బీజేపీ గూట్లో రాణె
విశ్లేషణ
ఇప్పటికే శివసేనతో కలతల కాపురాన్ని ఎలాగో కాపాడుకుంటూ వస్తోన్న బీజేపీ... రాణెకు పార్టీ తీర్థం ఇచ్చేలా ఉంది. ఇక అది రాణె ఆకాంక్షలను అదుపులో ఉంచడానికి ఎన్నో అదృశ్య విన్యాసాలను చే యాల్సి వస్తుంది.
మహారాష్ట్రకు చెందిన దుందుడుకు రాజకీయ వేత్త నారాయణరాణెను తమ పార్టీలో చేర్చుకో డానికి భారతీయ జనతా పార్టీ పచ్చ జెండా చూపినట్టు ఇంకా రూఢి కాలేదు. అయినా, దేశంలోని అతి పెద్ద పార్టీ బీజేపీలో చేరాలని ఆయన భావి స్తున్నారని చాలా కాలంగానే వినవస్తోంది. ఈ విషయంలో అమిత్ షా, నరేంద్ర మోదీల మాటే నెగ్గుతుంది. అయినా ఆయనను పార్టీలోకి తీసుకునే అంశం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగానే ఉంది.
కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి రాణె వలస రావడం పట్ల బీజేపీ శ్రేణులలో ఉన్న భయాలకు సజావైన కారణాలే ఉన్నాయి. నారాయణ రాణె, అహ్మదాబాద్‌లో ఉన్న అమిత్‌షాను కలుసు కోడానికి వెళుతూ ప్రయాణంలో ఉండగానే, బీజేపీలోనే ఆందోళన చెందిన ఒకరు ఆ భోగ ట్టాను లీక్ చేశారు. తద్వారా అటు రాణెకు, తన పథకాలకు సంబంధించి బీజేపీకి కలగగల ఇబ్బంది ఏదైనా ఉంటే దాన్ని తొలగించారు. రాణె ఈ విషయంపై మౌనం వహించడమే మేలు అనుకున్నారు.
కాంగ్రెస్ నుంచి రాణె నిష్క్రమించడం, పైకి చూడటానికైతే పెద్ద కుదుపే. కానీ, ఆ పార్టీ బహుశా తలనొప్పి వదిలిందని అనుకునే అవ కాశమే ఎక్కువ. రాణె శివసేన నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించడాన్ని గతంలో స్వాగతించిన ట్టుగానే ఆయన నిష్క్రమణ కూడా ఆ పార్టీకి అలాంటి పరిణామమే అవుతుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కలసి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి పదవిని ఆశించి రాణె పార్టీ విచ్ఛిన్నకునిగానే ఉన్నారు.
ఆయనను మచ్చిక చేయడం కాంగ్రెస్ వల్ల కాలేదు. నేడు ఆ పార్టీ ప్రాబల్యం, ప్రాముఖ్యం క్షీణిస్తున్నందువల్ల ఆయనకు ఇవ్వజూపడానికి వారి వద్ద ఏమీ లేదు. దీంతో రాణె తన ఇద్దరు కుమారులతో సహా మరేదారీ లేక ముందుకు సాగడానికి దారే లేని మార్గాన కొత్త అవకా శాలను వెదుక్కుంటున్నారు. రాణే గత్యంతరం లేని పరిస్థితి పట్ల బీజేపీ ప్రతిస్పందన అవకా శపూరితమైనది. క్షీణిస్తున్న కాంగ్రెస్‌ను మరింతగా చిన్నదిగా చేయడం కోసం అది ప్రయత్నిస్తోంది. అయితే, అందుకోసం అది కొన్ని ప్రమాదాలను ఎదుర్కొనడానికి సిద్ధ పడుతోంది.
బీజేపీ, ఇప్పటికే శివసేనతో అసంతృప్తి కరమైన వివాహబంధాన్ని ఎలాగో కాపాడు కుంటూ వస్తోంది. రాణెను, ఆయన ఆకాంక్షలను అదుపులో ఉంచగలగాలంటే అందుకోసం అది అదృశ్యమైన ఎన్నో విన్యాసాలను చేయడం అవసరం అవుతుంది. రాణె, తన కుమారులు నీలేశ్, నితేశ్‌లతో కలసి మొత్తం సింధుదుర్గ్ జిల్లాను అంతటినీ ఒకప్పడు తమ కుటుంబం నియంత్రణలో ఉంచుకున్నదని గుర్తిస్తే... వారి ద్దరికీ కూడా పదవులు ఇవ్వాలి. ఏవో చిన్నా చితకా మార్పులు వారికి సరిపోవు. కీలకమైన స్థానాలే కావాలి.
నారాయణ రాణెకు స్థానం కల్పించడం, రాష్ట్ర అధికార చట్రాన్ని అస్థిర పరచగలుగు తుంది. అది ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు మరో కొత్త తలనొప్పి అవుతుంది. రాణెను లేదా ఆయన కుమారులలో ఒకరిని రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా చూసిన శివసేన ప్రతిస్పందన ఎంత ప్రతికూలమైనదిగా ఉంటుందో ఊహించుకో వచ్చు. శివసేన మంత్రులు ఆయనతో కలసి మంత్రివర్గంలో ఉండటానికి సిద్ధపడకపోవచ్చు. ఒకవేళ ఇది, శివసేనను ప్రభుత్వం నుంచి వెళ్లగొట్టేసి, మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలన్న పథకంతో చేపట్టిన చర్యే అయితే తప్ప, జటిల సమస్యే.
2014 ఎన్నికల్లో ఓడిపోయిన రాణె, ఆ తర్వాత ఒక ఉపఎన్నికలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుని అదే ఫలితాన్ని ఎదుర్కొన్నారు. ఆయన ప్రస్తుతం ఒక విధమైన ఒంటరి ఎడారి జీవితాన్ని గడుపుతున్నారు. ఏదైనా ఇంత కాలు మోపే నేలను దొరికించుకోవాలని ప్రయత్నిస్తు న్నారు, ముఖ్యమంత్రి పదవే దొరికితే అంతకు మించింది లేదు. రాణె, బహుశా తనకు రాజ్యసభ సీటు, ఇద్దరు కొడుకులకు శాసన మండలి సభ్య త్వాలు, తలా ఓ మంత్రిత్వ శాఖ కోరే అవకాశం ఉంది.
నారాయణ రాణె బీజేపీలోకి వలసపోతే, అది భావజాలాల పట్టింపు లేకపోవడమే గాక, సాను కూలత, సౌఖ్యం, వ్యక్తిగత, కుటుంబ ఆకాంక్షల పట్ల మాత్రమే పట్టింపు ఉండే భారత రాజకీయాల తీరులె న్నులను మరోసారి నొక్కి చెపుతుంది అంతే. హఠాత్తుగా ఒక పార్టీ మాజీ విమర్శకుడు, అదే పార్టీకి... మళ్లీ పార్టీ ఫిరాయించే వరకు... ‘విధేయ సైనికుడు’ అయిపోతాడు. ఏది ఏమైనా ఒకటి మాత్రం ఖాయం.. రాణె బీజేపీలో కూడా సుఖంగా ఉండలేరు.
మహేష్ విజాపృకర్
వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com