సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమితో సీట్ల పంపణీ విషయంపై శివసేన(ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పార్టీ సంప్రదింపులు ఓ కొలిక్కి రావటం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ మొదటి నుంచి సీట్ల పంపిణీ చర్చలు జరగనున్నట్లు శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. శివసేన గెలిచిన సీట్లపై కాకుండా మిగతా సీట్లపై చర్చలు కొంత అలస్యంగా జరుపుతామని తెలిపారు. ఇదే విషయాన్ని తాము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు తెలియజేశామన్నారు.
2019లో బీజేపీ కూటమి ద్వారా ఎన్నికల బరిలోకి దిగి 23 స్థానాల్లో పోటీ చేయగా 18 సీట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గతేడాది శివసేనలో ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలో చీలికలు వచ్చాయి. మెజార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్రకు సీఎం అయ్యారు. అయితే ఇప్పటికీ శివసేన(ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే).. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిలో కొనసాగుతోంది.
మొదటి నుంచి శివసేన(యూబీటీ) తాము 23 స్థానాల్లో పోటీ చేస్తామంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో శివసేన(యూబీటీ) తాము 2019లో గెలిచిన సీట్లు తప్ప మిగతా వాటిపై చర్చలు కొంత అలస్యంగా జరుపుతామని కాంగ్రెస్ నేతలకు వెల్లడించింది.
చదవండి: ‘నేను కూడా హిందూనే’.. హిందుత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment