vijapurkar
-
ఈ అనుమానాలు అర్థరహితం
విశ్లేషణ యోగి సరయూ నదికి హారతి పట్టడం బాగానే ఉంది. పెద్ద రామ విగ్రహ నిర్మాణమూ బాగానే ఉంది. అలాంటి విగ్రహాన్ని నెలకొల్పడం అయోధ్యకు తగ్గట్టుగానే ఉంటుంది. దానికి వివాదాస్పద స్థలానికి మధ్య సంబంధమే లేదు. రామ మందిరం– బాబ్రీ మసీదు కారణంగా గత కొన్ని దశాబ్దాలుగా అయోధ్య ప్రధాన చర్చనీయాంశం అవు తోంది. ఎప్పుడూ అది వార్త ల్లోనే ఉంటోంది. రాజకీయాలు దాని చుట్టూనే తిరుగుతు న్నాయి. నాకు తెలిసిన వారిలో ఎవరైనా ఎప్పుడైనా అయో ధ్యను సందర్శించడం, లేక దాన్ని చూసి రావాలనే ఆకాంక్షను వ్యక్తం చేయడం జరిగిందేమో గుర్తుచేసుకుం దామని బాగా తరచి ఆలోచిస్తున్నాను. సాధారణంగా చార్ ధామ్ (నాలుగు పుణ్య క్షేత్రాలు)– బద్రీనాథ్, ద్వారక, పూరి, రామేశ్వరం లేదా కాశీ, పన్నెండు జ్యోతి ర్లింగాలు మాత్రమే భక్తులు ‘తప్పనిసరిగా దర్శించా ల్సిన’ వాటిలో భాగంగా ఉంటాయి. సప్తపురిగా పిలిచే ఏడు నగరాలలో అయోధ్య కూడా ఒకటి. పైన పేర్కొ న్నవాటిలో కొన్ని కూడా ఆ ఏడింటిలో ఉన్నా, అయోధ్య మాత్రం ఎన్నడూ అగ్రశ్రేణి దర్శనీయ స్థలం కాదు. గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కడానికి తగినన్ని దీపాలను వెలిగించి గతవారం అయోధ్యలో జరిపిన దీపావళి ఉత్స వంపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ ఆ వేడుకను పైన చెప్పిన నేపథ్యం నుంచి చూడాలి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన సొంత బ్రాండు హిందుత్వను ప్రదర్శించి చూపడానికి అసాధారణమైనది ఏదో చేయాలని చేసిన ఉత్సవం కాదది. వంద అడుగుల రాముని విగ్రహాన్ని నిర్మించడానికి ప్రణాళికను యోగి రూపొందించారు నిజమే. కానీ ఆయన అయోధ్యలోని కూలదోసిన, వివాదాస్పద కట్టడాన్ని పునర్నిర్మించే పనేమీ చేయలేదు. యోగి చేసే పలు వాదనలతో నాకు విభేదాలున్నాయి. ఆయన ప్రాపంచికమైన వాటిని అన్ని టినీ విసర్జించిన సాధువు కారనేది వాటిలో ప్రాథమి కమైనది. గోవధ నిషేధం వల్ల కలిగే ఆర్థిక ప్రభావాన్ని విస్మరించడం, గోసంరక్షణవాదం వంటివి కూడా నేను విభేదిస్తాను. అయితే, అయోధ్యను తిరిగి పర్యాటక ప్రదే శాలలో ఒకదానిగా, ప్రత్యేకించి దేశంలోని అంతర్గత పర్యాటకులకు దర్శనీయ స్థలంగా మార్చడం కోసం యోగి చేసిన ప్రయత్నాన్ని నేను తిరస్కరించలేను. ఏదిఏమైనా అయోధ్యలో నెలకొల్పనున్న ఆ రామ విగ్రహానికి తగ్గట్టుగా సరిపడేటన్ని హోటల్ గదులు, రవాణా సదుపాయాల వంటివి కూడా ఏర్పడతాయని ఆశించాలి. దాని నిర్వహణ సజావుగా సాగుతుందని, ఖర్చు చేసిన డబ్బుకు తగ్గ విలువ లభించేట్టు చూడటం పట్ల పట్టింపు లేకుండా పర్యాటకుల జేబుల్లోని డబ్బును దండిగా పిండేసుకునే ప్రాంతంగా అది మిగిలిపోదని కూడా అనుకుందాం. గంగా నదికి రాత్రిపూట బ్రహ్మాం డంగా హారతులను పట్టడాన్ని మీరు శివరాత్రి నాడు లేదా మోదీ ఎవరైనా ప్రపంచ నేతలను అక్కడికి తీసు కెళ్లినప్పుడు టీవీల్లో చూసే ఉంటారు. గంగానదిలాగే ఒక పవిత్ర స్థలంతో ముడిపడి ఉన్న సరయూ నది కూడా అంత పవిత్రమైనది ఎందుకు కాకూడదు? రామునితో ముడిపడి ఉండటం కారణంగా అయోధ్య పవిత్రమైనది అయినప్పుడు, సరయూ కూడా పవిత్రమైనదే. 1980 శీతాకాలంలో నెల రోజుల పాటూ వార ణాసిలో గడిపాను. అప్పుడు తరచుగా గంగానది ఘాట్ల వద్దకు వెళుతుండేవాడిని. ఇప్పటిలాంటి హారతులు అçప్పట్లో లేవు. కనీసం ఇప్పుడు మనం చూస్తున్న స్థాయి లోవి లేవు. ఇప్పుడు చూస్తున్నట్టుగా గంగా హారతులు జరగడం పాత సాంప్రదాయమేనంటే ఎలాంటి అభ్యంత రాలూ లేకుండా ఆమోదించారు. సరయూ హారతిని కూడా అలా ఆమోదించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది. పర్యాటక ప్రదేశాలకు ప్రాచుర్యం కల్పించడం కోసం కొత్త ఆకర్షణలు ప్రవేశపెట్టడం సమంజసమే. కాబట్టి, సరయూ నదికి హారతి పట్టడం బాగానే ఉంది. పెద్ద రామ విగ్రహ నిర్మాణమూ బాగానే ఉంది. అలాంటి విగ్రహాన్ని నెలకొల్పడం అయోధ్యకు తగ్గట్టు గానే ఉంటుంది. దానికి వివాదాస్పద స్థలానికి మధ్య సంబంధమే లేదు. దాన్నేదో కుట్రగా చూడటం అర్థరíß తం. ముంబైకి గేట్‌వే ఆఫ్ ఇండియా, హైదరాబాద్‌కు చార్మినార్‌లా సంకేతాత్మక కట్టడమేదీ లేని ఆ నగరంలో రాముని విగ్రహం పర్యాటక రంగానికి సంబంధించి ప్రధాన ఆకర్షణ అవుతుంది. కాబట్టి సరయూ నది ఒడ్డున భారీ విగ్రహం అనే ఆలోచన మంచిదే. కనీసం అది, తాజ్‌మహల్ కంటే ముందు అక్కడ శివాలయం ఉండేదనే మూర్ఖపు ఆలోచనకంటే తక్కువ చెడ్డది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అజ్ఞానులైన మంత్రులు లేవనెత్తిన ఆ వాదన, ఒకప్పుడు హిందూవాద చరిత్రకా రుడు పీఎన్ ఓక్ చేసిన వాదనను నెమరు వేయడమే. యోగి యోచన, అయోధ్యలో ఒకప్పుడు ఉండిన వివాదా స్పద కట్టడాన్ని కూలగొట్టిన చోటనే రామ మందిరాన్ని పునర్నిర్మించాలని కోరడం అంత చెడ్డదీ కాదు. కాబట్టి అయోధ్యను మంచి పర్యాటక స్థలంగా చేయాలనే ప్రయత్నం గురించి మనం ఇంత రాద్ధాంతం చేయాల్సిన పని లేదు. దేశీయంగా అంతర్గతంగా జరిపే పర్యటనల్లో అత్యధిక భాగం బంధువులను చూడటా నికి, పుణ్యక్షేత్రాల సందర్శన కోసం జరిపేవే. యోగి ప్రయత్నాన్ని ప్రతికూల దృష్టితో చూడాల్సిన అవసరం లేదు. అది నిరపాయకరమైనది. అలా అని, ఆసుప త్రుల్లో పసిపిల్లల మరణాలవంటి ప్రధాన పాలనాప రమైన సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోనవసరం లేదని నేను యోగికి చెబుతున్నానని అర్థం కాదు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపృకర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
బీజేపీ గూట్లో రాణె
విశ్లేషణ ఇప్పటికే శివసేనతో కలతల కాపురాన్ని ఎలాగో కాపాడుకుంటూ వస్తోన్న బీజేపీ... రాణెకు పార్టీ తీర్థం ఇచ్చేలా ఉంది. ఇక అది రాణె ఆకాంక్షలను అదుపులో ఉంచడానికి ఎన్నో అదృశ్య విన్యాసాలను చే యాల్సి వస్తుంది. మహారాష్ట్రకు చెందిన దుందుడుకు రాజకీయ వేత్త నారాయణరాణెను తమ పార్టీలో చేర్చుకో డానికి భారతీయ జనతా పార్టీ పచ్చ జెండా చూపినట్టు ఇంకా రూఢి కాలేదు. అయినా, దేశంలోని అతి పెద్ద పార్టీ బీజేపీలో చేరాలని ఆయన భావి స్తున్నారని చాలా కాలంగానే వినవస్తోంది. ఈ విషయంలో అమిత్ షా, నరేంద్ర మోదీల మాటే నెగ్గుతుంది. అయినా ఆయనను పార్టీలోకి తీసుకునే అంశం ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగానే ఉంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి రాణె వలస రావడం పట్ల బీజేపీ శ్రేణులలో ఉన్న భయాలకు సజావైన కారణాలే ఉన్నాయి. నారాయణ రాణె, అహ్మదాబాద్‌లో ఉన్న అమిత్‌షాను కలుసు కోడానికి వెళుతూ ప్రయాణంలో ఉండగానే, బీజేపీలోనే ఆందోళన చెందిన ఒకరు ఆ భోగ ట్టాను లీక్ చేశారు. తద్వారా అటు రాణెకు, తన పథకాలకు సంబంధించి బీజేపీకి కలగగల ఇబ్బంది ఏదైనా ఉంటే దాన్ని తొలగించారు. రాణె ఈ విషయంపై మౌనం వహించడమే మేలు అనుకున్నారు. కాంగ్రెస్ నుంచి రాణె నిష్క్రమించడం, పైకి చూడటానికైతే పెద్ద కుదుపే. కానీ, ఆ పార్టీ బహుశా తలనొప్పి వదిలిందని అనుకునే అవ కాశమే ఎక్కువ. రాణె శివసేన నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించడాన్ని గతంలో స్వాగతించిన ట్టుగానే ఆయన నిష్క్రమణ కూడా ఆ పార్టీకి అలాంటి పరిణామమే అవుతుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కలసి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి పదవిని ఆశించి రాణె పార్టీ విచ్ఛిన్నకునిగానే ఉన్నారు. ఆయనను మచ్చిక చేయడం కాంగ్రెస్ వల్ల కాలేదు. నేడు ఆ పార్టీ ప్రాబల్యం, ప్రాముఖ్యం క్షీణిస్తున్నందువల్ల ఆయనకు ఇవ్వజూపడానికి వారి వద్ద ఏమీ లేదు. దీంతో రాణె తన ఇద్దరు కుమారులతో సహా మరేదారీ లేక ముందుకు సాగడానికి దారే లేని మార్గాన కొత్త అవకా శాలను వెదుక్కుంటున్నారు. రాణే గత్యంతరం లేని పరిస్థితి పట్ల బీజేపీ ప్రతిస్పందన అవకా శపూరితమైనది. క్షీణిస్తున్న కాంగ్రెస్‌ను మరింతగా చిన్నదిగా చేయడం కోసం అది ప్రయత్నిస్తోంది. అయితే, అందుకోసం అది కొన్ని ప్రమాదాలను ఎదుర్కొనడానికి సిద్ధ పడుతోంది. బీజేపీ, ఇప్పటికే శివసేనతో అసంతృప్తి కరమైన వివాహబంధాన్ని ఎలాగో కాపాడు కుంటూ వస్తోంది. రాణెను, ఆయన ఆకాంక్షలను అదుపులో ఉంచగలగాలంటే అందుకోసం అది అదృశ్యమైన ఎన్నో విన్యాసాలను చేయడం అవసరం అవుతుంది. రాణె, తన కుమారులు నీలేశ్, నితేశ్లతో కలసి మొత్తం సింధుదుర్గ్ జిల్లాను అంతటినీ ఒకప్పడు తమ కుటుంబం నియంత్రణలో ఉంచుకున్నదని గుర్తిస్తే... వారి ద్దరికీ కూడా పదవులు ఇవ్వాలి. ఏవో చిన్నా చితకా మార్పులు వారికి సరిపోవు. కీలకమైన స్థానాలే కావాలి. నారాయణ రాణెకు స్థానం కల్పించడం, రాష్ట్ర అధికార చట్రాన్ని అస్థిర పరచగలుగు తుంది. అది ముఖ్య మంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు మరో కొత్త తలనొప్పి అవుతుంది. రాణెను లేదా ఆయన కుమారులలో ఒకరిని రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా చూసిన శివసేన ప్రతిస్పందన ఎంత ప్రతికూలమైనదిగా ఉంటుందో ఊహించుకో వచ్చు. శివసేన మంత్రులు ఆయనతో కలసి మంత్రివర్గంలో ఉండటానికి సిద్ధపడకపోవచ్చు. ఒకవేళ ఇది, శివసేనను ప్రభుత్వం నుంచి వెళ్లగొట్టేసి, మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలన్న పథకంతో చేపట్టిన చర్యే అయితే తప్ప, జటిల సమస్యే. 2014 ఎన్నికల్లో ఓడిపోయిన రాణె, ఆ తర్వాత ఒక ఉపఎన్నికలో కూడా అదృష్టాన్ని పరీక్షించుకుని అదే ఫలితాన్ని ఎదుర్కొన్నారు. ఆయన ప్రస్తుతం ఒక విధమైన ఒంటరి ఎడారి జీవితాన్ని గడుపుతున్నారు. ఏదైనా ఇంత కాలు మోపే నేలను దొరికించుకోవాలని ప్రయత్నిస్తు న్నారు, ముఖ్యమంత్రి పదవే దొరికితే అంతకు మించింది లేదు. రాణె, బహుశా తనకు రాజ్యసభ సీటు, ఇద్దరు కొడుకులకు శాసన మండలి సభ్య త్వాలు, తలా ఓ మంత్రిత్వ శాఖ కోరే అవకాశం ఉంది. నారాయణ రాణె బీజేపీలోకి వలసపోతే, అది భావజాలాల పట్టింపు లేకపోవడమే గాక, సాను కూలత, సౌఖ్యం, వ్యక్తిగత, కుటుంబ ఆకాంక్షల పట్ల మాత్రమే పట్టింపు ఉండే భారత రాజకీయాల తీరులె న్నులను మరోసారి నొక్కి చెపుతుంది అంతే. హఠాత్తుగా ఒక పార్టీ మాజీ విమర్శకుడు, అదే పార్టీకి... మళ్లీ పార్టీ ఫిరాయించే వరకు... ‘విధేయ సైనికుడు’ అయిపోతాడు. ఏది ఏమైనా ఒకటి మాత్రం ఖాయం.. రాణె బీజేపీలో కూడా సుఖంగా ఉండలేరు. మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
గోల గోల పండుగల వేళ
విశ్లేషణ ధ్వని కాలుష్య నిరోధం గురించిన ప్రభుత్వ చట్టాలున్నా పండుగ సంబరాల నిర్వాహకులకు ఆ పట్టింపే ఉండదు. శబ్ద కాలుష్యం తాత్కాలికమైనదే అయినా, శాశ్వతమైన నష్టాన్ని కలగజేయగలదని రుజువైంది. మన భారతీయులకు లెక్కలేనన్ని పండుగలు న్నాయి. అవి ఎక్కువగా మతంతో ముడిపడినవి. ఈ వేడుకల విలువకు కొలబద్ద శబ్దమేనని మన వాళ్లు అపార్థం చేసుకుం టున్నారని అనిపిస్తుంది. రాత్రంతా చెవులు చిల్లులు పడేలా చేసే సంగీత ఘోషతో కూడిన దేవీ నవరాత్రే కావచ్చు, లేదా రోడ్డుకు అడ్డంగా పైనుంచి వేలాడు తున్న ఉట్టిని అందుకోడానికి దొంతరలు, దొంతర లుగా ఒకరిపైకి ఒకరు పైకి ఎక్కే దహీహండి(ఉట్లు కొట్టడం)యే కావచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాతి రోజున... కృష్ణ పర మాత్మునికి అందకుండా తల్లి ఎత్తుగా ఉన్న ఉట్టిలో ఉంచిన వెన్నను దొంగిలించడానికి ఆయన చేసిన లీలను అనుకరిస్తూ దహీహండి వేడుక జరుగు తుంది. మహారాష్ట్రలో అది పెద్దగా చప్పుళ్లు లేకుం డానే సాగిపోతుంది. హైడెసిబల్ సౌండ్ సిస్టమ్స్‌ను సరఫరా చేస్తే పోలీసులు స్వాధీనం చేసుకుంటారని వాటిని అద్దెకు ఇవ్వకపోవడమే అందుకు కారణం. లేకపోతే అది కూడా మహా శబ్ద ఘోషగా సాగేదే. ఆ తర్వాత చలికాలం వచ్చేసరికి దేవీ నవరాత్రి వంతు వస్తుంది. ఆ తొమ్మిది రాత్రులు స్త్రీ పురుషులు రాత్రిళ్లు గుజరాతీ దాండియా (కోలాటం) బాణీలు మోగుతుండగా నృత్యాలు చేస్తారు. అవి దసరా పండుగతో ముడిపడినవి. కాబట్టి నవరాత్రులకు కూడా ప్రాతిపదిక మతమే. కానీ, ఈ దాండియా వేడుకలను, ప్రధానంగా వాణిజ్యపరమైన కార్యక్ర మాలుగా ఈవెంట్ మేనేజర్లు టికెట్లు అమ్మి నిర్వహి స్తారు. వాటిలో కూడా డీజేలు హై డెసిబల్ సౌండ్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తూ, చెవులు గింగురుమనేలా సంగీతాన్ని వినిపిస్తారు. ఇక ఇప్పుడు, శుక్రవారం నుంచి ప్రారంభ మయ్యే గణేశ్ చతుర్థి వంతు. దాదాపు ప్రతి వీధి మలుపునా గజాననుని విగ్రహానికి పూజలు చేస్తారు. రోడ్లను, రోడ్డు పక్క ఉండే పాదచారుల బాటలను ఆక్రమించి, వాహనాలు సహా రాకపోకలన్నింటినీ అడ్డగించేస్తారు. లౌడ్ స్పీకర్లు ఈ పండుగ సర్వసా ధారణ లక్షణం. ఈ శబ్ద కాలుష్యానికి వ్యతిరేకంగా చేసిన ప్రచార ఉద్యమం ఏమైనా విజయం సాధిం చిందో లేదో వేచి చూడాలి. కోర్టులైతే అలాంటి ధ్వనులను నిషేధించాయి. దహీహండి పగటిపూట సాగే ఒక రోజు కార్య క్రమం. నవరాత్రి, గణేశ్ చతుర్థి తొమ్మిది రోజులు, పది రోజులు సాగే వేడుకలు. నిర్వాహకులు ఈ వేడు కలకు లౌడ్ స్పీకర్ల ఉపయోగపు వేళల పరిమితు లను 10 గంటల పరిమితికి దాటి కొనసాగేలా, కనీసం చివరి మూడు రోజులకైనా మిహాయింపు లను కోరి, సాధిస్తారు. ఈ వేడుకల్లో పాల్గొనేవారు ఇది మతపరమైన ఉత్సాహం అంటారు, ఇతరు లేమో ఆ విపరీత శబ్దాల వల్ల బాధపడాలి. 70 డెసి బల్స్కు మించిన శబ్దాలు ఈ పండుగలకు గుర్తుగా మారాయి. గణేశ్ చతుర్థి సందర్భంగా, రెండో రోజు నుంచే నిమజ్జనాలు సాగుతుంటాయి. కాబట్టి రోజంతా ఆ గోల సాగుతూనే ఉంటుంది. పదో రోజున పెద్ద పెద్ద విగ్రహాలన్నిటినీ ఊరేగింపుగా తీసుకుపోయి సాగ నంపుతారు. భారీ డోళ్లు, భేరీలు, పోర్టబుల్ డీజే సెట్లు విగ్రహాలతో పాటే ట్రక్కులపై జలాశయాలకు సాగిపోతాయి. శుభ శకునాల వేల్పును, పూజిం చడం కోసం పందిళ్లకు తరలించేటప్పుడు కూడా అవన్నీ వెంట ఉండాల్సిందే. ముంబై హైకోర్టు దహీహండిలో పాల్గొనే వారి ప్రాణ రక్షణ కోసం, కాళ్లుచేతుల రక్షణ కోసం ఉట్టి కట్టే ఎత్తు మీద, అందులో పాల్గొనేవారి వయసుపైన ఆంక్షలను విధించినప్పుడు... నిర్వాహకులు, ప్రధా నంగా రాజకీయవేత్తలు అది ఒక ‘సాహస క్రీడ’ అంటూ వాదించడం ఆసక్తికరం. ఇది అవకాశవాదా నికి సుస్పష్టమైన ఉదాహరణ. ఈ కేసులో, హైకోర్టు తీర్పును సమీక్షించాలని సుప్రీం కోర్టు కోరింది. దీంతో అది వాటిని నియంత్రించే పని చట్టసభల పనే తప్ప తాము చేయజాలమంటూ మునుపటి యథాతథస్థితి కొనసాగింపును పునరుద్ధరించింది. గణేశ్ చతుర్థికి రాజకీయపరమైన ప్రాపకం కూడా భారీ ఎత్తున ఉంది. అది స్థానిక రాజకీయ వేత్తలు అందించే దానికే పరిమితం కాదు. పైగా ఇది లాభసాటి వ్యవహారం కూడా. చిన్న సంస్థలు చిన్న విగ్రహాలను ఎంచుకుని, అక్రమంగా రోడ్డు స్థలా లను ఆక్రమిస్తాయి. అందుకోసం అవి రాజకీయ వేత్తల మద్దతును కోరతాయి. ఎన్నికల సమ యంలో చిన్న గృహ సముదాయాల ప్రాతిపదికపై ఏర్పడ్డ బృందాలు రాజకీయవేత్తల నుంచి నిధులను కోరతాయి. ‘దానికి బదులు’గా ఓటును ఆశించి ఆశించి వారు సమర్పించుకోడానికి అంగీకరిస్తారు. ధ్వని కాలుష్య నిరోధం గురించి ప్రభుత్వ చట్టా లున్నా నిర్వాహకులకు దాదాపుగా ఆ పట్టింపే ఉండదు. శబ్ద కాలుష్యం తాత్కాలికమైనదే అయినా, శాశ్వతమైన నష్టాన్ని కలగజేయగలదని రుజువైంది. నగరాలు, పట్టణాలలో అన్ని వైపులా చుట్టేసి వ్యాపించే శబ్ద కాలుష్యం... గణేశ్ చతుర్థి వంటి పండుగల సమయంలో మరింత ఎక్కువగా పెరుగు తున్నదే తప్ప తగ్గడం లేదని మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు అధ్యయనాలు తేల్చి చెప్పాయి. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com మహేష్ విజాపృకర్ -
చట్టబద్ధమైన అహంకారమా?
విశ్లేషణ ‘చెప్పుతో 25 సార్లు కొట్టాన’ని గర్వంగా చెప్పుకున్న తర్వాత తాను ‘వినమ్రత’ కలిగిన వ్యక్తినని శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చెప్పిన మాటలను యథాతథంగా తీసుకోవడం ఎవరికైనా కష్టమే అవుతుంది. ఎయిర్‌లైన్స్ వ్యవహారంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ గండం నుంచి బయటపడినట్లే. ఈ మరాఠా ఎంపీకి అనువుగా ఉండటం కోసం పుణె–ఢిల్లీ మార్గంలో బిజినెస్ క్లాస్ సీట్లు ఉన్న విమానాన్ని ఎయిరిండియా ప్రవేశపెట్టనున్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. ఎంపీ గైక్వాడ్ తన వైఖరిని పూర్తిగా సమర్థించుకున్నట్లు కనిపించింది, అదే సమయంలో ఆయన ప్రత్యర్థులు మొదట్లో దృఢవైఖరిని అవలంబించినప్పటికీ ఆ తర్వాత మాత్రం లొంగుబాటు ప్రదర్శించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంమీద ఈ వివాదంలో శివసేన ఎంపీ గెలి చారు. పైగా ఈ మొత్తం ఉదంతంలో అవసరమైతే పార్టీ వైపు నుంచి న్యాయ సహాయం అందిస్తామని, కానీ భవిష్యత్తులో మాత్రం ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి సరిగా వ్యవహరించాలని సూచిస్తూ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే తమ పార్లమెంట్ సభ్యుడికి వత్తాసుగా నిలిచినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. రవీంద్ర గైక్వాడ్ ముందుగా క్షమాపణ చెప్పాల్సిందేనంటూ ఎయిర్‌లైన్స్, విమానయాన మంత్రి గట్టిగా చేసిన డిమాండ్‌తో పోలిస్తే ఇది పట్టించుకోవాల్సిన పని లేనంత చిన్న విషయంగా అయిపోయింది. ఎయిర్‌లైన్స్ సీనియర్ ఉద్యోగిపై దాడికి సంబంధించి జరిగిన దానికి సారీ చెబుతూ శివసేన ఎంపీ చివరకు సభలో పశ్చాత్తాపం వ్యక్తపరిచారు. కానీ మీడియా మాత్రం దాన్ని క్షమాపణలాగా చూడనేలేదు. రాజకీయాధికార వర్గానికి చెందిన ప్రతిపక్షాలు లేదా వాటిలోని కొన్ని సెక్షన్లకు చెందిన వారు రవీంద్ర గైక్వాడ్ ప్రవర్తన చెడుగా ఉందని భావించినప్పటికీ, విమాన ప్రయాణం చేయడం నుంచి ఆయనను నిషేధించడం అనేది (సామాన్య ప్రయాణీకుడు ఇలా వ్యవహరించి ఉంటే ఇప్పటికే తను జైల్లో ఉండేవాడు) ఒక ఎంపీగా తన హక్కులను అతిక్రమించినట్లవుతుంది అనే ప్రాతిపదికన ఎంపీకి కల్పించాల్సిన హక్కులను భంగపరిచినట్లవుతుందన్న అభిప్రాయం కల్గించడానికి వీరు ప్రయత్నించారు. పైగా దీనికి సంబంధించి శివసేన పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెడతానని బెదిరించింది కూడా. కానీ, ఎంపీగా అతని ప్రత్యేకహక్కును అది ఉల్లంఘించినట్లేనా?. ఎయిరిండియా తన విమానాలలో ప్రయాణించకుండా ఆయనను తక్షణమే దూరం పెట్టేసినప్పుడు, ఒక ఎంపీని తన విధులు నిర్వర్తించకుండా ఎలా అడ్డుకుంటారని ప్రశ్నిస్తూ శివసేన.. ఇది అన్యాయమంటూ ఆక్రోశించింది. నిజమే.. చట్టసభలో కానీ, ఆయన ఏవైనా కమిటీలలో గానీ ఉన్నట్లయితే, ఒక ఎన్నికైన ప్రతినిధిగా తన విధులు తప్పక నెరవేర్చవలసే ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఆ నిషేధం తన పార్లమెంట్ విధులను నిర్వహించకుండా అడ్డగించడమే అవుతుంది. తన విధులు నిర్వర్తించకుండా శివసేన ఎంపీని అడ్డగించడం బహుశా తప్పే కావచ్చు. వాస్తవంగా కూడా ఏ ఎంపీని తన విధులను నిర్వర్తించడం నుంచి ఈ రూపంలో తప్పించకూడదు. ఇక్కడ ‘పనిచేయటం’, ‘విధులు’ అనే పదాలకే ప్రాధాన్యత ఉంది. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ జరిగిన ఉదంతం అసౌకర్యాన్ని కలిగించిందంటూ చాలా జాగ్రత్తగా పదప్రయోగం చేశారు. అది హక్కుల ఉల్లంఘన అని చెప్పకుండా ఆమె చాలా జాగ్రత్త వహించారు. అయితే విస్తృతార్థంలో.. ఎంపీ చేయవలసిన విమాన ప్రయాణాలపై విమానయాన సంస్థ నిషేధం విధించడం అంటే పార్లమెంటుకు హాజరు కాకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం అని అర్థం కాదు. కానీ ఎయిరిండియా ఉద్యోగిని తాను తన చెప్పుతో పాతిక పర్యాయాలు కొట్టినట్లు టీవీ కెమెరాల ముందు శివసేన ఎంపీ స్వయంగా అంగీకరించారు కాబట్టి, అది హక్కులను అడ్డుకోవడంలాగా కాకుండా పూర్తిగా విభిన్నమైన ఘటనకు చెందిన ఒక పాయలాగా మారిపోయింది. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ తన చర్యను సమర్థించుకోవడమే కాదు (ఆ వీడియో ఫుటేజీని మీరు చూసినట్లయితే) తాను చేసిన పనికి ఎంతో గర్వపడుతున్నట్లు చెప్పారు. ఆ గర్వం కూడా కొట్టడం తన చట్టపరమైన హక్కు అనే భావన నుంచి వచ్చిన గర్వం. విమానంలో ఉన్న ప్రయాణీకుల భద్రత రీత్యా ఆ ఎంపీ భవిష్యత్ విమాన ప్రయాణంపై ఎయిరిండియా ఆంక్షలను కూడా విధించింది. పౌరవిమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు కూడా దాదాపుగా ఈ విషయాన్నే లోక్‌సభలో ప్రకటించారు. విమానయాన సిబ్బంది ఆగ్రహానికి కూడా ప్రాతిపదిక ఇదే. ‘చెప్పుతో 25 సార్లు కొట్టాన’ని గర్వంగా చెప్పుకున్న తర్వాత తాను ‘వినమ్రత’ కలిగిన వ్యక్తినని గైక్వాడ్ చెప్పిన మాటలను య«థాతథంగా తీసుకోవడం ఎవరికైనా కష్టమే అవుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కొట్టొచ్చినట్లుగా కనపడుతున్న తన దుష్ప్రవర్తన ఫలితంగానే ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఈ ఉదంతంలో కాస్త మెట్టు దిగాల్సి వచ్చింది. హౌస్ ఆఫ్ కామన్స్‌లో ప్రివిలెజ్ కేసు ఉల్లంఘనకు సంబంధించిన నివేదికను పేర్కొంటూ, కౌల్ –షక్దర్ తమ ‘ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ ఆఫ్ పార్లమెంట్’ అనే రచనలో.. ఇలాంటి తరహా ఉల్లంఘనలు, ‘ఇతర పౌరులకు మల్లే తనకూ వర్తించే సామాజిక విధుల నుంచి ఏ గౌరవ సభ్యుడినీ తప్పించలేవ‘ని చెప్పారు. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com మహేష్ విజాపృకర్ -
చెల్లని కాసులు.. చిల్లర కాసులు
విశ్లేషణ నలుపు లేదా తెలుపు ఏదైనా కావచ్చు.. కోట్ల కొద్దీ నగదు కలిగిన వారు కూడా ఉన్నట్లుండి చిల్లర కాసులకు ఎంత విలువ ఉందో ఇప్పుడు గ్రహించారు. ఈ చిల్లరే లేకుంటే వారి జీవితాలు ఘోరంగా దెబ్బతింటాయి. గత శుక్రవారం నా బ్యాంకు నుంచి రూ. 2,000ల నోట్ల తొలి సెట్‌ను తీసుకోగానే, 1893లో సుప్రసిద్ధ రచ యిత మార్క్ ట్వెయిన్ ప్రచురించిన ‘ది మిలి యన్ పౌండ్ బ్యాంక్ నోట్’ అనే కథానిక నా తలపుకు వచ్చింది. ఆ కథానికలో ముఖ్య పాత్ర హెన్రీ ఆడమ్స్ పదిలక్షల పౌండ్ల విలువైన సింగిల్ కరెన్సీ నోట్‌కి సొంతదారై, దాన్ని ఖర్చు పెట్టాలని ప్రయత్నించాడు. కానీ అతడా నోటుని ఇవ్వబోయి నప్పుడు షాప్ కీపర్లు, రెస్టారెంట్ యజమానులు ఒక్కసారిగా బెదిరిపోయారు. ఆ నోటుకు తగిన చిల్లర వారి వద్ద లేకపోయింది. అలాగని అంత పెద్ద నోటుతో వచ్చిన అత డిని వెనక్కు పంపాలని కూడా వారనుకోలేదు. అంత పెద్ద సంపన్నుడిని కోల్పోయే సంప్రదాయం కూడా వారికి లేదు. ఆ క్రమంలో రుణం అతడిని వెతుక్కుంటూ వచ్చింది. తక్కువ ధరలో అతడు కొనుక్కోవాలనుకున్న సూట్ స్థానంలో ఖరీదైన పూర్తి స్థాయి వార్డ్రోబ్ వచ్చేసింది. వాళ్లు అతడికి రుణాలు కూడా ఇచ్చారు. అత్యధిక విలువ గల నోటుతో ఏదైనా బిల్లు కట్టడానికి కూడా కష్టమే అయినప్పటికీ, ఆ నోటు నిరుపయోగం మాత్రం కాలేదు. భారత్‌లో అయితే చిన్న కమ్యూనిటీలలో తప్పితే, రూ.2,000ల కరెన్సీ నోటుతో ఎవరూ రుణం పొందలేరు. పైగా సరైన ప్రణాళికతో నోట్ల రద్దు చేయనందున, తక్కువ విలువ కలిగిన 100, 50, 10 రూపాయల నోట్ల సరఫరాని అది సమర్థ వంతంగా తీసుకురాలేకపోయింది. మార్క్ ట్వెయిన్ కథానికలో హెన్రీ ఆడమ్స్కి దక్కిన అదృష్టం గురించి నేనయితే కల్లో కూడా ఆశించలేను. ఎందుకంటే రిటైల్ మార్కెట్లో రుణం తీసుకోవడం అంత సులభం కాదు. అందు కనే నవంబర్ 10న నా బ్యాంకు నుంచి రూ. 10 వేల చెక్కును విత్‌డ్రా చేసి మరీ నేను తీసుకున్న అయిదు 2 వేల రూపాయల నోట్లు నేటికీ నా వాలె ట్లోనే వృథాగా ఉండిపోయాయి. నేను కొనాలను కున్న చిన్న చిన్న కొనుగోళ్లు వాయిదా పడ్డాయి. శాసన మండలి ఎన్నికలు జరగనున్న మహా రాష్ట్రలో రాజకీయ నాయకులు తమ ఓటర్లకు బంగారు, వెండి నాణేలు లంచంగా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, పంజాబ్‌లో ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలో ఎవరికీ అర్థం కావటం లేదు. బహుశా అవినీతి పెరిగి బంగారు, వెండి నాణేల సత్వర సేకరణకు దారి తీయవచ్చు. అలా కాదంటే.. పరిశుద్ధమైన, తక్కువ ఖర్చుతో కూడిన ఎన్నికలు జరగవచ్చు. రెండుసార్లు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రయోగాన్ని మినహాయిస్తే, నల్లధనం ప్రభావం లేని ఎన్నికలను ఇంతవరకు మనం విని ఉండలేదు. నలుపు లేదా తెలుపు ఏదైనా కావచ్చు.. కోట్ల కొద్దీ నగదు కలిగిన వారు కూడా ఉన్నట్లుండి చిల్లర కాసులకు ఎంత విలువ ఉందో ఇప్పుడు గ్రహించారు. ఈ చిల్లరే లేకుంటే వారి జీవితాలు ఘోరంగా దెబ్బతింటాయి. కూరలో కలిపే కొత్తి మీరను కొనుగోలు చేయ డానికి ఎస్యువీ వాహనాలలో లేదా సెడాన్ కార్లలో తమ డ్రైవర్లను పంపడం కూడా వారికి సాధ్యం కావడం లేదు. ఇక మధ్యతరగతి కుటుం బాలయితే చిల్లర కోసం తమ పిల్లల హుండీలలో చేయి పెట్టాల్సివచ్చింది. ఇది పట్టణ ప్రాంతాల్లోని మధ్యతర గతి, సంప న్నవర్గాలు ఎదుర్కొంటున్న సంక్షోభం. ఇక ద్రవ్యో ల్బణం కారణంగా అధిక విలువ కలిగిన నోట్లు ఆడుతున్న గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏమిట నేది ఎవరికీ తెలియటం లేదు. బ్యాంకింగ్ రంగం విస్తరించినప్పటికీ గ్రామీణులకు బ్యాంకులు అంత సులభంగా అందుబాటులో లేవు. ప్రధాన నగరా ల్లోని బ్యాంకులకు కూడా కొత్త, చిన్న నోట్లను తగినంతగా అందుబాటులో ఉంచలేకపోతున్న నేపథ్యంలో మారుమూల ప్రాంతాల్లో బ్యాంకుల తీరును ఎవరైనా ఊహించు కోవచ్చు. ఏమైనప్ప టికీ సంపన్న, మధ్యతరగతి వర్గాలు నిరుపేదల పట్ల సహానుభూతి ప్రదర్శించాల్సిన సమయమిది. ప్రపంచంలోని 120 కోట్లమంది అత్యంత నిరు పేదల్లో మూడోవంతు మంది భారత్‌లోనే ఉంటు న్నారు. ఇప్పుడు వీరిని గణాంకాలుగా లెక్కించడం మాని మనుషులుగా భావించాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. డబ్బు లేకుంటే ఏం జరుగుతుందన్నది మన అనుభవంలోకి వచ్చింది కాబట్టి, డబ్బులేని వారి పరిస్థితి గురించి మనం ఆలోచించవలసిన సమ యమిది. అవినీతిని ప్రోత్సహిస్తూ, సంక్షేమ పథకాల పేరుతో కొల్లగొడుతున్న వ్యవస్థకు పేదలు బలవుతుంటారు. పెద్ద నోట్ల రద్దు జరిగి ఆరురోజులు పూర్తయింది. ఈలోగా అరుణ్ జైట్లీ ఈ బాధ మరో రెండు వారాలు కొనసాగుతుందని సెలవిచ్చేశారు కూడా. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు, మహేష్ విజాపుర్కర్ ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
వార్తల స్థానంలో అరుపులా?
విశ్లేషణ ఏం జరగనుందో ఊహించి చెప్పే ఒక సూచనాత్మక సర్వే చేయండి. తామేం పొందగల మని భావించామో -ప్రశాం తంగా చెప్పే స్పష్టమైన వార్తలు - దాన్ని పొందలేదని చాలా మంది టెలివిజన్ వార్తల వీక్షకు లు మీకు చెబుతారు. కనీసం ప్రాంతీయ చానళ్లలా కాకుండా దేశవ్యాప్త వీక్షకులకు అందుబాటులో ఉండే ఇంగ్లిష్, హిందీ ప్రాంత చానళ్లకు ఇది వర్తిస్తుంది. టీవీ మాధ్యమాన్ని విశ్వసించలేమని మీకు చాలామందే చెబుతారు. పైన పేర్కొన్న కారణాల వల్లే తాను సాధారణంగా టీవీని చూడనని ప్రజాదరణ ఉన్న ఎన్డీటీవీ హిందీ న్యూస్ చానల్ యాంకర్ రవీష్ కుమార్ మీకు చెప్పినప్పుడు వాటిని మీరు సీరియస్‌గానే తీసుకోవాలి. ఒకానొక టీవీ చర్చను ప్రారంభించడానికి ముందుగా చర్చించవలసిన అంశం గురించి క్లుప్తంగా తాను ముందే హోస్ట్‌లకు వివరించానని, చర్చలో పాల్గొనేవారు నేరుగా చర్చించడాన్ని తాను అనుమతించలేదని రవీష్ చెప్పారు. ఒక యాంకర్‌గా తాను కూడా తప్పులు చేసి ఉంటానని రవీష్ అంగీకరించారు కానీ టీవీ మాధ్యమంపై తన ఆరోపణ స్థాయిని అది తగ్గించబోదని స్పష్టం చేశారు. గత శుక్రవారం నాడు, టెలివిజన్ వార్తల్లో ఎక్కడ తప్పు ఉందో తన పాఠకులకు చెప్పాలని రవీష్ నిర్ణయించుకున్నారు. టీవీ వార్తలు రోగగ్రస్తమై పోయాయి. అవి ప్రజలను కూడా రోగగ్రస్తులను చేశాయి. ఆ స్థితిలోనే వండివార్చుతున్న వాటిని వారు ఆమోదిస్తూ దాంట్లోనే వినోదాన్ని కనుగొంటున్నారని ఆయన చెప్పారు. టీవీ మాధ్యమానికి టీఆర్పీలను ఇవ్వడంపై శ్రోతలు చురుగ్గా ఎందుకున్నారనే విషయం ఆయన అవగాహనకు అవతలే ఉంది. దిగ్భ్రాంతి కలిగించే తీరులో ఆయన తన అభిప్రాయాన్ని బయటపెట్టారు!! విజువల్స్‌ను తను స్విచ్ ఆఫ్ చేశారు. కాబట్టి తాను ప్రశాంతంగా వర్ణిస్తున్న దాన్ని సావధానంగా శ్రోతలు వినగలరు. అరకొర జ్ఞానం కలిగిన యాంకర్ పరిధికి అవతల ఉండే ప్రధానమైన పరిణామంపై నిర్దిష్ట అవగాహనను కల్గించడం కోసం ఒక నిపుణుడి అభిప్రాయాన్ని అందించే లక్ష్యంతో టీవీ అనేది ప్రారంభంలో చర్చను తీసుకువచ్చేది. నిదానంగా ఈ చర్చలు ప్రైమ్ టైమ్‌లోని వార్తలను దాటుకుని ఎలాంటి వార్తనైనా చర్చనీయాంశంగా మార్చేశాయి. అవి అభిప్రాయాలను రువ్వే మల్లయుద్ధ గోదాలుగా మారిపోయాయి. సమాచారాన్ని తెలియచే యడానికి బదులుగా యాంకర్లు, అతిథులు తమతో సహా ప్రతి ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుంటూ తీవ్రమైన చర్చా విస్ఫోటనలలో మునిగిపోవడం ప్రారంభించారు. ఒక గౌరవనీయుడైన యాంకర్నుంచి అంటే పరిశ్రమ లోపలి నుంచే ఈ విషాద విలాపం వచ్చింది. దురదృష్టవశాత్తూ ఈయన హిందీకి మాత్రమే పరిమితం కాడు. ఈయనది ఒక చురుకైన బుద్ధి. ఒక రిపోర్టరుగా తన ప్రైమ్ టైమ్‌ను వీధిలోని కెమెరాగా మార్చడాన్ని అధిగమించలేడు. టీవీ మాధ్యమంలోని పరిణామాలు ఇప్పుడున్నంత చెడుగా లేనట్లయితే ఇంతటి బాధాకరమైన వాణి బయటకు వచ్చేది కాదు. ఒక దిగ్భ్రాంతి, విస్మయంతో కూడిన వ్యూహాన్ని అతడు ఇలా ఉపయోగించినప్పటికీ, సంవత్సరం క్రితం అత్యాచార సమస్యపై తీసిన ఇండియాస్ డాటర్స్పై నిషేధానికి వ్యతిరేకంగా నిరసన తెలుపడంలో మీడియా ఇదేవిధమైన శూన్యతలో ఉండి చర్చకు తావీయలేదు. ట్వీటర్ ఈ అంశంపై రగుల్కొనలేదు. ఇంటర్నెట్ ఉరిపోసుకోలేదు. అయితే సంతోషకరమైన విషయం ఏమిటంటే, నేను ఈ విషయంపై ఒక పోర్టల్‌లో రాసినప్పుడు తొలి 24 గంటల్లోనే దాదాపుగా 2 వేల ఫేస్బుక్ షేర్లు వచ్చాయి. నల్లతెర గురించి రవీష్ చెప్పిన దాని క్రోడీకరణ ఇక్కడ చూద్దాం. ఒకటి, నల్లతెర అనేది న్యూస్ టీవీ డార్క్ స్థితికి సంబంధించిన రూపకం వంటిది. రెండు, అభిప్రాయ సృష్టి అనేది కొద్దిమంది వ్యాఖ్యాతలు, యాంకర్లకే పరిమితమైంది. ఇక్కడ కూడా, సరైన సమాచారం అందని రీతిలో ఉంటుంది. అతిథులు తమ ప్రత్యర్థి మాట్లాడవలసిన సమయాన్ని తిరస్కరిస్తూ కాలయాపన చేస్తుంటారు. ఒకరినుంచి మరొకరు వినేది మరొక చానల్లో అదే విధమైన షోను భ్రమింపజేస్తుంటుంది. మరే దేశంకన్నా ఎక్కువ వార్తా చానళ్లు బహుశా మనదేశంలో ఉంటాయి కానీ వీటిలో అన్నీ డబ్బు సంపాదించడం లేదు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్టమైన కథనం కోసం రిపోర్టర్‌ను పంపించడం కాకుండా తమ ప్యానెల్లో వాగ్యుద్ధాన్ని తీవ్రస్థాయిలో కొనసాగించే అతిథిని తీసుకురావడం చవకైనది అని వారు గ్రహించి ఉండొచ్చని నా అభి ప్రాయం. ఢిల్లీని మినహాయిస్తే ఏ నగరంలోనూ తగిన టీమ్ అన్నది లేదు. ముంబై వంటి మెట్రోపోలిటన్ నగరాల్లో కూడా ప్రధానమైన టీవీ నెట్‌వర్క్‌లు బహుశా ముగ్గురు రిపోర్టర్లనే కలిగి ఉంటున్నాయి. స్పష్టంగానే వీరి వ్యవహారం ఏమిటంటే, అభిప్రాయాలను మల్చడమే కానీ, వార్తలను మల్చడం కాదు. ప్రైవేట్ న్యూస్ టీవీ చానల్స్ వాటిని ఏర్పర్చిన లక్ష్యాన్ని ఇప్పుడు కోల్పోయాయి. దూరదర్శన్ ఒక దృశ్యరూపంలోని ఆల్ ఇండియా రేడియోగా ఉంటున్నందుకుగాన్ని మనమంతా అవహేళన చేస్తున్న సమయంలో ప్రైవేట్ న్యూస్ టీవీ చానళ్లు దూరదర్శన్ స్థానాన్ని భర్తీ చేశాయి. ఒక సంవత్సరం పాటుగా ఈ చానళ్లు ఒక దృశ్య మినహాయింపుగా మాత్రమే ఉంటూ స్తంభించిపోయిన స్థితిలో ఉన్నాయి. పైగా ఈ విజువల్స్‌లో కూడా చాలా భాగం ఒకే సమాచార ప్రదాత నుంచి వస్తున్నాయి. గతంలోని దూరదర్శన్ లాగా స్క్రీన్‌మీద మాట్లాడుతున్న తలలను ఇప్పుడు చూస్తుంటారు. కనీసం నిర్ధారించుకోకుండానే వార్తలు ముక్కలు ముక్కలుగా వేరైపోయాయి. ఇదే ఇపుడు టీవీ చానళ్లను మినహాయించి చూస్తే వీక్షకులకు, ప్లేయర్లకు విషయాన్ని మరింత సంక్లిష్టం చేస్తోంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com మహేష్ విజాపుర్కార్ -
పురస్కారాల తీరు మారాలి
అభిప్రాయం తన గ్రామస్తులు ఆసుపత్రికి సత్వరమే చేరడానికి వీలుగా ఒంటరిగా పర్వతాన్ని బద్దలు కొట్టిన వ్యక్తి మాంఝీ. ఒక వ్యక్తిగా సమాజంలో మార్పును తెచ్చిన అలాంటి స్త్రీ, పురుషులు ఎందరో ఉన్నారు. వారిని గుర్తించి కనీసం పద్మశ్రీ అయినా ఇవ్వనవసరం లేదా? ఒకప్పటి ప్రముఖ హిందీ నటి ఆశాపరేఖ్‌కు మునుపే పద్మశ్రీ పురస్కారం లభించింది. కాబట్టి ఆమె తనకు పద్మ భూషణ్ కావాలని లాబీయింగ్ చేసి ఉండవచ్చు లేదా చేసి ఉం డకపోవచ్చు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాత్రం ఆమె లాబీయింగ్ చేశారనే అంటున్నారు. లిఫ్ట్ పనిచేయక పోతే, 12 అంతస్తులు మెట్లెక్కి వచ్చి మరీ ఆమె తనతో ఆ పురస్కారానికి తాను ఎలా ‘అర్హురాలో’ తెలిపారని ఆయన అంటున్నారు. ఆశా పరేఖ్ దానిని ఖండించారు. మరో కారణంగా కూడా ఈ పద్మ అవార్డుల సీజన్‌పై నీలి నీడలు ముసురుకున్నాయి. అవార్డుల కోసం ఈ నెలలో తనకు వచ్చిన సిఫారసులను ‘వేలల్లో’ కేంద్రానికి పంపాననీ, ఈ వ్యవహారం తనకు ‘తలనొప్పి’గా మారిందనీ గడ్కరీ అంతకు ముందే తెలిపారు. ఇంత వరకు ఏ రాజకీయవేత్తా అలాంటి మాట అనలేదు. కానీ రాజకీయం, నచ్చజెప్పడం, పెద్దవారితో సంబంధాలు ఉండటం వంటి అంశాలు ఆ గౌరవం ఎవరెవరికి దక్కాలనే నిర్ణయాలను కొంత వరకు ప్రభావితం చేస్తుండవచ్చు. దేశం, గొప్పదనాన్ని గుర్తించి గౌరవిస్తూ జరుపుకునే వేడుకే ఈ పురస్కార ప్రదానం. ఇది మీరు చదివేటప్పటికే ఈ ఏడాది పద్మ అవార్డులను ప్రకటించి ఉంటారు. జాబితాలో ఉన్న వారు పతాక శీర్షికలకెక్కుతారు. వారిలో క్రీడా కారులు, గాయకులు లేదా సంగీత విద్వాంసులు, నటులు, విద్యా వేత్తలు ఉంటారు. అంతే కాదు కొందరు వ్యాపారవేత్తలు ... అవును, వ్యాపారవేత్తలే, ఈ వర్గం ఎలా వ్యాపారం చేస్తుందనేదానితో పనిలేదు... ఉంటారు. మరికొందరు రాజకీయవేత్తలు కూడా... మన దేశ నైతిక జీవితానికి ఈ వర్గం ఏం చేసిందనే పట్టింపే ఉండదు... దర్శన మిస్తారు. ప్రభుత్వం ఉన్నాగానీ, వినమ్రులైన ఇతర గొప్ప వ్యక్తులు పలువురు సమాజంలో మార్పును తీసు కొస్తున్నారు. వారెవరూ జాబితాకు ఎక్కని విధంగా ఈ పురస్కారాల ఎంపిక పద్ధతిని రూపొందించారు. మహాత్మా గాంధీకి మరణానంతర పురస్కారంగా భారతరత్న ఎందుకు ఇవ్వలేదనో లేదా మిగతా వారికంటే ఆయన సమున్నతుడు కావడం వల్లనే ఇవ్వలేదనో నా వాదన కాదు. మరణానంతర పురస్కార ప్రదానాలు చేసిన వారు కనీసం డజను మందైనా ఉన్నారు. మరొకరు, వీర సావార్కర్ ప్రస్తుత ప్రభుత్వం మదిలో ఉండి ఉంటారు. మునుపటి ప్రభుత్వాల దృష్టిలో ఆ పేరు తప్పక ఉండి ఉండదు కూడా. ఈ రెండూ రాజకీయాల వైపే వేలెత్తి చూపేవే. వివిధ పద్మ అవార్డులను అందుకునే ఇతరులకు కూడా ఈ అవార్డుల సీజన్ గాలి తగిలి ఉండొచ్చు. వద్మ పురస్కారాలు కూడా చాలా వరకు, టీవీ చానళ్లు సహా వివిధ సంస్థలు ఇచ్చే జీవితకాల సాఫల్యతా పురస్కారాలవంటివే. సినీ పరిశ్రమలోని ప్రతి ప్రముఖ సీనియరుకూ అలాంటి అవార్డు ఏదో ఒకటి లభిస్తుందనే నా అంచనా. కాకపోతే అంత సుదీర్ఘ మైన ఓర్పు వారికి ఉండాలంతే. వాటిని ఇచ్చేవాళ్లు కూడా... జాబితాలోని పేర్లన్నీ పూర్తయ్యే వరకు చూసిన తర్వాతే కొత్త వారిని చేరుస్తారు. అప్పటికి వారు ఎలాగూ ముసలివారై అర్హులవుతారు. ఆశాపరేఖ్ అన్నారని ఆరోపిస్తున్న ‘అర్హత ఉండటం’ అనే వాదన కూడా ఆ ఆలోచనా రీతి నుంచి పుట్టుకొచ్చిందేనా? దేశం, ఈ పురస్కారాలను వినూత్న దృష్టితో పరికించి, గ్రహీతలకు ఉండాల్సిన అర్హతలను కొత్తగా పునర్నిర్వచించాల్సిన సమయం ఇది. గడ్కరీ కేంద్రానికి పంపానంటున్న ‘వేలకొలది’ సిఫారసులలో కొందరు గొప్ప వ్యక్తుల పేర్లు ఉండి ఉండవని నా అంచనా. ఉదాహరణకు, దశరథ్ మాంఝీ పేరు ఉండి ఉండదు. కొద్ది కాలం బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న జీతన్ రాం మాంఝీ అని పొరబడకండి. దశరథ్ మాంఝీ, రోడ్డు వేయడం కోసం ఒంటరిగా ఒక పర్వతాన్ని బద్దలు కొట్టిన వ్యక్తి. ప్రభుత్వానికి ఆ ఆలోచన తట్టనైనా లేదు. గొప్ప వారి సరసన నిలవాల్సిన అలాంటి వ్యక్తుల జాబితా పెద్దదే ఉంటుంది. గ్రామస్తులు ఆసుపత్రికి సత్వరమే చేరాలంటే అడ్డంగా ఉన్న పర్వతాన్ని మాంఝీ సుత్తి, ఉలితోనే తొలిచేసి దారి చేశాడు. ఆ గ్రామ ప్రజలకు 70 కిలోమీటర్ల చుట్టు తిరుగుడు తప్పించాడు. నరేంద్ర మోదీ, వ్యాపార వ్యవస్థాపకులలో సహజోత్సాహోద్వేగాలను రేకెత్తింపజేయడం గురించి మాట్లాడుతున్న నేటి ప్రపంచంలో ఈ మనిషి వయసుకు కుంగి, శ్రమకు వడలినా సగర్వంగా సమోన్నతంగా నిలిచాడు. తన పేరున్నందుకే అయినా, బిహార్ ముఖ్యమంత్రిగా ఉండగా జీతన్‌రాం, దశరథ్ మాంఝీ భారత్ రత్నకు అర్హుడన్నారు. ఒక వ్యక్తిగా సమాజంలో మార్పును తెచ్చిన అలాంటి స్త్రీ, పురుషులు ఎందరో ఉన్నారు. తన గ్రామాన్ని బ్రహ్మపుత్ర కోతకు గురికాకుండా కాపాడటం కోసం జాదవ్ పయెంగ్ 1979 నుంచి అడవిని పెం చుతున్నాడు. అదేమీ చిన్నది కాదు, 1,400 ఎకరాలు! ఆయన ఆలోచన వేళ్లూనుకోవడానికి ముందుగానీ, తర్వాత గానీ ప్రభుత్వం ఏమైనా చేసిందా? అలాంటి వారి జాబితా లేకపోవడం కూడా వారు ఏ గుర్తింపూ లేకుండా ఉండిపోవడానికి ఒక కారణం. నేనొక్కడినే ఆ జాబితాను తయారు చేయలేనని మనవి చేస్తున్నాను. కానీ వారిని గుర్తించగలం. రామన్ మాగసెసే అవార్డుకు గాలించి, పట్టుకునే పద్ధతి ఒకటుంది. ఆ అవార్డు లభించే వరకు, గ్రహీతల కృషి కాదుగదా, వారున్నట్టు కూడా మనకు తెలియదు. అలాంటి పద్ధతిలో వీరిని కూడా గుర్తించి కనీసం పద్మశ్రీ అయినా ఇవ్వనవసరం లేదా? వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపుర్కార్ mvijapurkar@gmail.com -
చిగురించిన కుటుంబ వారసత్వం
సందర్భం నితీశ్ ప్రభుత్వంలో ఎక్కువమంది మహిళలను మంత్రులుగా నియమించే విషయంలో పట్టుపట్టని లాలూ తన కుమారులిద్దరికీ మంత్రి పదవులు సాధించడంలో ఘన విజయమే సాధించారు. ప్రజాజీవితం పేరిట కుటుంబంలో కొత్త వారసత్వం మొలకెత్తింది. శిశుమరణాలు అధికంగా ఉన్న రోజుల్లో కుటుంబ సంరక్షణ కోసం సమర్ధనగా విడి కుటుంబాల్లో పలువురు పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కుటుంబాన్ని పైకి తీసుకురావ డానికి మరిన్ని చేతులు అద నంగా ఉంటే బాగుంటుందని కూడా సమర్థించుకునేవారు. అయితే వాస్తవానికి పేదలు ఎక్కువమంది పిల్లల్ని కనేవారు కానీ ఆ పెద్ద కుటుంబాలు ఆ పిల్లల్ని పేదరికం లోనే ఉంచేవనేది మరో విషయం. లాలూకు తొమ్మిదిమంది పిల్లలు. ఇంత మంది సంతానాన్ని కని, పెంచడానికి రబ్రీదేవికి ఎంత సాహస ముండాలి అంటూ కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేసే వారు. చాలా మంది ఈ విషయంలో లాలూను పరిహ సించేవారు. అయితే అదనపు చేతుల సహాయం అవస రం కావడానికి లాలూ పేదవాడేం కాదు. ఆయన విద్యా వంతుడు. ప్రజాసేవ చేయాలని ఉందని చెప్పుకుం టూనే బతకడానికి రాజకీయాల్లో స్వయం ఉపాధిని వెతుక్కుంటున్న నేతలలో లాలూ ఒకరు. బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, లాలూ కుటుంబ సభ్యులిద్దరు ఆయన మంత్రివర్గంలో చేరారు. ఆ వెంటనే లాలూ కుటుంబం తమ మూలపురుషుడితో కలిసి గ్రూప్ ఫొటోకు దిగింది. రాజకీయాల్లో కొనసాగుతానని ఈ కుటుంబం స్పష్టంగా తన ఉద్దేశాలను వ్యక్తపరిచాక -ఒక కుమారుడు రాజకీయాల కోసం క్రికెట్‌నే త్యజించాడు- ఇప్పటికి లాలూ కుటుంబం రాజకీయంగా విస్తృతరూపాన్ని సంతరించుకున్నట్లయింది. అయితే నా మనసులో కుటుంబ పరిమాణానికి ప్రముఖ స్థానం లేదు. ఇద్దరు కుమారులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడం అందులోనూ ఒకరు నేరుగా ఉప ముఖ్యమంత్రి కావడంతో ఒక నూతన రాజ కీయ కుటుంబం ఇప్పుడు ఎంత పటిష్టంగా తన స్థానాన్ని నెలకొల్పుకున్నది అన్నదే నా ఆలోచన. మేం అయిదుగురం- మా తల్లిదండ్రులు, నా ఇద్దరు సోద రులు, నేను రాజకీయాల్లో ఉన్నామని లాలూ కుమార్తె మీసా యాదవ్ టీవీల ముందునిల్చుని చెప్పారు. కుల రాజకీయాల్లో ఆరితేరిన కుటుంబ పెద్ద.. దాణా కుంభ కోణంలో ఇరుక్కుని జైలుకెళ్లినప్పుడు లాలూ కుటుంబం పార్టీని ఎలా నడపగలదనిపించింది. కాని ఈ విషయం పెద్దగా వివాదాస్పదం కాలేదు. అవినీతి కేసులో శిక్షపడిన కారణంగా ఎన్నికల్లో పాల్గొనడం, ఓటేయడం చేయలేకపోయిన ఆర్జేడీ పార్టీ అధినేత నూతన ప్రభుత్వంలో ఎక్కువమంది మహిళ లను మంత్రులుగా నియమించే విషయంలో పట్టుపట్ట డంకానీ, నితీశ్‌ను ఒప్పించడంకాని చేయకపోగా, తన కుమారులిద్దరికీ మంత్రి పదవులు సాధించడంపైనే దృష్టిపెట్టారు. ఈసారి బిహార్ శాసనసభ కు 22 మంది మహిళలు ఎంపికయ్యారు. రాజకీయాలకు బొత్తిగా కొత్త వాడైన ఒక పుత్రుడేమో ఏకంగా ఉపముఖ్యమంత్రి అయిపోయాడు. మరొకరేమో, రెండుసార్లు సవరణ చెప్పించుకుంటేగానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ లేని అవిద్యావంతుడు. కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని మోదీ తగినంతగా మహిళలకు స్థానం కల్పించలేదని పలు ఆరోపణలు గుప్పించిన నితీశ్ కుమార్ తన మంత్రివర్గంలో ఎక్కువ మంది మహిళలను చేర్చుకుంటారని భావించడం మరీ ఎక్కువ ఆశించడమే అవుతుందని కొందరు మిత్రులు సూచించారు. లాలాకు ఏడుగురు కుమార్తెలున్నప్పటికీ నిర్ణయాధికారంలో వారికి భాగస్వామ్యం కల్పించడం ద్వారానే మహిళలకు సాధికారత లభిస్తుందని లాలూకు తట్టినట్లు లేదు. మహిళలను సమానులుగా చూడడంలో లేదా వారిని సమానులుగా చేయడంలో తాను ప్రద ర్శించిన వ్యతిరేకతను పార్లమెంటులో మహిళల కోటా పట్ల లాలూ వ్యక్తంచేసిన అభ్యంతరంలో చూడొచ్చు. ప్రభుత్వం కంటే కుటుంబం ముందు అనే వైఖరి పూర్తిగా వ్యతిరేకించదగినది. అందుకే ఈ వ్యాసం మొద ట్లోనే సంతానం అనే పదం వాడాను. రాజకీయాల్లో ఉంటున్న ఇతర కుటుంబాలతో వివాహ సంబంధాలు కుదుర్చుకోవడం ద్వారా లాలూ కుటుంబం విస్తరిస్తోం ది. నేను గతంలో సూచించినట్లుగా, లాలూ చిన్న కూతు రు సమాజ్‌వాదీపార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మునిమనవడు, ఎంపీ అయిన తేజ్ ప్రతాప్ సింగ్ భార్య అయింది. ఇక లాలూ నాలుగో కూతురు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి గెంతేసిన ఎమ్మెల్యే జితేంద్రయాదవ్ కుమారుడు రాహుల్‌యాదవ్ భార్య. ఇక చిన్నకూతురు హేమ మరొక రాజకీయ కుటుంబానికి చెందిన వినీత్ యాద వ్ని పెళ్లాడింది. ఆరవ కూతురు ధను, చిరంజీవరా వును పెళ్లాడింది. ఈయన తండ్రి ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌కు చెందిన రావ్ అజిత్‌సింగ్. ఈయన హరియా ణాలో ఒకసారి విద్యుత్ మంత్రిగా పనిచేశారు కూడా. ఇక్కడ చిన్న గమనిక: లాలూ ఏడుగురు కుమా ర్తెల్లో ముగ్గురు రాజకీయవర్గాలకు చెందని వ్యక్తులను పెళ్లాడారు. అయినంతమాత్రాన లాలూ కుటుంబం రాజకీయాలకు తక్కువ అని చెప్పలేం. ఏమాత్రం అను భవం లేని కుమారులను పెద్ద పదవుల్లో నియ మింప చేయడమే రాజకీయం. పైగా లాలూ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కూడా కాదు. ఆర్జెడీ పార్టీకి ఇప్పుడు ఒక ఉపాధ్యక్షులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ లాలు ఇప్పుడెంత ప్రభావం చూపుతున్నారంటే, మన ప్రజా జీవితంలోని ప్రమాణాల ప్రకారం చూస్తే కొత్త రాజ కీయ వారసత్వం ఎంతో సహజమనిపిస్తోంది. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు: మహేష్ విజాపుర్కార్ mvijapurkar@gmail.com)