Marylebone Cricket Club
-
మన్కడింగ్‌ను రనౌట్‌గా మార్చడం సంతోషం.. కానీ
క్రికెట్లో ఎంసీసీ(మెరిల్బోర్న్ క్రికెట్ అసోసియేషన్) సవరించిన కొత్త రూల్స్ సంతోషం కలిగించాయని టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నాడు. ''ఎంసీసీ కమిటీ తీసుకొచ్చిన కొత్త రూల్స్ బాగున్నాయి.. అందులో కొన్నింటికి నేను మద్దతు ఇస్తున్నా. ముఖ్యంగా మన్కడింగ్ విషయంలో మార్పు తీసుకురావడం అభినందనీయం. క్రీజులో ఉన్న బ్యాటర్‌కు మన్కడింగ్ అనే పదం ఇబ్బందిగా అనిపించేది. తాజాగా మన్కడింగ్ పదాన్ని రనౌట్‌గా మార్చారు. నా దృష్టిలో మన్కడింగ్ అనేది రనౌట్‌గానే పరిగణిస్తారు. ఒక రకంగా ఇది మంచిదే అయినప్పటికి.. అందరికి సౌకర్యవంతంగా అనిపించకపోవచ్చు. ఇక రెండో రూల్ ఒక బ్యాట్స్‌మన్ క్యాచ ఔట్‌గా వెనుదిరిగినప్పుడు.. క్రీజులోకి కొత్త బ్యాటర్ రావాలనే నిర్ణయం కూడా బాగా నచ్చింది. ఎందుకంటే.. ఒక బౌలర్ వికెట్ తీసి సక్సెస్ ట్రాక్‌లో ఉండడం సక్సెస్‌గా కనిపించినప్పుడు.. అతను కొత్త బ్యాట్స్‌మన్‌కు బౌలింగ్ చేయడం కూడా ఫెయిర్‌గానే కనిపిస్తుంది. ఈ కొత్త రూల్ బాగుంది.. వెల్డన్'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక క్రికెట్ చట్టాలు చేసే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) మన్కడింగ్‌ను చట్టబద్ధం చేసింది. ఇది క్రికెట్లో రనౌట్! అంతేతప్ప క్రీడాస్ఫూర్తికి విరుద్ధమయ్యే మన్కడింగ్ కానే కాదిపుడు. ఎంసీసీ చేసిన పలు సవరణలను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అమోదించింది. అయితే ఇవన్నీ ఈ ఏడాది అక్టోబర్ తర్వాతే అమలవుతాయి. ఎంసీసీ సవరణలివి... ►సలైవా (ఉమ్ము), చెమటతో బంతిని రుద్దడం పూర్తిగా నిషిద్ధం. కరోనా వల్ల ఇప్పుడైతే చెమట, ఉమ్ముతో బంతిని షైన్ చేయడాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఇకపైనా కుదరదు. ►క్యాచ్ అవుట్ అయిన బ్యాటర్ సగం పిచ్ దాటినా కూడా కొత్త బ్యాటరే స్ట్రయిక్ చేయాలి. ఓవర్ చివరిబంతికి ఔటైతే తప్ప... సగం పిచ్ దాటిన నెపంతో నాన్ స్ట్రయికర్ బ్యాటింగ్ చేయడానికి వీలులేదు. ►ఫీల్డింగ్ సమయంలో ఎవరైన ఆటగాడు అనైతికంగా ఫీల్డ్‌లో కదిలితే ఇన్నాళ్లు అది డెడ్‌బాల్‌గానే పరిగణించేవారు. బ్యాటర్ భారీషాట్ ఆడినపుడు బ్యాటింగ్ జట్టుకు ఇది ప్రతికూలమయ్యేది. కానీ ఇప్పుడు బ్యాటింగ్ జట్టుకు అనుకూలంగా మార్చారు. ఫీల్డర్ అనుచిత మార్పు చేస్తే ప్రత్యర్థి (బ్యాటింగ్) జట్టు స్కోరుకు ఐదు పెనాల్టీ పరుగులు జతచేస్తారు. -
జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్‌లకు అరుదైన గౌరవం
