narayana rane
-
సీఎంపై అనుచిత వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అరెస్ట్
-
ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు.. కేంద్రమంత్రి అరెస్ట్‌కు రంగం సిద్ధం
ముంబై: కేంద్ర మంత్రి నారాయణ రాణే చేసిన వ్యాఖ్యలతో మరోసారి శివసేన, బీజేపీల మధ్య యుద్ధం మొదలయ్యింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి.. నారాయణ రాణే కొడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఈ వివాదం రాజుకుంది. నారాయణ రాణే వ్యాఖ్యలపై శివసేన నాయకులు మండిపడుతున్నారు. ఇప్పటికే ఆయన మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక నాసిక్ పోలీసులు నారాయణ రాణేను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో నారాయణ రాణే ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. శివసేన యూత్ వింగ్ కార్యకర్తలు ముంబైలోని నారాయణ రాణే నివాసం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ, శివసేక కార్యకర్తల మధ్య వివాదం రాజుకుంది. ఒకరి మీద ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. రోడ్డు మీద బైటాయించి ఒకరికి ఒకరు వ్యతిరేకంగా నినాదాలు చేసుకున్నారు. (చదవండి: ‘మేం తిరిగి కొడితే...లేవడం కష్టం: బీజేపీకి ఉద్ధవ్ ఠాక్రే కౌంటర్) #WATCH | Maharashtra: A clash breaks out amid Shiv Sena workers, BJP workers and Police in Mumbai as Shiv Sena workers marched towards Union Minister Narayan Rane's residence. Union Minister Narayan Rane had given a statement against CM Uddhav Thackeray yesterday. pic.twitter.com/TezjDGGqAb — ANI (@ANI) August 24, 2021 వివాదం ఏంటంటే.. రాయ్‌గఢ్ జిల్లాలో సోమవారం నారాయణ్ రాణే జన్ ఆశీర్వాద్ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా దేశానికి ఎప్పుడు స్వాతంత్య్రం వచ్చిందో కూడా తెలియని ఉద్ధవ్ ఠాక్రేను కొట్టాలన్నంత కోపం వచ్చిందన్నారు నారాయణ రాణే. ‘‘ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడు వచ్చిందో తెలియకపోవడం సిగ్గు చేటు. ప్రసంగం సందర్భంగా ఠాక్రే ఇది ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవమో కనుక్కొని మరీ చెప్పారు. ఒకవేళ నేను అక్కడే ఉండి ఉంటే.. ఠాక్రేను కొట్టేవాడిని’’ అంటూ నారాయణ రాణే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: శివసైనికులు చేసింది ముమ్మాటికీ తప్పే: ఫడ్నవీస్ ) ఈ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా మండిపడింది. సోమవారం రాత్రే నారాయణ రాణేపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఆయన కొంకణ్ ప్రాంతంలోని చిప్లున్‌లో ఉండటంతో రాణేను అరెస్ట్ చేయడానికి నాసిక్ పోలీసులు అక్కడి వెళ్లారు. ఈ వివాదంపై నాసిక్ పోలీస్ కమిషనర్ దీపక్ పాండే స్పందించారు. ‘‘ఇది చాలా తీవ్రమైన అంశం. ఇప్పటికే కేంద్ర మంత్రిపై తగిన చర్యలు తీసుకోవడానికి ఓ బృందం వెళ్లింది. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కోర్టులో హాజరు పరుస్తాం. కోర్టు నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్తాం’’ అని తెలిపారు. -
శివసేనకు చెక్ పెట్టేందుకే.. ఆ నలుగురికి అవకాశం!
సాక్షి, ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో మంత్రిమండలి విస్తరణలో మహారాష్ట్రకు చెందిన నలుగురు లోకసభ సభ్యులకు (ఎంపీలకు) అవకాశం లభించింది. అందరూ ఊహించినట్లుగానే మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణేకు కేంద్ర మంత్రి మండలిలో స్థానం దక్కింది. ఆయనతోపాటు ఓబీసీ సమాజానికి చెందిన భివండీ ఎంపీ కపిల్ పాటిల్, 2019లో దిండోరి లోకసభ ఎన్నికల్లో రెండు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన డాక్టరు భారతీ పవార్, ఔరంగాబాద్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు డా. భాగవత్ కరాడ్ మొదలగు నలుగురికి కేంద్ర మంత్రిమండలిలో అవకాశం లభించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బుధవారం సాయంత్రం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాల్లో మహారాష్ట్రకు చెందిన ఈ నలుగురు ప్రమాణస్వీకారం చేశారు. దీనిపై మహారాష్ట్ర బీజేపీలో ఆనందం వ్యక్తమవుతోంది. రాబోయే ముంబై, థానే, ఔరంగాబాద్ తదితర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన ఓబీపీ రాజకీయ రిజర్వేషన్, మరాఠా రిజర్వేషన్ తదితర అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర నుంచి నలుగురికి అవకాశం ఇచ్చినట్లు రాజకీయ నిపుణులు తెలుపుతున్నారు. రాణేకు కేంద్ర మంత్రిత్వ శాఖలో అవకాశంపై ప్రధాని నరేంద్రమోదీపై శివసేన విమర్శలు గుప్పించింది. శివసేన నాయకుడు కిషోర్ తివారీ మాట్లాడుతూ.. ‘‘ నారాయణ్ రాణే ఒక జెడ్పీ బ్లాక్ లీడర్. శివసేన అధినేత బాలసాహెబ్ ఠాక్రే రాణేను ముఖ్యమంత్రిగా మార్చడానికి ముందు ఆయన గుమస్తా. అతన్ని పెద్దగా చేసిన వ్యక్తినే మట్టుపెట్టాడు. రాణే ఎక్కడికి వెళ్తాడో అక్కడ గందరగోళం సృష్టిస్తాడు.ం మోదీ మంత్రిత్వ శాఖలో అదే జరుగుతుంది ’’అన్నారు. శివసేనకు చెక్ పెట్టేందుకే.. కేంద్ర మంత్రి మండలిలో మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణేకు అవకాశం ఇవ్వడంతో మహారాష్ట్రలో ముఖ్యంగా కోంకణ్‌లో పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోంది. మరోవైపు మరాఠా రిజర్వేషన్ అంశంపై కూడా బీజేపీకి లాభం చేకూరనుందని భావిస్తున్నారు. ముంబైతోపాటు కోంకణ్‌లో శివసేన ప్రభావం అధికంగా ఉంటుంది. ఇలంటి నేపథ్యంలో శివసేనకు గట్టి పోటీ ఇవ్వాలంటే శివసేనతో ఢీ కొనేందుకు నారాయణ రాణేను రంగంలోకి దింపనున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. దూకుడు స్వభావం కలిగిన నారాయణ రాజకీయ జీవితం శివసేన నుంచి ప్రారంభమైంది. కార్పొరేటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని పదవులు శివసేనలో ఉండగానే ఆయనకు దక్కాయి. అయితే శివసేనను వీడిన ఆయన ముందు కాంగ్రెస్‌లో అనంతరం బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన ఆయనకు కేంద్ర మంత్రి మండలిలో అవకాశం లభించింది. దీనిపై ఆయన కుటుంబీకులతోపాటు మద్దతుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. థానేలో పట్టు కోసం.. భివండీలో ఎంపీ కపిల్ పాటిల్‌కు కేంద్ర మంత్రి పదవి దక్కడంపై భివండీతోపాటు థానే జిల్లాలోని బీజేపీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. థానే జిల్లాలో శివసేనకు చెక్ పెట్టేందుకు ఆయనకు మంత్రి మండలిలో అవకాశం ఇచ్చినట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. గ్రామపంచాయితీ నుంచి కేంద్రమంత్రి వరకు ఎదిగిన కపిల్ పాటిల్ ఎన్సీపీలో ఉండేవారు. అయితే 2014లో బీజేపీలో ప్రవేశించిన ఆయన లోకసభ సభ్యునిగా విజయం సాధించారు. అనంతరం 2019లో కూడా వరుసగా భివండీ లోకసభ నుంచి విజయం సాధించారు. ఇలా రెండు మార్లు విజయం సాధించిన ఆయనకు కేంద్ర మంత్రి మండలిలో అవకాశం దక్కడంపై బీజేపీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భివండీలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. మరోవైపు తెలుగువారైన బీజేపీ కార్యకర్తలు, పదాధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి వరకు.. డాక్టరైన భాగవత్ కరాడ్ కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి వరకు ఎదిగారు. అహ్మదపూర్ తాలూకా చిఖలీ గ్రామంలోని రైతు కుటుంబానికి చెందిన ఆయన సుమారు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి విద్యాబ్యాసం చేశారు. ఇలా ఔరంగాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి విద్యాభ్యాసం చేసి డాక్టరయ్యారు. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా రెండు పర్యాయాలు మేయర్‌గా విధులు నిర్వహించారు. 2020లో ఆయన రాజ్యసభ సభ్యునిగా నియామాకం అయ్యారు. ఇలా ఓబీసీ సమాజానికి చెందిన ఆయనకు ముఖ్యంగా డాక్టరు అయిన భాగవత్ కరాత్‌కు మంత్రి పదవిలో చోటు ఇచ్చి ఓబీసీ వర్గాలను కొంత మేర సంతోషపరిచారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఓబీసీలకు ఒకరకంగా కేంద్రంలో ప్రాతినిథ్యం ఇచ్చినట్టు అయింది. మహిళకు అవకాశం.. కేంద్ర మంత్రి మండలి విస్తరణలో మొత్తం నలుగురికి అవకాశం దక్కగా ఇందులో ఒకే ఒక్క మహిళగా డా. భారతీ పవార్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీ పవార్ కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్‌గా మారిన ఆమె జిల్లా పరిషత్ ఎన్నికలతో రాజకీయాల్లో ప్రవేశించారు. ఎన్సీపీ నుంచి పోటీ చేసిన ఆమె బీజేపీలో చేరారు. 2019 లోకసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా దిండోరి లోకసభ నియోజకవర్గం నుంచి ఏకంగా రెండు లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే Ðకేంద్ర మంత్రిమండలి విస్తరణలో మాత్రం ఆమె పేరు పెద్దగా చర్చల్లో విన్పించలేదు. ప్రీతం ముండే, రక్షా ఖడ్సే, హీనా గావిత్ పేర్లు విన్పిం చాయి. అయితే చివరికి ఊహించని విధంగా ఆమె పేరు ఖరారైంది. దీనిపై ఆమెమద్దతు దారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
మిత్రపక్షం వద్దన్నా.. మాజీ సీఎం కొడుకుకే టికెట్
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే కొడుకు నితేశ్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. బీజేపీ టికెట్ మీద కనకవల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. మిత్రపక్షం శివసేన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కనకవల్లి టికెట్‌ను నితేశ్కే ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. నితేశ్ ఇప్పటీకి బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోలేదు. అయితే, స్థానికంగా నితేశ్‌కు ఉన్న విజయావకాశాలను దృష్టిలో పెట్టుకొని ఆయనకు బీజేపీ బీఫామ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. నితేశ్ టికెట్ విషయమై నారాయణ రాణే మంగళవారం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌తో భేటీ అయి చర్చించిన సంగతి తెలిసిందే. నారాయణ రాణే ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. త్వరలోనే కొడుకును పార్టీలోకి తీసుకొని.. టికెట్ కట్టబెట్టాలని ఆయన భావిస్తున్నారు. మరోవైపు రాణే తీరుపై గుర్రుగా ఉన్న శివసేన.. నితేశ్‌కు కనకవల్లి టికెట్ ఇస్తే.. పోటీగా తాము సొంతంగా అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేసింది. నితేశ్‌కు బీజేపీ టికెట్ ఇస్తే.. కనకవల్లిలో మిత్రపక్షంగా ఉన్న కమల శ్రేణులకు, శివసైనికులకు మధ్యే ప్రధాన పోరు నడిచే అవకాశం కనిపిస్తోంది. -
బీజేపీ గూట్లో రాణె
విశ్లేషణ ఇప్పటికే శివసేనతో కలతల కాపురాన్ని ఎలాగో కాపాడుకుంటూ వస్తోన్న బీజేపీ... రాణెకు పార్టీ తీర్థం ఇచ్చేలా ఉంది. ఇక అది రాణె ఆకాంక్షలను అదుపులో ఉంచడానికి ఎన్నో అదృశ్య విన్యాసాలను చే యాల్సి వస్తుంది. మహారాష్ట్రకు చెందిన దుందుడుకు రాజకీయ వేత్త నారాయణరాణెను తమ పార్టీలో చేర్చుకో డానికి భారతీయ జనతా పార్టీ పచ్చ జెండా చూపినట్టు ఇంకా రూఢి కాలేదు. అయినా, దేశంలోని అతి పెద్ద పార్టీ బీజేపీలో చేరాలని ఆయన భావి స్తున్నారని చాలా కాలంగానే వినవస్తోంది. ఈ విషయంలో అమిత్ షా, నరేంద్ర మోదీల మాటే నెగ్గుతుంది. అయినా ఆయనను పార్టీలోకి తీసుకునే అంశం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగానే ఉంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి రాణె వలస రావడం పట్ల బీజేపీ శ్రేణులలో ఉన్న భయాలకు సజావైన కారణాలే ఉన్నాయి. నారాయణ రాణె, అహ్మదాబాద్‌లో ఉన్న అమిత్‌షాను కలుసు కోడానికి వెళుతూ ప్రయాణంలో ఉండగానే, బీజేపీలోనే ఆందోళన చెందిన ఒకరు ఆ భోగ ట్టాను లీక్ చేశారు. తద్వారా అటు రాణెకు, తన పథకాలకు సంబంధించి బీజేపీకి కలగగల ఇబ్బంది ఏదైనా ఉంటే దాన్ని తొలగించారు. రాణె ఈ విషయంపై మౌనం వహించడమే మేలు అనుకున్నారు. కాంగ్రెస్ నుంచి రాణె నిష్క్రమించడం, పైకి చూడటానికైతే పెద్ద కుదుపే. కానీ, ఆ పార్టీ బహుశా తలనొప్పి వదిలిందని అనుకునే అవ కాశమే ఎక్కువ. రాణె శివసేన నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించడాన్ని గతంలో స్వాగతించిన ట్టుగానే ఆయన నిష్క్రమణ కూడా ఆ పార్టీకి అలాంటి పరిణామమే అవుతుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కలసి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి పదవిని ఆశించి రాణె పార్టీ విచ్ఛిన్నకునిగానే ఉన్నారు. ఆయనను మచ్చిక చేయడం కాంగ్రెస్ వల్ల కాలేదు. నేడు ఆ పార్టీ ప్రాబల్యం, ప్రాముఖ్యం క్షీణిస్తున్నందువల్ల ఆయనకు ఇవ్వజూపడానికి వారి వద్ద ఏమీ లేదు. దీంతో రాణె తన ఇద్దరు కుమారులతో సహా మరేదారీ లేక ముందుకు సాగడానికి దారే లేని మార్గాన కొత్త అవకా శాలను వెదుక్కుంటున్నారు. రాణే గత్యంతరం లేని పరిస్థితి పట్ల బీజేపీ ప్రతిస్పందన అవకా శపూరితమైనది. క్షీణిస్తున్న కాంగ్రెస్‌ను మరింతగా చిన్నదిగా చేయడం కోసం అది ప్రయత్నిస్తోంది. అయితే, అందుకోసం అది కొన్ని ప్రమాదాలను ఎదుర్కొనడానికి సిద్ధ పడుతోంది. బీజేపీ, ఇప్పటికే శివసేనతో అసంతృప్తి కరమైన వివాహబంధాన్ని ఎలాగో కాపాడు కుంటూ వస్తోంది. రాణెను, ఆయన ఆకాంక్షలను అదుపులో ఉంచగలగాలంటే అందుకోసం అది అదృశ్యమైన ఎన్నో విన్యాసాలను చేయడం అవసరం అవుతుంది. రాణె, తన కుమారులు నీలేశ్, నితేశ్లతో కలసి మొత్తం సింధుదుర్గ్ జిల్లాను అంతటినీ ఒకప్పడు తమ కుటుంబం నియంత్రణలో ఉంచుకున్నదని గుర్తిస్తే... వారి ద్దరికీ కూడా పదవులు ఇవ్వాలి. ఏవో చిన్నా చితకా మార్పులు వారికి సరిపోవు. కీలకమైన స్థానాలే కావాలి. నారాయణ రాణెకు స్థానం కల్పించడం, రాష్ట్ర అధికార చట్రాన్ని అస్థిర పరచగలుగు తుంది. అది ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు మరో కొత్త తలనొప్పి అవుతుంది. రాణెను లేదా ఆయన కుమారులలో ఒకరిని రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా చూసిన శివసేన ప్రతిస్పందన ఎంత ప్రతికూలమైనదిగా ఉంటుందో ఊహించుకో వచ్చు. శివసేన మంత్రులు ఆయనతో కలసి మంత్రివర్గంలో ఉండటానికి సిద్ధపడకపోవచ్చు. ఒకవేళ ఇది, శివసేనను ప్రభుత్వం నుంచి వెళ్లగొట్టేసి, మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలన్న పథకంతో చేపట్టిన చర్యే అయితే తప్ప, జటిల సమస్యే. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన రాణె, ఆ తర్వాత ఒక ఉపఎన్నికలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుని అదే ఫలితాన్ని ఎదుర్కొన్నారు. ఆయన ప్రస్తుతం ఒక విధమైన ఒంటరి ఎడారి జీవితాన్ని గడుపుతున్నారు. ఏదైనా ఇంత కాలు మోపే నేలను దొరికించుకోవాలని ప్రయత్నిస్తు న్నారు, ముఖ్యమంత్రి పదవే దొరికితే అంతకు మించింది లేదు. రాణె, బహుశా తనకు రాజ్యసభ సీటు, ఇద్దరు కొడుకులకు శాసన మండలి సభ్య త్వాలు, తలా ఓ మంత్రిత్వ శాఖ కోరే అవకాశం ఉంది. నారాయణ రాణె బీజేపీలోకి వలసపోతే, అది భావజాలాల పట్టింపు లేకపోవడమే గాక, సాను కూలత, సౌఖ్యం, వ్యక్తిగత, కుటుంబ ఆకాంక్షల పట్ల మాత్రమే పట్టింపు ఉండే భారత రాజకీయాల తీరులె న్నులను మరోసారి నొక్కి చెపుతుంది అంతే. హఠాత్తుగా ఒక పార్టీ మాజీ విమర్శకుడు, అదే పార్టీకి... మళ్లీ పార్టీ ఫిరాయించే వరకు... ‘విధేయ సైనికుడు’ అయిపోతాడు. ఏది ఏమైనా ఒకటి మాత్రం ఖాయం.. రాణె బీజేపీలో కూడా సుఖంగా ఉండలేరు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
మాజీ సీఎం ఘోర పరాజయం
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఉప ఎన్నికలో బాంద్రా నియోజకవర్గంలో శివసేన అభ్యర్థి తృప్తి సావంత్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే పై ఆమె సుమారు 19 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. కాగా సాంగ్లీ అసెంబ్లీ సీటును ఎన్సీపీ తిరిగి కైవసం చేసుకుంది. మాజీ కేంద్రమంత్రి ఆర్ఆర్ పాటిల్ భార్య సుమన్ పాటిల్ సుమారు 1.12 లక్షల ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. -
త్వరలో తగ్గిస్తాం
భివండీ న్యూస్‌లైన్ : వచే ్చ నెల మొదటి వారంలో విద్యుత్ చార్జీలు తగ్గించేందుకు ప్రయత్నిస్తామని పరిశ్రమల మంత్రి నారాయణ్ రాణే అభయమిచ్చారు. కాగా పట్టణంలో విద్యుత్ చార్జీలు విపరీతంగా ఉన్న కారణంగా 40 శాతం మేర పరిశ్రమలు మూతపడ్డాయి. మరికొన్ని మూతపడే దశకు చేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పవర్లూమ్ సంఘర్ష్ సమితి సభ్యులు శుక్రవారం ముంబైలోని మంత్రాలయకు వెళ్లి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి నారాయణ్ రాణేని కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. విద్యుత్ చార్జీలను తగ్గించకపోయినపట్టయితే పరిశ్రమల్లోని యంత్రాలను పాత ఇనుప సామగ్రి రూపంలో అమ్ముకోవడం తప్ప మరో మార్గం లేదని పవర్లూమ్ సంఘర్ష్ సమితి సభ్యులు మంత్రి రాణే దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు రాణే స్పందిస్తూ నాగపూర్‌లో శాసనసభ శీతాకాల సమావేశాలు జరగడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ అందుబాటులో లేరని, అందువల్ల మంత్రిమండలి సమావేశం జరగలేదని తెలిపారు. వచ్చే నెల మొదటివారంలో జరిగే సమావేశంలో విద్యుత్ చార్జీల తగ్గించేవిధంగా చర్యలు తీసుకుంటామని అభయమిచ్చారు. కాగా మంత్రిని కలసినవారిలో ఎమ్మెల్సీ సంజయ్ దత్, భివండీ జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షోయబ్ గుడ్డూ, ఫజల్ అన్సారీ. జావేద్ దల్వి తదితరులు ఉన్నారు. కాగా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబర్ ఏడో తేదీన మరమగ్గాల పరిశ్రమలన్నింటినీ మూసివేసి యజమానులు ఆందోళనకు దిగారు. భివండీ పవర్లూమ్ సంఘర్శ్ సమితి నేతృత్వంలో నవంబర్ ఆరు నుండి 15 వరకు పరిశ్రమల యజమానులు శాంతియుతంగా బంద్ పాటించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ తర్వాత రాస్తారోకోతోపాటు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టినా ఎంతమాత్రం స్పందించలేదు. ఈ నేపథ్యంలో సమితి అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు సురేశ్ టావురే, సమితి సభ్యులు నవంబర్ 25న భివండీ నుంచి ముంబైలోని మంత్రాలయదాకా పాదయాత్ర ఆందోనలు చేపడతామంటూ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించారు. ఇందుకు స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉప ముఖ్య మంత్రి అజిత్ పవార్లు త్వరలో జరిగే మంత్రిమండలి సమావేశంలో చర్చించి విద్యుత్ చార్జీలు తగ్గించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. దీంతో ఆయా యజమానులు ఆందోళనలను విరమించిన సంగతి విదితమే.