ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష! | MCC Likely To Review Overthrow Rules | Sakshi
Sakshi News home page

ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష!

Published Sat, Jul 20 2019 3:27 PM | Last Updated on Sat, Jul 20 2019 3:27 PM

MCC Likely To Review Overthrow Rules - Sakshi

ప్రపంచకప్‌ ఫైనల్లో చోటుచేసుకున్న అనూహ్య ఘటనతో ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష జరిపే యోచనలో మరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎమ్‌సీసీ) ఉన్నట్లు ‘దిసండే టైమ్స్‌’ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్లో ఆఖరి ఓవర్లో అనూహ్యంగా ఓవర్‌త్రో ద్వారా లభించిన పరుగులు మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేసిన విషయం తెలిసిందే.  దీంతో ఈ నిబంధనలపై సమీక్ష జరిపి అవసరమైతే మార్చాలని క్రికెట్‌ నిబంధనలు రూపొందించే ఎమ్‌సీసీ సబ్‌ కమిటీ భావిస్తోందని ఆ కథనం వెల్లడించింది.

ఆఖరి ఓవర్‌లో గప్టిల్‌ విసిరిన బంతి అనూహ్యంగా బెన్‌స్టోక్స్‌ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అంపైర్లు ఇంగ్లండ్‌కు 6 పరుగులు కేటాయిచడం వివాదాస్పదమైంది. నిబంధనల ప్రకారం 5 పరుగులివ్వాల్సి ఉండగా అంపైర్లు ఆరు పరుగులిచ్చారని, మాజీ అంపైర్లు, ఆటగాళ్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని ఎమ్‌సీసీ భావిస్తోంది.

 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement