టు బౌలర్లలో ఎ.గణేష్ 11 పరుగులిచ్చి 3 వికెట్లు, బి.కుమార్ 19 పరుగులిచ్చి 2 వికెట్లు, జి.సత్య 22 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించారు. 114 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మహబూబాబాద్ జిల్లా జట్టు వికెట్ నష్టపోకుండా 13 ఓవర్లలో 114 పరుగులు చేసి ఘనవిజయం సాధించింది. జట్టులోని బి.కుమార్ 67, ఎ.గణేష్ 37 పరుగులు చేశారు. -
పాకిస్తాన్‌పై భారత్ విజయం
మహిళల ఆసియా కప్ టి20 బ్యాంకాక్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత జట్టు జైత్రయాత్ర సాగుతోంది. మంగళవారం చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (రెండు వికెట్లు.... 22 బంతుల్లో 26 నాటౌట్; 3 ఫోర్లు) ఆల్‌రౌండ్ షో... ఓపెనర్ మిథాలీ రాజ్ (57 బంతుల్లో 36; 3 ఫోర్లు) బాధ్యతాయుత బ్యాటింగ్‌తో అదరగొట్టడంతో భారత్ ఐదు వికెట్లతో గెలిచింది. ఈ టోర్నీలో భారత్‌కిది వరుసగా మూడో విజయం. అరుుతే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటీవలి వరకు ఈ మ్యాచ్ జరగడంపై సస్పెన్స నెలకొంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 97 పరుగులు చేసింది. నైన్ అబిది (37), ఆయేషా (28) టాప్ స్కోరర్లుగా నిలిచారు. నాలుగో ఓవర్ నుంచి ప్రారంభమైన వికెట్ల పతనం నిలకడగా సాగింది. ఏక్తా బిస్త్‌కు మూడు, హర్మన్ ప్రీత్, అనూజలకు రెండేసి వికెట్లు దక్కారుు. అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ను పాక్ బౌలర్లు ఇబ్బంది పెట్టి మ్యాచ్‌ను చివరి ఓవర్ వరకు తీసుకెళ్లారు. అరుుతే మిడిలార్డర్ బ్యాట్స్‌వుమన్ హర్మన్‌ప్రీత్ తుదికంటా నిలిచి కీలక ఇన్నింగ్స ఆడటంతో 19.2 ఓవర్లలో 5 వికెట్లకు 98 పరుగులు చేసి భారత్ గెలిచింది. -
విదేశాల్లో మినీ ఐపీఎల్!
సెప్టెంబర్‌లో యూఎస్ లేదా యూఏఈలో బీసీసీఐ వర్కింగ్ కమిటీ నిర్ణయం ధర్మశాల: విదేశాల్లో ‘మినీ ఐపీఎల్’ పేరిట టి20 టోర్నమెంట్‌ను నిర్వహించడానికి బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సెప్టెంబర్‌లో అమెరికా లేదా యూఏఈలో ఎనిమిది జట్లతో ఈ టోర్నీని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో దీంతో పాటు మరికొన్ని అంశాలపై కమిటీ చర్చించింది. ‘పొట్టి ఫార్మాట్లో టోర్నీ ఉంటుంది. ఇంటా, బయటా పద్ధతి ఉండదు కాబట్టి మ్యాచ్‌ల సంఖ్య కూడా తక్కువే. రెండు వారాల విండోలో ఈ టోర్నీని పూర్తి చేయాలి’ అని బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. గతేడాది చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీని రద్దు చేసిన నేపథ్యంలో బోర్డు మినీ ఐపీఎల్‌ను తెరమీదకు తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకా వెల్లడించాల్సి ఉంది. భారత జట్టు చీఫ్ కోచ్‌గా అనిల్ కుంబ్లే నియామాకానికి కూడా కమిటీ ఆమోద ముద్ర వేసింది. అండర్-19 క్రికెట్లోకి వచ్చే ఆటగాడు కేవలం రెండు సీజన్లు మాత్రమే ఆడాలన్న కమిటీ... అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఒకసారి మాత్రమే ఆడాలని నిబంధన విధించింది. టెస్టుల ప్రమోషన్‌కు ప్రత్యేక బడ్జెట్ టెస్టు క్రికెట్‌ను ప్రమోట్ చేసేందుకు ప్రత్యేకంగా బడ్జెట్‌ను కేటాయించాలని వర్కింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ సీజన్లో స్వదేశంలో 13 టెస్టులు జరగనున్న నేపథ్యంలో అంతర్జాతీయ మ్యాచ్‌లను బాగా మార్కెటింగ్ చేసేందుకు ఆయా రాష్ట్ర సంఘాలతో బోర్డు కలిసి పని చేయనుంది. రంజీ మ్యాచ్‌లను తటస్థ వేదికల్లో నిర్వహించాలన్న టెక్నికల్ కమిటీ నిర్ణయాన్నీ బోర్డు ఆమోదించింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ స్థానంలో కొత్తగా జోనల్ టి20 లీగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. -
'బంగ్లాను తక్కువగా అంచనా వేయోద్దు'
న్యూఢిల్లీ: ఎట్టిపరిస్థితుల్లోనూ బంగ్లాదేశ్ జట్టును తక్కువగా అంచనా వేయరాదని టీమిండియాను జట్టు డైరెక్టర్ రవిశాస్త్రి హెచ్చరించాడు. ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ... గెలవడం అలవాటుగా మార్చుకోవాలంటూ ఆసియా కప్ ఆడేందుకు బంగ్లాదేశ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లకు సూచించాడు. ఆసియా కప్ లో భాగంగా భారత్ తమ తొలి మ్యాచ్ ఆతిథ్య బంగ్లా జట్టుతో ఆడనుంది. ఆస్ట్రేలియాపై 3-0తో క్లీన్ స్వీప్, శ్రీలంకపై 2-1తో విజయంతో భారత్ చాలా జోష్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రతిసారీ ఆఖర్లో పోరాటం చేయడమే కాదు ఆరంభం నుంచే దూకుడుగా ఇన్నింగ్ మొదలెట్టాలని ఆటగాళ్లను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఎలాంటి పిచ్ లు తయారుచేసిన వెనకంజ వేయరాదని, గెలవాలన్న కసితో క్రికెట్ ఆడటం మీ పని అన్నాడు. కేవలం ప్రత్యర్థి జట్లు మాత్రమే మారతాయంటూ ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపేలా మాట్లాడాడు. పాక్, లంక బలమైన జట్టు అయినప్పటికీ బంగ్లాను తేలికగా తీసిపారేయోద్దు అని చురక అంటించాడు. గత కొన్నేళ్లుగా బంగ్లాను గమనిస్తున్నాను.. బంగ్లా జట్టు చాలా మెరుగైందిని గతంలో ఆ జట్టు చేతిలో వారి దేశంలో 1-2 తేడాతో వన్డే సిరీస్ పరాజయాన్ని ఈ సందర్భంగా టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి గుర్తుచేశాడు. -
యువరాజ్పైనే అందరి దృష్టి
* బరిలో హర్భజన్, నెహ్రా * నేటినుంచి ముస్తాక్ అలీ టి20 టోర్నీ న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత భారత టి20 జట్టులో పునరాగమనం చేసిన యువరాజ్ సింగ్ అంతర్జాతీయ మ్యాచ్‌లకు ముందు దేశవాళీలో తన టి20 సామర్థ్యాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. శనివారం ప్రారంభం కానున్న ముస్తాక్ అలీ టోర్నీలో అతను పాల్గొంటున్నాడు. వన్డేల్లో చెలరేగడం ద్వారా టీమిండియాకు మళ్లీ ఎంపికైన యువీ... టి20ల్లో ఎలా ఆడతాడనేది ఆసక్తికరం. ఐపీఎల్లో ఢిల్లీ జట్టు యువీని తప్పించడంతో ఫిబ్రవరిలో జరిగే వేలంలో మరో ఫ్రాంచైజీలకు అతను అందుబాటులోకి వస్తాడు. ఆలోగా ముస్తాక్ అలీ టోర్నీతో పాటు ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌లలో రాణిస్తే యువీ మరో సారి వేలంలో స్టార్‌గా ముందు వరుసలో నిలిచే అవకాశం ఉంది. పైగా టి20 ప్రపంచకప్ కోసం కూడా అతని అవకాశాలు మెరుగవుతాయి. యువీతో పాటు భారత జట్టులోకి ఎంపికైన సీనియర్లు హర్భజన్ సింగ్, ఆశిష్ నెహ్రా కూడా తమ ప్రదర్శనను, ఫిట్నెస్ను అంచనా వేసేందుకు ఈ టోర్నీ ఉపయోగపడనుంది. వన్డేల్లో స్థానం కోల్పోయిన సురేశ్ రైనా కూడా తన ఫేవరెట్ ఫార్మాట్లో సత్తా చాటేందుకు సన్నద్ధమయ్యాడు. కుర్రాళ్లకూ అవకాశం ఐపీఎల్ వేలం ఫిబ్రవరిలో జరగనుంది. దానికి కాస్త ముందు హడావిడిగా కాకుండా ఈ సారి ముస్తాక్ అలీ ట్రోఫీ జనవరి 20నే ముగుస్తోంది. కాబట్టి దేశవాళీ యువ ఆటగాళ్లను తమ జట్టులోకి తీసుకోవాలని భావించే ఫ్రాంచైజీలకు వారి ఆటపై ఓ అభిప్రాయానికి వచ్చేందుకు తగినంత సమయం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో ప్రదర్శన కుర్రాళ్లకు కూడా కీలకం కానుంది. విజయ్ హజారే తరహాలోనే అన్ని జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. పాయింట్ల ప్రకారం టాప్-2 జట్లు క్వార్టర్స్‌కు చేరతాయి. గ్రూప్ ఎ: హైదరాబాద్, బెంగాల్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, తమిళనాడు, విదర్భ గ్రూప్ బి: రాజస్థాన్, పంజాబ్, కేరళ, జమ్మూ కశ్మీర్, సౌరాష్ట్ర, త్రిపుర, జార్ఖండ్ గ్రూప్ సి: ఆంధ్ర, మధ్యప్రదేశ్, అస్సాం, బరోడా, ఢిల్లీ, రైల్వేస్, గోవా గ్రూప్ డి: ముంబై, ఒడిషా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, సర్వీసెస్ -
ఎంసీసీ టి20 జట్టులో యువరాజ్
మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రతి ఏటా నిర్వహించే టి20 టోర్నమెంట్ కోసం ఎంపిక చేసిన జట్టులో యువరాజ్ సింగ్‌కు స్థానం లభించింది. మార్చి 20న దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో యువీ ఎంసీసీ తరఫున బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీ తర్వాత ఎంసీసీ ప్రయోగాత్మకంగా ఓ డే నైట్ టెస్టు మ్యాచ్‌ను పింక్ బంతులతో నిర్వహించనుంది.