MCC
-
నీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదల
నీట్ యూజీ-2024 తొలి రౌండ్ కౌన్సెలింగ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్ని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) విడుదల చేసింది. కాగా, నీట్ యూజీ కౌన్సెలింగ్ తొలి రౌండ్ ఆగస్ట్ 14 నుంచి రాష్ట్రాల వారీగా ప్రారంభమైంది. ఎంసీసీ సమాచారం మేరకు.. నీట్ యూజీ-2024 కౌన్సెలింగ్ నాలుగుసార్లు జరగనుంది. తాజాగా తొలిరౌండ్ కౌన్సెలింగ్ పూర్తయింది. అందులో ర్యాంక్, ప్రాధాన్యతలు, అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా అభ్యర్ధులకు ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను కేటాయించినట్లు ఎంసీసీ వెల్లడించింది. ఈ కౌన్సెలింగ్‌లో మొత్తం 26,109 మంది విద్యార్ధులకు సీట్లను కేటాయించింది.మొత్తం టాప్ 17 ర్యాంకులు సాధించిన విద్యార్ధులు ఎయిమ్స్ ఢిల్లీలో ఎంబీబీఎస్ సీట్లను సంపాదించారు. ఈ సందర్భంగా అర్హులైన విద్యార్ధులు ప్రొవిజినల్ అలాట్మెంట్ లెటర్స్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని ఎంసీసీ వెల్లడించింది.ఎంసీసీ ప్రకారం, రెండవ రౌండ్ కౌన్సెలింగ్ కోసం అవసరమయ్యే వైకల్య ధ్రువీకరణ పత్రాలు(పీడబ్ల్యూడీ) అవసరమయ్యే అభ్యర్థులు సెప్టెంబర్ 9, 2024 సాయంత్రం 5 గంటల లోపు సంబందిత కేంద్రాల నుంచి పొందాలని తెలిపింది. ఇతర వివరాల కోసం ఎంసీసీ కాల్ సెంటర్‌కు కాల్ చేసి తెలుసుకోవాలని, జన్మాష్టమి కారణంగా, ఎంసీసీ కాల్ సెంటర్ (సోమవారం)ఆగస్టు 26, 2024న ఉదయం 9 నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేస్తుందని ఎంసీసీ ప్రతినిధులు వెల్లడించారు.అభ్యర్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్ట్ చేయడానికి గడువు ఆగస్ట్ 29 వరకు ఇచ్చింది. ఆ తర్వాత మెడికల్ కాలేజీలు ఈ అభ్యర్థుల అడ్మిషన్ డేటాను వెరిఫై చేస్తాయి. ఇవి ఆగస్టు 30,31 మధ్య ఎంసీసీకి సమర్పిస్తాయి. -
‘అగ్నిపథ్’ స్కీమ్‌పై వ్యాఖ్యలు... క్లారిటీ ఇచ్చిన కాంగ్రెస్
న్యూఢిల్లీ:అగ్నిపథ్ స్కీమ్‌పై దేశ ప్రజలకు తామిచ్చిన హామీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎంసీసీ)పరిధిలోకే వస్తుందని ఎన్నికల కమిషన్(ఈసీ)కి కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఈ మేరకు పార్టీ ఈసీకి ఒక లేఖ రాసింది. సాయుధ దళాలను రాజకీయం చేయవద్దని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఈసీ సూచించిన నేపథ్యంలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.అగ్నిపథ్ స్కీమ్ విషయమై శుక్రవారం(మే24) ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఎక్స్ సర్వీస్‌మెన్ విభాగం చీఫ్ కల్నల్ రోహిత్ మీడియా సమావేశంలో స్పందించారు. ‘సాయుధ దళాలు దేశ భద్రత కోసం గొప్పగా పనిచేస్తున్నాయి. మేం కేవలం అగ్నిపథ్ స్కీమ్ గురించే మట్లాడుతున్నాం. ఈ స్కీమ్‌ను తీసుకువచ్చి ఆర్మీని మోదీ ప్రభుత్వం బలహీనపరిచింది. ఈ స్కీమ్ దేశ ప్రజలు, ఆర్మీ జవాన్ల ప్రయోజనాలకు ఎంత మాత్రం మేలు చేయదు. అందుకే రద్దు చేస్తాం’అని తెలిపారు. -
కోడ్ ఉల్లంఘిస్తే గట్టి చర్యలుండాలి!
ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థుల నైతిక వర్తన నియమావళి (మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ని తొలిసారి 1960లో రూపొందించారు. ఈ కోడ్‌ను ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలకు జారీ చేయడం 1979 నుంచి ఆనవాయితీగా మారింది. 1991లో పార్టీలన్నింటి అనుమతితో దీన్ని మరింత బలపరిచారు. కానీ రాజకీయ వాతావరణం పదును తేలినకొద్దీ, ఉల్లంఘనలు పెరిగాయి.కోడ్‌కు కట్టుబడి ఉండటం కంటే తప్పించుకునే మార్గాలను అన్వేషించేందుకే నేతలు ఇష్టపడుతుంటారు. కాబట్టి, వీలైనంత పారదర్శకంగా నిబంధనల ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలుంటాయో స్పష్టం చేయాలి. అదే సమయంలో, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా కోడ్‌ను మార్చాలి. ప్రజాజీవితంలో గౌరవ మర్యాదలను కొనసాగించేందుకు ఇది చాలా ముఖ్యం.‘చాలాసార్లు ఎన్నికలు ఒక మనిషిలోని చెడ్డతనపు పార్శా్వన్ని బయటికి తెస్తాయి, అవి ప్రతిసారీ మంచి మనిషి విజయానికి దారితీయవనేది కూడా నిశ్చయం’ అన్నారు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఆయన రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలోని ఈ పేరా ఎన్నికలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని లోటుపాట్లను ఎత్తిచూపుతుంది. అప్పటికి ఎన్నికల కమిషన్ లేదు... మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ– నైతిక వర్తన నియమావళి) కూడా లేదు.రాజకీయ నేతలు, వ్యవస్థలన్నింటి ప్రత్యేక సమ్మతితో ఏర్పడిందీ ఎంసీసీ. మార్పులు, చేర్పులతో కాలంతోపాటు ఎదుగుతూ వచ్చింది. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఎంసీసీపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. పార్టీలతో సహా నేతలు, అభ్యర్థులు... ఎన్నికల కమిషన్ కు సవాళ్లు విసురుతూనే ఉంటారు. ఇదంతా కూడా మీడియా నిఘా, న్యాయ వ్యవస్థ కీలక డేగ కన్ను మధ్యలోనే జరుగుతూంటుంది.కేరళతో మొదలు...గతాన్ని కొంచెం తరచి చూద్దాం. కేరళ అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా కొన్ని విధివిధానాలతో మొదలైందీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ప్రచార సభలు, ప్రదర్శనలు, ప్రసంగాలు, నినాదాలు, పోస్టర్లు, ప్లకార్డుల వంటివి ఎలా ఉండాలో ఈ విధి విధానాల్లో పొందుపరిచారు అప్పటి (1960) ఎన్నికల ప్రధాన అధికారి కేవీకే సుందరం. 1968లో ఎస్పీ సేన్ వర్మ ప్రధానాధికారిగా ఉండగా ఎన్నికల కమిషన్ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది. కేరళ ఎన్నికల సందర్భంగా రూపొందించిన విధి విధానాలను అందరికీ జారీ చేస్తూ, ఎన్నికలు సజావుగా జరిగేందుకు (ఫ్రీ అండ్ ఫెయిర్) కనీస మర్యాదలను పాటించాలని కోరింది. తరువాతికాలంలో అంటే 1979 నుంచి ఈ కోడ్‌ను సార్వత్రిక ఎన్నికల సంద ర్భంగా అన్ని పార్టీలకు జారీ చేయడం ఆనవాయితీగా మార్చారు అప్పటి సీఈసీ ఎస్.ఎల్. శక్ధర్. అంతేకాకుండా, రాజకీయ పార్టీల సమ్మతితో ఈ కోడ్‌ను మరింత విశదంగా రూపొందించారు. అధికార పార్టీకి కొన్ని పరిమితులు విధించడం, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడం వంటి చర్యలు అమల్లోకి వచ్చింది అప్పుడే. 1991లో టీఎ¯Œ శేషన్ ఎన్నికల ప్రధానాధికారిగా ఉండగా మరో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పార్టీలన్నింటి అను మతితో ‘కోడ్’ను మరింత బలపరిచారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకూ రాజకీయ వాతా వరణం మరింత పదును తేలింది. ఫలితంగా మోడల్ కోడ్ సామర్థ్యం మొద్దుబారింది. ఉల్లంఘనలు పెచ్చుమీరి పోయాయి. ఉల్లంఘనల పరిణామాలు స్పష్టం చేయాలి...ప్రస్తుతం అమల్లో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఉన్న ప్రధాన లోపం కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎటువంటి పరిణామాలను ఎదు ర్కోవాల్సి వస్తుందీ? అన్నది లేకపోవడం. అందుకే ఈ కోడ్... నిబంధనల ఉల్లంఘనలకు అడ్డు కావడం లేదు. కాబట్టి వీలైనంత పార దర్శకంగా నిబంధనల ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో స్పష్టం చేయాల్సి ఉంటుంది. విద్వేషపూరిత ప్రసంగాలు, కుల మతాలను అడ్డం పెట్టుకుని ఓట్లు అడగడం వంటి విషయాల్లో మరీ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది. ఓట్ల కోసం పెట్టే ప్రలోభాలు, ప్రత్యర్థి పార్టీలు, నేతల గురించి అసభ్యకరమైన సంభా షణలు, భారత సాయుధ దళాలను పొగుడుతూ లేదా విమర్శిస్తూ, చర్యలను ప్రశ్నిస్తూ చేసే ప్రసంగాల గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏ రకమైన ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలుఉంటాయో స్పష్టంగా, బహిరంగంగా ప్రకటించాలి.ఉదాహరణకు విద్వేషపూరిత ప్రసంగాల వంటి వాటికి ప్రచారంపై నిర్దిష్ట కాలం నిషేధం విధించడం, మరింత తీవ్రమైన ఉల్లంఘనలకు నిషేధ సమయాన్ని పొడిగించడం, అప్పటికీ ఉల్లంఘనలు మానకపోతే మోడల్ కోడ్ అమల్లో ఉన్నంత కాలం నిషేధాన్ని కొనసాగించడం చేయవచ్చు. ఇది కేవలం ప్రచార సభలకు మాత్రమే పరిమితం కాకుండా... మీడియాలో కనిపించడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటి వాటికీ వర్తించేలా నిబంధనలు రూపొందించాలి. ‘ఉల్లంఘనులు’ స్టార్ క్యాంపెయినర్లు అయితే తరువాతి ఎన్నికల్లో ఆ గుర్తింపు రద్దు చేయడం కూడా చేయవచ్చు. అయితే వీటి నుంచి తప్పించుకునేందుకు నేతలు సర్వశక్తులూ ఒడ్డుతారు. యుక్తులు పన్నుతారు కూడా. ఒకప్పుడు కండబలం ఉపయోగిస్తే ఇప్పుడు ఆ స్థానాన్ని ధన బలం ఆక్రమించింది. టెక్నాలజీ ఈ ఆయుధానికి మరింత పదును పెట్టింది. కోడ్‌కు కట్టుబడి ఉండటం కంటే తప్పించుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించేందుకు నేతలు మరింత ఎక్కువ ఇష్టపడుతూంటారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసీసీని రీమోడల్ చేయాల్సిన అవసరముంది. అది కూడా వివక్షకు తావులేని విధంగా అమలు చేసేలా ఉండాలి. ప్రజాజీవితంలో కొద్దోగొప్పో గౌరవ మర్యాదలను కొనసాగించేందుకు ఇది చాలా ముఖ్యం. పార్టీలకు నోటీసులు... కొత్త పంథా!ఎన్నికల కమిషన్ (ఈసీ) ఈ మధ్యకాలంలో ఓ కొత్త పంథాను ఎంచుకుంది. కోడ్ ఉల్లంఘించిన వ్యక్తులకు కాకుండా... ఆ వ్యక్తుల పార్టీలకు నోటీసులు పంపుతోంది. అయితే ట్రాఫిక్ ఉల్లంఘనలకు డ్రైవరే బాధ్యుడైనట్లు కోడ్ ఉల్లంఘనల బాధ్యత కూడా పార్టీది కాదన్నది గుర్తించాలి. పైగా ఈసీ నోటీసు ప్రాథమికంగా ఉల్లంఘనపై సంతృప్తి చెందిన తరువాతే వెళుతుందన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్లు, కీలక వ్యక్తులు కోడ్‌ను ఉల్లంఘిస్తే ఈసీ ఆ పార్టీపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడరాదు. ఈ చర్యలు జరిమానా కావచ్చు లేదా పార్టీ గుర్తులకు సంబంధించినదైనా కావచ్చు. అవసరమైతే ఈ రెండు రకాల చర్యలు కూడా తీసుకునేలా మార్పులు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా... ఉల్లంఘనలు జరిగిన 72 గంటల్లోపే చర్యలు తీసు కోవడం కూడా అవసరం. వీటికి సంబంధించి స్పష్టమైన పద్ధతి ఒకదాన్ని సిద్ధం చేయాలి. ఆలస్యంగా తీసుకునే తూతూ మంత్రపు చర్యల వల్ల ప్రజల్లో ఈసీపై నమ్మకం సడలుతుంది. కోడ్ ఉల్లంఘనలు ఎన్ని జరిగాయో ఒక జాబితా సిద్ధం చేసి వాటిల్లో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? ఎన్ని అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి? వంటి వివరాలను వెబ్సైట్లో ఉంచాలి.కోడ్ ఉల్లంఘనలను నేరుగా ఇతర చట్టాలకు అనుసంధానించడం జరిగితే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై పడుతుంది. అయితే, ఈ చర్యలన్నీ రాజ కీయ పార్టీలు కోడ్ విషయంలో స్వీయ నియంత్రణ పాటించేలా చేస్తాయా? ఇది మన రాజకీయ నేతల క్యారెక్టర్‌పై ఆధారపడిఉంటుంది. అయితే ఈ వ్యవహారాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించే వారి విచక్షణాధికారాలకు పరిమితి విధిస్తుందనడంలో సందేహం లేదు. తద్వారా ఎన్నికల ప్రధానాధికారిపై వివక్ష, ఏకపక్ష ధోరణివంటి ఆరోపణలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఉల్లంఘనలపై తీసుకునే చర్యలు నిర్దిష్ట కాలావధిలోగా పూర్తవుతాయన్న భరోసా ఎన్నికల కమిషన్ ప్రజలకు కల్పించడం కూడా అవసరమే. వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. నాయకత్వం వహిస్తున్న వారు ఆదర్శప్రాయంగా వ్యవహరిస్తే ఎలాంటి మోడల్ కోడ్లూ అవసరం ఉండదు.- వ్యాసకర్త ఎన్నికల మాజీ ప్రధాన అధికారి-అశోక్ లవాసా -
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిని చేయాలని వేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకుగాను మోదీని ఆరు సంవత్సరాల పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హుడిని చేయాలని వేసిన పిటిషన్ ఢిల్లీ హైకోర్టు ముందు సోమవారం(ఏప్రిల్29) విచారణకు వచ్చింది.ఇటీవల ఉత్తరప్రదేశ్ ఫిలిబిత్‌లో నిర్వహించిన ప్రచార సభలో ప్రధాని మోదీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడిగారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పిటిషనర్ కోరారు. అయితే పిటిషన్లో విచారించదగ్గ మెరిట్స్ ఏవీ లేవని కోర్టు అభిప్రాయపడింది. -
విమాన ఖర్చులు ప్రధాని నుంచి వసూలు చేయాలి: సంజయ్ రౌత్
ముంబై: తన పదవిని ఎన్నికల ప్రచారానికి వాడుకొని ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్‌సింగ్ ఆరోపించారు. ప్రధాని ప్రజల సొమ్మును ఎన్నికల ప్రచారానికి వాడుకుని ఉంటే దానిని వెంటనే రికవర్ చేయాలని రౌత్ డిమాండ్ చేశారు. ‘ప్రధాని ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు ప్రభుత్వ విమానాన్ని వాడితే దానికి అయిన ఖర్చు బిల్లులను బీజేపీయే చెల్లించాలి. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా ప్రధాని ప్రభుత్వ విమానాలు, హెలికాప్టర్లలోనే ప్రచారానికి వెళుతున్నారు. ఇటీవల ప్రధాని ముంబైలో పర్యటించి అదానీకి ఇచ్చేందుకుగాను భూమి ఎక్కడుందో వెతికారు. దారావీ స్లమ్ ఏరియా రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టారు. బీజేపీని తరిమికొట్టేందుకు ముంబై ఎప్పుడో డిసైడైంది’అని రౌత్ చెప్పారు. ఇదీ చదవండి.. ఎన్నికల బరిలో యువరాజులు, యువరాణులు -
Bengaluru: డీకే శివకుమార్‌పై ‘ఈసీ’కి బీజేపీ ఫిర్యాదు
బెంగళూరు: మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్(ఎన్నికల నియమావళి)ను ఉల్లంఘించారని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌పై బీజేపీ ఎన్నికల కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది. కర్ణాటక అసెంబ్లీ విధాన సౌధలోని డీకే శివకుమార్ ఆఫీసును పార్టీ కార్యక్రమాలకు వాడుతున్నారని ఫిర్యాదులో బీజేపీ పేర్కొంది. ‘విధాన సౌధలోని తన ఆఫీసును కాంగ్రెస్ ఆఫీసులా డీకే శివకుమార్ భావిస్తున్నారు. శనివారం(మార్చ్ 30) ఆయన తన విధాన సౌధ ఆఫీసులో నజ్మా నజీర్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే కార్యక్రమం పెట్టుకున్నారు. ఇది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను పూర్తిగా ఉల్లంఘించడమే’ అని డీకే శివకుమార్‌పై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేష్‌కుమార్ తెలిపారు. ఈ విషయంలో డీకే శివకుమార్‌పై కఠిన చర్యలు తీసుకుని గట్టి సందేశం పంపాలని ఎన్నికల కమిషన్‌ను ఈ సందర్భంగా సురేష్ కుమార్ కోరారు. ఇదీ చదవండి.. ఇండియా ర్యాలీలో టీఎంసీ ఎంపీ కీలక ప్రకటన -
వాస్తవాలపై ‘ఉక్కుపాదం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధి కార్యాలయాల ద్వారా నిరుద్యోగులకు నిరంతరం సేవలు అందిస్తున్నట్లు ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ కెరీర్ సర్వీసు(ఎన్సీఎస్) ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో 29 మోడల్ కెరీర్ సెంటర్ల(ఎంసీసీ) అభివృద్ధి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, ప్రణాళికాబద్ధంగా నిధులు విడుదల చేస్తోందని పేర్కొన్నారు. కానీ, ఈనాడు పత్రిక వాస్తవాలను వక్రీకరిస్తూ ‘ఉపాధిపై ఉక్కుపాదం’ పేరుతో అసత్య కథనాన్ని వండివార్చిందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4.99 కోట్ల ఎన్సీఎస్ నిధులతో 12 ఉపాధి కార్యాలయాలకు మరమ్మతులు చేసి కంప్యూటర్ పరికరాలను సమకూర్చడంతోపాటు పూర్తిస్థాయిలో ఎంసీసీ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఉపాది కార్యాలయాలు/ఎంసీసీ కేంద్రాల్లో అభ్యర్థుల వ్యక్తిగత హాజరు మేరకే రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ ప్రక్రియ జరుగుతుందన్న విషయాన్ని ఈనాడు పత్రిక గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. నిరుద్యోగులు తమ ధ్రువీకరణపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయాల్లో అధికారులను సంప్రదిస్తే ఉచిత రిజిస్ట్రేషన్, కెరీర్ కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2,07,971 మంది అభ్యర్థులు ఎన్సీఎస్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ డేటా ఆధారంగా ప్రణాళిక ప్రకారం ప్రతి నెలా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంసీసీ, ఏపీఎస్ఎస్డీసీ, సీడాప్ సమన్వయంతో 516 జాబ్ మేళాలు నిర్వహించి 28,362 మందికి ఉపాధి కల్పించినట్టు వివరించారు. ఇప్పటికే కొత్త జిల్లాల్లోనూ ఎంసీసీల నిర్వహణ కోసం కార్యాలయాల ఎంపిక చేసి అధికారులను నియమించామని నవ్య స్పష్టంచేశారు. -
20 నుంచి ఎంబీబీఎస్ సీట్లకు జాతీయ కౌన్సెలింగ్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత కోటా ఎంబీబీఎస్, బీడీ ఎస్ సీట్ల భర్తీకి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేయనున్నారు. కాలేజీలు, సీట్ల వివరాలను ఈ నెల 20వ తేదీన ఎంసీసీ, ఎన్ఎంసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, అదే రోజున ఉదయం పది గంటల నుంచి ఆన్లైన్ రిజిస్ట్రే షన్ప్రక్రియ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఇవ్వనున్నట్టు తెలిపింది. 29వ తేదీన సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేస్తారు. ఆగస్ట్ నాలుగో తేదీ నాటికి కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఆగస్ట్ 7 నుంచి 28వ తేదీ వరకూ రెండో దశ, ఆగస్ట్ 31వ తేదీ నుంచి సెపె్టంబర్ 18వ తేదీ వరకూ మూడో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మూడో దశలో మిగిలిన సీట్లకు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి స్ట్రే వెకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది. 15 శాతం అఖిల భారత కోటా కౌన్సెలింగ్‌లో.. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో 15 శాతం అఖిల భారత కోటా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. ఈ సీట్లలో జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చేరతారు. కాగా, ఈసారి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌ను మార్పు చేయాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) భావించింది. ఆ ప్రకారం అఖిల భారత స్థాయి కౌన్సెలింగ్, రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌ను ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించింది. కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి న అభ్యర్థనల మేరకు ఈసారి కొత్త విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అంటే అఖిల భారత కౌన్సెలింగ్ తర్వాతే రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆ మేరకు జాతీయ, రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌లు వేర్వేరు తేదీల్లో కొనసాగుతాయి. అయితే రాష్ట్రాల కౌన్సెలింగ్ ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై ఎన్ఎంసీ ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకటించలేదు. -
టీమిండియా మాజీ బౌలర్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక కమిటీలో చోటు
లండన్: ప్రతిష్టాత్మక మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) వరల్డ్ క్రికెట్ కమిటీలో భారత మాజీ పేసర్ జులన్ గోస్వామికి స్థానం లభించింది. ఆమెతో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్లు ఇయాన్ మోర్గాన్, హీతర్ నైట్లను కూడా కమిటీలోకి తీసుకున్నట్లు ఎంసీసీ చైర్మన్ మైక్ గ్యాటింగ్ వెల్లడించారు. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీలో భాగమైన వరల్డ్ క్రికెట్ కమిటీ కొత్తగా వచ్చే సాంకేతిక అంశాలను, వాటిని ఉపయోగించడానికి సంబంధించి తగిన సూచనలు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎంసీసీ ప్రధాన కేంద్రం లార్డ్స్ మైదానంలో ఉంది. లార్డ్స్‌లోనే జరిగిన ఫైనల్ మ్యాచ్‌లలో 2019 వన్డే వరల్డ్ కప్, 2017 వన్డే వరల్డ్ కప్‌లలో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. ఈ టీమ్‌లకు మోర్గాన్, హీతర్ నైట్ కెప్టెన్లుగా వ్యవహరించారు. గత ఏడాది ఇదే లార్డ్స్ మైదానంలో తన ఆఖరి వన్డే ఆడి జులన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఓవరాల్‌గా మూడు ఫార్మాట్లలో కలిపి 355 వికెట్లు పడగొట్టిన జులన్‌కు ఈ ఏడాదే ఎంసీసీ గౌరవ సభ్యత్వం దక్కింది. -
మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం ఏమి తప్పుకాదు..
Mayank Agarwal fielding on his knees against NZ is certainly not unfair: కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్-భారత్ మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం ప్రస్తుతం చర్చానీయాంశమైంది. దీనిపై మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ క్రికెట్ సలహాదారు జానీ సింగర్ స్పందించారు. క్రికెట్లోని ఏ చట్టం కూడా మోకాళ్లపై ఫీల్డింగ్ చేయకూడదని తెలపలేదు అని సింగర్ చెప్పారు. ఆధునిక క్రికెట్లో మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం సర్వసాధారణమైందని అతను తెలిపారు. "ఫీల్డర్ మోకాళ్లపై ఫీల్డింగ్ చేయకూడదని క్రీడా చట్టాలలో ఏమీ లేదు. నిజానికి, ఇది ప్రస్తుత క్రికెట్లో చాలా సాధారణం. మోకాళ్లపై ఫీల్డింగ్ చేయడం ఖచ్చితంగా తప్పు కాదు. కానీ బౌలర్ బంతి వేసిన తర్వాత ఫీల్డర్ తన పొజిషన్‌ను మార్చుకుని మోకాళ్లపై ఫీల్డింగ్ చేస్తే అది కచ్చితంగా చట్ట ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. అప్పడు నిర్ణయం ఆన్-ఫీల్డ్ అంపైర్‌తో ముడి పడి ఉంటుంది అని సింగర్ పేర్కొన్నాడు. చదవండి: IND vs NZ: ఒక్క వికెట్.. అప్పుడు గెలుపు.. ఇప్పుడేమో ఇలా -
‘అంపైర్స్ కాల్’ కథ ముగియనుందా?
న్యూఢిల్లీ: అంపైర్స్ కాల్.. 2016లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రవేశపెట్టిన ఈ నిబంధన ఆన్- ఫీల్డ్ అంపైర్ల నిర్ణయానికి అధిక ప్రాధాన్యం కల్పించింది. బ్యాట్స్‌మన్ ఔట్/ నాటౌట్ విషయంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్‌కు వదిలిపెట్టడమే అంపైర్స్ కాల్. ఇక్కడ ఫీల్డ్ అంపైర్ డెసిషన్‌పైనే రివ్యూ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఫీల్డ్ అంపైర్ తొలుత తీసుకున్న నిర్ణయానికే కట్టుబడతాడు. కొన్నిసార్లు ఇది సరైన నిబంధనే అనిపించినా, చాలా సందర్భాల్లో అంపైర్స్ కాల్ వివాదాలకు దారి తీసింది. ఇటీవల భారత్- ఇంగ్లండ్ మధ్య చెన్నైలో జరిగిన రెండో టెస్టులో భాగంగా ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ జో రూట్ అవుట్ విషయంపై కూడా దుమారం చెలరేగింది. టీమిండియా బౌలర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ తీసుకున్న నిర్ణయంతో భారత్ తీవ్ర నిరాశకు గురైంది. అక్షర్ వేసిన బాల్‌ను రూట్ ఎదుర్కోగా అది నేరుగా కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో పడింది. అయితే అది రూట్ బ్యాట్‌ను తాకుతూ వెళ్లిందనుకొని టీమిండియా అంపైర్‌కు క్యాచ్ అప్పీల్ చేసింది. కానీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో భారత కెప్టెన్ కోహ్లి డీఆర్ఎస్కు వెళ్లాడు. రీప్లేలో భాగంగా బంతి జో రూట్ ప్యాడ్‌ను తాకినట్లు కనిపించినా ఎక్కడా ఎడ్జ్ అవ్వలేదని తేలింది. దీంతో ఎల్బీకి ఏమైనా చాన్స్ ఉందేమోనని థర్డ్ ఎంపైర్ మరోసారి పరిశీలించగా, ప్యాడ్లు తాకుతూ ఆఫ్‌స్టంప్ మీదుగా బంతి వెళ్లినట్లు కనిపించింది. దీంతో అవుట్ అని రిప్లేలో స్పష్టమైంది. కానీ బంతి ప్రభావం ఆఫ్ స్టంప్‌పై ఉండటంతో ఆ నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే థర్డ్ అంపైర్ అప్పచెప్పాడు. దాంతో తొలుత నాటౌట్ నిర్ణయానికే ఫీల్డ్ అంపైర్ కట్టుబట్టాడు. రూట్ బతికిపోయాడు. ఇక్కడ చదవండి: సన్‌రైజర్స్‌కు వార్నర్ షాక్ ఇవ్వనున్నాడా! దీంతో కోహ్లి కాసేపు ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనత్తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్స్ కాల్ నిబంధన వల్ల కలిగిన నష్టానికి ఇదొక నిదర్శనం వంటిది.ఇలాంటి ఘటనల ఆధారంగా ఈ రూల్‌కు స్వస్తి పలకాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ నిబంధనలు రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) తాజా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఆసీస్ దిగ్గజం రిక్కీ పాంటింగ్, శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర తదితరులతో కూడిన కమిటీ తమ ఎజెండాలో భాగంగా.. ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్స్ కాల్ నిబంధనను రద్దు చేసేందుకు సముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. ‘‘డెసిషన్ రివ్యూ సిస్టం ద్వారా తేలిన ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్స్ కాల్ ఎంతమేరకు ఉపయోగకరం అన్న అంశంపై చర్చ జరిగింది. ఈ నిబంధన కారణంగా ఆడియెన్స్ కాస్త గందరగోళానికి గురవ్వాల్సి వస్తుందన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. ఒకవేళ రివ్యూలో అవుట్/ నాటౌట్(ఎల్బీడబ్ల్యూ) అని తేలితే అంపైర్స్ కాల్‌తో సంబంధం లేకుండా ఏదొక నిర్ణయానికి థర్డ్ అంపైర్ కట్టుబడి ఉండాలని కమిటీ పేర్కొంది’’ అని ఎంసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో మరికొంత మంది సభ్యులు మాత్రం.. ప్రస్తుత విధానంతో వారు సంతృప్తిగానే ఉన్నారని, బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎన్నో ఏళ్లుగా అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఎన్నో ఫలితాలు తేలాయని, దీనిని కొనసాగించడం వల్ల నష్టమేమీలేదని పేర్కొన్నట్లు వెల్లడించింది. కమిటీ అభిప్రాయాలను, ప్రతిపాదనలను ఐసీసీకి పంపనున్నట్లు వెల్లడించింది. -
233 ఏళ్ల ఎంసీసీ చరిత్రలో..
లండన్: దాదాపు రెండు శతాబ్దాల సుదీర్ఘ ప్రస్తానం కల్గిన క్రికెట్ లామేకర్ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. 233 ఏళ్ల తర్వాత ఒక మహిళను ఎంసీసీ అధ్యక్ష పీఠంపై కూర్చొబెట్టనుంది. ఇంగ్లండ్ మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ క్లేర్ కానర్‌ను ఎంసీసీ ప్రెసిడెంట్‌గా నియమించింది. అయితే ఆమె వచ్చే ఏడాది అక్టోబర్ 21వ తేదీన బాధ్యతలు తీసుకోనున్నారు. ఎంసీసీ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా స్థానంలో కానర్‌ను నియమించారు. (టై అంటే టై.. సూపర్ ఓవర్ ఏమిటి?) ఎంసీసీ అనేది లండన్ కేంద్రగా ఏర్పడింది. క్రికెట్లో చట్ట పరమైన అంశాలను చూసేందుకు దీనిని 1787 లో స్థాపించారు. కాగా, ఎంసీసీని 2005లో దుబాయ్ హెడ్ క్వార్టర్స్‌గా ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద చరిత్ర ఉన్న ఈ క్లబ్‌కు మొదటిసారి ఒక మహిళను ఎంసీసీ అధ్యక్షురాలుగా . అయితే, క్లేర్ కానర్ ఈ పదవిలో రావటానికి ఏడాదికి పైగా వేచి ఉండాలి. తన పదవీ కాలం వచ్చే ఏడాది ముగిసి పోనుండటంతో కుమార్ సంగక్కర స్వయంగా ఆమె నామినేషన్‌ను ప్రకటించారు. ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మహిళల క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ కానర్ ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఎంసీసీ అధ్యక్ష పదవికి కొనార్ ఎంపికైనట్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెల్లడించారు. కాగా, దీనికి ముందు ఆమె మెర్ల్‌బోన్ క్రికెట్ క్లబ్ సభ్యుల ఆమోదం పొందాల్సి ఉన్నా అది లాంఛనమే. ('కోపం వచ్చింది.. కానీ ఏం చేయలేకపోయా') 10 ఏళ్ల పాటు సేవలు.. ఎంసీసీ అధ్యక్షురాలిగా ఎంపికైన కానర్ పదేళ్ల పాటు ఇంగ్లండ్ మహిళా జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. తన కెరీర్లో 16 టెస్టులు, 93 వన్డేలును ఆమె ఆడారు. టెస్టుల్లో 24 వికెట్లు సాధించగా, వన్డేల్లో 80 వికెట్లను ఖాతాలో వేసుకున్నారు. ఆమెకు రెండు అంతర్జాతీయ టీ20లు ఆడిన అనుభవం కూడా ఉంది. 2005లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆమె సారథ్యంలో ఇంగ్లండ్ మహిళా జట్టు తొలిసారి సిరీస్‌ను దక్కించుకుంది. దాంతో 42 ఏళ్ల చరిత్రను ఆమె లిఖించారు. ప్రస్తుతం ఈసీబీ మహిళ క్రికెట్ జట్టు హెడ్‌గా కొనసాగుతున్నారు. కరోనా వైరస్ కారణంగా సంగక్కరా రెండో దఫా అధ్యక్షుడిగా కొనసాగే అవకాశం దక్కింది. అతని పదవీ కాలం సుమారు ఏడాది కాలం ఉండగా, కానర్‌ను ఆ స్థానంలో ఎంపిక చేయడం విశేషం. -
పాక్‌కు వెళ్లే సంగక్కర జట్టు ఇదే..
లండన్: వచ్చే నెలలో పాకిస్తాన్లో పర్యటించనున్న కుమార సంగక్కర నేతృత్వంలోని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) జట్టును ప్రకటించారు. ఈ మేరకు 12 మందితో కూడిన ఇంగ్లిష్ కౌంటీ క్లబ్ జట్టును ఎంసీసీ తాజాగా వెల్లడించింది. ఈ జట్టులో సంగక్కర సారథిగా వ్యవహరిస్తుండగా, మరో సీనియర్ క్రికెటర్ రవి బొపారాను సైతం ఎంపిక చేశారు. పాక్ పర్యటనలో ఎంసీసీ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో రెండు మ్యాచ్‌లను పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) జట్లైన లాహోర్ క్వాలండర్స్-ముల్తాన్ సుల్తాన్స్‌తో ఎంసీసీ ఆడనుంది. ఇక మూడో మ్యాచ్‌ను పాకిస్తాన్ దేశవాళీ టీ20 మ్యాచ్ విజేత నార్తరన్తో ఎంసీసీ జట్టు తలపడుతోంది. తమ దేశంలో క్రికెట్‌ను బతికించాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన విజ్ఞప్తిని ఎంసీసీ గత నెల్లో ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఎంసీసీ నుంచి ఒక జట్టును పాకిస్తాన్ పర్యటనకు పంపడానికి సమాయత్తమైంది. ఎంసీసీ అధ్యక్షుడిగా ఉన్న సంగక్కర సారథ్యంలోని జట్టు.. పాకిస్తాన్ పర్యటనకు పంపాలని నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ తరహా దేశాల్లో క్రికెట్‌ను బ్రతికించడం చాలా ముఖ్యమని భావించిన ఎంసీసీ.. పాక్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయనే చెప్పాలనే ఉద్దేశంతోనే తమ జట్టును అక్కడకు పంపుతుంది. 2009లో పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ ప్రమాదంలో పలువురు క్రికెటర్లు గాయాలు బారిన పడ్డా ప్రాణ నష్టం జరగలేదు. ఆ ఘటనలో కుమార సంగక్కర సైతం గాయపడ్డాడు. అప్పట్నుంచి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి విదేశీ జట్లు భయపడుతున్నాయి. భద్రతాపరంగా అన్ని హామీలు లభించిన తర్వాత అందుకు సమాయత్తమవుతున్నాయి. ఆ దాడి తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వరల్డ్ ఎలెవన్ జట్టు ఒకసారి వెళ్లగా, శ్రీలంక అక్కడకు తరుచూ వెళుతూనే ఉంది. ఇటీవల శ్రీలంక జట్టు.. పాకిస్తాన్లో టెస్టు సిరీస్ ఆడింది. ఆ దాడి తర్వాత పాక్‌లో ఇదే తొలి టెస్టు సిరీస్ కాగా, ప్రస్తుతం బంగ్లాదేశ్ సైతం పాకిస్తాన్ పర్యటనలో ఉంది. దీనిలో భాగంగా ఇప్పటికే మూడు టీ20ల సిరీస్ ఆడిన బంగ్లాదేశ్.. పాక్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు సిద్ధమైంది. పాక్‌కు వెళ్లే ఎంసీసీ జట్టు ఇదే.. కుమార సంగక్కర(కెప్టెన్), రవి బొపారా, మైకేల్ బర్జెస్, ఒలివర్ హానన్, ఫ్రెడ్ క్లాసెన్, మైకేల్ లీస్క్, అర్రోన్ లిల్లీ, ఇమ్రాన్ క్వాయమ్, విల్ రోడ్స్, సఫ్యాన్ షఫ్రీ, వాన్ డెర్ మెర్వీ, రాస్ వైట్లీ -
పాకిస్తాన్ టూర్‌కు కెప్టెన్‌గా సంగక్కరా
లండన్: తమ దేశంలో క్రికెట్‌ను బతికించాలంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చేసిన విజ్ఞప్తిని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) మన్నించింది. ఈ మేరకు ఎంసీసీ నుంచి ఒక జట్టును పాకిస్తాన్ పర్యటనకు పంపడానికి సమాయత్తమైంది. దానిలో భాగంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో లాహోర్‌కు జట్టును పంపడానికి అంగీకరించింది. అయితే పాకిస్తాన్ పర్యటనకు వచ్చే ఎంసీసీ జట్టు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరా నేతృత్వం వహించనున్నాడు. ఈ విషయాన్ని ఎంసీసీ తాజాగా ధృవీకరించింది. ఎంసీసీ అధ్యక్షుడిగా ఉన్న సంగక్కరా సారథ్యంలోని జట్టు.. పాకిస్తాన్ పర్యటనకు వస్తుందని స్పష్టం చేసింది. ‘ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న పాకిస్తాన్ తరహా దేశాల్లో క్రికెట్‌ను బ్రతికించడం చాలా ముఖ్యం. పాకిస్తాన్లో క్రికెట్‌ను కాపాడుకోవడానికి పీసీబీ ఇప్పటికే పలు మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించింది. అందుకు మేము కూడా సిద్ధం ఉన్నాం’ అని ఎంసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. 2009లో పాకిస్తాన్ పర్యటనలో ఉన్న శ్రీలంక క్రికెటర్ల బస్సుపై ఉగ్రదాడి జరిగింది. ఆ ప్రమాదంలో పలువురు క్రికెటర్లు గాయాలు బారిన పడ్డా ప్రాణ నష్టం జరగలేదు. ఆ ఘటనలో కుమార సంగక్కరా సైతం గాయపడ్డాడు. అప్పట్నుంచి పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడానికి విదేశీ జట్లు భయపడుతున్నాయి. భద్రతాపరంగా అన్ని హామీలు లభించిన తర్వాత అందుకు సమాయత్తమవుతున్నాయి. ఆ దాడి తర్వాత పాకిస్తాన్ పర్యటనకు వరల్డ్ ఎలెవన్ జట్టు ఒకసారి వెళ్లగా, శ్రీలంక అక్కడకు తరుచూ వెళుతూనే ఉంది. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనలోనే ఉంది. ఇరు జట్ల మధ్య ఇప్పటికే తొలి టెస్టు జరగ్గా అది డ్రాగా ముగిసింది. అయితే రెండో టెస్టు గురువారం నుంచి కరాచీలో ఆరంభం కానుంది. ఆ దాడి తర్వాత పాకిస్తాన్లో ఒక ద్వైపాక్షిక టెస్టు సిరీస్ జరగడం ఇదే తొలిసారి. -
ఎంసీసీ మీటింగ్‌కు గంగూలీ దూరం
కోల్‌కతా: క్రికెట్ లా మేకర్ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) నిర్వహించే సమావేశానికి అందులో సభ్యుడిగా ఉన్న భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ దూరం కానున్నాడు. ఆగస్టు 11, 12వ తేదీల్లో మైక్ గాటింగ్ అధ్యక్షతను జరుగనున్న సమావేశానికి తాను రావడం లేదని గంగూలీ స్పష్టం చేశాడు. తన తల్లికి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చికిత్స అందించాల్సి ఉందని, దాంతో తాను మీటింగ్‌కు రావడం లేదని గంగూలీ తెలియజేశాడు. క్రికెట్లో ఏమైనా వివాదాలు తలెత్తితే ఎంసీసీ మీటింగ్‌లో సమీక్షిస్తారు. ఒకవేళ మార్పులు అనివార్యమైన పక్షంలో ఏమి చేస్తే బాగుంటుందనేది ఎంసీసీ సూచిస్తుంది. ఏడాదికి రెండుసార్లు ఎంసీసీ సమావేశం జరుగుతుంది. దానిలో భాగంగానే ఆది, సోమ వారాల్లో సమావేశం నిర్వహించనున్నారు. దీనికి సంబంధంచి మీడియాతో మాట్లాడిన గంగూలీ.. ఎంసీసీ మీటింగ్‌లో పాల్గొనడం లేదని పేర్కొన్నాడు. ఇక భారత క్రికెటర్లను నాడా(నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ) పరిధిలోకి తీసుకురావడంపై గంగూలీ స్పందించలేదు. -
ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష!
ప్రపంచకప్ ఫైనల్లో చోటుచేసుకున్న అనూహ్య ఘటనతో ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష జరిపే యోచనలో మరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎమ్‌సీసీ) ఉన్నట్లు ‘దిసండే టైమ్స్’ అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఆఖరి ఓవర్లో అనూహ్యంగా ఓవర్‌త్రో ద్వారా లభించిన పరుగులు మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ నిబంధనలపై సమీక్ష జరిపి అవసరమైతే మార్చాలని క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎమ్‌సీసీ సబ్ కమిటీ భావిస్తోందని ఆ కథనం వెల్లడించింది. ఆఖరి ఓవర్లో గప్టిల్ విసిరిన బంతి అనూహ్యంగా బెన్‌స్టోక్స్ బ్యాట్‌కు తగిలి బౌండరీ వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అంపైర్లు ఇంగ్లండ్‌కు 6 పరుగులు కేటాయిచడం వివాదాస్పదమైంది. నిబంధనల ప్రకారం 5 పరుగులివ్వాల్సి ఉండగా అంపైర్లు ఆరు పరుగులిచ్చారని, మాజీ అంపైర్లు, ఆటగాళ్లు మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఓవర్‌త్రో నిబంధనలపై సమీక్ష జరపాల్సిన అవసరం ఉందని ఎమ్‌సీసీ భావిస్తోంది. -
అమల్‌రాజ్‌కు జీవిత సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: తమ జట్టుకు విశేష సేవలందించిన భారత ఫుట్‌బాల్ మాజీ క్రీడాకారుడు, హైదరాబాద్ ప్లేయర్ విక్టర్ అమల్‌రాజ్‌ను కోల్‌కతాకు చెందిన ప్రతిష్టాత్మక ఫుట్‌బాల్ క్లబ్ మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ (ఎంఎస్సీ) గొప్ప గౌరవంతో సత్కరించింది. ఆయన సేవలను కొనియాడుతూ అమల్‌రాజ్‌కు ‘జీవితకాల సాఫల్య పురస్కారాన్ని’ అందజేసింది. కోల్‌కతాలో జరిగిన ఈ కార్యక్రమంలో కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఫిర్హాద్ హకీమ్ ముఖ్య అతిథిగా విచ్చేసి అమల్‌రాజ్‌కు అవార్డును అందజేశారు. భారత ఫుట్‌బాల్ జట్టుకూ సారథ్యం వహించిన ఆయన ... మొహమ్మదాన్ స్పోర్ట్స్ క్లబ్‌కు 6 పర్యాయాలు ఆడారు. 1980లో ఎంఎస్సీ కెప్టెన్‌గా ఎంపికై పలు టోర్నమెంట్లలో జట్టును విజేతగా నిలిపారు. 1978, 1979, 1980, 1983, 1985, 1989లలో అమల్‌రాజ్ ఎంఎస్సీకి ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం అమల్‌రాజ్ భారత ఆహారసంస్థ (ఎఫ్‌సీఐ)లో డీజీఎం హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. . -
టెస్టులూ కావాలి మాకు!
బెంగళూరు: సంప్రదాయక టెస్టు క్రికెట్ ప్రాభవం కోల్పోతోందని... ఐదు రోజుల ఆటకు క్రమంగా కాలం చెల్లుతోందని ఈ మధ్య తరచూ వార్తలొస్తున్నాయి. కానీ మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) నిర్వహించిన సర్వేలో మాత్రం ఈ వార్తల్లో నిజం లేదని తేలింది. ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో 86 శాతం మంది క్రికెట్ అభిమానులు టెస్టులకు జై కొట్టారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌తోపాటు తమకు టెస్టులు చూడటం కూడా ఇష్టమేనని 86 శాతం ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఎంసీసీ టెస్టు క్రికెట్ సర్వేను వంద దేశాల్లో నిర్వహించింది. ఇందులో 13 వేల మంది క్రికెట్ ప్రేక్షకులు పాల్గొన్నారు. టెస్టు క్రికెట్ మరింత విజయవంతం కావడానికి ఆ అభిమానులు విలువైన సూచనలూ ఇచ్చారు. వాటిలో కొన్ని ఇలా ఉన్నాయి. ఈ మ్యాచ్‌లకు అందుబాటులో ఉన్న టికెట్ల వివరాల్ని, ధరతో పాటు ఆన్లైన్లో ఉంచాలి. ప్రస్తుతం ధరల వివరాలే ఉంటున్నాయి. ఎన్ని టికెట్లు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదు. ఐదు రోజుల మ్యాచ్‌ల్ని టీవీల్లో ఉచితంగా వీక్షించేందుకు (ఫ్రీ టు ఎయిర్) అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు పెయిడ్ చానళ్లలో ప్రసారమవుతున్నాయి. రోజు మొత్తానికి బదులుగా ‘హాఫ్ డే’ టిక్కెట్లు విక్రయించాలని సర్వేలో పాల్గొన్న అభిమానులు తెలిపారు. తాజా సర్వేతో టెస్టు క్రికెట్‌కూ ఆదరణ ఉందని రుజువైందని ఎంసీసీ తెలిపింది. గతేడాది సర్వేలో కూడా 70% ప్రజలు టెస్టులకు మద్దతు తెలిపారు. -
కోడ్ ఉల్లంఘనల్లో అధికార పార్టీ ప్రథమం
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల సంఘం, రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలీసులు.. ఎవరేం చెప్పినా డోంట్ కేర్ అన్నట్లు ఉంది రాజకీయ పార్టీల పరిస్థితి. ఎవరికి వారు ‘వీలున్నంత వరకు’ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ)ని ఉల్లంఘిస్తూనే ఉన్నారు. నగరంలో ఈ కేసుల సంఖ్య ఇప్పటికే సెంచరీ దాటింది. మొత్తం నమోదైన 112 కేసుల్లో అత్యధికంగా అధికార పార్టీపైనే నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో దాని మిత్రపక్షం ఎంఐఎం ఉంది. ఈ కేసులకు సంబంధించి సిటీ పోలీసులు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి సమగ్ర నివేదికలు సమర్పిస్తున్నారు. ఈ తరహా కేసులే ఎక్కువగా.. ఉల్లంఘనకు సంబంధించి నమోదవుతున్నవాటిలో ఎంసీసీ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రధానంగా అనుమతి లేని ఫ్లెక్సీలు, బ్యానర్లు, హోర్డింగ్స్, లాలీపాప్స్‌తో ప్రచారం, నిషేధిత డ్రోన్ కెమెరాల వాడకం, వ్యక్తిగత దూషణలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, పలు సంస్థల ఛైర్మన్లతో పాటు ప్రభుత్వం నుంచి వేతనం, గౌరవ వేతనం పొందుతున్న వారు ఎంసీసీ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. అధికారిక వాహనాలను పార్టీ ప్రచారానికి వాడారనే ఆరోపణలపైనా కొన్ని కేసులు నమోదయ్యాయి. పాదయాత్రలు, వాహనర్యాలీలను నిర్వహించడానికి సంబంధించీ పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించిన నోటీసుల జారీ, చార్జ్షీట్ల దాఖలు తదితర చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు. నిర్ణీత సమయాన్ని మించి రోడ్ షోలు, సభలు, సమావేశాల నిర్వహణకు సంబంధించీ కేసులు ఉన్నాయి. సామాజిక మాధ్యమాలు, ‘సీ–విజిల్’ ద్వారా.. ఈ కేసుల్లో పోలీసులు ప్రత్యక్షంగా నమోదు చేసినవే ఎక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో వచ్చే ఫిర్యాదులను అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్న అధికారులు ప్రాథమిక నిర్ధారణ తర్వాత కేసులు నమోదు చేస్తున్నారు. నగరానికి సంబంధించి ఉత్తర మండల పరిధిలోనే ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. అధికారిక యాప్ ‘సీ–విజిల్’ ద్వారా వచ్చిన ఫిర్యాదులపై అధికారులు తక్షణం స్పందిస్తున్నారు. వీటితో పాటు మద్యం, నగదు తరలింపు, పంపిణీలకు సంబంధించి, ప్రలోభాలకుయత్నించడం ఆరోపణల పైనా కేసులు నమోదు చేస్తున్నారు. కేసుల వివరాలు ఇవీ.. మొత్తం కేసులు è 112 టీఆర్ఎస్ è 37 ఎంఐఎం è 28 కాంగ్రెస్ è 17 బీజేపీ è 13 టీడీపీ è 4 సీపీఎం è 1 ఇతరులు è 12 సైబరాబాద్ పరిధిలో.. నాన్‌బెయిలబుల్ వారెంట్స్– 2,389 ఆయుధాలు డిపాజిట్ చేసింది– 1,081 బైండోవర్: 1,696 మొత్తం కేసులు: 28 ఎక్సైజ్ కేసులు: 48 నగదు స్వాధీనం: రూ.1.83 కోట్లు రాచకొండ పరిధిలో.. నాన్‌బెయిలెబుల్ వారెంట్స్ –1,760 ఆయుధాలు డిపాజిట్ చేసింది– 751 బైండోవర్: 1,674 మొత్తం కేసులు: 36 రూ.90,837 విలువచేసే 289.90 లీటర్ల మద్యం స్వాధీనం. నగదు స్వాధీనం: రూ.2.13 కోట్లు -
'బ్యాట్ మందం అనేది సమస్యే కాదు'
లక్నో: ఇప్పటికే క్రికెటర్లు వాడే బ్యాట్ల మందంపై అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసిన వరల్డ్ క్రికెట్ కమిటీ మెరిల్ బోర్న్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) పలు మార్గదర్శకత్వాలను సూచించగా, భారత్ లో బ్యాట్లను తయారు చేసేవారు మాత్రం ఆ సూచనలతో ఏకీభవించడం లేదు. బ్యాట్ల మందంపై నిబంధనల వల్ల ఉపయోగం ఉండదు. బ్యాట్ బ్యాలెన్స్ తో పాటు, ఆటగాళ్ల టాలెంట్ ఇక్కడ ముఖ్యం' అని ఎంతోమంది స్టార్ ఆటగాళ్లకు బ్యాట్లను తయారు చేసిన ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన బీడీఎమ్ ఫ్యాక్టరీ వర్కర్ జితేందర్ సింగ్ పేర్కొన్నాడు. క్రికెటర్ల సూచనమేరకు మందంగా ఉన్న బ్యాట్లను కానీ, పలుచని బ్లేడ్ తరహా బ్యాట్లను కానీ తాము తయారు చేస్తూ ఉంటామన్నాడు. ఆయా బ్యాట్లను బ్యాట్స్‌మెన్ ఎలా ఉపయోగించాలో ఆ క్రికెటర్ల నైపుణ్యంపై మాత్రమే ఆధారపడి వుంటుంది తప్ప బ్యాట్ తయారీపై కాదన్నాడు. గతనెల్లో క్రికెటర్ల వాడే బ్యాట్ల మందం పరిమితంగా ఉండాలంటూ ఎంసీసీ సూచించిన సంగతి తెలిసిందే. ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లను సులువుగా కొట్టడానికి బ్యాట్ల మందం పెరగడం కూడా కారణమని ఎంసీసీ అభిప్రాయపడింది. -
ఇక క్రికెట్లో ‘రెడ్ కార్డ్’!
బ్యాట్ సైజ్ తగ్గింపు ఎంసీసీ కీలక సిఫార్సులు ఆమోదిస్తే అక్టోబర్ నుంచి అమలు ముంబై: క్రికెట్లో బంతికి, బ్యాట్‌కు మధ్య సమతుల్యం తేచ్చేందుకు మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ప్రయత్నిస్తోంది. రెడ్ కార్డ్ సస్పెన్షన్, బ్యాట్ సైజ్ కుదింపులాంటి విప్లవాత్మక మార్పులను క్రికెట్ ‘లా’మేకర్ అయిన ఎంసీసీ ప్రపంచ క్రికెట్ కమిటీకి సూచించింది. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ బ్రియర్లీ అధ్యక్షతన రెండు రోజుల పాటు సమావేశమైన ఈ కమిటీ... పలు అంశాలపై కూలంకషంగా చర్చించింది. ఈ కమిటీ భేటీలో మాజీ ఆటగాళ్లు రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), రమీజ్ రాజా (పాకిస్తాన్), జాన్ స్టీఫెన్సన్ (ఎంసీసీ చీఫ్) పాల్గొన్నారు. ఈ సిఫార్సులను ఎంసీసీ ప్రధాన కమిటీకి నివేదిస్తారు. అక్కడ అమోదం పొందితే ‘లా ఆఫ్ క్రికెట్’లో కొత్త కోడ్ వచ్చే ఏడాది అక్టోబర్‌లో మొదలవుతుంది. ఎవరైనా ఆటగాడు మైదానంలో మొరటుగా ప్రవర్తిస్తే ‘రెడ్ కార్డ్’ సస్పెన్షన్ వేటు వేయాలని సిఫారసు చేసిందీ కమిటీ. ఈ తరహా వేటు ప్రస్తుతం ఫుట్‌బాల్, హాకీ తదితర ఆటల్లో అమల్లో ఉంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను ప్రవేశపెట్టడంపై అడుగులు వేయాలని కమిటీ సూచించింది. హెల్మెట్‌కు తాకి వచ్చినా... బ్యాట్స్‌మన్ కొట్టిన బంతి ఫీల్డర్ హెల్మెట్‌కు తగిలి క్యాచ్ పడితే ప్రస్తుతం నాటౌట్‌గా ఇస్తున్నారు. ఇక నుంచి దానిని అవుట్‌గా పరిగణించాలని సూచించారు. బ్యాట్ సైజ్‌పై పాంటింగ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బ్యాట్‌ను కుదించేందుకు 60 శాతం ఆటగాళ్లు మద్దతిస్తున్నారని అన్నారు. బ్యాట్ బ్లేడ్ సైజ్ 40 మిల్లీమీటర్లు మించకుండా చూడాలని ప్రతిపాదించారు. ఒలింపిక్స్ తదితర క్రీడల్లో క్రికెట్‌ను ప్రవేశపెట్టడాన్ని బీసీసీఐ వ్యతిరేకిస్తూ వచ్చింది. దీంతో అందరిని సంతృప్తి పరిచాకే తుదినిర్ణయం తీసుకోవాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు. -
ఆర్బీఐతొలి ఎంసీసీ సమావేశం ప్రారంభం
• నేడు విధాన ప్రకటన • రెపో రేటు యథాతథం అంచనాలు ముంబై: కొత్తగా ఏర్పాటయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యున్నత స్థాయి పరపతి విధాన కమిటీ (ఎంపీపీ) రెండు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ప్రారంభమైన 2016-17 నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన ద్వైమాసిక సమావేశం, బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 6.5 శాతం) ను సమీక్షించి ఇందుకు సంబంధించి మంగళవారం ఒక కీలక ప్రకటన చేయనుంది. అయితే ఇప్పటి వరకూ సమీక్ష నిర్ణయం మార్కెట్ కాలంలోనే జరుగుతుండగా, ఈ సమయాన్ని మధ్యాహ్నం 2.30కి మార్చడం జరిగింది. కాగా తాజా సమీక్ష సందర్భంగా రేటు యథాతథంగా కొనసాగించడానికే వీలుందని నిపుణులు అంచనావేస్తున్నారు. దాదాపు 65 శాతం మంది బ్యాంకర్లు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ద్రవ్యోల్బణం మరింత తగ్గడం కోసం ఆర్బీఐ నిరీక్షించే వీలుందని అంచనాలు ఉన్నాయి. ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 5.05 శాతంగా ఉండగా, టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ట స్థాయిలో 3.74 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ కీలక రేటుపై నిర్ణయాన్ని ఆర్బీఐ గవర్నర్ ఒక్కరే తీసుకుంటుండగా, ఈ దఫా మెజారిటీ దీనికి ప్రాతిపదిక కానుండడం గమనార్హం. సభ్యులు సమానంగా విడిపోతే... ఆర్బీఐ గవర్నర్‌గా అదనపు ఓటు కీలకం అవుతుంది. తయారీ రంగం బలహీనం: నికాయ్ న్యూఢిల్లీ: తయారీ రంగం వృద్ధి సెప్టెంబర్‌లో పేలవంగా ఉందని నికాయ్ మార్కెట్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ పర్చేంజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) పేర్కొంది. ఆగస్టులో 20 నెలల గరిష్ట స్థాయిలో 52.2 పాయింట్ల వద్ద ఉన్న సూచీ సెప్టెంబర్‌లో 52.1 పాయింట్లకు పడిందని తన తాజా నివేదికలో పేర్కొంది. ఇది ఆర్బీఐ రుణ రేటు- రెపో తగ్గింపునకు వీలుకల్పిస్తున్న అంశంగా వివరించింది. కొత్త ఆర్డర్ల మందగమనం సెప్టెంబర్‌లో తయారీ రంగం బలహీనతకు కారణంగా పేర్కొంది. నికాయ్ సూచీ ప్రకారం 50 పాయింట్ల పైన నమోదు వృద్ధి విస్తరణగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. -
ఎంసీసీ 231 ఆలౌట్
సాక్షి, హైదరాబాద్: ఎలిగెంట్ సీసీ బౌలర్ అశ్విన్ విజయ్ (6/44) చెలరేగడంతో ఎ డివిజన్ రెండు రోజుల లీగ్‌లో ఎంసీసీ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎంసీసీ జట్టు 74.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. సంతోష్ (80 బంతుల్లో 81; 11 ఫోర్లు), ముకుంద్ (139 బంతుల్లో 50; 4 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. ఎలిగెంట్ సీసీ బౌలర్లలో నిహాల్ 3 వికెట్లు, నితీష్ కుమార్ ఒక వికెట్ పడగొట్టారు. ఎ-డివిజన్ వన్డే లీగ్ మ్యాచ్‌లో వెంకట చైతన్య (7/12) చెలరేగడంతో కన్సల్ట్ సీసీ 106 పరుగుల తేడాతో సఫిల్‌గూడ సీసీపై ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కన్సల్ట్ సీసీ 48.2 ఓవర్లలో 158 పరుగులు చేసి ఆలౌటైంది. నజీర్ 37, చెన్నారావు 33 పరుగు లు చేయగా... ప్రత్యర్థి బౌలర్లలో నిశాంత్ 4, కార్తీక్, జయంత్ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన సఫిల్‌గూడ సీసీ 21.2 ఓవర్లలో 52 పరుగులకే కుప్పకూలింది. హర్ష (20) మినహా ఇంకెవరూ రెండంకెల స్కోర్లు చేయలేదు. వెంకట చైతన్య చక్కని స్పెల్ (8.2-3-12-7)తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను వణికించాడు. భవన్ రెడ్డికి 3 వికెట్లు దక్కాయి. -
కొత్త క్రికెట్ 'లా' యాప్!
న్యూ ఢిల్లీః క్రీడాభిమానులకు ఓ కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. క్రికెట్ చట్టాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా ఈ కొత్త అనువర్తనాన్ని ఓ క్రికెట్ క్లబ్ రూపొందించింది. ఢిల్లీలోని పురాతన క్రికెట్ సంస్థ క్రీడాభిమానుల హైటెక్ అవసరాలకు అనుగుణంగా కొత్త అప్లికేషన్ ను మార్కెట్ లో విడుదల చేసింది. అత్యంత పురాతన క్రికెట్ ఇనిస్టిట్యూట్ మేరీ లెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసిసి) క్రికెట్ క్రీడకు సంబంధించిన చట్టాలను సులభంగా తెలుసుకునేందుకు వీలుగా కొత్త యాప్ విడుదల చేసింది. ఈ నూతన ఆవిష్కారం యాండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులు ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. 'ఎంసిసి లాస్ ఆఫ్ క్రికెట్' పేరున అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త యాప్ లో... క్రికెట్ చట్టాలు క్రీడాభిమానులకు, వినియోగదారులకు సులభంగా అర్థమయ్యేందుకు వీలుగా ఫొటోలు, క్విజ్, యానిమేషన్ రూపంలో ప్రత్యేక వివరణలతో విడుదల చేసింది. క్రికెట్ కు సంబంధించిన 42 చట్టాలను ఎంసీసీ యాప్ లో అందుబాటులోకి తెచ్చింది. ఆట సెట్ ఆప్ దగ్గరనుంచీ ప్రతి విషయాన్ని అర్థమయ్యే రీతిలో వివరిస్తూ చట్టాలను ఎనిమిది విభాగాలుగా విభజించి యాప్ లో అందుబాటులోకి తెచ్చింది. -
ఎంసీసీ అధ్యక్షుడిగా మాథ్యూ ఫ్లెమింగ్
లండన్: మాజీ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ మాథ్యూ ఫ్లెమింగ్ ప్రఖ్యాత మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) అధ్యక్షుడిగా ఎన్నికవనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 1న ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం లార్డ్స్‌లో జరిగిన ఎంసీసీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు రోజర్ నైట్ ఈ పదవికి 51 ఏళ్ల ఫ్లెమింగ్ పేరును నామినేట్ చేశారు. ఇంగ్లండ్ తరఫున ఈ మాజీ ఆటగాడు 11 వన్డేలు ఆడారు. ఎంసీసీ ఫౌండేషన్ పేరిట అఫ్ఘానిస్తాన్‌లో క్రికెట్ అభివృద్ధికి ఫ్లెమింగ్ కీలక పాత్ర పోషించారు.