sanjay routh
-
షోలాపూర్ సీటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ‘షోలాపూర్ సౌత్’ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టటంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తమ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిందని తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘ఇటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తే.. మహా వికాస్ అఘాడి (MVA)కి సమస్యలను సృష్టించినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన కొత్త జాబితాలో షోలాపూర్ సౌత్ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దిలీప్ మానేను ప్రకటించింది. మేము ఇప్పటికే అదే స్థానం నుంచి మా పార్టీ తరఫున అమర్ పాటిల్‌ను బరిలోకి దింపాం. అయితే.. ఇది కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో టైపింగ్ పొరపాటుగా భావిస్తున్నా. .. మా వైపు నుంచి కూడా అలాంటి పొరపాటు జరగొచ్చు. మా సీటు షేరింగ్ ఫార్ములాలో భాగమైన మిరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని విన్నా. మిత్రపక్షాలకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టడం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తే.. అది ఎంవీకే సమస్యలను సృష్టించినట్లు అవుతుంది’ అని అన్నారు.ముంబైలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపడంపై రౌత్ స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ముంబైలో మరో సీటు అడుగుతోంది. సాధారణంగా ముంబైలో శివసేన(యూబీటీ) ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది’ అని అన్నారు. మరోవైపు.. షోలాపూర్ సౌత్ స్థానంలో పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మేము దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేం. ఇక.. రేపటితో నామినేషన్ల దాఖలు అంశం ముగుస్తుంది’’ అని అన్నారు.నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 200కు పైగా స్థానాలకు అభ్యర్థులను ఎంవీఏ కూటమి ప్రకటించింది. అయితే.. శివసేన (యూబీటీ ), కాంగ్రెస్ పార్టీ మధ్య కొన్ని సీట్ల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండటం గమనార్హం.చదవండి: ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి -
సీజేఐ ఇంట్లో ప్రధాని మోదీ గణపతి పూజపై రాజకీయ దుమారం
న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో జరిగిన గణపతి పూజలో ప్రధాని మోదీ పాల్గొనడంపై ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.దేశంలో గణేష్ ఉత్సవాల సందడి కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జస్టిస్ డీవై చంద్రచూడ్ నివాసంలో గణేజ్ పూజ జరిగింది. ఈ పూజలో మోదీ సంప్రదాయ మహరాష్ట్ర టోపీ ధరించి పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న ఫొటోల్ని ప్రధాని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే మోదీ పూజలో పాల్గొన్నడానికి ప్రతిపక్ష నేతలు తప్పుబడుతుంటే .. అధికార బీజేపీ నేతలు పూజలో రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు పాల్గొనడం నేరం కాదని మోదీకి మద్దతు పలుకుతున్నారు. #WATCH | On PM Modi visiting CJI DY Chandrachud's residence for Ganpati Poojan, Shiv Sena (UBT) leader Sanjay Raut says, " Ganpathi festival is going on, people visit each other's houses. I don't have info regarding how many houses PM visited so far...but PM went to CJI's house… pic.twitter.com/AVp26wl7Yz— ANI (@ANI) September 12, 2024 ప్రజల్లో సందేహాలు తలెత్తుతాయ్రాజ్యసభ ఎంపీ, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ఇలాంటి (మోదీ పూజలో పాల్గొనడంపై) సమావేశాలు అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి. ఇది గణపతి పండుగ. ఢిల్లీలో చాలా చోట్ల గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రధాని ఇప్పటి వరకు ఎంత మంది ఇళ్లకు వెళ్లారో నాకు సమాచారం లేదు. కానీ ప్రధాని మాత్రం చీఫ్ జస్టిస్ ఇంటికి వెళ్లారు. అక్కడ గణపతి పూజలు చేశారు. హారతులిచ్చారు. రాజ్యాంగ పరిరక్షకులు.. రాజకీయ నాయకులను ఈ విధంగా కలుస్తుంటే ప్రజలకు సందేహాలు కలుగుతాయి’అని సంజయ్ రౌత్ అన్నారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీతో చంద్రచూడ్‌కు ఉన్న సంబంధాలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. శివసేన (యూబీటీ) ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మధ్య జరిగిన గొడవకు సంబంధించిన కేసు విచారణ నుండి భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ తప్పుకోవాలని కోరారు.ఇదీ చదవండి : అన్నదమ్ముల్ని ప్రాణం తీసిన అప్పుఅది తప్పెలా అవుతుందిప్రధాని పర్యటనపై ప్రతిపక్ష నేతలు చేసిన విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. గణేష్ పూజకు హాజరు కావడం నేరం కాదు. అనేక సందర్భాల్లో న్యాయమూర్తలు, రాజకీయ నాయకులు పెళ్లిళ్లు ఇతర శుభకార్యాల్లో పాల్గొంటారు. అది తప్పు కాదు కదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా 2009లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నిర్వహించిన ఇఫ్తార్ విందులో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ హాజరయ్యారని గుర్తు చేశారు. -
ఎంవీఏ కూటమి సీఎం అభ్యర్థిపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయం అసక్తికరంగా మారుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందస్తుగా ప్రకటించాలని వస్తున్న సూచనను ఎన్సీపీ (శరద్ పవార్) చీఫ్ శరద్ పవార్ తిరస్కరించారు. కూటమి తరఫున శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీలో చర్చలు జరగుతున్న సమయంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.‘మన కూటమే మన ఉమ్మడి సీఎం అభ్యర్థి. ఒక వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించటంపై మాకు నమ్మకం లేదు. ఉమ్మడి నాయకత్వమే మా ఫార్మూలా’ అని శరద్ పవార్ అన్నారు.అయితే సీఎం అభ్యర్థి ప్రకటనపై కూటమిలో గురువారం నుంచి అంతర్గతం వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఓవైపు శరద్ పవార్ తిరస్కరిస్తున్న సమయంలోనే శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్.. ఎంవీకే కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రేను నిలపాలని అంటున్నారు. శరద్ పవార్ వ్యాఖ్యపై సంజయ్ రౌత్ స్పందించారు.‘శరద్ పవార్ చెబుతుంది నిజమే. ఎంవీకే కూటమి ముందు మెజార్టీ స్థానాలకు సాధించాలి. అయితే రాహుల్ గాంధీని లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఉంటే మరో 23 నుంచి 30 సీట్లను ఇండియా కూటమి గెలచుకొని ఉండేది. ఇది మా పార్టీ అభిప్రాయం. ఏ ప్రభుత్వం, పార్టీ అయినా సీఎం అభ్యర్థి ముఖం లేకుండా ఉండకూడదు. ప్రజలకు కూడా తెలియాలి కదా.. వారు ఎవరికి ఓటు వేస్తున్నారో. ..ప్రజలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, నరేంద్ర మోదీ ఇలా అభ్యర్థుల ముఖాలను చూసే ఓటు వేశారు. అదేవిధంగా ఎంవీఏ కూటమి తరఫున ఎవరిని సీఎం అభ్యర్థిగా పెట్టినా మాకు ఇబ్బంది లేదు. ఎంవీఏలో మూడు పార్టీలు ఉన్నాయి. మూడు పార్టీలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాయి. మళ్లీ అసెంబ్లీకి సైతం ఇలాగే ఉమ్మడిగా పోటీ చేయడానికి సిద్ధం’ అని అన్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవల సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘ఉద్ధవ్ ఠాక్రే గతంలో ఎంవీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన చేసిన మంచి పనులను ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. అదే విధంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రే పలు మిత్రపక్షాలను ముందుండి నడిపించారు’ అని అన్నారు. మహారాష్ట్రలో సెపప్టెంబర్/ అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. -
‘కంగన’కు చెంపదెబ్బ.. సంజయ్‌రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముంబై: బాలీవుడ్ నటి, బీజేపీఎంపీ కంగనా రనౌత్‌ను మహిళా కానిస్టేబుల్ చెంపదెబ్బ కొట్టిన ఘటనపై శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్‌రౌత్ స్పందించారు. ‘కొందరు ఓట్లు వేస్తారు. కొందరు చెంపదెబ్బలు కొడతారు. కంగనా విషయంలో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఆమెపై నాకు సానుభూతి ఉంది.ఆమె ఇప్పుడు ఒక ఎంపీ. ఎంపీపై దాడి జరగకూడదు. ఆ సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ చెబుతున్నట్లు ఆమె తల్లి గనుక రైతుల ధర్నాలో ఉంటే కోపం వస్తుంది. రైతుల పోరాటానికి వ్యతిరేకంగా కంగన మాట్లాడింది. నాకు రైతుల పట్ల గౌరవం ఉంది’అని సంజయ్‌రౌత్ అన్నారు.ఛండీగఢ్ ఎయిర్‌పోర్టులో తనిఖీల సందర్భంగా కంగనా రనౌత్‌ను సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ చెంప మీద కొట్టడం సంచలనం రేపింది. కంగన రైతుల పోరాటానికి వ్యతిరేకంగా మాట్లాడినందునే తాను కొట్టినట్లు కానిస్టేబుల్ తెలిపింది. కాగా, గతంలో మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలో మహా వికాస్ అఘాడీ అధికారంలో ఉన్నప్పుడు కంగన శివసేనకు వ్యతిరేకంగా తరచూ సవాళ్లు విసురుతూ ఉండేది. ఒక దశలో ముంబైలోని కంగనా స్టూడియో భవనాన్ని మున్సిపల్ అధికారులు అక్రమ నిర్మాణమని పేర్కొంటూ కూల్చివేశారు. -
రాజ్‌ఠాక్రేపై ఏ ఫైల్ ఓపెన్ చేశారు: సంజయ్ రౌత్
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌ఠాక్రేపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్ ఠాక్రేపై ఏదో ఫైల్ ఓపన్ చేశాని.. అందుకే ఒక్కసారిగా బీజేపీకి తన మద్దతు ప్రకటించారని సంజయ్ రౌత్ అన్నారు. ‘ఒక్కసారిగా ఏదో విచిత్రం జరిగింది. మేము ఈ విషయాన్ని రాజ్‌ఠాక్రేను అడగదలుచుకున్నాం. ఒక్కసారిగా మారిపోయి మహారాష్ట్ర శత్రువుల(ప్రత్యర్థుల)వైపు చేరి పూర్తి మద్దతు ఇస్తున్నారు. మీరు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు? ఇలా చేయటం వెనక ఉన్న బలమైన కారణం ఏంటీ? మీ మీద ఏ ఫైల్ ఓపెన్ చేశారు?’ అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు. మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సోదరుడైన రాజ్ ఠాక్రే... తన పార్టీ బీజేపీ, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ (ఎన్సీపీ) కూటమికి సంపూర్ణ మద్దత ఇస్తుందని ప్రకటించారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ ఠాక్రే.. తన పార్టీ కేవలం ప్రధాని నర్రేందమోదీ, ఎన్డీయే కూటమికే మాత్రమే మద్దతు ఇస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనకు 1990 నుంచి బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. మొదటి నుంచి నరేంద్ర మోదీ.. ప్రధాని అవుతారన్న వారిలో తాను ఒకరినని చెప్పారు. ఇక.. ఉద్ధవ్ ఠాక్రేకు చెందిన శివసేన(యూబీటీ) ప్రతిపక్ష ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీగా ఉన్న విషయం తెలిసిందే. మంగళవారం మహావికాస్ ఆఘాడీ కూటమి మధ్య సీట్లు పంపిణీ ఖరారైన విషయం తెలిసిందే. శివసేన (యూబీటీ)కి -21,కాంగ్రెస్- 17, ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్)-10 సీట్లుతో లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నాయి. -
విమాన ఖర్చులు ప్రధాని నుంచి వసూలు చేయాలి: సంజయ్ రౌత్
ముంబై: తన పదవిని ఎన్నికల ప్రచారానికి వాడుకొని ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని శివసేన(ఉద్ధవ్) ఎంపీ సంజయ్‌సింగ్ ఆరోపించారు. ప్రధాని ప్రజల సొమ్మును ఎన్నికల ప్రచారానికి వాడుకుని ఉంటే దానిని వెంటనే రికవర్ చేయాలని రౌత్ డిమాండ్ చేశారు. ‘ప్రధాని ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు ప్రభుత్వ విమానాన్ని వాడితే దానికి అయిన ఖర్చు బిల్లులను బీజేపీయే చెల్లించాలి. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కూడా ప్రధాని ప్రభుత్వ విమానాలు, హెలికాప్టర్లలోనే ప్రచారానికి వెళుతున్నారు. ఇటీవల ప్రధాని ముంబైలో పర్యటించి అదానీకి ఇచ్చేందుకుగాను భూమి ఎక్కడుందో వెతికారు. దారావీ స్లమ్ ఏరియా రీ డెవలప్మెంట్ ప్రాజెక్టును అదానీకి కట్టబెట్టారు. బీజేపీని తరిమికొట్టేందుకు ముంబై ఎప్పుడో డిసైడైంది’అని రౌత్ చెప్పారు. ఇదీ చదవండి.. ఎన్నికల బరిలో యువరాజులు, యువరాణులు -
ఎలక్టోరల్ బాండ్లపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై : లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది. ఈడీ, సీబీఐ దాడులు జరిపిన సంస్థలే ఈ ఎలక్టోరియల్ బాండ్లను కొనుగోలు చేయడంపై ఆయా పార్టీలకు చెందిన నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఎలక్టోరల్ బాండ్‌పై శివసేన నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు కొనుగోలు చేసిన ఎలక్టోరల్ బాండ్ల ప్రధాన లబ్ధిదారుగా బీజేపీ ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు. దేశంలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని అన్నారు. ఎలక్టోరల్ బాండ్ ద్వారా గేమింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలు ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడం, నిధులను నేరుగా ఆయా పార్టీల బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా..గేమింగ్ అండ్ గ్యాంబ్లింగ్ కార్పొరేషన్ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసింది. అవి అధికార పార్టీ బీజేపీ అకౌంట్లలో జమవుతాయి. ఇలాంటివి గతంలో చాలానే జరిగాయి. ఎలక్టోరల్ బాండ్లలో డబ్బును కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు బదిలీ చేసిన కంపెనీలకు ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని రౌత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా కంపెనీలపై ఇటీవల జరిగిన ఈడీ దాడులకు, ఆ తర్వాత బాండ్ల కొనుగోలుకు మధ్య సంబంధాన్ని సూచించారు. ప్రజలు ఇలాంటి వాటిని నిత్యం గమనిస్తూనే ఉన్నారు. ఈడీ దాడులు చేస్తుంది. కొన్ని గంటల తర్వాత, ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేస్తారని మండిపడ్డారు. -
విధేయతే లేదు.. కేవలం రాజకీయమే: సంజయ్ రౌత్
ముంబయి: కాంగ్రెస్ పార్టీని వీడిన మిలింద్ దేవరాపై శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం నాయకుడు సంజయ్ రౌత్ విరుచుకుపడ్డారు. ప్రస్తుత రోజుల్లో అధికారం కోసం మాత్రమే రాజకీయాలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీకి విధేయత అనేది ఉనికిలో లేదని చెప్పారు. మిలింద్ దేవరా తండ్రి మురళీ దేవరా గురించి కూడా ప్రస్తావిస్తూ.. పార్టీ కోసం ఏం చేయాలో తెలిసిన గొప్ప నాయకుడని కొనియాడారు. " విధేయత, భావజాలం వంటి అంశాలు ఇప్పుడు లేవు. రాజకీయాలు ఇప్పుడు కేవలం అధికారం గురించి మాత్రమే నడుస్తున్నాయి. నాకు మిలింద్ దేవరా తెలుసు.. ఆయన పెద్ద నాయకుడు. కాంగ్రెస్‌తో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు." అని కాంగ్రెస్‌కు మిలింద్ దేవర రాజీనామా చేయడంపై రౌత్ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా నెలరోజుల ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి ప్రముఖ నాయకుడు మిలింద్ దేవరా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, శివసేన (యుబిటి)ల మధ్య సీట్ల పంపకాల చర్చలపై ఆయన కలత చెందినట్లు సమాచారం. 'రాజకీయ ప్రయాణంలో ముఖ్యమైన ముగింపు. నేను కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. పార్టీతో నా కుటుంబానికి 55 ఏళ్ల బంధాన్ని ముగించాను. ఇన్ని ఏళ్లుగా పార్టీ నుంచి నాకు మద్దతు తెలిపిన నాయకులు, సహచరులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.'అని పేర్కొంటూ ఎక్స్ వేదికగా మిలింద్ దేవరా పంచుకున్నారు. Congress leader Milind Deora resigns from the primary membership of Congress "Today marks the conclusion of a significant chapter in my political journey. I have tendered my resignation from the primary membership of Congress, ending my family’s 55-year relationship with the… pic.twitter.com/iCAmSpSVHH — ANI (@ANI) January 14, 2024 ముంబయి సౌత్ లోక్‌సభ స్థానం నుంచి మిలింద్ కాంగ్రెస్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు. కానీ 2014, 2019 ఎన్నికల్లో శివసేన నేత ప్రమోద్ సావంత్ చేతిలో ఓటమిపాలయ్యి రన్నరప్‌గా నిలిచారు. ఈ సారి ఇండియా కూటమి సీట్ల పంపకాల్లో భాగంగా సౌత్ ముంబయి లోక్ సభ స్థానాన్ని శివసేన(యూబీటీ)కి కేటాయించారు. దీంతో అసంతృప్తికి లోనైన మిలింద్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు సీనియర్ నేత గుడ్ బై.. 55 ఏళ్ల పాటు పార్టీకి సేవలు.. చివరకు.. -
కాలారామ్ గుడికి ప్రధాని మోదీ.. ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
ముంబై: ప్రధాని మోదీ నాసిక్ పర్యటనపై శివసేన(ఉద్ధవ్ ఠాక్రే)వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని నాసిక్‌లోని కాలారామ్ గుడిని సందర్శించడానికి కారణం తామేనని రౌత్ చెప్పారు. తాము ఈ నెల 22న అయోధ్య వెళ్లకుండా కాలారామ్ గుడిని సందర్శిస్తామని ప్రకటించినందు వల్లే టూర్ షెడ్యూల్లో లేకున్నాప్రధాని శుక్రవారం ఆ గుడికి వెళ్లారని రౌత్ అన్నారు. గత ఏడాది మే నెల నుంచి రెండు తెగల పెద్ద ఎత్తున అలర్లు జరుగుతున్న మణిపూర్‌ను ప్రధాని మోదీ ఇంతవరకు సందర్శించలేదని రౌత్ మండిపడ్డారు. శివసేన ముఖ్య నేతలు అయోధ్యలో ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత మరొక రోజున రామ్ మందిరాన్ని సందర్శిస్తారని, అనంతరం మణిపూర్ వెళ్లి అక్కడి రామ మందిరంలోనూ పూజలు నిర్వహిస్తారన్నారు. కనీసం తమ పర్యటన తర్వాతైనా మోదీ మణిపూర్‌కు వెళ్తారని ఆశిస్తున్నట్లు రౌత్ చెప్పారు. శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించిన ప్రధాని మోదీ మొత్తం రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. వీటిలో కీలకమైన ముంబై ట్రాన్స్ హర్బర్ లింక్ కూడా ఉండటం విశేషం. అయితే వీటిని కూడా మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రారంభిస్తున్నారని శివసేన విమర్శించింది. ఇదీచదవండి.. నాసిక్‌లో మోదీ పర్యటన -
Shiv Sena (UBT): ‘సీట్ల పంపిణీ చర్చలు మళ్లీ మొదటికి’
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమితో సీట్ల పంపణీ విషయంపై శివసేన(ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పార్టీ సంప్రదింపులు ఓ కొలిక్కి రావటం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ మొదటి నుంచి సీట్ల పంపిణీ చర్చలు జరగనున్నట్లు శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. శివసేన గెలిచిన సీట్లపై కాకుండా మిగతా సీట్లపై చర్చలు కొంత అలస్యంగా జరుపుతామని తెలిపారు. ఇదే విషయాన్ని తాము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు తెలియజేశామన్నారు. 2019లో బీజేపీ కూటమి ద్వారా ఎన్నికల బరిలోకి దిగి 23 స్థానాల్లో పోటీ చేయగా 18 సీట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గతేడాది శివసేనలో ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో చీలికలు వచ్చాయి. మెజార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే మహారాష్ట్రకు సీఎం అయ్యారు. అయితే ఇప్పటికీ శివసేన(ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే).. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిలో కొనసాగుతోంది. మొదటి నుంచి శివసేన(యూబీటీ) తాము 23 స్థానాల్లో పోటీ చేస్తామంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో శివసేన(యూబీటీ) తాము 2019లో గెలిచిన సీట్లు తప్ప మిగతా వాటిపై చర్చలు కొంత అలస్యంగా జరుపుతామని కాంగ్రెస్ నేతలకు వెల్లడించింది. చదవండి: ‘నేను కూడా హిందూనే’.. హిందుత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు -
సంజయ్ రౌత్ కస్టడీ మళ్లీ పొడిగింపు
ముంబై: శివసేన ఎంపీ సంజయ్ రౌత్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు మరో 14 రోజుల పాటు పొడిగించింది. మనీ లాండరింగ్ కేసులో రౌత్‌ను నిందితుడిగా పేర్కొంటూ ఈడీ వేసిన సప్లిమెంటరీ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న ప్రత్యేక న్యాయస్థానం సోమవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ముంబై పట్రా చౌల్ అభివృద్ధి పనుల్లో అవకతవకల కేసులో ఆగస్ట్ ఒకటో తేదీన ఈడీ సంజయ్ రౌత్‌ను అదుపులోకి తీసుకుంది. అప్పటి నుంచి ఆయన కస్టడీని న్యాయస్థానం పొడిగిస్తూ వస్తోంది. రౌత్ బెయిల్ పిటిషన్‌పై 21న కోర్టు విచారణ చేపట్టనుంది. -
సంజయ్ రౌత్‌కు లభించని ఊరట.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
ముంబై: మనీలాండరింగ్ కేసులో శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఇప్పట్లో ఉపశమనం లభించేలా కనిపించటం లేదు. ఆయనకు విధించిన జ్యుడీషియల్ కస్టడీనీ మరో రెండు వారాల పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ముంబైలోని ప్రత్యేక న్యాయస్థానం. ముంబైలోని పాత్రాచాల్ ప్రాంత పునర్నిర్మాణ పనుల్లో జరిగిన అవకతవకలపై ఆగస్టు 1న సంజయ్ రౌత్‌ను అరెస్ట్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం కేసుని విచారించిన న్యాయస్థానం ఆగస్టు 8న 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ గడువు సోమవారంతో ముగియనుండటంతో సంజయ్ రౌత్‌ను ముంబై ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరించింది ఈడీ. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని కోర్టుకు తెలిపింది. ఈ కేసును విచారించిన ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్‌పాండే.. సెప్టెంబర్ 5వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇదీ చదవండి: సంజయ్ రౌత్ అరెస్ట్.. ఈడీ తరువాత టార్గెట్ ఎవరో? -
రౌత్‌కు మళ్లీ ఈడీ సమన్లు
న్యూఢిల్లీ/ముంబై: మనీ లాండరింగ్ కేసులో శివసేన నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్‌కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 27న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వాస్తవానికి సంజయ్ రౌత్ బుధవారం విచారణకు హాజరు కావాల్సి ఉండగా, ఈడీ ఎదుటకు రాలేదు. ఆగస్టు మొదటి వారం వరకూ సమయం ఇవ్వాలని కోరుతూ సంజయ్ రౌత్ తన లాయర్ల ద్వారా ఈడీకి ఒక లేఖ పంపించారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొంటున్నానని, ఈడీ ఎదుటకు రాలేనని పేర్కొన్నారు. దీంతో ఈడీ ఆయనకు కొంత ఉపశమనం కలిగించింది. 27న హాజరు కావాలంటూ మరోసారి సమన్లు జారీ చేసింది. -
మోదీ ఆలోచించమన్నారు.. సాధ్యం కాదని చెప్పా: శరద్ పవార్
పుణె: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)అధినేత శరద్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ, ఎన్సీపీ కలిసి రావాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరినట్లు తెలిపారు. మరాఠీ దినపత్రిక బుధవారం నిర్వహించిన 'లోక్‌సత్తా' కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్ మాట్లాడుతూ.. 2019 రాష్ట్ర ఎన్నికల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు చర్చల సమయంలో ఎన్సీపీ, బీజేపీ కలిసిరావాలని మోదీ తనతో చర్చించిన విషయం నిజమేనని తెలిపారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న శివసేన సీఎం పదవికి సంబంధించిన విషయంలో బీజేపీతో విడిపోయిన విషయం తెలిసిందే. 2019 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత సుమారు 90 రోజుల వరకూ నూతన ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ప్రధాని మోదీతో చర్చ జరిగిన సమయంలో.. ఎన్సీపీ, బీజేపీలు కలసి రావాలని మోదీ అన్నట్లు తెలిపారు. అయితే తాను అది సాధ్యం కాదని స్పష్టం చేశానని పేర్కొన్నారు. తమ వైఖరి భిన్నమైందని తెలిపినట్లు చెప్పారు. అయినప్పటికీ ఆ విషయం గురించి ఆలోచించమని మోదీ అన్నారని పేర్కొన్నారు. శరద్ పవార్ వ్యాఖ్యలపై స్పందించిన శివసేన నేత సంజయ్‌రౌత్ మాట్లాడుతూ.. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ‘మహావికాస్ అగాడీ కూటమి’గా ఏర్పడి ఉద్దవ్ థాక్రే సీఎంగా ఎంపికయ్యారని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రయత్నించిందని కానీ సాధ్యం కాలేదని తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాలేదని తెలిసి ఎవరితోనైనా జట్టుకట్టడానికి సిద్ధపడిందని సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. -
ఆమె పులిలా పోరాడింది
ముంబై: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పులిలా పోరాడిందని, ఆమె విజేతగా అవతరించడం ఖాయమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. గురువారం ముంబైలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇప్పుడు జరగబోయే కేరళ, తమిళనాడు, అస్సాం, బెంగాల్ (నాలుగు రాష్ట్రాల) ఎన్నికలు జాతీయ రాజకీయాలను నిర్ణయిస్తాయని ఎంపీ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా అస్సాం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని అన్నారు. అస్సాంలో బీజేపీ అధికారంలో ఉందని, అయితే కాంగ్రెస్ గట్టిగా పోరాటం చేసిందని ప్రశంసించారు. మమతా బెనర్జీ లేఖపై మీడియా ప్రశ్నించినపుడు సీఎం ఉద్ధవ్‌కు కూడా లేఖ వచ్చిందని, ఎన్నికల తర్వాత పొత్తులపై చర్చించే అవకాశం ఉందన్నారు. ఇక పశ్చిమబెంగాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు నిజమైన మహాభారతం కంటే భయంకరంగా ఉన్నాయని రౌత్ ఆందోళన వ్యక్తంచేశారు. బెంగాల్ ఎన్నికలను దేశం మొత్తం పరిశీలిస్తోందని, ప్రజలు కూడా తెలివైనవారేనని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇక ఇటీవల సంజయ్‌పై బాలాసాహెబ్ థోరాట్ చేసిన విమర్శలపై స్పందిస్తూ.. యూపీఏ నాయకత్వాన్ని సోనియా నుంచి శరద్ పవార్‌కు అప్పగించాలని అనలేదని, కేవలం యూపీఏను గాడిలో పెట్టాలనే వ్యాఖ్యానించానని ఎంపీ స్పష్టంచేశారు. -
యాక్సిడెంటల్ హోం మినిస్టర్
ముంబై/నాగపూర్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కి అనూహ్యంగా ఆ పదవి లభించిందని, ఆయన యాక్సిడెంటల్ హోం మినిస్టర్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. పార్టీ పత్రిక సామ్నాలో ఆదివారం రాసిన సంపాదకీయంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ ఎన్సీపీ నేతలు జయంత్‌పాటిల్, దిలీప్ వాల్సే హోం మంత్రి పదవిని చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేయని కారణంగానే, అనిల్‌దేశ్‌ముఖ్‌కు అవకాశం లభించిందని రౌత్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల సంకీర్ణ ప్రభుత్వలో నష్ట నివారణ యంత్రాంగం సరిగా లేదని రౌత్ పేర్కొన్నారు. నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలని అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశించారని ముంబై మాజీ సీపీ పరమ్‌వీర్ సింగ్ చేసిన ఆరోపణలను ఎదుర్కొనే విషయంలో ఈ విషయం రుజువైందన్నారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షాతో అహ్మదాబాద్‌లో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఆ పార్టీ సీనియర్ నాయకుడు ప్రఫుల్ పటేల్ రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలపై రెండు పార్టీలు స్పందించాయి. దీనిపై మీడియా ప్రశ్నకు షా సమాధానమిస్తూ.. అన్ని విషయాలు వెల్లడించలేమని వ్యాఖ్యానించారు. కాగా, కావాలనే షా అలా మాట్లాడారని, గందరగోళం సృష్టించాలనే అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, బీజేపీ పద్ధతే అదని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ పేర్కొన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై పదవీ విరమణ పొందిన హైకోర్టు న్యాయమూర్తి విచారణ జరుపుతారని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ వెల్లడించారు. ఆ విచారణలో అన్ని వాస్తవాలు బయటకి వస్తాయన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను కోరానన్నారు. -
బెంగాల్లో సివంగిదే గెలుపు.. మేము పోటీ చెయ్యం
ముంబై: పశ్చిమ బెంగాల్లో మరికొన్ని రోజుల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దేశవాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తుండగా, టీఎంసీ మళ్లీ గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలనుకుంటుంది. ఈ నేపథ్యంలో బెంగాల్ ఎన్నికల్లో పోటీచేసే విషయంపై శివసేవ పార్టీ స్పష్టతనిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశ వ్యాప్తంగా బెంగాల్లో శివసేన పోటీచేస్తుందా?లేదా? ఆసక్తి నెలకొంది. ఈ రోజు పార్టీ అధ్యక్షుడు, సీఎం ఉద్దవ్ ఠాక్రేతో చర్చలు జరిపాం. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో ‘దీదీ వర్సెస్ అన్ని పార్టీలు’ అన్న రీతీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో తాము మమతాబెనర్జీకి మద్దతుగా నిలబడటం కోసం బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. మమతా బెనర్జీ ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాం. ఎందుకంటే ఆమె నిజమైన బెంగాల్ సివంగి అని సంజయ్ రౌత్ ట్విటర్లో పేర్కొన్నారు. బెంగాల్లో మార్చి 27 నుంచి ఏప్రిల్ 29 వరకు ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ. ఎన్నికల ఫలితాలు మే 2న వెలువడనున్నాయి. pic.twitter.com/enjd4sfiwx — Sanjay Raut (@rautsanjay61) March 4, 2021 చదవండి: ‘భారత్ మాతాకి జై’ అనే హక్కు మీకు లేదు -
‘శరద్ పవార్ అధ్యక్షుడిగా ఎంపికైతే సంతోషం’
సాక్షి, ముంబై: యూపీఏ కూటమి చైర్పర్సన్ అభ్యర్ధి మార్పుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూపీఏ చైర్మన్‌గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నిమమించబడితే సంతోషంగా ఆహ్వనిస్తామని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిల్లో కాంగ్రెస్ ప్రతిపక్షాలతో జతకట్టడమే చాలా ఉత్తమైన మార్గమని అన్నారు. పవార్ యూపీఏ చైర్ పర్సన్ బరిలో ఉంటే తాము పూర్తి మద్దతిస్తామని తెలిపారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడు లేనంతంగా సంక్షోభంలో ఉందని, యూపీఏ కూటమి బలపడాలంటే దేశంలోని పలు ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకోవాలని రౌత్ పేర్కొన్నారు. కాగా, సంజయ్ రౌత్ వ్యాఖ్యలకు శివసేన అధికార ప్రతినిధి మహేష్ స్పందిస్తూ.. శరద్ పవార్ యూపీఏ నాయకత్వం వహిస్తారన్న వార్తలు నిరాధారమైనవని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆందోళనలను దారి మళ్లించడానికి స్వార్ధ ప్రయోజనాల కోసం అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక శివసేన పార్టీ శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ భాగస్వామ్యంతో మహరాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
కంగనాకు మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి
ముంబై: కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ నాయకుడు రామ్‌దాస్ అతవాలే కంగనా రనౌత్‌కు మద్దతుగా నిలిచారు. ముంబాయి నగరం పీఓకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)ను తలపిస్తుందంటూ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి రామ్‌దాస్ మాట్లాడుతూ, ‘నాకు పూర్తిగా నిజమేమిటో తెలియదు, కానీ శివసేన పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ నటిని ఉద్దేశించి అలా మాట్లాడటం మాత్రం ఖండించదగ్గ విషయం. కంగనా చేస్తున్న పోరాటంలో మేం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తాం’ అని పేర్కొన్నారు. శివసేన మహిళ విభాగం నేతలు కంగనారనౌత్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి ఆమె పోస్టర్లపై చెప్పులతో దాడి చేశారు. దీనిపై మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్రఫడ్నవీస్ భార్య అమృత స్పందిస్తూ ‘ మేం ముంబాయి గురించి అలా అనడాన్ని సమర్థించం. కానీ ప్రతి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి. నటి పోస్టర్లపై చెప్పులతో దాడిచేయడం అనే చర్యలు హేయమైనవి’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మహారాష్ట్ర పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా మారిందని కామెంట్ చేసిన కంనా ఆ తరువాత ప్రస్తుతమున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని తాలిబన్లతో పోల్చింది. దీనిపై మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ స్పందిస్తూ కంగనాకు రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. అంత అభద్రతా భావం ఉంటే మహారాష్ట్రని వదిలి వెళ్లిపోవాలి. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న పోలీసుల గురించి తప్పుగా ఎలా మాట్లాడుతుంది’ అని మండిపడ్డారు. చదవండి: పీఓకేను తలపిస్తున్న ముంబై : కంగన -
'వదిలేయండి.. ఎవరి అభిప్రాయం వారిది'
ఢిల్లీ : లాక్డౌన్ వేళ అష్టకష్టాలు పడుతున్న వలస కార్మికుల పట్ల నటుడు సోనూసుద్ తన ఉదారభావాన్ని చాటుకున్న విషయం తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను వారి స్వగ్రామాలకు పంపిన సోనూ.. వారి పట్ల రియల్ హీరోగా ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే సోనూసుద్ చేస్తున్న ఈ సాయంపై శివసేన నేత సంజయ్ రౌత్ ఆ పార్టీ అధికార పత్రిక సామ్నాలో వ్యంగ్యంగా రాసుకొచ్చారు. బీజేపీ చేతిలో సోనూ ఓ కీలుబొమ్మ అంటూ ఆరోపించారు. లాక్డౌన్ వేళ కొత్త మహాత్ముడు పుట్టుకొచ్చారంటూ సోనూపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై సోనూసుద్ స్పందించారు. (విమర్శలకు చెక్: సీఎంతో భేటీ) 'ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి.. అది అతని అభిప్రాయం. వయసులో ఆయన పెద్ద మనిషి.. అందులోనూ ఎవరి నిర్ణయం వారికి ఉంటుంది. రౌత్ వ్యాఖ్యల పట్ల కాలమే సమాధానం చెబుతుందని భావిస్తున్నా. త్వరలోనే ఈ విషయన్ని సంజయ్ రౌత్ గ్రహిస్తారు. రౌత్ చేసిన వ్యాఖ్యలను మాత్రం సమర్థించను. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమాల్లో ఉన్నాను. ఒక యాక్టర్‌గా బిజీ లైఫ్‌ను గడుపుతున్నాను. నా జీవితంలో సినిమా కెరీర్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎవరో ఏదో అన్నంత మాత్రానా పని గట్టుకొని విమర్శలు చేయడం నాకు ఇష్టం లేదు. ఇది ప్రజాస్వామ్య దేశం.. ఎవరు ఏదైనా మాట్లాడే హక్కు ఉంటుంది.. సమాజంలో మంచి చేసే పనులపై విమర్శించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. నా ఊపిరి ఉన్నంతవరకు సినిమాల్లోనే కొనసాగుతా. రాజకీయాలంటే నాకు ఆసక్తి లేదు. ఈ సందర్భంగా శివసేన నేతలు ఉద్ధవ్, ఆదిత్య ఠాక్రేలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. వాళ్లను నా స్నేహితులుగా భావిస్తున్నా.. ఎందుకంటే కష్ట సమయంలో వారు నాకు సహాయం చేశారు. అయితే నా దృష్టిలో వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే లాక్డౌన్ వల్ల చిక్కుకుపోయిన వారు సురక్షితంగా ఇంటికి చేరుకోవడం.. అదే నా ఆశ' అని చెప్పుకొచ్చారు. (సోనూసుద్‌కు రాజకీయ రంగు) కాగా ఆదివారం సోనూసుద్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేను కలిశారు. ఈ సమావేశంలో ఉద్ధవ్ థాకరే తనయుడు, పర్యాటక శాఖ మంత్రి ఆదిత్య థాకరే కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై మాట్లాడుకోగా.. సోనూపై ఉద్ధవ్ థాకరే ప్రశంసలు కురిపించినట్లు తెలుస్తోంది. కాగా ఈ సమావేశంపై సోనూసుద్ మాట్లాడుతూ మర్యాదపూర్వకంగానే థాకరేను కలిశానని తెలిపారు. -
రాహుల్‌పై శివసేన ఆగ్రహం..!
సాక్షి, ముంబై: వీర్ సావార్కర్‌పై కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉండటంతో తన ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేయలేకపోతోంది. అయితే సందర్భం దొరికితే మాత్రం.. ఏమాత్రం ఆలోచన చేయకుండా రాహుల్ వ్యాఖ్యలను ఖండిస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ రాహుల్ వ్యాఖ్యలను ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ పార్టీ కీలక నేత, రాష్ట్రమంత్రి ఏక్నాథ్ షిండే రాహుల్ వ్యాఖ్యలపై పరోక్షంగా స్పందించారు. దేశంలో ప్రతిఒక్కరూ వీర్ సావార్కర్‌ను గౌరవించాల్సిందేనని అన్నారు. జాతి నిర్మాణంలో ఆయన పాత్రను ఏ ఒక్కరూ ప్రశ్నించడానికి వీల్లేదని రాహుల్‌ను ఉద్దేశించి చురకలు అంటించారు. (రాహుల్‌పై పరువునష్టం దావా!) హిందుత్వ సిద్ధాంతాల విషయంలో తమ పార్టీ రాజీపడే ప్రసక్తే లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇదివరకే స్పష్టం చేశారు. ‘వీర్ సావర్కర్ మహారాష్ట్రకు మాత్రమే కాదు.. దేశం మొత్తానికి ఆదర్శనీయమైన వ్యక్తి. నెహ్రూ, గాంధీలకు లాగానే సావర్కర్ కూడా దేశం కోసం తన ప్రాణాలు అర్పించారు. అలాంటి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’అని ట్వీట్ చేశారు. కాగా ‘నా పేరు రాహుల్ గాంధీ. రాహుల్ సావర్కర్ కాదు. నేను నిజమే మాట్లాడాను. చావనైనా చస్తాను కానీ క్షమాపణ మాత్రం చెప్పను’అని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో రాహుల్ వ్యాఖ్యలు మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో చిచ్చుపెట్టేలా ఉన్నాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హిందుత్వ అంశంపై కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి అవలంభిస్తోందంటూ బీఎస్పీ చీఫ్ మాయావతి ఇదివరకే పేర్కొన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో శివసేనతో జట్టుకట్టి.. మరోవైపు సావార్కర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆమె ప్రశ్నించారు. (నా పేరు రాహుల్ సావర్కర్ కాదు) దీనిపై వీర్ సావార్కర్ మనవడు రంజిత్ సావార్కర్ మరింత ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేస్తానని ఆయన తెలిపారు. అలాగే దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో కూడా చర్చిస్తానని ఆయన పేర్కొన్నారు. రాహుల్ వ్యాఖ్యలను ఖండించాలని ఠాక్రేను కోరనున్నట్లు ఆయన ప్రకటించారు. శివసేన హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలని, కాంగ్రెస్‌తో స్నేహానికి ముగింపు పలకాలని ఆయన డిమాండ్ చేశారు. ఠాక్రే మంత్రివర్గంలోని కాంగ్రెస్ మంత్రులను వెంటనే తొలగించాలని అన్నారు. -
సస్పెన్స్ సా...గుతోంది!
ముంబై: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు డెడ్‌లైన్ ముంచుకొస్తోంది. అయినా ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఫలితాలు విడుదలైన దగ్గర్నుంచి చెరో రెండున్నరేళ్లు సీఎం పదవిని పంచుకోవాలని డిమాండ్ చేస్తున్న శివసేన పట్టిన పట్టు వీడడం లేదు. రొటేషన్ పద్ధతిలో సీఎం పదవిని పంచుకోవడానికి సిద్ధపడితే బీజేపీతో ఎప్పుడైనా చర్చలకు సిద్ధమేనని శివసేన ప్రకటించింది. 105 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి 182 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని విస్తృతంగా ప్రచారం జరగడంతో శివసేనలో చీలికలు వస్తాయన్న ఆందోళన మొదలైంది. అందుకే ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశమై గంటకు పైగా చర్చలు జరిపారు. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే సర్వాధికారాలు పార్టీ అధినేతకే కట్టబెడుతూ ఎమ్మెల్యేలందరూ తీర్మానాన్ని ఆమోదించారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు చేజారిపోకుండా వారిని అధ్యక్షుడు నివాసమైన మాతోశ్రీకి సమీపంలోని ఫైవ్ స్టార్ హోటల్‌కి తరలించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు పనిచేయవు శివసేనలో చీలికలు రావడం ఖాయమని 25 మందికిపైగా సేన ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతూ ఉండడంతో ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ కమలదళంపై కస్సుమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి బ్లాక్మెయిల్ రాజకీయాల్ని పనిచేయవని అన్నారు. గవర్నర్‌తో బీజేపీ చర్చలు బీజేపీ సీనియర్ నాయకులు గురువారం గవర్నర్ భగత్ సింగ్ కొషియారిని కలుసుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం జరుగుతూ ఉండడంతో ఎదురయ్యే న్యాయపరమైన అడ్డంకులపై గవర్నర్‌తో చర్చించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, మంత్రులు సుధీర్ ముంగంటివార్, గిరీష్ మహాజన్ తదితరులు గవర్నర్‌ని కలిసిన వారిలో ఉన్నారు. అసెంబ్లీ గడువు ముగిసేలోగా ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోతే అతిపెద్ద పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. కాగా, ముఖ్యమంత్రి రేసులో తాను లేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్‌నే ఎమ్మెల్యేలు శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నుకున్నారని తెలిపారు. ఏం జరిగే అవకాశాలున్నాయ్ ! ప్రస్తుత మహారాష్ట్ర అసెంబ్లీ గడువు శనివారంతో ముగియనుంది. ఈ లోపల ప్రభుత్వ ఏర్పాటుపై ఏదో ఒక స్పష్టత రావాలి. లేదంటే జరిగే పరిణామాలు ఏవంటే.. ► ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరైనా ముందుకు వచ్చే వరకు దేవేంద్ర ఫడ్నవీస్‌నే సీఎంగా కొనసాగాలని గవర్నర్ ఆదేశించే అవకాశం. ► మహారాష్ట్ర గవర్నర్‌ని బీజేపీ ఎమ్మెల్యేల బృందం కలిసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం. సభలో బల నిరూపణకు గవర్నర్ సమయాన్ని ఇవ్వడం. ► బీజేపీయేతర పక్షాలన్నీ చేతులు కలిపి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని గవర్నర్‌ని కోరడం. ► మెజార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించడం. -
కోడ్‌ను పట్టించుకోను..
సాక్షి, ముంబై : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళిని తాను పట్టించుకోనని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ బాహాటంగా వ్యాఖ్యానించారు. ఎన్నికల కోడ్‌తో సంబంధం లేదని..తమకు తోచిన విధంగా మాట్లాడతామని సోమవారం ముంబై శివార్లలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పేర్కొన్నారు. తమ మనసులో ఏముంటే దాన్నే మాట్లాడతామని, కోడ్ సంగతి ఆ తర్వాత చూసుకుంటామని ర్యాలీకి హాజరైన వారిని ఉద్దేశించి రౌత్ చెప్పుకొచ్చారు. శివసేన నేత వ్యాఖ్యలపై ఈసీ ఇప్పటివరకూ స్పందించలేదు. కాగా సీపీఐ అభ్యర్ధి కన్నయ్య కుమార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తూ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ సంజయ్ రౌత్‌కు ముంబై జిల్లా ఎన్నికల అధికారి ఇటీవల నోటీసులు జారీ చేశారు. కన్నయ్య కుమార్‌ను ఎలాగైనా రానున్న ఎన్నికల్లో ఓడించాలని, అందుకు అవసరమైతే బీజేపీ ఈవీఎంలను టాంపరింగ్ చేయాలని శివసేన పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. బిహార్‌లోని బెగుసరై నుంచి జేఎన్టీయూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ రౌత్‌కు జారీ చేసిన నోటీసులో ఈవీఎంలు, ఎన్నికల ప్రక్రియ పట్ల విశ్వాసం లేనట్టుగా రౌత్ ప్రకటన ఉందని ముంబై సిటీ కలెక్టర్ శివాజీ జోన్ధలే పేర్కొన్నారు. -
మోదీ ఫ్రాన్స్.. రాహుల్ క్రొయేషియా
ముంబై: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచినట్లు ప్రధాని మోదీ అవిశ్వాస పరీక్షలో నెగ్గినా, రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియాలా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అందరి మనసులు గెలుచుకున్నారని శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ కితాబిచ్చారు. ‘ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ గెలిచినప్పటికీ, గొప్ప ఆటతీరు, పోరాటపటిమను ప్రదర్శిం చిన జట్టుగా క్రొయేషియాను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. రాహుల్‌ను అందరూ ఇదే తరహాలో చూస్తున్నారు. ఎవరైనా ఇలాంటి రాజకీయాలు చేస్తే కచ్చితంగా అతను మిగతా వారి కంటే నాలుగైదు అడుగులు ముందుంటాడు’ అని వ్యాఖ్యానించారు. అందరి దృష్టిని ఆకర్షించేందుకే రాహుల్ మోదీని కౌగిలించుకున్నారనీ, ప్రధానికి షాకివ్వాలన్న లక్ష్యంతో రాహుల్ ఆ పని చేసుంటే ఆయన లక్ష్యం నెరవేరినట్లేనని రౌత్ అభిప్రాయపడ్డారు. -
ప్రణబ్ ప్రధాని అభ్యర్థి కావొచ్చు
ముంబై: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం రాకపోతే.. ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీకి బదులు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆరెస్సెస్ ముందుకు తెచ్చే అవకాశం ఉందని శివసేన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 7న నాగ్‌పూర్‌లో జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరై ప్రసంగించడం తెలిసిందే. ఆరెస్సెస్ అసలు ప్రణబ్‌ను ఎందుకు ఆహ్వానించిందో సాధారణ ఎన్నికల అనంతరం కానీ స్పష్టత రాదని శివసేనకు చెందిన సంజయ్ రౌత్ అన్నారు. ఆదివారం ఆయన ముంబైలో మాట్లాడుతూ ‘పరిస్థితి చూస్తుంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా లేదు. హంగ్ ఏర్పడిన పక్షంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీకి ఇతర పార్టీలు మద్దతివ్వకపోతే, ప్రణబ్ ముఖర్జీని ప్రధాని అభ్యర్థిగా ఆరెస్సెస్ ముందుకు తెచ్చే అవకాశం ఉంది. ఆయనైతే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటారు’ అని అన్నారు. అయితే సంజయ్ రౌత్ వ్యాఖ్యలను ప్రణబ్ కూతురు, కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ట ముఖర్జీ ఖండించారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తన తండ్రికి లేదని ఆమె స్పష్టం చేశారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై శర్మిష్ట ట్విట్టర్లో స్పందిస్తూ ‘సంజయ్ రౌత్.. మా నాన్న రాష్ట్రపతిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి ఆయన రారు’ అని స్పష్టం చేశారు.