![ఎంసీసీ టి20 జట్టులో యువరాజ్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2017/09/2/41422561279_625x300.jpg.webp?itok=R7WgNC9x)
ఎంసీసీ టి20 జట్టులో యువరాజ్
మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రతి ఏటా నిర్వహించే టి20 టోర్నమెంట్ కోసం ఎంపిక చేసిన జట్టులో యువరాజ్ సింగ్‌కు స్థానం లభించింది. మార్చి 20న దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో యువీ ఎంసీసీ తరఫున బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీ తర్వాత ఎంసీసీ ప్రయోగాత్మకంగా ఓ డే నైట్ టెస్టు మ్యాచ్‌ను పింక్ బంతులతో నిర్వహించనుంది.