ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఉప ఎన్నికలో బాంద్రా నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి తృప్తి సావంత్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే పై ఆమె సుమారు 19 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.
కాగా సాంగ్లీ అసెంబ్లీ సీటును ఎన్సీపీ తిరిగి కైవసం చేసుకుంది. మాజీ కేంద్రమంత్రి ఆర్ఆర్ పాటిల్ భార్య సుమన్ పాటిల్ సుమారు 1.12 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు.