siva sena
-
మహారాష్ట్ర బీజేపీ కూటమిలో మొదలైన సీట్ల పంచాయితీ!
ముంబై: ఈ ఏడాది చివరల్లో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి పార్టీల్లో ఇప్పటి నుంచే సీట్ల పంపకం చర్చ మొదలైంది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లు ఉన్న మహారాష్ట్రలో ఏ పార్టీ ఏన్ని సీట్లు పోటీ చేయాలని దానిపై ఎన్డీయే కూటమి పార్టీల మధ్య పోరు ప్రారంభమైంది.బీజేపీ దాదాపు 150 సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం శివసేన( షిండే) పార్టీ 100 సీట్లు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీ 80 సీట్లలో పోటీ చేయాలనుకుంటున్నట్లు సమాచారం. 40 సీట్లలో ఎవరు ఏ పార్టీ పోటీ చేస్తుందనే విషయంలో తీవ్ర అసమ్మతి నెలకొనటంతో సుదీర్ఘ చర్చలకు దారితీసినట్లు తెలుస్తోంది.లోక్‌సభ ఎన్నికలల్లో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న మహాయుతి కూటమి ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయింది. మొత్తం 48 లోక్ సీట్లలో ప్రతిపక్షం మహా వికాస్ అఘాడి 30 సీట్ల గెలుపొందగా.. బీజేపీ ఎన్డీయే కూటమి కేవలం 17 సీట్లకే పరిమితమైంది. లోక్‌సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శన, సీట్ల మధ్య విభేదాలు, ఇతర అంశాలు అసెంబ్లీ సీట్ల విభజనపై కీలక పాత్ర పోషిస్తాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఎన్సీపీ నేత అజిత్ పవార్, బీజేపీ డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి గురువారం ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాను కలిశారు. అయితే వారి భేటీ సీట్ల విభజన చర్చలోకి వచ్చినట్లు సమాచారం. అయితే సీట్ల విభజన జరుతున్నట్లు వస్తున్న వార్తలను మహాయుతి పార్టీలు కొట్టిపారేస్తున్నాయి. మరోవైపు.. శుక్రవారం కేంద్ర మంత్రి నారాయణ్ రాణే మీడియాతో మాట్లాడుతూ విలేకర్లు అడిగిన ప్రశ్నకు.. మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ సీట్లలో బీజేపీ అభ్యర్థులను బరిలోకి దింపుతామని చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. -
ఎంవీఏ కూటమి సీఎం అభ్యర్థిపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ముంబై: అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో మహారాష్ట్రలో రాజకీయం అసక్తికరంగా మారుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి(ఎంవీఏ)కూటమి తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందస్తుగా ప్రకటించాలని వస్తున్న సూచనను ఎన్సీపీ (శరద్ పవార్) చీఫ్ శరద్ పవార్ తిరస్కరించారు. కూటమి తరఫున శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీలో చర్చలు జరగుతున్న సమయంలో శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.‘మన కూటమే మన ఉమ్మడి సీఎం అభ్యర్థి. ఒక వ్యక్తిని సీఎం అభ్యర్థిగా ప్రకటించటంపై మాకు నమ్మకం లేదు. ఉమ్మడి నాయకత్వమే మా ఫార్మూలా’ అని శరద్ పవార్ అన్నారు.అయితే సీఎం అభ్యర్థి ప్రకటనపై కూటమిలో గురువారం నుంచి అంతర్గతం వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. ఓవైపు శరద్ పవార్ తిరస్కరిస్తున్న సమయంలోనే శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్.. ఎంవీకే కూటమి తరఫున సీఎం అభ్యర్థిగా ఉద్ధవ్ ఠాక్రేను నిలపాలని అంటున్నారు. శరద్ పవార్ వ్యాఖ్యపై సంజయ్ రౌత్ స్పందించారు.‘శరద్ పవార్ చెబుతుంది నిజమే. ఎంవీకే కూటమి ముందు మెజార్టీ స్థానాలకు సాధించాలి. అయితే రాహుల్ గాంధీని లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించి ఉంటే మరో 23 నుంచి 30 సీట్లను ఇండియా కూటమి గెలచుకొని ఉండేది. ఇది మా పార్టీ అభిప్రాయం. ఏ ప్రభుత్వం, పార్టీ అయినా సీఎం అభ్యర్థి ముఖం లేకుండా ఉండకూడదు. ప్రజలకు కూడా తెలియాలి కదా.. వారు ఎవరికి ఓటు వేస్తున్నారో. ..ప్రజలు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, నరేంద్ర మోదీ ఇలా అభ్యర్థుల ముఖాలను చూసే ఓటు వేశారు. అదేవిధంగా ఎంవీఏ కూటమి తరఫున ఎవరిని సీఎం అభ్యర్థిగా పెట్టినా మాకు ఇబ్బంది లేదు. ఎంవీఏలో మూడు పార్టీలు ఉన్నాయి. మూడు పార్టీలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాయి. మళ్లీ అసెంబ్లీకి సైతం ఇలాగే ఉమ్మడిగా పోటీ చేయడానికి సిద్ధం’ అని అన్నారు.ఇదిలా ఉండగా.. ఇటీవల సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘ఉద్ధవ్ ఠాక్రే గతంలో ఎంవీఏ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన చేసిన మంచి పనులను ప్రజలు ఇంకా గుర్తుపెట్టుకున్నారు. అదే విధంగా లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉద్ధవ్ ఠాక్రే పలు మిత్రపక్షాలను ముందుండి నడిపించారు’ అని అన్నారు. మహారాష్ట్రలో సెపప్టెంబర్/ అక్టోబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. -
ప్రచారంలో సీనియర్ హీరో స్టెప్పులు!
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బాలీవుడ్ హీరో గోవిందా తళుక్కున మెరిశారు. దశాబ్దకాలం తర్వాత రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న ఆయన మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. శివసేన స్టార్ క్యాంపెయినర్‌గా పార్టీ ప్రచారాల్లో పాల్గొంటున్నారు. గోవిందా ఎన్నికల ప్రచార వేదికపై డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరిస్తున్నారు.ఆయన డ్యాన్స్‌ను చూసిన శివసేన నేతలు కూడా ఉత్పాహంగా ఆయనతోపాటు కాలు కదుపుతున్నారు. గోవిందా స్టైల్, ఉత్సాహం మునుపటిలానే ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. 2004లో ముంబై నార్త్ లోక్‌సభ స్థానం నుంచి గోవిందా కాంగ్రెస్ టిక్కెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి, బీజేపీ సీనియర్ నేత రామ్ నాయక్‌ను ఓడించారు. అయితే ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.चुनाव प्रचार के बीच गोविंदा का जोरदार डांस◆ एक्टर को डांस करता देखकर वहां मौजूद जनता और बाकी नेता भी झूम उठे#Govinda #ActorGovinda #Maharashtra pic.twitter.com/Zdugpko9Zp— News24 (@news24tvchannel) May 9, 2024Video Credits: News24తాజాగా గోవిందా గత మార్చి లో శివసేనలో చేరారు. ఏక్నాథ్ షిండే సమక్షంలో శివసేనలో చేరినప్పటి నుంచి ఆయన ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ప్రస్తుతానికి గోవిందా లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తారా లేదా అనేది ఖరారు కాలేదు. అయితే ముంబై నార్త్‌వెస్ట్ నుంచి ఆయనను శివసేన ఎన్నికల బరిలోకి దింపవచ్చనే టాక్ వినిపిస్తోంది. -
మేనిఫెస్టో విడుదల చేసిన ఉద్ధవ్ ఠాక్రే
శివసేన (యూటీబీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే లోక్‌సభ ఎన్నికల 2024 కోసం పార్టీ మేనిఫెస్టోను గురువారం విడుదల చేశారు. లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరగటానికి ఒకరోజు ముందు మేనిఫెస్టోను 'వచన్ నామ' పేరుతో విడుదల చేశారు.శివసేన పార్టీ తన మేనిఫెస్టోలో ప్రధానంగా దోపిడిని ఆపడం, ఉపాధి కల్పన, వ్యవసాయ రుణమాఫీ మొదలైనవాటిపైన ద్రుష్టి పెటుతోంది. రాష్ట్ర అభివృద్ధి ప్రధానం అంటూ ఉద్ధవ్ ఠాక్రే విలేకర్ల సమావేశంలో పేర్కొన్నారు.ఉద్యోగాల కల్పన: రాబోయే రోజుల్లో ఉద్యోగ కల్పన చాలా అవసరం అని పేర్కొన్నారు. తప్పకుండా రాష్ట్రంలో కావలసిన ఉద్యోగాలను ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు. ప్రజలు రాష్ట్రాన్ని వదిలి వలస వెళ్లకుండా.. జిల్లా స్థాయిలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన అన్నారు.రైతుల సంక్షేమం: వ్యవసాయ రుణాలను మాఫీ చేయడమే కాకుండా, పంట భీమాకు సంబంధించిన షరతులను కూడా సవరిస్తామని ఉద్ధవ్ ఠాక్రే మేనిఫెస్టోలో వెల్లడించారు. వ్యవసాయ పరికరాలు, విత్తనాల మీద GST లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. స్వామినాథన్ కమిటీ నివేదిక సిఫార్సు చేసిన కనీస మద్దతు ధర అమలు కూడా జరుగుతుందని ఆయన అన్నారు.పన్నుల వ్యవస్థ: పన్ను ఉగ్రవాదాన్ని తగ్గించడానికి, న్యాయపరమైన.. సమన పన్నుల వ్యవస్థను నిర్థారిస్తామని ఠాక్రే అన్నారు.పర్యావరణ పరిరక్షణ: మహారాష్ట్రలో పర్యావరణ అనుకూల ప్రాజెక్టులు, పరిశ్రమలను మాత్రమే అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.మహారాష్ట్రలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు శుక్రవారం (ఏప్రిల్ 26) రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. బుల్దానా, అకోలా, అమరావతి, వార్ధా, యవత్మాల్-వాషిం, హింగోలి, నాందేడ్, పర్భాని ప్రాంతాల్లో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రాంతాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 16,589 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ జరుగుతుందని అధికారులు తెలిపారు.#WATCH | Former Maharashtra Chief Minister and Shiv Sena (UBT) chief Uddhav Thackeray releases the party manifesto named 'Vachan nama' for the Lok Sabha elections, in Mumbai.#LokSabhaElections2024 pic.twitter.com/6dcQhs8X8N— ANI (@ANI) April 25, 2024 -
‘ఎలక్షన్ కమిషన్ ప్రైవేటీకరణ’.. శివసేన ఎంపీ తీవ్ర వ్యాఖ్యలు
సార్వత్రిక ఎన్నికల ముంగిట కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ రాజీనామా నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్‌పై శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ బీజేపీ శాఖలా మారిందని ఆరోపించారు. ముంబైలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సంఘాన్ని బీజేపీ ప్రైవేటీకరించిందని మండిపడ్డారు. ’ఎలక్షన్ కమిషన్ బీజేపీ శాఖలా మారింది. టీఎన్ శేషన్ (మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్) హయాంలో ఉన్నట్టుగా వ్యవస్థ ఇప్పుడు లేదు. విశ్వసనీయమైన నియంత్రణ సంస్థగా ఉండే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు విశ్వసనీయతను కోల్పోయింది. గత పదేళ్లలో ఎలక్షన్ కమిషన్ ప్రైవేటీకరించారు’ అన్నారు. ఎలక్షన్ కమిషన్ తీరును విమర్శిస్తూ ‘ఈ రోజుల్లో ఎలక్షన్ కమిషన్ ఎలా పని చేస్తోందో శివసేన (యూబీటీ), ఎన్సీపీ అనుభవించాయి. ఎన్సీపీ పార్టీని, ఎన్నికల గుర్తును అనర్హులకు అప్పగించారు.మనకు తెలిసిన ఎన్నికల కమిషన్ ఎప్పుడో చచ్చిపోయింది’ అన్నారు. ఎన్సీపీలో ఇటీవల చీలిక వచ్చింది. అజిత్ పవార్ వర్గానికే పార్టీ ఎన్నికల గుర్తు అయిన గడియారం గుర్తను ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. పార్టీ చీలిక తర్వాత అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇది శరత్ పవార్ వర్గానికి శరాఘాతంగా మారింది. ఇక శివసేన విషయంలోనూ తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే వర్గానికే పార్టీ అధికారిక బాణం, విల్లు ఎన్నికల గుర్తును ఎలక్షన్ కమిషన్ కేటాయించింది. దీంతో ఉద్దవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) కాగడా గుర్తును వినియోగిస్తోంది. -
Uddhav Thackeray: స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్య హత్య
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేనపార్టీ అని స్పీకర్ రాహుల్ నర్వాకర్ స్పష్టం చేశారు. దీనిపై శివసేన(యూబీటీ)నేత ఉద్ధవ్ ఠాక్రే స్పదిస్తూ.. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటమేనని అన్నారు. స్పీకర్ నిర్ణయం వెల్లడించిన అనంతరం ఉద్ధవ్ మీడియాతో మట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వాకర్ తమ వర్గం మెజర్టీని సరిగా అర్థం చేసుకోలేకపోయరని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఇది చాలా సులువైన కేసు అని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా సరైన తీర్పు వెల్లడిస్తే.. స్పీకర్ మాత్రం తాను సుప్రీంకోర్టు కంటే ఉన్నతుడిగా భావించాడని తెలిపారు. తమకు వ్యతిరేకంగా స్పీకర్ తన నిర్ణయం వెల్లడించారని చెప్పారు. అయితే స్పీకర్ రాహుల్ నర్వాకర్ వెల్లడించిన నిర్ణయాన్ని తమ వర్గం(యూబీటీ) తీవ్రంగా తిరస్కరిస్తోందని అన్నారు. ఈ వ్యవహారంపై తాము మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. తమకు వ్యతిరేకంగా స్పీకర్ తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునే ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు.. కోర్టు ధిక్కార కేసు వేస్తుందా? లేదా? అనేది చూడాలని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. సీఎం ఏక్నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ స్పష్టం చేయటంతో సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏక్నాథ్ షిండే వర్గానికే ఉందని తెలిపారు. శివసేన నుంచి సీఎం ఏక్నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేన (యూబీటీ) వర్గం నేత అయిన ఉద్ధవ్ ఠాక్రేకు లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఇక.. 2022 జూన్‌లో ఏక్నాథ్ షిండే, పలువురు ఎమ్మెల్యేలు శివసేన పార్టీ చీల్చి బయటకు వచ్చారు. దీంతో మహా వికాస్ అఘడి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఇక.. ఏక్నాథ్ షిండే, పలువురి రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ చేరాడు. బీజేపీ మద్దతు ఆయన మహారాష్ట్ర సీఎంగా అధికారం చేపట్టారు. అయితపాటు శివసేన నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే మంత్రుల పదవలు దక్కటం గమనార్హం. చదవండి: Ram Mandir: ‘కాంగ్రెస్ రాముడి ఉనికినే తిరస్కరిస్తోంది’ -
నయనతారపై పోలీసులకు ఫిర్యాదు.. ఎందుకంటే?
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం అన్నపూరణి. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ చిత్రంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మూవీ శ్రీరాముడిని కించపరిచేలా ఉందంటూ మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి ముంబై పోలీసులను ఆశ్రయించాడు. తమ మనోభావాలు దెబ్బతీసేలా చిత్ర నిర్మాతలు రాముడిని కించపరిచారని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఫిర్యాదు చేసిన విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. (ఇది చదవండి: ఓటీటీకి రూ.300 కోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అంతే కాకుండా ఈ చిత్రం లవ్ జిహాద్‌ను ప్రోత్సహించేలా ఉందంటూ ఆరోపించారు. సినిమా నిర్మాతలతో పాటు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ముంబై పోలీసులను కోరాడు. ఈ సినిమా నిర్మాతలపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను అభ్యర్థించారు. తమ మనోభావాలు దెబ్బతీసేలా సినిమాను నిర్మించారని.. అన్నపూరణి దర్శకుడు నీలేష్ కృష్ణ, నయనతార, నిర్మాతలతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఇండియాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. అయితే ఇప్పటివరకు ఈ ఫిర్యాదుపై చిత్ర నిర్మాతలు ఇంకా స్పందించలేదు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 1, 2023న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో జై, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. I have filed complain against #AntiHinduZee and #AntiHinduNetflix At a time when the whole world is rejoicing in anticipation of the Pran Pratishtha of Bhagwan Shri Ram Mandir, this anti-Hindu film Annapoorani has been released on Netflix, produced by Zee Studios, Naad Sstudios… pic.twitter.com/zM0drX4LMR — Ramesh Solanki🇮🇳 (@Rajput_Ramesh) January 6, 2024 -
Shiv Sena (UBT): ‘సీట్ల పంపిణీ చర్చలు మళ్లీ మొదటికి’
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమితో సీట్ల పంపణీ విషయంపై శివసేన(ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే) పార్టీ సంప్రదింపులు ఓ కొలిక్కి రావటం లేదు. ఈ నేపథ్యంలో మళ్లీ మొదటి నుంచి సీట్ల పంపిణీ చర్చలు జరగనున్నట్లు శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. శివసేన గెలిచిన సీట్లపై కాకుండా మిగతా సీట్లపై చర్చలు కొంత అలస్యంగా జరుపుతామని తెలిపారు. ఇదే విషయాన్ని తాము కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు తెలియజేశామన్నారు. 2019లో బీజేపీ కూటమి ద్వారా ఎన్నికల బరిలోకి దిగి 23 స్థానాల్లో పోటీ చేయగా 18 సీట్లతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే గతేడాది శివసేనలో ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో చీలికలు వచ్చాయి. మెజార్టీ ఎంపీ, ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ మద్దతుతో ఏక్నాథ్ షిండే మహారాష్ట్రకు సీఎం అయ్యారు. అయితే ఇప్పటికీ శివసేన(ఉద్దవ్ బాలాసాహెబ్ ఠాక్రే).. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిలో కొనసాగుతోంది. మొదటి నుంచి శివసేన(యూబీటీ) తాము 23 స్థానాల్లో పోటీ చేస్తామంటూ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ డిమాండ్‌ను కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ఈ నేపథ్యంలో శివసేన(యూబీటీ) తాము 2019లో గెలిచిన సీట్లు తప్ప మిగతా వాటిపై చర్చలు కొంత అలస్యంగా జరుపుతామని కాంగ్రెస్ నేతలకు వెల్లడించింది. చదవండి: ‘నేను కూడా హిందూనే’.. హిందుత్వంపై సీఎం కీలక వ్యాఖ్యలు -
‘50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లింది మరిచారా?’
ముంబై: శివసేన నేత ఆదిత్య ఠాక్రే, ఆయన తండ్రి, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్. మీ ఇద్దరిని చూసి బీజేపీ భయపడదన్నారు. 32 ఏళ్ల వ్యక్తికి ఈ ప్రభుత్వం భయపడుతోందంటూ ఆదిత్య ఠాక్రే చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ నిరవధిక వాయిదా పడిన తర్వాత మీడియాతో శుక్రవారం మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి. ‘కనీసం అతడి తండ్రిని చూసి కూడా ఇక్కడ ఎవరూ భయపడరు. మీ పార్టీ నుంచి అంతా చూస్తుండగానే 50 మంది ఎమ్మెల్యేలను తీసుకెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం. అప్పుడు ముంబయి అట్టుడుకుతుందని, కాలిపోతుందన్నారు. కానీ అగ్గిపుల్ల కూడా మండలేదు.’ అని దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతకు ముందు అసెంబ్లీ వేదికగా.. శ్రీ సిద్ధివినాయక ఆలయ ట్రస్టులో అవకతవకలపై విచారణను నెలరోజుల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: 'నన్నెవరు కొట్టలేదు.. అదో పెద్ద స్కామ్': నటి ఆవేదన -
రాహుల్ సావర్కర్ వ్యాఖ్యల వివాదం... తగ్గేదేలే! అంటున్న శివసేన
న్యూఢిల్లీ: ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన నాయకుడు సంజయ్‌రౌత్ హిందూత్వ సిద్ధాంతాలను విశ్వసించే తాము సావర్కర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపక్షేంచమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ జోడో యాత్రలో భాగంగా సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో శివసేన నాయకుల ఇంకా ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు విషయంలో శివసేన రాజీపడేదే లేదని కరాకండీగా చెప్పేసింది. సావర్కర్ పదేళ్లకు పైగా అండమాన్ జైలులో ఉన్నారని అందువల్ల జైలు జీవితం అనుభవించిన వారికే ఆ బాధ ఏంటో తెలుస్తుందని రౌత్ అన్నారు. ఇది కేవలం సావర్కర్ అనే కాదు అది నెహ్రు అయినా, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అయినా...ఎవరైనా సరే చరిత్రను వక్రీకరించడం సరికాదని తేల్చి చెప్పారు. రాహుల్‌గాంధీతో ఈ విషయం గురించి ఏమి చర్చించం, అలాగని ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించం అని అన్నారు. ఇకపై తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు అనేది రాజీపై నడుస్తుందని, పొత్తు ఎప్పటికీ రాజీయేనని తేల్చి చెప్పారు. ఐతే పొత్తు కోసం కాగ్రెస్‌తో కొనసాగుతాం, రాహుల్ గాంధీ, సోనియాలో మాట్లాడుతుంటాం. కానీ ప్రతి విషయంలో కాంగ్రెస్‌తో తాము ఏకాభిప్రాయంతో ఉండమన్నారు. అలాగే హిందూత్వ విషయాల్లో రాజీపడం అని తేల్చి చెప్పారు. రాహుల్ గాంధీ తనని ఫోన్లో ఆరోగ్యం గురించి కుశల ప్రశ్నలు వేశారని సంజయ్ రౌత్ ప్రశంసించిన ఒక రోజు తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సంజయ్ రౌత్ తనను ఒక తప్పుడూ కేసులో ఇరికించి 110 రోజుల పాటు జైలులో చింత్రహింసలకు గురిచేశారని చెప్పారు. కాగా రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా జైలులో ఉన్న సావర్కర్ బ్రిటీష్ వారి దయ కోసం ఎదురు చూశారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు పెను వివాదానికి తెర తీశాయ. దీంతో లెజెండరీ నాయకులు జవహార్ లాల్ నెహ్రో, మహాత్మగాంధీ, సర్దార్ పటేల్ వంటి నాయకులు కూడా బ్రిటీష్పాలనా కాలంలో జైలు పాలయ్యారని, వారిని కూడా రాహుల్ అవమానించినట్లేనని సంజయ్ రౌత్ ఆరోపణలు చేశారు. ఏదీఏమైనా రాహుల్ చేసిన వ్యాఖ్యాలు ఇరు పార్టీ వర్గాల సభ్యలను కాస్త కలవరపాటు గురి చేశాయి. (చదవండి: రాహుల్ సావర్కర్ వ్యాఖ్యలపై దుమారం.. కాంగ్రెస్‌తో శివసేన తెగదెంపులు?) -
బీఎంసీ పీఠమే లక్ష్యం.. సినీ నటులపై దృష్టిపెట్టిన కాంగ్రెస్
సాక్షి, ముంబై: బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ తమ అస్త్రశ్రస్తాలను సిద్ధం చేసుకుంటోంది. ఈసారి బీఎంసీ పీఠాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. బీఎంసీలో గత 25 ఏళ్లుగా ఆధిపత్యం చలాయిస్తున్న శివసేనను ఎలాగైనా గద్దె దింపి తమ బలం పెంచుకోవాలని చూస్తోంది. దీనికోసం సినీనటుల సేవలను వినియోగించుకోవాలని అనుకుంటోంది. అవసరమైతే రితేశ్ దేశ్‌ముఖ్, సోనూసూద్, మిలింద్ సోమణ్లలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటించాలని భావిస్తోంది. ఈ మేరకు ముంబై కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వానికి ఇప్పటికే సూచించినట్లు సమాచారం. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే బీఎంసీ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు కచ్చితంగా ఓట్లు పడతాయని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే బీఎంసీ ఎన్నికల్లో శివసేన, కాంగ్రెస్‌ల మధ్య పోరు రసవత్తరంగా మారే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ భాగస్వామ్య పారీ్టలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, బీఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అంశంపై ఈ మిత్ర పక్షాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. బీఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని శివసేన అంటుంటే, తాము ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తేనే పార్టీ బలపడుతుందని ముంబై కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పలుమార్లు సంకేతాలిచ్చారు. అంతేగాక, దివంగత ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ తనయుడు, నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లోకి వస్తారని చర్చ జరుగుతోంది. అది ఈ ఎన్నికల్లోనే జరగవచ్చని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. దీనిపై సోషల్ మీడియాలో కూడా చర్చలు నడుస్తున్నాయి. మరోవైపు ఈ ఊహాగానాలను ఇప్పటికే సోనూ సూద్ తోసిపుచ్చారు. చదవండి : స్పెషల్ ఒలింపిక్స్ గేమ్స్: సోనూ సూద్‌కు అరుదైన గౌరవం బీఎంసీలో అధికారం చేజిక్కించుకోవాలంటే ఉత్తర భారతీయులు, మైనారిటీ ఓట్లు ముఖ్యం కానున్నాయి. ప్రజల్లో నటీనటులపై ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో రితేష్ దేశ్‌ముఖ్, సోనూసూద్, మిలింద్ సోమణ్లలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా ప్రకటిస్తే గెలుపు ఖాయమని ముంబై కాంగ్రెస్ భావిస్తోంది. బీఎంసీలో గత 25 ఏళ్లుగా శివసేనదే ఆధిపత్యం. దీంతో ఈసారి ఎలాగైనా శివసేన ఆధిపత్యానికి చెక్ పెట్టి, తమ పట్టు నిలుపుకోవాలని ముంబై కాంగ్రెస్ నేతలు పట్టుదలతో ఉన్నారు. -
రూపాయికే పెట్రోలు : ఎగబడిన జనం
సాక్షి,ముంబై: మండుతున్న పెట్రోలు ధరలు వాహనదారుల జేబులకు చిల్లులు పెడుతున్నసంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒక రూపాయికే పెట్రోలు లభించడం వారికి వరంలా మారింది. దీంతో జనం క్యూట్టారు. మహారాష్ట్రలోని, శివసేన పార్టీ వాహనదారులకు ఈ తీపి కబురు అందించారు. డోంబివలీలోని పెట్రోల్ బంకులో లీటరు పెట్రోలు రూపాయికే పంపిణీ చేశారు. సుమారు 1200 మందికి లీటరుకు ఒక రూపాయి చొప్పున పెట్రోలు అందించారు. మహారాష్ట్ర యువనేత, పర్యావరణ మంత్రి ఆదిత్యా థాక్రే పుట్టినరోజు సందర్బంగా ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన అభిమానులు లీటరు పెట్రోలు రూపాయికే విక్రయించారు. ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు వాహనదారులకు బారులుతీరారు. డొంబివ్లీకి చెందిన శివసేన కార్పొరేటర్, దీపేశ్ మత్రే, పూజా మత్రే, కల్యాణ్ యువసేన నేత యోగేశ్ మత్రేతో సహా మరికొంతమంది నేతలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రెండు గంటలకు రూపాయికే లీటర్ పెట్రోల్‌ను పంపిణీ చేశారు. లాక్డౌన్ ఆంక్షలతో ప్రయాణికులు తమ సొంత వాహనాలను ఎంచుకోవాల్సి వస్తోంది. ఫలితంగా వీరిపై రోజుకు సుమారు 400 రూపాయల భారం పడుతోదని శివసేన స్థానిక దీపేశ్ మత్రే చెప్పారు. మొదటి 500 మందికి ఇవ్వాలనుకున్నాం. కానీ జనం భారీగా రావడంతో దీన్ని కొనసాగించామని తెలిపారు. కాగా ముంబైలో లీటరుకు రూ. 102.58, డీజిల్ రూ. 94.70 పలుకుతున్న సంగతి తెలిసిందే. చదవండి : ఎన్ఎస్డీఎల్: అదానీకి భారీ షాక్ Petrol diesel prices: పెట్రో రికార్డు పరుగు -
రాష్ట్రపతి పాలన?!: బీజేపీ నేత వ్యాఖ్యల కలకలం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో శివసేన అధికారం చేపట్టింది మొదలు బీజేపీ, శివసేన మధ్య ఏదో ఒక రూపంలో విభేదాల సెగలు రగులుతూనే ఉన్నాయి. తాజాగా స్థానిక బీజేపీ నేత శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అగాధి(ఎంవీఏ) సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న పదిహేనురోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయడం ఖాయమని, దాంతో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సమయం రానుందంటూ మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. కొంతమంది ఈ మంత్రులకు వ్యతిరేకంగా కోర్టుకు వెళతారు, ఇక ఆ తరువాత సదరు మంత్రులు వైదొలగవలసి ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఆ మంత్రులు ఎవరనేది మాత్రం ఆయన స్పష్టం చేయలేదు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో వాజ్‌ను సర్కార్ భారీగా వెనకేసుకొచ్చిందని ఆరోపించారు. దీంతో అసెంబ్లీని తొమ్మిది సార్లు వాయిదా వేయాల్సి ఉందని కూడా ఆయన గుర్తు చేశారు. శివసేన, ఎన్‌సిపి, కాంగ్రెస్ కూటమి రాష్ట్రంలో వ్యవస్ధీకృత నేరాలకు పాల్పడుతోందంటూ పాటిల్ ధ్వజమెత్తారు. (అనిల్ దేశ్‌ముఖ్ 2 కోట్లు అడిగారు) అవినీతి ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి పదవికి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా నేపథ్యంలో , మరిన్ని అవినీతా ఆరోపణలతో రానున్న పదిహేను రోజుల్లో మరో ఇద్దరు మంత్రులు రాజీనామా చేయాల్సి ఉంటుందని బీజేపీ చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. రాష్ట్రపతి పాలన దిశగా రాష్ట్రంలో పరిణామాలు మారబోతున్నాయని వ్యాఖ్యానించారు. తాను సర్వీసులో కొన సాగాలంటే రెండు కోట్ల రూపాయలు చెల్లించాలని మాజీ రాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీకి చెందిన అనిల్ దేశముఖ్ డిమాండ్ చేశారని సస్పెన్షన్‌కు గురైన ముంబై మాజీ పోలీస్ అధికారి సచిన్ వాజే ఆరోపించిన క్రమంలో చంద్రకాంత్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలుచేయాలని మరో మంత్రి అనిల్ పరాబ్ కోరారంటూ వాజే ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. (ఇది ఆరంభం మాత్రమే : కంగనా సంచలన వ్యాఖ్యలు) కాగా ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశించడంతో సోమవారం రాష్ట్ర హోంమంత్రి పదవికి అనిల్‌దేశ్‌ముఖ్ రాజీనామా చేశారు. -
మేం మర్చిపోం, మర్చిపోనివ్వం: ఫడ్నవీస్
పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీపై మండిపడ్డారు. అందుకే బిహార్‌లో సుశాంత్ పోస్టర్లను దేవేంద్ర ఫడ్నవీస్ పెట్టించారని ఆరోపించారు. సుశాంత్ మరణాన్ని అడ్డుపెట్టుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి ఫడ్నవీస్ సారథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిహార్‌లో వెలిసిన సుశాంత్ పోస్టర్లు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దీని గురించి ఫడ్నవీస్ స్పందిస్తూ ‘మేం సుశాంత్ సింగ్ మరణాన్ని రాజకీయాలకు వాడుకోవాలనుకోవడంలేదు. సుశాంత్ విషయం జరగకముందు నుంచే నేను బిహార్ ఎన్నికల కోసం పని చేస్తున్నాను. ఈ విషయం కామన్ మ్యాన్ భావాలకు స్పందించింది. సుశాంత్‌కు తప్పకుండా న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. అందుకే మేం చెబుతున్నాం మర్చిపోము, మర్చిపోనివ్వము’ అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ అనుకోని పరిస్థితులలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక శివసేన ప్రభుత్వంపై ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర గవర్నమెంట్ కరోనాపై యుద్ధం ముగిసిందని భావించి ప్రస్తుతం కంగనాపై యుద్ధం మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు. చదవండి: ‘సుశాంత్ రోజుకు 5 సార్లు డ్రగ్స్ తీసుకునేవాడు’ -
కంగనాకు మద్దతుగా నిలిచిన కేంద్రమంత్రి
ముంబై: కేంద్ర మంత్రి, రిపబ్లిక్ పార్టీ నాయకుడు రామ్‌దాస్ అతవాలే కంగనా రనౌత్‌కు మద్దతుగా నిలిచారు. ముంబాయి నగరం పీఓకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)ను తలపిస్తుందంటూ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీని గురించి రామ్‌దాస్ మాట్లాడుతూ, ‘నాకు పూర్తిగా నిజమేమిటో తెలియదు, కానీ శివసేన పార్టీ ప్రతినిధి సంజయ్ రౌత్ నటిని ఉద్దేశించి అలా మాట్లాడటం మాత్రం ఖండించదగ్గ విషయం. కంగనా చేస్తున్న పోరాటంలో మేం ఆమె కుటుంబానికి అండగా నిలుస్తాం’ అని పేర్కొన్నారు. శివసేన మహిళ విభాగం నేతలు కంగనారనౌత్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి ఆమె పోస్టర్లపై చెప్పులతో దాడి చేశారు. దీనిపై మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్రఫడ్నవీస్ భార్య అమృత స్పందిస్తూ ‘ మేం ముంబాయి గురించి అలా అనడాన్ని సమర్థించం. కానీ ప్రతి తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఉన్నాయి. నటి పోస్టర్లపై చెప్పులతో దాడిచేయడం అనే చర్యలు హేయమైనవి’ అని ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. మహారాష్ట్ర పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా మారిందని కామెంట్ చేసిన కంనా ఆ తరువాత ప్రస్తుతమున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని తాలిబన్లతో పోల్చింది. దీనిపై మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ స్పందిస్తూ కంగనాకు రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. అంత అభద్రతా భావం ఉంటే మహారాష్ట్రని వదిలి వెళ్లిపోవాలి. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి పోరాటం చేస్తున్న పోలీసుల గురించి తప్పుగా ఎలా మాట్లాడుతుంది’ అని మండిపడ్డారు. చదవండి: పీఓకేను తలపిస్తున్న ముంబై : కంగన -
మహా పాలిటిక్స్‌లో మరో కీలక మలుపు
-
కాంగ్రెస్‌కు బై బై..శివసేనకు జై
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి గుడ్ చై చెప్పిన పార్టీ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శివసేనలో చేరారు. కాంగ్రెస్‌లో గూండాలకు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సొంత పార్టీపైనే ఫైర్ అయిన ప్రియాంక కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కొంతమంది నేతలు తమ అనుచిత ప్రవర్తనతో బాధించారంటూ ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఒక లేఖ రాశారు. రాహుల్ నుంచి ఎలాంటి సమాధానం కోసం వేచి చూడకుండానే.. వెంటనే శివసైనకు జై కొట్టారు. ముంబైలో శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రేతో ఆమె శుక్రవారం ఉదయమ సమావేశమయ్యారు. అనంతరం థాక్రే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ప్రియాంక చతుర్వేది... ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రెండు పేజీల లేఖను రాశారు. కాంగ్రెస్ పార్టీలోని అన్ని పదవులకు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాదు తన ట్విటర్ ప్రొఫైల్‌లో తక్షణమే కాంగ్రెస్ పార్టీ హోదాలను తొలగించారు.. -
80 స్థానాల్లో పోటీ చేస్తాం: శివసేన
హైదరాబాద్: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో 80 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు శివసేన పార్టీ ప్రకటించింది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టీఎన్.మురారి 28 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. తాము ప్రకటించిన అభ్యర్థులకు ఇప్పటికే బీ–ఫారాలు ఇచ్చామని, ఈ నెల 14న వారు నామినేషన్లు దాఖలు చేస్తారన్నారు. నిజామాబాద్ బోధన్ నుంచి మొదటి విడత ప్రచారాన్ని ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ప్రేమ్ గాంధీ, రాజేం ద్రనగర్ అభ్యర్థి నర్సింగ్‌రావు పాల్గొన్నారు. -
మాజీ సీఎం ఘోర పరాజయం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఉప ఎన్నికలో బాంద్రా నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి తృప్తి సావంత్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే పై ఆమె సుమారు 19 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాగా సాంగ్లీ అసెంబ్లీ సీటును ఎన్సీపీ తిరిగి కైవసం చేసుకుంది. మాజీ కేంద్రమంత్రి ఆర్ఆర్ పాటిల్ భార్య సుమన్ పాటిల్ సుమారు 1.12 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. -
కొలిక్కి వస్తోన్న మహారాష్ట్ర రాజకీయాలు
-
దహిసర్‌లో బీజేపీ విజయోత్సవం
బోరివలి, న్యూస్‌లైన్: దహిసర్ నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి మనీషా చౌదరి, శివసేన పార్టీ అభ్యర్థి వినోద్ ఘోసాల్కర్‌పై 37 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఆదివారం పలుచోట్ల పార్టీ కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. దౌలత్ నగర్ నుంచి తెలుగు కార్యకర్తలు గాజుల నర్సారెడ్డి, నీరటి భూమన్న, తోకల రాములు, నీరటి మల్లేష్, సుతారి దీపక్, తోకల భీమేష్, చిట్టాపురం రమేష్ తదితరులు మనీషా చౌదరికి పుష్ప గుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ బోరివలిలోని గోవింద్ నగర్ నుంచి ప్రేమ్‌నగర్, దేవిదాన్ లేన్, అంబవాడి, దౌలత్‌నగర్ తదితర ప్రాంతాల గుండా ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా మనీషా మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేర్చుతానని హామీ ఇచ్చారు. ఇక్కడ రోజువారీ పని చేసే తెలుగు ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. 50 ఏళ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇప్పిస్తానని తెలిపారు. ఇళ్లల్లో పని చేసేవారికి గుర్తింపుకార్డులు అందజేస్తానని తెలిపారు. -
ఇంతకంటే ఏం చేయాలి?
శివసేనతో జతకట్టడంపై రాజ్‌ఠాక్రే సాక్షి, ముంబై: బీజేపీతో పొత్తు విచ్ఛిన్నమైన తర్వాత తాను శివసేనతో జత కట్టేందుకు శాయశక్తులా కృషి చేశానని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే వెల్లడించారు. ఓ మీడియా చానల్‌కు గురువారం ఇచ్చిన ముఖాముఖి కార్యక్రమంలో రాజ్ మాట్లాడుతూ..... ఇరు పార్టీలు విడిపోగానే పొత్తుకు సంబంధించిన చర్చలు జరిపామన్నారు. చర్చలు పూర్తవుతాయనే ఆశతో నామినేషన్ పత్రాల పంపిణీని కూడా కొద్ది గంటలపాటు నిలిపివేయాల్సి వచ్చిందని, ముందు చర్చలకు ముందుకొచ్చి, ఆ తర్వాత ఉద్ధవ్ స్పందించక పోవడంతో శివసేన-ఎమ్మెన్నెస్ ఏకం కావడం సాధ్యం కాలేదన్నారు. దీంతో పరిస్థితులన్నీ తారుమారయ్యాయని రాజ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అవసరమైతే తామిద్దరం కలిసి పని చేస్తామని బుధవారం రాజ్ సంచలనాత్మక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని రాజ్ మరోసారి బహిరంగంగా ప్రకటించారు. శివసేనతో పొత్తు గురించి ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘మహాకూటమి విచ్ఛిన్నమైన తరువాత సామ్నా దినపత్రిక డిస్ట్రిబ్యూటర్ బాజీరావ్ దాంగట్ నా ఇంటికి వచ్చారు. మీరిద్దరు ఒకటి కావాలి.... తాను ఉద్ధవ్‌తో మాట్లాడతానన్నారు. అందుకు నేను సరేనన్నాను. అదేరోజు రాత్రి దాంగట్ ఫోన్ నుంచి ఉద్ధవ్ ఫోన్ చేశారు. కుశల ప్రశ్నలు అడిగాకా.. ఉద్ధవ్ స్వయంగా బీజేపీ అంశాన్ని లేవనెత్తారు. మోసం జరిగిపోయిందన్నారు. బయటున్న నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి.... వారితో కలిసి ఉండి కూడా నీకెలా తెలియలేదని ప్రశ్నించాను. జరిగిందేదో జరిగిపోయిందని.. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావని అడిగాను. అందుకు ఉద్ధవ్ నా ముందు మూడు ప్రత్యామ్నాయ మార్గాలు ఉంచారు. ఒకటి మనిద్దరి మధ్య చర్చలు జరిగాలి.... రెండోది ఎన్నికల సమయంలో ఒకరిపై మరొకరం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం మానుకోవాలి. మూడోది ఎన్నికల తరువాత ఏం నిర్ణయం తీసుకోవాలనే విషయమై నిర్ణయానికి రావాలని చెప్పారు. నామినేషన్లు దాఖలు చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మొదటి ప్రత్యామ్నాయ మార్గంపై చర్చలు జరిపేందుకు నేను వెంటనే బాలానందగావ్కర్, నితిన్ సర్దేశాయ్ పేర్లు సూచించాను. అలాగే ఉద్ధవ్ కూడా అనిల్ దేశాయ్, మరొకరి పేరు సూచించారు. అనిల్ దేశాయ్ బాలా నందగావ్కర్కు ఫోన్ చేస్తారని ఉద్ధవ్ చెప్పారు. అయితే ఎంతకీ ఫోన్ రాకపోవడంతో బాలా ఫోన్ చేయగా అనిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. కొద్ది సేపు ప్రయత్నించగా చివరకు అనిల్ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు తాను నామినేషన్ వేయడానికి వెళ్తున్నానని, మూడు గంటల తరువాత ఫ్రీ అవుతానని చెప్పారు. అందుకు బాలా.. మీ పనులు పూర్తికాగానే మీరే ఫోన్ చేయండని అన్నారు. దీంతో మేమంతా ఆ ఫోన్ కోసం వేచిచూశాం. అప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మా పార్టీ అభ్యర్థులందరూ ఏ బీ ఫారాల కోసం నా ఇంటి ముందు గుమిగూడారు. చర్చలు జరుగుతాయేమోనని ఆశిస్తూ వాటిని ఎవరికీ అందజేయకుండా అలాగే ఉండిపోయాను. దీనిపై పార్టీ కార్యకర్తలు అనే విధాలుగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. సాయంత్రం నాలుగు గంటలైనా అనిల్ దేశాయ్ నుంచి ఫోన్ రాలేదు. చివరకు ఆశ వదులుకున్నాన’ని రాజ్ చెప్పారు. ‘నన్ను ఇరకాటంలో పెట్టి, ఎమ్మెన్నెస్ కార్యకర్తల్లో అనుమానాలు రేకెత్తించాలని శివసేన వ్యూహం పన్నినట్లుగా అర్థం చేసుకున్నాను. ఇంత మోసం చేస్తారనుకోలేదు. ఇంతకంటే ఇంకేం చేయాలి? శివసేన, ఎమ్మెన్నెస్ ఒకతాటిపైకి వచ్చేందుకు అహంకారం అడ్డువస్తోందని కొందరంటున్నారు. నేను ఇలాంటి ఈగోలను పట్టించుకోను. ఏదైన ఉంటే బహిరంగంగా, స్పష్టంగా చర్చించాలన్నదే నా పాలసీ. ఒకపక్క బీజేపీ వెన్నుపోటు పొడిచింది. అయినా కేంద్రంలో మంత్రి పదవులకు రాజీనామాలు చేయడం లేదు. మహానగర పాలక సంస్థ (బీఎంసీ)లో పొత్తు కొనసాగుతూనే ఉంది. దీని అర్ధమేంటి? ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలేకు రాష్ట్రంలో ప్రాబల్యం లేదు. రాజకీయాల్లో బలహీన పడిపోయారు. అలాంటి నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఉద్ధవ్ సిద్ధపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచిపట్టున్న రాజ్‌ఠాక్రేతో చర్చలు జరిపేందుకు ఎందుకు ముందుకు రావడం లేద’ని నిలదీశారు. -
శివసేన కరపత్రంలో బీజేపీ నేతల ఫొటోలు
మోదీకి మద్దతు పలుకుదాం రమ్మంటూ రాతలు ఘోసాల్కర్ కుయుక్తులపై బీజేపీ కన్నెర్ర పొత్తు వికటించకముందు పంచామంటున్న సేన సాక్షి, ముంబై: ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు వేస్తున్న ఎత్తుగడలు అర్థంకాక ఓటర్లు అయోమయానికి గురవుతున్నారు. ప్రచార పోస్టర్లు చూసి అవాక్కవుతున్నారు. దహిసర్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న శివసేన అభ్యర్థి వినోద్ ఘోసాల్కర్ పంచిన కరపత్రాల్లో మోదీ ఫొటో ఉండడం, ‘శివసేన ఆశీర్వాదాలున్నాయి.. రండి మోదీకి మద్దతు పలుకుదాం’ అంటూ రాసిన రాతలు ఓటర్లను గందరగోళంలోకి నెడుతున్నాయి. శివసేన, బీజేపీ కలిసి పోటీ చేయడం లేదు కదా..? అయినా మోడీకి మద్దతు పలుకుతూ తనకు ఓటు వేయాలంటూ ఘోసాల్కర్ కరపత్రాలు పంచడంతో ఇంతకీ ఘోసాల్కర్ ఏ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగాడంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోడీ బొమ్మ చూసి, ఘోసాల్కర్కు ఓట్లు వేస్తారనే దురుద్దేశంతోనే శివసేన ఈ కుయుక్తులు పన్నుతోందని బీజేపీ ఆరోపిస్తోంది. ఘోసాల్కర్ నిర్వాకాన్ని దహిసర్ బీజేపీ అభ్యర్థి మనీశ్ చౌదరి తీవ్రంగా విమర్శించారు. ఓటర్లను తప్పుదోవ పట్టించేందుకు ఘోస్కాల్కర్ పన్నుతున్న కుట్రలుగా అభివర్ణించారు. అంతటితో ఆగకుండా ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు కూడా చేశారు. ఘోసాల్కర్‌పై ఈసీ చర్య తీసుకునే అవకాశం.. మనీశ్ చౌదరి ఫిర్యాదును ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణిస్తే ఘోసాల్కర్‌పై చర్య తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రత్యర్థి పార్టీ నాయకుడి చిత్రపటాన్ని తమ ప్రచారం కోసం వినియోగించుకోవడం నిబంధనలకు విరుద్ధమంటున్నారు. దీనిపై మొదట ఘోసాల్కర్ నుంచి ఈ వివరణ కోరే అవకాశముందని, వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఆయనపై చర్య తప్పదంటున్నారు. పొత్తు వికటించకముందు పంచినవే... ఈ కరపత్రాల వివాదంపై శివసేన అభ్యర్థి ఘోసాల్కర్ స్పందించారు. శివసేన-బీజేపీ పొత్తు ఖాయమని భావించినందునే తాను ఈ కరపత్రాలను ముద్రించానని చెప్పారు. పొత్తు వికటించకముందే వాటిని పంపిణీ చేశామని, అప్పటి కరపత్రాలనే ఇప్పుడు బయటపెడుతూ బీజేపీ రాద్ధాంతం చేస్తోందని ఎదురుదాడికి దిగారు. కరపత్రాలతో నిజానికి తమకే నష్టం జరిగే అవకాశముందని, మోదీ చిత్రపటాన్ని చూసినవారు బీజేపీకే ఓటువేసే అవకాశముందని, దానిపై రాసిన రాత కూడా మోడీకి మద్దతు పలకాలంటూ రాసినందున బీజేపీకి ఎలా నష్టం జరుగుతుందంటూ ప్రశ్నించారు. అయితే బీజేపీ మాత్రం ఘోసాల్కర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘోసాల్కర్‌ను మోడీ బలపర్చిన అభ్యర్థిగా ఓటర్లు భావించే అవకాశముందని, ఈ కరపత్రాలతో బీజేపీ నష్టం జరుగుతుందని మనీశ్ చౌదరి పేర్కొన్నారు. -
రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం: ఉద్ధవ్
పింప్రి, న్యూస్‌లైన్: నరేంద్ర మోదీ ప్రధాని కావాలని కోరుకున్నవారిలో తామూ ఉన్నామని, అయితే ప్రధాని అయిన తర్వాత ఇక తనకెవరి సహకారం అవసరం లేదనే విధంగా మోదీ వ్యవహరిస్తున్నారని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. దేశాన్ని పాలించమన్నామే తప్ప రాష్ట్రాన్ని కాదని, ఇటువంటి వ్యవహారశైలి మోదీకి తగదని హితవు పలికారు. గురువారం సాయంత్రం చాకణ్లోని మార్కెట్ యార్డు మైదానంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఉద్ధవ్ ప్రసంగించారు. ఖేడ్-ఆలందీ, బోసిరి నియోజక వర్గాల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడ సాగిన ఉద్ధవ్ ప్రసంగమంతా మోదీని విమర్శిస్తూనే సాగింది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా మహారాష్ట్రను ముక్కలు కానివ్వబోమని, విదర్భ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా కృషి చేస్తామన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తామంటే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో కలిసి పోరాటాలు చేసిన పార్టీ శివసేన ఒక్కటేనని, శివసేనకు పూర్తి మెజార్టీ అందించాలని ప్రజలను కోరారు. ఈ సభలో ఎంపీలు గజానన్ కీర్తీకర్, శివాజీరావు అడల్రావు పాటిల్, జిల్లా నాయకులు రాంగావడే, ఖేడ్ పంచాయతీ సమితి ఉప సభాపతి రాజేష్ జవలేకర్ రాజ్ గురుగగన్, మాజీ సర్పంచ్ అతుల్ దేశ్‌ముఖ్, ఇతర నాయకులు హాజరయ్యారు. ఇదిలాఉండగా ఖేడ్ పంచాయతీ సమితి, మార్కెట్ సమితి మాజీ అధ్యక్షులు రాందాస్ ఠాకూర్, అతని అనుచరగణం, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శివసేన పార్టీలో శివసేన పార్టీలో చేరారు. ఖరాబ్వాడి ఉప సర్పంచ్, తాలూకా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నందాతాయి, ఎమ్మెన్నెస్‌కు చెందిన యోగేష్ అగార్కర్, వివిధ గ్రామాల సర్పంచులు పార్టీలో చేరినవారిలో ఉన్నారు. -
శివసేనతో బిజెపి తెగతెంపులు!
-
‘ఉద్ధ’రించిందేమీ లేదు..!
సాక్షి, ముంబై: ఉద్ధవ్ ఠాక్రేకు నాయకత్వ లక్షణాలు లేవు..అసలు శివసేనకు అతడు చేసిందేమీ లేదు.. దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రేను అత్యధికంగా ఇబ్బంది పెట్టింది ఉద్ధవ్ ఠాక్రేనే.. ఈ నిజాన్ని ఆయన ఇంట్లో పనిచేసే నౌకర్లను అడిగినా చెబుతారని కాంగ్రెస్ నాయకుడు నారాయణ్ రాణే విమర్శించారు. కొంకణ్ పర్యటనలో భాగంగా నారాయణ్ రాణే సింధుదుర్గ్ జిల్లాకు బయలుదేరారు. అంతకు ముందు హాత్‌ఖంబా ప్రాంతంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఉద్ధవ్‌ను లక్ష్యంగా చేసుకుని ఘాటుగా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నిష్టతో పనిచేసేవారికి, సమర్థవంతులకు అన్యాయం జరుగుతోందన్నారు. తను ముందుగా ప్రకటించిన ప్రకారం సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ందులో ఎటువంటి మార్పూ లేదని, రాజీనామాకు గల కారణాలను అప్పుడే స్పష్టం చేస్తానని తెలిపారు. ‘ఉద్ధవ్ ఠాక్రే నన్ను లక్ష్యంగా చేసుకుని తరుచూ విమర్శలు చేస్తున్నారు.. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన విమర్శలు, దూకుడుతనం మరింత ఎక్కువైంది.. ఇతరులపై ఆరోపణలు చేయడానికి బదులు బాల్ ఠాక్రే ఆదర్శాలను, సిద్ధాంతాలను కాపాడేందుకు కృషిచేస్తే మంచిది..’ అని రాణే వ్యాఖ్యానించారు. తనకు వ్యతిరేకంగా మరోసారి ఆరోపణలు చేస్తే ఇక ఊరుకునేది లేదని, మొత్తం వారి కుటుంబంలో, పార్టీలో ఏం జరుగుతుందో బహిర్గతం చేస్తానని హెచ్చరించారు. ‘కొంకణ్‌వాసులను భయాందోళన నుంచి పూర్తిగా విముక్తి కల్పిస్తానని ఉద్ధవ్ అంటున్నారు.. నేను నెలకు మూడుసార్లు కొంకణ్‌లో పర్యటిస్తుంటాను.. ఇక్కడ ఎలాంటి ఉగ్రవాదుల దాడులు, భయానక వాతావరణం, నేరాల కేసులు నమోదు కావడం లాంటి సంఘటనలు నాకు ఎక్కడా కనిపించడం లేదు.. మరి ఆయనకు మాత్రమే కనిపిస్తున్న ఆ భయాందోళనలు ఏమిటో. .’నని చమత్కరించారు. ఎన్నికలు సమయంలో ఒకసారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లడం తప్ప ఆయనకు కొంకణ్ గురించి ఏం తెలుసని ఎద్దేవా చేశారు. ఇక్కడి ప్రజలు రైళ్ల గురించి పడుతున్న ఇబ్బందులు, సమస్యలు ఉద్ధవ్‌కు తెలుసా అని ప్రశ్నించారు. ‘ప్రస్తుతం పెరిగిన రైలు చార్జీలు, గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు మీకు కనిపించడం లేదా.. లేకుంటే ఇవన్నీ చూసి మీకు భయమేస్తోందా.. అలా అయితే కొంకణ్ రావద్దు’ అని ఉద్ధవ్‌కు రాణే సలహా ఇచ్చారు . లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఎంపీలు గెలవడంలో వారి గొప్పతనమేమీ లేదన్నారు. కేవలం మోడీ ప్రాబల్యం వల్లే వారంతా గెలిచి గట్టేక్కారని వ్యాఖ్యానించారు.‘శివసేనకు నాయకుడు లేడు.. అది నేతృత్వం లేని పార్టీ. అందులో ఉద్ధవ్ ఠాక్రే నిర్వహిస్తున్న పాత్ర ఏమీ లేద’ని రాణే దుయ్యబట్టారు. ‘ 39 సంవత్సరాలు శివసేనలో కొనసాగాను.. అందులో ఆఖరు 15 సంవత్సరాలు బాల్ ఠాక్రేకు దగ్గరగా ఉన్నాను.. వాస్తవానికి శివసేన నుంచి బయటపడిన వారందరి కంటే బాల్ ఠాక్రేను ఎక్కువగా వేధించింది ఉద్ధవ్ ఠాక్రేనే..’అని ఘాటుగా విమర్శించారు. ‘బాల్ ఠాక్రే అప్పట్లో కుటుంబ సభ్యుల్ని, ఇంటిని వదిలి రెండుసార్లు బయటపడ్డారు. ఆయన ఎందుకు వెళ్లారు..? ఎక్కడ ఉంటుండేవారు...? మాకు తెలుసు.. ఇంటి వాతావరణం గురించి నౌకర్లను అడిగితే వారే చెబుతారు’ అని రాణే వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. రాణే ఎందుకు రాజీనామా చేస్తున్నారో తెలియదు : మాణిక్‌రావ్ నాగపూర్: మంత్రిపదవికి నారాయణ్ రాణే ఏ కారణం చేత రాజీనామా చేస్తున్నారో తనకు తెలియదని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే శనివారం తెలిపారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు రాణేకు ప్రభుత్వంలో సముచితం కల్పించిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం తనను నిర్లక్ష్యం చేస్తోందన్న రాణే వాదనను ఆయన తోసిపుచ్చారు. ఏమైనా ఇబ్బందులుంటే అధిష్టానంతో ఆయన చర్చించవచ్చని ఠాక్రే సూచించారు. -
శివసేనలో ఏడుగురు కాంగ్రెస్ కార్పొరేటర్ల చేరిక
సాక్షి, ముంబై: ఠాణేకి చెందిన కార్పొరేటర్ రవీంద్ర పాఠక్ సహా ఏడుగురు కార్పొరేటర్లు శనివారం శివసేనలో చేరారు. పాఠక్ కాంగ్రెస్ నాయకుడు, పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణేకు అత్యంత సన్నిహితుడు కావడం విశేషం. దీంతో రాణే ఏకాకిగా మిగిలిపోయారని రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కుమారుడి ఓటమి, కాంగ్రెస్ అధిష్టానం నిర్లక్ష్యంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి న పరిస్థితి రావడం లాంటి సమస్యలతో రాణే ఇప్పటికే ఇబ్బందుల్లో పడిపోయారు. దీనికి తోడు తనకు అత్యంత సన్నిహితుడైన పాఠక్ మరో ఆరుగురు కార్పొరేటర్లతో శివసేనలో చేరడం రాణేకు గట్టి దెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత రాణే రాజకీయ భవిత తలకిందులైంది. కుమారుడు నిలేష్ రాణే పరాజయంతో ఆయన ప్రాబల్యానికి గండిపడినట్లయ్యింది. మరోపక్క పార్టీలో ఆయన పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. నిప్పుకు గాలి తోడయినట్లు ఫాటక్తోసహా ఇతని భార్య, దీపక్ వేత్కర్, రాజా గవారి, కాంచన్ చింద్కర్, మన్‌ప్రీత్ కౌర్, మీనల్ సంఖ్యే ఇలా ఏడుగురు శివసేనలో చేరారు. దీంతో అత్యంత సన్నిహితులైన వీరంతా రాణేకు దూరం కావడం దెబ్బమీద దెబ్బ తగిలినట్లయింది. వీరందరికీ శనివారం మాతోశ్రీ బంగ్లాలో ఉద్ధవ్ ఠాక్రే స్వాగతం పలికారు. ఇదిలాఉండగా అప్పట్లో నారాయణ్ రాణే శివసేనతో తెగతెంపులు చేసుకుని బయటపడిన సమయంలో రవీంద్ర పాఠక్ కూడా ఆయన వెంట వచ్చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని గత శాసన సభ ఎన్నికల్లో కాంకావ్లీ నుంచి పాఠక్‌కు రాణే కాంగ్రెస్ టికెట్ ఇప్పించారు. అయితే స్వల్ప ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయారు. అయినప్పటికీ పాఠ్ ఇప్పటివరకు రాణేతోనే కొనసాగుతున్నారు. కాని ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు పొడసూపినట్లు తెలిసింది. రాణేలో పాఠక్‌కు రాజకీయంగా మంచి పట్టు ఉంది. ఆయన శివసేనలో చేరడంవల్ల ఠాణేలో ఆ పార్టీ మరింత బలపడనుంది. పాఠక్ పార్టీ మారడంపై రాణే మాట్లాడుతూ. తనతో ఉండాలనుకునేవారు ఉండవచ్చు, వెళ్లాలనుకునేవారు వెళ్లిపోవచ్చని స్పష్టం చేశారు. ఇలా మిత్రద్రోహం చేసినవారు త్వరలోనే ప్రతిఫలం అనుభవిస్తారని రాణే వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పుడు రాణే ఓపిగ్గా, సమయస్పూర్తితో మెలగాల్సిన అవసరమచ్చిందని ఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యానించారు. ఏదో ఒక పార్టీలో చిత్తశుద్ధితో కొనసాగితే మంచిదని హితవు పలికారు. -
బీజేపీపై మండిపడ్డ ఉద్దవ్ ఠాక్రే
ముంబై: బీజేపీపై ఇప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న శివసేన మరోసారి ఆ పార్టీపై విమర్శనాస్త్రాలను సంధించింది. పార్టీని కష్టపడి నిర్మించిన బీజేపీ అగ్రనాయకుడు ఎల్కే అద్వానీకి లోక్‌సభ ఎన్నికల టికెట్ కేటాయింపులో జాప్యం చేయడంపై మండిపడింది. పార్టీలో కష్టపడినందుకు ఆయనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే నిలదీశారు. బీజేపీలో నరేంద్ర మోడీ శకం మొదలైనంత మాత్రాన అద్వానీ శకం ముగిసినట్లుకాదని బీజేపీని ప్రశ్నించింది. ‘బీజేపీ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాలోనే అద్వానీ పేరుండాల్సింది. పార్టీని కష్టపడి నిర్మించి, వద్ధిలోకి తెచ్చిన వ్యక్తిని టికెట్ కోసం నిరీక్షించేలా చేశారు. ఇలా జరగాల్సింది కాదు’ అని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తన పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో వ్యాఖ్యానించారు. అద్వానీ నియోజకవర్గంపై నిర్ణయం తీసుకోవడానికి బీజేపీ ఎందుకంత సమయం తీసుకుందని ప్రశ్నించారు. దీని వల్ల ఆయనను అవమానించినట్లయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎటువంటి మచ్చాలేని రాజకీయ కురువృద్ధుడు అద్వానీపై ఎందుకంత అలసత్వం చూపించారని ఠాక్రే అసహనం వ్యక్తం చేశారు. -
ఎన్సీపీలో చేరిన శివసేన అధికార ప్రతినిధి
ముంబై: ఇంతకాలం శివసేన కీలక సభ్యుడిగా ఉన్నరాహుల్ నార్వేకర్ తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇటీవల రాష్ట్ర విధాన మండలి ఎన్నికలకు వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నశివసేన అధికార ప్రతినిథి రాహుల్ నార్వేకర్ సోమవారం ఎన్సీపీలో చేరారు. సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సమక్షంలో ఆయన ఎన్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. మావల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నార్వేకర్ పోటీచేస్తారని ఆ పార్టీ పేర్కొంది. -
శివసేనలో జంప్‌జిలానీలు
సాక్షి , ముంబై: శివసేనలోని అసంతృప్తి నాయకులను తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే షిర్డీ ఎంపీ భావుసాహెబ్ వాక్చౌరే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్దమయ్యారు. అధికారికంగా ప్రకటించకపోయినా ఆయన కాంగ్రెస్‌లో చేరారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా మరోవైపు తాజాగా శనివారం ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌తో పర్భణీ ఎంపీ గణేష్ దుధ్గావ్కర్ భేటీ అయ్యారు. దీంతో ఆయన కూడా ఎన్సీపీలో చేరనున్నట్టు ప్రచారం సాగుతోంది. -
‘కరివేపాకు’ చందమేనా..!
సాక్షి, ముంబై: గంపెడాశతో శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమిలో చేరిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) కు ఆ కూటమిలో తమ స్థానం ఏంటనే దానిపై రాందాస్ ఆఠవలే వర్గంలో తీవ్ర సందిగ్ధత నెలకొంది. వచ్చే లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి సీట్ల పంపకంలో స్థానాలు కేటాయించే విషయమై కూటమి ఇచ్చిన హామీలు హామీలుగానే మిగిలిపోయాయి. దీంతో కాషాయకూటమి తమ పార్టీకి ఎంతమేర ప్రాధాన్యత ఇస్తుందనేది ఆర్పీఐ కార్యకర్తలకు అంతుచిక్కడం లేదు. ఒకప్పుడు ఒంట రిగానే ఎన్నికల బరిలో దిగిన ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రాబల్యం తగ్గిపోవడంతో పలు ప్రధానపార్టీల తో పొత్తు పెట్టుకున్నారు. అయినా అనుకున్నంతమేర ఫలితాలు రాలేదు. చివరకు కాషాయకూటమితో పొత్తుపెట్టుకోవడంతో అది మహాకూటమిగా అవతరించింది. ఆ తర్వాత జరిగిన నగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో ఆర్పీఐ వర్గం ఓట్లు అధికంగా పోలవడంతో కాషాయకూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో భవిష్యత్తులో జరిగే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు డిమాండ్ చేయవచ్చనే ధీమాతో ఆఠవలే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో సీట్ల పంపకంపై పలుమార్లు శివసేన, బీజేపీ నాయకులతో చర్చలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెన్నెస్‌ను మహాకూటమిలో చేర్చుకునే అంశాన్ని బీజేపీ నాయకులు తెరమీదకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఆర్పీఐ గుండెల్లో దడ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు ఆర్పీఐకి వదులుకోవాలనే విషయంపై శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన సేన భవన్లో అనేక సార్లు చర్చలు జరిగాయి. తనను రాజ్యసభకు పంపాలని చేసిన డిమాండ్‌ను కూడా శివసేన నెరవేర్చలేకపోయింది. చివరకు అనేక కారణాలు చూపుతూ బీజేపీ ద్వారా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. ఇలా శివసేన, బీజేపీ నాయకులు ఆఠవలే నిరాశపడకుండా అనేక హామీలు ఇచ్చారు. ఆయన్ని శాంతపరిచేందుకు‘మహాకూట మి సమన్వయ సమితి’ని కూడా ఏర్పాటు చేశారు. కాని ఇంతవరకు కచ్చితమైన సీట్ల సంఖ్యను ఖరారు చేయలేకపోయారు. దీంతో ఆర్పీఐ కార్యకర్తలు సందిగ్ధంలో పడిపోయారు. బీఎంసీ ఎన్నికల్లో కాషాయకూటమి నాయకులు తమను వాడుకున్నారని ఆర్పీఐ వర్గం ఆరోపిస్తోంది. సీట్ల సర్దుబాటు వెంటనే తేల్చని పక్షంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని గతంలో ఆఠవలే హెచ్చరించారు. అయినప్పటికీ ఆ అంశం ఇప్పటికీ అయోమయంలోనే ఉంది. దీంతో కాషాయకూటమిలో తమ పార్టీ స్థానం ఏంటనే దానిపై ఆఠవలే కార్యకర్తలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. -
బాల్‌ఠాక్రే వర్ధంతి కోసం భారీ ఏర్పాట్లు
సాక్షి, ముంబై: దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రే ప్రథమ వర్థంతిని ఘనంగా నిర్వహించేందుకు ఆ పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 17న శివాజీపార్క్ మైదానంలో జరగనున్న కార్యక్రమానికి లక్షలాది మంది కార్యకర్తలు తరలిరానున్నారు. ఇప్పటికే రాష్ర్టంలోని ప్రతి పార్టీ కార్యకర్త, అభిమానులు తరలివచ్చి నివాళులు ఆర్పించాలని ఇప్పటికే పార్టీ అధినాయకత్వం కోరిన సంగతి తెలిసిందే. ఆ రోజు జరిగే బాల్‌ఠాక్రే వర్ధంతి కార్యక్రమానికి శివసేన మిత్రపక్షాలైన బీజేపీ, ఆర్పీఐ నాయకులను కూడా హాజరుకావాలని ఆహ్వనించింది. దీంతో ఇరుపార్టీల పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. భారీ సంఖ్యలో శివసైనికులను శివాజీపార్క్ మైదానానికి తరలించే బాధ్యతలు ముంబైలోని అన్ని విభాగ ప్రముఖులకు అప్పగించారని పార్టీ వర్గాలు తెలిపాయి. శివాజీపార్క్ మైదానంలో బాల్‌ఠాక్రే పేరుతో నిర్మించిన (ఉద్యానవనం రూపంలో ఉన్న) స్మారకాన్ని శివసైనికులు ‘శక్తి స్థల్’ గా గుర్తించాలనే ఉద్ధేశ్యంతో అక్కడ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపాయి. ఇదిలాఉండగా బాల్ ఠాక్రే వర్ధంతి పురస్కరించుకుని శివసేన సీని యర్ నాయకుడు, ఎమ్మెల్యే సుభాష్ దేశాయి గోరేగావ్‌లో మూడు రోజుల పాటు ‘ఠాక్రే ఉత్సవాలు’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం నుం చి మూడు రోజులపాటు వేర్వేరు కార్యక్రమాలు జరగనున్నాయి. బాల్‌ఠాక్రే ప్రథమ వర్థంతి సందర్భంగా శివసేన విడుదల చేసిన పోస్టర్లపై ‘చలా శివ్ తీర్థావర్’ అంటూ పిలుపునిచ్చారు. దీంతో వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు జనాలను భారీ సంఖ్యలో తరలించడంపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించారు. బాల్‌ఠాక్రే చనిపోయిన తర్వాత ఉద్ధవ్ రెండుసార్లు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఆయన లేని లోటు కారణంగా కార్యకర్తలు, పదాధికారులు పార్టీని వదిలి వెళ్లిపోకుండా ఉద్ధవ్ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేగాక ముంబైతోపాటు రాష్ట్రంలో శివసేనకు చెందిన కీలక లోక్‌సభ నియోజకవర్గాలలో సమావేశాలు జరిపి మరింత పటిష్టం చేశారు. ఆదివారం జరగనున్న ప్రథమ వర్ధంతికి పెద్ద ఎత్తున జనం, శివసైనికులు తరలి వచ్చేందుకు ఇంటర్నెట్, ఫేస్బుక్, ట్విట్టర్లలో భారీగా పోస్ట్‌లు చేశారు. దీన్నిబట్టి ఆ రోజు భారీగానే బలప్రదర్శన జరిగే అవకాశాలున్నాయని ప్రతిపక్ష పార్టీల నాయకులు అభిప్రాయపడుతున్నారు. -
బీఎస్పీతో పొత్తుకు రెడీ
సాక్షి, ముంబై: శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమితో జతకట్టినప్పటికీ ఆశించివేమీ దొరక్కపోవడంతో అసంతృప్తికి గురైన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే ప్రత్యామ్నాయాల మార్గాల వేటలోపడ్డారు. శివసేన, బీజేపీతో తెగతెంపులు చేసుకోకుండానే బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ)తో పొత్తులు కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయమై బీఎస్పీ అధినేత్రి మాయవతితో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆఠవలే స్పష్టం చేశారు. అఠవలే ప్రతిపాదన పై మాయవతే తుదినిర్ణయం తీసుకుంటారని బీఎస్పీ ప్రదేశ్ అధ్యక్షుడు విలాస్ గరుడ్ అన్నారు. శివసేన, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న తరువాత మొదటిసారిగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరుగుతున్నాయి. అఠవలే డిమాండ్ చేసిన స్థానాలను ఆర్పీఐకి కేటాయించేందుకు సేన, బీజేపీలో ఏ ఒక్కటీ సిద్ధంగా లేదు. క నీసం తనను రాజ్యసభకు పంపించాలన్న ఆఠవలే అభ్యర్థననూ పట్టించుకోలేదు. దీంతో కొన్ని రోజులుగా అసంతృప్తితో ఉన్న అఠవలే కాషాయకూటమితో తెగతెంపులు చేసుకుంటామని ఇది వరకే హెచ్చరించారు. ఈనెల మూడో తేదీన ఔరంగాబాద్‌లో జరిగిన ఆర్పీఐ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడుతూ బీఎస్పీతో జతకట్టనున్నట్లు సూచనాప్రాయంగా వెల్లడించారు. దళిత-బహుజన సమాజం ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే జాతీయస్థాయిలో బీఎస్పీ, ఆర్పీఐ ఒక తాటిపైకి రావల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. బీఎస్పీ జాతీయ పార్టీ. వివిధ రాష్ట్రాల్లో దానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆర్పీఐకి సైతం అనేక రాష్ట్రాలలో యూనియన్లు ఉన్నాయి. దీంతో ఈ రెండు పార్టీలు ఒకేతాటిపైకి వస్తే దళితవర్గం రాజకీయంగా, సామాజికంగా మరింత బలపడుతుందని ఆఠవలే అభిప్రాయపడ్డారు. 1996లో పుణేలో జరిగిన ఆర్పీఐ సమావేశంలో బీఎస్పీతో పొత్తు పెట్టుకుందామని ప్రతిపాదిం చారు. అనివార్య కారణాలవల్ల అప్పుడు పొత్తు కుదుర్చుకోలేకపోయామని ఆఠవలే అన్నారు. ఆ కల నెరవేరడానికి ఇప్పుడు సమయం దగ్గరపడిందని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై త్వరలో బీఎస్పీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్, ఎంపీ వీరసింహ్తో చర్చిస్తానని ప్రకటించారు. తదనంతరం మాయవతితో కూడా చర్చలు జరుపుతానని అఠవలే పేర్కొన్నారు. ఆర్పీఐ ప్రతిపాదనపై మాయవతి ఎలా స్పందిస్తారనేది వేచిచూడాలి. -
మారుతున్న వ్యూహాలు
సాక్షి, ముంబై: శివసేన నాయకులు సంజయ్ ఘాడి, మాజీ కార్పొరేటర్ రాజా చౌగులే మహారాష్ట్ర నిర్మాణసేన (ఎమ్మెన్నెస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో సోమవారం భేటీ అయ్యారు. దీంతో వారిద్దరు ఎమ్మెన్నెస్‌లో మళ్లీ చేరనున్నారన్న వార్తలకు బలం చేకూరింది. గత కొన్ని రోజులుగా సంజయ్ ఘాడి, రాజా చౌగులే శివసేనను వీడి ఎమ్మెన్నెస్‌లో చేరనున్నట్టు కథనాలు వస్తున్నాయి. ఈ విషయంపై అధికారికంగా ఇప్పటి వరకు ఎవరూ అధికారిక ప్రకటన చేయకపోయినా, ఠాక్రే నివాస స్థానమైన కృష్ణకుంజ్కు ఇద్దరూ వెళ్లి భేటీ అయ్యారు. ఎమ్మెన్నెస్‌కు చెందిన వీరిద్దరు గతంలో ఈ పార్టీలో ప్రాధాన్యం లభించడం లేదని ఆరోపిస్తూ శివసేనలో చేరారు. 2007లో చౌగులే, 2009లో అసెంబ్లీ ఎన్నికల్ల సీటు ఇవ్వలేదన్న కోపంతో ఘాడీ శివసేన తీర్థం పుచుకున్నారు. ఇప్పుడు శివసేనలో ప్రాధాన్యం లేదంటూ వీరిద్దరు దసరాను పురస్కరించుకుని అధికారికంగా ఎమ్మెన్నెస్‌లో చేరనున్నట్టు సమాచారం. శివసేన సీనియర్ నాయకుడు మనోహర్ జోషి సైతం పార్టీ వైఖరిపై అసంతృప్తితో ఉన్నట్టు ఇటీవల బహిరంగంగానే ప్రకటించారు. ఎంపీ టికెట్‌పై హామీ ఇవ్వకపోవడంపై ఆయన గుర్రుగా ఉన్నారు. అయితే తాను పార్టీ వీడే ప్రసక్తే లేదని ప్రకటించారు. అసంతృప్తి కారణంగా గతంలో పార్టీ వీడిన వారిని తిరిగి చేర్చుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇది వరకే ఒకరిద్దరు సొంతగూటికి వచ్చారు. -
ఉందామా! వద్దా!
సాక్షి, ముంబై: మహాకూటమిలోని పరిణామాలపై అసంతృప్తితో ఉన్న రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అధ్యక్షుడు రాందాస్ ఆఠవలే తన దారి తాను చూసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహాకూటమిలో కొనసాగాలా, తెగతెంపులు చేసుకోవాలనే అనే విషయమై త్వరలో నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆఠవలే రాజ్యసభ స్థానం డిమాండ్ చేయడంతో కొద్ది రోజులుగా శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమిలో ప్రతిష్టం భన నెలకొంది. అది ఎటూ తేలకపోవడంతో ఇక తాడోపేడో తేల్చుకునే సమయం దగ్గరపడిందని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. అయితే ఆర్పీఐ అసంతృప్తికి చాలా కారణాలు ఉన్నాయి. శివసేన దగ్గర ఒకే ఒక రాజ్యసభ సీటు ఉంది కాబట్టి ఆఠవలేకు రాజ్యసభ స్థానం ఇవ్వడం ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని అది తేల్చిచెప్పింది. బీజేపీ నుంచి ప్రయత్నం చేయాలని సూచించింది. శివసేన వైఖ రిపై అసంతృప్తికి గురైన ఆర్పీఐ అధినేత.. మహా కూటమి పక్షపాత ధొరణి అవలంభిస్తున్నట్లు తన సన్నిహితులతో చెబుతున్నారు. దీంతో పార్టీ పదాధికారులు, కార్యకర్తలు సహా ఆఠవలే కూడా అసంతృప్తితో ఉన్నారు. త్వరలో తాడోపేడో తేల్చుకుని తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నా యి. శివశక్తి, భీంశక్తి ఒకటవ్వాలని దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే చేసిన ప్రతిపాదనకు ఆఠవలే స్పందించారు. తరువాత శివసేన, బీజేపీ నేతృత్వంలోని కాషాయకూటమితో ఆర్పీఐ జతకట్టడం తో దీనికి మహాకూటమిగా నామకరణం చేశారు. శివసేన ఆఠవలేకు తప్పకుండా రాజ్యసభ అభ్యర్థిత్వం ఇస్తుందని కార్యకర్తలు భావించారు. ఆఠవలే ఇదే విషయాన్ని పలుసార్లు పార్టీ నాయకులతో చెప్పారు కూడా. చివరికి శివసేన కుదరదని తేల్చి చెప్పడంతో ఆర్పీఐలో అసంతృప్తి నెలకొంది. శివసేన తీసుకున్న ఈ నిర్ణయంతో దళిత సమాజానికి తప్పుడు సంకేతం పంపిందని ఆర్పీఐ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఆఠవలేకు రాజ్యసభ అభ్యర్థిత్వం నిరాకరించి శివసేన తమ అసలు రంగు బయటపెట్టుకుందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహాకూటమి దక్షిణ మధ్య ముంబై, కల్యాణ్ నియోజక వర్గాలు తమకు వదిలేయాలని, అక్టోబరు ఆఖరు వరకు శాసనసభ సీట్ల పంపకంపై తుది నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో ప్రత్నామ్యాయ మార్గాన్ని వెతుకోవాల్సి ఉంటుందని ఇదివరకే ఆర్పీఐ కాషాయ కూటమిని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆఠవలే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసేందు సిద్ధంగా లేరు. తనను రాజ్యసభకు పం పించాలని పట్టుబడుతున్నారు. శివసేన మాత్రం ఏ ఒక్క ప్రతిపాదననూ అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించడం లేదు. అందుకే తెగదెంపులు తప్పకపోవచ్చని ఆర్పీఐ నాయకుడొకరు అన్నారు. ‘కూటమి నుంచి బయటపడాలా..? వద్దా..? అనే దానిపై తేల్చుకునేందుకు త్వరలో ఒక సమావేశం నిర్వహిస్తాం’ అని ఆర్పీఐ వర్గాలు వెల్లడించాయి. -
తిప్పలు తప్పవా?
సాక్షి, ముంబై: గతంలో చేసిన పాపాలు కొందరు రాజకీయ నాయకులను నీడలా వెంటాడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం శిక్షపడిన అభ్యర్థులు ఎన్నికలకు అనర్హులంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించడమే. రాష్ట్రంలోని అనేకమంది నాయకులను ఈ తీర్పు తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రానికి చెందిన దాదాపు 853 మంది నాయకులకు మున్ముందు ఇది ఇబ్బందికరంగా పరి ణమించే అవకాశముంది. ‘నేషనల్ ఎలక్షన్ వాచ్’ అనే సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం 2009 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన 3,530 మంది అభ్యర్థుల్లో 853 మందిపై అనేక కేసులున్నాయి. వీరిలో శివసేనపార్టీకి చెందినవారు అత్యధికంగా 153 మంది ఉన్నారు. ఎమ్మెన్నెస్‌కు చెందిన 82, బీజేపీకి చెందిన 69, కాంగ్రెస్‌కు చెందిన 57, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 47, ఎన్సీపీకి చెందిన 40 మందితోపాటు ఇతర పార్టీల వారుకూడా ఈ జాబితాలో ఉన్నారు. 328 మంది అభ్యర్థులపై హత్య, హత్యాయత్నం, బలవంతపు వసూళ్లు, అపహరణ తదితర కేసులు ఉన్నాయి. శివసేనకు చెంది న 47, ఎమ్మెన్నెస్‌కు చెందిన 30, బీఎస్పీకి చెందిన 21, కాంగ్రెస్‌కు చెందిన 18, బీజేపీకి చెందిన 17, ఎన్సీపీకి చెందిన 15 మందిపై ఈ తరహా కేసులు ఉన్నాయి. అందువల్ల మున్ముందు జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీరికి ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. బీజేపీకి చెందిన శివాజీ కార్డిలే, అతుల్ దేశ్కర్, సుధీర్ మునగంటివార్, సుధాకర్ దేశ్‌ముఖ్, రవీంద్ర చవాన్, ఎన్సీపీకి చెందిన బదామ్‌రావ్ పండిత్, లోక్సంగ్రామ్ పార్టీకి చెందిన అనీ ల్ గోటే, ఎమ్మెన్నెస్‌కు చెందిన శిశిర్ షిండే, బాలానందగావ్కర్, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన అబూ ఆజ్మీ, శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే, సంజయ్ రాథోడ్, సంజయ్ జాదవ్‌లతోపాటు పలువురు ప్రముఖులున్నారు. ఇక కేసులవారీగా పరిశీలించినట్టయితే శిశిర్ షిండేపై ఎనిమిది, శివాజీ కార్డిలేపై అయిదు ఉన్నాయి. మరోవైపు ఏక్నాథ్ షిండేపై 20, రాథోడ్‌పై 21, అబూ ఆజ్మీపై తొమ్మిది, సుధాకర్ దేశ్‌ముఖ్‌పై ఎనిమిది, బాలానందగావ్కర్పై అయిదు, రవీంద్ర చవాన్‌పై 18, సంజయ్ జాదవ్‌పై 17, అతుల్ దేశ్కర్పై మూడు, మునగంటివార్పై 28, బదామ్‌రావ్ పండిత్‌పై 10 కేసులున్నట్టు ఎలక్షన్ వాచ్ నివేదికతో తేలిపోయింది. అదే విధం గా ఎన్నికల కమిషన్‌కు అందించిన ప్రతిజ్ఞాపత్రాల్లో పేర్కొన్న వివరాల మేరకు 620 మందిపై అవినీతి కేసులు ఉండగా, మరో 20 మందిపై తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. నకిలీ స్టాంపుల కేసులో అనిల్ గోటేకి ఇప్పటికే జైలు శిక్షపడగా బెయిల్‌పై బయటికొచ్చారు. ఇంకా అనేకమంది నాయకులపై నమోదైన కేసులకు సంబంధించి త్వరలోనే తీర్పు వెలువడే అవకాశముంది. దీంతో తమపై కేసులు నమోదైన నాయకులంతా ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. ఈ తీర్పు నేపథ్యంలో త్వరలో జరగనున్న లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులను ప్రకటించే ముందు ఆయా పార్టీలు వారి గురించి పూర్తిగా ఆరా తీసే అవకాశం కూడా ఉంది. జైలు శిక్షపడిన, శిక్ష పడే అవకాశమున్నవారికి సీట్లు ఇవ్వకుండా జాగ్రత్తపడాలని ఆయా పార్టీలు భావిస్తున్నట్టు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. -
జోషికి భవిష్యత్‌పై బెంగ
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి, లోక్‌సభ స్పీకర్ వంటి అనేక కీలక పదవులు చేపట్టిన శివసేన అగ్రనాయకుడు మనోహర్ జోషికి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణ మధ్య ముంబై నుంచి టికెటు నిరాకరించడంతో పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ‘దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే నన్ను అడగకుండానే అనేక పదవులు కట్టబెట్టారు. ఆయన కొడుకు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే మాత్రం టికెట్‌ను కూడా నిరాకరించారు’ అని ఓ టీవీ చానెల్‌కు ఇటీవల ఇచ్చిన ఇంటర్యూలో ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ శివసేనలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇటీవల గణేశ్ ఉత్సవాల సమయంలో దక్షిణ ముంబై లోక్‌సభ నియోజకవర్గంలో బీఎంసీ స్థాయిసమితి అధ్యక్షుడు రాహుల్ శేవాలే హోర్డింగులు భారీ ఎత్తున ఏర్పాటు కావడంపై జోషి అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆయన మాతోశ్రీ బంగ్లాకు చేరుకుని ఉద్ధవ్‌కు ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఉద్ధవ్ శేవాలేకు సర్దిచెబుతారని ఆయన భావించినా, అలా ఏమీ జరగలేదు. ఆ తరువాత ఉద్ధవ్ వీళ్లిద్దరినీ ఎదురుఎదురుగా కూర్చోబెట్టి చర్చించారు. లోక్‌సభ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో ఇంతవరకు ప్రకటించలేదు కాబట్టి వాగ్వాదాలు వద్దంటూ సర్దిచెప్పారు. దీంతో శేవాలేకు మాతోశ్రీ అండ ఉందనే విషయం జోషికి తెలిసిపోయింది. లోక్‌సభ ఎన్నికల తరువాత కేంద్రంలో బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర రాజకీయాల్లో తన కు పూర్వవైభవం వస్తుందని జోషి విశ్వసిస్తున్నారు. ములాయంసింగ్, జయలలిత, మమతా బెనర్జీ వంటి నాయకులతో తనకు సత్సంబంధాలు ఉన్నాయని జోషి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు. అదృష్టం వరిస్తే తను రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అంతదూరం వెళ్లాలంటే ముందు ఇక్కడ టికెటు రావడం తప్పనిసరని జోషి వివరించారు. -
‘మిషన్-2014’ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న పార్టీలు
సాక్షి, ముంబై: ‘మిషన్-2014’కు రాష్ట్రంలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. రోజురోజుకీ మారుతున్న రాజకీయ పరిణామాలపై దృష్టి కేంద్రీకరించిన అన్ని పార్టీలు పరిస్థితులకు అనుగుణంగా మారడంతోపాటు 2014లో జరగబోయే ఎన్నికల కోసం వ్యూహరచన చేయడంలో ఇప్పటినుంచే నిమగ్నమయ్యాయి. పార్టీలను బలోపేతం చేయడంతోపాటు ప్రజాదరణ పొందేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించాయి. కొన్ని పార్టీలైతే అంతర్గత విభేదాలు, సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు మార్పులు చేర్పులు చేపడుతున్నాయి. సీట్ల పంపకాలపై ప్రత్యేక దృష్టి సారించాయి. అయితే ఇవి ఆయా కూటములకు తలనొప్పిగా మారాయి. సాధ్యమైనంత మేర తమ కూటముల మధ్య ఉన్న భేదాభిప్రాయాలను విడనాడి సీట్ల పంపకాలకు త్వరగా తెరదించాలనుకుంటున్నాయి. ప్రస్తుతం పితృపక్షం నడుస్తుండటంతో దసరా అనంతరం సీట్ల చిక్కుముడిని విప్పాలని ఆయా పార్టీలు ఓ నిర్ణయానికి వచ్చాయి. పాతఫార్ములాతోనే మహా కూటమి పోటీ మహాకూటమి లోక్‌సభ సీట్ల పంపకాలలో ఆర్పీఐకి ఎన్ని సీట్లు కేటాయించాలనే విషయం స్పష్టం కాకపోయినా, పాత ఫార్ములానే ఉంటుందని బీజేపీ సీనియర్ నాయకుడు గోపీనాథ్ ముండే స్పష్టం చేశారు. ‘గతంలో మాదిరిగానే బీజేపీకి 26, శివసేనకు 22 సీట్లు ఉంటాయి. అయితే వీటిలో నుంచి ఆర్పీఐకి ఎన్ని కేటాయించాలనేది ఆ పార్టీ అధ్యక్షుడు రామ్‌దాస్ అథవాలేతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. దసరా అనంతరం దీనిపై స్పష్టత వస్తుంద’ని తెలిపారు. ఈ విషయమై బుధవారం గోపీనాథ్ ముండే మాతోశ్రీకి వెళ్లి శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఈ సమయంలో ఎలాంటి చర్చలు జరగలేదని, పాత ఫార్ములాతోనే ముందుకు వెళ్లనున్నట్టు ఆయన స్పష్టం చేశారు. నాలుగు లోక్‌సభ సీట్లు కావాలని, తొందరగా సీట్ల పంపకాల ప్రక్రియ పూర్తి చేయకపోతే కూటమి నుంచి బయటకి వెళ్లనున్నట్టు రాందాస్ అథవాలే హెచ్చరికపై ముండే స్పందించారు. అలాంటిదేమి జరగదని, చర్చల ద్వారా అన్ని సమస్యలకు సమాధానం లభిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆర్పీఐకి సరైన న్యాయం జరుగుతుందని ఆయన హామీఇచ్చారు. భవిష్యత్‌లో కూడా మహాకూటమికి ఎలాంటి ఢోకా ఉండదని ఆయన పేర్కొన్నారు. డీఎఫ్ కూటమిలో సైతం... డీఎఫ్ కూటమిలో లోక్‌సభ ఎన్నికల సీట్ల పంపకాలపై వివాదాలు తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ వైపు ఎన్సీపీ నాయకులు పాత ఫార్ములతోనే (26-22) పోటీ చేస్తామని ప్రకటిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ మాత్రం కొత్త ఫార్ములాతో పోటీ చేస్తామని పేర్కొంటోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్ 29 స్థానాల్లో పోటీ చేసి ఎన్సీపీకి 19 స్థానాలను ఇవ్వాలని యోచిస్తోంది. అయితే ఈ పరిణామాలన్నీ తాజాగా ఉండగానే పుణేలో పర్యటించిన రాహుల్‌గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలకు చేసిన హితబోధ డీఎఫ్ కూటమిలో కొత్త తలనొప్పులను తీసుకువచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు. ఒంటరిగా బరిలోకి దిగాలన్న కాంగ్రెస్ కార్యకర్తల డిమాండ్ మేరకు అలాంటి అవసరం రాకుండా అత్యధిక స్థానాలను గెలుచుకోవాలని ఆయన సూచించారు. అధిక సీట్లు కైవసం చేసుకుని ఎన్సీపీ అవసరం లేకుండా చూసుకోవాలన్నారు. దీనిపై రాబోయే రోజుల్లో ఎన్సీపీ నాయకులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సిందే. ఒంటరిగానే ఎమ్మెన్నెస్... శివసేనతోపాటు ఇతర పార్టీలకు పలు చోట్ల గట్టి పోటీ ఇస్తున్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) కూడా మిషన్ -2014కు సిద్ధమైంది. రాజ్‌ఠాక్రే అనేక ప్రాంతాల్లో పర్యటించి పదాధికారులు, కార్యకర్తల మనోబలాన్ని పెంచడంతోపాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవాలా? ఒంటరిగా బరిలోకి దిగాలా..? అనే విషయం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటనలు రాలేదు. ఇప్పటివరకైతే ఒంటరి పోటీవైపే మొగ్గుచూపుతున్న ఎమ్మెన్నెస్ ఎన్నికల్లో తమ సత్తాచాటి వచ్చే ఎన్నికల్లో కింగ్‌మేకర్ పాత్రను పోషించాలని ఉబలాటపడుతోంది. మరోవైపు ఎమ్మెన్నెస్ పార్టీని కూడా మిత్రపక్షంగా చేర్చుకొని బరిలోకి దిగాలని బీజేపీ ప్రయత్నిస్తున్నా అది ఎంత మేరకు సఫలీకృతమవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.