లండన్: భారత మాజీ క్రికెటర్లు జవగళ్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్‌లకు ప్రసిద్ధ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)లో జీవితకాల సభ్యత్వం లభించింది. టెస్టు క్రికెట్ ఆడే 12 దేశాల నుంచి ఎనిమిది దేశాల క్రికెటర్లకు ఈ ఏడాది జీవితకాల సభ్యత్వం ఇచ్చినట్లు ఎంసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. మేటి పేసర్‌గా భారత జట్టుకు సేవలందించిన శ్రీనాథ్ ప్రస్తుతం ఐసీసీ ఎలైట్ మ్యాచ్ రిఫరీ ప్యానెల్లో ఉన్నారు. శ్రీనాథ్ తన అంతర్జాతీయ కెరీర్లో వన్డేల్లో 315 వికెట్లు, టెస్టుల్లో 236 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ మూడు ఫార్మాట్లలో కలిపి 711 వికెట్లు తీశాడు. చదవండి: T20 WC 2021: ఆఖరి ఓవర్లో నలుగురు ఔట్.. బౌలర్‌కు దక్కని హ్యాట్రిక్ -
ఇక ‘బ్యాట్స్‌మన్’ కాదు.. బ్యాటర్!
Batter Instead Of Batsman: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ నిబంధనలను రూపొందించే మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ఒక కీలక మార్పు చేసింది. కేవలం పురుష ఆటగాడినే గుర్తు చేసే ‘బ్యాట్స్‌మన్’కు బదులుగా ఇకపై మహిళలకు కూడా ఉపయోగించే విధంగా ‘బ్యాటర్’ పదాన్ని చేర్చాలని నిర్ణయించింది. క్రీడల్లో లింగ వివక్ష ఉండరాదని, సాంకేతిక పదాల్లో కూడా అది కనిపించరాదనే ఉద్దేశంతోనే ఈ మార్పు చేసినట్లు ఎంసీసీ ప్రకటించింది. ఇదే తరహాలో ‘బ్యాట్స్‌మెన్’ స్థానంలో ‘బ్యాటర్స్’ అని వ్యవహరిస్తారు. చదవండి: సంపాదనలో మెస్సీని దాటేశాడు.. ఏడాదికి 922 కోట్లు అర్జిస్తున్నాడు -
రూల్ ప్రకారం అతను నాటౌట్.. అదనంగా 5 పరుగులు కూడా
లండన్: దక్షిణఫ్రికా, పాక్ జట్ల మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో ప్రొటీస్ వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించి, డబుల్ సెంచరీకి చేరువగానున్న పాక్ బ్యాట్స్‌మెన్ ఫకర్ జమాన్(193; 155 బంతుల్లో 18x4, 10x6) రనౌట్‌కు కారణమయ్యాడని క్రికెట్ లామేకర్ మెరిల్బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) పేర్కొంది. డికాక్ ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యపై ఫీల్డ్ అంపైర్లు స్పందించకపోవటాన్ని ఎంసీసీ తప్పుపట్టింది. ఎంసీసీ రూల్ 41.5.1 ప్రకారం ఫీల్డర్లు మాటలతో కానీ సైగలతో కానీ బ్యాట్స్‌మెన్‌ను తప్పుదోవ పట్టించి, అతను వికెట్ కోల్పోవడానికి కారణమైతే ఫీల్డ్ అంపైర్లు జోక్యం చేసుకోవచ్చని ఎంసీసీ వివరణ ఇచ్చింది. Absolutely brilliant from #QuintonDeKock . Brilliant. @OfficialCSA #SAvPAK pic.twitter.com/6LIHaM9ZzV — Tweeter (@tweetersprints) April 4, 2021 ఫీల్డర్ల తప్పుడు సంకేతాల వల్ల బ్యాట్స్‌మెన్ రనౌటైతే, దాన్ని నాటౌట్‌గా పరిగణించాలని అంతేకాకుండా బ్యాట్స్‌మెన్ తీసిన పరుగులకు అదనంగా 5 పరుగులు కలపాలని, తరువాతి బంతిని ఎదుర్కొనే ఛాయిస్‌ను కూడా బ్యాట్స్‌మెన్‌కే ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొంది. ఫకర్ జమాన్ రనౌట్ వివాదంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎంసీసీ ఈ మేరకు స్పందించింది. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. కాగా, కెరీర్లో రెండో డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని 7 పరుగుల తేడాతో మిస్ చేసుకున్న పాక్ బ్యాట్స్‌మెన్.. రనౌట్ వివాదంలో డికాక్ తప్పేమీ లేదని పేర్కొనడం గమనార్హం. ఇదిలా ఉండగా, మ్యాచ్ చివరి ఓవర్లో డికాక్ ఉద్దేశపూర్వకంగా చేసిన సైగల కారణంగా ఫకర్ జమాన్ డబుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మార్క్రమ్ వేసిన త్రో బౌలర్ ఎండ్‌కు వెళ్తుందని భావించిన జమాన్.. అటువైపు దృష్టి మళ్లించేసరికి బంతి వికెట్లను తాకడంతో అతను రనౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో పర్యాటక పాక్ జట్టు 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చదవండి: ఐపీఎల్ ప్లేయర్స్‌కు కరోనా వ్యాక్సినేషన్: బీసీసీఐ ఉపాధ్యక్షుడు -
సంగక్కర పదవీకాలం పొడిగింపు
లండన్: ప్రతిష్టాత్మక మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా కుమార సంగక్కర మరో ఏడాది పాటు కొనసాగనున్నాడు. అతని పదవీ కాలాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు పొడిగించేందుకు ఎంసీసీ సిద్ధమైంది. ఈ మేరకు జూన్ 24న జరుగనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించి దీనిపై ఆమోదముద్ర వేయనున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. ‘కరోనా నేపథ్యంలో సంగక్కర పదవీ కాలాన్ని పొడిగించాలని కమిటీ నిర్ణయించింది. ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు. మామూలుగానైతే అధ్యక్షుని పదవీ కాలం 12 నెలలు మాత్రమే. కానీ అనుకోని పరిస్థితుల్లో దీన్ని పొడిగించే వెసులుబాటు ఉంది’ అని క్లబ్ పేర్కొంది. గతేడాది అక్టోబర్ 1న ఎంసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ఈ శ్రీలంక మాజీ ప్లేయర్... ఈ పీఠాన్ని అధిష్టించిన తొలి బ్రిటిషేతర వ్యక్తిగా ఘనత సాధించాడు. -
ఓవర్ త్రో: ఇలా చేస్తే బాగుండు: వార్న్
క్రికెట్లో ఓవర్ త్రో సహజం. కానీ ఆ ఒక్క ఓవర్ త్రో న్యూజిలాండ్‌కు ప్రపంచకప్‌ను దూరం చేసింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి ఓవర్లో గప్టిల్ విసిరిని బంతి స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లింది. దీంతో అంపైర్లు ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు కేటాయించారు. ఈ ఓవర్ త్రో కివీస్ ఓటమికి ప్రధాన కారణమైంది. అయితే అంపైర్ ఆరు పరగులు కేటాయించడం పెద్ద వివాదస్పదమైంది. దీంతో మరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్‌సీసీ) ఓవర్ త్రో నిబంధనలపై సమీక్ష చేపట్టింది. అయితే ఎమ్‌సీసీ సభ్యుడు, ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ ప్రపంచకప్ ఫైనల్ ఓవర్‌త్రోపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఓవర్ త్రో నిబంధనలపై ఎమ్‌సీసీ సమీక్ష నిర్వహిస్తున్నాం. ఎమ్‌సీసీలో సభ్యుడిగా నా వాదన వినిపించాను. ఫీల్డర్ విసిరిన బంతి క్రీజులో ఉన్న బ్యాట్స్‌మన్ శరీరానికి, బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళితే దానిని డెడ్‌బాల్‌గా పరిగణించాలి. అంతేకాకుండా బ్యాట్స్‌మెన్ పరుగు కూడా తీయొద్దు. ఎందుకంటే అది క్రీడా స్పూర్తికి విరుద్దం. ఓవర్ త్రో పరుగులు అనేవి మైదానంలో ఉన్న ఫీల్డింగ్ జట్టు తప్పిదం వల్లనే రావాలి కానీ.. ఎవరి తప్పిదం లేనప్పుడు వచ్చిన పరుగులను కౌంట్ చేయోద్దు అనేది నా వాదన ఇక ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్‌ను నేను స్వాగతిస్తున్నా. టెస్టు క్రికెట్‌ను బతికించేందుకు ఐసీసీ ముందడుగేసింది. అయితే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు టెస్టు ప్రమాణాలను పెంపొందించేలా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక టెస్టుల్లో ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, నంబర్లను కొందరు తప్పుబడుతున్నారు. కానీ అందులో ఏం తప్పు ఉందో అర్థం కావడం లేదు. జెర్సీలపై నంబర్లు, పేర్లు ఉంటే అభిమానులు ఆటగాళ్లను సులువుగా గుర్తుపట్టవచ్చు’అంటూ వార్న్ పేర్కొన్నాడు. చదవండి: ఆ విషయంలో ధర్మసేనది తప్పులేదు : ఐసీసీ నా జీవితంలో ఆ రోజే చెడ్డది.. మంచిది : గప్టిల్ నేను పొరపాటు చేశా: వరల్డ్‌కప్ ఫైనల్ అంపైర్ -
ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష!
ప్రపంచకప్ ఫైనల్లో చోటుచేసుకున్న అనూహ్య ఘటనతో ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష జరిపే యోచనలో మరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్‌సీసీ) ఉన్నట్లు ‘దిసండే టైమ్స్’ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి ఓవర్లో అనూహ్యంగా ఓవర్‌త్రో ద్వారా లభించిన పరుగులు మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నిబంధనలపై సమీక్ష జరిపి అవసరమైతే మార్చాలని క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎమ్‌సీసీ సబ్ కమిటీ భావిస్తోందని ఆ కథనం వెల్లడించింది. ఆఖరి ఓవర్లో గప్టిల్ విసిరిన బంతి అనూహ్యంగా బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అంపైర్లు ఇంగ్లండ్‌కు 6 పరుగులు కేటాయిచడం వివాదాస్పదమైంది. నిబంధనల ప్రకారం 5 పరుగులివ్వాల్సి ఉండగా అంపైర్లు ఆరు పరుగులిచ్చారని, మాజీ అంపైర్లు, ఆటగాళ్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని ఎమ్‌సీసీ భావిస్తోంది. -
‘అశ్విన్ తప్పులేదు.. మన్కడింగ్ ఉండాల్సిందే’
లండన్ : మన్కడింగ్ వివాదంలో చిక్కుకొని తీవ్ర విమర్శలపాలవుతున్న కింగ్స్‌ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్‌కు క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) మద్దుతుగా నిలిచింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో అశ్విన్.. రాజస్తాన్ ఆటగాడు జోస్ బట్లర్ మన్కడింగ్ విధానంలో ఔట్ చేసిన విషయం తెలిసిందే. బట్లర్ ఔట్ రాజస్తాన్ విజయవకాశాలు దెబ్బతీయగా.. పంజాబ్న విజయానికి కారణమైంది. అయితే అశ్విన్ క్రీడాస్పూర్తిగా విరుద్దంగా ప్రవర్తించాడని అభిమానులు, మాజీ క్రికెటర్లు అతనిపై దుమ్మెత్తిపోస్తున్నారు. దీంతో మన్కడింగ్ నిబంధన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఎంసీసీ ఆ నిబంధనపై వివరణ ఇచ్చింది. ఈ విషయంలో అశ్విన్‌ది ఏమాత్రం తప్పులేదని, అతడు నిబంధనల మేరకే నడుచుకున్నాడని స్పష్టం చేసింది. అంతేకాకుండా మన్కడింగ్ నిబంధన ఉండాల్సిన అవసరం ఎంతో ఉందని మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. చదవండి : మన్కడింగ్ ఔట్ అంటే ఏంటో తెలుసా? ‘ఈ నిబంధన ఎంతో ముఖ్యం. ఇది లేకుంటే నాన్‌స్ట్రైకర్స్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. బౌలర్ బంతి వేయకుండానే సగం పిచ్ దాటేస్తారు. ఇలా జరగకుండాలంటే ఈ నిబంధన ఉండాల్సిందే. ఇక బౌలర్ బ్యాట్స్‌మన్‌ను హెచ్చరించాలనే విషయం నిబంధనలో లేదు. ఇది క్రీడాస్పూర్తికి విరుద్దం కూడా కాదు. బౌలర్ బంతి వేయకుండానే నాన్‌స్ట్రైకర్ క్రీజు దాటితేనే రనౌట్ అవుతారు. ఒక వేళ అశ్విన్ కావాలనే అలా చేసి ఉంటే మాత్రం అది క్రీడా స్పూర్తికి విరుద్దం. కానీ అశ్విన్ అలా చేయలేదని చెప్పాడు. టీవీ అంపైర్ కూడా నిబంధనల ప్రకారమే ఔట్ ఇచ్చాడు. నాన్‌స్ట్రైకర్స్ మాత్రం ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. నిబంధనలకు విరుద్దంగా అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించకూడదు. బౌలర్లు కూడా నిబంధనలకు లోబడే టైమ్ ఫ్రేమ్‌లోనే బౌలింగ్ చేయాలి’ అని 41.16 నిబంధనపై ఎంసీసీ స్పష్టతనిచ్చింది. చదవండి: అశ్విన్ ఏందీ తొండాట..! -
‘మన్కడింగ్’ మారింది!
లండన్: మన్కడింగ్... క్రికెట్లో వివాదాస్పద నిబంధనల్లో ఒకటి. క్రికెట్ నియమావళి 42.15 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. దీన్ని 1947–48లో తొలిసారిగా భారత బౌలర్ వినూ మన్కడ్ చేయడంతో ఆయన పేరుమీదుగా మన్కడింగ్ నిబంధనగా మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నియమావళిలో చేర్చారు. అయితే ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని చాలా సందర్భాల్లో వివాదం జరిగింది. అయితే ఈ నిబంధనను ఎంసీసీ మార్చేసింది. ఇప్పుడు దీన్ని 41.16 నిబంధన ప్రకారం ‘బ్యాట్స్‌మన్ తప్పిదం’గా మార్చారు. పూర్తిగా బౌలర్‌కు అనుకూలమైన నిబంధనగా మారిందిపుడు. గతంలో బౌలర్ యాక్షన్‌కు ముందు మాత్రమే ఔట్ చేసే అవకాశముండేది. ఇప్పుడు యాక్షన్ (బంతి విడుదలకు ముందు చేయి పూర్తిగా తిరిగినా) తర్వాత కూడా ఔట్ చేసే వెసులుబాటు కల్పించారు. ఏప్రిల్ 12న మన్కడ్ జయంతి. పైగా ఈ ఏడాది శత జయంతి రోజే ఆయన పేరుతో ఉన్న నిబంధన మారడం గమనార్హం. -
గీత దాటితే వేటు పడుద్ది
లండన్: ఇక నుంచి మైదానంలో క్రికెటర్లు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడాల్సిందే! మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) రూపొందించిన కొత్త నియమావళిలో అంపైర్లకు మరిన్ని అధికారాలు రాబోతున్నాయి. మైదానంలో ఏమాత్రం అనుచితంగా ప్రవర్తించినా సంబంధిత ఆటగాడిని పెవిలియన్‌కు పంపే అధికారం వారికి ఉంటుంది. అలాగే క్రికెటర్లు వాడే బ్యాట్ల పరిమాణం కూడా తగ్గనుంది. అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. గతేడాది డిసెంబర్లో జరిగిన ఎంసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదనలకు ఎంసీసీ ఆమోదముద్ర వేసింది. -
జహీర్‌కు ఎంసీసీ గౌరవ సభ్యత్వం
ప్రఖ్యాత మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్‌కు జీవితకాల గౌరవ సభ్యత్వం ఇచ్చింది. భారత్ నుంచి ఈ గౌరవం దక్కిన 24వ క్రికెటర్ జహీర్. గత నెలలోనే సెహ్వాగ్ కూడా ఈ జాబితాలో చేరాడు. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో ఉండే ఈ క్లబ్ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌కు సేవలు అందించిన వారికి గౌరవ సభ్యత్వం ఇస్తుంది. ప్రస్తుతం 300 మందికిపైగా గౌరవ సభ్యులు ఈ క్లబ్లో ఉన్నారు. -
పిచ్‌ల నాణ్యతపై ఐసీసీ ఆందోళన
లండన్: ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ల సందర్భంగా ఆతిథ్య జట్లకు అనుకూలంగా పిచ్‌లను తయారుచేసుకోవడంపై ఐసీసీ క్రికెట్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. టెస్టు ఫార్మాట్ భవిష్యత్‌పై అనిల్ కుంబ్లే నేతృత్వంలోని ఈ కమిటీ శుక్రవారం సమావేశమైంది. విదేశీ పర్యటనల్లో ఆయా జట్లకు స్పిన్, మరికొన్ని చోట్ల బౌన్సీ పిచ్‌లు ఎదురయ్యే విష యం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న అంతర్జాతీయ క్రికెట్ స్వరూపాన్ని మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. అలాగే బ్యాట్స్‌మెన్ వాడే బ్యాట్ల పరిమాణంపై కచ్చితత్వంతో ఉండాలని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)కి కమిటీ సూచించింది. ఈ సమావేశానికి ఐసీసీ చైర్మన్ శశాంక్ మనోహర్, మీడియా ప్రతినిధిగా ఉన్న రవిశాస్త్రి హాజరుకాలేదు. -
ఎంసీసీ టి20 జట్టులో యువరాజ్
మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రతి ఏటా నిర్వహించే టి20 టోర్నమెంట్ కోసం ఎంపిక చేసిన జట్టులో యువరాజ్ సింగ్‌కు స్థానం లభించింది. మార్చి 20న దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లో యువీ ఎంసీసీ తరఫున బరిలోకి దిగుతాడు. ఈ టోర్నీ తర్వాత ఎంసీసీ ప్రయోగాత్మకంగా ఓ డే నైట్ టెస్టు మ్యాచ్‌ను పింక్ బంతులతో నిర్వహించనుంది. -
లార్డ్స్ డబుల్ సెంచరీ
క్రికెట్ మక్కా... లార్డ్స్ మైదానం గురించి చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు. ప్రపంచంలో ప్రతి క్రికెటర్‌కీ కనీసం ఒక్కసారైనా అక్కడ ఆడాలనేది కల. ప్రతి క్రికెట్ అభిమానికీ అక్కడ మ్యాచ్ చూడటం ఓ ఆశ. ఎందుకంటే ఇది క్రికెట్‌కు పుట్టినిల్లు. చరిత్రలో అత్యంత పురాతనమైన మైదానం కూడా ఇదే. ఎన్నో రికార్డులకు, క్రికెట్లో మరెన్నో మార్పులకు వేదికైన లార్డ్స్ మైదానం ఇప్పుడు మరో ఘనతను సొంతం చేసుకోబోతోంది. 1814లో స్థాపించిన ఈ గ్రౌండ్‌కు ఇప్పుడు 200 ఏళ్లు పూర్తి కానున్నాయి. అక్కడ ఆడటం ఓ కల లార్డ్స్ మైదానంలో 1814 జూన్ 22న మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్, హెర్ట్‌ఫోర్డ్‌షైర్ మధ్య తొలి మ్యాచ్ జరిగినట్లుగా చెబుతుంటారు. అయితే తొలి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ జరిగింది మాత్రం 1884లోనే. జూలై 21న లార్డ్స్‌లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఇప్పటిదాకా లార్డ్స్ 127 టెస్టు మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చింది. ఇక్కడ 55 వన్డేలు, 8 టి20 మ్యాచ్‌లు జరిగాయి. ఇక ప్రతీ క్రికెటర్ తన కెరీర్లో కనీసం ఒక్కసారైనా ఇక్కడ ఆడాలని..ఇదే మైదానంలో వ్యక్తిగతంగా సత్తా చాటి మధురానుభూతులను సొంతం చేసుకోవాలని కలలుకంటారు. కానీ ఈ మైదానం అందరికీ మధురానుభూతులను పంచలేదు. కొందరు మాత్రమే ఈ మైదానంలో సత్తా చాటడం ద్వారా తమ కలను నెరవేర్చుకున్నారు. ఇక్కడ టెస్టుల్లో సెంచరీ చేసే బ్యాట్స్‌మెన్ పేరును అలాగే ఒక ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, టెస్టు మ్యాచ్‌లో పది వికెట్లు తీసే బౌలర్ పేరును డ్రెస్సింగ్ రూమ్‌లో బోర్డుపై రాయడం ఆనవాయితీగా వస్తోంది. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ జీవితంలో లార్డ్స్‌లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అయితే అజిత్ అగార్కర్ తన టెస్టు కెరీర్లో చేసిన ఏకైక సెంచరీ ఇక్కడే నమోదు చేయడం విశేషం. ఇక వన్డేల్లో ఇక్కడ ఏ ఒక్క భారత బ్యాట్స్‌మెన్ కూడా సెంచరీ చేయలేకపోయాడు. ఆ పేరు వెనక... ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) కార్యకలాపాలు లార్డ్స్ మైదానం నుంచే నడుస్తున్నప్పటికీ ఈసీబీ మాత్రం ఈ మైదానంలో కిరాయిదారు మాత్రమే. ప్రపంచంలో పురాతన క్రికెట్ గ్రౌండ్ అయిన లార్డ్స్‌కు యజమాని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్. ఈ మైదానం వ్యవస్థాపకులు థామస్ లార్డ్. అతను ఇంగ్లిష్ ప్రొఫెషనల్ క్రికెటర్. అతని పేరే ఈ మైదానానికి పెట్టారు. ఇంగ్లండ్ రాజధాని లండన్‌లోని సెయింట్ జాన్స్ వుడ్ ప్రాంతంలో ఉంది. ప్రముఖ క్రికెట్ మ్యూజియం లార్డ్స్‌లోనే ఉంది. ఐసీసీ ప్రధాన కార్యాలయం 2005లో దుబాయ్‌కి మార్చకముందు ఇక్కడే ఉండేది. ఇప్పటికీ అదే పెవిలియన్ 200 ఏళ్ల చరిత్ర ఉన్న లార్డ్స్‌లో ఇప్పటిదాకా ఎన్నో మార్పులు జరిగాయి. కాలానుగుణంగా ఈ మైదానం మారుతూ వచ్చింది. అయితే 1889-90లో ఇక్కడ నిర్మించిన పెవిలియన్ (విక్టోరియన్ ఎరా పెవిలియన్) ఇప్పటికీ అలాగే ఉంది. స్టేడియం రూపురేఖలు మారినా ఈ పెవిలియన్ మాత్రం అలాగే ఉంది. ప్రపంచకప్ విజేత అయినా... యాషెస్ సిరీస్ విన్నర్ అయినా... లేక మరే సిరీస్ గెలిచినా... లార్డ్స్ పెవిలియన్‌లో షాంపేన్ విరజిమ్మడాన్ని గర్వంగా భావిస్తారు. అంతేకాదు ఆ మధురానుభూతిని ఎప్పటికీ మరిచిపోరంటే అతిశయోక్తి కాదేమో. 1983లో ప్రుడెన్షియల్ ప్రపంచకప్‌ను కపిల్‌దేవ్ అందుకున్న మధుర జ్ఞాపకాలు ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటాయి.