చిగురించిన కుటుంబ వారసత్వం | many Bihar leaders politics is all about family | Sakshi
Sakshi News home page

చిగురించిన కుటుంబ వారసత్వం

Published Tue, Nov 24 2015 12:26 AM | Last Updated on Sun, Sep 3 2017 12:54 PM

చిగురించిన కుటుంబ వారసత్వం

చిగురించిన కుటుంబ వారసత్వం

సందర్భం
 నితీశ్ ప్రభుత్వంలో ఎక్కువమంది మహిళలను మంత్రులుగా నియమించే విషయంలో పట్టుపట్టని లాలూ తన కుమారులిద్దరికీ మంత్రి పదవులు సాధించడంలో ఘన విజయమే సాధించారు. ప్రజాజీవితం పేరిట కుటుంబంలో కొత్త వారసత్వం మొలకెత్తింది.

 శిశుమరణాలు అధికంగా ఉన్న రోజుల్లో కుటుంబ సంరక్షణ కోసం సమర్ధనగా విడి కుటుంబాల్లో పలువురు పిల్లలకు ప్రాధాన్యత ఇచ్చేవారు. కుటుంబాన్ని పైకి తీసుకురావ డానికి మరిన్ని చేతులు అద నంగా ఉంటే బాగుంటుందని కూడా సమర్థించుకునేవారు. అయితే వాస్తవానికి పేదలు ఎక్కువమంది పిల్లల్ని కనేవారు కానీ ఆ పెద్ద కుటుంబాలు ఆ పిల్లల్ని పేదరికం లోనే ఉంచేవనేది మరో విషయం.
 లాలూకు తొమ్మిదిమంది పిల్లలు. ఇంత మంది సంతానాన్ని కని, పెంచడానికి రబ్రీదేవికి ఎంత సాహస ముండాలి అంటూ కొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేసే వారు. చాలా మంది ఈ విషయంలో లాలూను పరిహ సించేవారు. అయితే అదనపు చేతుల సహాయం అవస రం కావడానికి లాలూ పేదవాడేం కాదు. ఆయన విద్యా వంతుడు. ప్రజాసేవ చేయాలని ఉందని చెప్పుకుం టూనే బతకడానికి రాజకీయాల్లో స్వయం ఉపాధిని వెతుక్కుంటున్న నేతలలో లాలూ ఒకరు.

 బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, లాలూ కుటుంబ సభ్యులిద్దరు ఆయన మంత్రివర్గంలో చేరారు. ఆ వెంటనే లాలూ కుటుంబం తమ మూలపురుషుడితో కలిసి గ్రూప్ ఫొటోకు దిగింది. రాజకీయాల్లో కొనసాగుతానని ఈ కుటుంబం స్పష్టంగా తన ఉద్దేశాలను వ్యక్తపరిచాక -ఒక కుమారుడు రాజకీయాల కోసం క్రికెట్‌నే త్యజించాడు- ఇప్పటికి లాలూ కుటుంబం రాజకీయంగా విస్తృతరూపాన్ని సంతరించుకున్నట్లయింది.

 అయితే నా మనసులో కుటుంబ పరిమాణానికి ప్రముఖ స్థానం లేదు. ఇద్దరు కుమారులు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేయడం అందులోనూ ఒకరు నేరుగా ఉప ముఖ్యమంత్రి కావడంతో ఒక నూతన రాజ కీయ కుటుంబం ఇప్పుడు ఎంత పటిష్టంగా తన స్థానాన్ని నెలకొల్పుకున్నది అన్నదే నా ఆలోచన. మేం అయిదుగురం- మా తల్లిదండ్రులు, నా ఇద్దరు సోద రులు, నేను రాజకీయాల్లో ఉన్నామని లాలూ కుమార్తె మీసా యాదవ్ టీవీల ముందునిల్చుని చెప్పారు. కుల రాజకీయాల్లో ఆరితేరిన కుటుంబ పెద్ద.. దాణా కుంభ కోణంలో ఇరుక్కుని జైలుకెళ్లినప్పుడు లాలూ కుటుంబం పార్టీని ఎలా నడపగలదనిపించింది. కాని ఈ విషయం పెద్దగా వివాదాస్పదం కాలేదు.

 అవినీతి కేసులో శిక్షపడిన కారణంగా ఎన్నికల్లో పాల్గొనడం, ఓటేయడం చేయలేకపోయిన ఆర్జేడీ పార్టీ అధినేత నూతన ప్రభుత్వంలో ఎక్కువమంది మహిళ లను మంత్రులుగా నియమించే విషయంలో పట్టుపట్ట డంకానీ, నితీశ్‌ను ఒప్పించడంకాని చేయకపోగా, తన కుమారులిద్దరికీ మంత్రి పదవులు సాధించడంపైనే దృష్టిపెట్టారు. ఈసారి బిహార్ శాసనసభ కు 22 మంది మహిళలు ఎంపికయ్యారు. రాజకీయాలకు బొత్తిగా కొత్త వాడైన ఒక పుత్రుడేమో ఏకంగా ఉపముఖ్యమంత్రి అయిపోయాడు. మరొకరేమో, రెండుసార్లు సవరణ చెప్పించుకుంటేగానీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయ లేని అవిద్యావంతుడు.

 కేంద్ర మంత్రివర్గంలో ప్రధాని మోదీ తగినంతగా మహిళలకు స్థానం కల్పించలేదని పలు ఆరోపణలు గుప్పించిన నితీశ్ కుమార్ తన మంత్రివర్గంలో ఎక్కువ మంది మహిళలను చేర్చుకుంటారని భావించడం మరీ ఎక్కువ ఆశించడమే అవుతుందని కొందరు మిత్రులు సూచించారు. లాలాకు ఏడుగురు కుమార్తెలున్నప్పటికీ నిర్ణయాధికారంలో వారికి భాగస్వామ్యం కల్పించడం ద్వారానే మహిళలకు సాధికారత లభిస్తుందని లాలూకు తట్టినట్లు లేదు. మహిళలను సమానులుగా చూడడంలో లేదా వారిని సమానులుగా చేయడంలో తాను ప్రద ర్శించిన వ్యతిరేకతను పార్లమెంటులో మహిళల కోటా పట్ల లాలూ వ్యక్తంచేసిన అభ్యంతరంలో చూడొచ్చు.

 ప్రభుత్వం కంటే కుటుంబం ముందు అనే వైఖరి పూర్తిగా వ్యతిరేకించదగినది. అందుకే  ఈ వ్యాసం మొద ట్లోనే సంతానం అనే పదం వాడాను. రాజకీయాల్లో ఉంటున్న ఇతర కుటుంబాలతో వివాహ సంబంధాలు కుదుర్చుకోవడం ద్వారా లాలూ కుటుంబం విస్తరిస్తోం ది. నేను గతంలో సూచించినట్లుగా, లాలూ చిన్న కూతు రు సమాజ్‌వాదీపార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మునిమనవడు, ఎంపీ అయిన తేజ్ ప్రతాప్ సింగ్ భార్య అయింది. ఇక లాలూ నాలుగో కూతురు ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి గెంతేసిన ఎమ్మెల్యే జితేంద్రయాదవ్ కుమారుడు రాహుల్‌యాదవ్ భార్య. ఇక చిన్నకూతురు హేమ మరొక రాజకీయ కుటుంబానికి చెందిన వినీత్ యాద వ్‌ని పెళ్లాడింది. ఆరవ కూతురు ధను, చిరంజీవరా వును పెళ్లాడింది. ఈయన తండ్రి ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌కు చెందిన రావ్ అజిత్‌సింగ్. ఈయన హరియా ణాలో ఒకసారి విద్యుత్ మంత్రిగా పనిచేశారు కూడా.

 ఇక్కడ చిన్న గమనిక: లాలూ ఏడుగురు కుమా ర్తెల్లో ముగ్గురు రాజకీయవర్గాలకు చెందని వ్యక్తులను పెళ్లాడారు. అయినంతమాత్రాన లాలూ కుటుంబం రాజకీయాలకు తక్కువ అని చెప్పలేం. ఏమాత్రం అను భవం లేని కుమారులను పెద్ద పదవుల్లో నియ మింప చేయడమే రాజకీయం. పైగా లాలూ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కూడా కాదు. ఆర్జెడీ పార్టీకి ఇప్పుడు ఒక ఉపాధ్యక్షులు మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ లాలు ఇప్పుడెంత ప్రభావం చూపుతున్నారంటే, మన ప్రజా జీవితంలోని ప్రమాణాల ప్రకారం చూస్తే కొత్త రాజ కీయ వారసత్వం ఎంతో సహజమనిపిస్తోంది.

http://img.sakshi.net/images/cms/2015-03/61427657065_625x300.jpg
 (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు: మహేష్ విజాపుర్కార్ mvijapurkar@gmail.com)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement