విమాన ఖర్చులు ప్రధాని నుంచి వసూలు చేయాలి: సంజయ్‌ రౌత్‌ | Sanjay Rout Alleges Pm Violates Model Code Of Conduct | Sakshi
Sakshi News home page

ప్రచారానికి ప్రభుత్వ విమానంలో ప్రధాని చక్కర్లు: సంజయ్‌ రౌత్‌

Published Tue, Apr 2 2024 4:10 PM | Last Updated on Tue, Apr 2 2024 5:00 PM

Sanjay Rout Alleges Pm Violates Model Code Of Conduct - Sakshi

ముంబై: తన పదవిని ఎన్నికల ప్రచారానికి వాడుకొని ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని శివసేన(ఉద్ధవ్‌) ఎంపీ సంజయ్‌సింగ్‌ ఆరోపించారు. ప్రధాని ప్రజల సొమ్మును ఎన్నికల ప్రచారానికి వాడుకుని ఉంటే దానిని వెంటనే రికవర్‌ చేయాలని రౌత్‌ డిమాండ్‌ చేశారు.

‘ప్రధాని ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు ప్రభుత్వ విమానాన్ని వాడితే దానికి అయిన  ఖర్చు బిల్లులను బీజేపీయే చెల్లించాలి. షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత కూడా ప్రధాని ప్రభుత్వ విమానాలు, హెలికాప్టర్‌లలోనే ప్రచారానికి వెళుతున్నారు. ఇటీవల ప్రధాని ముంబైలో పర్యటించి అదానీకి ఇచ్చేందుకుగాను భూమి  ఎక్కడుందో వెతికారు.  దారావీ స్లమ్‌ ఏరియా రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టారు. బీజేపీని తరిమికొట్టేందుకు ముంబై ఎప్పుడో డిసైడైంది’అని రౌత్‌ చెప్పారు.  

ఇదీ చదవండి.. ఎన్నికల బరిలో యువరాజులు, యువరాణులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement