ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన శివసేనపార్టీ అని స్పీకర్ రాహుల్ నర్వాకర్ స్పష్టం చేశారు. దీనిపై శివసేన(యూబీటీ)నేత ఉద్ధవ్ ఠాక్రే స్పదిస్తూ.. స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని హత్య చేయటమేనని అన్నారు. స్పీకర్ నిర్ణయం వెల్లడించిన అనంతరం ఉద్ధవ్ మీడియాతో మట్లాడారు. అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వాకర్ తమ వర్గం మెజర్టీని సరిగా అర్థం చేసుకోలేకపోయరని అన్నారు.
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి ఇది చాలా సులువైన కేసు అని తెలిపారు. సుప్రీంకోర్టు కూడా సరైన తీర్పు వెల్లడిస్తే.. స్పీకర్ మాత్రం తాను సుప్రీంకోర్టు కంటే ఉన్నతుడిగా భావించాడని తెలిపారు. తమకు వ్యతిరేకంగా స్పీకర్ తన నిర్ణయం వెల్లడించారని చెప్పారు. అయితే స్పీకర్ రాహుల్ నర్వాకర్ వెల్లడించిన నిర్ణయాన్ని తమ వర్గం(యూబీటీ) తీవ్రంగా తిరస్కరిస్తోందని అన్నారు. ఈ వ్యవహారంపై తాము మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అన్నారు. తమకు వ్యతిరేకంగా స్పీకర్ తీసుకున్న నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునే ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు.. కోర్టు ధిక్కార కేసు వేస్తుందా? లేదా? అనేది చూడాలని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ స్పష్టం చేయటంతో సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏక్‌నాథ్ షిండే వర్గానికే ఉందని తెలిపారు. శివసేన నుంచి సీఎం ఏక్‌నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేన (యూబీటీ) వర్గం నేత అయిన ఉద్ధవ్ ఠాక్రేకు లేదని స్పీకర్ స్పష్టం చేశారు.
ఇక.. 2022 జూన్‌లో ఏక్‌నాథ్ షిండే, పలువురు ఎమ్మెల్యేలు శివసేన పార్టీ చీల్చి బయటకు వచ్చారు. దీంతో మహా వికాస్ అఘడి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఇక.. ఏక్‌నాథ్ షిండే, పలువురి రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ చేరాడు. బీజేపీ మద్దతు ఆయన మహారాష్ట్ర సీఎంగా అధికారం చేపట్టారు. అయితపాటు శివసేన నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే మంత్రుల పదవలు దక్కటం గమనార్హం.
చదవండి: Ram Mandir: ‘కాంగ్రెస్ రాముడి ఉనికినే తిరస్కరిస్తోంది’
Comments
Please login to add a commentAdd a comment